Home » Non-Vegetarian » Chilli prawns recipe


 

 

చిల్లీ ప్రాన్స్ రెసిపీ

 

 

 

 

కావలసినవి:
ప్రాన్స్ - 200 గ్రాములు
ఉల్లిపాయ - రెండు
పచ్చిమిర్చి - ఆరు
అల్లం వెల్లుల్లి తరుగు - నాలుగు టీ స్పూన్లు
పెప్పర్ పౌడర్ - టీ స్పూన్
కార్న్‌ఫ్లోర్ - అర కప్పు
మైదాపిండి - పావు కప్పు
చిల్లీ సాస్ - టీ స్పూన్
సాల్ట్ - తగినంత
నూనె -  సరిపడా
క్యాప్సికం - మూడు
సోయా సాస్ - టీ స్పూన్
ఉల్లికాడలు - నాలుగు
అజినమోటో - అర టీ స్పూన్
కోడిగుడ్డు - ఒకటి

 

తయారి:

ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి కొద్దిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో అజినమోటో, సాల్ట్, పెప్పర్ పౌడర్, కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్, మైదాపిండి వేసి సరిపడా నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో  ఉడికించిన రొయ్యలను వేసి కలపాలి. స్టవ్ వెలిగించి పాన్‌ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక ప్రాన్స్‌ని పకోడీల్లా వేసి దోరగా వేయించాలి. వేరొక పాన్‌లో పావు కప్పు నూనె వేసి వేడయ్యాక క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి , పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. అవి వేగాక అందులో రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, ఫ్రై చేసిన ప్రాన్స్, కట్ చేసిన ఉల్లికాడలను కూడా వేసి కలిపి తక్కువ ఫ్లేమ్ మీద పది  నిమిషాలు ఉడికించి తరువాత సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.

 

 


Related Recipes

Non-Vegetarian

గోంగూర ఎండు రొయ్యలు

Non-Vegetarian

చిల్లీ చికెన్

Non-Vegetarian

బ్రోకలీ 65 రెసిపి

Non-Vegetarian

Chicken Nuggets

Non-Vegetarian

Chicken Dum Biryani (Ramzan Special)

Non-Vegetarian

Chicken Haleem (Ramzan Special)

Non-Vegetarian

Perfect Royyala Biryani

Non-Vegetarian

Chicken 65