LATEST NEWS
వ్యవస్థలోని లోపాలను   వాస్తవ వేదిక ద్వారా ఎండగడుతున్న  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో  బర్నింగ్ టాపిక్ అయిన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీలు అన్న అంశంపై చర్చించారు. వాస్తవ వేదిక 9వ ఎడిషన్ లో వైద్యం ప్రైవేటు పరం అవుతుందా? ప్రభుత్వ ఆస్పత్రులలో నెలకు 15 లక్షల జీతం ఇస్తామన్నా ఎందుకు చేరడం లేదు? అన్న విషయాలను ప్రస్తావించారు.  ఇది కేవలం ఆస్పత్రులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు.. మొత్తంగా రాష్ట్రంలో ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశంగా విశ్లేషించారు.  వీరిరువురి పూర్తి విశ్లేషణకు తెలుగువన్ లో ఈ రోజు ప్రసారం అయిన  ‘వాస్తవ వేదిక’లో వీక్షించండి
తమిళ స్టార్ హీరో విజయ్‌కు చెందిన తమిళ  వెట్రి కళగం పార్టీ.. టీవీకేకి కేంద్ర ఎన్నికల సంఘం   గుర్తును కేటాయించింది. టీవీకే పార్టీకి విజిల్ గుర్తును కేటాయిస్తూ ఈసీ గురువారం (జనవరి 22) నిర్ణయం తీసుకుంది.   తమిళనాడు అసెంబ్లీ కి ఈ ఏడాది ఏప్రిల్- మే లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ విజిల్  గుర్తు మీద పోటీ చేయనుంది. ఈసీ తమ పార్టీకి ఈల గుర్తు కేటాయించడం పట్ల విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు విజయ్ నటించిన సక్సెస్ ఫుల్ మూవీ విజల్ ను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, టీవీకేకు విజిల్ గుర్తు సక్సెస్ కు సంకేతంగా అభివర్ణిస్తున్నారు.   ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా.. ఏఐడీఎమ్‌కే ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టేసింది. ప్రజలపై హామీల జల్లులు కురిపిస్తోంది. టీవీకే పార్టీ ఎలాంటి  పొత్తూ లేకుండానే ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. రానున్న ఎన్నికలలో టీవీకే ప్రభావం పై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.  
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిని గురువారం (జనవరి 22) విచారించి, ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. జగన్ హయాంలో మద్యం విధాన రూపకల్పన, అమలు ప్రక్రియలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలపై ఈడీ విజయసాయిపై ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే భారీగా అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలపైనా ఈడీ విజయసాయిని సుదీర్ఘంగా విచారించింది.  అదే విధంగా మద్యం కుంభకోణం ద్వారా  అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించిన అంశం, హవాలా మార్గాల వినియోగం, షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ  దర్యాప్తు చేస్తోంది. డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ  ఏపీలో మద్యం విక్రయాలు క్యాష్ అండ్ క్యారీ రూపంలోనే నగదు రూపంలోనే ఎందుకు జరపాల్సి వచ్చిందన్న అంశంపై  ఈడీ అధికారులు విజయసాయిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పనపై తన సమక్షంలోనే మూడు సార్లు సిట్టింగులు జరిగినట్లు విజయ్ సాయి రెడ్డి ఈడీకి వాంగ్మూలం ఇచ్చినట్లూ, అయితే  ఆ పాలసీ రూపకల్పనతో తనకు ప్రత్యక్ష సంబంధం లేదని చేసినట్లు తెలిసింది.   ఇక ఇదే కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డిని విచారించనుంది.  ఈ కేసులో ఇప్పటికే ఇప్పటికే పలువురు కీలక వ్యక్తుల పాత్రపై  ఫోకస్ పెట్టిన ఈడీ.. రానున్న రోజులలో మరింత మందిని విచారించే అవకాశం ఉందని అంటున్నారు.  ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకోవడంతో విజయసాయి, మిథున్ రెడ్డిల విచారణ అనంతరం ఈడీ టార్గెట్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సమాయత్తమౌతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో మూడేళ్ల వ్యవధి ఉండగానే జగన్ పాదయాత్ర ప్రకటన రాజకీయంగా చర్చకు తెరతీసింది. 2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రజా సంకల్పయాత్ర పేరిట దాదాపు 16 నెలల పాటు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ పాదయాత్ర కారణంగానే అప్పటి ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.  అయితే అధికారంలో ఉన్న ఐదేళ్లూ జగన్ సర్కార్ విధానాలు, జగన్ కక్ష సాధింపు రాజకీయాలు, అలాగే రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, అరకొర సంక్షేమంతో  సాగించిన పాలనా, అలాగే జగన్ అనుసరించిన ఆర్థిక అరాచకత్వ విధానాల కారణంగా 2024 ఎన్నికలలో పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా 11 స్థానాలకే పరిమితమైంది.  గత ఎన్నికలలో పరాజయం తరువాత జగన్  రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారు. ఎక్కువగా బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ కే పరిమితమౌతూ రాష్ట్రంలో పార్ట్ టైమ్ రాజకీయాలు నెరపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలహీనపడింది.  ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే పాదయాత్ర శరణ్యమని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.  తాజాగా తాడేపల్లిలోని పార్టీ క్యాంపు ఆఫీసులో ఏలూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ తన పాదయాత్ర ప్రకటన చేశారు.  తన ప్రకటన పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతుందని ఆయన భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.   అయితే జగన్ పాదయాత్ర @ 2.0 వల్ల పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు ఆయన సుదీర్ఘ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. అప్పట్లో ఆయన అడుగుకో హామీ అన్నట్లుగా వాగ్దానాలు గుప్పించారు. వాటిని నమ్మి జనం ఆయన పార్టీకి బ్రహ్మరథం పట్టి ఆ ఎన్నికలలో ఘన విజయం చేకూర్చి పెట్టారు. అయితే అయిదేళ్ల పాలనలో  పాదయాత్ర ద్వారా వచ్చిన మైలేజీని పూర్తిగా పోగొట్టుకోవడమే కాకుండా,   తీవ్ర ప్రజా వ్యతిరేకతను కూడా జగన్ మూటగట్టుకున్నారు. హామీల అమలు విషయాన్ని పట్టించుకోలేదు. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అరకొరగా అమలు చేశారు. అంతే కాకుండా  అధికారంలో ఉన్నప్పుడు జనం మొహం చూడటానికి కూడా ఇష్టపడకుండా, బయటకు వచ్చినప్పుడు రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టుకు తిరిగిన జగన్.. పార్టీ పరాజయం తరువాత కూడా పెద్దగా జనంలోకి రాలేదు. మరి ఇప్పుడు పాదయాత్ర అంటూ మరో సారి జనం ముందుకు వచ్చే ప్రయత్నం ఏ మేరకు వర్కౌట్ అవుతుందన్నది అనుమానమేనన్నది పరిశీలకుల విశ్లేషణ.  
చట్టసభల్లో కూడా నోవర్క్ నో పే విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. కొందరు సభ్యులు సభకు హాజరు కాకుండా వేతనాలు తీసుకుంటున్నారన్న ఆయన  ఉద్యోగులు విధులకు గైర్హాజరైతే వేతనాలు నిలిపివేస్తారు.. మరి ఎమ్మెల్యేల విషయంలో ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయరని జనం ప్రశ్నిస్తున్నారన్నారు.  నో వర్క్ నో పే విధానాన్ని చట్ట సభల సభ్యులకు అమలు చేసే విధంగా చట్టం చేయాలని అఖిల భారత సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని అయ్యన్నపాత్రుడు అన్నారు.
