LATEST NEWS
ఘోర పరాజయం తరువాత కూడా జగన్ లో ఇసుమంతైనా మార్పు రాలేదు.  2024లో వైసీపీ ఘోర పరాజయానికి తన ఐదేళ్ల హయాంలో అవలంబించిన కక్ష సాధింపు రాజకీయాలు, వేధింపు చర్యలు, అభివృద్ధిని పట్టించుకోకపోవడం వంటి కారణాలతో పాటు మరో కారణం కూడా ఉంది. అదే  సిట్టింగ్ ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీకి నిలబెట్టడం.  అయితే ఆ విషయం ఇప్పటికీ జగన్ కు అర్ధమైనట్లు కనిపించడం లేదు. 2029 ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న జగన్ ఇప్పుడు కూడా నేతలను సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులోనూ ప్రధానంగా ప్రస్తుతం చిలకలూరి పేట నియోజకవర్గంలో పని చేసుకుంటున్న మాజీ మంత్రి విడదల రజనీని వచ్చే ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే  ఈ విషయాన్ని మాజీ మంత్రి విడదల రజనీకి చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో కూడా చిలకలూరి పేట సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన విడదల రజనిని అక్కడ నుంచి  గుంటూరు పశ్చిమకు మార్చారు. అయితే ఆమె అక్కడ విజయం సాధించలేకపోయారు. అంతకు ముందు 2019 ఎన్నికలలో విడదల రజని చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావుపై విజయం సాధించారు. ఆ తరువాత జగన్ విడదల రజనీకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు ఆమె మంత్రిగా కొనసాగారు. మంత్రి హోదాలోనే గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన రజని ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఆమె పరాజయానికి కారణాలెన్ని ఉన్నా, ఆమె మాత్రం తనను నియోజకవర్గం మార్చడమే పరాజయానికి కారణమని భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతారు. ఓటమి తరువాత  విడదల రజనీ మళ్లీ చిలకలూరి పేటకు వచ్చేశారు. చిలకలూరి పేట క్షేత్రంగానే ఆమె రాజకీయాలు చేస్తున్నారు. జగన్ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 2029 ఎన్నికలలో చిలకలూరిపేట నుంచే పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. అయితే ఇక్కడే జగన్ ఆలోచన వేరుగా ఉంది. రఆమె ఓటమి తర్వాత, రజినీ నిశ్శబ్దంగా చిలకలూరిపేటకు తిరిగి వచ్చి స్థానిక పనిని తిరిగి ప్రారంభించారు. కానీ జగన్ ఇప్పుడు రేపల్లె నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను పోటీకి దింపాలని కోరుకుంటున్నారని సమాచారం. రేపల్లె నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన  అనగాని సత్యప్రసాద్‌ పై విడదల రజనిని పోటీకి నిలబెడితే.. ఆమె ఖాతాలో మరో పరాజయం జమ కావడం ఖాయమని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  
ఇటీవల మరణించిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం (నవంబర్ 6) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సుబ్బానాయుడు, భాను చందర్ వంటి కార్యకర్తలను కోల్పోవడం బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్న లోకేష్ తనకు రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ సబ్బానాయుడితో మంచి పరిచయం, అనుబంధం ఉందన్నారు. సుబ్బానాయుడు అనారోగ్యానికి గురయ్యారని తెలిసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్లు చెప్పిన ఆయన సబ్బానాయుడి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మాలేపాటి కుటుంబానికి అండగా ఉంటానన్నారు. అంతే కాకుండా ఆ కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకువచ్చేందుకు వ్యక్తిగతంగా తాను చేయూతనిస్తానని లోకేష్ చెప్పారు. మాలేపాటి పై దుప్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 
సీనియర్ హీరోయిన్, నటి రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలలో నటించడం చాలా వరకూ తగ్గించేశారు. టీవీ రియాలిటీ షోలలో జడ్జీగా చేసినప్పటికీ.. మంత్రి అయిన తరువాత అదీ మానేశారు. గత ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చినా సినిమాల జోలికి మాత్రం వెళ్లలేదు. అయితే ఇప్పుడు ఆమె ఎబౌట్ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.  ఇప్పుడు ఆమె సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయారు.   తమిళ సినిమా లెనిన్ ఇండియన్ అనే సినిమాతో రోజా వెండితెరపై మళ్లీ కనిపించనున్నారు.  ఈ మేరకు ఆ మూవీ మేకర్స్ రోజా తమ సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.  అంతే కాకుండా సినిమా వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు కూడా. ఇక  రోజా 2013లో   డాటర్ అఫ్ వర్మ అనే   చిత్రంలో చివరిసారిగా నటించారు.  ఇక ఇప్పుడు తమిళమూవీతో రోజా సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే.. ముందు ముందు ఆమె నటిగా మళ్లీ బిజీ అవ్వాలని భావిస్తున్నట్లు తెలు స్తోంది. అయితే ఆమె తెలుగు సినిమాలలోనూ నటిస్తారా? నటిస్తే ఆమెకు వచ్చే అవకా శాలెలాంటివి? అన్న చర్చ అప్పుడే మొదలైంది.  
  జూబ్లీ హిల్స్‌లో సెంటిమెంటో గెలుస్తుందో డెవలప్‌మెంటో గెలుస్తుందో తెలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.షేక్ పేట డివిజన్ పారా మౌంట్ కాలనీలో ముఖ్యమంత్రి ప్రచార సభ నిర్వహించారు. కిషన్ రెడ్డి..ఎందుకు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వొద్దు? నీ అబ్బ జాగీరా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే నీకు ఏం ఇబ్బందని రేవంత్ అన్నారు. రెహమత్ నగర్ లో నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు మైనార్టీలకు అనేక అవకాశాలు కల్పించిందని స్ఫష్టం చేశారు.  కాంగ్రెస్ అంటే ముస్లిం..ముస్లిం అంటే కాంగ్రెస్ అని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో  నేను మూడు సార్లు గెలవడానికి మైనార్టీల సహకారం ఎంతో ఉందని సీఎం అన్నారు. ప్రధాని మోదీ, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కటే అని కేసీఆర్ ప్రతి సారి కేంద్రంలో మోదీకి మద్దతు ఇచ్చాడని రేవంత్ అన్నారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని..బీఆర్ ఎస్ ముస్లిం లను మోసం చేస్తుందని పేర్కొన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ పైన సీబీఐ విచారణ అడిగితే మోదీ పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ కార్ రేస్ కేసు లో కేటీఆర్ అరెస్ట్ కోసం గవర్నర్ అనుమతించడం లేదని తెలిపారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే జూబ్లీ హిల్స్ లో డిపాజిట్  తెచ్చుకోవాలని రేవంత్ సవాల్ విసిరారు. జూబ్లీ హిల్స్ గ్రౌండ్ లో అసలు బీజేపీనే లేదని తెలిపారు.
  మంగళగిరి నియోజకవర్గాల్లో సరిగ్గా గ్రీవెన్స్ నిర్వహించడం లేదని, నాయకులు ప్రజల సమస్యలు సరైన రీతిలో పరిష్కరించివుంటే మంత్రి లోకేష్  ప్రజాదర్బార్ కు 4వేల మంది ఎందుకు వస్తారు అని నాయకులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు మండిపడ్డారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యటించిన ఆయన పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలతో ఆయన మాట్లాడుతూ.. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలి అని ఆదేశించారు.  ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని కోరారు. నవంబర్ 15వ తేది లోపు నియోజకవర్గ కమిటీల నుంచి గ్రామ స్థాయి కమిటీల వరకు పార్టీ నియామకాలు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. 15వ తేది లోపు పూర్తి చేయలేకపోతే జాతీయ అధ్యక్షులు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక సంస్కృతి. క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. కొందరి నాయకుల వలన పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి నాయకులు వారి ప్రవర్తన మార్చుకోవాలని, మరలా పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో పార్టీ నాయకులు సఫలం కావాలి, దానికి తగ్గట్టు నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లో నిర్వహిస్తూ.. క్యాడర్ ను కలుపుకుంటూ.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని సూచించారు. కూటమి నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది.. అందరూ సఖ్యతతో పనిచేయాలి.. సంయమనం పాటించండి.. సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టండంతో పాటు వైసీపీ దుష్ప్రచారాలకు ప్రజలు ప్రభావితం కాకుండా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపై ఉందని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పని చేయండని కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, జోనల్, పార్లమెంట్, నియోజకవర్గ ఇంచార్జులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.  
