Home » Pickles » Avakaya Pickle


ఈ వీడియో చూస్తే కొత్త పెళ్లి కూతుర్లు కూడా ఆవకాయ పెట్టేస్తారు

 

 

అమ్మ ఆవకాయ అంజలి అస్సలు బోరు కొట్టవు  అని ఎదో  సినిమాలో  అన్నట్టు  నిజంగా  ఆవకాయ అస్సలు బోర్  కొట్టదు.ఆవకాయ  రుచి  ని ఆస్వాదించడానికి  ఆంధ్ర , తెలంగాణ అనే తారతమ్యాలు ఉండవు , చిన్న పెద్ద అనే బేధం అస్సలే ఉండదు , పేదవాడికి , ధనికుడికి అందరికి బంధువు ఈ ఆవకాయ. వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరూ పచ్చళ్ళు పెట్టె బిజీ లో ఉంటారు , కానీ రుచి గా, సంవత్సరం వరకు నిల్వ ఉండే పచ్చడి పెట్టడం అందరికి సాధ్యం అవదు , కానీ కిలోల కొలతలతో కాకుండా ఇపుడు మేము చెప్పే ఈ సులభమైన పద్దతిలో చేసి చూడండి.

 

ఆవకాయ పెట్టడానికి కావాల్సినవి :

ముందుగా  మామిడికాయలు తీస్కుని వాటిని శుభ్రంగా కడిగి వాటి ముచుకను తీసి ఒక అరగంటా పాటు నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత వాటిని శుభ్రంగా తుడిచి మనకు కావాల్సిన సైజు లో ముక్కలు కోసి పెట్టుకోవాలి.

మామిడి ముక్కలు - 6కప్పులు 

కారం - ఒక కప్పు 

వెల్లుల్లి - ఒక కప్పు 

మెంతిపిండి - ఒక  కప్పు 

పసుపు - తగినంత 

నువ్వుల నూనె - ముక్కలు మునిగేంత 

ఉప్పు (దొడ్డు ఉప్పు) - 3/4 వంతు కప్పు 


తయారు చేసే విధానం : 

ముందుగా మనం  కొలత కోసం ఎదో ఒక కప్  తీస్కుని దానితో ఆరు కప్పుల మామిడి  ముక్కలు తీసుకుందాం. ముక్కలు మునిగేంత నూనె తీస్కుని ఆ నూనెలో మామిడి కాయ ముక్కల్ని వేసి ముక్కలకి నూనె పట్టించి వేరే ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇపుడా నూనె లో ఒక కప్పు  కారం వేయాలి. ఇంకా ఒక కప్పు ఆవపిండి కూడా వేయాలి. ఉప్పు కూడా ఒక కప్పు  కంటే కొంచెం  తగ్గించి వేసుకోవాలి , ఒకవేళ కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు . పసుపు అర చెంచా వేస్కోవాలి' ఇందులోనే ఒక కప్పు వెల్లుల్లి కూడా కచ్చా పిచ్చా  గా దంచి కలపాలి. చివరిగా మామిడికాయ ముక్కల్ని కూడా వేసి అన్ని బాగా కలపాలి. ఇలా కలిపిన  ముక్కల్ని మూడు రోజుల పాటు ఉంచి , మూడవ రోజున ఉప్పు చూసుకుని ,ముక్కలు మునిగేంత నూనె పోసుకుని జాడీలో భద్రంగా పెట్టుకుంటే సంవత్సరం వరకు ఆవకాయ పాడవకుండా ఉంటుంది. ఇదండీ ఈజీ గా అందరూ పెట్టగలిగే ఆవకాయ , ఆలస్యం చేయకుండా ఎవరిపై ఆధారపడకుండా ఆవకాయ పెట్టేయండి మరి..


Related Recipes

Pickles

టమాట కరివేపాకు పచ్చడి

Pickles

క్యాబేజీ పచ్చడి

Pickles

నిమ్మకాయ కారం పచ్చడి

Pickles

Allam Pachadi

Pickles

Dondakaya Roti Pachadi

Pickles

Tomato Karivepaku Pachadi

Pickles

Vellulli Avakaya

Pickles

Usiri Avakaya Recipe