LATEST NEWS
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా వినతిపత్రం సమర్పించింది. 2024 జూన్‌ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో,  ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, రాజధానిగా అమరావతి ఎంపిక ప్రక్రియ, నిర్మాణ కార్యక్రమాలపై వివరాలను కూడా కేంద్రానికి నోట్‌ ద్వారా రాష్ట్ర ప్రభఉత్వం అందజేసింది. ఈ విషయమై, కేంద్రం ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించడమే కాకుండా, నీతి ఆయోగ్‌ అభిప్రాయాన్ని కూడా కోరినట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి అమరావతిని రాజధానిగా చట్టబద్ధంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం సూచించిన ప్రకారం.. 2024 జూన్‌ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించేందుకు దాదాపు కేంద్రం నిర్ణయానికివచ్చేసినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్గెస్ట్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.  బీఆర్ఎస్ కీలక నేత, పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందన్న వాస్తవం వెలుగు చూసింది. ఈ విషయాన్ని   ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులే స్వయంగా తమ ఎదుట విచారణకు హాజరైన  హరీష్ రావుకు వెల్లడించారు. ది ఇప్పుడు  రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హరీష్ రావు కి విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న హరీష్ రావు మంగళవారం (జనవరి 20) అధికారుల ఎదుట హాజరయ్యారు.  హరీష్ రావును విచారించిన అధికారులు, 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొన్ని నెలల పాటు ఆయన ఫోన్ నిఘాలో ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పగానే హరీష్ రావ్   షాక్‌కు గురైనట్లు సమాచారం. విచారణ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నను హరీష్ రావ్ స్వయంగా కాగితంపై రాసుకున్నారు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందన్న విషయాన్ని తొలిసారి విన్న హరీష్ రావ్, వెంటనే , ఇది మీరు సృష్టించారా?  అని సిట్  అధికారులను ప్రశ్నించారు. అనంతరం స్పందించిన అధికారులు, ఫోన్ ట్యాపింగ్ జరిగిన తేదీలు, కాల వ్యవధి వివరాలను హరీష్ రావుకు తెలియజేశారు. అంతేకాదు, హరీష్ రావ్ అనుచరుల ఫోన్లు కూడా అదే సమయంలో కొన్ని ట్యాప్ అయ్యినట్టు సిట్ అధికారులు వెల్లడించడంతో విచారణ మరింత కీలకంగా మారింది. దీనిపై హరీష్ రావ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకు పలువురు కీలక అధికారుల పేర్లు బయటకు రావడంతో పాటు, రాజకీయ నాయ కుల ఫోన్ల ట్యాపింగ్ అంశం ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా మారింది. తాజాగా హరీష్ రావ్ ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందన్న విషయం వెలుగులోకి రావడం కేసును మరో దశకు తీసుకెళ్లింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న ఆదేశాలెవరివి? ఎవరిని లక్ష్యంగా చేసుకుని నిఘా పెట్టారు?రాజకీయ లబ్ధి కోసమే ఈ ట్యాపింగ్ జరిగిందా? అన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. SIT దర్యాప్తు ముమ్మరం కావడంతో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 
ప్రభుత్వానికి  పేర్లు మార్చడంలోని సరదా, దేశమంతా తన వశంలోకి తెచ్చుకోవాలన్న కోరికా తప్ప చదువు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన సంగతి ఇసుమంతైనా పట్టడం లేదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి కల్పనను  పట్టించుకోకుండా బండి రంగు మారుస్తానంటే ఎట్టా సామీ అంటున్నారు ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయులు.  కానీ వారి మాటలు వినే నాధుడేడీ.  ఇప్పటికీ చాలా కాలం నుంచే అధికారులు, ఉపాధ్యాయులు, విద్యావంతులూ విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏకరవు పెడుతూ వచ్చారు. వివేకానందుడిలా చేతులు కట్టుకుని విన్నట్టు నటించిన దేవరది చెవుడు కాదు, నటన కాదు.. కొండంత నిర్లక్ష్యం అంటూ ప్రతిపక్షాలు గుండె బాదుకుంటున్నాయి. అదీ నిజమే!  ఏమన్నా అంటే ఎగస్పార్టీ వోరికి కుళ్లు అంటూ దబాయించేయడం సర్వసాధారణమైంది. చదువుకుంటేనేగా గ్రామాల్లో వికాసం అంటూ ఉండేది. చదువు చెప్పేవారే  ఉంటే పిల్లలు గేదెలెనకా, మేకలేకనా పరిగెత్తాల్సిన ఖర్మేంటి?  కాస్తంత గ్రామాభివృద్ధి, విద్యారంగంలో రావాల్సిన మార్పుల గురించి ఏకరవుపెడుతున్నవారంతా   గొంతుపోవడం,  అనారోగ్యం పాలవడం తప్ప ఒరుగుతున్నది దాదాపు శూన్యమన్న అభిప్రాయాలే ఎక్కువ వినపడుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి స్వామీ అని అహ్మదాబాద్‌ నుంచి అమలాపురం వరకూ టీచర్లు, ప్రొఫెసర్లు గోడు పెడుతున్నారు. అదే  కాదు అన్ని రంగాల్లోనూ ఉద్యోగాల భర్తీ  వూసే లేదని గోసపడుతున్నారు. అవన్నీపట్టించుకుని పత్రికల ద్వారా, మైకుల్లోనూ అరిచి గింజుకోవడమే అవుతోంది ఈ విషయమై బాధపడుతున్న మేధోవర్గానికి.  అసలు విషయమేమంటే..జూన్‌ 2025 నాటికి కేంద్రీయ విద్యా సంఘఠన్‌లో  7,765 బోధనా సిబ్బంది పోస్టులు, నవోదయ విద్యాసమితిలో 4,323 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీసు దళాల(సిఎస్‌ఎఫ్‌)లో 25,487 కానిస్టబుల్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే రాజస్థాన్‌లో ఎల్డీసీ క్లర్క్‌ కేడర్2 లో దాదాపు11 వేల ఉద్యోగాలు భర్తీ చేయవలసి ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఏయిమ్స్‌లో ఇంకా 1,731 పోస్టులు  భర్తీ చేయాలి. ఇక బ్యాంకుల విషయానికి వస్తే 12 ప్రభుత్వరంగ బ్యాంకులో 4,20,599 మంది ఆఫీసర్లు, 2,49,817 క్లర్కు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసలే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పథకం పేరు మార్చి దాన్ని రాముడికి అర్పించేసి ఉపాధికి గండి కొట్టేస్తున్నారు. అంతే కాకుండా ఇది  చాలా అద్భుతం అంటూ తమ వారి చేత  భజనచేయించుకుంటున్న పాలకులు  కోట్లాది ప్రజలకు ఉపా ధిని కొంపముంచేస్తున్నారన్న విషయం పెద్దగా, గట్టిగా వినబడకుండా నిరసనల గొంతు నొక్కేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే.. తనకు ఇష్టమైన పదార్థాన్నే దేశ ప్రజలంతా లొట్టలే సుకుంటూ  అందరూ తినాలన్నదే పాలకుల ఇజంగా కనిపిస్తోంది. దానికి మోడీ ఇజం అనోచ్చం టారా?