ALSO ON TELUGUONE N E W S
  సినిమా పేరు: కృష్ణలీల  తారాగణం:  దేవన్, ధన్య బాలకృష్ణ, తులసి,  బబ్లూ పృథ్వీ,వినోద్ కుమార్,గగన్ విహారి    తదితరులు  మ్యూజిక్: భీమ్స్  ఎడిటర్: కార్తీక శ్రీనివాస్  రచన: అనిల్ కిరణ్  దర్శకత్వం: దేవన్  సినిమాటోగ్రాఫర్: సతీష్ ముత్యాల  బ్యానర్ : మహాసెన్ విజువల్స్   నిర్మాత: జ్యోత్స   విడుదల తేదీ: నవంబర్  7  2025  నూతన కథానాయకుడు 'దేవన్'(Devan)స్వీయ దర్శకత్వంలో 'ధన్య బాలకృష్ణ'(Danya Balakrishna)హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ 'కృష్ణలీల'(Krishna leela). ఫాంటసీ, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కడంతో పాటు ప్రచార చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో కృష్ణలీల రిజల్ట్ పట్ల ఆసక్తి ఏర్పడింది. మరి మేకర్స్ మూవీని ఎలా తెరకెక్కించారో చూద్దాం.   కథ విహారి(దేవన్) యోగా ప్రక్రియకి సంబంధించిన ప్రక్రియలో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదిస్తాడు. ఎంతో మంచి వ్యక్తి తో పాటు ఆడవాళ్ళని, పెద్ద వాళ్ళని గౌరవించే మెంటాలిటీ విహారి సొంతం. బృంద(ధన్య బాలకృష్ణ) రాజకీయంగా పెద్ద పలుకుబడి కలిగిన హోమ్ మినిస్టర్(వినోద్ కుమార్) కూతురు. మగవాళ్లంటే చాలా కోపం.అణువణువున అహంకారాన్ని తన ఆభరణంగా మలుచుకున్న యువతి. చిన్నసైజు రౌడీ కూడా. బృంద ని తొలిచూపులోనే విహారి ప్రేమిస్తాడు. పైగా తనకి బృందకి గత జన్మలోనే అనుబంధం ఉందని బలంగా నమ్ముతాడు. కానీ బృంద మాత్రం విహారి ప్రేమ ని యాక్సెప్ట్ చెయ్యదు. ఈ విషయంలో విహారి చావుల దాకా కూడా వెళ్లి వస్తాడు. విహారి ఒక రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి దాక్షాయణి అనే ఒక అమ్మాయిని హత్య చేసానని చెప్తాడు. విహారి హత్య చేసిన దాక్షాయణి ఎవరు? ఎందుకు చంపాడు? ఒక వేళ చేస్తే అందుకు ఏమైనా కారణం ఉందా? దాక్షాయణి ఎవరు? బృంద కి దాక్షాయణి కి సంబంధం ఏంటి? బృంద తో  ప్రేమ ఏమైంది? విహారి ని తన లైఫ్ లోకి ఆహ్వానించిందా? విహారి చెప్తున్న గత  జన్మ ఎంతవరకు నిజం? అసలు కృష్ణలీల అంటే ఏంటి అనేదే చిత్ర కథ ఎనాలసిస్  కృష్ణలీల కి ఎంచుకున్న సబ్జెట్ మంచిదే. కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక మనిషికి, ఇంకో మనిషికి మధ్య ఏర్పడిన అనుబంధం వెనక గత జన్మ ప్రభావం ఉంటుందని చెప్పడం  బాగుంది. కానీ గత జన్మలో జరిగింది తెలుసుకున్న విహారి, బృంద ప్రేమ కోసం పరితపించడాన్ని సీన్స్ గా ఎందుకు ఎస్టాబ్లిష్ చెయ్యలేదో అర్ధం కాదు. సినిమా ఉద్దేశ్యం అదే కదా! అలాంటిది మేకర్స్ ఈ విషయాన్నీ చాలా తేలిగ్గా తీసుకున్నారు. కథకి ఆయువు పాటు గా నిలిచే పాయింట్స్ కి ఎలివేషన్స్ ఇవ్వకుండా చిన్న చిన్న విషయాలని ఎలివేషన్ ఇచ్చారు. సినిమా మొత్తం ఇదే సూత్రాన్ని ఫాలో అవుతు కథనాలకి అన్యాయం చేసారు.    అలా కాకుండా స్క్రిప్ట్ ని పకడ్బందీగా తెరకెక్కించి ఉంటే మంచి చిత్రంగా మిగిలేది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సినిమా ప్రారంభం నుంచి మొదటి పదిహేను నిముషాలు ఎంతో ఇంట్రెస్ట్ కలిగింది. కానీ ఆ తర్వాత నుంచి సినిమా నిదానంగా గాడి తప్పుతు వచ్చింది. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఎందుకు వస్తున్నాయో అర్ధం  కాదు. సన్నివేశాల్లో బలం ఉన్నా కూడా డైలాగ్స్ బాగోకపోవడంతో మెప్పించలేకపోయాయి. టోటల్ గా చెప్పాలంటే విహారి, ఫ్యామిలీ మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రమే బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉంది.    సెకండ్ హాఫ్ లో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. ప్రతి సన్నివేశం  ఇంట్రెస్ట్ గా ఉండటంతో పాటు సినిమా మొత్తానికి కూడా ఫ్లాష్ బ్యాక్ ప్రాణంగా నిలిచింది. మినిస్టర్ ని ట్రాప్ చేసే సన్నివేశం ప్లేస్ మెంట్ కుదరలేదు. ప్రేమ కోసం కోర్టుకి వెళ్లే ఎపిసోడ్ ఎంతో కొత్తగా ఉంది. కానీ సన్నివేశాలుగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యారు.  ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కి సంబంధించిన సన్నివేశాల్లో కూడా ఇదే పరిస్థితి. సీన్ యొక్క ఉద్దేశ్యంలో బలం ఉన్నా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయలేకపోయారు.   నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు విహారిగా, శివస్వామి గా దేవన్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా శివ స్వామిగా సూపర్ గా చేసాడు. కాకపోతే డైలాగ్స్ చెప్పే విషయంలో తడపడ్డాడు. టోటల్ గా పర్లేదనే స్థాయిలో దేవన్  పెర్ ఫార్మెన్స్ ఉంది. దర్శకుడు కూడా తనే కాబట్టి ఆ శాఖలో మెరుపులు లేకపోయినా పర్వాలేదని అనిపించాడు. ధన్య బాలకృష్ణ మాత్రం బృంద, దాక్షాయణి గా రెండు విభిన్నమైన క్యారక్టర్ లలో ఒక రేంజ్ పెర్ ఫార్మెన్సు ని ప్రదర్శించింది. ముఖ్యంగా దాక్షాయణి గా ఎక్సలెంట్. ఆమె ఎన్ని సినిమాలు చేసినా, ఈ క్యారక్టర్ ఆమె సినీ చాట్ లో మెమొరీబుల్ గా మిగిలిపోతుంది. సీనియర్ ఆర్టిస్ట్స్ వినోద్ కుమార్, బబ్లూపృథ్వీ, తులసి లు తమకి నటనలో తిరుగులేదని మరోసారి నిరూపించారు. మిగతా క్యారెక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. హైదరాబాద్ లోని హై కోర్ట్ న్యాయవాది అయిన అనిల్ కిరణ్ కథ విషయంలో సక్సెస్ అయ్యారు. కానీ మాటలు సింక్ అవ్వలేదు. స్క్రీన్ పై పరంగా కూడా తడపడ్డారు. భీమ్స్ (Bheems)నుంచి సాంగ్స్ ఒక మోస్తరుగా పర్వాలేదని అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం నామమాత్రం. నిర్మాణ విలువలు, ఫొటోగ్రఫీ ప్రధాన హైలెట్ గా నిలిచాయి.   ఫైనల్ గా చెప్పాలంటే కథ ముమ్మట్టికి మంచిదే. కానీ కథనం, డైలాగ్స్ విషయంలో మరింత శ్రద్ద వహించాల్సింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్    రేటింగ్ 2 /5                                                                                                           అరుణాచలం        
  సినిమా పేరు: ది గర్ల్ ఫ్రెండ్  తారాగణం:రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి, రాహుల్ రవీంద్రన్ తదితరులు  మ్యూజిక్: హేషం అబ్దుల్ వహబ్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ప్రశాంత్ ఆర్ విహారి ఎడిటర్: చోటా కె ప్రసాద్  రచన, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్  సినిమాటోగ్రాఫర్: కృష్ణన్ వసంత్  బ్యానర్స్  :గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్  నిర్మాత: అల్లు అరవింద్, ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి  విడుదల తేదీ: నవంబర్  7  2025    పాన్ ఇండియా హీరోయిన్ 'రష్మిక'(Rashmika mandanna)ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్(The Girl freind). రిలీజ్ డేట్ ఈ రోజే అయినా సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిన్నటి నుంచే ప్రీమియర్స్ తో పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసింది. మరి మూవీ ఎలా ఉందో  చూద్దాం.   కథ భూమా(రష్మిక) ఎంఏ లిటరేచర్ స్టూడెంట్. కాలేజీ లో చదువుకుంటూ అదే కాలేజీ క్యాంపస్ లోని హాస్టల్ లో ఉంటుంది. నెమ్మదస్తురాలితో పాటు బిడియం, మొహమాటం కలగలిపిన యువతి. ఎడ్యుకేషన్ తప్ప వేరే వ్యాపకం లేదు. విక్కీ (దీక్షిత్ శెట్టి)  అదే కాలేజీలో ఎంఏ సైన్స్ స్టూడెంట్. ప్రతిదీ తన కంట్రోల్ లో ఉండాలనుకునే దుడుకు స్వభావం కలిగిన యువకుడు. దుర్గ(అనూ ఇమ్మాన్యుయేల్) కి ఎప్పట్నుంచో విక్కీ పై క్రష్ ఉంటుంది. విక్కీ మాత్రం భూమాని తన గర్ల్ ఫ్రెండ్ గా నిర్ణయించుకుంటాడు. భూమా లైఫ్ ని  కూడా డిసైడ్ చేస్తుంటాడు. ఆ క్వాలిటీ భూమాకి నచ్చకపోయినా విక్కీ ని బాయ్ ఫ్రెండ్ గా స్వీకరిస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు శారీరకంగా ఒక్కటవ్వుతారు. కానీ ఆ తర్వాత విక్కీ విషయంలో భూమా ఒక నిర్ణయం తీసుకుంటుంది. విక్కీ విషయంలో భూమా తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? ఆ నిర్ణయం తర్వాత భూమా విషయంలో విక్కీ ప్రవర్తన ఏంటి? ఆ ప్రవర్ధన యొక్క తీరు ఎలా ఉంది? ఈ కథలో దుర్గ క్యారక్టర్ పయనం ఎటు? అసలు భూమా పై విక్కీ కి ఉంది ప్రేమేనా! చివరకి భూమా క్యారక్టర్ ఎలా ముగిసింది? అనేదే  ది గర్ల్ ఫ్రెండ్ చిత్ర కథ.   