ALSO ON TELUGUONE N E W S
While Mana Shankara Vara Prasad Garu continues its historic run, director Anil Ravipudi has once again proven why he is considered one of the most bankable names in Telugu cinema. Having delivered nine consecutive hits, Ravipudi shared that his secret lies in his discipline toward production costs. He emphasized that he treats every film as his own, acting as a "watchman" for the producer’s investment.  By ensuring everything is documented on paper and maintaining a strict grip on the budget, he managed to deliver a high-value blockbuster featuring Chiranjeevi within controlled limits, a feat that has greatly pleased producers Sahu Garapati and Sushmitha Konidela. He commented that only a director can control the budget and he is mindful of their well-being, always.  The director also expressed his profound gratitude toward the overseas audience, specifically in the US market. Since F2, five of his films have received an extraordinary reception there, and Mana Shankara Vara Prasad Garu is no exception. Ravipudi noted that the love from the NRI audience is indescribable and plans to visit the US in late January or February to thank them personally.  This global support has been a major pillar in the film crossing the ₹300 crore mark, with the director now hopeful that the upcoming weeks will push the collections toward the ₹400 crore milestone. A key contributor to this massive success is the music by Bheems Ceciroleo. Ravipudi highlighted the unique freedom they share, allowing them to experiment with multiple versions until they find the perfect sound. He thanked Megastar Chiranjeevi for trusting him and giving him all the freedom by supporting his demands to bring back Vintage Chiru for fans and audiences. He stated that he is indebted to audiences for making them their house member and he will comeback with even bigger entertainer for next Sankranti festival.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organization is not responsible for the factual nature of the data. We encourage viewers' discretion before reacting to the information provided.
    -సోషల్ మీడియాని షేక్ చేస్తున్న విశాల్  -మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం -ఫ్యాన్స్, ప్రేక్షకులు ఏమంటున్నారు సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ కాబోయే కొన్ని కాంబినేషన్స్ షూట్ దశ నుంచే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంటాయి. అటువంటి ఆసక్తినే కలిగిస్తున్న కాంబో  విశాల్(vishal),తమన్నా(Tamannaah). ఈ ఇద్దరు ప్రస్తుతం హిట్ మేకర్ సుందర్(Sundar)దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీకి రీసెంట్ గా 'మొగుడు' అనే టైటిల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు ఐదు నిమిషాల నిడివితో ఉన్న ప్రోమో ని రిలీజ్ చేశారు. సదరు ప్రోమో చూస్తుంటే  సినిమా ఏ ఉద్దేశ్యంతో తెరకెక్కుతుందో చాలా క్లియర్ గా చెప్పడమే కాకుండా ప్రోమోలోని అంశాలు  అభిమానులతో పాటు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరి అంతలా ఆకట్టుకునే విధంగా ప్రోమోలో ఏముందో చూద్దాం.   తమన్నా టీవీలో కామెడీ కింగ్ యోగిబాబు నటించిన సీరియల్ ని చూస్తుంది. విశాల్ ఇంటి ఫ్లోర్ ని తుడుస్తూ ఉన్నాడు. యోగిబాబు తన అత్తయ్యతో మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం. అర్థమైందా అత్తయ్యా అని చెప్పాడు. ఆ తర్వాత యోగిబాబు రియల్ గానే  తమన్నా ఇంటికి వచ్చాడు. దీంతో విశాల్ తో తమన్నా  టీ తీసుకు రమ్మంటుంది. కిచెన్ లోకి వెళ్తున్న విశాల్ కి తన ఇంట్లోకి రౌడీలు వచ్చారని తెలుస్తుంది. ఆ తర్వాత  కిచెన్ లో విశాల్, రౌడీల మధ్య ఫైట్ జరుగుతుంది. ఇదంతా చూసి యోగిబాబు షాక్ అవుతాడు. యోగిబాబు ముఖంపై రౌడీల బ్లడ్ పడినా తమన్నా చూసి టమాటా రసం పడిందా అని అంటుంది. ఐదు నిమిషాల ఈ టైటిల్ ప్రోమోతో మూవీలో మాస్ అండ్ కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో మేకర్స్ చెప్పినట్లయింది.   Also read:  బయటపడిన ప్రముఖ హీరోయిన్ చాటింగ్..టీనేజ్ యువకుల ధైర్యానికి మెచ్చుకోవాలి   విశాల్, సుందర్ కాంబోలో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. వాటిల్లో గత ఏడాది సంక్రాంతి కి వచ్చిన 'మదగజరాజా’ ఒకటి.  దీంతో 'మొగుడు' పై  అంచనాలు పెరిగాయి. కొంత గ్యాప్ తర్వాత తమన్నా ఫ్యామిలీ లుక్ తో  స్క్రీన్ షేర్ చేసుకోవడం అదనపు ఆకర్షణ. హిప్‌హాప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బెంజ్ మీడియా, ఖుష్భు కలిసి నిర్మిస్తున్నారు. మొగుడు టైటిల్ తో గోపీచంద్, కృష్ణవంశీ కాంబోలో మూవీ వచ్చి పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.      
  నిరాశపరిచిన రాజా సాబ్ మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్! పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాస్టర్ ప్లాన్ స్పిరిట్ రైట్స్ తో పాటు, ప్రభాస్ తో మరో మూవీ?   పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ మారుతి (Maruthi) కాంబినేషన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన 'ది రాజా సాబ్' (The Raja Saab) మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై నిరాశపరిచింది. సోషల్ మీడియా వేదికగా మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. స్టార్ హీరో పిలిచి ఇంత పెద్ద అవకాశమిచ్చి, ఇంత టైం ఇస్తే.. ఇదా చేసేది అంటూ ఫైర్ అవుతున్నారు. మారుతి పరిస్థితి ఇలా ఉంటే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పరిస్థితి మరోలా ఉంది.   ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'ను పీపుల్ మీడియా డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వల్ల రూ.50 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇక భారీ బడ్జెట్ తో 'ది రాజా సాబ్'ని నిర్మించగా రూ.100 కోట్లకు పైగా నష్టం చూడాల్సి వచ్చిందట. మొత్తానికి ఈ రెండు సినిమాల వల్ల పీపుల్ మీడియాకు రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు నష్టం వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.    "ముల్లును ముల్లుతోనే తీయాలి" అన్నట్టుగా ఈ నష్టాలను ప్రభాస్ సినిమాలతోనే కవర్ చేయాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చూస్తుందట. ఈ క్రమంలోనే 'స్పిరిట్' తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ కావడంతో 'స్పిరిట్'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకే 'స్పిరిట్'తో చాలా వరకు నష్టాలు భర్తీ అయ్యే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   Also Read: బాలయ్య సాలిడ్ లైనప్.. లిస్టులో ఐదుగురు స్టార్ డైరెక్టర్స్!   అయితే 'స్పిరిట్' రైట్స్ తో పాటు, పీపుల్ మీడియా మరో ఎత్తుగడ కూడా వేసిందట. తక్కువ టైం, తక్కువ బడ్జెట్ లో కంటెంట్ బేస్డ్ సినిమా తీద్దామనే ప్రపోజల్ ని ప్రభాస్ ముందు ఉంచిందట. నో చెప్పడం పెద్దగా అలవాటు లేని ప్రభాస్.. పీపుల్ మీడియా బ్యానర్ లో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.   పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ప్రభాస్ మరో సినిమా చేయనున్నాడనే న్యూస్ పై కూడా ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రమోషన్స్, ఫైనల్ కాపీ రెడీ చేసుకోవడం వంటి విషయాల్లో పీపుల్ మీడియా తడబాటు కనిపించిందని.. అందుకే ఆ బ్యానర్ లో మరో సినిమా చేయడం కరెక్ట్ కాదని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.    
