LATEST NEWS
టీవీకే అధ్యక్షుడు విజయ్‌ ను విమర్శించే క్రమంలో నటి త్రిష పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ క్షమాపణలు కోరారు. ఎవరినీ బాధ పట్టే ఉద్దేశం తనకులేదని, పొరపాటున ఈ వ్యాఖ్యలు చేశానని, అందుకు చింతిస్తున్నానన్నారు. సోమవారం  (ఫిబ్రవరి 16) మీడియాతో మాట్లాడిన నయినార్ నాగేంద్రన్.. మాట్లాడుతూ, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఆ రోజు తాను ఆ నిబంధనను అత్రికమించానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దీనిపై వివాదం రేగడంతో బీజేపీ కోయంబత్తూరు ఎమ్మెల్యే వనతి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తనతో ఈ విషయం చర్చించారని, తాను అన్న మాటలకు చింతిస్తున్నానని నాగేంద్రన్ తెలిపారు. సొంతంగా పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేయగలరా అంటూ విజయ్ విసిరిన సవాలుపై నాగేంద్రన్‌ను మీడియా ఇటీవల ప్రశ్నించింది. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ, విజయ్‌కు అనుభవం లేదని, ముందు త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి తన కుటుంబంతో అనుబంధం కలిగి ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు.దీంతో  రాజకీయ దుమారం రేగింది. బీజేపీ నైజం ఏమిటో నాగేంద్రన్ మాటలను బట్టే చెప్పవచ్చంటూ డీఎంకే విమర్శలు గుప్పించింది. కాగా, నాగేంద్ర వ్యాఖ్యలను త్రిష తరఫున న్యాయవాది తప్పుపట్టారు. బాధ్యత కలిగిన హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తాను ఊహించలేదంటూ త్రిష స్పందనను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన క్లయింట్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, నటనకే పరిమితమని, సంబంధం లేని వ్యహహారాల్లో ఆమెను లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో నాగేంద్రన్ తన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్టు ప్రకటించారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఇటీవల పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలి రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి .. ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం పెను సంచలనం సృష్టించడంతో ఆయన యూటర్న్ తీసుకున్నట్లు కనిపించింది. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంచలన విజయాన్ని కట్టబెట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో గూడెం మహిపాల్ రెడ్డి అండతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యంతో కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ.. తాజాగా ఇస్నాపూర్ పురపాలక సంఘం ఛైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకుంది. ఇస్నాపూర్ మున్సిపల్ ఛైర్మన్‌గా మోటే సుమలత.. వైస్ ఛైర్మన్‌గా పట్లోళ్ల మాధవి ఎన్నిక అయ్యారు.  ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్న గూడెం మహిపాల్ రెడ్డి.. ఓటు వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, స్థానిక నేతలను ఉద్దేశించి పరోక్షంగా .బుల్లెట్ దిగిందా, లేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ లో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ 10 వార్డులు, బీఆర్ఎస్ 12, ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో గెలుపొందారు. వారిలో ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లగా మరొకరు బీఆర్ఎస్‌ పార్టీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెరో 13 ఓట్లు చేరాయి. దీంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ తమదే అని ధీమాతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి‌తో కలిసి ఒకే కారులో ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన రఘునందన్ రావు.. బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఎక్స్ అఫీషియో ఓటు వేయడంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది.
నెల్లూరు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు మేయర్ విషయంలో అన్యాయం జరుగుతోందంటూ వైసీపీ మాజీ మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ఆందోళనకు దిగారు.  అయితే జయవర్ధన్ ఆరోపణలను తెలుగుదేశం ఖండించింది.  వైసీపీ ప్రోత్సాహంతోనే తమపై విషప్రచారం సాగించారనితెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ అసత్య  ప్రచారాలు చేశారన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో తమకే సంఖ్యా బలం అధికంగా ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కాగా, నెల్లూరు మేయర్ పదవికి దేవరకొండ శ్రీలతని తెలుగుదేశం ఎంపిక‌ చేసిన విషయం తెలిసిందే.
  కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా.. ఇంకెంత కాలం అవమానాలు భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంత కాలం నాకు వేధింపులు తప్పవు అని అన్నారు. జగిత్యాలలోనే ఇలా ఉంటే పార్టీ మారిన మరో 9 నియోజకవర్గాల్లో ఎలా పరిస్థితి ఉందో అని వాపోయారు.   మరోవైపు తన వర్గానికి ఛైర్మన్ పీఠం దక్కకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీ కార్యకర్తల మనోభావాలు గౌరవించాలన్నారు.. తన ప్రతిపాదనను కాదని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడంతో జీవన్‌ రెడ్డి కలత చెందారు. తన వర్గానికి చెందిన వ్యక్తికి కాకుండా.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి చెందిన సమిండ్ల వాణిని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎంపిక చేయడాన్ని ఆయన అవమానంగా భావిస్తున్నారు. 