ఎనాలసిస్  ఇలాంటి కథలు ప్రస్తుత జనరేషనే కాదు ఎప్పట్నుంచో వయసులో ఉన్న యువతి యువకుల నిజ జీవితంలో జరుగుతూనే  ఉన్నాయి. వాళ్ళ మధ్య పరిచయాలు ఎలా ఏర్పడతాయి. ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంటున్నపుడు తనకి తెలియకుండానే ఒక అబ్బాయి ఆకర్షణలో పడి దాన్నే ప్రేమ అని ఎలా అనుకుంటుందో కూడా ఈ చిత్రం చెప్పినట్లయింది. ఎందుకంటే నిజమైన ప్రేమ అనేది యువతి యువకుల మధ్య ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా గెలుస్తుంది కదా. అందుకే ఈ కథలోని క్యారెక్టర్స్ మధ్య  ఆకర్షణే కనపడుతుంది.స్త్రీ,పురుషుల మధ్య జరిగే కలయిక ఎంతో పవిత్రమైనది. ఆ కలయికే స్వచ్ఛమైన ప్రేమకి పునాది. ఆ ఇద్దరి నిండు నూరేళ్ళ జీవితానికి కూడా  అంకురార్పణ.   కానీ ఆ కలయిక కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది కథ యొక్క ఉద్దేశ్యం వేరే అయ్యి ఉండవచ్చు. కానీ శారీరకంగా కలిసిన దానికి కూడా జస్టిఫై ఇచ్చి ఉండాల్సింది. అలా ఇవ్వకపోవడం వలన యువతి, యువకులు శారీరకంగా కలవడం పెద్ద తప్పు కాదని చెప్పినట్లయింది. దీంతో ప్రస్తుత సొసైటీ కి రాంగ్ మెసేజ్ వెళ్లే అవకాశం లేకపోలేదు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే భూమా, విక్కీ ల ఇంట్రడక్షన్ సీన్ దగ్గర్నుంచి కాలేజీ లో వచ్చే అన్ని సన్నివేశాలు మనం చాలా సినిమాల్లోనే చూసాం. భూమాని తన గర్ల్ ఫ్రెండ్ గా  చేసుకోవడానికి విక్కీ ఎన్నో ఇబ్బందులని పేస్ చేసినట్టుగా చూపించాల్సింది. ఆ విధంగా చెయ్యకపోవడం వలన విక్కీ పరిచయమవ్వడం ఆలస్యం భూమా అతనితో ట్రావెల్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టుగా అనిపించింది. పైగా భూమాతో ఫ్రెండ్ షిప్ కోసం విక్కీ ఇబ్బందులు పడే ప్రాసెస్ లో  కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ జనరేట్ అయ్యేది.    ఒక సందర్భంలో విక్కీతోనే భూమా మాట్లాడుతు నా కోసం ట్రై చెయ్యకు అసలు పడనని అంటుంది కూడా. విక్కీ తో భయంగా ఉంటునే అతనితో తిరగడం అనేది అంతగా సెట్ అవ్వలేదు. ఇద్దరి మధ్య సూపర్ గా వచ్చిన సీన్స్ కూడా లేవు. దుర్గ క్యారక్టర్ ని కూడా ఎక్కువ ఉపయోగించుకున్నది లేదు. ఇంటర్వెల్ లో పెద్దగా ట్విస్ట్ లేకపోయినా భూమా, విక్కీ తో ట్రావెల్ అవుతున్నాం కాబట్టి బాగానే అనిపిస్తుంది.సెకండ్ హాఫ్ చూసుకుంటే భూమా, విక్కీ మధ్య వచ్చిన సన్నివేశాల్లో కొంచం క్లారిటీ వచ్చింది. ఆ రెండు క్యారెక్టర్స్ ఎలా ముగుస్తాయనే క్యూరియాసిటీ, భూమా తండ్రి రాకతో ఏర్పడింది. కాకపోతే బలమైన సీన్స్ సృష్టించకుండా భావోద్వేగాలకి వాల్యూ ఇవ్వడంతో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు.   ముఖ్యంగా భూమా, ఆమె తండ్రి మధ్య వచ్చే సీన్ తో పాటు ఆ సందర్భంగా తండ్రి చెప్పే డైలాగ్స్ నేటి యువతరానికి గట్టిగానే తగులుతాయి. తండ్రి క్యారక్టర్ ని చివరిదాకా అదే టెంపో తో నడుపుతూ సీన్స్ వచ్చి ఉంటే కొద్దిగా రిలీఫ్ ఉండేది.  ప్రీ క్లైమాక్స్ ని ఇంటర్ వెల్ లోనే సెట్ చేసుకుని భూమా పోరాటం మొదలు పెడితే, నేటి తరం అమ్మాయిలకి దైర్యంగా ఎలా ఉండాలో చెప్పినట్లయ్యేది. ఓవర్ ఆల్ గా సినిమా మొత్తంపై  చూసుకుంటే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి.     నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు భూమా గా రష్మిక మరోసారి తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించింది. తను ఎన్ని సినిమాలు చేసినా గర్ల్ ఫ్రెండ్ మాత్రం తన సినిమాల లిస్ట్ లో ఒక బెస్ట్ మూవీ గా ఉంటుంది. ముఖ్యంగా క్లోజ్ షాట్స్ లో తన యాక్టింగ్ సూపర్. విక్కీ గా దీక్షిత్ శెట్టి(Deekshit Shetty)బాగానే చేసినా తను కాకుండా ఇంకో యువ నటుడు అయితే బాగుండేదేమో. మిగతా పాత్రల గురించి  పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా రావు రమేష్, అను ఇమ్మానియేల్ తమకి ఇచ్చిన క్యారెక్టర్స్ కి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసారు.  హేషం అబ్దుల్ మ్యూజిక్ లో మెరుపులు లేవు. కానీ విహారి అందించిన బిజీఎం మాత్రం క్యారెక్టర్స్ యొక్క భావోద్వేగాలకి మరింతగా ఎలివేషన్ ఇచ్చింది. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran)దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కానీ కథకుడు గా మాత్రం నామమాత్రపు ప్రదర్శననే కనపరిచాడు. నిర్మాణ విలువల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. సినిమా మొత్తాన్ని ఒక కాలేజీ లోనే తెరకెక్కించారు. కాకపోతే ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉండటంతో ఆ ఛాయలు మనకి కనిపించవు. ఎడిటింగ్ ఇంకో ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఫైనల్ గా చెప్పాలంటే ఆసక్తికరమైన కథ అయినా కథనం స్లో గా నడిచింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్. రష్మిక పెర్ ఫార్మెన్స్ ప్రధాన హైలెట్. రేటింగ్ 2 .5 /5                                                                                                                                                                                                                                          అరుణాచలం     
Cast: Rashmika Mandanna, Deekshith Shetty, Anu Emmanuel, Rao Ramesh, Rohini Crew:  Cinematographer by Krishnan Vasant Edited by Chota k Prasad Music by Hesham Abdul Wahab, Prashanth Vihari (BGM) Written & Directed by Rahul Ravindran Produced by Dheeraj Mogilineni, Koppineedi Vidya, Allu Aravind  Rashmika Mandanna has developed into a huge star who can drive films on her name and star status. The Girlfriend is her big brave attempt to test the waters of being the leading lady, who completely carries the film on her shoulders. Rahul Ravindran after debuting with Chi.La.Sow and facing a debacle like Manmadhudu 2, he is back to director's chair with this film. The movie released now and let's discuss about the movie in detail.  Plot:  Bhuma Devi (Rashmika Mandanna) joins MA in Hyderabad college after requesting her father (Rao Ramesh) for over an year. She is a studious person and very sensitive, apologetic, innocent and highly fearful. She has very low confidence to speak. Vikram (Deekshith Shetty), the college stud, falls in love with her looking at her behaviour.   He sees his mother (Rohini) in her. While she is hesitant, he makes her fall for him and takes the first step of kissing her. Slowly, she starts to understand his toxic behaviour and unable to get out of the relationship, feels suffocated. Durga (Anu Emmanuel) tries to help her but can she? Watch the movie to know more.  Analysis:  Rashmika Mandanna is a capable performer and she tried to prove it in this The Girlfriend very honestly. She sincerely owned the character but did not really own the screen. The problem lies in writing too, as it overstretches sequences rather than getting to the point. Hence, even she had to sustain too much that it feels like she is asked to do just one thing till the end.  