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు  ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం (జనవరి 20) దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించిన సిట్.. ఆయనకు మరో మారు నోటీసులు జారీ చేయనుంది. మంగళవారం (జనవరి 20) విచారణ సందర్భంగా హరీష్ రావు తన కుమారుడు విదేశాలకు వెళ్తున్నందున సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్ పోర్టుకు వెళ్లాలని   రిక్వెస్ట్ చేయడంతో  ఏడున్నర గంటల తరవాత విచారణ ముగించామనీ, ఆయనను ఇంకా విచారించాల్సిన అవసరం ఉందనీ సిట్ వర్గాలు చెబుతున్నాయి. సిట్ చీఫ్ సజ్జనార్ హరీష్ రావు విచారణ ముగిసిన తరువాత చేసిన ప్రకటన కూడా అదే సూచిస్తోంది.  ఇలా ఉండగా మంగళవారం (జనవరి 20) విచారణ ముగిసిన తరువాత బయటకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు సిట్ సూచనలను పట్టించుకోకుండా  మీడియా ముందు పొలిటికల్ కామెంట్స్ చేశారు. అది పక్కన పెడితే.. విచారణలో భాగంగా హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా ఆధారాలను సిట్ బృందం హరీష్ ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  అయితే అవన్నీ ఫేక్ అని హరీష్ రావు వాదించినట్లు తెలుస్తోంది.   కాగా మంగళవారం (జనవరి 20) విచారణ అర్ధంతరంగా ముగియడంతో రెండు మూడు రోజులలో హరీష్ రావును సిట్ మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే.. సుప్రీంకోర్టు కొట్టి వేసిన కేసులో హరీష్ రావును విచారణకు పిలిచారంటూ కేటీఆర్ సహా  బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని సిట్ చీఫ్  సజ్జనార్ ఖండించారు. తాము హరీష్ రావును విచారణకు పిలిచింది ఆ కేసులో కాదని క్లారిటీ ఇచ్చారు.  ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసిన కేసులో హరీష్ రావును విచారించామనీ, ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సజ్జనార్ అన్నారు.  
సొంత రాష్ట్రంలో సొంతంగా పార్టీ పెట్టి దానిని ఎన్నికలలో గెలుపు బాటలో నడిపించలేక చతికిలపడి, ఇప్పుడా పార్టీని ఎలా నడపాలో తెలియక అయోమయంలో ఉన్న ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్న కల్వకుంట్ల కవితకు ఐడియాలజిస్టుగా ఉంటారట. సొంతంగా పార్టీని నడపడంలో విఫలమైన  ప్ర‌శాంత కిషోర్  ఐడియాలు, వ్యూహాలు కవిత పార్టీకి ఏ మేరకు పని చేస్తాయి? ఏ మేరకు పనికొస్తాయి అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. సరే అసలు తాను కవిత పార్టీకి వ్యూహకర్తగా పని చేయనున్నానంటూ వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధాలని ప్రశాంత్ కిశోర్ కొట్టి పారేశారనుకోండి అది వేరు సంగతి.   ఇటీవ‌ల క‌విత‌- ప్ర‌శాంత్ కిషోర్ మధ్య రెండు సమావేశాలు జరిగాయనీ, కవిత  త‌న పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టుగా ఆయ‌న్ను నియ‌మించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంద‌న్న వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రశాంత్ కిశోర్ ఖండించినప్పటికీ చర్చ మాత్రం ఆగడం లేదు.   ప్ర‌శాంత్ కిషోర్  జ‌న్ సూర‌జ్  పార్టీ ఇటీవ‌ల జ‌రిగిన  బీహార్ ఎన్నిక‌ల్లో సోదిలో కూడా క‌నిపించ‌లేదు. ఇక ఆయన స్వయంగా పార్టీ అభ్యర్థిగా ఎక్కడా పోటీ చేయలేదు.  స్వ‌త‌హాగా బీహారీ అయిన ప్ర‌శాంత్ కిషోర్ .. సాటి  బీహారీ అయిన  క‌విత‌కు.. (ఈ కామెంట్ ఎందుకు చేయాల్సి వ‌చ్చిందంటే కేసీఆర్ కుటుంబం కూడా బీహార్ నుంచే ఏపీలోని బొబ్బిలికి వ‌ల‌స వ‌చ్చిన‌ట్టు చెబుతారు. ఆ త‌ర్వాతే  వారు తెలంగాణ‌కొచ్చి సెటిలైన‌ట్టు అంటారు. అందుకే కేసీఆర్ గ‌తంలో బీహార్ లో కొంద‌రికి  ఆర్ధిక సాయం చేశారు కూడా) రాజ‌కీయ స‌ల‌హాదారుగా పని చేయడానికి ముందుకు వచ్చారన్న చర్చ జరుగుతోంది. సొంతంగా పార్టీ పెట్టడానికి ముందు వరకూ ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు బాగానే క్లిక్ అయ్యాయి. ఏపీలో జగన్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, అంతకంటే ముందు 2014లో కేంద్రంలో మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ వ్యాహాలే కారణమనే వారూ లేకపోలేదు. కానీ ఇంటి వైద్యం ఒంటపట్టదన్నట్లు ఆయన వ్యూహాలు ఆయన సొంత పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడలేదు.  సరే అది పక్కన పెట్టి పార్టీలను అధికారంలోకి తీసుకురావడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలలో సెంటిమెంట్ ప్రధానం అన్నది తెలిసిందే.  మొన్నా మ‌ధ్య క‌విత ఎమ్మెల్సీ ప‌ద‌వికి  రాజీనామా చేస్తూ.. తాను ఆస్తి కోసం పోరాడ్డం లేద‌ని ఆత్మ‌గౌర‌వం కోసం కొట్లాడుతున్నాన‌ని ప్ర‌క‌టించ‌డ‌మే  కాకుండా.. క‌న్నీటి  ప‌ర్యంత‌రం అయ్యారు.  ఒక మ‌హిళ ఇంత పెద్ద ఎత్తున ఒక నిండు స‌భ‌లో క‌న్నీటి ప‌ర్యంతం కావ‌డం ఏమంత చిన్న విష‌యం కాదు. ఈ విజువ‌ల్  ప‌బ్లిక్ లోకి బలంగా వెడుతుంది.  సెంటిమెంట్ రగులుస్తుంది.   ఆ సెంటిమెంట్ నే కవిత  తెలంగాణ  రాజ‌కీయాల్లో రాణించేందుకు మరింత రగిల్చేలా పీకే వ్యూహాలకు పదును పెట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక  మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు. బీసీల కోసం కొట్లాట ఇవ‌న్నీ  కూడా ప్ర‌శాంత్ కిషోర్ అంబుల పొదిలోని ఆస్త్రాలుగానే చెబుతున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్   కేసీఆర్ తో జ‌త క‌ట్టి ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహ‌ర‌చ‌న చేస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఎందుకంటే కేసీఆర్ అప్ప‌ట్లో జాతీయ  రాజ‌కీయాల వైపున‌కు వెళ్లే ఆలోచ‌న చేశారు. కానీ ఇదే క‌విత అన్న‌ట్టు ఇక్క‌డేం పీకినం అని దేశ రాజ‌కీయాల్లోకి బోవాలె అన్న‌ట్టు.. గులాబీ బాస్ ఎందుకో వెన‌క‌డుగు వేశారు. ఆపై అక్క‌డ మాట దేవుడెరుగు- ఇక్క‌డ కూడా కేసీఆర్ కార్ పార్టీ చ‌తికిల‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు క‌విత వ్యూహాల వద్దకు వ‌స్తే.. ప్ర‌శాంత్ కిషోర్ స‌ల‌హా సూచ‌న‌లు ఎంత మేర వ‌ర్క‌వుట్ అవుతాయ‌న్న‌ది ప్రశ్నార్థకమే. నీటిలో ఉన్న బ‌ర్రెకు రేటు క‌ట్ట‌డం క‌ష్ట‌మేమోగానీ..  అది బ‌య‌ట‌కొచ్చాక దాని పొదుగు చూసి ఆ ధ‌ర ఇట్టే చెప్పొచ్చు అన్న‌ట్టు.. ప్ర‌శాంత్ కిషోర్ ఒక  రాజ‌కీయ అనామ‌కుడు. అప్ప‌ట్లో మోడీకి, ఆ మ‌ధ్య  జ‌గ‌న్ కి అత‌డిచ్చిన ఒక‌టీ అరా స‌ల‌హా సూచ‌ల‌ను అడ్డి మార్- గుడ్డి దెబ్బ లెక్క‌  వ‌ర్క‌వుట్ అయి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఇప్పుడు కూడా ఆయ‌న స‌ల‌హా సూచ‌న‌లు, భారీ మందీ మార్బ‌లం, ఆపై అణువ‌ణువూ లెక్క‌లు తీసి వాటి ద్వారా ఏదో చేయాల‌న్న వ్యూహాలు.. ఇవ‌న్నీ కూడా బెడిసి కొట్టి చాలా కాల‌మే అయ్యింది. ఇప్పుడీ రాజ‌కీయ వ్యూహాల‌కు బుట్ట‌లో ప‌డే ఓట‌రు మ‌హాశ‌యులెవ‌రూ లేరు.కాబ‌ట్టి క‌విత ఆయన వ్యూహాల కోసం అర్రులు చాచడం అనవసర మంటున్నారు పరిశీలకులు. కాదని ఒక వేళ కవిత ప్రశాంత్ కిశోర్ ను వ్యూహకర్తగా నియమించుకున్నా, ఆయనకు ఇచ్చే భారీ ఫీజు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతుందంటున్నారు.  ఫైన‌ల్ గా సీఎం దావోస్ ప‌ర్య‌ట‌న శుద్ధ దండ‌గ అంటున్న క‌విత‌.. తాను ప్ర‌శాంత్ కిషోర్ కి వెచ్చించే సొమ్ము కూడా బీహారార్ప‌ణం అవుతుందని గ్రహించాల్సి ఉంటుందంటున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