బీఆర్ఎస్ బీజేపీలో  విలీనమౌతుందంటూ  కాంగ్రెస్, కాంగ్రెస్- బీఆర్ఎస్ ఒక‌టేన‌ని బీజేపీ,  బీజేపీ- కాంగ్రెస్ కుమ్ముక్క‌య్యార‌ని బీఆర్ఎస్. ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ ఆరోపణలతో దేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలో  మ‌రెక్క‌డా లేని విధంగా కుమ్ముక్కు రాజ‌కీయాలు కేవ‌లం తెలంగాణ‌లో మాత్ర‌మే నడుస్తున్నాయా అన్న సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది.  ఇటు సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్ నుంచి మొద‌లు పెడితే  అటు కేటీఆర్,  మరో వైపు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజ‌య్ వ‌ర‌కూ ఎవ‌రికి వారు  ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ పులిహోర క‌లిపేస్తుంటారు.  అయితే ఈ రాజ‌కీయ ఆరోప‌ణ‌లు ప‌క్క‌న  పెడితే కామారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ క‌లిసిపోయాయన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవలి పురపోరులో కామారెడ్డి మునిసిపాలిటీలో కాంగ్రెస్   19 వార్డుల్లో విజయం సాధించింది. అంత కంటే రెండు తక్కువగా  బీజేపీ 16 వార్డుల్లో జయకేతం ఎగురవేసింది. కామారెడ్డిలో బీఆర్ఎస్ పదకొండు వార్డుల్లో విజయం సాధించింది.దీంతో కామారెడ్డి మునిసిపాలిటీలో చైర్మన్ పదవి దక్కించుకోవడానికి అవసరమై మెజారిటీ ఏ పార్టీకీ రాలేదు. దీంతో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీకి చైర్మన్ పదవి దక్కకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుకున్నాయి. దీంతో  కాంగ్రెస్ అభ్య‌ర్ధికి ఉమారాణి చైర్మన్ గానూ, బీఆర్ఎస్ కు చెందిన   కాస‌ర్ల గోదావ‌రి  వైస్ చైర్మ‌న్ గానూ పదవులు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది.   2023 ఎన్నిక‌ల నాటి పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే.. ఇదే  కామారెడ్డి కేంద్రంగా కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్ధి  రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి పోటీ పడగా, ఇరువురూ పరాజయం పాలయ్యారు. బీజేపీకి చెందిన వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. ఒకే ఎన్నికలో ఇద్దరు సీఎంలను ఓడించిన ఘనత సాధించారు.   ఇక ప్రస్తుతానికి వస్తే.. కామారెడ్డిలో ఎప్పుడూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పోటాపోటీ వాతావరణం ఉంటుంది. అటువంటిది.. ఆ రెండు పార్టీలూ చెట్టాపట్టాలేసుకుని మరీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను పంచుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు కామారెడ్డి జనం.   ఇక   కొత్త‌గూడెంలో కూడా సరిగ్గా ఇటువంటి పరిస్థితే కనిపిస్తున్నది. 60 స్థానాలున్న కొత్తగూడెం మునిసిపాలిటీలో తాజా పురపోరులో  వామపక్షాలకు 22 వార్టుల్లోనూ, , కాంగ్రెస్ 22 వార్డుల్లోనూ గెలుపొందాయి. దీంతో మునిసిపల్ చైర్మన్ ఎన్నికలో సీపీఐకి మద్దతు ఇస్తామంటూ బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ కు కొత్తడూగెం మునిసిపాలిటీలో ఎనిమిది వార్డులు దక్కాయి. మేయర్ పదవి కాంగ్రెస్ కు రాకుండా అడ్డుకోవడానికి తాము వామపక్షాలతో కలవడానికి రెడీ అంటోంది బీఆర్ఎస్. పోరాడ్డానికి తాము సీపీఎంతో జ‌త‌క‌ట్ట‌డానికైనా  సిద్ధ‌మేనంటోంది కారు పార్టీ. ఇక్కడ కూడా  2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకుని పోటీ చేయగా,  పొత్తులో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానం సీపీఐకి దక్కింది. ఇక్కడ నుంచి సీపీఐ అభ్యర్థిగా  కూనంనేని సాంబ‌శివ‌రావు గెలుపిందారు.  దానిని గుర్తు చేస్తూ, కొత్తగూడెం మునిసిపాలిటీలో పోటీ కేవలం ఫ్రెండ్లీ కంటెస్టేనంటూ చైర్మన్ అభ్యర్థిగా తాము సీపీఐకి మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.   ఇలా తెలంగాణలో పురపోరులో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు దక్కించుకోవడానికి ఓ చోట అధికారపక్షం కాంగ్రెస్ తో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేతులు కలిపితే.. మరో చోట వామపక్షాలకు కారు కలుపుకుంటోంది.   రాజకీయాలను పక్కన పెట్టి మరీ..  స్థానిక సంస్థ‌లలో అధికారం కోసం అధికార, విపక్షాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూపొందుతోంది. ఇది అల్లు అర్జున్ కి 22వ సినిమా (AA22).  సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించి పెద్దగా అప్డేట్స్ లేవు, ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ అంచనాలు మాత్రం భారీస్థాయిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.   'AA22'లో రానా దగ్గుబాటి(Rana Daggubati) నటిస్తున్నాడట. కథకి కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. హీరో, విలన్, ప్రత్యేక పాత్ర అనే లెక్కలు వేసుకోకుండా.. అన్ని రకాల పాత్రలు చేయడానికి రెడీగా ఉంటాడు రానా. తన 15 ఏళ్ళ సినీ ప్రయాణాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు 'AA22'లో కూడా ఒక పాత్ర చేయడానికి రానా ఓకే చెప్పాడన్న న్యూస్ వైరల్ గా మారింది. ఈ రోల్ తో రానా అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని చెబుతున్నారు.     'AA22'లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అలాగే రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో రష్మికది నెగెటివ్ రోల్ అని టాక్.   ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'పుష్ప-2' తరువాత అల్లు అర్జున్, 'జవాన్' తరువాత అట్లీ చేస్తున్న సినిమా కావడంతో పాటు.. గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కావడంతో పాజిటివ్ టాక్ వస్తే రూ.2000 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.   Also Read: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు!    
  రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు(ఫిబ్రవరి 17) తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ నెలకొంది ఉంది. (Actress Prathyusha)   భువనగిరికి చెందిన ప్రత్యూష చిన్న వయసులోనే స్టార్‌డమ్ చూశారు. 1998లో 'రాయుడు' సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రత్యూష.. తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కేవలం 20 ఏళ్ళ వయసులోనే.. 2002 ఫిబ్రవరి 24న ప్రత్యూష చనిపోయారన్న వార్త సినీ ప్రపంచాన్ని, ప్రేక్షకులను కుదిపేసింది.    ప్రత్యూష, ఆమె స్నేహితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం విషం తాగి ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష మరణించగా.. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ డిశ్చార్చి అయ్యాడు.    ప్రత్యూష మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమెది హత్య అని, ఆమెపై లైంగిక దాడి జరిగిందని, దీని వెనుక ఓ రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యుడు ఉన్నాడని.. ఇలా ఎన్నో ప్రచారాలు జరిగాయి. ప్రత్యూషది హత్యేనని ఆరోపిస్తూ ఆమె తల్లి సరోజినీదేవి న్యాయ పోరాటానికి దిగారు.   ఈ కేసులో దర్యాప్తు జరిపిన సీబీఐ.. ఆత్మహత్య అని తేల్చింది. నిందితుడు సిద్ధార్థపై సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), సెక్షన్ 309 (ఆత్మహత్యకు యత్నించడం) కింద సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సిద్ధార్థకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి.. ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు, రూ.5 వేల జరిమాన విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు.    ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ హైకోర్టును ఆశ్రయించాడు. జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ.. 2011 డిసెంబర్ 28న హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై అటు సిద్ధార్థ, ఇటు సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో వేరు వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.    నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి, హైకోర్టు విధించిన శిక్షను పూర్తిగా రద్దు చేయాలంటూ సిద్ధార్థ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లపై 2025లో వాదనలు పూర్తయ్యాయి. జస్టిస్‌ రాజేష్ బిందల్, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గతేడాది నవంబర్ లో తీర్పును రిజర్వ్‌ చేసింది.    ప్రత్యూష మరణించిన 24 ఏళ్ళ తరువాత తుది తీర్పు రాబోతుంది. ప్రత్యూషది హత్యా? ఆత్మహత్యా? సుప్రీంకోర్టు తీర్పు ఏంటి? అనేది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.  