Anil Ravipudi is one of the most sought after directors in Telugu Cinema has he delivered 9 out 9 hits till date. And his recent two films - Sankrantiki Vasthunnam and Mana Shankara Vara Prasad Garu, have been huge grossers despite being regional films and that too with Senior stars like Venkatesh and Chiranjeevi.  He interacted with media today and stated that his 10th film will also release for Sankranti 2027. He won't leave the slot and will begin with announcement promotions, pretty soon. Currently, huge speculations are going on about his next film as he is on a red hot hit streak. Akhil Akkineni could be in the race say new reports.  Simultaneously, reports indicate that Pawan Kalyan and Venkatesh are also being considered for this festival entertainer. Given Ravipudi's history of delivering blockbusters with senior stars like Venkatesh and Chiranjeevi, the possibility of a collaboration with PSPK or a reunion with "Venky Mama" remains strong. While Pawan Kalyan fans hope that a film with Anil Ravipudi will settle all box office scores, they are skeptical about PSPK giving his full-time for a demanding director like Anil Ravipudi. On the other hand, Venkatesh needs to finish Adarsha Kutumbam in Trivikram Srinivas direction to think about his next.  Akhil Akkineni post Lenin, which is slated for 1st May 2026 release, could be looking for a huge blockbuster for Sankranti season which helped his father Nagarjuna - Soggade Chinni Nayana and brother Naga Chaitanya - Bangarraju, to re-establish themselves at the box office. Let's wait for official confirmation.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
    -ఇంతకీ ఆ చాటింగ్ లో ఏముంది! -అవంతిక మోహన్ ఎవరు -ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది పెళ్లి కానీ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎవరకి మాత్రం ఉండదు చెప్పండి. అందులోను వాళ్ళకి నచ్చిన అందమైన సినిమా హీరోయిన్ పెళ్ళికి రెడీగా  ఉండి సోషల్ మీడియా వేదికగా ముచ్చట్లు పెడుతు ఉంటే పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తారు కదా. ఇప్పుడు అదే విధంగా అందమే అసూయ పడేంత అందంతో ఉండే  ప్రముఖ హీరోయిన్ అవంతిక మోహన్(Avantika Mohan)కి ఇద్దరు యువకులు పెళ్లి ప్రపోజ్ తీసుకొస్తున్నారు. ప్రపోజ్ లు  చేస్తుంది ఎవరు? వాళ్ల వయసు ఎంత! అవంతిక మోహన్ రిప్లై ఎలా ఉందో చూద్దాం. ఇనిస్టా వేదికగా కేరళ(kerala)కి చెందిన టీనేజ్ యువకుడు అవంతిక మోహన్ తో' కేరళలో నిన్ను చాలా మంది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. వాళ్లలో నేను ఒకడిని అంటు మెసేజ్ చేసాడు. ఆ మెసేజ్ పై అవంతిక స్పందిస్తు 'ఇంత చిన్న వయసులో నీకు ఎంత దైర్యం. బుడ్డోడా నీకు చెప్పేది ఒక్కటే, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. కొత్త హీరోకి ఛాన్స్ లేదు. వెళ్లి హోమ్ వర్క్ చేసుకో. కెరీర్ పై ఫోకస్ చేస్తుండని రిప్లై ఇచ్చింది. మరో టీనేజ్ యువకుడు 'నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా అని అడిగాడు. అవంతిక రిప్లై ఇస్తూ నీ మెసేజ్ చూస్తుంటే నాకు కోపం రాకుండా నవ్వొస్తుంది.నీకు దాదాపుగా ఇరవై ఏళ్ళ వరకు ఉండచ్చు. చాలా రాంగ్ టైం ఇది. అయినా కూడా నీ ధైర్యానికి మెచ్చుకొని తీరాల్సిందే అని అవంతిక రిప్లై ఇచ్చింది. సదరు యువకుల స్క్రీన్ షాట్స్ ని కూడా అనంతిక తన అకౌంట్ లో షేర్ చేసింది.   Also read:   నమ్రత పై మహేష్ బాబు భావోద్వేగ ట్వీట్  2012 వ సంవత్సరంలో 'యక్షి' అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన అవంతిక మోహన్ తెలుగులో 'ఉందిలే మంచి కాలం ముందు ముందున' అనే మూవీతో అలరించింది. 2015 నుంచే మలయాళ టీవీ షోస్, సీరియల్స్ లో కూడా తన సత్తా చాటుతూ ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. గత ఏడాది ధీరమ్ అనే మలయాళ మూవీతో మెప్పించిన అనంతిక 2017 లో అనిల్ కుమార్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ ఇద్దరికి రుద్రాంష్ అనే కుమారుడు ఉన్నాడు. అవంతిక మోహన్ అసలు పేరు ప్రియాంక.   
  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో రూపొందిన 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. వింటేజ్ చిరంజీవిని గుర్తుచేస్తూ రావిపూడి చేసిన మ్యాజిక్ కి అందరూ ఫిదా అయ్యారు.   ఈ సినిమాలో ప్రముఖ నటుడు హర్షవర్ధన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ సమయంలో చిరంజీవితో అలా కాదు ఇలా చేయండి అంటూ అనిల్ రావిపూడి పదేపదే చెబుతుండటంతో.. ఏంటి ఎక్కువ చేస్తున్నాడని హర్షవర్ధన్ అనుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ షేర్ చేసుకున్నారు.   "అనిల్ రావిపూడి టెర్రిఫిక్ డైరెక్టర్. ఎంతో హోంవర్క్ చేస్తారు. షూట్ లో చిరంజీవి గారు ఒకలా చేస్తే.. అనిల్ వచ్చి అలా కాదు ఇలా చేయండి అని చెప్తుంటే మొదట్లో నేను షాకయ్యాను. ఏంటి ఈయనొచ్చి చిరంజీవి గారికి యాక్టింగ్ చెబుతున్నాడు.. కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపించింది. కానీ అసలు మేటర్ నాకు తర్వాత తెలిసింది. చిరంజీవి గారి పాత సినిమాలలోని వింటేజ్ సీన్స్, బాడీ ల్యాంగ్వేజ్ లను సమీకరించి ఒక కథ తయారు చేసుకున్నాడు. ఇందులో మా హీరోలుగా చేయండి సార్ అని.. చిరంజీవి గారి పాత సినిమా సీన్ ని చిరంజీవి గారికే చూపించేవాడు. చిరంజీవి గారు కూడా సరదాగా.. వేరే ఎవరినో ఇమిటేట్ చేయడం కష్టం, నాకు వచ్చింది చేస్తాను అనేవారు. చిరంజీవి వర్సెస్ చిరంజీవి అన్నమాట." అంటూ 'మన శంకర వరప్రసాద్ గారు' షూటింగ్ విశేషాలను పంచుకున్నారు హర్షవర్ధన్.    