The Tollywood fan wars have reached an all-time low following the release of Sandeep Reddy Vanga’s Spirit release date, officially locked for March 5, 2027. While the makers of Mahesh Babu’s magnum opus Varanasi have re-affirmed their 2027 arrival, a section of Prabhas’s fanbase is surprisingly calling for a direct box office clash. This aggressive stance stems from deep-seated frustration over the recent "ragging" they endured on social media. Following the colossal disaster of The Raja Saab, Mahesh Babu fans took to digital platforms to mock the "Rebel Star" and the box office collections of the movie owing to its disaster word-of-mouth.  This online bullying was not unprovoked but rather a sharp reciprocation of past events. During the 2023 Sankranti season, Prabhas fans had relentlessly made fun of Mahesh Babu when Guntur Kaaram faced stiff competition and mixed reviews against the surprise success of Teja Sajja’s HanuMan.  The Guntur Kaaram vs HanuMan clash became a tool for rival fans to degrade Mahesh’s stardom. Now, with the tables turned after the failure of The Raja Saab, Prabhas fans feel cornered and hurt by the intense trolling. By demanding a clash between Spirit and Varanasi, they hope for a one-on-one battle to settle scores.  Despite the makers' efforts to avoid a clash, the fan-driven narrative suggests that the rivalry between the two biggest fanbases of Telugu cinema is no longer just about box office numbers, but about settling old scores. This can be categorised as unhealthy competition as both the big films have crores of rupees at stake.  SS Rajamouli is crafting Varanasi on a huge scale and today's confirmation as 2027 release, gave Mahesh fans, some lease of fresh air as the timelines are normally dangerously long with the director. Well, it is apparent that SSR will never allow a box office clash with his movie to any other big one, so this online chatter is just another deep indication of bad fan culture that is rampant in Telugu Cinema social media these days.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Nivin Pauly has staged one of the most remarkable comebacks in Malayalam cinema history with his latest release, Sarvam Maya. The film has emerged as a massive worldwide blockbuster, officially crossing the ₹140 crore mark and surpassing the lifetime collections of his iconic 2015 hit, Premam.  Directed by Akhil Sathyan, the supernatural comedy resonated deeply with family audiences, proving that Nivin’s charm and script selection can still command the box office. The industry had largely written off the actor after a string of underperformers, but Sarvam Maya has successfully revitalized his "Superstar" status, entering the top 10 highest-grossing Malayalam films of all time. However, this newfound momentum faces an immediate challenge with his upcoming project, Baby Girl. Despite the record-breaking success of Sarvam Maya, the promotional campaign for Baby Girl has struggled to generate significant excitement. Scheduled for release on January 23, the film is a gritty thriller where Nivin plays a hospital attender caught in a baby-missing case.  Scripted by the legendary duo Bobby-Sanjay, the film’s release was notably delayed by six months, which may have cooled some of the initial anticipation. While the trailer showcases an intense, grey-shaded performance, the general audience seems cautious.  Unlike the universal appeal of Sarvam Maya, the dark tone of Baby Girl hasn't yet translated into strong advance bookings. Trade analysts are now closely watching whether the massive goodwill from his recent blockbuster will be enough to carry this thriller through, or if it will rely entirely on word-of-mouth to rescue it from a cold start. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -రిమీ సేన్ వ్యాఖ్యల్లోని మర్మమేంటి! -పాలసీలని మారుస్తుంది ఎవరు -దుబాయ్ లో ఏం చేస్తుంది   మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi),శ్రీను వైట్ల(Srinu vaitla)కాంబోలో వచ్చిన అందరి వాడు ద్వారా తెలుగు సినీప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపుని పొందిన భామ 'రిమీ సేన్(Rimi Sen). హిందీలో చేసిన ధూమ్ ద్వారా అయితే ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని పొందింది. హంగామా, గోల్ మాల్ వంటి చిత్రాల్లో కూడా మెరిసిన రిమీ సేన్ సినిమాలకి స్వస్తి చెప్పి రియల్ ఎస్టేట్ రంగంలో కొన్నేళ్ల క్రితం దుబాయ్ లో సెటిల్ అయ్యింది. ఆ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్ చేస్తున్నాయి.   దుబాయ్(Dubai)లో సెటిల్ అవ్వడంపై ఆమె మాట్లాడుతు మన దేశంలో ప్రభుత్వం రాత్రికి రాత్రి పాలసీలని మారుస్తున్నాయి. దీంతో వ్యాపారం చెయ్యడం చాలా కష్టతరంగా మారింది. నా దృష్టిలో ఇప్పుడు ఇండియా వ్యాపారం చెయ్యడానికి అంత అనుకూలమైన దేశం కాదు. అందుకే బిజినెస్ పరంగా సులభకరంగా ఉన్న దుబాయ్ కి మారిపోయానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.రిమీ సేన్ స్వస్థలం కోల్ కతా.   Also read:   బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబో.. వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందా!  
  సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు  లాభపడిన నిర్మాత ఎవరు? ఎక్కువ లాభాలు తెచ్చిన సినిమా ఏది?   2026 సంక్రాంతికి 'ది రాజా సాబ్', 'మన శంకర వరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారీ నారీ నడుమ మురారి' ఇలా మొత్తం ఐదు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. మరి వీటిలో తక్కువ బడ్జెతో నిర్మాతకు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏదో తెలుసా?   ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలైన 'ది రాజా సాబ్', 'మన శంకర వరప్రసాద్ గారు' తర్వాత.. ప్రేక్షకుల దృష్టిని ఎక్కువ ఆకర్షించిన సినిమా 'అనగనగా ఒక రాజు' అనడంలో సందేహం లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన మూవీ ఇది.    'అనగనగా ఒక రాజు' చిత్ర విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో నిర్మాతకు బాగా డబ్బులు వచ్చాయి. ఇక విడుదల తర్వాత కూడా.. మొదటి వారంలోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఇప్పటిదాకా 'అనగనగా ఒక రాజు' ద్వారా మేకర్స్ కి రూ.30 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది.   యంగ్ హీరోతో రూపొందించిన సినిమా రూ.30 కోట్ల లాభాలు తెచ్చిపెట్టడం అనేది మామూలు విషయం కాదు. అందుకే ఈ విషయంలో నిర్మాత నాగవంశీ ఫుల్ హ్యాపీగా ఉన్నారట.     Also Read: 'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ   'అనగనగా ఒక రాజు' సినిమా విషయంలో మొదటి నుంచి పక్కా ప్లానింగ్ తో వెళ్ళారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి తగినంత సమయం కేటాయించారు. కొన్ని కారణాల వల్ల సినిమా కాస్త ఆలస్యమైనా.. రీజనబుల్ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ని అందించగలిగారు. కంటెంట్ ని ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళడంలోనూ సక్సెస్ అయ్యారు. దాంతో విడుదలకు ముందు మంచి బిజినెస్ జరిగింది. విడుదల తర్వాత కూడా భారీ వసూళ్లు వచ్చాయి. మొత్తానికైతే నిర్మాతలు అదిరిపోయే లాభాలు చూశారు.   'అనగనగా ఒక రాజు' స్ఫూర్తితో యంగ్ హీరోలతో మరిన్ని మంచి సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో నాగవంశీ ఉన్నారట. ఇదే బాటలో ఇతర నిర్మాతలు కూడా పయనించే అవకాశముంది.   Also Read: అల్లు అర్జున్ కి రూట్ క్లియర్!    
    -సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్  -బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబో సెట్ కాబోతుందా! -అనిల్ రావిపూడి ఏమంటున్నాడు రామాయణంలో రాముడు, హనుమంతుడి కి ఉన్నశక్తుల్ని చెప్పమని రామ,హనుమ భక్తులని అడగడం ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ వద్ద బాలకృష్ణ(Balakrishna),అనిల్ రావిపూడి(Anil Ravipudi)కి ఉన్న కెపాసిటీ ని  చెప్పమని మూవీ లవర్స్ ని అడిగినా కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. అంతలా ఆ ఇద్దరు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా ఈ ఇద్దరికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారింది.   బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో 2023 అక్టోబర్ లో 'భగవంత్ కేసరి'(Bhagavanth kesari)వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నేలకొండపల్లి భగవంత్ కేసరి గా బాలకృష్ణ పెర్ ఫార్మ్, అనిల్ రావిపూడి టేకింగ్ ఒక రేంజ్ లో ఉంటాయి. నేషనల్ అవార్డుని సైతం అందుకుందంటే కథ, కథనాలు ఎంత వాల్యుబుల్ నో అర్ధం చేసుకోవచ్చు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతిని కూడా అనిల్ రావిపూడి టార్గెట్ చేసినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. అది కూడా బాలకృష్ణతోనే రాబోతున్నాడనే టాక్ ఒక రేంజ్ లోనే వైరల్ అవుతుంది.   నిజానికి గోపీచంద్ మలినేని తో  బాలకృష్ణ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ బడ్జెట్ పరిమితుల నేపథ్యంలో కథ మారిపోవడంతో, సెట్స్‌పైకి వెళ్లేందుకు కొంచం గ్యాప్ రావచ్చనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. దీంతో అనిల్ దగ్గర బాలకృష్ణకి సరిపోయే కథ సిద్ధంగా ఉందని ఆ ఇద్దరి కాంబోలో త్వరలోనే మూవీ అనౌన్స్ మెంట్ రావచ్చనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.     ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో అభిమానులు ఆ ఇద్దరి కాంబోలో సినిమా రావాలని కోరుకుంటున్నారు. రీసెంట్ గా మన శంకర వర ప్రసాద్ గారు సక్సెస్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి మాట్లాడుతు బాలకృష్ణతో ఎవరూ ఊహించని విధంగా సినిమా చేయాలన్నదే నా లక్ష్యం. ఆ దిశగా ఎంతో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్‌లలో ‘భగవంత్ కేసరి ఒకటి. ఆ సినిమా ఇంకా పెద్ద స్థాయిలో హిట్ కావాల్సింది.    సినిమా విడుదల సమయంలో రాజకీయ పరిస్థితుల కారణంగా బాలయ్య అభిమానుల్లో కొంత నిరాశ కనిపించింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)గారు జైలులో ఉండటం ప్రభావం చూపించింది. అయినప్పటికీ సాధారణ ప్రేక్షకులు మూవీని ఆదరించి హిట్ చేసారు. పరిస్థితులు అనుకూలంగా ఉండి ఉంటే స్పందన మరింత గొప్పగా ఉండేదని చెప్పాడు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి బాలకృష్ణ తో వస్తాడేమో చూడాలి.      
After a movie dominated Sankranti week, the Republic Day is arriving with a cool and chilled out weekend. So, those who would love to chillax at their homes on easy cushion chairs and catch up on OTT content streaming, we came up with the full OTT guide that helps you plan your weekend full of thrills, chills and entertaining shows. Here's the comprehensive guide on new releases for 19th January till 26th January on all major OTT platforms.  The Week's Biggest Premieres Tere Ishk Mein (Netflix) Premiering on January 23rd, this spiritual successor to Raanjhanaa reunites Dhanush with director Aanand L. Rai for a haunting, poetic tale of unrequited love and redemption co-starring Kriti Sanon. A Knight of the Seven Kingdoms (JioHotstar) Set a century before Game of Thrones, this fantasy epic follows the humble Ser Duncan the Tall and his young squire, Egg, bringing a grounded, character-driven perspective to the Targaryen-led Westeros. Space Gen: Chandrayaan (JioHotstar) Arriving on January 23rd, this dramatized series starring Shriya Saran and Nakuul Mehta chronicles the emotional and scientific resilience of ISRO’s team following the journey from the failure of Chandrayaan 2 to the historic lunar landing.   New on Netflix Zero Day (Jan 20) Robert De Niro makes his series debut as a former U.S. President called back into the fold to lead a commission investigating a catastrophic global cyberattack that threatens modern democracy. Gimbap and Onigiri (Jan 21) A heartwarming cross-cultural romance featuring Eiji Akaso and Kang Hye-won, where a Japanese chef and a Korean food blogger find a deep connection through a shared kitchen. Kidnapped: Elizabeth Smart (Jan 21) A definitive documentary revisitation of a high-profile disappearance, offering new perspectives on the harrowing months in captivity and the ultimate journey toward advocacy.   New on Amazon Prime Video 120 Bahadur (Jan 16) Farhan Akhtar portrays Major Shaitan Singh Bhati in this patriotic epic that recreates the legendary bravery of the soldiers who fought the 1962 Battle of Rezang La. Steal (Jan 21) Sophie Turner leads this six-part heist thriller as an ordinary office worker who becomes an unlikely anti-hero caught in a massive financial conspiracy. Cheekatilo (Jan 23) Sobhita Dhulipala stars as a relentless true-crime podcaster in this Telugu mystery series that unearths chilling secrets hidden within the streets of Hyderabad. Beast Games Season 2 (Jan 21/New Episode) MrBeast returns with Episode 5 of his massive reality competition, pitting physical specimens against intellectual "eggheads" for a $5 million grand prize. New on JioHotstar Mark (Jan 23) Kiccha Sudeep stars in this high-octane action thriller as a former operative forced back into a world of violence to settle a dangerous international debt. Gustaakh Ishq (Jan 24) Vijay Varma and Fatima Sana Shaikh lead this poetic romance set in Old Delhi, following a young poet's struggle to save his legacy while navigating a forbidden love. The Pitt Season 2 (Weekly) Noah Wyle returns to the high-stakes world of a modern trauma center, with each episode capturing a grueling real-time hour in a busy emergency room.   