Actress Trisha Krishnan has taken a firm stand against recent "distasteful and inappropriate" remarks made about her by a high-ranking political figure. Through her legal advisor, Nithyaesh Natraj, she issued a formal statement on February 15, 2026, to address the ongoing controversy and set the record straight regarding her personal and professional life. Many news reports have stated that she is planning to join TVK, as she is very close to Thalapathy Vijay. Some even started comparing her life with Jayalalitha and stating that she will shadow Vijay just like Jayalalitha shadowed MGR. But she filed a case against BJP leader and issued a statement clarifying that she would stay apolitical and her personal life should not be a concern for politics.    The statement clarifies that Trisha has no affiliation with any political party and intends to maintain her long-standing neutral stance in politics. It emphasizes that she wishes to be recognized solely for her craft as an actress rather than being linked to any political discourse. The communique further notes that personal lives should not be made a subject of public commentary, especially by those holding responsible positions in the state's political space. Concluding the statement, the actress requested that her name not be drawn into matters that do not concern her. Following the release of this legal note, Trisha also took to social media to state that disrespect should always be called out. The move has received significant support from her fans and colleagues in the film industry, reinforcing her demand for professional boundaries and mutual respect in public discourse. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Megastar Chiranjeevi has addressed recent concerns regarding his health after a photo of him wearing an arm sleeve went viral on social media. The image led to widespread speculation among fans and the film industry about his well-being and the progress of his upcoming projects.  To clear the air, the veteran actor confirmed that he underwent a minor shoulder keyhole surgery and is currently on the path to a smooth recovery. Sharing a picture with his surgeon, Chiranjeevi expressed his gratitude to Dr. Nithin for his expertise during the procedure.  He informed his well-wishers that he is already returning to his daily routine and thanked them for their constant love and blessings. This clarification comes at a time when his recent film,  With this official update, the Megastar has put an end to rumors surrounding his health and his next collaboration with director Bobby Kolli, produced by KVN Productions. Fans can now look forward to his return to full-scale promotional activities and filming soon.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Kamal Haasan’s RaajKamal Films International once again for a new film titled Seyon. The official announcement was made today, confirming that Turmeric Media is also part of the production. This film is expected to showcase Sivakarthikeyan in a dynamic role within a rural commercial setting, blending rooted emotions with mass appeal. Director Sivakumar Murugesan, who is known for his upcoming film "Thaai Kizhavi," will be helming this project. Another exciting addition to the team is music director Santhosh Narayanan, whose collaboration with this team has already raised expectations for the soundtrack.  With the successful track record of "Amaran" behind them, the producers aim to deliver another blockbuster that resonates with audiences across generations. While the primary technical crew has been announced, the team will share more updates about the filming schedule and additional cast members soon. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సామ్రాట్ ఇంటర్వ్యూ  -సడన్ గా కెరీర్ ఆగడంపై ఏం చెప్పాడు -చివరిగా ఎక్కుడు కనపడ్డాడు -మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తాడా!   తెలుగు సినిమాని మిస్ చెయ్యని అసలు సిసలైన సినీ ప్రేమికులకి ప్రముఖ నటుడు  సామ్రాట్(Samrat)గురించి తెలిసే ఉంటుంది. మెయిన్ హీరోగా సింగిల్ హ్యాండ్ తో సినిమాని నడిపించే పొజిషన్ కి దూరంగానే ఉన్నా,చాలా చిత్రాల్లో కథని టర్నింగ్ తిప్పే ప్రాధాన్యత గల క్యారెక్టర్స్ లో కనిపించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ముఖ్యంగా పెళ్లి కొడుకు క్యారక్టర్ కి పేటెంట్ హక్కుని పొందినట్టుగా ఎక్కువ సార్లు సదరు క్యారక్టర్ లో కనిపించడం జరిగింది. బిగ్ బాస్ తెలుగు 2 కంటెస్ట్ గా కూడా పాల్గొన్న సామ్రాట్ కొంతకాలంగా ఎలాంటి చిత్రాల్లో కనిపించడం లేదు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అందుకు గల కారణాలని వివరించాడు.   సామ్రాట్ మాట్లాడుతు హీరోయిన్ తో పాటు పెళ్లి పీటలపై కూర్చోవడం, ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అవ్వడం.ఇలాంటి క్యారెక్టర్స్ వస్తుండటంతో బోర్ కొట్టి రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత హర్షిత ని పెళ్లి చేసుకున్న కొంత కాలానికి  నాపై గృహ హింస కేసు నమోదు నమోదయ్యింది. నా నుంచి విడిపోయే విషయంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చు. కానీ హర్షిత తప్పుడు దారి ఎంచుకొని నేను నటుడు అనే ఉద్దేశ్యంతో నా పరువు పోవాలని ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసింది. ఆ సమయంలో నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుంగిపోయాను. మా ఫ్యామిలీ కూడా చిన్నాభిన్నమైంది.ఆ తర్వాత మా ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో రెండు రోజులు జైలుకి వెళ్లి వచ్చాను. నాపై లేని పోనీ ఆరోపణలు రావడం నా కెరీర్ ని దెబ్బతీసిందని సామ్రాట్ చెప్పుకొచ్చాడు. Also read:  ఇంటి నుంచి బయటకి రమ్మన్న వ్యాఖ్యలపై స్పందించిన త్రిష.. నెక్స్ట్ జరిగేది ఇదేనా! 2024 లో వచ్చిన 'ధీర' అనే మూవీ సామ్రాట్ ప్రీవియస్ సినిమా లిస్ట్ లో ఉంది. సామ్రాట్ ఆ తర్వాత శ్రీ లిఖిత ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రెజెంట్ అయితే సామ్రాట్ ఖాతాలో ఎలాంటి చిత్రాలు లేవు. .వినాయకుడు, పంచాక్షరీ, ప్రేమ కావాలి,దేనికైనా రెడీ వంటి చిత్రాలు మంచి పేరు తీసుకురాగా పూర్తి పేరు సామ్రాట్ రెడ్డి.  
