జొన్న చుడువా

 

 

 

కావలసిన పదార్ధాలు:-

జొన్న అటుకులు - 1 కప్పు

జీలకర్ర - 1 టీ స్పూను

మినప్పప్పు - 1 టీ స్పూను

నూనె - 3 టీ స్పూన్లు

పచ్చి సెనగ పప్పు - 1 టీ స్పూను

పసుపు - పావు టీ స్పూను

పల్లీలు - 1 టేబుల్‌ స్పూను

ఎండు మిర్చి - 3

కొత్తిమీర తరుగు - 1 టీ స్పూను

ఉప్పు - తగినంత

 

తయారుచేసే విధానం:- 

ముందుగా స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక జొన్న అటుకులను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరికాస్త నూనె వేసి కాగాక పచ్చి పల్లీలు వేసి వేయించాలి. మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. పసుపు వేసి మరోమారు కలియబెట్టి, దింపేసి, జొన్న అటుకుల మీద వేసి బాగా కలపాలి. ఉప్పు జత చేసి మరోమారు కలిపి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి.