Home » Sweets N Deserts » Depavali Special Sweets


 

 

దీపావళి స్పెషల్  స్వీట్స్

 

 

*****

 

చూర్మా లడ్డు

 

 

కావలసినవి:
కోవా - 100 గ్రాములు
గోధుమ పిండి - 200 గ్రాములు
బాదాం పప్పు - 50 గ్రాములు
యాలకులు - 4
నెయ్యి - 400 గ్రాములు
పంచదార పొడి - 200 గ్రాములు

 

తయారీ :
గోధుమ పిండి తీసుకుని  కరిగించిన  నెయ్యి  కొద్దిగా నీళ్లు చపాతీ పిండిలా కలుపుకుని ఆ  పిండిని చిన్న  చిన్న ఉండలుగా  చేసుకుని  స్టవ్ వెలిగించి   పాన్‌ పెట్టి  నెయ్యి వేసి  తడిపిన   ఈ ఉండలను వేసి బ్రౌన్ కలర్ వరకు వేయించుకుని  చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడి ఒక గిన్నెలోకి తీసుకుని కోవా వేసి కలపాలి. తరువాత పంచదార, బాదాం  యాలకులు కలిపి పొడి పెట్టుకోవాలి. పాన్‌లో  కొద్దిగా నెయ్యి వేసి  గోధుమపిండి, కోవా మిశ్రమం వేసి  కొంచంసేపు వేయించి,  చల్లారాక.  బాదాం మిస్రమాన్నీ వేసి కలిపి లడ్డులు చేసుకోవాలి.

 

 

*****

 

కర్బూజా రసగుల్ల

 

 

కావలసినవి:
కర్బూజా పండు - అరకేజి
పాలు - ఒక లీటర్
నెయ్యి -100 గ్రా
పంచదార - 2 కప్పులు
కార్న్ ఫోర్- 3 స్పూన్లు
నిమ్మకాయ -1

 

తయారు చేసే విధానం:
ముందుగా చక్కెరతో  తీగ పాకం పట్టాలి తరువాత కర్బూజాని ముక్కలుగా చేసి మిక్సిలో వేసి  జ్యూస్ చేసుకొని పాకము చల్లారాక  జ్యూస్ ను అందులో కలపాలి. తరువాత   పాలను మరిగించి అందులో నిమ్మకాయ పిండి పాలు విరిగేలా చెయ్యాలి. తరువాత అందులో నీరంతా పోయేలా పల్చటి గుడ్డలో వేసి వడకట్టి పన్నీర్ తయారు చేసుకోవాలి.ఇప్పుడు విరిగిన పాల మిశ్రమంలో  కార్న్ ఫోర్ వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత గిన్నెలో నెయ్యి పోసి కాగాక  ఉండలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ముందుగా తయారుచేసుకున్న కర్బూజా జ్యూస్ లో వేసి నానవ్వాలి.లేదా ఫ్రిజ్ లో పెట్టి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు...

 


*****

 

పాల పూరీలు

 

 

కావలసిన పదార్థాలు :

 

 

మైదా - 200గ్రా
గోధుమపిండి - 200గ్రా
పాలు - అర లీటరు
ఉప్పు - అరచెంచా
గసగసాలు - 25గ్రా
నూనె- సరిపడా
పంచదార - 200గ్రా
కొబ్బరి పాలు - అర లీటరు
యాలకుల పొడి - కొద్దిగా

 

 

తయారీ విధానం :
ముందుగా పాలు బాగా కాచి అందులో పంచదార, కొబ్బరిపాలు, యాలకుల పొడి, గసగసాల పొడి వేసి బాగా కలిపి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకోవాలి.మైదా, గోధుమపిండి, ఉప్పు, నీళ్లు వేసి పూరీ పిండిలా కలిపి పక్కన వేసి  కలిపి పదిహేను నిముషాలు పక్కన పెట్టుకోవాలి.  పిండితో పూరీలు చేసి పెట్టుకుని ఆయిల్ మరిగించి పూరీలు బ్రౌన్ గా వేయించి తయారు చేసుకున్న పాల మిశ్రమంలో వేసుకుని అవి నానాక సర్వ్ చేసుకోవాలి.

 

 


Related Recipes

Sweets N Deserts

జన్మష్టమి స్పెషల్ రెసిపి రసగుల్లా

Sweets N Deserts

Coconut Slice Cake Indian

Sweets N Deserts

షీర్ కుర్మా (రంజాన్ స్పెషల్)

Sweets N Deserts

Mango Cheese Cake

Sweets N Deserts

Eggless Ginger Cookies (Christmas Special)

Sweets N Deserts

Chocolate Badam Halwa

Sweets N Deserts

Kobbari Burelu (Diwali Special)

Sweets N Deserts

Kova Kajjikayalu (Diwali Special)