   -ఇన్ స్టాగ్రామ్ వేదికగా త్రిష పోస్ట్  -ముందు ముందు ఏం జరగబోతుంది  -ఫ్యాన్స్ ఏమంటున్నారు హీరో, హీరోయిన్ కే కాదు. సదరు హీరో, హీరోయిన్ కాంబో కి కూడా డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ఒక కాంబోనే  ఇళయ దళపతి విజయ్(Vijay),స్టార్ హీరోయిన్ త్రిష(Trisha).ఈ ఇద్దరు స్క్రీన్ పై కనపడితే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కలెక్షన్స్ వర్షం కురవడమే కాదు తమిళ సినీ మార్కెట్ కి సరికొత్త సవాళ్లు విసురుతాయి. అంతటి చరిష్మా ఆ ఇద్దరి కాంబో సొంతం.   రీసెంట్ గా తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్(Nainar Nagendran)రాజకీయ విమర్శల్లో భాగంగా విజయ్ ని ఉద్దేశించి మాట్లాడుతు విజయ్ ని త్రిష ఇంట్లో నుంచి బయటకు రమ్మనండి. ఆమెతో ఉన్న అనుబంధం నుంచి తప్పుకుంటేనే తన చుట్టూ ఏం జరుగుతుందో విజయ్‌కి తెలుస్తుంది. వాస్తవ ప్రపంచాన్ని చూడగలడు. విజయ్‌ కి ఉన్న రాజకీయ అనుభవం శూన్యం. ఒక రాష్ట్రాన్ని నడిపించడానికి ముందు తన కుటుంబంలోని సంబంధాలను సరిదిద్దుకోవాలనే సంచలన కామెంట్స్ చేసాడు. ఈ విషయంపై  త్రిష స్పందిస్తూ 'ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడతాడని ఊహించలేదు. నా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో కలపద్దు. రాజకీయాలకి నేను దూరం. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తు  ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది.   also read:  మరో నాలుగు రోజుల్లో రిలీజ్..  సినిమా టైటిల్ మారింది ఈ నేపథ్యంలో ముందు ముందు సదరు విషయం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. విజయ్ ఇప్పటి వరకు ఈ విషయంపై మాట్లాడలేదు. అభిమానులు మాత్రం నైనార్ నాగేంద్ర పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.త్రిష, విజయ్ లు కలిసి  గిల్లి,ఆతి, తిరుప్పాచ్చి ,కురువి ,లియో వంటి చిత్రాల్లో చేసారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం' ద్వారా విజయ్ బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.      
    -సెన్సార్ ఎందుకు అడ్డు వచ్చింది -ఏమని పేరు మార్చారు -అభిమానులు కోరుకునేది ఏంటి    చిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు జరిగే విచిత్రాలని చూస్తే కొంచం వింతగానే అనిపిస్తుంది. కాకపోతే సదరు వింత సినిమాకి ఎలాంటి నష్టం కలిగించకుండా ఉంటే చాలు. నష్టం జరగకుండా చూసే బాధ్యత ప్రధానంగా  మూవీ లవర్స్, ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసుకునే రిసీవ్ పైనే సినిమా యొక్క ఆలోచలన్నీ ఉంటాయి. అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం.   హిట్టు,ప్లాప్ తో సంబంధం లేకుండా సుహాస్(Suhas)వరుస చిత్రాలతో సెల్యులాయిడ్ పైకి వస్తన్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే ఈ నెల 20 న 'హే భగవాన్'(Hey Bhagwan)అనే మూవీతో అడుగుపెట్టబోతున్నాడు. లిటిల్ హార్ట్ ఫేమ్ శివాని నాగారం హీరోయిన్ కావడం ప్రత్యేకత. ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు బాగుండటంతో పాటు హే భగవాన్ టైటిల్ తో అయితే  మూవీపై క్యూరియాసిటీ ఏర్పడింది.రిలీజ్ కి ముందు అన్ని పనులకి గుమ్మడి కాయ కొట్టాలనే లక్ష్యంతో రీసెంట్ గా' హే భగవాన్' సెన్సార్ కి వెళ్ళింది. టైటిల్ వల్ల కొంత  ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావించిన సెన్సార్ వారు టైటిల్ మార్చాలని సూచించింది. దీంతో చిత్ర బృందం ఎలాంటి భేషజాలకి  పోకుండా సెన్సార్ చెప్పినట్టుగా తమ సినిమాటైటిల్ ని 'హే బలవంత్' గా మార్చారు.   Also read:   77 లో ఏముంది రవితేజ.. ఫస్ట్ టైం ఎందుకు ఇంత పాజిటివ్    మేకర్స్ అయితే ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు. ఈ క్రమంలోనే చిత్ర కథతో పాటు సుహాస్ తండ్రిగా చేస్తున్న నరేశ్(Naresh)చేసే బిజినెస్ ని కనిపెట్టిన వారికి ఐదుగురు చొప్పున ఒక్కొక్కరికి పాతిక వేల రూపాయలు ప్రకటించారు. తన తండ్రి చేసే బిజినెస్ ఏంటో తెలుసుకొని, సదరు బిజినెస్ ని డెవలప్ చేయాలనుకునేది సుహాస్ లక్ష్యం. గోపి అచ్చర దర్సకత్వంలో వంశీ నిర్మించాడు. టైటిల్ మార్పు అయితే 'హే బలవంత్' పై పడకుండా ఉండాలని అభిమానులు, మూవీ లవర్స్ కోరుకుంటున్నారు.       