Deekhisth Shetty is good as a toxic masculine man and sincere, in his portrayal. He did not get very dynamic role and rather it feels monotonic and slightly unbelievable at places. Still, he carried it confidently. Anu Emmanuel is good in her brief role and Rohini owned the screen in her cameo. Rao Ramesh is also good but even character lacks proper writing.  Technically, the movie is well shot and frames have been lit up aesthetically. You can observe tardiness with Vikram and very hesitant and fearful nature of Rashmika being matched with colors, she pick to wear too, as the character. There are symbolisms and intentful changes in art depictions. While the things in the background are being set up well, the explicit narrative needed some scenes to bring them in a more convincing manner.  You can understand that a very shy and hesitant person has to open up but without hesitation, she tends to injuries of Vikram. Later, we see her trying to be less sensitive towards her classmate. There is no indication for what sort of happiness she is gaining from the relationship as well. So, the film feels monotonic in its approach in trying to tell the same point repeatedly.  As a director Rahul Ravidran stayed true to his material and delivered what can be called as film that tries to tell a strong and necessary point but in a very convoluted and slightly draggy way that we harms its ambition. Overall, the performances, technical values and BGM by Prashanth Vihari and songs by Hesham Abdul Wahab make it a decent even film with no emotional connect.  Bottomline:  Misses the gut wrenching punch that the story needs for audiences to route to this Girlfriend.  Rating: 2.5/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
Cast: Thiruveer, Teena Sravya, Rohan Roy, Narendra Ravi, Yamini Nageswar, Waltair Vinay, Prabhavathi Crew:  Music by Suresh Bobbili Cinematography by Soma Sekhar Edited by Naresh Adupa  Written and Directed by Rahul Srinivas Produced by Agaram Sandeep Thiruveer has been one of the highly talented young actors who is making good impression among audiences with his content choices. His rural based comedy The Great Pre-Wedding Show released on 7th November, with a promise to deliver healthy entertainment about pre-wedding shoots trend. Let's discuss about this entertainer that aims to be a satirical take on growing trends.  Plot:  Ramesh (Thiruveer) runs a photography shop in a village and he situates it opposite to a Village Panchayat Office. He falls in love with Hema (Teena Sharvya), an employee in Panchyat and he tries to woe her. He has a lazy assistant Ram Charan (Rohan Roy) and due to him, Ramesh tends to end up in trouble. Still, he trusts him and works with the young boy. A Mandal Chairperson nephew Anand (Narendra Ravi) asks Ramesh to conduct Pre-wedding shoot for him with his fiance Soundarya (Yamini Nageswar).  After spending a good amount of Rs.2 Lakhs on the shoot, Ramesh handovers the memory chip to his assistant and the boy misplaces it at an open field. Unable to find it right away, Ramesh tries to cancel Anand and Soundarya's wedding. On the other hand, Anand and Soundarya, fall in love with each other as they start believing that they are made for each other and soulmates. Will Ramesh be able to separate them? If he fails, can he convince Anand about missing video files? What will he do to escape from this typical situation? Watch the movie to know more.  Analysis:  Thiruveer and Teena Sharya are good in their performances. Mainly, their silent chemistry is engaging to look. Narendra Ravi and Yamini Nageswar are surprise package in the film. Narendra, especially, is good in bringing typical villager from godavari districts energy to the screen. His innocence and sincerity are engaging to watch. Rohan is also good in bringing few laughs.  The writing in the movie tough is uneven and tends to go through highs and lows too much. While few moments click big time, some tend to drag a little too much. The movie entertains in the first hour with the typical characters and their behaviours. The set-up is well executed too. It makes us feel like we are watching a simple, fun entertainer.  But the second half tends to drag the point, a little too much and feels slightly exhausting. Still, the heartful ending moments and overall innocence of characters make it watchable. While the music is not so memorable, it doesn't hurt while hearing too. Production values are decent and apt for the story. Technically, movie doesn't aim too high while sound design, usage of sound could have been much better.  Overall, this movie is not something that tries to oversell the point and it also doesn't fully utilise its potential. With certain flaws in writing, it does struggle but it delivers on comical front and becomes a watchable film.    Bottomline:  An enjoyable film with certain flaws in narrative.     Rating: 2.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  సినిమా పేరు: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో తారాగణం: తిరువీర్, టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని, మాస్టర్ రోషన్ తదితరులు  మ్యూజిక్: సురేష్ బొబ్బిలి  ఎడిటర్: నరేష్ అడపా రచన, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్  సినిమాటోగ్రాఫర్: సోమశేఖర్ బ్యానర్స్  : పప్పెట్ షో ప్రొడక్షన్, 7పీఎం ప్రొడక్షన్ నిర్మాత: సందీప్ అగరం విడుదల తేదీ: నవంబర్  7  2025  తిరువీర్, టీనా శ్రావ్య జంటగా చేసిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'(The great pre wedding show)థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో మూవీ లవర్స్ 'వెడ్డింగ్ షో' పై తమ ఫోకస్ ని ఉంచారు. సినిమాపై నమ్మకంతో రిలీజ్ కి రెండు రోజుల ముందే మేకర్స్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.   కథ రమేష్ (తిరువీర్) శ్రీకాకుళంలోని ఒక రూరల్ విలేజ్ లో చిన్నసైజు ఫోటో స్టూడియోతో పాటు జిరాక్స్ సెంటర్ నడుపుతుంటాడు. మొహమాటం,బిడియం,భయం రమేష్ లో   పోటాపోటీగా ఉంటాయి. తన షాప్ ఎదురు పంచాయితీ ఆఫీస్ లో పని చేసే హేమ(టీనా శ్రావ్య) అంటే రమేష్ కి చాలా ఇష్టం. మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన హేమకి కూడా రమేష్ అంటే ఇష్టం. కళ్లతోనే ప్రేమించుకుంటు ఉంటారు. కానీ ఒకరికొకరు ఆ విషయాన్నీచెప్పుకోరు. ఆనంద్( నరేంద్ర రవి) చిన్నసైజు పొలిటికల్ లీడర్ తో పాటు  మండల పరిషత్ అధ్యక్షుడికి కుడి భుజం. సౌందర్య( యామిని) తో ఆనంద్ కి పెళ్లి నిశ్చయమవుతుంది. పెళ్లి చూపుల్లోనే ప్రేమలో పడతారు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ వీడియో తీసుకోవాలని రమేష్ ని సంప్రదిస్తారు. రమేష్ మాత్రం ఆ ఇద్దరి పెళ్లి చెడకొట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో ఆనంద్ ని, నీప్రేమలో పడేలా చెయ్యమని హేమని కోరతాడు.