LATEST NEWS
తెలుగువన్ స్పెషల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. వైసీపీ అధికారిక సోషల్ మీడియా పేజీలను మెటా  బ్లాక్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ పరిణామంపై ప్రతిపక్ష నేత జగన్   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై, భావప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడిగా   అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని ఆరోపిస్తూ.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి కార్యాలయం,  మెటా యాజమాన్యానికి ఆయన 'ఎక్స్' వేదికగా  ట్యాగ్ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులలో అధిక వ్యయాలు, డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లలో అక్రమాలపై తాము సాక్ష్యాలతో నిలదీస్తుంటే తట్టుకోలేక ఈ చర్యలకు పాల్పడ్డారని జగన్ విమర్శించారు. అయితే..  ఈ ఆరోపణలను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని  రాజేష్ తీవ్రంగా ఖండించారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. మెటా సంస్థ కేవలం ఒకరి ఫిర్యాదుతో ఓవర్ నైట్ ఏ అకౌంట్‌ను సస్పెండ్ చేయదని ఆయన చెప్పారు.  వైసీపీ సోషల్ మీడియా విభాగం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పదే పదే ఉల్లంఘించడం వల్లే ఈ బ్లాక్ జరిగిందని  వివరించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ ద్వారా రికార్డు స్థాయిలో 15,941 మంది నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు లభించాయనీ.. అయితే వైసీపీ నేతలు తప్పుడు ఆధారాలు, ఫేక్ ఆడియో క్లిప్పింగులతో సమాజంలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించారని అప్పసాని రాజేష్ ఆరోపించారు. ఈ పరీక్షల కోసం టీసీఎస్ అయాన్ ద్వారా 42 వేల ప్రశ్నలతో కూడిన భారీ క్వశ్చన్ బ్యాంక్‌ను ఆన్‌లైన్ విధానంలో ఉపయోగించారని, దీనివల్ల పేపర్ లీక్ అవ్వడం సాంకేతికంగా అసాధ్యమని ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చినా విపక్షం తప్పుడు ప్రచారం ఆపలేదన్నారు. అంతేకాకుండా.. మాజీ ఎమ్మెల్యే నందిగం సురేష్ అనుచరుడు బొంత రోశయ్య అనే వ్యక్తి ద్వారా ఒక నకిలీ ఆడియో క్లిప్‌ను సృష్టించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారని టీడీపీ ఆధారాలతో సహా మెటా సంస్థకు ఫిర్యాదు చేసింది. గతంలో వైసీపీ హయాంలో న్యాయమూర్తులను సైతం దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన చరిత్ర వారిదని, అందుకే అప్పట్లో   హైకోర్టు ఏకంగా సిబిఐ విచారణకు ఆదేశించిందని అప్పసాని రాజేష్ గుర్తుచేశారు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రులపై మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకరంగా ప్రచారం చేస్తూ, దానిని భావప్రకటన స్వేచ్ఛగా చిత్రీకరించడం హాస్యాస్పదమన్నారు. ఒకవేళ ఇదే ధోరణి సాగితే అబద్ధాలను ప్రచారం చేసే సాక్షి పత్రిక సర్క్యులేషన్‌ను కూడా నియంత్రించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ బ్లాక్ అనేది ప్రజాస్వామ్య అణచివేత కాదని, ఫేక్ న్యూస్ నెట్‌వర్క్‌పై మెటా తీసుకున్న చట్టపరమైన చర్య మాత్రమేనని ఆయన చెప్పారు. అయినా మెటా ఫిర్యాదు చేయగానే బ్లాక్ చేయదనీ, నిజానిజాలను నిర్ధారించుకుని వైసీపీకి నోటీసులు పంపించిన తరువాత కూడా అక్కడ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడం వల్లే మెటా చర్య తీసుకుందన్నారు.   
తెలుగువన్ స్పెషల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ముసలం పుడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్ )బిల్లు  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారన్న వార్తలతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజక వర్గాల సంఖ్యను ఏకంగా 50 శాతం మేర పెంచి, మొత్తం 815 స్థానాలకు చేర్చాలనేది ప్రాథమిక ప్రతిపాదన. అయితే..  దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహా మండలి ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో 543 స్థానాలను మరో 9 శాతం పెంచాలని చేసిన సిఫారసులే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో 2009లో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియలో కేవలం నియోజక వర్గాల సరిహద్దులను మాత్రమే మార్చారు..   సీట్ల సంఖ్య పెరగలేదు. కానీ ఈసారి సీట్ల సంఖ్య భారీగా పెరగబోతోంది. విచిత్రం ఏంటంటే, ఈ విభజన అంతా జనాభా ప్రాతిపదికన సమపాళ్లలో జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రత్యేకమైన పాకెట్లను మాత్రమే టార్గెట్ చేస్తూ పునర్విభజన చేసేలా ఆర్థిక సలహా మండలి నివేదిక ఇచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న  అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా సీట్లు పెరగవు. ఇదే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే..  ఈ సిఫారసుల వల్ల కోస్తా తీర ప్రాంతాలైన విజయవాడ, ఏలూరు వంటి బలమైన కేంద్రాల్లో స్థానాలు పెరగడం లేదు. కానీ వైసీపీకి  మొదటి నుంచి కంచుకోటగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఏకంగా 10 లోక్ సభ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమలోని కడప, కర్నూలు, నంద్యాల, రాజంపేట, అనంతపురం వంటి ఐదు కీలక పార్లమెంట్ నియోజక వర్గాలను ఒక్కొక్కదానిని మూడు మూడు నియోజక వర్గాలుగా విస్తరించాలని చూస్తున్నారు. కేవలం హిందూపూర్‌ను మాత్రమే ఇందులో వదిలేశారు. వైసిపి బలహీనపడిందని భావిస్తున్న తరుణంలో.. ఆ పార్టీకి పట్టున్న ప్రాంతంలో ఇలా సీట్లు పెరగడం భవిష్యత్తులో జగన్ మోహన్ రెడ్డికి కలిసివచ్చే అంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఇది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే   కార్యక్రమమేనని సీనియర్ జర్నలిస్టులు వీవీ రావు, గోపి విశ్లేషించారు.  ఇటు తెలంగాణలోనూ ఇదే వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణలో అత్యంత ధనిక ప్రాంతాలైన చేవెళ్ల, మల్కాజ్‌గిరి, మెదక్, సికింద్రాబాద్ వంటి స్థానాలను రెండు లేదా మూడుగా విభజించే ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ( ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విభజన ద్వారా భవిష్యత్తులో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు అవసరం లేకుండా, ఒంటరిగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాలనేది బిజెపి అసలు వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో మహిళా బిల్లు సమయంలో నియోజక వర్గాల పెంపు కోసం విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తమ స్వరాష్ట్రంలో ఇలాంటి అసమానతలతో కూడిన విభజన ప్రతిపాదన వస్తే ప్రజలకు ఏం సమాధానం చెబుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సరిహద్దుల మార్పు రాజకీయం తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును ఎలా మార్చబోతుందో చూడాలి.