       -ఫ్యాన్స్ ఏమంటున్నారు -ఆ విషయంలో బహుశా ఇదే ఫస్ట్ అనుకుంటా  -ఇక నో డౌట్స్  -కావేరి పిక్ సూపర్  మహిమలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, సినీ మహిమ మాత్రం అప్పుడప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. రవితేజ(Ravi Teja)అప్ కమింగ్ ప్రాజెక్ట్ 'ఇరుముడి'(Irumudi)నే అందుకు ఉదాహరణ. ఈ చిత్రం ప్రకటించినప్పట్నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ 'వైఫె' లా ఇరుముడి ని అంటిపెట్టుకుని ఉండిపోయాయి. ఈ మధ్య కాలంలో ఇంతలా పాజిటివ్ ని ఏర్పరుచుకున్న సినిమా రాలేదనే చెప్పాలి. అందుకే ఇరుముడి మూవీలో ఏదో మహిమ దాగి ఉందనే అభిప్రాయాన్ని అందరు వ్యక్తం చేస్తుంటారు. ఆ మాట అక్షరాలా నిజమని చెప్పేలా మేకర్స్ నిన్న మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన రవితేజ,ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar)పోస్టర్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి ఆ వివరాలు చూద్దాం.     ప్రియా భవాని శంకర్.. సౌత్ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో దూసుపోతుంది. ఇప్పుడు   ఇరుముడి లో కావేరి అనే రోల్ లో కనిపించనుంది.  హోమ్లీ లుక్ లో ఉన్న ప్రియా  చెంపలపై రవితేజ ముద్దు పెడుతుంటే ప్రియా చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తుంది. మేకర్స్ రిలీజ్ చేసిన ఈ ఒక్క పిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుండటంతో పాటు పక్కా హిట్ అనే అభిప్రాయాన్ని అభిమానులు, నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. రవితేజ చేస్తున్న 77 వ మూవీలో ఏదో మహిమ దాగి ఉందనే కామెంట్స్ కూడా చేస్తుండటం గమనార్హం. Also read:  Taapsee vs modi: మోదీ పై సెటైరికల్ కామెంట్స్ చేసిన తాప్సీ.. వాట్ నెక్స్ట్    నిన్ను కోరి,మజిలీ ఫేమ్ శివ నిర్వాణ(Siva Niravana)దర్సకత్వంలో తండ్రి,కూతురు మధ్య అనుబంధాలతో ముడిపడిన యాక్షన్ ఎంటర్ గా ఇరుముడి ముస్తాబవుతోంది.మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)భారీ వ్యయంతో నిర్మిస్తుండగా పలువురు క్రేజీ నటులు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటికే  పాపని ఎత్హుకుని నెత్తిన ఇరుముడి ధరించి ఉన్న రవితేజ పిక్ బయటకి వచ్చిన విషయం తెలిసిందే.    
  -మోదీ పై తాప్సీ ఆ విధంగా ఎందుకు మాట్లాడింది -సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మాటలు  -ఫ్యాన్స్ ఏమంటున్నారు   ఒక వైపు దేశప్రధానమంత్రి మోదీ(Modi)..మరో వైపు ప్రముఖ హీరోయిన్ తాప్సీ(Taapsee).. ఇదేంటి కొత్తగా ఈ ఇద్దరి పేర్లు చెప్తున్నారు. మోదీ పాలన, ఆశయాలు నచ్చి తాప్సీ రాజకీయ తీర్ధం ఏమైనా పుచ్చుకోనుందా అని అనుకుంటున్నారా! అలాంటిదేమి లేదు.కాకపోతే రీసెంట్ గా  మోదీ గురించి  తాప్సీ కొన్ని వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యాఖ్యలతో పాటు అందుకు సంబంధించిన వీడియో  దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. మరి తాప్సీ ఏమని మాట్లాడిందో చూద్దాం.  రీసెంట్ గా తాప్సీ ఒక ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. యాంకర్ డిస్ ప్లే లో మోదీ, రాహుల్ గాంధీ పిక్స్ ని ఉంచి, ఆ ఇద్దరిలో మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరని తాప్సీ ని అడగడం జరిగింది. దాంతో  తాప్సీ చిరు నవ్వుని ప్రదర్శిస్తు మోదీ ఫోటో వైపు చూపిస్తూ చేతులు జోడించి నమస్కారం చేశారు. అనంతరం పిక్ దగ్గరకి వెళ్లి నాకు ఇంకా ఈ దేశంలోనే ఉండాలని ఉందంటూ కొంచం చమత్కార ఉద్దేశ్యంతోనే చెప్పినట్టుగా వీడియోలో కనిపిస్తుంది. దీంతో మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ దేశంలో ఉండనివ్వరన్న ఉద్దేశంతోనే తాప్సీ ఆ విధంగా మాట్లాడిందనే కామెంట్స్ తో సోషల్ మీడియా కళకళలాడుతూ ఉంది. అభిమానులు మాత్రం ఆమె ప్రవర్తనలో ఎలాంటి వ్యంగం లేదని, కొంత మంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారనే అభిపాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.   Also read:  ప్రభాస్ కి గాయాలు! ఎందుకు అయ్యాయో తెలిస్తే షాక్ అవుతారు   తెలుగు సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడితే కెరీర్ జెట్ స్పీడ్ వేగంతో ముందుకు వెళ్తుందని నిరూపించిన వాళ్లలో తాప్సీ కూడా ఒకరు.2010 లో ఝుమ్మంది నాదంతో తెరంగ్రేటం చేసి ఆ తర్వాత గ్యాప్ అనేది లేకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో అస్సి.,వొ లడ్కి హై కహాన్, గాంధారి వంటి చిత్రాలు ఉన్నాయి.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు పడినా, మా పిల్లలు కష్టపడకూడదు అనుకునే తల్లిదండ్రులే ఎక్కువ. అయితే తల్లిదండ్రులు చాలా వరకు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ, తమకు తెలియకుండానే తమ పిల్లల ఆనందాన్ని దెబ్బతీసే తప్పులు చేస్తారు. తల్లిదండ్రులలో అలాంటి అలవాట్లు ఉంటాయి.  వెంటనే ఆ అలవాట్లు వదిలేస్తే తమ పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు.  పిల్లల జీవితం ఎంతో బాగుంటుంది.  