హేమ కూడా ఒప్పుకుంటుంది. రమేష్ ఎందుకు ఆనంద్, సౌందర్యల పెళ్లి చెడగొట్టాలని అనుకున్నాడు? అందుకు కారణం ఏంటి? హేమని ఉపయోగించుకొని పెళ్లి చెడగొట్టడంలో సక్సెస్ అయ్యాడా ? అసలు ప్రీ వెడ్డింగ్ వీడియో తీసాడా? రమేష్,హేమ ప్రేమ ఏమైంది?  ఆనంద్, సౌందర్యల పెళ్లి ఏమైంది? అనేదే చిత్ర కథ   ఎనాలసిస్  ముమ్మాటికీ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిన్న సినిమాని తెరకెక్కించాలనుకునే వాళ్లకి ఇన్ స్పైర్ ఇస్తుందని చెప్పవచ్చు. చిత్ర కథ కూడా చాలా నేచురల్ గా ఉంది. కానీ కథనాల విషయంలో మరింత లోతుగా వెళ్ళలేదు. ఆ అవకాశం ఉన్నా కూడా మేకర్స్ ఆ దిశగా ఆలోచించలేదు. తూ తూ మంత్రంగా డైలాగ్స్ తో ముగించేశారు. కాకపోతే మూవీ అయితే బోర్ అనేది రాదు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే రమేష్,హేమ మధ్య వచ్చిన సన్నివేశాలతో పాటు, అసిస్టెంట్ రోషన్ సన్నివేశాలతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆనంద్ క్యారక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ బాగుంది. ఆనంద్, సౌందర్య తో వచ్చిన సీన్స్ కూడా బాగున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ సన్నివేశాలు కూడా సూపర్ గా వచ్చి నవ్వులని పూయిస్తాయి. ప్రీ వెడ్డింగ్ లో జరిగిన ఒక మిస్టేక్ తో ఆ ఇద్దరి పెళ్లిని రమేష్ ఆపాలని అనుకోవడం బాగుంది.   కానీ అందుకు సంబంధించిన ప్రయత్నాలు సినిమా టిక్ గా లేవు. డాక్యుమెంటరీ సీన్స్ లాగా సాగాయి. ఆనంద్ ని ప్రేమలోకి దించమని హేమకి చెప్పాడు కాబట్టి, హేమ ప్రేమలోకి  ఆనంద్ నిదానంగా వస్తున్నాడని చెప్పి ఎంటర్ టైన్ మెంట్ కోణంలో కన్ఫ్యుస్  డ్రామాని క్రియేట్ చెయ్యాల్సింది. ఆ విధంగా చేసుంటే సరికొత్త లుక్ వచ్చి ఉండేది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో పాటు మిగతా ట్విస్ట్ ల విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు.   రమేష్ లో ఉన్న మంచి తనాన్ని, అమాయకత్వాన్ని,భయాన్ని కొన్ని సీన్స్ ద్వారా చెప్పుండాల్సింది. ఆ విధంగా చేసి ఉంటే రమేష్ అనుకున్న నిర్ణయానికి మరింత జస్టిఫై వచ్చి ఉండేది. సెకండ్ హాఫ్ లో అయినా కథనం విషయంలో మరింత లోతుగా వెళ్తారేమో అనుకుంటాం. కానీ సాదా సీదాగానే ముగించేశారు. రమేష్, హేమ ల లవ్ ని ఎస్టాబ్లిష్ చెయ్యడంతో పాటు, ఆనంద్ ఫ్యామిలీ మధ్య ఎంటర్ టైన్ మెంట్ ని మరింతగా ఎస్టాబ్లిష్ చెయ్యాలిసింది. ప్రీ క్లైమాక్స్,  క్లైమాక్స్ బాగున్నాయి.   నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు రమేష్ క్యారక్టర్ లో 'తిరువీర్'(Thiruveer)పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. సదరు క్యారక్టర్ తన కోసమే పుట్టిందా అనేలా తన క్యారక్టర్ కి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేసాడు. కాకపోతే నటనలో భిన్న పార్శ్యాలని ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. హేమ క్యారక్టర్ లో టీనా శ్రావ్య(Teena Sravya)తన పాత్ర పరిధి మేరకు ఎక్కువ డోస్ లేకుండా ఎంత వరకు పెర్ ఫార్మ్ ని ప్రదర్శించాలో అంతవరకు ప్రదర్శించింది. నరేంద్ర రవి, యామిని కూడా తమ నటనతో మెస్మరైజ్ చేసారు. ముఖ్యంగా నరేంద్ర రవి అయితే శ్రీకాకుళం ప్రాంతంలోని ప్రజల్లో ఉండే కల్లా కపటం లేని మంచితనం, అమాయకత్వం, చిరు కోపాన్ని పర్ఫెక్ట్ గా ప్రదర్శించాడు.   రమేష్ అసిస్టెంట్ గా చేసిన మాస్టర్ రోషన్ మరోసారి విజృంభించాడు. మిగతా క్యారెక్టర్స్ గురించి పెద్గగా చెప్పుకోవాల్సిన పని లేదు. టెక్నికల్ పరంగా చూసుకుంటే ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. శ్రీకాకుళం ఏరియాకి చెందిన ప్రకృతి అందాలని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. రాహుల్ శ్రీనివాస్(Rahul Srinivas)దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కానీ రచయితగా పెద్దగా మెప్పించలేక పోయాడు. నిర్మాణ విలువలు అంతగా బాగోలేదు.   ఫైనల్ గా చెప్పాలంటే నటీనటులు తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించారు. ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంటర్ టైన్ మెంట్ కోణంలో కథనం సాగింది.        రేటింగ్ 2 .75 /5                                                                                                                                                                                                      అరుణాచలం   
Mass ka Das Vishwak Sen has announced his funny collaboration with KV Anudeep, who made Jathi Ratnalu. The movie Funky, teaser looked fun and interesting as it offered whacky storytelling of the director with raw energy of Vishwak. Now, the makers have locked the release date as 3rd April, 2026.  Makers are calling it as a wild ride with bigger, louder and crazier gags. Currently, the movie shoot is going on and Kayadu Lohar, is playing the leading lady role. Vishwak Sen is playing the role of a director within the film, sporting an exciting new look and attitude.  The Million dollar question is that both Vishwak and Anudeep need a big blockbuster comeback in theatres. Previous year, turned out to be abysmal for the actor with Laila, being his most trolled and highly criticised film. He needs this new-age comedy to stick with audiences like Jathi Ratnalu.  On the other hand, Anudeep did not meet the expectations with Prince starring Sivakarthikeyan, while some sequences have developed good fan following. It is important for him and the actor to deliver a Funky Comeback at the box office for Summer 2026 season. Even producer Naga Vamsi needs a turnaround after recent setbacks like Kingdom and Mass Jathara. Let's see how it performs.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  పదేళ్ల తర్వాత రోజా రీ ఎంట్రీ డీ గ్లామర్ రోల్ తో సర్ ప్రైజ్ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా?   సినీ రంగంలో నటిగా తనదైన ముద్ర వేసిన ఆర్కే రోజా (RK Roja).. రాజకీయాల్లోనూ రాణించారు. రాజకీయాలతో బిజీగా ఉండటంతో.. దశాబ్దం పాటు సినిమాలకు దూరమయ్యారు. టీవీ షోలలో మాత్రం బాగానే మెరిశారు. అలా రాజకీయాలతో సినిమాలకు దూరమైన రోజా, ఇప్పుడు మళ్ళీ సిల్వర్ స్క్రీన్ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా డీ గ్లామర్ రోల్ తో కావడం విశేషం.   1991లో వచ్చిన 'ప్రేమ తపస్సు' సినిమాతో కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టిన రోజా.. వరుస సినిమాలతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు పొందారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ తనదైన ముద్ర వేశారు. అలాంటి రోజా.. రాజకీయాల్లోకి వెళ్ళి, సినిమాలకు దూరమయ్యారు. తెలుగులో ఆమె చివరి చిత్రం 2013లో వచ్చిన 'D/O వర్మ' కాగా, తమిళ్ లో ఆమె చివరి చిత్రం 2015లో వచ్చిన 'ఎన్ వళి తని వళి'. అలా పదేళ్ళుగా నటనకు దూరమైన రోజా.. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు.   డీడీ బాలచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'లెనిన్ పాండ్యన్' అనే తమిళ సినిమాతో రోజా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా నుండి తాజాగా ఆమె లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. సంతానం అనే డీ గ్లామర్ రోల్ చేస్తున్నారు రోజా. పేద కుటుంబానికి చెందిన వయసైపోయిన పెద్దావిడలా కనిపిస్తున్నారు. బయట చీరకట్టు, గంభీరమైన మాట తీరుతో పవర్ ఫుల్ గా కనిపించే రోజాను.. ఈ పాత్రలో ఆడియన్స్ ఎలా రివీస్ చేసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే, రోజా తన రీ ఎంట్రీ కోసం తెలుగుని కాకుండా తమిళ్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటనే చర్చ కూడా జరుగుతోంది.    Also Read: 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ఫస్ట్ రివ్యూ!   2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ తరపున నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రోజా. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాజకీయాల్లో, అందునా మంత్రిగా ఉన్నప్పుడు.. మెగా, నందమూరి కుటుంబాలతో పాటు ఎందరో సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తూ రోజా దారుణ విమర్శలు చేశారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా.. సినీ అభిమానుల్లోనూ ఆమె పట్ల వ్యతిరేకత కనిపించింది. అందుకే, తెలుగునాట నటిగా మునుపటి ఆదరణ ఉండకపోవచ్చనే ఉద్దేశంతోనే.. రోజా తన రీ ఎంట్రీ కోసం టాలీవుడ్ ని కాకుండా కోలీవుడ్ ని ఎంచుకొని ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     చూద్దాం మరి, రీ-ఎంట్రీ రోజాకు ఏ మేరకు కలిసొస్తుందో. ఒకవేళ ఆ సినిమా తెలుగులోకి డబ్ అయితే.. ఇక్కడి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి కూడా నెలకొంది.   https://www.instagram.com/reel/DQqi3grEV-n/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==  
Kaantha starring Dulquer Salmaan, Samuthirakani, Bhagyashri Borse and Rana Daggubati trailer has been unveiled today. The makers have showcased the bygone era of South Indian Cinema, situated in Madras, with meticulous dedication and commitment. They twisted the real incidents in a dynamic way.  The movie is based on Tamil first superstar ML Bhagavatar, facing allegations of murder and conspiracy. He had to suffer 7 years before acquittal from the case and all charges. Kaantha adds a dynamic twist of ego clashes between Dulquer Salmaan, who is playing the leading role based on Bhagvatar and his mentor Samuthirakani.  Dulquer insists of shadow directing the film going against his mentor on his own sets. We see his attraction towards Bhagyashri Borse and her performance doesn't really match old world charm while look does. Rana Daggubati is good and cool as an inspector who takes over the sets and investigates in his style.  Selvamani Selvaraj engrosses audiences with his vision and production design is apt to the era. But can this film be another Mahanati or not, we have to wait and see. Dulquer Salmaan and Rana have produced the film and it is releasing on 14th November in Telugu, Tamil and Malayalam languages.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
KGF has become the most popular franchise with each character garnering big praise for the way they have been crafted and written. Actors earned good fame and Yash, became a nation-wide sensation as Rocky Bhai. A shocking news surfaced stating that Harish Rai, the actor who played Qasim Chaha, passed away.  Harish Rai had been suffering with thyroid cancer from past few years and he had been getting treatment for the same. Today, he passed away due to complications of the cancer. Harish made a good name as Don Roy in 1995 cult classic OM, and later, he acted in many films but made good name with KGF.  Harish openly accepted that he is suffering with the cancer and many actors have helped him financially, too. Unfortunately, he couldn't recover from the severity of the health issues.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కేజీఎఫ్ నటుడు హరీష్ రాయ్ కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన.. నేడు(గురువారం) తుదిశ్వాస విడిచారు. (Harish Rai)   1995 లో వచ్చిన కన్నడ కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ 'ఓం'లో డాన్ రాయ్ గా మంచి గుర్తింపు పొందారు హరీష్ రాయ్. ఇక 'కేజీఎఫ్'లో ఆయన పోషించిన ఖాసీం చాచా పాత్ర పాన్ ఇండియా ప్రేక్షకులను చేరువ చేసింది.      హరీష్ రాయ్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తనను ఆదుకోవాలని హరీష్ కోరగా.. కొందరు కన్నడ సినీ ప్రముఖులు ముందుకొచ్చి, తోచిన సాయం చేశారు.    చికిత్స తీసుకున్నప్పటికీ హరీష్ ఆరోగ్యం మెరుగు పడలేదు. క్యాన్సర్ మహమ్మారి ఆయనను మింగేసింది. హరీష్ రాయ్ మృతి వార్త తెలిసి.. సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
అనగనగా ఓ మధ్యతరగతి ఉద్యోగి. అతను రోజూ తన కార్యాలయానికి వెళ్తూ వస్తూ దారిలో కనిపించే విశేషాలను గమనిస్తూ ఉండేవాడు. అంతా బాగానే ఉండేది కానీ, దారి మధ్యలో కనిపించే ఆ రాజభవనాన్ని చూడగానే ఉద్యోగి మనసు కలుక్కుమనేది. ‘ఆహా! హాయిగా ఆ రాజకుటుంబంలో పుట్టినా బాగుండేది, ఎలాంటి కష్టమూ లేకుండా పట్టుపరుపుల మీద నుంచే అష్టైశ్వార్యాలూ అనుభవించవచ్చు’ అంటూ తెగ ఈర్ష్యపడిపోయేవాడు ఉద్యోగి. రాజకుటుంబం సంగతేమో కానీ ఈ ఉద్యోగిని చూసి అసూయపడేవారు కూడా లేకపోలేదు. రోజూ ఉదయాన్నే ఠంచనుగా ఉద్యోగి గొడుగుని ఊపుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక పళ్ల దుకాణం వాడు అతణ్నే గమనిస్తూ ఉండేవాడు. ‘ఛీ వెధవ బతుకు! చిన్నప్పుడు మా నాన్న మాట విని బుద్ధిగా చదువుకుని ఉంటే హాయిగా ఆ ఉద్యోగిలాగా ఉండేవాడిని కదా! ఉద్యోగం ఉంటే దర్జాగా బతకవచ్చు’ అనుకునేవాడు దుకాణదారుడు.  ఇదిలా ఉండగా ఉద్యోగికి ఓసారి అరుదైన అవకాశం దక్కింది. కార్యాలయం తరఫున యువరాజుని కలిసి కొన్ని సంతకాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ మాట వినగానే ఉద్యోగి ఎగిరి గంతేశాడు. ‘తను ఎప్పటికీ ఆ భోగాలను అనుభవించలేడు. కనీసం వాటిని ఒక రోజు పాటు దగ్గరగా చూసే అవకాశం వచ్చింది కదా!’ అనుకున్నాడు. రాజభవనంలో తన సమయం ఎలా గడవబోతోందో తెగ ఊహించుకోసాగాడు ఉద్యోగి. అతని ఊహలతో పని లేకుండా ఆ రోజు రానే వచ్చింది. తనకున్న వాటిలో బాగున్న దుస్తులను వేసుకుని, తలని ఒకటికి పదిసార్లు దువ్వుకుని రాజభవనానికి బయల్దేరాడు ఉద్యోగి. ఉద్యోగి రాక గురించి వినగానే యువరాజుగారు నేరుగా అతణ్ని తన మందిరానికి పంపించమన్నారు. యువరాజుగారు పట్టుపరుపు మీద పడుకునో, అలంకరించుకుంటూనో ఉంటారనుకుంటూ బెరుకుగా ఆ గదిలోకి అడుగుపెట్టిన ఉద్యోగికి ఆయన కిటికీ దగ్గర నిల్చొని కనిపించారు. ‘యువరాజా! నేను మీ సంతకాల కోసం వచ్చాను’ అని ఉద్యోగి ఒకటికి రెండుసార్లు చెప్పినా యువరాజుగారు వినిపించుకోలేదు. ఇక లాభం లేదని ఉద్యోగి ఆయనకు దగ్గరగా వెళ్లి చూస్తే ఏముంది… యువరాజుగారు తీక్షణంగా ఆ పళ్లు అమ్ముకునేవాడినే చూస్తున్నారు. ‘యువరాజా! అతనేమన్నా అపచారం చేశాడా? అంత తీక్షణంగా చూస్తున్నారు?’ అంటూ కాస్త చొరవగా అడిగాడు ఉద్యోగి.  ‘అపచారమా పాడా! అతణ్ని చూసినప్పుడల్లా నాకు మహా అసూయగా ఉంటుంది. హాయిగా ఏ రోజుకారోజు కాయకష్టం చేసకుంటూ, వచ్చినదానితో తృప్తిగా బతుకుతూ, భవిష్యత్తు గురించి ఎలాంటి బాధా లేకుండా ఉండే అతని జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో కదా! కావాలంటే దుకాణాన్ని తీసి ఉంచుతాడు, లేకపోతే మధ్యలోనే కట్టేసి తన భార్యాపిల్లలతో కలిసి షికారుకి వెళ్లిపోతాడు. అంత స్వేచ్ఛగా, సాదాసీదాగా జీవించడంలో ఉన్న ఆనందం బందిఖానాలాంటి ఈ రాజభవనంలో ఎక్కడ ఉంటుంది,’ అంటూ నిట్టూర్చారు యువరాజులవారు. యువరాజులవారి మాటలు విన్న ఉద్యోగికి ఏదో కొత్త విషయం బోధపడింది. సుఖానికీ, సంతోషానికీ ఉన్న వ్యత్యాసం తెలిసి వచ్చింది. మరి అదే విషయం దుకాణదారుడుకి ఎప్పుడు తెలిసివస్తుందో!
