Home » Sweets N Deserts » Bandar Halwa


 బందర్ హల్వా

 

 

కావలసిన వస్తువులు:

గోధుమపిండి       -    అర కిలో.
జీడిపప్పు             -     50 గ్రాములు
బెల్లం                  -     అర కిలో
నెయ్యి                -     పావు కిలో
యాలుకల పొడి    -     రెండు స్పూన్లు
రెడ్ కలర్             -     చిటికెడు.
 

తయారు చేసే విధానం:
ముందుగా గోధుమపిండిని  నీళ్ళతో ముద్దలా చేసి ఒక గిన్నెలో ఉంచి ఆ ముద్ద మునిగేలా నీళ్ళు పోసి  నానబెట్టాలి. తర్వాత  ఆ నీళ్ళలో గోధుమపిండి ముద్దను బాగా కలిపి, వచ్చే గోధుమ పాలను వడగట్టి వుంచుకోవాలి. వడగట్టి వుంచిన గోధుమ పాలలో పైకి తేరుకున్న నీళ్ళు కొన్ని తీసేసి దానిలో రెడ్‌కలర్  కలపాలి. ఇప్పుడు  స్టవ్ వెలిగించుకుని గిన్నెపెట్టుకుని  బెల్లం , సరిపడ  నీళ్ళు పోసి ముదురుపాకం వచ్చాక గోధుమపాలు కలపాలి. జీడిపప్పు వేసి చిన్న మంటపెట్టి ఉడకనివ్వాలి కొద్దిసేపటి తర్వాత ఇందులో నెయ్యి కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూ వుండాలి. మిశ్రమాన్ని గట్టిపడిన తరువాత చివరిలో  ఇలాచి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ట్రే కి నెయ్యి రాసి అందులో హల్వా వేసి చల్లారాక కావల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.బందర్ హల్వా రెడీ...


Related Recipes

Sweets N Deserts

సాబుదానా హల్వా

Sweets N Deserts

క్యారెట్ హల్వా

Sweets N Deserts

బీట్ రూట్ హల్వా

Sweets N Deserts

గోధుమ రవ్వతో హల్వా

Sweets N Deserts

Gulab Jamun

Sweets N Deserts

Pesarapappu Halwa

Sweets N Deserts

Carrot Halwa

Sweets N Deserts

Suji ka Halwa