New on Apple TV+ & HBO Max (Global) Drops of God Season 2 (Apple TV+ - Jan 21) The multilingual wine drama returns as Camille and Issei travel to global vineyards to solve a mystery involving a legendary lost vintage. Hijack Season 2 (Apple TV+ - Weekly) Idris Elba's Sam Nelson is thrust into a new crisis, this time involving a hostage situation on a Berlin underground train. The 99-Year-Old Man! (HBO Max - Jan 22) A definitive two-part documentary by Judd Apatow celebrating the legendary life and career of comedy icon Mel Brooks. New on ETV Win and Regional Platforms Sparsha (Jan 17/Weekly) The latest episodes of this emotional drama continue to delve into the complexities of human relationships and family secrets on ETV Win. Malli Vachina Vasantham (Jan 3/Ongoing) This heartwarming series remains a top choice for regional audiences, focusing on second chances and the rediscovery of joy in the autumn of life. Sirai (ZEE5 - Jan 23) Vikram Prabhu anchors this gritty Tamil investigative thriller that explores the dark underbelly of the prison system and a high-profile manhunt. It is a hihgly critically acclaimed hit in Tamil Cinema and is pushed to win accolades all over.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    వైరల్ గా మారిన ఫరియా ప్రేమ వ్యవహారం  డాన్సింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఎవరు హైదరాబాద్ కా బాద్షా నేనా! తెలుగు సినిమా ప్రేమికులు 'జాతిరత్నాలు' లోని చిట్టి సాంగ్ ని ఎంతగానో హమ్ చేశారు. దీంతో  ఫరియా అబ్దుల్లా(Fariya Abdullah)తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందడం  ఖాయమని అందరు భావించారు. కానీ ఎవరి దిష్టి తగిలిందో ఏమో స్టార్ స్టేటస్ అనేది ఇంకా ఆమెకి అందని స్ట్రా బెర్రీ లా మారింది. అందుకు కారణాల గురించి ప్రస్తుతం మనకి అవసరం లేదు. రీసెంట్ గా సోషల్ మీడియా షేక్ అయ్యే న్యూస్ ని ఫరియా వెల్లడి చేసింది. ఒక ఇంటర్వ్యూ లో తన పర్సనల్ విషయాలపై మాట్లాడుతు నేను ప్రేమలో ఉన్నాను.ఆ విధంగా ప్రేమలో ఉండటం వల్ల  నా లైఫ్ సమతుల్యంగా ఉండటంతో  పాటు నా బిజీ షెడ్యూల్ కి మృదువైన మెరుపుని అందిస్తుంది. నా  లవర్ ఒక హిందువు.  సినీరంగానికి చెందినవాడు కాదు. డాన్సింగ్  బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాడని చెప్పింది. ఇక ఫరియా తన లవర్ గురించి అలా చెప్పిందో లేదో  ఇంటర్నెట్ డిటెక్టివ్‌లు రంగంలోకి దిగి ఆ లవర్ ఎవరై ఉంటారా అని తమ మస్తిష్కాలని బిజీ మోడ్ లో ఉంచారు.   Also read:  మన శంకర వర ప్రసాద్ గారు హిందీ రీమేక్! ఈ హీరో మీకు ఓకేనా! పక్కా హైదరాబాదీ అయిన ఫరియా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండటంతో పాటు యూట్యూబ్ ఛానల్ కి కూడా రన్ చేస్తుంది. ఫరియా నుంచి వచ్చిన ప్రీవియస్ మూవీ గుర్రం పాపిరెడ్డి.      
  అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వాయిదా పడిన వారాణసి? మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేయనున్న బన్నీ!   పుష్పరాజ్ గా పాన్ ఇండియాని షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో రూపొందుతోన్న 'వారణాసి'(Varanasi)ని విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.    ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతోన్న మోస్ట్ హైప్డ్ సినిమాలలో ఈ రెండు ముందు వరుసలో ఉంటాయి. కంటెంట్ క్లిక్ అయితే రూ.2000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగల సత్తా ఈ సినిమాలకు ఉంది. అలాంటిది ఈ రెండూ ఒకేసారి విడుదలైతే.. వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఈ సినిమాలు కాస్త గ్యాప్ తో విడుదలైతే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. అందుకు తగ్గట్టుగానే 'వారణాసి' వాయిదా పడినట్లు తెలుస్తోంది.     'వారణాసి' గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న దాని ప్రకారం.. ఈ మూవీ వేసవిలో రావడం కష్టమేనట. 2027 డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అదే జరిగితే అల్లు అర్జున్ కి రూట్ క్లియర్ అయినట్టే. 'వారణాసి' నుంచి పోటీ లేకపోతే బన్నీ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించే అవకాశముంది.   Also Read: మరో హీరోని పెట్టు.. హిట్ కొట్టు.. చిరంజీవి కొత్త సెంటిమెంట్!  
NTR and Prashanth Neel have come together for a huge action entertainer, NTRNEEL aka Dragon. The makers did not announce the title of the film officially and even movie shoot is going on at a very slow pace. Due to a major rib injury, NTR did not participate in the shoot. During the time, he worked hard to transform.  He finally acquired the physique and joined the shoot recently. There have been rumors about NTR not being happy with the output and script. Prashanth Neel is said to be more or less getting pushed to make a film that is far from his earlier vision to align with collective ideas of NTR's team.  Now, the shoot is reported to be halted by the sources. Due to NTR's injury and health issues, the actor requested the team for a break to re-join. Sources also state that Prashanth Neel has decided to finish the shoot with other actors where NTR is not needed, so that, their dates won't be wasted.  Even though Mythri Movie Makers, the producers, have decided to bring the movie for Sankranti 2027, they are unable to really decide when the movie shoot will progress smoothly and release the film. Rukmini Vasanth has been confirmed to star in the movie as leading lady but no other details have been confirmed officially.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
    శంకర వర ప్రసాద్ బాలీవుడ్ కి వెళ్తాడా! సినీ అభిమానులు ఏమంటున్నారు ఆ హీరో పై మీ అభిప్రాయం ఏంటి    ఆనందాన్ని ఎవరు మాత్రం కోరుకోరు అని సిగరెట్ యాడ్ ద్వారా సినిమా మనకి మంచి చెప్తుంది. మరి సినిమా మంచిని కూడా మనం కోరుకోవాలి కదా. అందుకే సినిమా మంచిని కోరుకునే సినీ అభిమానులు ఇప్పుడు మన శంకర వరప్రసాద్ మంచిని కోరుకుంటు ఒక డీల్ ని ప్రతిపాదనలోకి తీసుకొస్తున్నారు. మరి ఆ డీల్ వెనక ఉన్న మ్యాటర్ ఏంటో చూద్దాం. సోషల్ మీడియా వేదికగా  సినీ అభిమానులు స్పందిస్తు 'జనవరి 12 న థియేటర్స్ లో అడుగుపెట్టిన  మన శంకర వరప్రసాద్ గారి(Mana Shankara Varaprasad Garu)విజయ వీరవిహారం ఒక రేంజ్ లో కొనసాగుతుంది. ఎంటైర్ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా పట్టుమని పది రోజులు పూర్తవ్వకుండానే 300 కోట్ల క్లబ్ లోకి చేరింది. అంతలా ప్రేక్షక లోకాన్ని  మెస్మరైజ్ చెయ్యడానికి కారణం వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్స్ మధ్య నడిచే సబ్జెక్టు కి ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ ని సమపాళ్లల్లో జోడించి తెరకెక్కించడమే. ఈ పాయింట్ యూనివర్సల్ ది కాబట్టి హిందీ ప్రేక్షకులకి ఎంతగానో నచ్చుతుంది. ఈ తరహా సబ్జెట్స్ ని బాలీవుడ్ లో ఎప్పట్నుంచో తెరకెక్కిస్తూనే ఉన్నారు. కాబట్టి  అక్షయ్ కుమార్(Akshay Kumar),సల్మాన్ ఖాన్(Salman Khan)  అజయ్ దేవగన్(Ajay devgn)షారుక్ ఖాన్(Shahrukh Khan)లో ఎవరో ఒకరు బాగుంటారు. ఈ నలుగురు ఇప్పటికే ఫ్యామిలీ టైపు ఆఫ్ సినిమాలో తమ సత్తా చాటారు.  Also read: నీకు పుణ్యం ఉంటుంది బాబు.. ఆ పని చేసి పెడతావా కాబట్టి వాళ్ళల్లో ఎవరో ఒకరు చేస్తే మన శంకర వరప్రసాద్ గారు హిందీలో కూడా సంచలన విజయం సాధించడంతో పాటు బాలీవుడ్ బీరువాల్లోకి రికార్డు కలెక్షన్స్ వచ్చి చేరతాయనే అభిప్రాయాన్ని సినీ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ మంచి మాటలు బాలీవుడ్ హీరోలు, మేకర్స్ వద్దకి చేరి బాలీవుడ్ ప్రేక్షకులు కూడా మన శంకర వర ప్రసాద్ గారు టికెట్స్ కోసం  థియేటర్స్ ముందు పడిగాపులు కాసే రోజు వస్తుందేమో చూడాలి.        