హైదరాబాద్ నగర ప్రయాణికులకు అత్యంత కీలకమైన మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టు   రాజకీయ దుమారానికి కేంద్రబిందువుగా మారింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆలస్యం కావడం వెనుక కేంద్ర ప్రభుత్వం,   కొందరు కీలక నేతల రాజకీయ కుట్రలు ఉన్నాయంటూ తెలంగాణ ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి  సంచలన ఆరోపణలు చేశారు. నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే ఈ మెట్రో విస్తరణను కావాలనే అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.  అసలింతకీ జరిగిందేంటంటే..  మెట్రో ఫేజ్ 1 టేకోవర్..   దానికి సంబంధించిన రీఫైనాన్సింగ్ నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.   మెట్రో మొదటి దశను నిర్వహించిన ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాల కారణంగా ఫేజ్ 2 విస్తరణకు ముందుకు రాకపోవడంతో..  కేంద్ర ప్రభుత్వ సలహా మేరకే రాష్ట్ర ప్రభుత్వం  ఎల్ అండ్ టీ  నుంచి మెట్రోను తన అధీనంలోకి తీసుకుంది. అందు కోసం  రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 1,400 కోట్ల మార్జిన్ మనీతో పాటు రూ. 84 కోట్ల ప్రాసెసింగ్ ఫీజును కూడా చెల్లించింది.  ఎల్ అండ్ టీ మెట్రోకు ఉన్న రూ. 13 వేల 600 కోట్ల బ్యాంక్ రుణాలను క్లియర్ చేయడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్ సీ ద్వారా ఒక జపాన్ సంస్థ నుండి   4 శాతం వడ్డీకి రీఫైనాన్స్ ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం సాధించింది.  జపాన్ సంస్థ ఇప్పటికే ఈ నిధులను ఐఆర్ఎఫ్‌సీకి బదిలీ చేసింది. ఈ నెల15 నాటికే అంటే సోమవారం నాటికే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందాలి.. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  అనుమతి పత్రాలను సమర్పించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఈ నిధుల బదిలీని   నిలిపివేసింది.  దీనిపైనే రేవంత్ కేంద్రంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.  నిధుల నిలిపివేత వెనుక కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యక్ష ఉందని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి గత నెల 20న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను,  21న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి..  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని అనుమతులు  సులభంగా ఇస్తే రాష్ట్రంలో బీజేపీని మూసుకోవాల్సి వస్తుందని ఒత్తిడి తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌ల సలహా తోనే కిషన్ రెడ్డి ఈ కుట్రను అమలు చేస్తున్నారని ఆరోపించారు.  అంతే కాకుండా.. విశాఖపట్నం వంటి నగరాల మెట్రో ప్రాజెక్టులకు సులభంగా అనుమతులు ఇస్తున్న కేంద్రం, హైదరాబాద్ విషయంలో మాత్రం ఎందుకు  చేతులెత్తేస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రానికి ఓ సవాల్ కూడా విసిరారు.  కేంద్ర ప్రభుత్వం ఈ 122 కిలోమీటర్ల మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండటానికి ఇష్టపడకపోతే, తక్షణమే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్   ఇవ్వాలనీ, కేంద్రం రూపాయి ఇవ్వకపోయినా 100 శాతం ఈక్విటీతో పూర్తి ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి,  మెట్రో విస్తరణ పనులను పూర్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నిధుల బదిలీని ఆపడం ద్వారా సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్ వంటి కీలక ప్రాంతాల ప్రజలకు మెట్రో సౌకర్యాన్ని దూరం చేయవద్దని, కిషన్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేయాలని సీఎం డిమాండ్ చేశారు.
   మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులు, సమస్యలను స్వీకరించి సంబంధిత అంశాలపై స్పందించారు. పల్నాడు జిల్లాకు అత్యంత కీలకమైన వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వరికపూడిశెల జలసాధన సమితి ప్రతినిధులు మంత్రి లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా మోసపోయిన 1,056 మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. గత మూడేళ్లుగా తాము అందించిన సేవలను గుర్తించి తగిన గుర్తింపు కల్పించడంతో పాటు, భవిష్యత్తులో కూడా ఈ సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన గోల్డ్ లోన్ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. తాము తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల విషయంలో తూకం, వస్తువుల పరంగా తేడాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పేద గర్భిణీల ఆరోగ్య సంరక్షణ కోసం నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాలని, మహిళల భద్రత కోసం ప్రతి నియోజకవర్గంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు మంత్రి లోకేష్‌ను కోరారు.ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెం పంచాయతీ సమగ్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని గ్రామానికి చెందిన ఎన్. మల్లికార్జున నాయుడు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో రోడ్ల నిర్మాణంతో పాటు గండివాగుపై వంతెన నిర్మించాలని కోరారు.ప్రజల నుంచి అందిన అన్ని వినతులను పరిశీలించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.  
బీహార్ రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దీపక్ ప్రకాష్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.  అసెంబ్లీ లేదా శాసనమండలిలో సభ్యుడు కానప్పటికీ ఆయనను మళ్లీ మంత్రిగా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు   మంత్రి దీపక్ ప్రకాష్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి  నోటీసులు జారీ చేసింది. అసలు ఎమ్మెల్యే,  ఎమ్మెల్సీ కాని ఒక వ్యక్తి  సుదీర్ఘ కాలం పాటు మంత్రి పదవిలో ఎలా కొనసాగుతారనే ప్రాథమిక రాజ్యాంగ ప్రశ్నను ఈ కేసు లేవనెత్తింది. సామాజిక కార్యకర్త రాకేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) పరిధిని మరోసారి చర్చకు తెచ్చింది. ఈ వివాదం వివరాలిలా ఉన్నాయి.  గత ఏడాది నవంబర్ 20, 2025న అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన కేబినెట్‌లో దీపక్ ప్రకాష్‌ను పంచాయతీరాజ్ మంత్రిగా నియమించారు. ఆ సమయానికి ఆయన చట్టసభల్లో సభ్యుడు కాదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎలాంటి సభ్యత్వం లేని వ్యక్తి అయినా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు, కానీ ఆరు నెలల లోపు అంటే ఈ ఏడాది మే 20 నాటికి అసెంబ్లీ లేదా మంండలికి ఎన్నిక కావాలి.  అయితే, ఈ ఆరు నెలల గడువు ముగియడానికి ముందే బీహార్ రాజకీయాల్లో ఊహించని మార్పులు జరిగాయి. ఏప్రిల్ 15న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాత మంత్రివర్గం  రద్దయింది. ఆ సమయంలో దీపక్ ప్రకాష్ కూడా తన మంత్రి పదవిని కోల్పోయారు. ఆ తర్వాత దాదాపు 22 రోజుల విరామం అనంతరం బీహార్‌లో  సమ్రాట్ చౌదరి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, పాత కేబినెట్‌లో ఉన్న దీపక్ ప్రకాష్‌ను మళ్లీ అదే పంచాయతీరాజ్ మంత్రిగా కొత్త ప్రభుత్వంలోకి తీసుకున్నారు.   రాజ్యాంగ నియమాల ప్రకారం ఆయనకు లభించిన మొదటి ఆరు నెలల మినహాయింపు గడువు మే 20తో ముగిసిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా అని, చట్టసభ సభ్యత్వం లేని వ్యక్తికి మళ్లీ కొత్తగా మరో ఆరు నెలల సమయం లభిస్తుందా అనే అంశంపైనే ఇప్పుడు న్యాయపోరాటం నడుస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తోంది. దీని ప్రకారం చట్టసభ సభ్యుడు కాని వ్యక్తి వరుసగా ఆరు నెలల పాటు మాత్రమే మంత్రిగా కొనసాగేందుకు వీలుంటుంది. ఆ నిర్ణీత గడువులోగా అతను తప్పనిసరిగా రాష్ట్ర శాసనసభ లేదా శాసనమండలి సభ్యత్వాన్ని సాధించాలి. ఈ మినహాయింపు అనేది ఒక వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుందనీ..  కేవలం ముఖ్యమంత్రి మారినంత మాత్రాన లేదా కొత్త ప్రభుత్వం ఏర్పాటైనంత మాత్రాన ఈ రాజ్యాంగ నిబంధనను తుంగలో తొక్కి, ఆరు నెలల గడువును పునరుద్ధరించడం కుదరదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ ఇలాంటి నియామకాలను అనుమతిస్తే, ప్రజాస్వామ్య సూత్రాలకు విఘాతం కలుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవిస్తూ, రెండోసారి ఇలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేస్తూ నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇలాంటి రాజకీయ నియామకాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ALSO ON TELUGUONE N E W S