తల్లిదండ్రులు వీలైనంత తొందరగా  వదులుకోవాల్సిన ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. పోల్చడం.. పిల్లలను ఇతరులతో పోల్చడం అనేది ముఖ్యంగా భారతీయ ఇళ్లలో సర్వసాధారణం. పిల్లలను ఇతరులతో పోల్చడం వల్ల వారు మరింత ఉత్సాహం తెచ్చుకుని చదువుతారు, మంచి పనులు చేస్తారు అనుకుంటే పొరపాటు.  దానికి బదులుగా పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పిల్లలను ఇతరులతో పోల్చే అలవాటు మానుకోవాలి. ఇష్టాలు రుద్దడం.. తరచుగా తల్లిదండ్రులు తాము సాధించలేక పోయిన   కలలను తమ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని కోరుకుంటారు.  మాకు అవకాశం,  ఆర్థిక స్థితి సహకరించలేదు, అందుకే మేము సాధించలేకపోయాము,  కాబట్టి మీరు వీటిని సాధిస్తే సంతోషం అని చెబుతుంటారు.  దీనివల్ల పిల్లలు తమకు నచ్చిన వృత్తిని ఎంచుకోలేకపోతారు,నచ్చిన పని చేయలేకపోతారు. ఇది జీవితాంతం అసంతృప్తికి దారితీస్తుంది.  పిల్లలకు మార్గనిర్దేశం చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం.  అలాగే  వారికి నచ్చిన వృత్తిని ఎంచుకునే అవకాశం ఇవ్వడం వారి తల్లిదండ్రుల బాధ్యత. జోక్యం..  పిల్లల జీవితంలోని ప్రతి అంశంలోనూ తల్లిదండ్రులు  జోక్యం చేసుకోవడం సరైనది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవడానికి తరచుగా ఆంక్షలు విధిస్తారు, కానీ నిరంతరం ఇలా వ్యవహరించడం వల్ల  పిల్లలు బలహీనపడతారు.తమకు స్వేచ్ఛ లేదని, తమ ఇష్టాలతో తల్లిదండ్రులకు పని లేదని అనుకుంటారు.  తల్లిదండ్రులకు ఎదురు తిరిగే వైపుగా ఈ పరిస్థితి దారితీస్తుంది.  పర్పెక్ట్ గా ఉండాలని అనుకోవడం.. పిల్లలు చదువులో రాణించాలి, ఆటలు,  ఇతర యాక్టివిటీస్.. ఇలా  ప్రతిదానిలోనూ పర్పెక్ట్ గా  ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఇది చాలా తప్పు.  అలా చేయడం వల్ల బిడ్డ ఒత్తిడికి గురవుతాడు. ఎవరూ పర్పెక్ట్ గా ఉండరు అనే విషయం గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు అన్ని విషయాల్లో పర్పెక్ట్ గా లేనప్పుడు పిల్లలు ఉండాలని అనుకోవడం ఎంత వరకు సమంజసం.  మనుషులు తప్పులు చేయడం,  తప్పులు చేసిన తర్వాత అనుభవాల నుండి నేర్చుకోవడం చేస్తారు.  కాబట్టి పిల్లలు అన్నింటిలో పర్పెక్ట్ గా ఉండాలని కోరుకోవడం తప్పు.                                      *రూపశ్రీ.
డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు,  ధనవంతులకు డబ్బు గురించి ఎలాంటి చింత ఉండదు. కానీ మధ్యతరగతి కుటుంబాలు మాత్రం డబ్బు విషయంలో తెలిసీ తెలియక కొన్ని తప్పులు చేస్తారు.  ఈ కారణంగా చాలామంది డబ్బు నష్టపోతున్నారు.  ఈ విషయాన్ని స్వయానా ప్రపంచంలోనే ప్రముఖ మిలియనీర్ అయిన వారెన్ బఫెట్ పేర్కొనడం గమనార్హం. మధ్యతరగతి ప్రజలు తాము ఎంతో కష్టపడి పోగు చేసిన డబ్బును చేతులాగా నష్టపోతారని ఆయన అంటున్నారు. ఇంతకీ మధ్యతరగతి ప్రజలు డబ్బు ఎలా నష్టపోతున్నారు? తెలుసుకుంటే.. క్రెడిట్ కార్డు ఇంట్రెస్ట్.. ఈ రోజుల్లో మధ్యతరగతి ప్రజలు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఇది వారు చేసే  అతిపెద్ద తప్పట. నిజానికి, క్రెడిట్ కార్డులపై అధిక వడ్డీ రేట్ల భారం మధ్యతరగతిపై పడింది. మధ్యతరగతి వారు  క్రెడిట్ కార్డు వడ్డీ  సైకిల్  నుండి తప్పించుకోలేకపోతున్నారు.  దీని వలన ఎలాంటి  పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. కొత్త కారు కొనడం.. కారును హోదాకు చిహ్నంగా చూస్తారు. కానీ కారును హోదాకు చిహ్నంగా భావించి కొనుగోలు చేస్తే తప్పు చేసినట్టే.  కారు అనేది  ప్రయాణ సాధనంగా ఉండాలి. కొత్త కారు కొనుగోలు కారణంగా మధ్యతరగతి వారు ఎక్కువగా  అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. లోన్లు  తీసుకోవడం వల్ల కారు మార్కెట్ ధర కంటే ఖరీదైనదిగా మారుతుంది. అయితే కాలక్రమేణా కారు విలువ కూడా తగ్గుతుంది. దీని ఫలితంగా  మధ్యతరగతి వారు  డబ్బును పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. లాటరీ లేదా జూదం.. మధ్యతరగతి వారు తరచుగా జూదం ఆడి లేదా లాటరీ టిక్కెట్లు కొనడం ద్వారా ధనవంతులు కావాలని ప్రయత్నిస్తారు.  దీని కారణంగా వారు తమ డబ్బును కోల్పోయే పొరపాటు చేస్తారు.  మధ్య తరగతి కుటుంబాలలో చాలామంది  అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా డబ్బును వృధా చేస్తారు. అదే  డబ్బును వ్యాపారంలో పెట్టుబడి పెట్టగలిగినప్పుడు,కష్టాన్ని నమ్ముకుని ప్రయత్నాలు చేసినప్పుడు  అది విలువను పెంచుతుంది. అవసరానికి మించి.. మధ్యతరగతి కుటుంబాలలో కొందరు తమ ఆర్థిక స్థాయి,  తమ అవసరానికి మించి  ఇళ్లను  కట్టుకుంటారు.   ఇళ్లు గ్రాండ్ గా ఉండాలని అనుకుంటారు,  దీనికోసం అప్పులు తీసుకుంటారు.  ఇల్లు కేవలం జీవన సాధనం, హోదా,  చిహ్నం కాదని గుర్తించరు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మధ్యతరగతి కుటుంబాలలో చాలా శాతం.. తమ జీవితాంతం ఇల్లు కట్టుకోవడానికి చేసే ప్రయత్నాలలోనే కాలాన్ని గడుపుతాయి. ఈ కారణంగా ఆస్తులు కూడబెట్టుకోవడానికి మధ్య తరగతి వారి వద్ద ఏమీ మిగలదు.                           *రూపశ్రీ.
వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్  హడావిడి మొదలవుతుంది.  వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ,  ఒకో రోజు ఒకో విధంగా ప్రేమను వ్యక్తం చేస్తారు.  ఇందులో ప్రేమ అయినా, స్నేహం అయినా,  అభిమానం అయినా ఏదైనా సరే.. ఆ బంధం పట్ల ఉన్న ప్రేమను,  అభిమానాన్ని వ్యక్తం చేయడానికి వాలెంటైన్స్ వీక్ బాగా సహాయపడుతుంది. అయితే రోజ్ డే తో మొదలయ్యే ఈ హడావిడి వాలెంటైన్స్ డే తో ముగుస్తుంది.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. రోజ్ డే.. వాలెంటైన్స్ వీక్ లో మొదటి రోజును రోజ్ డే గా జరుపుకుంటారు. రోజ్ డే అంటే కేవలం పువ్వులు బహుమతిగా ఇవ్వడం మాత్రమే కాదు. ఇది ఎమోషన్స్ ను అంగీకరించడం అనే విషయాన్ని కూడా చాటి చెప్తుంది. ఎర్ర గులాబీలు లోతైన ప్రేమ,  అభిరుచిని సూచిస్తాయి. పసుపు గులాబీలు స్నేహం,  ఆనందాన్ని సూచిస్తాయి. గులాబీ రంగు గులాబీలు ఎదుటి వారిని మెచ్చుకోవడాన్ని వ్యక్తపరుస్తాయి. తెల్ల గులాబీలు శాంతి,  కొత్త ప్రారంభాలను సూచిస్తాయి. ప్రపోజల్ డే.. వాలెంటైన్స్ వీక్ లో రెండవ రోజును ప్రపోజ్ డే గా జరుపుకుంటారు.  ఈ రోజు తాము ప్రేమించిన వారికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. చాక్లెట్ డే.. చాక్లెట్ అంటే తీపిదనం, ఆనందం.  ఈ రోజున ప్రేమిస్తున్న వారికి చాక్లెట్ ను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ప్రేమించిన వారితో గడిపే క్షణాలు మరింత సంతోషంగా,  మరిచిపోలేనిది చేయాలని చెప్పడమే చాక్లెట్ ఇవ్వడంలో అంతరార్థం  అని చెబుతున్నారు. టెడ్డీ డే.. టెడ్డీ డే వాలెంటైన్ వీక్ లో  నాల్గవ రోజు.  ఫిబ్రవరి 10 న వస్తుంది. ఈ రోజున జంటలు  అంతులేని ప్రేమ,  స్నేహానికి గుర్తుగా  టెడ్డీ బేర్‌లను ఇచ్చి పుచ్చుకుంటారు. ప్రామిస్ డే.. ప్రామిస్ డే కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.  భాగస్వామిని ఎల్లప్పుడూ బేషరతుగా ప్రేమిస్తానని వాగ్దానం చేయడమే ప్రామిస్ డే లో ఉన్న ముఖ్య భాగం. బలమైన సంబంధానికి పునాది వాగ్దానంపై  ఆదారపడి ఉంటుంది.  అందుకే ప్రామిస్ చేస్తారు. హగ్ డే.. కౌగిలింత ఉద్రిక్తతలను తగ్గించి  ఉత్సాహపరుస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రేమను వ్యక్త పరిచేందుకు వాలెంటైన్ వీక్ లో ఆరవ రోజుగా హగ్ డే ను జరుపుకుంటారు.  కౌలిగి ఒక భరోసా ఇస్తుందని చెబుతారు. కిస్ డే.. వాలెంటైన్ వీక్ లో ఏడవ రోజును కిస్ డే గా జరుపుకుంటారు.  ప్రేమించిన భాగస్వామికి ముద్దు పెట్టడం ద్వారా తమ ప్రేమను, ఇష్టాన్ని వ్యక్తం చేస్తారు. ప్రేమికుల దినోత్సవం.. చివరగా ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు.  ఎల్లలు లేని ప్రేమను చాటిచెబుతూ జీవితాంతం ఒకరికొకరు ఉంటామని తెలియజేసుకునే రోజు ఇది.  అయితే ప్రేమకు గౌరవం దక్కినప్పుడే అది విలువైనదిగా ఉంటుంది.  ప్రేమను ఎప్పుడూ పరిహారం చేయకూడదు. అలాగే ప్రేమను తమ విచ్చలవిడితనానికి వాడుకోకూడదు.                                 *రూపశ్రీ
ప్రతిరోజూ ఆహారంలో పండ్లు తీసుకోవడం చాలా మంచిదని దీనివల్ల ఆరోగ్యానికి ఢోకా ఉండదని అంటారు. అయితే పండ్లలో కొన్ని ఖరీదైనవి ఉంటాయి, మరికొన్ని తక్కువ ధరకే లభ్యమయ్యేవి ఉంటాయి. ధర విషయం పక్కన పెడితే ప్రతి పండుకూ దాని ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది కివి పేరు చెబితే అధిక ధర అంటూ బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. కానీ ధర అయినా సరే కివి పండును ఆహారంలో భాగం చేసుకుంటూ మాత్రం హాస్పిలట్స్ లో పోసే వందలు, వేల ఖర్చు ఈజీగా తగ్గినట్టేనట.  కివి పండును ఆహారంలో భాగంగా తీసుకుంటే  రోగనిరోధక వ్యవస్థ బలపడటంతో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  తక్కువ కేలరీలతో, ఫైబర్ పుష్కలంగా ఉండే కివి పండులో డైజెస్టివ్ ఎంజైమ్ లు అయిన వియమిన్-సి ఉంటుంది. ఇది బరువు తగ్గడం నుండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కివి పండు రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోగనిరోధక శక్తి.. కివి పండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. రోజూవారీ వ్యక్తికి కావలసిన విటమిన్-సి లో 80శాతం వరకు  కివి పండు నుండే పొందవచ్చు.  విటమిన్-సి శరీరంలో గొప్ప యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.  ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షిస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పరిచి అంటు వ్యాధుల  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొటాషియం మెండు.. గుండె, మూత్రపిండాలు, కండరాలు, నరాలు  సక్రమంగా పనిచేయాలంటే పొటాషియం చాలా అవసరం. ఒక కివి పండులో సుమారు 215మిగ్రా ల పొటాషియం ఉంటుంది.  కివిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసింత పొటాషియం లభిస్తుంది.  ఇది  అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.  అంతే కాదు మూత్రపిండాల్లో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి నుండి కాపాడుతుంది. రక్తం గడ్డకట్టే పనికి చెక్..  సాధారణంగా దిగువ సిరల్లో రక్తం గడ్డ కట్టే సమస్య ఏర్పడుతుంది.  ఇది మెదడులో రక్తప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది.  గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలకు కూడా దారితీస్తుంది.  కివి రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.  కివి పండ్లలో ఆహారంలో తీసుకుంటూ ఉంటే రక్తంలో కొవ్వు కరిగిపోయి  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రోక్ సమస్యను కూడా తగ్గిస్తుంది. జీర్ణఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. కివిలో కరిగే ఫైబర్స్, కరగని పైబర్స్ రెండూ ఉంటాయి. ఇందులో మూడు వంతులు కరిగే ఫైబర్, రెండు వంతుల కరగని పైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు గుండె, జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కివిలో ఉండే ఫైబర్ మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.                                                           *నిశ్శబ్ద.
