Home » Sweets N Deserts » Gulab Jamun Recipe


 

 

గులాబ్ జామూన్

 

 

కావలసినవి:
గులాబ్ జామూన్ ప్యాకెట్ : ఒకటి 
పంచదార : అర కేజీ 
యాలుకలపొడి : ఒక స్పూన్
నూనె : తగినంత 

 

తయారుచేసే విధానం:
ముందుగా గులాబ్ జామూన్ ప్యాకెట్ కట్ చేసి పిండిని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళుపోసి కలపాలి. ఆ పిండిని ఒక పది నిముషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. పక్కనే మరో స్టవ్ కూడా వెలిగించి, వేరే గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీళ్ళు కలిపి స్టవ్ మీద పెట్టి లేత పాకం పట్టాలి. ఆ పాకంలో యాలుకల పొడి కలుపుకోవాలి. తరువాత కలిపిన పిండిని తీసుకుని చిన్నచిన్న ఉండలుగా చేసి, కాగే నూనెలో చిన్న మంట మీద దోరగా వేగనివ్వాలి. అలా వేగిన ఉండల్ని తీసి పాకంలో వెయ్యాలి. పది నిమిషాలు అలాగే ఉంచితే పాకం పీల్చుకొని గులాబ్ జామూన్లు తినటానికి రెడీగా ఉంటాయి. రుచికరమైన గులాబ్ జామూన్ల తయారీకి పిండి కలిపేటప్పుడు అందులో కాస్త పన్నీర్ కలిపితే జామూన్‌లు మృదువుగా ఉంటాయి. అలాగే పిండిని కలిపే సమయంలో జీడిపప్పులను పొడిగా కొట్టి కలిపితే రుచితో పాటు వెరైటీగా ఉంటాయి.

 


Related Recipes

Sweets N Deserts

బ్రెడ్ గులాబ్ జామూన్ తయారీ విధానం

Sweets N Deserts

గులాబ్ జామూన్

Sweets N Deserts

సుజీ గులాబ్ జామున్

Sweets N Deserts

Gulab Jamun

Sweets N Deserts

How to Prepare Panasa Pandu Payasam

Sweets N Deserts

వినాయకచవితికి బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు

Sweets N Deserts

Watch How to Make Panakam

Sweets N Deserts

షీర్ కుర్మా (రంజాన్ స్పెషల్)