Home » Rice » Noor Mahal Pulao


నూర్‌మహల్ పులావ్

 

 

కావలసినవి :

బాస్మతి బియ్యం - 2 కప్పులు

ఉల్లితరుగు - పావుకప్పు

కుంకుమపువ్వు - కొద్దిగా

చీజ్ - అరకప్పు

లవంగాలు - 6

క్రీమ్ - 3 స్పూన్లు

వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు - తగినంత

దాల్చినచెక్క - చిన్న ముక్క

జీలకర్ర - టీ స్పూను

ఏలకులు - 8

పాలకూర రసం - 2 టేబుల్ స్పూన్లు

బటర్ - 2 టేబుల్ స్పూన్లు

కొత్తిమీరతరుగు - 2 టేబుల్ స్పూన్లు

గరంమసాలా - టీ స్పూను

నూనె - 4 టేబుల్ స్పూన్లు

బిరియానీ ఆకు - 1


తయారీ :

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటసేపు నానబెట్టాలి. తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో నూనె వేసి కాగాక బిరియానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ఏలకులు వేసి సన్నని మంట మీద వేయించాలి.

 

ఇప్పుడు  అల్లం వెల్లుల్లి పేస్ట్ , గరంమసాలా వేసి కొద్దిగా వేయించాలి. తరువాత  నానబెట్టుకున్న బియ్యం వేసి నాలుగైదు నిముషాలు కలిపి, అందులో సరిపడా నీళ్ళు, ఉప్పు వేసి సన్ననిమంట మీద ఉడికించాలి.

 

ఇప్పుడు ఒక చిన్న బౌల్‌తీసుకుని అందులో చీజ్‌ తురుము, క్రీమ్, ఉప్పు వేసి కలపాలి. దీనిని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని పాలు, కుంకుమపువ్వు ఉన్న బౌల్‌లో వేయాలి.

 

ఒక భాగం పాలకూర రసంలో వేయాలి. మూడవ భాగాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి నూనెలో వేయించాలి( వీటినే నూర్ మహల్ అంటారు). తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని చీజ్ బాల్స్ వేసి అందులోనే  ఉడికిన రైస్, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

 


Related Recipes

Rice

బీట్రూట్, పన్నీర్ పులావ్

Rice

Mexican Corn Rice Recipe

Rice

How to Make Coconut Rice

Rice

How to Make Pulihora

Rice

Rice and Fruit Salad

Rice

Daddojanam - Navaratri Special

Rice

Dussehra Special Pulihora

Rice

Usirikaya Rice (Karthika Masam Special)