భారతీయులు ఆహార ప్రియులు.  భారతీయుల భోజనంలో చాలా రకాలు పదార్థాలు ఉంటాయి.  ముఖ్యంగా చాలామంది తమ భోజనంలో కొంచెం అన్నం  చపాతీ,  రెండు లేదా మూడు రకాల కూరలు.. ఇలా ఉండేలా చూసుకుంటారు. అయితే ఒకే భోజనంలో చపాతీ,  అన్నం రెండూ తినడం మంచిదేనా అని కొందరి అనుమానం.  నిజానికి నేటికాలంలో హోటళ్లలో కూడా  ఇలాంటి మెనూనే లంచ్ లో ఇస్తంటారు.  అయితే రెండూ తినడం ఎంత వరకు మంచిది? తెలుసుకుంటే.. బోజనంలో చపాతీ, అన్నం రెండూ కలిపి తినడం అనేది పూర్తీగా వ్యక్తి శారీరక స్థితి మీద ఆధారపడి ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు. కానీ స్పష్టంగా చెప్పాలంటే మాత్రం చపాతీ, అన్నం రెండూ భోజనంలో తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచి ఛాయిస్ కాదని అంటున్నారు. ఒక్క చపాతీ,  ఒక కప్పు అన్నం.. ఇది చాలా మంది ఎంచుకునే అలవాటు. దీన్ని చాలా ఇష్టంగా ఎంచుకుంటారు. పైగా దీన్ని చాలా బాలెన్స్డ్ ఫుడ్ అని కూడా పిలుస్తారు.  కానీ చపాతీ, అన్నం.. రెండూ భోజనంలో తీసుకోవడం అయితే అస్సలు మంచిది కాదట. చపాతీలోనూ, అన్నంలోనూ.. రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.  రెండూ భోజనంలో తినడం వల్ల కార్బోహైడ్రేట్లు అధికంగా శరీరానికి అందుతాయి. తద్వారా కేలరీలు కూడా ఎక్కువ తీసుకున్నట్టు అవుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు,  బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మరీ ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు అన్నం అవాయిడ్ చేసే చర్యలో భాగంగా కొంచెం అన్నం,  చపాతీ అని తమ లంచ్ ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇది  రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది.  అందుకే ఈ రెండింటి కాంబినేషన్ అస్సలు తినకూడదు. ప్రతి ఆహార పదార్థంలో ఉండే కార్బోహైడ్రేట్‌లకు  విభిన్నమైన శైలి ఉంటుంది.  గోధుమలలో ఉండే కార్బోహైడ్రేట్స్ వేరు,  అన్నంలో ఉండే కార్బోహేడ్రేట్స్ వేరు.. ఈ రెండింటికి విడివిడిగా తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ కలిపి తీసుకున్నప్పుడు జీర్ణం కావడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.  అందుకే ఈ కాంబినేషన్ తినడం మంచిది కాదు.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. అయితే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే  ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం ప్రేగులలోనే జీర్ణం అవుతుంది. కానీ నేటికాలంలో చాలామంది పేగు ఆరోగ్యం దెబ్బతినడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.  ముఖ్యంగా నేటికాలంలో ఫాస్ట్ ఫుడ్,  శీతల పానీయాలు తాగడం వల్ల పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరంలో కొన్ని లక్షణాలను బట్టి   ప్రేగు ఆరోగ్యం బాగుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.  ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే ప్రేగు ఆరోగ్యం ఎంతో ముఖ్యం.  ఎందుకంటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పేగులలోనే తయారవుతుంది. పేగు ఆరోగ్యం దెబ్బతింటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా తయారవదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రేగు ఆరోగ్యం దెబ్బతింటే జీర్ణక్రియ నుండి రోగ నిరోధక శక్తి దెబ్బతినడం వరకు చాలా రకాల సమస్యలు వస్తాయి. తరచుగా ఉబ్బరం, కడుపులో గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు వస్తుంటే ప్రేగు ఆరోగ్యం దెబ్బతినిందని,  ప్రేగు సమస్యలు ఉన్నాయని అర్థం. గట్ మైక్రోబయోమ్ అసమతుల్యత ఏర్పడినప్పుడు ఆహారం సరిగా జీర్ణం కాదు.  దీని వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడటం, కడుపు ఉబ్బరంగా మారడం, పొట్ట బరువుగా ఉండటం జరుగుతుంది. తరచుగా మలబద్దకం లేదా విరేచనాలు వంటి సమస్యలు వస్తున్నా కూడా ప్రేగు ఆరోగ్యం దెబ్బతిన్నదని అర్థం. ప్రేగు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల పోషకాలు సరిగా గ్రహించబడవు. ఇది తరచుగా అలసటకు దారితీస్తుంది.  ఎంత మంచి ఆహారం తీసుకున్నా శరీరం శక్తివంతంగా ఉండదు. శరీరంలో దాదాపు 70శాతం రోగనిరోధక వ్యవస్థ పేగు ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది.  కాబట్టి ప్రేగు సమస్యలు వస్తే రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా ఉండటం,  చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను కూడా శరీరం భరించలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. గట్ మైక్రోబయోమ్ అసమతుల్యత కావడం వల్ల జీవక్రియ కూడా ప్రభావితం అవుతుంది.  ఇది బరువు పెరగడానికి అయినా కారణం కావచ్చు, లేదంటే బరువు తగ్గడానికి అయినా కారణం కావచ్చు.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...