  భార్యాభర్తల కథకు కాస్త కామెడీ జోడించి, రియాలిటీకి దగ్గరగా చూపిస్తే ఆ సినిమా ఇచ్చే కిక్కే వేరేలా ఉంటుందని చెప్పుకోవచ్చు. సరిగ్గా అదే లైన్ తీసుకొని వినూత్నంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘పురుష:’ మూవీ. ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చేస్తూనే డిఫరెంట్ స్టైల్ ప్రమోషన్స్ చేపడుతూ ఆడియన్స్ దృష్టిని లాగేస్తున్నారు మేకర్స్.    ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు ‘పురుష:’ మూవీ టీమ్ వదులుతున్న పోస్టర్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలు చూపిస్తూనే.. పెళ్లి తర్వాత జీవితంలో భార్యల ఇంపార్టెన్స్ ఏంటనేది ఈ సినిమాలో చూపించనున్నారని ఇప్పటికే విడుదల చేసిన టీజర్ స్పష్టం చేసింది. ఇక తాజాగా మరో డిఫరెంట్ పోస్టర్ వదిలి సినిమాపై ఇంకాస్త హైప్ పెంచేశారు.    తాజాగా వదిలిన ఈ పోస్టర్ లో వెన్నెల కిషోర్ ఏదో అయోమయంలో పడినట్లు కనిపిస్తుండగా.. కిటికీ దగ్గర ఏం జరిగింది అని పోస్టర్ పై రాసి ఇంకాస్త క్యూరియాసిటీ పెంచారు. మొత్తానికి ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో ఖచ్చితంగా ఫుల్ ఫన్ ఉంటుందని, అలాగే డిఫరెంట్ సీన్స్ ఆడియన్స్ ఈ సినిమాలో చూడబోతున్నారని స్పష్టమవుతోంది.        బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు ఈ ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. వీరు వులవల దర్శకత్వం  వహిస్తున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నాడు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.    విడుదలైన ప్రతి పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. మరోవైపు ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్ కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మగజాతి గర్వించదగ్గ ఆణిముత్యాలండీ మీరు అంటూ ప్రతి సీన్ లో కామెడీ టచ్ ఉండేలా ఈ టీజర్ కట్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.   ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల పని చేస్తుండగా.. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.   
Director Sundar C, known for his mass-friendly storytelling and strong Telugu market presence, is gearing up with yet another promising entertainer- this time teaming up with Versatile Star Vishal for the upcoming film “Mogudu.” Backed by Avni Cinemax Pvt. Ltd. and Benzz Media Pvt. Ltd. under the presentation of Khushbu Sundar, the project is produced by A.C.S. Arun Kumar. The film features Tamannaah Bhatia as the female lead, while comedy king Yogi Babu takes on a key role. Hiphop Tamizha is scoring the music. While the shoot is moving at full speed, the makers have already taken the promotional game up a notch. They’ve dropped a title reveal along with a 5-minute glimpse, which has immediately triggered buzz across social media. The video doesn’t rely on frills- it directly dives into the heart of the story, introducing the dynamic between Vishal, Tamannaah, and Yogi Babu with surprising clarity and emotional weight. The glimpse opens with a witty, TV-serial-style dialogue from Yogi Babu: “Being a man isn’t enough… behaving like a real husband is what matters. Do you understand, mother-in-law?” This sets the tone for the playful chaos that follows. We then see Yogi Babu entering Tamannaah’s home, getting charmed by her presence, only to freeze when he encounters her husband—Vishal. The sequence, stitched with humor and subtle tension, highlights Sundar C’s signature ability to blend family drama with fun. The standout element of the glimpse is the crackling husband–wife dynamic between Vishal and Tamannaah. Tamannaah nails the role of a commanding, no-nonsense wife, while Vishal brings a refreshing mix of domestic innocence and powerful action heroism. Watching him shift from kitchen chores to beating down bad guys adds an enjoyable mass flavor to the narrative. “Mogudu” clearly positions itself as a commercial entertainer loaded with family sentiment, humor, and action, aiming to pull in audiences of all ages. As Vishal’s 36th film, the project seems to pack the right balance of entertainment elements, a fact the glimpse emphasizes strongly. With such an extended and impactful first look already in play, anticipation is now building toward the teaser and trailer. The team has hinted at continuous, engaging promotions throughout the shoot to keep the buzz alive among all sections of viewers. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
    -ట్వీట్ ఎందుకు చేసాడు -అసలు ట్వీట్ లో ఏముంది  -ఫ్యాన్స్ ఏమంటున్నారు! సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)కి లో ప్రొఫైల్ మెయింటైన్ చెయ్యడం మొదట నుంచి అలవాటు. సామాజిక సేవా పరంగా కూడా అదే లో ప్రొఫైల్ సూత్రాన్ని అవలంబిస్తూ ఎంతో మంది ప్రాణాలని కాపాడుతుంటాడు. వృత్తి పరంగా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా సినీ  సామాజిక, కుటుంబ బాధ్యత విషయాల్లో తన భార్య మాజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్(Namrata shirodkar)  అన్ని విధాలుగా అండగా ఉంటుంది. అంతలా మహేష్ పై నమ్రత నీడ ఉంటుంది. ఈ రోజు నమ్రత పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేష్ చేసిన ట్వీట్ ఆ ఇద్దరి మధ్య ఎంత అనుబంధం పెనవేసుకొని ఉందో తెలియచేస్తుంది.   ఎక్స్ వేదికగా నమ్రత కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తు' హ్యాపీ బర్త్ డే ఎన్ ఎస్ జి ..మన కుటుంబాన్ని ఇంతటి ప్రేమతో, గౌరవంతో ఒక్కటిగా ఉంచుతున్నందుకు నీకు ధన్యవాదాలు. అంతకంటే నేనేమి కోరుకోలేను అని నమ్రత నుదుటికి ఆప్యాయంగా  ముద్దుపెడుతున్న పిక్ ని షేర్ చేసి  ట్వీట్ చేసాడు. సదరు ట్వీట్ తో మహేష్ లైఫ్ లో నమ్రత బాండింగ్ ఎంత మేర ఉందో అర్ధమవుతుంది.మహేష్ అభిమానులు కూడా నమ్రత కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుండటంతో సోషల్ మీడియా కళకళ లాడుతు ఉంది.    Also read:  Mana shankara varaprasad garu:  నిక్కీ డీటెయిల్స్ ఇవే.. ఫాదర్ లేడు   ఇక మహేష్ ఈ సారి ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్  'వారణాసి'(Varanasi)తో ఏకంగా వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై కన్నేశాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా రాజమౌళి(SS Rajamouli)తన గత చిత్రాలని మించి హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు చూస్తుంటే కథ,కథనాలు ఊహకి అందని విధంగా ఉండబోతున్నాయని అర్ధమవుతుంది. శ్రీరాముడు గా కూడా మహేష్  మెస్మరైజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.                     https://x.com/urstrulyMahesh/status/2014216163983778266  