  జీవితంలో ప్రతి ఒక్కరికీ నిర్వర్తించే వృత్తి చాలా కీలకమైనది.  జీవితం గడవడానికి ఆ వృత్తే సంపాదనను అందిస్తుంది. ప్రతి వ్యక్తి రోజులో సింహభాగం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలోనే గడుస్తుంది.  అయితే ఆఫీసులో ఒత్తిడి,  చిరాకు వంటి సaమస్యలు చాలా సాధారణంగా ఉంటాయి.  వీటిని కొందరు తేలికగా తీసుకుని చాలా ఈజీగా డీల్ చేస్తే.. మరికొందరు ఒత్తిడి,  చిరాకు వంటి విషయాలకు చాలా అతిగా రియాక్ట్ అవుతుంటారు. ఇలా ఆఫీసులో చిరాకు,  ఒత్తిడి కలగడం వల్ల ఉద్యోగులకు మనోబలం తగ్గుతుంది. ఆఫీసులలో చాలా అనుకువగా పనిచేసే ఉద్యోగులు,  పై అధికారులు ఎక్కువగా అధిపత్యం చెలాయించే ఉద్యోగులు కొందరు ఉంటారు. ఇలాంటి వారికి ఆఫీసులో ఉద్యోగపరంగా ఆసక్తి కోల్పోతుంటారు.  ఈ ఆసక్తి తగ్గడం కారణంగా ఉద్యోగుల పని నాణ్యత,  వారి పని చేసే తీరు మారిపోతుంది. సాధారణంగా చేసే పనిని నిర్ణీత గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుని పని చేస్తుంటారు. నిరుత్సాహం వల్ల తమ పని మీద ఆత్మవిశ్వాసం కూడా కోల్పోతుంటారు.   ఉద్యోగస్థులు తమ పని మీద నిర్లక్ష్యంగా ఉండటం,  వారి పనిలో ప్రతి కూల ప్రభావం పడటం వంటివి జరగడం వల్ల వారు ఉత్తమ ఉద్యోగులు అనే ట్యాగ్ ను కోల్పోతారు. ఆఫీసులో చిరాకు,  ఒత్తిడి అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటే అక్కడ సరైన వాతావరణం,  ఉద్యోగులను ట్రీట్ చేస్తున్న తీరు సరిగా లేదని అర్థం.  దీని వల్ల ఉద్యోగులు పని  చేస్తున్న చోటు నుండి వెళ్లిపోయే ఆలోచనలో ఉంటారు.  ఇది సంస్థలకు చాలా నష్టం తెచ్చిపెడుతుంది. ఆఫీసులో ఎదురయ్యే చిరాకులు,  ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలా మంది ఉద్యోగులు తమ తోటి ఉద్యోగులతో తప్పుగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  దీని వల్ల పని చేసే వాతావరణం  అనారోగ్యకరంగా మారుతుంది. చాలా కాలం పాటు ఉద్యోగుల మద్య గొడవలు,  నిరాశ,   ఒత్తిడి, చిరాకు వంటివి కొనసాగుతుంటే..  అవి మానసిక సమస్యలకు దారితీస్తాయి. ఉద్యోగులలో కోపం,  రక్తపోటు సమస్యలు,  మధుమేహం వంటివి కూడా ఇలాంటి సమస్యల వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కంపెనీలు ఉద్యోగులను పని యంత్రాలుగా చూస్తుంటాయి.  అలాంటి చోట్ల ఉద్యోగస్థులు చాలా ఎక్కువ వైఫల్యం అవుతుంటారు. అలా కాకుండా కంపెనీలు ఉద్యోగస్థుల మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. కంపెనీలు ఉద్యోగుల మానసిక ఉత్తేజాన్ని ఇచ్చే కార్యాకలాపాలను కూడా చేపడుతుండాలి. అపుడే ఉద్యోగస్థులు మానసికంగా బలంగా ఉండి సంస్థ కార్యకలాపాలు సమర్థవంతంగా చేయగలుగుతారు.                                       *రూపశ్రీ
దాంపత్య జీవితం అనేది ఇద్దరి మధ్య ఉండే ఒక పవిత్ర బంధం. ఇది శరీర సంబంధం మాత్రమే కాదు..  ప్రేమ, నమ్మకం, కమ్యునికేషన్,  బాధ్యత, గౌరవం అనే ఐదు స్థంభాల మీద నిలబడే సంబంధం. చాలావరకు భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం గురించి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొందరేమో భార్యాభర్తల గొడవ, సమస్య మూడవ వ్యక్తికి చెప్పడం వల్ల.. ఆ మూడవ వ్యక్తి భార్యాభర్తలను కూర్చోబెట్టి, వారి మధ్య అపార్థాలు తొలగిస్తారు అని అంటుంటారు. కానీ చాలామంది మాత్రం మూడవ వ్యక్తి జోక్యం వల్ల భార్యాభర్తల బంధం విచ్ఛిన్నం అవుతుంది అంటుంటారు.  భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం గురించి.. కలిగే పర్యవసానాలు గురించి తెలుసుకుంటే..  “మూడవ వ్యక్తి జోక్యం” అంటే.. భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలలో, ఎమోషన్ పరిస్థితులలో, నిర్ణయాలలో, కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు లేదా ఎవరైనా ఇతర వ్యక్తి ప్రభావం చూపించడం. అలాంటి వ్యక్తులనే థర్డ్ పర్సన్ అని అంటారు. ఈ “మూడవ వ్యక్తి” ఎప్పుడూ చెడు ఉద్దేశంతో ఉండకపోవచ్చు. కానీ సమస్య ఏమిటంటే, ఆ మూడవ వ్యక్తి దంపతుల మధ్య ఉన్న నిజమైన అభిప్రాయాలు, ఆలోచనలు, పరిస్థితులు, అనుభవాలను అర్థం చేసుకోలేరు. దాంతో వాదన పెద్దదవుతుంది, అనుమానం పెరుగుతుంది, ప్రేమ తగ్గుతుంది. మూడవ వ్యక్తి జోక్యం ఉంటే ఏమవుతుంది? భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం పాయిజన్ లా పనిచేస్తుందని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటంటే..  నమ్మకం దెబ్బతింటుంది.. భార్యకు లేదా భర్తకు “వారి మాట వినడం కంటే బయట వాళ్ల మాట ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు” అన్న భావన వస్తుంది. ఇది నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ప్రైవసీ ఉండదు..  దంపతుల మధ్య జరిగిన విషయాలు మూడవ వ్యక్తి వద్దకి వెళ్లడం వల్ల “ప్రైవసీ” కోల్పోతుంది. అది తర్వాత చాలా దారుణంగా మారుతుంది. ప్రతి చిన్న విషయాన్ని చెప్పుకోవడం, చర్చించడం, తప్పుగా అర్థం చేసుకోవడం వంటి  సమస్యలను పదే పదే తెస్తుంది. నిర్ణయాలు దెబ్బతింటాయి.. మూడవ వ్యక్తి అభిప్రాయం విని తీసుకున్న నిర్ణయాలు చాలా సార్లు అసలైన పరిస్థితికి దూరంగా ఉంటాయి. ఎందుకంటే మూడవ వ్యక్తికి ఎప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న సమస్య, పరిస్థితి 100% అర్థం కాదు.  ఎదురు వ్యక్తులు వారి అనుభవాల పరంగా నిర్ణయాలు చెబుతారు.  కోపం, అసహనం, దూరం పెరుగుతాయి.. ప్రతి వాదనలో “వాళ్లు అలా చెప్పారు” అనే పదం వస్తే, దంపతుల మధ్య దూరం పెరుగుతుంది.  అది క్రమంగా బంధం చేదిపోవడానికి సారి తీస్తుంది.   బ్రేకప్ అయ్యే ప్రమాదం.. మూడవ వ్యక్తి ఎక్కువగా  జోక్యం చేసుకోవడం వల్ల ఒక దశలో నమ్మకం పూర్తిగా పోతుంది. ఇది విడాకులకు కూడా దారి తీస్తుంది. *రూపశ్రీ.
  నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా అవసరం.  ఒక వాహనానికి ఇంధనం ఎలాగో.. శరీరానికి నీరు కూడా అలాగే చాలా అవసరం.  చాలా మంది నీరు బాగా తాగాలి అని చెబుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ నీరు తాగితే చాలా నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అంటున్నారు వైద్యులు.  ఇంతకీ నీరు ఎక్కువ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుంటే.. ఎక్కువ నీరు తాగమని తరచుగా చాలామంది సలహాలు ఇస్తుంటారు. అయితే నీరు ఎక్కువ తాగితే శరీరానికి చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు.  ఆహార నిపుణులు కూడా. ఎక్కువ నీరు తాగడం వల్ల నీటి మత్తుకు దారి తీస్తుందని అంటున్నారు.  నీరు ఎక్కువగా తాగినప్పుడు రక్తంలో సోడియం స్థాయిలు తగ్గుతాయట.  దీని వల్ల శరీరం ఒకానొక మత్తు స్థితిలోకి జారుకుంటుంది. అందుకే శరీరానికి మంచిది అనే అపోహలో నీరు ఎడాపెడా తాగకూడదు. శరీరానికి సోడియం అవసరం చాలా ఉంది. ఇది శరీరంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది.  ఇది మెదడు, కండరాలు,  నరాలు సరిగ్గా పనిచేయడానికి చాలా అవసరం.  అలాంటి సోడియం శరీరంలో ద్రవాల సమతుల్యతను కూడా కాపాడుతుంది.  కాబట్టి సోడియం స్థాయి తగ్గిపోతే శరీరం మత్తులోకి జారుతుంది. రక్తంలో సోడియం స్థాయిలు తగ్గిపోతే అది శరీరంపై ఇతర ప్రభావాలు కూడా చూపిస్తుంది.  ముఖ్యంగా తలనొప్పి,  తలతిరగటం,  వాంతులు,  అలసట వంటి సమస్యలే కాకుండా బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నీటిని ఎక్కువ తాగడం వల్ల మెదడులో నరాలు ఒత్తిడికి లోనవుతాయి. ఇది మెదడు పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది.  కొన్ని సార్లు మెదడు వాపు సమస్య కూడా వస్తుంది.  మరికొన్ని సందర్భాలలో స్పృహ కోల్పోవడం, లేదా మూర్ఛ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఒక వ్యక్తి ఎంత నీరు తాగాలి అనేది.. వ్యక్తి వయసు, బరువు,  చేసే పనులను బట్టి ఉంటుంది. అయితే సగటున పెద్దలకు రోజుకు 2 నుండి 3 లీటర్ల నీరు తాగడం మంచిది. నీరు బాగా తాగే వారిలో తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం,  శరీరంలో వాపు కనిపించడం,  ఎప్పుడూ తలనొప్పిగా ఉండటం,  వంటి లక్షణాలు కనిపిస్తే అవన్నీ నీరు అధికంగా తాగడం వల్ల వచ్చే సమస్యలేనని అర్థం చేసుకోవాలని వైద్యులు అంటున్నారు. ఇలాంటి లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ప్రపంచంలో కాఫీ తాగే అలవాటు మొదలైన దగ్గర్నుంచీ... అది మంచిదా! కాదా! అనే వివాదం కూడా మొదలైంది. కాఫీ మంచిందంటూ ఒక పరిశోధన బయటకు వచ్చిన వెంటనే... కాఫీ తాగితే ఆరోగ్యం మీద ఆశ వదిలేసుకోవాలంటూ మరో పరిశోధన భయపెడుతుంది. ఈ వివాదానికి ముగింపు ఇచ్చేందుకు టెక్సాస్‌లోని ToxStrategies అనే సంస్థ నడుం బిగించింది. ఇంతకీ అదేం తేల్చిందంటే... ఇదీ లిమిట్‌ - 2001 నుంచి 2015 వరకూ కాఫీ మీద జరిగిన దాదాపు 700 పరిశోధనల ఫలితాలను ToxStrategies సేకరించింది. వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని... ఒక మోతాదు వరకు కాఫీ తాగితే అంత ప్రమాదం లేని తేల్చింది. రోజుకి దాదాపు 400 మిల్లీగ్రాముల వరకూ కెఫిన్‌ పుచ్చుకోవడం వల్ల వచ్చే నష్టేమమీ ఉండదట. ఇది దాదాపు నాలుగు కప్పుల కాఫీతో సమానం. గర్భిణీలూ పుచ్చుకోవచ్చు - ఇప్పటివరకూ గర్భిణీలు కాఫీకి వీలైనంద దూరంగా ఉండాలని హెచ్చరించేవారు. వారు కాఫీ తాగడం వల్ల అబార్షన్లు జరగే ప్రమాదం ఉందనీ, ఒకవేళ బిడ్డ పుట్టిన కూడా తక్కువ బరువుతోనో అవయవలోపంతోనో పుడతారనీ భయపెట్టేవారు. కానీ కాఫీ అలవాటు ఉండే గర్భిణీలు ఇక మీదట నోరు కట్టేసుకోవాల్సిన ఖర్మ పట్టలేదంటున్నారు. వారు 300 మిల్లీగ్రాములు కెఫిన్‌ లేదా మూడు కప్పుల కాఫీ తాగితే ఫర్వాలేదంటున్నారు. పిల్లలు అతి తక్కువగా - పిల్లలు మాత్రం కెఫిన్‌కి వీలైనంత దూరంగా ఉండక తప్పదని తేల్చారు. పిల్లలు బరువుండే ప్రతి కిలోకీ 2.5 మిల్లీగ్రాములకి మించి కెఫన్ పుచ్చుకోవద్దని అంటున్నారు. అంటే 20 కిలోలు ఉండే పిల్లవాడు రోజుకి 50 మి.గ్రాల మించి కెఫిన్‌ తీసుకోకూడదన్నమాట. మోతాదుతో ఉపయోగాలు – కాఫీని మోతాదులో పుచ్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే! కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, లివర్ ఆరోగ్యంగా ఉంటుంది, టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది, పార్కిన్‌సన్స్‌ వంటి వ్యాధులు దరిచేరవు. కానీ మోతాదు దాటిని కెఫిన్ మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. నిద్రలేమి దగ్గర నుంచీ గుండెపోటు వరకు కెఫిన్‌తో నానారకాల సమస్యలూ మొదలవుతాయన్నది నిపుణుల హెచ్చరిక. చివరగా చిన్న మాట... కాఫీని మోతాదులో పుచ్చుకుంటే సురక్షితమే అని తేలడం మంచి విషయమే! కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. మనం తీసుకునే కాఫీలో మాత్రమే కెఫిన్‌ ఉండదు. టీ, కూల్‌డ్రింక్స్, తలనొప్పి మాత్రలు, చాక్లెట్లు.. ఇలా బోలెడు పదార్థాలలో కెఫిన్ కనిపిస్తుంది. కాబట్టి ఒకోసారి మనకి తెలియకుండానే కెఫిన్‌ మోతాదుని దాటేసే ప్రమాదం ఉంది! అంచేత పరిశోధకులు నాలుగు కప్పుల కాఫీకి అనుమతిస్తే మనం రెండు కప్పులతోనే సరిపుచ్చుకోవడం మంచిది. పైగా కొందరి శరీర తత్వానికి కాఫీ అస్సలు సరిపడకపోవచ్చు. అలాంటివారు కాఫీకి దూరంగా ఉండాల్సిందే! - నిర్జర. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  విటమిన్ డి ముందు వెనుకా  ఆలోచించకుండా వేసుకునే మ్యాజిక్ పిల్ కాదు. కొంతమంది విటమిన్-డి లోపం గురించి తెలుసుకోకుండానే విటమిన్ డి పిల్స్ వేసుకుంటూ ఉంటారు. గత కొంతకాలంగా చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. నిద్రవేళలు పాటించకపోవడం,  జీవనశైలి,  వృత్తి సమయాల కారణంగా విటమిన్-డి లోపానికి గురవుతున్నారు.  అయితే ఇప్పటి యూత్ మాత్రం ఏదైనా విటమిన్ లోపం ఏర్పడిందనే అనుమానం రాగానే ముందు వెనుకా ఆలోచించకుండా సప్లిమెంట్లు తీసుకుంటున్నారు.  అందులో భాగంగానే విటమిన్-డి పిల్స్ కూడా వాడుతుంటారు.  అయితే  ఇలా విటమిన్-డి కోసం సప్లిమెంట్లు వాడేవారు తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. పరిశోధనలు తేల్చిన కొన్ని నిజాలు తెలుసుకుంటే..   పరిశోధనల ప్రకారం ఇతర విటమిన్ల మాదిరిగా కాకుండా  సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా విటమిన్ డి ని భర్తీ చేయకూడదు. విటమిన్-డి ని మన శరీరం  తయారు చేస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే విటమిన్ డి విటమిన్ కాదు, ఒక హార్మోన్. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా విటమిన్ డి సప్లిమెంట్లను ఇచ్చే ముందు జాగ్రత్త వహించాలని అంటున్నారు. విటమిన్ డి అనేది  సోషల్ మీడియాలో ఇది ఆరోగ్య మాత్రగా ప్రచారం చేయబడుతోంది.  రెండవ ఆలోచన చేయకుండా చాలామంది  విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకుంటారు.  సూర్యరశ్మికి గురైన తర్వాత చర్మంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. అప్పుడు కాలేయం,  మూత్రపిండాలు దాని క్రియాశీల రూపంలోకి మారుస్తాయి. దీని తరువాత ఇది శరీరంలో  వివిధ కార్యకలాపాలకు  ఉపయోగించబడుతుంది. శరీరంలో విటమిన్ డి లోపం ఉందని మొదట  వైద్యుడిని సంప్రదించాలి. కండరాల బలహీనత, శరీరంలో నొప్పి లేదా లేచి కూర్చోవడంలో ఇబ్బంది ఉంటే  డాక్టర్ పరీక్షను సిఫార్సు చేస్తారు. పరీక్ష తర్వాత డాక్టర్ విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలని సలహా ఇస్తే,  శరీరంలో విటమిన్ డి లోపం ఉందని తెలిస్తేనే ఈ సప్లిమెంట్లు తీసుకోవాలి. ముఖ్యంగా నవజాత శిశువులకు,  70-75 సంవత్సరాల వయసు పై బడిన వృద్దులకు విటమిన్-డి సప్లిమెంట్లు ఇవ్వవచ్చు. అంతేకానీ యూత్ వీటిని వాడటం మంచిది కాదు.