Mani Ratnam is known for moving swiftly with his projects and rarely waiting for actors to align schedules. Over the years, the director has often changed casting plans or moved to different subjects whenever delays affected development timelines. But this time, the veteran filmmaker appears to have made an exception. According to industry sources, Mani Ratnam has decided to wait for Vijay Sethupathi and Sai Pallavi to become available instead of reworking the project with another combination. The development has generated curiosity as it reflects the filmmaker’s confidence in the pairing and the world being developed around them. Sai Pallavi is currently occupied with Ramayana, which has emerged as one of Indian cinema’s biggest ongoing productions and is taking up a major portion of her schedule. Vijay Sethupathi, on the other hand, is understood to have prioritised his commitment to director Kruthika Udayanidhi’s film before moving to Mani Ratnam’s project. The decision stands out particularly because Mani Ratnam has traditionally been known to adapt quickly rather than hold projects for long periods waiting for dates. With both actors balancing packed schedules, sources suggest the filmmaker is willing to begin production only after Vijay Sethupathi and Sai Pallavi become available, making this one of the rare occasions where Mani Ratnam has chosen patience over replacing actors and moving ahead. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో, అంతే వేగంగా బ్రేకప్‌లు, విడాకులు  చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు సినిమా వాళ్ళు అతీతులేమి కాదు. నటీనటుల మధ్య బంధం ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్లు వారి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లని గమనిస్తున్నారు. ఎవరైనా తమ భాగస్వామి ఫోటోలని  డిలీట్ చేశారంటే చాలు, అక్కడ ఏదో తేడా కొట్టిందంటూ ప్రచారాలు మొదలైపోతాయి. తాజాగా టాలీవుడ్ నటి సునయన విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రియుడికి సంబంధించిన ఫోటోలని తొలగించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో కలకలం రేగింది. కొన్ని రోజుల క్రితం సునయన(sunaina yella)సోషల్ మీడియా వేదికగా ఒక అపరిచిత వ్యక్తి చేతిని పట్టుకుని ఉన్న ఫోటోని  షేర్ చేస్తూ, ఒక లాక్ ఎమోజీని జోడించింది. ఆమె నిశ్చితార్థం జరిగిందనే వార్తలకి  సదరు పోస్ట్ బలమైన కారణమైంది. ఆ తర్వాత దుబాయ్‌కి చెందిన ప్రముఖ యూట్యూబర్ ఖలీద్ అల్ అమేరి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అదే తరహా ఫోటోని  ‘అల్హమ్దులిల్లాహ్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం, నిశ్చితార్థం దాదాపు ఖాయమని అంతా భావించారు. అయితే తాజాగా సునయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుండి ఆ ఫోటోలని ,తన ప్రియుడికి సంబంధించిన పోస్ట్‌లని  పూర్తిగా డిలీట్ చేసింది. సాధారణంగా సెలబ్రెటీలు తమ రిలేషన్‌షిప్‌కి  ముగింపు పలికినప్పుడు లేదా మనస్పర్థలు వచ్చినప్పుడు మొదట చేసే పని ఇన్‌స్టాగ్రామ్ నుండి ఫోటోలు తొలగించడమే. సునయన కూడా అదే బాటలో పయనించడంతో, ఆమె తన ప్రియుడితో బ్రేకప్ చెప్పేసిందంటూ వార్తలు చల్ చేస్తున్నాయి. అన్‌ఫాలో చేసుకున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఖలీద్ అల్ అమేరి తన మొదటి భార్య సలామా మహ్మద్‌తో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సునయనతో ఆయన సరికొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని అభిమానులు ఆశించారు. Also read: ఆ సూపర్ హిట్ మూవీ కథలు నావే.. మాజీ ఐపీఎస్ అధికారిణి సంచలనం సునయన తెలుగులో 'కుమార్ వర్సెస్ కుమారి', 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' వంటి చిత్రాలతో పాటు తమిళంలో ‘కాదలిల్ విజుంతేన్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ, ఇలా హఠాత్తుగా ఇన్‌స్టాగ్రామ్ నుండి ఫోటోలు డిలీట్ చేయడం వెనుక అసలు కారణం ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇది నిజంగానే బ్రేకపా? లేక వ్యక్తిగత ప్రైవసీ కోసమే ఆమె ఆ ఫోటోలను తొలగించిందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై సునయన నుండి అధికారిక స్పందన వస్తేనే గానీ ఈ సస్పెన్స్‌కి  తెరపడేలా లేదు.      
ప్రస్తుతం వెండితెరపై దయ్యాల జాతర నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలు సైతం వసూళ్ల కోసం చమటోడుస్తున్న తరుణంలో, హారర్ జానర్ సినిమాలు మాత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. నయా హారర్ థ్రిల్లర్స్ ప్రేక్షకులను భయపెడుతూనే, భారీ కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ భట్ సరికొత్త సంచలనం 'హాంటెడ్ 3D: ఎకోస్ ఆఫ్ ది పాస్ట్' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. మహాక్షయ్ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 12న విడుదలై.. మొదటి రోజే ఏకంగా రూ. 2.50 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. కేవలం పాజిటివ్ టాక్‌తో వీకెండ్ ముగిసేసరికి ఈ చిన్న చిత్రం ఏకంగా రూ. 10 కోట్ల మార్కును దాటేసి లాభాల బాట పట్టింది. మరోవైపు హాలీవుడ్ సైకలాజికల్ హారర్ చిత్రం 'అబ్సెషన్' ఇండియాలోనూ సంచలనాలు సృష్టిస్తోంది. ప్రముఖ యూట్యూబర్ కర్రీ బార్కర్ కేవలం ఒక మిలియన్ డాలర్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 200 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. భారతదేశంలోనూ ఈ చిత్రం ఏకంగా రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరి నిలకడైన వసూళ్లతో దూసుకుపోతోంది. దీనికి తోడు వైరల్ యూట్యూబ్ కాన్సెప్ట్ ఆధారంగా యువ క్రియేటర్ కేన్ పార్సన్స్ దర్శకత్వంలో వచ్చిన 'బ్యాక్‌రూమ్స్' కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద క్రేజీ ఓపెనింగ్స్ సాధించింది. గత శుక్రవారం ఒక్క రోజే ఈ మూడు హారర్ చిత్రాలు కలిసి దాదాపు రూ. 6.75 కోట్ల గ్రాస్‌ను రాబట్టడం విశేషం. పెద్దగా మల్టీప్లెక్స్ స్క్రీన్లు దక్కకపోయినప్పటికీ, సింగిల్ స్క్రీన్స్ మరియు బి, సి సెంటర్లలో వీటి హవా గట్టిగా నడుస్తోంది. గతంలో కూడా విక్రమ్ భట్ అందించిన హారర్ చిత్రాలు బాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేశాయి. ఇప్పుడు మళ్లీ అదే మ్యాజిక్‌ను ఆయన రిపీట్ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే హారర్ సినిమాలకు భారతీయ ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని ఈ తాజా కలెక్షన్ల ట్రెండ్ మరోసారి నిరూపించింది. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ సినిమాల గురించిన చర్చలే నడుస్తున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులు భయంతో వణికిపోతున్నారంటూ వస్తున్న మీమ్స్, రివ్యూలు ఈ చిత్రాలకు మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. థియేటర్లలో సీట్ల అక్యుపెన్సీ రోజురోజుకూ పెరుగుతుండటంతో అటు ఎగ్జిబిటర్లు, ఇటు నిర్మాతలు ఫుల్ ఖుషీ అవుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని భారీ హారర్ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఈ చిత్రాల సక్సెస్ చూశాక టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర నిర్మాతలు కూడా హారర్ థ్రిల్లర్ కథలపై దృష్టి పెడుతున్నారు. రాబోయే వారాల్లో ఈ సినిమాలు మరిన్ని రికార్డులను తిరగరాస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