  వార్తల్లో 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ కార్తీక్ పాత్రలో సుశాంత్ రెడ్డికి బదులుగా శ్రీనాథ్ మాగంటి! మెయిన్ యాక్టర్ ని ఎందుకు మార్చారు? సుశాంత్ రెడ్డి తప్పుకున్నాడా? తప్పించారా?   ఈ తరం తెలుగు యువత రిపీటెడ్ గా చూసే సినిమాలలో ఒకటి 'ఈ నగరానికి ఏమైంది'. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించారు. 2018 లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'ఈ నగరానికి ఏమైంది-2' రూపొందుతోంది. (Ee Nagaraniki Emaindi 2)   ఒక సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుందంటే.. మొదటి భాగంలోని ప్రధాన తారాగణమే రెండో భాగంలో కూడా కొనసాగుతుంది. అయితే 'ఈ నగరానికి ఏమైంది-2'లో మాత్రం సాయి సుశాంత్ రెడ్డికి బదులుగా శ్రీనాథ్ మాగంటి నటిస్తున్నాడు. దీంతో అలా ఆర్టిస్ట్ ని మార్చడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.    'ఈ నగరానికి ఏమైంది' గ్యాంగ్ గా ఆ నలుగురు ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అయ్యారు. అందుకే వారిలో ఒకరిని రీప్లేస్ చేయడంపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొత్త ఆర్టిస్ట్ వస్తే ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో దర్శకుడు తరుణ్ భాస్కర్, నటుడు సాయి సుశాంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు.     "వ్యక్తిగత కారణాల వల్ల 'ఈ నగరానికి ఏమైంది-2'లో నటించలేనని సుశాంత్ చెప్పినప్పుడు బాధ కలిగింది. అయితే ఈ స్క్రిప్ట్ మీద, ఈ క్యారెక్టర్స్ మీద నాకు నమ్మకం ఉంది. 'ఈ నగరానికి ఏమైంది' ప్రపంచం అనేది నిజ జీవితంలో నా ఫ్రెండ్స్ తో అనుభవాల నుంచి పుట్టింది. 'ఈ నగరానికి ఏమైంది-2' స్టోరీ కూడా ఆర్గానిక్ గా వచ్చిందే. ఇందులో సుశాంత్ లేనప్పటికీ కార్తీక్ పాత్ర మిమ్మల్ని మునుపటిలాగానే అలరిస్తుంది." అని తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు.     "ఈ నగరానికి ఏమైంది నా హృదయానికి దగ్గరైన సినిమా. నాకెన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. ఆ సినిమా చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇప్పుడు లైఫ్ చాలా మారిపోయింది. నా ప్రజెంట్ వర్క్ తో సినిమాని బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారింది. అందుకే మనసుకి బాధగా ఉన్నా ఈ నగరానికి ఏమైంది-2 చేయలేకపోతున్నాను." అని సుశాంత్ తెలిపాడు.   మరి 'ఈ నగరానికి ఏమైంది-2' ఎలా ఉంటుంది? కార్తీక్ పాత్రలో సుశాంత్ రెడ్డిని మరిపించేలా శ్రీనాథ్ మాగంటి నటిస్తాడా? అనేది చూడాలి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భారతదేశంలో  వందల శతాబ్దాల నుండి కొన్ని నియమాలు, పద్దతులు నిర్ణయమైపోయి ఉన్నాయి.  ముఖ్యంగా వివాహ వ్యవస్థ లో ఉన్న కొన్ని నియమాలను ఏ మతమైనా సరే.. తప్పకుండా పాటిస్తుంది.  అలాంటి నియమాలలో వివాహం,  వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళ్లడం, అత్తవారింట్లో కుటుంబ సభ్యులకు సేవలు చేస్తూ జీవించడం ముఖ్యమైనది.  అమ్మాయిల విషయంలో ఇలా ఉంటే.. అబ్బాయిలు తండ్రి తర్వాత కుటుంబానికి యజమాని అవుతారు.  కుటుంబానికి వారసులుగా అబ్బాయిలనే పరిగణిస్తారు.  ఎందుకంటే వారు తల్లిదండ్రులతోనే ఉంటారు కాబట్టి. కానీ భారతదేశంలోనే ఒక ప్రాంతంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతోంది. అక్కడ అమ్మాయిలను కుటుంబ వారసులుగా పరిగణిస్తారు.  అబ్బాయిలకు పెళ్లి చేసి  అత్తవారింటికి పంపుతారు.  ఇంతకీ ఆ ప్రాంతం ఏది? అక్కడి విశేషాలేంటి? తెలుసుకుంటే.. ఖాసీ తెగ.. ఖాసీ తెగ ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు చెందినది. ఇక్కడి ప్రజలు పితృస్వామ్య నియమాలను కాకుండా మాతృస్వామ్య నియమాలను అనుసరిస్తారు. పితృస్వామ్య వ్యవస్థలలో కుమారులను వారసులుగా పరిగణిస్తారు, అయితే ఖాసీ తెగలో కుమార్తెలు వారసత్వాన్ని వారసత్వంగా పొందుతారు. వీరు మాతృస్వామ్య వ్యవస్థను అనుసరిస్తారు. అంటే కుమార్తెలు జీవితాంతం తమ తల్లి కుటుంబంతోనే ఉంటారు. ఇంటి పేరు.. సాధారణంగా ప్రతి కుటుంబానికి  తండ్రి ఇంటిపేరును మొదటి పేరు సంక్రమిస్తుంది.  వివాహం తర్వాత కూడా ఆడపిల్లలకు ఇంటిపేరు, గోత్రం మారుతాయని చెబుతారు.  కానీ ఖాసీ తెగ వారి తల్లి ఇంటిపేరును  కొనసాగిస్తుంది.  ఈ తెగ దాని ప్రత్యేక సంస్కృతి కారణంగా ప్రపంచంలోని ఇతరుల నుండి భిన్నంగా ఉంటుంది. అబ్బాయిలనే పంపిస్తారు.. శతాబ్దాలుగా వివాహం తర్వాత అమ్మాయిలను అత్తవారింటికి పంపే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ ఖాసీ తెగలో ఈ సంప్రదాయం ఉండదు. ఇక్కడ వివాహం తర్వాత అమ్మాయిల ఇంటికి అబ్బాయిలను పంపిస్తారు. ఇక్కడి అబ్బాయిలు వివాహం తర్వాత వారి అత్తమామల ఇంటికి వెళతారు. అంతేకాదు.. అబ్బాయిలు ఇంటి పనులన్నీ చేస్తారు. అమ్మాయిలు బయట పని చేస్తారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. అబ్బాయిని అత్తారింటికి పంపడం అనే విషయం పై అతని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు.  ఇక్కడ ఇది శతాబ్దాలుగా అమలులో ఉన్న సంప్రదాయం. ఈ తెగ వారు ఈ సంప్రదాయాన్ని సంతోషంగా అమలు చేస్తున్నారట. ఖాసీ తెగ మాత్రమే కాదు.. ఇవి కూడా.. భారతదేశంలో ఖాసీ తెగతో పాటు, గారో తెగ, నాయర్ తెగ, తులువా తెగ,  బోండా తెగలు మాతృస్వామ్య విదానాన్ని ఆచరిస్తారు. మేఘాలయ రాష్ట్రంలోని గారో కొండలలో నివసించే గిరిజన సమాజమైన గారో తెగలో, తండ్రి కాదు, తల్లి ఇంటిపెద్ద పాత్ర పోషిస్తుంది. ఇక్కడ కూడా, పిల్లలు తమ తల్లి ఇంటిపేరును ఉపయోగిస్తారు,  చిన్న కుమార్తె తన తల్లి నుండి ఆస్తిని వారసత్వంగా పొందుతుంది. అంతేకాకుండా, కుమార్తెలను వివాహం తర్వాత అత్తారింటికి పంపించరట. నాయర్ తెగ మరింత విభిన్నం.. నాయర్ తెగ మరింత ప్రత్యేకం. వారు స్వాతంత్య్రానికి పూర్వం నుంచే  మాతృస్వామ్య వ్యవస్థలో నివసిస్తున్నారు. ఇక్కడ కూడా స్త్రీలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. స్త్రీలనే కుటుంబాలకు పెద్దలుగా పరిగణిస్తారు.  వీరిని "తారవాడ్లు" అని పిలుస్తారు. ఇక్కడ పురుషులు ప్రత్యేక గదులలో నివసిస్తున్నారంటే ఆశ్చర్యపోతారు.  కానీ ఇదే నిజం.                                               *రూపశ్రీ.
భారతదేశం చాలా వైవిధ్యభరితమైనది. భారతీయ సంప్రదాయాలలో పురుషార్థాలు చాలా ప్రధానమైనవి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పురుషార్థాలు అని అంటారు. ఈ  నాలుగింటిని అవలంభించడం వల్ల ప్రతి వ్యక్తి ఒత్తిడి నుండి విముక్తి అవుతాడని చెబుతారు. కానీ నేటి ఆధునిక కాలంలో వీటిని అటకెక్కించారు. ఈ నాలుగింటి గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఇవి వ్యక్తి జీవితంలో ఎంత ముఖ్యమైనవో తెలిసిపోతుంది. వీటి గురించి తెలుసుకుంటే.. ధర్మం.. జీవితంలో కొన్నిసార్లు మనం పారిపోతున్నట్లు అనిపిస్తుంది.  కానీ ఎందుకు అనే విషయం అర్థం కాదు.  ధర్మం అంటే ప్రతి వ్యక్తి తన నిజమైన కర్తవ్యాన్ని అర్థం చేసుకోవడం. ప్రపంచానికి ఒక వ్యక్తి నుండి కావలసింది ఇదే. ప్రతి వ్యక్తి తనలోకి తాను చూసుకోవాలి. అంటే.. ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఏది ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది? రోజువారీ చిన్న చిన్న పనులలో నిజాయితీని పాటించినప్పుడు లభించే సంతృప్తి చాలా గొప్పది.  ఒక్కసారి దీన్ని అనుభవించినప్పుడు ఇక దాన్నుండి పక్కకు పోవాలన్నా పోలేరు. అర్థం.. డబ్బు లేకుండా జీవితం కష్టమవుతుంది. అర్థ అంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని,  సమాజాన్ని ఆదుకునే శ్రేయస్సు. కానీ డబ్బును సంపాదించడమే అర్థం అనే విషయానికి నిజమైన వివరణ అనుకుంటారు చాలా మంది.  ఈ కారణంగానే జీవితంలో డబ్బు కోసం చాలా పోరాటం చేస్తారు. దానిని ధర్మంతో సమతుల్యం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి తన అవసరాను గుర్తించాలి, తెలివిగా ప్లాన్ చేసుకోవాలి.  కానీ అత్యాశతో ఉండకూడదు.  ఉన్నదాంటో తృప్తి పడటం నేర్చుకోవాలి. కామ.. కామ అంటే కోరికలు.  ప్రేమ,  ఇంద్రియ సుఖాలు. కోరికలను అణచివేయవద్దని, వాటిని సరైన మార్గంలో నెరవేర్చుకోవాలని అర్థం.  కానీ ధర్మార్థాల  విషయంలో రాజీ పడకూడదు. కామం అంటే కేవలం ఇంద్రియాల గురించే కాదు.. కామం అంటే కోరిక, పని.. ఇందులో చాలా ఉంటాయి.  నేటి కాలంలో కామం అనగానే ఒక బూతు అనుకుంటారు. అది తప్పు. ప్రతి రోజూ ఒక చిన్న ఆనందం అయినా ఉండేలా చూసుకోవాలి.  ఎవరితోనైనా మాట్లాడాలి. ప్రకృతితో సమయం గడపాలి. కోరికలను బయటకు చెప్పడం కాదు.. బాలెన్సింగ్ గా ఉంచుకోవాలి. మోక్షం.. మోక్షం  అంటే విముక్తి. అన్ని ఒత్తిడి, భయం,  బంధనాల నుండి విముక్తి. ఒక వ్యక్తి నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం. ధర్మం, అర్థ,  కామాలు సమతుల్యంగా ఉన్నప్పుడు, మోక్షం సహజంగా వస్తుందని చెబుతారు. మోక్షం వైపు అడుగులు వేయాలంటే ధ్యానం చేయాలి. యోగా చేయాలి, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాలి.  వర్తమానంలో జీవించాలి.                                   *రూపశ్రీ.
అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చడం,  మూడు ముళ్లతో ఇద్దరు ఒక్కటవ్వడం.. ఇవన్నీ ఒక కొత్త జీవితానికి కేవలం మొదలు మాత్రమే.  వివాహం తర్వాత భార్యాభర్తల బంధం క్రమంగా పలుచబడుతోందని, భార్యాభర్తలు పెళ్లైన కొత్తలో ఉన్నంత సంతోషంగా, ప్రేమగా ఉండలేకపోతున్నారని చాలా మంది అంటుంటారు.  మూడు ముళ్లు పడినంత ఈజీగా వైవాహిక బంధం నిలబడదు. వైవాహిక బంధం నిలబడాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కృషి చేయాలి.  చాలామంది పెళ్లైన తర్వాత వైవాహిక బంధం నిలబెట్టుకునే బాధ్యత అమ్మాయిలదే అంటుంటారు.  అయితే దీని గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు రిలేషన్షిప్ నిపుణులు.. అవేంటో తెలుసుకుంటే.. బాధ్యత.. వైవావిక బంధం అనేది ఇద్దరు వ్యక్తుల వల్ల ఏర్పడుతుంది.  కాబట్టి ఆ బంధాన్ని నిలబెట్టుకునే బాధ్యత  ఇద్దరి మీద ఉంటుంది. చాలామంది కుటుంబాలలో పితృస్వామ్య వ్యవస్థ ఉంటుంది. దీని వల్ల మగవాడు తప్పు  చేసినా సరే.. మహిళలే బాధ్యత వహించాలని, మగవారు తప్పుగా మాట్లాడినా మహిళలు సర్దుకుపోవాలని అంటుంటారు.  మహిళలను చిన్నతనంగా చూడటం చేస్తుంటారు.  ఇలాంటి కుటుంబాలలో మహిళలకు ప్రాధాన్యత ఏమీ ఉండదు.   కానీ ఒక వైవాహిక బంధం సంతోషంగా ఉండాలంటే ఆ బందానికి బార్యాభర్తలు ఇద్దరూ బాధ్యత వహించాలి. భార్య కోసం భర్త,  భర్త కోసం భార్య ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఒకరి పట్ల మరొకరు బాధ్యతగా ఉంటారో.. అప్పుడు ఆ బందం కూడా బాగుంటుంది. ఆనందం.. ఏ బంధంలో అయినా సంతోషం,  ఆనందం ఉంటే ఆ బంధం ఎన్నేళ్లైనా బాగుంటుంది.  మగవాళ్లు తమ వైవాహిక జీవితంలో కాకుండా బయటి నుండి సంతోషాన్ని వెతుక్కుంటే వారు ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేరు.  తొందరగానే వారి జీవితంలో వెలితి కనిపిస్తుంది.  ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండే వారితో వచ్చే ఆనందమే ఎక్కువ కాలం ఉంటుంది. మహిళలు అయినా,  పురుషులు అయినా తమ భాగస్వామిలో సంతోషాన్ని వెతుక్కునే వారు అయితే.. వారిద్దరి బంధం అన్యోన్యంగా ఉంటుంది. పురుషులు చాలా వరకు స్నేహితులతో,  బయటి వ్యక్తులతో పార్టీలు,  ఫంక్షన్లలో గడపడానికి ఇష్టపడుతుంటారు. కానీ భార్యతో, కుటుంబంతో గడిపినప్పుడు కలిగే ఆనందం.. ఆ కుటుంబాన్ని మరింత బలంగా మారుస్తుంది. సంతృప్తి.. వివాహ బంధం సంతోషంగా ఉండాలంటే సంతృప్తి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.  ఉన్నదాంతో సంతృప్తి పొందేవారు,  తమకు అలాంటి జీవితం ఇచ్చినందుకు దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండేవారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ వైవాహిక ఆనందాన్ని బయట కాకుండా తమలోనే వెతకాలి.  బయట వెతకడం వల్ల  ఎప్పుడూ స్పష్టమైనది దొరకదు. అందుకే భాగస్వామికి సమయం ఇవ్వడం, వారితో గడపడం చేయాలి. ఇలా చేయడం వల్ల వారిలో ఉండే ఎన్నో విషయాలు వాటికవే అర్థమవుతాయి. వారి పట్ల ప్రేమ, గౌరవం మరింత బలపడతాయి.                                  *రూపశ్రీ.
క్యాన్సర్ ప్రపంచాన్ని కబళిస్తున్న జబ్బు. పూర్తీగా చెయ్యి దాటిన దశలో బయటపడటం అనే కారణం వల్ల క్యాన్సర్ అంటే ఇక మరణమే అనే అభిప్రాయం ఏర్పడింది.  క్యాన్సర్ కు వైద్యం ఉన్నా అది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా నరకం అనుభవించాల్సి వస్తుంది.  సింపుల్ గా చెప్పాలంటే.. క్యాన్సర్ ఒక మనిషి  శరీరాన్ని లోపలే విచ్చిన్నం చేయడమే కాకుండా.. ఒక కుటుంబాన్ని ఆర్థికంగా కూడా చితికిపోయేలా చేస్తుంది. నేటికాలంలో క్యాన్సర్ నిపుణులు కొన్ని ఆందోళనకరమైన మార్పులు గమనిస్తున్నారు. క్యాన్సర్ అంటే పెద్దవారిలో బయటపడేది అనుకునేవారు. కానీ నేటికాలంలో యువతలో కూడా క్యాన్సర్ బయటపడటం ఆందోళనగా మారుతోంది. కొంతమంది 20 లేదా 30 ఏళ్ల లోపు క్యాన్సర్ రోగులుగా మారుతున్నారు. రొమ్ము క్యాన్సర్ నుండి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వరకు అన్ని రకాల క్యాన్సర్‌లలో ఈ మార్పు కనిపిస్తోంది. శరీరాన్ని చాలా సైలెంట్ గా క్యాన్సర్ బారిన పడేలా చేసే 7 అలవాట్లు ఉన్నాయి. ఈ 7లో కూడా 3 పనులు చేసిన తర్వాత ప్రజలు చాలా గ్రేట్ గా ఫీలవుతూ ఉంటారు. అవేంటో అవి శరీరాన్ని క్యాన్సర్ బారిన పడేలా ఎందుకు చేస్తాయో.. తెలుసుకుంటే..   ప్రజలు మూడు పనుల విషయంలో చాలా గ్రేట్ ఫీలవుతారు.  పైగా వాటిని మార్చుకోవాలని కూడా అనుకోరు.  కానీ క్రమంగా అవి కణాలను,  హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఉదాహరణకు.. గంటల తరబడి కూర్చోవడం వల్ల  తాము చాలా పని చేస్తున్నామని, చాలా భాద్యతగా ఉంటున్నామని అనుకుంటారు. ఇది విజయానికి  మంచిదే కానీ ఇది ఆరోగ్యపరంగా చాలా నష్టాలు కలిగిస్తుందని అంటున్నారు. అదేవిధంగా.. నిద్రించడానికి తగినంత సమయం లేకపోవడం వల్ల  తగినంత నిద్రపోని వారు అనేకమంది ఉన్నారు. కొంతమంది ఎక్కువగా మద్యం సేవించిన తర్వాత తమ సామర్థ్యం బాగా పెరిగిందని తమను తాము గొప్పగా చెప్పుకుంటారు. ఆహారం.. నేటికాలంలో ఆహారపు అలవాట్లు చాలా అనారోగ్యకరంగా తయారయ్యాయి. ప్యాక్ చేసిన స్నాక్స్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు,  తక్కువ ఫైబర్ భోజనం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది ప్రేగులలోని బ్యాక్టీరియా సంఖ్యను ప్రభావితం చేస్తుంది. ఇది పెద్దప్రేగు,  గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. యాంటీబయాటిక్ ఎక్కువ వాడటం కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతుంది. పొల్యూషన్.. పర్యావరణ,  కాలుష్య కారకాలు క్యాన్సర్‌కు ప్రధాన కారణం. చుట్టూ ఉన్న కలుషితమైన గాలి,  ఇంటి లోపల,  వెలుపల గాలిని ప్రమాదకరంగా మారుస్తోంది. PM2.5,  వాయు కాలుష్యం నుండి వచ్చే టాక్సిన్స్ శరీరంలోకి ప్రవేశించి వాపుకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.  DNA ను దెబ్బతీస్తాయి. ఇది ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతుంది. జన్యువులు.. చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చే వ్యక్తులు జన్యు కారణాల వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉండటం వలన BRCA వంటి  సమస్యలు  సంభవించవచ్చు. అనారోగ్యకరమైన వాతావరణంలో జీవించడం దీని ప్రమాదం పెరుగుతుంది. పరీక్షలు.. యువతలో చాలామంది తమకు ఎదురయ్యే  ఆరోగ్య సమస్యలను లైట్ తీసుకుంటారు. మాది చిన్న వయసు మాకేం జబ్బులు వస్తాయి అని అనుకుంటారు. ఈ వయసులో క్యాన్సర్ ఎలా వస్తుందనే ఆలోచన యువతలో ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాణాంతక వ్యాధిని గుర్తించడం ఆలస్యం అవుతుంది.  చికిత్స కష్టమవుతుంది.  దీర్ఘకాలిక నొప్పి, ఆకస్మికంగా బరువు తగ్గడం, మలద్వారం నుండి రక్తస్రావం, ఎప్పుడూ  దగ్గు రావడం,  రొమ్ములో ముద్దగా ఉండటం,  మూత్ర విసర్జన అలవాట్లలో మార్పు లేదా నోటిలో పూతలు ఎక్కువ కాలం ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.                         *రూపశ్రీ.
