Home » Vegetarian » Carrot Idli Recipe


 

 

క్యారెట్ ఇడ్లి

 

 

 

కావల్సిన పదార్థాలు:

ఉద్దిపప్పు: 1 cup (బ్లాక్ గ్రామ్ దాల్)

ఇడ్లీ రవ్వ: 2 cups

ఉప్పు: రుచికి సరిపడా

బేకింగ్ సోడా: చిటికెడు

కొత్తిమీర మిక్స్ కోసం-పేస్ట్ తయారు చేసుకోవడానికి

కొత్తిమీర తరుగు : 1/4 cup

పచ్చిమిర్చి : 2-4 జీలకర్ర పొడి: 1/2 tsp

 

తయారు చేయు విధానం:

1. ముందుగా ఉద్దిపప్పును 2-3గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉద్దిపప్పు పిండితో మిక్స్ చేయడానికి ముందు ఇడ్లీ రవ్వను కూడా విడిగా కొద్దిగా నీళ్ళుపోసి అందులో నానబెట్టుకోవాలి.

2. రెండు గంటల తర్వాత ఉద్దిపప్పులోని నీరు వంపేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

3. ఇడ్లీ రవ్వలోని నీటిని వంపేసి, నీటినంతటినీ పిండేసుకోవాలి. దీన్ని పేస్ట్ చేసుకొన్ని ఉద్దిపప్పు పిండిలో మిక్స్ చేయాలి. చేత్తో బాగా కలుపుకోవాలి.

4. కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసి రాత్రంతా మూత పెట్టి అలాగే ఉంచాలి. శీతాకాలంలో పిండి పులవడానికి ఎక్కువ సమయంకావాలి. అదే సమ్మర్ లో అంత సమయం అవసరం లేదు 4-5గంటలు పులియబెడితే చాలు.

5. ఇప్పుడు కావల్సినంత పిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేయలి. అలాగే ఇందులోని పేస్ట్ చేసుకొన్న కొత్తిమీర పేస్ట్ ను మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి ఇడ్లీలు చేయడానికి రెడీ.

6. ఇప్పడు ఇడ్లీ ప్లేట్స్ లో కొద్దిగా నూనె రాసి అరచెంచా క్యారెట్ తురుమును మొదట నింపుకోవాలి. దాని మీద ఇడ్లీ పిండి వేసుకోవాలి.

తర్వాత పిండి మీద కూడా మరికొంత క్యారెట్ తురుమును సర్దుకోవాలి. తర్వాత ప్లేట్స్ అన్నీ ఇడ్లీ కుక్కర్ లో పెట్టి మూత పెట్టి 10-15నిముషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి వేడి వేడి ఇడ్లీని సాంబార్ లేదా చట్నీతో సర్వ్ చేయాలి.

 


Related Recipes

Vegetarian

పాలక్ పరోటా

Vegetarian

Kaju Mushroom Masala Recipe

Vegetarian

క్రీమ్ పొటాటో సలాడ్!

Vegetarian

Colourfull Vegetable Salad (Holi Special)

Vegetarian

Bottle Gourd Sweet Curry with Milk

Vegetarian

Moong Dal Kosambari

Vegetarian

Panasa Pottu Kura

Vegetarian

Tangy Eggplant Curry