హాలీవుడ్ క్లాసిక్ చిత్రం 'ది మమ్మీ' (The Mummy) సినిమాలో 'ఇన్‌హోటెప్' (Imhotep) అనబడే భయంకరమైన ఈజిప్షియన్ మమ్మీ పాత్ర గుర్తుంది కదా? ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులను తన విలక్షణ నటనతో, భయపెట్టే విజువల్స్‌తో కట్టిపడేసిన ఆ హాలీవుడ్ నటుడు అర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo) ఇప్పుడు నేరుగా మన తెలుగు వెండితెరపై అడుగుపెడుతున్నారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా హిస్టారికల్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'రణబాలి' (Ranabaali) చిత్రంలో ఆయన ఒక అత్యంత కీలకమైన, క్రూరమైన విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు కావడంతో, చిత్రబృందం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరియు భారతీయ చిత్ర పరిశ్రమలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఒక సరికొత్త ఫెరోషియస్ క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాటిక్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అర్నాల్డ్ వోస్లూ పోషిస్తున్న పాత్ర పేరు 'సార్ థియోడోర్ హెక్టర్' (SIR THEODORE HECTOR). ఆయన క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ 'ది డెమన్ ఆఫ్ డ్రాట్' (THE DEMON OF DROUGHT) అంటే 'కరువును సృష్టించే రాక్షసుడు' అనే ఒక పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌ను మేకర్స్ ఇచ్చారు. విడుదల చేసిన పోస్టర్ విజువల్స్ చూస్తేనే మైండ్ బ్లోయింగ్ రేంజ్‌లో ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఒక రాజసం ఉట్టిపడే ఇంటీరియర్ రూమ్‌లో, వెనుక రాయల్ యూనియన్ జాక్ జెండాల మధ్య, ఒక విలాసవంతమైన సింహాసనం లాంటి కుర్చీలో అర్నాల్డ్ వోస్లూ గంభీరంగా కూర్చుని ఉన్నారు. చేతిలో ఒక పవర్‌ఫుల్ రాయల్ స్వోర్డ్ (ఖడ్గం) పట్టుకుని, ఎరుపు మరియు నలుపు రంగుల రాయల్ బ్రిటిష్ దుస్తులు, మెడలో బంగారు ఆభరణాలతో ఉన్న ఆయన లుక్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంది. ఆయన చూపుల్లోని క్రూరత్వం, ముఖంలో కనిపించే కఠినత్వం చూస్తుంటే పందొమ్మిదో శతాబ్దపు బ్రిటిష్ అణచివేతకు, క్రూరత్వానికి ఈ పాత్ర ఒక పెద్ద నిదర్శనంగా నిలవబోతోందని స్పష్టమవుతోంది. 'టాక్సీవాలా', 'శ్యామ్ సింగ రాయ్' వంటి వైవిధ్యమైన సూపర్ హిట్ చిత్రాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఈ చారిత్రక యాక్షన్ డ్రామాను నెక్స్ట్ లెవెల్ విజన్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నేషనల్ క్రష్, ఆయన భార్య రష్మిక మందన్న 'జయమ్మ' అనే ఒక పవర్‌ఫుల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 11న విడుదల కానుంది.   https://x.com/MythriOfficial/status/2066831521986879837
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా 'వారణాసి' (Varanasi) సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నారనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ గట్టిగా నడుస్తోంది. రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా సుదీర్ఘ కాలం పడుతుంది, ఆ తర్వాత మహేష్ బాబును అంతకంటే పవర్‌ఫుల్‌గా వెండితెరపై చూపించే దమ్మున్న దర్శకుడు ఎవరు అనే ప్రశ్న గత కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతోంది. ఈ రేసులోకి ఇప్పటికే 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో పాటు పలువురు టాప్ డైరెక్టర్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ ఇప్పుడు వాటన్నింటినీ పక్కకు నెట్టేస్తూ ఒక ఊహించని మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. తన మార్క్ బోల్డ్, ఇంటెన్స్ మేకింగ్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల రాత మార్చిన సందీప్ రెడ్డి వంగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఒక నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. వీరిద్దరి కలయికలో సినిమా వస్తే చూడాలని టాలీవుడ్ ఆడియన్స్ చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ క్రేజీ వెయిటింగ్‌కు ఎండ్ కార్డ్ పడే సమయం దగ్గరపడిందని, ఈ మైండ్ బ్లోయింగ్ కాంబో దాదాపు ఖరారైందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ అధినేత ఏషియన్ సునీల్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఇమేజ్‌కు, సందీప్ రెడ్డి వంగా నయా టేకింగ్‌కు సరిపోయేలా ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి 'వారణాసి' చిత్రం తర్వాత మహేష్ బాబు ఇమేజ్ గ్లోబల్ వైడ్‌గా మారిపోవడం ఖాయం కాబట్టి, దానికి తగ్గట్టుగానే సందీప్ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ కథను ప్లాన్ చేశారట. సూపర్ స్టార్ క్లాస్ అండ్ డీసెంట్ లుక్‌కు, సందీప్ రెడ్డి వంగా మార్క్ అల్ట్రా వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలు రావడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. రాజమౌళి సినిమా ముగిసేలోపే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  కాగా, ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా కూడా రెబల్ స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' అనే భారీ మూవీ చేస్తున్నారు. 'స్పిరిట్' పూర్తి కాగానే, మహేష్ ప్రాజెక్ట్ పైకి సందీప్ రెడ్డి ఫోకస్ షిఫ్ట్ అయ్యే అవకాశముంది.  
  సినిమా ఇండస్ట్రీలో కథల దొంగతనం లేదా కాపీరైట్ వివాదాలు కొత్తేమీ కాదు. కానీ, ఈసారి ఏకంగా ఒక మాజీ ఐపీఎస్ అధికారిణి, కేరళ తొలి మహిళా డీజీపీ  ఆర్. శ్రీలేఖ రెండు ప్రముఖ మలయాళ చిత్రాలపై తీవ్రమైన ప్లాజియరిజం (కథల దొంగతనం) ఆరోపణలు చేయడంతో దక్షిణాది సినీ పరిశ్రమలో పెద్ద సంచలనం రేగుతుంది .  ఇటీవలే విడుదలైన షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన 'దృఢం' సినిమాతో పాటు, గతంలో విమర్శకుల ప్రశంసలు, అవార్డులు అందుకున్న 'భూతకాలం' (2022) సినిమా కథలు కూడా తనవేనంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా సంచలన విషయాలని  బయటపెట్టారు. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 'దృఢం'   చూసిన తర్వాత ఆమె ఈ విషయాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. తాను సుమారు 15 సంవత్సరాల క్రితం 'మాతృభూమి' వారపత్రికలో రాసిన 'కరింకుడి పోలీస్ స్టేషన్' అనే లఘు కథ (షార్ట్ స్టోరీ) ఆధారంగానే 'దృఢం' సినిమా మూల కథని  రూపొందించారని,అంతేకాకుండా, ఈ కథను 5 సంవత్సరాల క్రితమే తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ఆడియో రూపంలో కూడా అప్‌లోడ్ చేశాను. ఒక మారుమూల కొండ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కి  వచ్చే కొత్త సబ్ ఇన్‌స్పెక్టర్ చుట్టూ, అక్కడ జరిగే వరుస హత్యల చుట్టూ తిరిగే ఈ కథని  ఎలాంటి అనుమతులు లేకుండా సినిమాగా మార్చేశారని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై 'దృఢం' చిత్ర దర్శకుడు మార్టిన్ జోసెఫ్ స్పందిస్తూ.. తమ చిత్రానికి శ్రీలేఖ కథకు ఎలాంటి సంబంధం లేదని, రచయితలు జోమోన్ జాన్, లింటో దేవసియా కూడా ఈ వీడియోను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నారని చెబుతున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇక రెండో సినిమా అయిన 'భూతకాలం' గురించి శ్రీలేఖ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. సుమారు 3 సంవత్సరాల క్రితం తన యూట్యూబ్ ఛానల్‌లోనే  తాను స్వయంగా అనుభవించిన ఒక యదార్థ ఉదంతాన్ని 'భూత భవనం' (దెయ్యాల ఇల్లు) అనే పేరుతో కథగా పంచుకున్నానని, ఆ కాన్సెప్ట్‌ను దొంగిలించే 2022లో రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో 'భూతకాలం' తెరకెక్కించారు. చివరికి  టైటిల్‌లో కూడా నా కథా శీర్షిక పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు . ఆసక్తికర విషయం ఏంటంటే ఈ రెండు చిత్రాల్లోను షేన్ నిగమ్ హీరో. Also read: ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ ఇతనే చిత్ర నిర్మాతలు, దర్శకులపై కథల కాపీ ఆరోపణలు చేసినప్పటికీ, నటుడు షేన్ నిగమ్ పట్ల తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని శ్రీలేఖ స్పష్టం చేశారు. 2017లో వచ్చిన 'పరవ' సినిమా నుంచే తనకు షేన్ నటన అంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా 'దృఢం' సినిమాలో పోలీస్ యూనిఫాంలో చూస్తుంటే గతంలో తనతో కలిసి పనిచేసిన, తాను తమ్ముడిలా భావించే మొహమ్మద్ అనే పోలీస్ అధికారి గుర్తుకు వచ్చాడని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వివాదం మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్న తరుణంలో, కథల హక్కులపై జరుగుతున్న ఈ చర్చ ఎటు దారితీస్తుందో చూడాలి.  