నేటి కాలంలో మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి పెద్ద శత్రువులుగా మారినవి జబ్బులే.  కొత్త కొత్త ఆరోగ్య సమస్యలన్నీ బయటపడుతూ ఉంటాయి.  మనిషి ప్రాణాన్ని ప్రమాదంలో పడేసే లిస్ట్ లో బ్రాడీకార్డియా కూడా ఒకటి. ఇది గుండెకు సంబంధించిన జబ్బు. ఈ సమస్య తెలుసుకున్నప్పుడు దీన్ని సులువుగానే పరిష్కరించుకోవచ్చు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు అంటున్నారు. అసలు బ్రాడీకార్డియా అంటే ఏంటి? దీన్ని లక్షణాలు, కారణాలు ఏంటి? తెలుసుకుంటే.. బ్రాడీకార్డియా.. హృదయ స్పందన మందగించినప్పుడు దానిని బ్రాడీకార్డియా అంటారు. ఈ పరిస్థితి చాలా తీవ్రమైనది,  ప్రాణాంతకమైనదిగా కూడా మారే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని నిర్గక్ష్యం చేయకూడదు. నెమ్మదిగా హృదయ స్పందనను గమనించాలి.  ఒక నిమిషం వ్యవధిలో  హృదయ స్పందనలను లెక్కించాలి. బ్రాడీకార్డియా ఎలా నిర్ణయిస్తారు.. గుండె సాధారణంగా నిమిషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది. కానీ  గుండె నిమిషానికి 60 సార్లు కంటే తక్కువ కొట్టుకుంటే బ్రాడీకార్డియా ఉండవచ్చని వైద్యులు అంటున్నారు. బ్రాడీకార్డియా ఉంటే ఏం జరుగుతుంది.. SA నోడ్ అనేది గుండెకు ఉండే  సహజ పేస్‌మేకర్, ఇది గుండె కొట్టుకునేలా క్రమం తప్పకుండా విద్యుత్ సంకేతాలను పంపుతుంది. బ్రాడీకార్డియాలో ఈ సంకేతాలు బలహీనంగా లేదా ఆలస్యంగా ఉంటాయి. దీనివల్ల గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది . ఇది రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది, శరీరానికి,  ఇతర అవయవాలకు తగినంత ఆక్సిజన్ డెలివరీని నిరోధిస్తుంది. హృదయ స్పందన నెమ్మదిగా ఉంటే ఏం  జరుగుతుందంటే..  హృదయ స్పందన నెమ్మదిగా ఉండటం వల్ల  శరీరం,  మెదడుకు తగినంత రక్తం,  ఆక్సిజన్ చేరకుండా ఆటంకం కలుగుతుంది. ఇది అలసట, తలతిరగడం, తలతిరగడం, శ్వాస ఆడకపోవడం, గందరగోళం,  మూర్ఛపోవడానికి కూడా కారణమవుతుంది. చాలా ఫిట్‌గా ఉన్న వ్యక్తులలో కూడా హదయ స్పందన నెమ్మదిగా ఉండే అవకాశం ఉంటుంది. హృదయ స్పందన నెమ్మదిగా ఉండటంతో పాటు ఇతర  కారణాలు  బ్రాడీకార్డియాను నిర్ధారిస్తాయి. ఇతర కారణాలు.. వృద్ధాప్యం దీర్ఘకాలిక గుండె జబ్బులు గుండె  విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లడం కొన్ని మందులు తీసుకోవడం డయాబెటిస్, అధిక రక్తపోటు,  ఎలక్ట్రోలైట్ అసమతుల్యత నిర్ధారణ,  చికిత్స.. బ్రాడీకార్డియాను సాధారణంగా ECG ద్వారా నిర్ధారణ చేస్తారు.  కొన్నిసార్లు హోల్టర్ మానిటర్‌ను సాధారణ హృదయ స్పందనను రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు. చికిత్స పరిస్థితి  తీవ్రత,  కారణాన్ని బట్టి ఉంటుంది. తేలికపాటి కేసులకు మందులు,  జీవనశైలి మార్పులతో చికిత్స చేయవచ్చు. అయితే తీవ్రమైన కేసులకు పేస్‌మేకర్ అవసరం కావచ్చు. లీడ్ లెస్ పేస్ మేకర్లు.. సాంప్రదాయ పేస్‌మేకర్లు  ప్రభావవంతంగా ఉండేవి, కానీ వాటి వైర్లు సమస్యల ప్రమాదాన్ని పెంచేవి.. ఆ కారణంగా ఆధునిక లీడ్‌లెస్ పేస్‌మేకర్లు కనుగొన్నారు. ఇవి తక్కువ ఇన్వాసివ్,  వేగంగా కోలుకోవడానికి వీలు కల్పిస్తాయి. పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ తర్వాత చాలా మంది పూర్తిగా సాధారణ జీవితాన్ని గడుపుతారు.                      *రూపశ్రీ.
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు.. మందరాన్ని మంచి హెల్త్ కోసం కూడా వాడవచ్చు.  విదేశాలలో పువ్వులతో టీ తయారు చేసుకుని తాగుతారు.  అలాంటి లిస్ట్ లో మందారం కూడా ఉంది.  అసలు మందారం టీలో ఉండే ఔషద గుణాలేంటి? మందారం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే.. మందారం టీ.. మందారం టీ చూడటానికి చాలా కలర్ పుల్ గా ఉంటుంది. ఇది రుచిలో పుల్లగా, క్రాన్బెర్రీ లాంటి రుచిని కలిగి ఉంటుంది.  ఈ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసం ఎలాంటి సంకోచం లేకుండా దీన్ని తాగవచ్చు. మందారం టీ బెనిఫిట్స్.. మందారం టీ తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.  అధిక రక్తపోటు నియంత్రించడానికి మందారం టీ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది నరాలను సడలించి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు.. మందారం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో.. మందారం టీ శరీరంలో అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది కార్బోహేడ్రేట్లు, స్టార్చ్ ల శోషణను నెమ్మదిస్తుంది.  ఈ ప్రక్రియ జరగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయం.. మందారం టీ తాగడం వల్ల కాలేయం శుద్ది అవుతుంది. కాలేయంలో  పేరుకున్న కొవ్వును తగ్గించడంలో మందారం టీ  చాలా బాగా సహాయపడుతుంది.                         మందారం టీ తయారు విధానం.. మందారం టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. మందారం రెక్కలు.. గుప్పెడు నిమ్మకాయ..  సగం చెక్క తేనె.. స్పూన్ నీరు.. ఒక గ్లాస్ తయారీ విధానం.. ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు పోయాలి. అందులో శుభ్రం చేసుకున్న గుప్పెడు మందారం రెక్కలను వేయాలి. ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తరువాత స్టౌ ఆప్ చేయాలి.  కొంచెం వేడి తగ్గిన తర్వాత వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.  తేనె, నిమ్మరసం రుచి కోసం మాత్రమే.  అవి లేకుండా కూడా తాగవచ్చు.                                      *రూపశ్రీ.