Home » Sweets N Deserts » Double Ka Meetha Recipe
డబుల్ కా మీటా రెసిపి
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ ముక్కలు: 9
జీడిపప్పులు:50 గ్రాములు
బాదంపప్పులు:50 గ్రాములు
నెయ్యి : 200 గ్రాములు
పంచదార: అరకేజీ
కాచిన పాలు : అరలీటరు
పచ్చిపాలు: పావు లీటరు
యాలక్కాయల పొడి : ఒక టీ స్పూన్
తయారీ విధానం :
ముందుగా బ్రెడ్ ముక్కలని నెయ్యిలో బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నె తీసుకుని పంచదార వేసి ఒక కప్పు నీళ్ళు పోసి పాకంపట్టాలి ఇప్పుడు అందులో బ్రెడ్ ముక్కలు, కాచిన పాలు వేసి కొంచం సేపు ఉడికిన తరువాత పచ్చి పాలు పోయాలి.
పాలు చిక్కబడ్డాక... వేయించిన జీడి పప్పులు, బాదం పప్పులు, యాలకుల పొడి వేయాలి.బ్రెడ్ ముక్కలు ముక్కలు గా ఉండకుండా బాగా కలపాలి.