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌ ఇప్పుడు సౌత్ సినిమాపై గట్టిగా దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు దక్షిణాది చిత్రాల డిస్ట్రిబ్యూషన్‌లో భాగస్వామిగా ఉన్న ఆయన, ఇప్పుడు నేరుగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. మాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఒక భారీ పాన్ ఇండియా చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.   ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు 'ఒడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్' (Odiyan: The Age of Illusion) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవలే విడుదలైన 'భూతకాలం', 'భ్రమయుగం' చిత్రాలతో సౌత్ ఇండియాలోనే కాక దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కేరళ జానపద కథలు, మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.   ఈ భారీ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు మలయాళ లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. 19వ శతాబ్దపు కేరళ నేపథ్యంలో, ఒక మాయా రూపాంతర శక్తి (Shape-shifter) చుట్టూ ఈ కథ తిరుగుతుందని మేకర్స్ వెల్లడించారు. ఒక వైపు భీతి గొలిపే వాతావరణం, మరోవైపు సైకలాజికల్ డ్రామాతో ఈ సినిమా సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది.   కరణ్ జోహార్‌తో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలోనూ కొన్ని విజయవంతమైన ప్రయాణాలు జరిగాయి. ఇప్పుడు పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. రాహుల్ సదాశివన్ మార్క్ డార్క్ ఫోక్ హారర్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఈ వినూత్న కలయికపై సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియులు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ముఖ్యంగా హారర్ జానర్‌లో రాహుల్ సదాశివన్ టేకింగ్, పృథ్వీరాజ్ నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 'ఒడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్' చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, షూటింగ్ అప్‌డేట్స్ మరికొద్ది రోజుల్లో అధికారికంగా వెల్లడి కానున్నాయి.
Long before Pan India became an industry trend, Allu Arjun had already built a massive following across the country. His films, songs, dance moves and screen presence have consistently connected with audiences beyond language and regional boundaries. The latest example of this influence came when Prime Minister Narendra Modi used the AA23 theme music in one of his social media posts. More than just a creative choice, it reflects the popularity and cultural relevance associated with Allu Arjun today. What makes it even more significant is that AA23 is still in its early stages, yet its theme music has already found a place in mainstream conversations. Very few actors command this level of anticipation, where even content from an upcoming project generates nationwide attention. Over the years, Allu Arjun has evolved beyond being just a successful actor. His films and associated content have repeatedly become cultural moments, resonating with audiences across India. As excitement around AA23 continues to grow, moments like these once again reinforce why Allu Arjun is widely regarded as the OG Pan India star, with an influence that extends far beyond cinema. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
నేచురల్ స్టార్ నాని (Nani), డైరెక్టర్ సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. 'బ్లడీ రోమియో' (Bloody Romeo) అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో అనౌన్స్ అయిన ఈ సినిమాపై టాలీవుడ్ ఆడియన్స్‌లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. నాని ప్రస్తుతం నటిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) చిత్ర షూటింగ్ అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యం అవుతోందని, ఈ కారణంగానే సుజీత్ తన పూర్తి ఫోకస్‌ను పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సీక్వెల్ 'ఓజీ 2' (OG 2) పైకి షిఫ్ట్ చేశారనే టాక్ బలంగా వినిపించింది. అంతేకాదు, నవంబర్ నెల నుంచే ఈ సీక్వెల్ షూటింగ్ పట్టాలెక్కబోతోందంటూ ఇండస్ట్రీలో ఒక రేంజ్‌లో ప్రచారం కూడా సాగింది. కానీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించిన ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ తెరపైకి ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, నాని మరియు సుజీత్ కలయికలో రాబోతున్న 'బ్లడీ రోమియో' షూటింగ్ ఆలస్యమంటూ వచ్చిన వార్తలు అన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఎందుకంటే వచ్చే నెలలోనే, అంటే జూలై లోనే ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రెగ్యులర్ షూటింగ్ చాలా గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం డైరెక్టర్ సుజీత్ తన కోర్ టీమ్‌తో కలిసి విదేశాల్లో లొకేషన్ల వేటలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కథా నేపథ్యం అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతుండటంతో, లండన్, బుడాపెస్ట్, హంగేరీ వంటి అందమైన మరియు కాస్మోపాలిటన్ నగరాల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తవడంతో, విదేశీ షెడ్యూల్స్ కోసం లొకేషన్లను లాక్ చేసే పనిలో సుజీత్ నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్లానింగ్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన న్యూస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'బ్లడీ రోమియో' సినిమా మొత్తం షూటింగ్‌లో కేవలం 20 శాతం మాత్రమే హైదరాబాద్‌లో జరగబోతోందని సమాచారం. మిగిలిన 80 శాతం భారీ యాక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్ మరియు కీలకమైన డ్రామా సీక్వెన్సులు అన్నీ కూడా లండన్, బుడాపెస్ట్, హంగేరీ దేశాల్లోనే షూట్ చేయనున్నారు. ఈ ఇంటర్నేషనల్ బ్యాక్‌డ్రాప్ సినిమాకు ఒక సరికొత్త విజువల్ గ్రాండియర్‌ను తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకపక్క నాని 'ది ప్యారడైజ్' షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తూనే, మరోపక్క 'బ్లడీ రోమియో' కోసం డేట్స్ అడ్జస్ట్ చేశారట. ఈ సరికొత్త క్లారిటీతో నాని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే, 'ఓజీ 2' కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కాస్త నిరాశచెందుతున్నారు. అయితే సుజీత్ కి వేగం షూటింగ్ ఫినిష్ చేస్తాడనే పేరుంది. నాలుగు నెలల్లో 'బ్లడీ రోమియో' షూటింగ్ పూర్తి చేసి, నవంబర్ నాటికి 'ఓజీ 2' ప్రాజెక్ట్ పైకి వచ్చినా ఆశ్చర్యంలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.  
