Home » Others » Fruit Bhel Puri with Sprouts


 

 

మొలకలు - ఫ్రూట్ భేల్ పూరి


 


భేల్ పూరి  అంటే నచ్చని పిల్లలు ఉండరు. అయితే కేవలం మరమరాలు, టమాటో, ఉల్లిపాయ తో చేసే భెల్ పూరిలో రుచి ఉన్న మాట నిజమే కాని రుచితో పాటే కాస్త ఆరోగ్యానికి అవసరమైన మొలకలు,పళ్ళు కూడా కలిస్తే ఇంకా ఇంకా బాగుంటుంది కదూ. దీనికోసం అవసరమైనవి చూద్దామా.

 

కావలసిన పదార్థాలు :

 

మరమరాలు - 1 కప్పు

సన్న కారప్పూస - 1 కప్పు

నిమ్మరసం - రెండు చెంచాలు

మిరియాల పొడి - రెండు చెంచాలు

మొలకెత్తిన పెసలు, చిన్న సెనగలు - రెండు కలిపి - 1 కప్పు

దానిమ్మ గింజలు - 1 కప్పు

సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు - 1/2 కప్పు

ద్రాక్ష - 1/2 కప్పు

కమలా ఫలం తొనలు - కొన్ని

కొత్తిమీర తరుగు - కొద్దిగా

ఉప్పు - తగినంత

 

 

తయారి విధానం:


ఓ గిన్నెలో మరమరాలు, సన్న కారప్పూస తీసుకొని బాగా కలిపి, మొలకెత్తిన పెసలు, చిన్న సెనగలు కూడా వేయాలి. ఇంకా  ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత పండ్ల ముక్కలు, కొత్తిమీర కూడా వేసి అంతా కలిసేలా కలిపి నిమ్మరసం కూడా వేస్తే నోరూరించే భేల్ సిద్దం.

   ... కళ్యాణి
 


Related Recipes

Others

మొలకలతో పోహా

Others

Paneer Tikka

Others

కఠోరి చాట్ తయారుచేయు విధానం

Others

స్వీట్ కట్టర్ పానీ పూరి

Others

సజ్జప్పాలు

Others

Janthikalu (Mothers Day Special Recipes)

Others

Bobbarla Vada - Sankranti Special

Others

How to Make Katori Chaat Recipe