జొన్న బూందీ లడ్డు

 

 

 

కావలసిన పదార్ధాలు:

గోధుమపిండి లేదా సెనగ పిండి - ఒక కప్పు

నెయ్యి లేదా నువ్వుల నూనె - వేయించడానికి తగినంత

బెల్లం పొడి - 2 కప్పులు

జొన్న పిండి - ఒకటిన్నర కప్పులు

ఏలకుల పొడి - ఒక టీ స్పూను

జీడి పప్పులు - తగినన్ని

కిస్‌మిస్‌ - తగినన్ని

 

తయారుచేసే విధానం:

ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి లేదా సెనగ పిండి, జొన్న పిండి వేసి బాగా కలపాలి. కొద్డిగా నీళ్లు జత చేసి, బూందీ పిండిలా కలపాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి కాగనివ్వాలి. కలిపి ఉంచుకున్న పిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి బూందీ దూసి, దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేరొక  పెద్ద పాత్రలో కొద్దిగా నీళ్లు, బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చేవరకు ఉడికించి దింపేయాలి. తయారుచేసి ఉంచుకున్న బూందీని బెల్లం పాకంలో వేసి కలియబెట్టాలి. నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లు జత చేసి లడ్డులా ఉండకట్టాలి. కొద్దిగా చల్లారిన తరవాత గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి. అంతే మనకి కావలసిన జొన్న బూందీ లడ్డూ రెడీ..