  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుండి వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ బ్యూటీ, తాజాగా తన సినీ ప్రయాణం మరియు వ్యక్తిగత మార్పులపై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు వరుస హిట్లతో వచ్చిన స్టార్‌డమ్ తనలో తెలియకుండానే అహాన్ని పెంచిందంటూ సామ్ ఓపెన్‌గా మాట్లాడటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన తదుపరి చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదల కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో సమంత పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక సాధారణ చిన్న పట్టణం నుండి వచ్చి, వెండితెరపై ఇంతటి స్టార్‌డమ్ అందుకోవడం తనకు మొదట్లో ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకులు తన పేరు పెట్టి అరుస్తుంటే ఆ మత్తులో పడిపోయానని, దాంతో ఓ దశలో సక్సెస్ అనే ఆటకు తాను పూర్తిగా దాసోహమయ్యానని సమంత అంగీకరించారు. ఆ రోజుల్లో ఏడాదికి ఏకంగా ఐదు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపానని సామ్ గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో ఇండస్ట్రీలో అందరూ తనను ‘గోల్డెన్ లెగ్’ అని పిలవడం మొదలుపెట్టారని, ఆ ట్యాగ్‌ను నిలబెట్టుకోవాలనే ఒత్తిడిని తానే స్వయంగా పెంచుకున్నానని తెలిపారు. ఆ సమయంలో తనకు అసలు ముగింపే లేదని, ఎప్పటికీ ఇలాగే కొనసాగుతాననే ఒక రకమైన అహంకారం తలకెెక్కిందని ఆమె నిజాయితీగా ఒప్పుకున్నారు. అయితే 2022లో సమంత మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ ఆరోగ్య సమస్యల వల్ల బలవంతంగా తీసుకోవాల్సి వచ్చిన లాంగ్ బ్రేక్ తన జీవితాన్ని, ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని సమంత ఎమోషనల్ అయ్యారు. ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా ఏ నాటికైనా కెరీర్‌కు ముగింపు ఉంటుందనే చేదు నిజాన్ని ఆ విరామ సమయంలోనే గ్రహించానని, అందుకే సెకండ్ ఇన్నింగ్స్‌లో కొన్ని పాత అలవాట్లను, పద్ధతులను పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. సమంత చేసిన ఈ బోల్డ్ అండ్ హానెస్ట్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. స్టార్ స్టేటస్‌లో ఉండి కూడా తన తప్పులను ఇంత ఓపెన్‌గా ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలని, సామ్ మునుపటికంటే ఇప్పుడు మరింత పరిణతి చెందిన వ్యక్తిగా మారిందంటూ నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఇక సమంత ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. హెల్త్ బ్రేక్ తర్వాత ఆమె వెండితెరపై ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించనున్న సినిమా ఇదే కావడంతో టాలీవుడ్‌లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రంతో సమంత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేయనుందో చూడాలి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఎండలు భగభగ మండుతూ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత రుతుపవనాలు వస్తాయి.  ఈ రుతుపవనాలు ప్రజలకు ఎంతో ఊరట ఇస్తాయి. చాలా ఎండల తర్వాత వర్షం కురవడం,  వాతావరణం చల్లబడటం అనేది కేవలం మనుషులకే కాదు.. జంతువులకు, వృక్షాలకు కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మొక్కలను పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టమున్నవారికి మాత్రం వర్షాలు కురవడం అనేది ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది.  అయితే వర్షాకాలం కొన్ని సవాళ్లను కూడా వెంట తెస్తుంది. వర్షాలు రాగానే కొన్ని తోటలు పచ్చగా, అందంగా కనిపిస్తాయి.   మరికొన్ని కలుపు మొక్కలు, కీటకాలు, కుండీలలో నీరు నిలవడం వంటి సమస్యలను తెచ్చిపెడతాయి.   ఈ వర్షాకాలంలో  తోటలోని మొక్కలకు ఎలాంటి వ్యాధులు రాకూడదన్నా.. మొక్కలు పచ్చగా,  ఏపుగా పెరగాలన్నా వర్షాలు ప్రారంభమయ్యే ముందు  కొన్ని పనులు చేయాలి. ఎంతో సులభమైన, ముఖ్యమైన ఆ పనులు ఏంటో తెలుసుకుంటే..   డ్రైనేజీ రంధ్రాలు.. వర్షాకాలంలో మొక్కలు చనిపోవడానికి చాలా ఎక్కువగా  ఎదురయ్యే  సాధారణ కారణం నీరు. మొక్కలకు నీరు బాగా పోసినా లేదా వర్షాల కారణంగా కుండీలలో నీరు ఎక్కువగా నిలిచినా మొక్కలు చనిపోతాయి.  కుండీ అడుగున ఉన్న రంధ్రం మట్టితో లేదా గులకరాళ్లతో మూసుకుపోతే, వర్షపు నీరు బయటకు పోదు. దీనివల్ల వేర్లు నీటిలో మునిగి ఉండి కుళ్లిపోతాయి. అందువల్ల, వర్షాలు రాకముందే, అదనపు నీరు వెంటనే బయటకు పోయేలా అన్ని కుండీలలోని డ్రైనేజీ  రంధ్రాలను పుల్ల లేదా స్క్రూడ్రైవర్‌తో శుభ్రం చేయాలి. కలుపు మొక్కలు.. గాలిలో , నేలలో తేమ పెరిగేకొద్దీ కుండీలలో , పూల మడులలో అనవసరమైన కలుపు మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఈ కలుపు మొక్కలు చూడటానికి అందవిహీనంగా ఉండటమే కాకుండా, నేల నుండి అవసరమైన పోషకాలను గ్రహించి,  ప్రధాన మొక్కలను బలహీనపరుస్తాయి. వర్షాలు ప్రారంభమయ్యే ముందు, తోట అంతటా లేదా కుండీలలో  కలుపును పూర్తిగా తీసివేసి, అన్ని కలుపు మొక్కలను వేళ్లతో సహా పెకిలించాలి. ప్రూనింగ్.. ప్రూనింగ్ అంటే కత్తిరింపు.  కొత్త మొక్కల పెరుగుదలకు వర్షాకాలం ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది . అందువల్ల, వర్షాలు ప్రారంభమయ్యే ముందు  మొక్కలను తేలికగా కత్తిరించాలి. చనిపోయిన, కుళ్ళిన లేదా వ్యాధి సోకిన కొమ్మలను తొలగించాలి. కత్తిరించడం వల్ల మొక్కలో గాలి, సూర్యరశ్మి ప్రసరణ మెరుగుపడుతుంది. వర్షం పడిన వెంటనే మొక్కకు ఎన్నో కొత్త, నిగనిగలాడే ఆకులు చిగురిస్తాయి. సపోర్ట్.. వర్షాకాలంలో బలమైన గాలులు, తుఫానులు సర్వసాధారణం. మనీ ప్లాంట్, తిప్పతీగ  లేదా తమలపాకు  వంటి తీగలు, బరువైన మొక్కలు బలమైన గాలుల వల్ల లేదా నీటి బరువు వల్ల విరిగి పడిపోవచ్చు. దీనిని నివారించడానికి, వర్షాకాలం రాకముందే  తీగలు , పొడవైన మొక్కలన్నింటికీ వెదురు కర్రలు, పుల్లలు లేదా తాళ్లతో తగినంత ఆధారాన్ని అందించాలి, తద్వారా అవి బలమైన తుఫానుల సమయంలో కూడా సురక్షితంగా నిలబడతాయి. కంపోస్ట్, కొత్త మట్టి.. తరచుగా కురిసే వర్షాల వల్ల  కుండీలలోని పై మట్టి, దానిలోని పోషకాలు కొట్టుకుపోతాయి. వర్షాలు పడటానికి ముందే మట్టిని సిద్ధం చేసుకోవడం ముఖ్యం. కుండీలలో కొంత తాజా మట్టిని, మంచి సేంద్రియ ఎరువును కలపాలి. వర్షపు నీరు పడినప్పుడు, ఈ ఎరువు నేరుగా వేర్లకు చేరి,  మొక్కలు రెట్టింపు వేగంతో పెరిగే శక్తిని ఇస్తుంది. కొన్ని గార్డెనింగ్ టిప్స్.. తేమతో కూడిన వాతావరణం కీటకాలు, శిలీంధ్రాలు , చీమల పెరుగుదలకు అనువైనది. వర్షాకాలంలో, మొక్కలపై మీలీబగ్స్ , శిలీంధ్రాల దాడి  బాగా  పెరుగుతుంది. దీనిని నివారించడానికి, ప్రతి 15 రోజులకు ఒకసారి  మొక్కలపై వేప నూనెను పిచికారీ చేయాలి, లేదా కొద్దిగా శిలీంధ్రనాశక పొడిని శుభ్రమైన నీటిలో కలపి పిచికారీ చేయాలి. ఈ ముందుజాగ్రత్త చర్యలు  మొక్కలను వ్యాధుల నుండి కాపాడుతాయి.                                            *రూపశ్రీ.
తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా పెంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఉండే  కొన్ని అలవాట్లు తెలియకుండానే పిల్లల మీద ప్రబావం చూపిస్తాయి.ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే.. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద ప్రబావం చూపిస్తున్నట్టు కనీసం తల్లిదండ్రులు తెలుసుకోరు, గ్రహించలేరు కూడా.  కానీ అది పిల్లల మానసిక , భావోద్వేగ ఎదుగుదలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రవర్తన సరిగా లేని తల్లిదండ్రుల వల్ల, పిల్లలు క్రమంగా మౌనంగా ఉండిపోతారు, తమ మనసులో ఉన్న విషయాలను  వ్యక్తపరచడానికి సిగ్గుపడతారు, వారి ఆత్మవిశ్వాసం కూడా బలహీనపడుతుంది.  తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంటే పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందో.. వారు జీవితంలో ఏ విషయాన్ని చెప్పలేక, జీవితంలో ఎదగలేక వెనుకబడిపోతారో.. పేరెంటింగ్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. కొన్ని లక్షణాలను, ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో పెంపకం సరిగా లేదని అర్థం చేసుకోవచ్చు.  తల్లిదండ్రులలో మూడు సాధారణ లక్షణాలు ఉంటాయి. మొదటిది, తమ పిల్లల ప్రతి  దాన్ని నియంత్రించాలని, వారి తరపున ప్రతి నిర్ణయం తామే తీసుకోవాలని కోరుకునే తల్లిదండ్రులు. రెండవది, పిల్లలు విచారంగా, కోపంగా లేదా కలత చెందినప్పుడు, "నువ్వు అతిగా స్పందిస్తున్నావు" లేదా "ఇంత చిన్న విషయానికి ఎందుకు కోపపడుతున్నావు?" వంటి మాటలు అనడం. ఇది పిల్లల భావాలకు విలువ లేదని వారికి నేర్పుతుంది. పిల్లలు సరిగా పెంచడం లేదనడానికి మూడవ సంకేతం ఏమిటంటే, పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే, ఎప్పుడూ చదువుకుంటే, తల్లిదండ్రుల మాట వింటే, వారి అంచనాలకు అనుగుణంగా జీవిస్తేనే తమకు ప్రేమ, పెద్దల అనుమతి  లభిస్తాయని భావించడం.  ఒకవేళ వారు అలా చేయకపోతే, వారి తల్లిదండ్రులు కోపగించుకోవడం లేదా కలత చెందడం,  ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఇలా చాలా చేస్తారు. తల్లిదండ్రులు చేసే ఈ ప్రవర్తన వల్ల పిల్లలు మానసికంగా ఎదగలేరు,  వారి ఆత్మవిశ్వాసం కోల్పోతారు. తల్లిదండ్రులు ప్రవర్తన మార్చుకోవాలి.. తల్లిదండ్రులు తమలో తాము పైన చెప్పుకున్న లక్షణాలు గమనిస్తే, వెంటనే తమ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలని పేరెంటింగ్ నిపుణులు అంటున్నారు.  అంతేకాదు.. తమ పిల్లలను నియంత్రించడానికి బదులుగా, తల్లిదండ్రులు వారితో మంచి అనుబంధాన్ని పెంచుకోవడం, పిల్లలతో స్నేహితులుగా ఉండటంపై  దృష్టి పెట్టాలి. వారి సమస్యలకు పరిష్కారాలు సూచించే ముందు, పిల్లలు ఏం చెప్తున్నారో  అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా, వారి  సమస్య ఏంటో వివరంగా తెలుసుకోవాలి. కేవలం చదువు, ఫలితాలపై దృష్టి పెట్టకుండా, వారు తమ పిల్లల అభిరుచికి విలువ ఇవ్వాలి. ఇది ముఖ్యం.. తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా లేకపోవడం అంటే.. అప్పుడప్పుడు ఒక చెడ్డ నిర్ణయం తీసుకునేవారు లేదా పొరపాటు చేసేవారు కాదు. విషపూరితమైన తల్లిదండ్రులు అంటే, వారి వల్ల పిల్లలు క్రమంగా తమ ఆత్మవిశ్వాసాన్ని, తమ అభిప్రాయాన్ని చెప్పే శక్తిని, ఏదీ చెప్పుకోలేని పరిస్థితి తీసుకురావడం.  ఇలాంటివన్నీ ఉంటే ఆ పిల్లలు జీవితంలో ఎంతో కోల్పోతారు.                                          *రూపశ్రీ.
  పిల్లలను పెంచడం అంటే కేవలం వారికి మంచి విద్య,  ఆహారం,  కనీస అవసరాలు  అందించడం కాదు. వారికి అవసరమైన జీవిత నైపుణ్యాలు, విలువలను కూడా నేర్పించాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తరచుగా చాలామంది తల్లిదండ్రులు, ఆడపిల్లలకు కొన్ని పనులను నేర్పిస్తారు.  మగపిల్లలకు ఆ పనులతో అవసరం లేదని,  అది మగవారి బాధ్యత కాదని చెబుతారు. కానీ మారుతున్న కాలంతో పాటు ఈ ఆలోచనా విధానం వేగంగా మారుతోంది. నేటి కాలంలో అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరినీ స్వయం సమృద్ధిగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం చాలా ముఖ్యం. చిన్నతనంలో నేర్చుకున్న అలవాట్లు, నైపుణ్యాలు పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు మాత్రమే నేర్పించే కొన్ని పనులు మగపిల్లలకు కూడా నేర్పిస్తే వారు మనుషులుగా ఎదగడమే కాకుండా వారి భవిష్యత్తు ఎంతో బాగుంటుంది.  ఆ పనులు ఏంటో తెలుసుకుంటే.. ఇంటి పనులలో సహాయం.. చిన్న వయస్సు నుండే పిల్లలకు ఇంటి పనులలో పాల్గొనడం నేర్పించాలి. వారి గదిని సర్దుకోవడం, గిన్నెలను వాటి స్థానంలో పెట్టడం, బట్టలు మడతపెట్టడం లేదా బల్ల సర్దడం వంటి పనులు వారిలో బాధ్యతా భావాన్ని పెంపొందిస్తాయి. దీనివల్ల ఇంటిని చూసుకోవడం అనేది అందరి ఉమ్మడి బాధ్యత అని పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. వంట.. వంట చేయడం అనేది ఒక జీవన నైపుణ్యం మాత్రమే కాదు, అది ఆత్మ గౌరవాన్ని కూడా పెంపొందిస్తుంది. .  టీ తయారు చేయడం, టిఫిన్  సిద్ధం చేయడం, సాధారణ భోజనం వండటం వంటి ప్రాథమిక వంట నైపుణ్యాలను మగపిల్లలకు కూడా నేర్పించాలి. దీనివల్ల భవిష్యత్తులో వారు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా ఉంటారు. మహిళలను గౌరవించడం.. చిన్నతనం నుండే పిల్లలకు ఇతరుల పట్ల గౌరవం, ఇతరులతో సున్నితంగా ఉండటం వంటివి   నేర్పించాలి. స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవానికి, సమానత్వానికి అర్హులని కొడుకులకు నేర్పించడం చాలా ముఖ్యం. ఇది వారి వ్యక్తిత్వాన్ని సానుకూలంగా తీర్చిదిద్దుతుంది. ఎమోషన్స్.. అబ్బాయిలకు తరచుగా ఏడవకూడదని,  బాధపడకూడదని సలహా ఇస్తుంటారు, కానీ మానసిక ఆరోగ్యానికి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వ్యక్తపరచడం చాలా ముఖ్యం. అబ్బాయిలకు తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పడం, సహాయం అడగడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం నేర్పించాలి. ఆర్థిక బాధ్యత.. చిన్న వయస్సు నుండే పిల్లలకు పొదుపు చేయడం, బడ్జెట్ వేసుకోవడం, బాధ్యతాయుతంగా ఖర్చు చేయడం వంటి అలవాట్లను నేర్పించడం వల్ల, వారు ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకుని, భవిష్యత్తులో మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చాలా వరకు ఆర్థికంగా పొదుపు చేసుకోవాలని,  ఎక్కువగా ఖర్చులు పెట్టకూడదని కేవలం ఆడపిల్లలకు చెబుతూ  ఉంటారు. కానీ భవిష్యత్తులో వివాహం తర్వాత ఆడపిల్లలు పొదుపు చేస్తూ.. మగవారు ఖర్చు చేస్తూ ఉంటే ఆ ఇల్లు ఆర్థికంగా ఎదగదు.  అందుకే ఆర్థిక బాధ్యత ఆడపిల్లలకు, మగపిల్లలకు ఇద్దరికీ నేర్పాలి.                                    *రూపశ్రీ.
