RELATED ARTICLES
ARTICLES
తానా కోటి సరిగమలు కార్యక్రమానికి విశేష స్పందన

 

తానా కోటి సరిగమలు కార్యక్రమానికి విశేష స్పందన

 


తెలుగువన్, టోరీ రేడియో ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరించిన తానా కోటి సరిగమలు సూపర్ హిట్ అవ్వడం సంతోషదాయకం. అమెరికాలోని ఆస్టిన్ నగరంలో ఈ నెల 10 న జరిగిన ఈ ప్రోగ్రాం కి విశేష స్పందన లభించింది. దాదాపు 1000 మంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. తెలుగు దిగ్గజ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గాయనీ గాయకులు సుమంగళి, శ్రావణభార్గవి, రనీనా రెడ్డి, హేమచంద్ర, వృధ్వీ చంద్ర, రోషన్‌ సాలూర్‌ పాల్గొని ఆహుతుల్ని తమ గాత్ర మాధుర్యంతో ఉర్రూతలూగించారు. తానా రీజినల్ కోఆర్డినేటర్ విద్యాధర్ గారపాటి ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తానా ఆస్టిన్ టీం సపోర్ట్ వల్లే ఈ కార్యక్రమం ఇంత పెద్ద సక్సెస్ అయిందని.

 

 

ఆర్గనైజింగ్ టీం మెంబెర్స్ కల్పనా నూకవరపు, శ్రీధర్ పోలవరపు, బాలాజీ పర్వతనేని, దిలీప్ కుమార్ చంద్ర, హరి బాచిన, ప్రసాద్ కాకమాను, లెనిన్ యెర్రం, సుమన్ పుసులూరి, బాలాజీ బత్తుల, స్వప్న గజ్జల, సాంబ వెలమ, మాధవ జాలాది, అనూష కొల్ల, కిషోర్ పైడిమారి, లెనిన్ తుళ్లూరి, హరీష్ దొండపాటి, కృష్ణ ధూళిపాళ్ల, కుమార్ పిచికల, రామ మోహన్ మొరిశెట్టి, శ్రీనివాస్ మేదమ్, శివ తాళ్లూరి, శ్రీవర్ధన్ నేత గాయత్రి వెంకటేశ్వరన్, రాజేశ్వరి ముత్తం, ప్రవర్ధన్, షర్మిల, ప్రసన్న కుమార్ పెంటకోట కష్టపడటం వల్లే ఇది సాధ్యం అయిందని చెప్పారు. అంతే కాకుండా, డల్లాస్ నుండి వచ్చి తమ వంతు సహకారం అందించిన సుగున్ చాగర్లమూడి (South West RVP) , చలపతి కొండ్రుకుంటా,అనిల్ వీరపనేని, సందీప్ మేక, కుమార్ నందిగాం లకి థాంక్స్ చెప్పారు. ఈ వేదికని అత్యద్భుతంగా డెకరేట్ చేసిన పీకాక్ శ్రీ ఈవెంట్స్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక, ఈ అవకాశం ఇచ్చిన తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన గారికి మరియు విద్య గారపాటి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;