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భారతదేశం చాలా వైవిధ్యభరితమైనది. భారతీయ సంప్రదాయాలలో పురుషార్థాలు చాలా ప్రధానమైనవి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పురుషార్థాలు అని అంటారు. ఈ  నాలుగింటిని అవలంభించడం వల్ల ప్రతి వ్యక్తి ఒత్తిడి నుండి విముక్తి అవుతాడని చెబుతారు. కానీ నేటి ఆధునిక కాలంలో వీటిని అటకెక్కించారు. ఈ నాలుగింటి గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఇవి వ్యక్తి జీవితంలో ఎంత ముఖ్యమైనవో తెలిసిపోతుంది. వీటి గురించి తెలుసుకుంటే.. ధర్మం.. జీవితంలో కొన్నిసార్లు మనం పారిపోతున్నట్లు అనిపిస్తుంది.  కానీ ఎందుకు అనే విషయం అర్థం కాదు.  ధర్మం అంటే ప్రతి వ్యక్తి తన నిజమైన కర్తవ్యాన్ని అర్థం చేసుకోవడం. ప్రపంచానికి ఒక వ్యక్తి నుండి కావలసింది ఇదే. ప్రతి వ్యక్తి తనలోకి తాను చూసుకోవాలి. అంటే.. ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఏది ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది? రోజువారీ చిన్న చిన్న పనులలో నిజాయితీని పాటించినప్పుడు లభించే సంతృప్తి చాలా గొప్పది.  ఒక్కసారి దీన్ని అనుభవించినప్పుడు ఇక దాన్నుండి పక్కకు పోవాలన్నా పోలేరు. అర్థం.. డబ్బు లేకుండా జీవితం కష్టమవుతుంది. అర్థ అంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని,  సమాజాన్ని ఆదుకునే శ్రేయస్సు. కానీ డబ్బును సంపాదించడమే అర్థం అనే విషయానికి నిజమైన వివరణ అనుకుంటారు చాలా మంది.  ఈ కారణంగానే జీవితంలో డబ్బు కోసం చాలా పోరాటం చేస్తారు. దానిని ధర్మంతో సమతుల్యం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి తన అవసరాను గుర్తించాలి, తెలివిగా ప్లాన్ చేసుకోవాలి.  కానీ అత్యాశతో ఉండకూడదు.  ఉన్నదాంటో తృప్తి పడటం నేర్చుకోవాలి. కామ.. కామ అంటే కోరికలు.  ప్రేమ,  ఇంద్రియ సుఖాలు. కోరికలను అణచివేయవద్దని, వాటిని సరైన మార్గంలో నెరవేర్చుకోవాలని అర్థం.  కానీ ధర్మార్థాల  విషయంలో రాజీ పడకూడదు. కామం అంటే కేవలం ఇంద్రియాల గురించే కాదు.. కామం అంటే కోరిక, పని.. ఇందులో చాలా ఉంటాయి.  నేటి కాలంలో కామం అనగానే ఒక బూతు అనుకుంటారు. అది తప్పు. ప్రతి రోజూ ఒక చిన్న ఆనందం అయినా ఉండేలా చూసుకోవాలి.  ఎవరితోనైనా మాట్లాడాలి. ప్రకృతితో సమయం గడపాలి. కోరికలను బయటకు చెప్పడం కాదు.. బాలెన్సింగ్ గా ఉంచుకోవాలి. మోక్షం.. మోక్షం  అంటే విముక్తి. అన్ని ఒత్తిడి, భయం,  బంధనాల నుండి విముక్తి. ఒక వ్యక్తి నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం. ధర్మం, అర్థ,  కామాలు సమతుల్యంగా ఉన్నప్పుడు, మోక్షం సహజంగా వస్తుందని చెబుతారు. మోక్షం వైపు అడుగులు వేయాలంటే ధ్యానం చేయాలి. యోగా చేయాలి, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాలి.  వర్తమానంలో జీవించాలి.                                   *రూపశ్రీ.
అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చడం,  మూడు ముళ్లతో ఇద్దరు ఒక్కటవ్వడం.. ఇవన్నీ ఒక కొత్త జీవితానికి కేవలం మొదలు మాత్రమే.  వివాహం తర్వాత భార్యాభర్తల బంధం క్రమంగా పలుచబడుతోందని, భార్యాభర్తలు పెళ్లైన కొత్తలో ఉన్నంత సంతోషంగా, ప్రేమగా ఉండలేకపోతున్నారని చాలా మంది అంటుంటారు.  మూడు ముళ్లు పడినంత ఈజీగా వైవాహిక బంధం నిలబడదు. వైవాహిక బంధం నిలబడాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కృషి చేయాలి.  చాలామంది పెళ్లైన తర్వాత వైవాహిక బంధం నిలబెట్టుకునే బాధ్యత అమ్మాయిలదే అంటుంటారు.  అయితే దీని గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు రిలేషన్షిప్ నిపుణులు.. అవేంటో తెలుసుకుంటే.. బాధ్యత.. వైవావిక బంధం అనేది ఇద్దరు వ్యక్తుల వల్ల ఏర్పడుతుంది.  కాబట్టి ఆ బంధాన్ని నిలబెట్టుకునే బాధ్యత  ఇద్దరి మీద ఉంటుంది. చాలామంది కుటుంబాలలో పితృస్వామ్య వ్యవస్థ ఉంటుంది. దీని వల్ల మగవాడు తప్పు  చేసినా సరే.. మహిళలే బాధ్యత వహించాలని, మగవారు తప్పుగా మాట్లాడినా మహిళలు సర్దుకుపోవాలని అంటుంటారు.  మహిళలను చిన్నతనంగా చూడటం చేస్తుంటారు.  ఇలాంటి కుటుంబాలలో మహిళలకు ప్రాధాన్యత ఏమీ ఉండదు.   కానీ ఒక వైవాహిక బంధం సంతోషంగా ఉండాలంటే ఆ బందానికి బార్యాభర్తలు ఇద్దరూ బాధ్యత వహించాలి. భార్య కోసం భర్త,  భర్త కోసం భార్య ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఒకరి పట్ల మరొకరు బాధ్యతగా ఉంటారో.. అప్పుడు ఆ బందం కూడా బాగుంటుంది. ఆనందం.. ఏ బంధంలో అయినా సంతోషం,  ఆనందం ఉంటే ఆ బంధం ఎన్నేళ్లైనా బాగుంటుంది.  మగవాళ్లు తమ వైవాహిక జీవితంలో కాకుండా బయటి నుండి సంతోషాన్ని వెతుక్కుంటే వారు ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేరు.  తొందరగానే వారి జీవితంలో వెలితి కనిపిస్తుంది.  ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండే వారితో వచ్చే ఆనందమే ఎక్కువ కాలం ఉంటుంది. మహిళలు అయినా,  పురుషులు అయినా తమ భాగస్వామిలో సంతోషాన్ని వెతుక్కునే వారు అయితే.. వారిద్దరి బంధం అన్యోన్యంగా ఉంటుంది. పురుషులు చాలా వరకు స్నేహితులతో,  బయటి వ్యక్తులతో పార్టీలు,  ఫంక్షన్లలో గడపడానికి ఇష్టపడుతుంటారు. కానీ భార్యతో, కుటుంబంతో గడిపినప్పుడు కలిగే ఆనందం.. ఆ కుటుంబాన్ని మరింత బలంగా మారుస్తుంది. సంతృప్తి.. వివాహ బంధం సంతోషంగా ఉండాలంటే సంతృప్తి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.  ఉన్నదాంతో సంతృప్తి పొందేవారు,  తమకు అలాంటి జీవితం ఇచ్చినందుకు దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండేవారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ వైవాహిక ఆనందాన్ని బయట కాకుండా తమలోనే వెతకాలి.  బయట వెతకడం వల్ల  ఎప్పుడూ స్పష్టమైనది దొరకదు. అందుకే భాగస్వామికి సమయం ఇవ్వడం, వారితో గడపడం చేయాలి. ఇలా చేయడం వల్ల వారిలో ఉండే ఎన్నో విషయాలు వాటికవే అర్థమవుతాయి. వారి పట్ల ప్రేమ, గౌరవం మరింత బలపడతాయి.                                  *రూపశ్రీ.
  పిల్లలను పెంచడం అనేది బాధ్యతాయుతమైన,  కష్టమైన పని. తల్లిదండ్రుల ప్రతి మాట పిల్లల జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును  మెరుగ్గా ఉంచడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులుగా మారడం ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన అనుభూతి, కానీ తల్లిదండ్రులుగా సమర్థవంతమైన బాధ్యత కత్తిమీద సాము వంటిదనే చెప్పవచ్చు.  ప్రస్తుత కాలంలో పెంపకం కూడా చాలా మారిపోయింది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల సమయం లేకపోవడంతో పాటు అనేక ఇతర సమస్యలు తల్లిదండ్రులకు  ఇబ్బందిగా మారుతున్నాయి. తమ పిల్లలకు మంచి పెంపకాన్ని అందించాలంటే డబ్బు బాగా సంపాదించాలని  తల్లిదండ్రులు  పగలు రాత్రి కష్టపడి పనిచేస్తారు.    విద్య, మంచి బట్టలు,  ఖరీదైన వస్తువులు ఇస్తారు.  అయితే, ఇవన్నీ ఉన్నప్పటికీ చాలా సార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి దూరం అవుతుంటారు. పిల్లలను వారి తల్లిదండ్రుల నుండి దూరం చేసే తల్లిదండ్రుల 3 తప్పులు ఉన్నాయి.  అవేంటంటే..   రిజెక్ట్ చేయడం.. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాట ఏ విధంగానూ వినడం లేదని ఆందోళన చెందుతుంటారు.   ఈ కారణంగా తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య గొడవలు అవుతుంటాయి. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు,  పిల్లల మధ్య సరైన వాతావరణం  లేకపోవడం. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలు చెప్పే ప్రతిదాన్ని పట్టించుకోకపోవడం లేదా పిల్లలు చెప్పిన దాన్ని వ్యతిరేకించడం, రిజెక్ట్ చేయడం చేస్తారు.దీని కారణంగా  పిల్లలు కూడా తల్లిదండ్రులతో అదే విధంగా ప్రవర్తిస్తారు.ఈ సమస్య పోవాలంటే పిల్లలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కూర్చుని పిల్లలతో మాట్లాడాలి. సమయం.. నేటికాలం  తల్లిదండ్రులు ఇద్దరూ తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని  డబ్బు సంపాదనలో మునిగిపోతున్నారు.  దీని కారణంగా వారికి పని ఒత్తిడి పెరుగుతుంది.   పగలు మరియు రాత్రి పనిపై దృష్టి పెట్టడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీని కారణంగా పిల్లలు ఒంటరితనం ఫీలవుతారు.  తల్లిదండ్రులు  పిల్లల మధ్య దూరం పెరగడానికి ఇదే కారణం. పోలిక..  తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చుతారు. చదువు అయినా, ఆటలు అయినా, ప్రతి చిన్న విషయానికి  పిల్లలను ఇతరులతో పోల్చడం వల్ల వారి మనస్సులలో న్యూనతా భావన ఏర్పడుతుంది. దీని కారణంగా, పిల్లలు తల్లిదండ్రులపై కోపంగా ఉండి, వారికి దూరంగా ఉండటం మొదలుపెడతారు. తమ తల్లిదండ్రులను శత్రువులుగా భావిస్తారు.                                     *రూపశ్రీ.