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా భోజనం చేయడం,  తిన్న వెంటనే నిద్రపోవడం, జీవనశైలిలో మార్పులు.. మొదలైనవన్నీ గ్యాస్,  ఎసిడిటీ సమస్యకు దారితీస్తాయి.  గుండెల్లో మంట, ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు తరచుగా దగ్గరలోని మెడికల్ స్టోర్ నుండి గ్యాస్ మాత్రలను కొనుగోలు చేసి వాడుతుంటారు. ఈ మందులు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి, కానీ దీర్ఘకాలంలో, అవి ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ల వల్ల మూత్రపిండాలకు కలిగే ప్రమాదాలు వైద్య నివేదికలలో, నిపుణుల బృందం ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (PPIs) అనే ఔషధాల సమూహాన్ని ఆరోగ్యానికి అత్యంత హానికరం అని వర్ణించింది. ఈ మందులను దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల మూత్రపిండాల వైఫల్యం ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు.. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు అనేక పేర్లతో అమ్ముడవుతాయి . ప్రపంచవ్యాప్తంగా చాలా  సాధారణంగా సూచించబడే మందులలో ఇవి కూడా ఉన్నాయి. కొన్ని పరిశోధనలలో ఇతర అసిడిటీ మందులు (హిస్టమైన్-2 రిసెప్టర్ యాంటాగోనిస్టుల వంటివి) తీసుకునే వారితో పోలిస్తే, PPIS మందులు తీసుకునే వారికి మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తేలింది. PPIS తీసుకుంటున్న రోగులకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వచ్చే అవకాశం 28.4 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.  అదేవిధంగా, తీవ్రమైన మూత్రపిండాల గాయం ప్రమాదం 4.2 రెట్లు ఎక్కువగా , ఫైనల్ స్టేజ్ మూత్రపిండాల వ్యాధి ప్రమాదం 35.5 రెట్లు ఎక్కువగా ఉంటుందట.  PPIS తీసుకునే వ్యక్తులలో ఎలక్ట్రోలైట్ల (సోడియం, పొటాషియం మరియు మెగ్నీషియం వంటివి) అసమతుల్యత ఉండే అవకాశం ఎక్కువగా ఉందని  అధ్యయనాల్లో తేలింది. లివర్ ప్రమాదం కూడా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, చాలా మంది రోగులకు PPIలు కీలకమైన మందులు కావచ్చని, PPIలు ఎలుకలు , మానవులలో దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచవచ్చని సూచించింది. సాధారణంగా మందుల ప్రయోగాలు ఎలుకల మీదనే జరుగుతాయి. రానిటిడిన్.. రానిటిడిన్‌తో ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే.., దానిని నిల్వ చేసినప్పుడు, దానిలో N-నైట్రోసోడైమిథైలమైన్ (NDMA) అనే రసాయనం ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది అత్యంత విషపూరితమైనదని , క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. చాలా దేశాలు దీని వాడకాన్ని నిషేధించినప్పటికీ, భారతదేశంలో ఇది ఇప్పటికీ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుకలో ఉంది. కాబట్టి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు ఊరికే మెడికల్ స్టోర్ నుండి మందులు తెచ్చుకుని వాడకుండా ఆరోగ్యాన్నిజాగ్రత్తగా కాపాడుకోవాలి.                                   *రూపశ్రీ.
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి రకరకాల ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ ఉత్పత్తులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు.  ఈ సమస్యను చాలామంది ఎదుర్కుంటూ ఉంటారు. కానీ ముఖం మీద మొటిమలు తగ్గాలన్నా,  గొండ్ కటీరా లేదా బాదం బంక చాలా బాగా పనిచేస్తుందని అంటున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఖరీదైన ఉత్పత్తులు ఎందుకు పనిచేయవంటే.. ఖరీదైన ఉత్పత్తులు  చర్మంపై ఎందుకు పనిచేయడం లేదని చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. దానికి సమాధానం ఏమిటంటే ఆ ఉత్పత్తులలో అనేక రకాల రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలను తరచుగా చర్మానికి మేలు చేయడానికి కలుపుతారు, కానీ అవి ప్రయోజనాలను అందించడానికి బదులుగా హాని కలిగించే అవకాశం ఎక్కువ. బాదం బంక ఎలా పనిచేస్తుందంటే.. శరీరంలో వేడి చర్మంపై ఎర్రటి బొబ్బల రూపంలో కనిపిస్తుంది. దీన్ని తగ్గించడానికి బాదం బంకను ఉపయోగించవచ్చు. బాదం బంకను  రాత్రంతా నానబెట్టాలి. ఉదయం పూట, ఆ స్ఫటికాలు జెల్లీలా కనిపిస్తాయి. దీనికి కొంచెం చల్లటి నీరు కలపాలి. ఇప్పుడు సగం నిమ్మకాయ రసాన్ని  కలపాలి. ఈ పానీయాన్ని తాగాలి.  దీనిని 3 నుండి 4 రోజుల పాటు తాగడం వల్ల ఫలితాలు కనిపిస్తాయి. బాదం బంక ప్రయోజనాలు.. బాదం బంక తినడం వల్ల శరీరం సహజంగా చల్లబడుతుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది,  దాని వృద్ధాప్యాన్ని నెమ్మదించే లక్షణాలు కలిగి  ఉంటుంది.  ఇది శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తుంది.            మొటిమలు, ముడతలు, ఎండదెబ్బ వంటి సమస్యలను తగ్గించగలదు. దీని ఫలితంగా కాంతివంతమైన , యవ్వనమైన చర్మం లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.                                       *రూపశ్రీ.
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ, టీ లు పేపర్ కప్పులలో తాగుతుంటారు.  దుకాణ దారులు కూడా పేపర్ కప్పులు ఉపయోగిస్తారు.  ఎక్కడో చాలా కొద్దిమంది మాత్రమే స్టీల్ లేదా గాజు గ్లాసులు ఉపయోగిస్తారు. ఉద్యోగం నిమిత్తం బయట ఉండేవారు లేదా రోజూ అలా వాకింగ్ కు వెళ్లి వస్తూ బయట టీ లేదా కాఫీ తాగడం అలవాటుగా గల వారు రోజూ పేపర్ కప్పులో తాగడం జరుగుతుంది.  ఎప్పుడో ఒకసారి ఇలా పేపర్ కప్పులో తాగితే పర్లేదు.. కానీ. రోజూ పేపర్ కప్పులలో కాఫీ, టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబున్నారు. పేపర్ కప్పులు ఆరోగ్యానికి కూడా మంచివని అనుకుంటారు, పైగా పర్యావరణానికి కూడా హాని కలిగించవు అనుకుంటారు. కానీ పేపర్ కప్పులను టీ, కాఫీ తాగడానికి ఉపయోగించడం గురించి చాలా షాకింగ్ నిజాలు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.  దాని గురించి తెలుసుకుంటే.. పేపర్ కప్పులలో కాఫీ, టీ తాగడం వల్ల కలిగే నష్టాలు.. మైక్రోప్లాస్టిక్.. చాలా కాగితపు కప్పుల లోపల పాలిథిలిన్ లేదా ప్లాస్టిక్  పలుచని పొర ఉంటుంది.  దీనిలో వేడి టీ పోసినప్పుడు, మైక్రో ప్లాస్టిక్ కణాలు విడుదలై పానీయంలో కలిసిపోతాయి, ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. రసాయనాలు.. కొన్ని కాగితపు కప్పుల పూతలో ఉండే రసాయనాలు, అధిక వేడికి గురైనప్పుడు పానీయంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. పేపర్ కప్పులలో కాఫీ, టీ  ఎక్కువ కాలం పాటు తాగడం  వల్ల ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరగవచ్చని వైద్యులు  చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత.. ప్లాస్టిక్ ఆధారిత కొన్ని రసాయనాలు శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను ప్రభావితం చేయగలవని నిపుణులు భావిస్తున్నారు. పేపర్  కప్పులను పదేపదే ఉపయోగించడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని అంటున్నారు. పర్యావరణం.. కాగితపు కప్పులు అని పిలిచినప్పటికీ, వాటిలో ఉండే ప్లాస్టిక్ పూత కారణంగా వాటిని పూర్తిగా రిసైకిల్  చేయడం కష్టమట. దీనివల్ల పర్యావరణ కాలుష్య సమస్య పెరగవచ్చట. కాఫీ, టీ  ఎలా తాగితే సురక్షితం.. టీ తాగడానికి స్టీల్, గాజు లేదా మట్టి కప్పులను వాడాలి. కాగితపు కప్పులలో వేడి పానీయాలను పదేపదే తాగడం మానుకోవాలి. కాగితపు కప్పులను ఉపయోగిస్తుంటే, క్వాలిటీ  కప్పులను మాత్రమే ఎంచుకోవాలి.  వేడి పానీయాలను కప్పులో ఎక్కువ సేపు ఉంచడం కూడా మంచిది కాదు. కాబట్టి తొందరగా తాగాలి.                                       *రూపశ్రీ.