నేటి కాలంలో మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి పెద్ద శత్రువులుగా మారినవి జబ్బులే.  కొత్త కొత్త ఆరోగ్య సమస్యలన్నీ బయటపడుతూ ఉంటాయి.  మనిషి ప్రాణాన్ని ప్రమాదంలో పడేసే లిస్ట్ లో బ్రాడీకార్డియా కూడా ఒకటి. ఇది గుండెకు సంబంధించిన జబ్బు. ఈ సమస్య తెలుసుకున్నప్పుడు దీన్ని సులువుగానే పరిష్కరించుకోవచ్చు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు అంటున్నారు. అసలు బ్రాడీకార్డియా అంటే ఏంటి? దీన్ని లక్షణాలు, కారణాలు ఏంటి? తెలుసుకుంటే.. బ్రాడీకార్డియా.. హృదయ స్పందన మందగించినప్పుడు దానిని బ్రాడీకార్డియా అంటారు. ఈ పరిస్థితి చాలా తీవ్రమైనది,  ప్రాణాంతకమైనదిగా కూడా మారే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని నిర్గక్ష్యం చేయకూడదు. నెమ్మదిగా హృదయ స్పందనను గమనించాలి.  ఒక నిమిషం వ్యవధిలో  హృదయ స్పందనలను లెక్కించాలి. బ్రాడీకార్డియా ఎలా నిర్ణయిస్తారు.. గుండె సాధారణంగా నిమిషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది. కానీ  గుండె నిమిషానికి 60 సార్లు కంటే తక్కువ కొట్టుకుంటే బ్రాడీకార్డియా ఉండవచ్చని వైద్యులు అంటున్నారు. బ్రాడీకార్డియా ఉంటే ఏం జరుగుతుంది.. SA నోడ్ అనేది గుండెకు ఉండే  సహజ పేస్‌మేకర్, ఇది గుండె కొట్టుకునేలా క్రమం తప్పకుండా విద్యుత్ సంకేతాలను పంపుతుంది. బ్రాడీకార్డియాలో ఈ సంకేతాలు బలహీనంగా లేదా ఆలస్యంగా ఉంటాయి. దీనివల్ల గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది . ఇది రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది, శరీరానికి,  ఇతర అవయవాలకు తగినంత ఆక్సిజన్ డెలివరీని నిరోధిస్తుంది. హృదయ స్పందన నెమ్మదిగా ఉంటే ఏం  జరుగుతుందంటే..  హృదయ స్పందన నెమ్మదిగా ఉండటం వల్ల  శరీరం,  మెదడుకు తగినంత రక్తం,  ఆక్సిజన్ చేరకుండా ఆటంకం కలుగుతుంది. ఇది అలసట, తలతిరగడం, తలతిరగడం, శ్వాస ఆడకపోవడం, గందరగోళం,  మూర్ఛపోవడానికి కూడా కారణమవుతుంది. చాలా ఫిట్‌గా ఉన్న వ్యక్తులలో కూడా హదయ స్పందన నెమ్మదిగా ఉండే అవకాశం ఉంటుంది. హృదయ స్పందన నెమ్మదిగా ఉండటంతో పాటు ఇతర  కారణాలు  బ్రాడీకార్డియాను నిర్ధారిస్తాయి. ఇతర కారణాలు.. వృద్ధాప్యం దీర్ఘకాలిక గుండె జబ్బులు గుండె  విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లడం కొన్ని మందులు తీసుకోవడం డయాబెటిస్, అధిక రక్తపోటు,  ఎలక్ట్రోలైట్ అసమతుల్యత నిర్ధారణ,  చికిత్స.. బ్రాడీకార్డియాను సాధారణంగా ECG ద్వారా నిర్ధారణ చేస్తారు.  కొన్నిసార్లు హోల్టర్ మానిటర్‌ను సాధారణ హృదయ స్పందనను రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు. చికిత్స పరిస్థితి  తీవ్రత,  కారణాన్ని బట్టి ఉంటుంది. తేలికపాటి కేసులకు మందులు,  జీవనశైలి మార్పులతో చికిత్స చేయవచ్చు. అయితే తీవ్రమైన కేసులకు పేస్‌మేకర్ అవసరం కావచ్చు. లీడ్ లెస్ పేస్ మేకర్లు.. సాంప్రదాయ పేస్‌మేకర్లు  ప్రభావవంతంగా ఉండేవి, కానీ వాటి వైర్లు సమస్యల ప్రమాదాన్ని పెంచేవి.. ఆ కారణంగా ఆధునిక లీడ్‌లెస్ పేస్‌మేకర్లు కనుగొన్నారు. ఇవి తక్కువ ఇన్వాసివ్,  వేగంగా కోలుకోవడానికి వీలు కల్పిస్తాయి. పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ తర్వాత చాలా మంది పూర్తిగా సాధారణ జీవితాన్ని గడుపుతారు.                      *రూపశ్రీ.
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు.. మందరాన్ని మంచి హెల్త్ కోసం కూడా వాడవచ్చు.  విదేశాలలో పువ్వులతో టీ తయారు చేసుకుని తాగుతారు.  అలాంటి లిస్ట్ లో మందారం కూడా ఉంది.  అసలు మందారం టీలో ఉండే ఔషద గుణాలేంటి? మందారం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే.. మందారం టీ.. మందారం టీ చూడటానికి చాలా కలర్ పుల్ గా ఉంటుంది. ఇది రుచిలో పుల్లగా, క్రాన్బెర్రీ లాంటి రుచిని కలిగి ఉంటుంది.  ఈ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసం ఎలాంటి సంకోచం లేకుండా దీన్ని తాగవచ్చు. మందారం టీ బెనిఫిట్స్.. మందారం టీ తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.  అధిక రక్తపోటు నియంత్రించడానికి మందారం టీ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది నరాలను సడలించి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు.. మందారం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో.. మందారం టీ శరీరంలో అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది కార్బోహేడ్రేట్లు, స్టార్చ్ ల శోషణను నెమ్మదిస్తుంది.  ఈ ప్రక్రియ జరగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయం.. మందారం టీ తాగడం వల్ల కాలేయం శుద్ది అవుతుంది. కాలేయంలో  పేరుకున్న కొవ్వును తగ్గించడంలో మందారం టీ  చాలా బాగా సహాయపడుతుంది.                         మందారం టీ తయారు విధానం.. మందారం టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. మందారం రెక్కలు.. గుప్పెడు నిమ్మకాయ..  సగం చెక్క తేనె.. స్పూన్ నీరు.. ఒక గ్లాస్ తయారీ విధానం.. ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు పోయాలి. అందులో శుభ్రం చేసుకున్న గుప్పెడు మందారం రెక్కలను వేయాలి. ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తరువాత స్టౌ ఆప్ చేయాలి.  కొంచెం వేడి తగ్గిన తర్వాత వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.  తేనె, నిమ్మరసం రుచి కోసం మాత్రమే.  అవి లేకుండా కూడా తాగవచ్చు.                                      *రూపశ్రీ.
సీజన్ ను బట్టి లభించే పండ్లు చాలా ఉంటాయి.  అలాంటి వాటిలో రేగు పళ్లు చాలా ముఖ్యమైనవి.  అయితే రేగు పళ్లను  ఎవరు తిన్నా ఏం పర్వాలేదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కొందరు వ్యక్తులు  రేగు పళ్లను తినకూడదట.  అసలు రేగు పళ్లను ఎవరు తినకూడదు? దీనికి గల కారణాలు ఏంటి? రేగు పళ్లను తినడం వల్ల ఎవరికి సమస్యలు ఉంటాయి? వివరంగా తెలుసుకుంటే.. సీజన్ ను బట్టి వివిధ రకాల పండ్లు అందుబాటులోకి వస్తుంటాయి.  ఆరోగ్యం బాగుండాటంటే సీజన్ లో దొరికే పండ్లు తీసుకోవడం మంచిదని అంటుంటారు వైద్యులు, పెద్దలు. శీతాకాలంలో లభించేవి రేగు పళ్లు. చాలామంది రేగుపళ్లను చాలా ఉత్సాహంగా తింటారు.  ఇవన్నీ చిన్నతనంతో ముడిపడిన ఆనందాలు. కొంతమందికి మాత్రం రేగు పళ్లు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. ఎవరు తినకూడదంటే.. మధుమేహం ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండాలి. బాగా పండిన రేగు పండ్లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతాయి. కేవలం చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండటమే కాకుండా వాటిలో కార్బోహేడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.  ఈ కారణంగా రేగు పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రేగు పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.  అప్పటికే గ్యాస్,  ఎసిడిటీ,  అజీర్తి మొదలైన సమస్యలు ఉన్నవారు రేగు పండ్లను తింటే సమస్య మరింత పెరుగుతుంది. గర్బిణీ స్త్రీలు రేగు పండ్లకు దూరంగా ఉండాలి.   రేగు పండ్లు తినడం వల్ల వారికి కడుపులో సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.  అలాగే మలబద్దకం లాంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కొంతమందికి రేగు పండ్లు తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.  దద్దుర్లు,  దురద వంటి సమస్యలు వస్తాయి.  అలర్జీ సమస్యలు ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండటం మంచిది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...