LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం (ఫిబ్రవరి 14) ప్రవేశపెట్టిన బడ్జెట్ పై శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పెదవి విరిచారు. పయ్యావుల బడ్జెట్ ప్రసంగం మొత్తం ఆత్మస్థుతి, పరనిందేనని విమర్శించారు.  అంకెల గారడీ తప్ప ఏ మాత్రం పసలేని బడ్జెట్ అంటూ బడ్జెట్ ప్రసంగంలో   చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పేర్లను పదిసార్లు ప్రస్తావించడం తప్ప ప్రజలకు మేలు చేసే అంశాలు  లేవని విమర్శలు గుప్పించారు.   ఈ బడ్జెట్ ప్రజల్లో ఉన్న కొద్దిపాటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని కూడా  ఈ బడ్జెట్ దెబ్బతీసిందని బొత్స అన్నారు. శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో  మాట్లాడిన బొత్స గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పథకం నిధుల కేటాయింపులోనూ ప్రభుత్వం కోత పెట్టిందనీ,   ఇక రాష్ట్ర అప్పుల విషయంలోనూ ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తోందని   ఆరోపించారు.   
రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ మాజీ నాయకుడు విజయసాయి రెడ్డి కమలానికి అనుకూలంగా తన గళాన్ని మరింత బిగ్గరగా వినిపిస్తున్నారు. జగన్ రాజకీయ ప్రవేశం నుంచే కాకుండా, అంతకు ముందు నుంచీ కూడా వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి, వైసీపీకి రాజీనామా చేయడమే కాకుండా, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా సమయంలో రాజకీయాలకు ఓ దణ్ణం పెట్టేసి.. తాను ఇక రాజకీయ సన్యాసం తీసుకున్నాననీ, వ్యవసాయమే ఇక తన వ్యాపకమనీ గట్టిగా ప్రకటించారు. అయితే అతి కొద్ది కాలంలోనే ఆయన తన రాజకీయ సన్యాసం నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత  కొద్ది కాలం మౌనంగా ఉన్న విజయసాయి.. బీజేపీకి మద్దతుగా తన గొంతు సవరించుకున్నారు.  అలాగే వైసీపీపై, జగన్ పై సునిశిత విమర్శలు చేయడం  ఆరంభించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ మద్యం కుంభకోణం విషయంలో  విజయసాయిరెడ్డి సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.  ఇక ఇటీవలి కాలంలో ఆయన ట్వీట్లు, కామెంట్లు అన్నీ కూడా ఆయన కషాయ దళంలో చేరనున్నారన్న ప్రచారానికి కారణమయ్యాయి.   తాజాగా విజయసాయి రెడ్డి ఆ ప్రచారంలో ఇసుమంతైనా అవాస్తవం లేదనిపించేలా సామాజిక మాధ్యమం వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.  వందేమాతరం పూర్తిగా పాడాల్సిందేనన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఆ నిర్ణయాన్ని విజయసాయి స్వాగతించడమే కాకుండా భారతీయులంతా సమర్థించి స్వాగతించాలని పిలుపు నిచ్చారు. పనిలో పనిగా విదేశీ మతాలంటూ పరోక్షంగా మతమార్పిడిపై సునిశిత వ్యాఖ్యలు చేశారు.  ఈ క్రమంలోనే జాతీయ భావం, దేశభక్తి, విదేశీ మతాలు అంటూ సాయిరెడ్డి చేసిన కామెంట్లు ఆయన కాషాయం కట్టేయడానికి రెడీ అయిపోయారనడానికి నిదర్శనంగా నెటిజనులు పేర్కొంటున్నారు. 
బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేతల కుటుంబాలతో తన నివాసంలో చేపట్టిన ఆత్మీయ పలకరింపు కార్యక్రమానికి మోడీ యే స్ఫూర్తి అని మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం (ఫిబ్రవరి 14) అసెంబ్లీ ఆవరణలో నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఎంత బిజీగా ఉన్నా  ప్రజాప్రతినిథులు నిత్యం  ప్రజలలో ఉండాలన్నదే తన అభిప్రాయమన్నారు. రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత ముఖ్యమో, నేతలతో ఆత్మీయ పలకరింపు కూడా అంతే ముఖ్యమన్న లోకేష్ అంతటితో ఆగకుండా.. ఏఐ క్వాంటం ఎంత అవసరమో మనవీయ సంబంధాలూ అంతే అవసరమని చెప్పారు. కుటుంబాలతో బంధం బలోపేతం కోసమే డిన్నర్ సమావేశాలని చెప్పారు.  క్వాంటం, ఏఐలు సీఎం చంద్రబాబు చూసుకుంటారనీ, తాను మానవీయ సంబంధాలు చూసుకుంటానన్నారు. అందుకే బడ్జెట్ సమావేశాలప్పుడైనా ఇలా నేతలందరితో ఏటా కలిసేలా ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు. ఇంక తాను బరువు తగ్గడం గురించి మాట్లాడుతూ.. మరో రెండు కిలోల బరువు తగ్గితే తాను లక్ష్యం చేరుకుంటానని చెప్పారు. ఇక సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమన్నది తనకు ప్రతిపక్షంలో ఉండగా అలవాటైందన్నారు. ఏ అంశంపైనైనా పార్టీ నిర్ణయం తీసుకునే వరకూ అభిప్రాయాలు బలంగా వినిపించవచ్చన్న లోకేష్.. ఒక సారి పార్టీ నిర్ణయం తీసుకున్న తరువాత దానికి కట్టుబడాల్సిందేనన్నారు. ఈనెల 28న యలమంచిలిలో బ్లూజెట్ పరిశ్రమ శంకుస్థాపనపై మాట్లాడుతూ,  ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి 2,300 కోట్ల రూపాయల పెట్టుబడి రానుందన్నారు. 
తన బడ్జెట్ ప్రసంగంలో వరుసగా మూడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కడం తన అదృష్టమన్న మంత్రి పయ్యావుల కేశవ్.. బడ్జెట్ అంటే కేవలం ఆదాయ, వ్యయాల పద్దు మాత్రమే కాదన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి బడ్జెట్ ఒక రోడ్ మ్యాప్ అని అభివర్ణించారు.  రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసేలా బడ్జెట్ ను రూపొందించినట్లు చెప్పిన పయ్యావుల కేశవ్.. పాలన ఎలా ఉండకూడదో గత జగన్ ప్రభుత్వం నిరూపించిందనీ, పాలన ఎలా ఉండాలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చూపుతోందనీ చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దేలా గత బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు చెప్పిన పయ్యావుల కేశవ్.. ప్రస్తుత బడ్జెట్ ను స్వర్ణాంధ్ర విజన్ కు బాటలు వేసేలా రూపొందించినట్లు వివరించారు.   ఇప్పటి వరకు సాధించిన .. ఇంకా ఏం సాధించాల్సిన అంశాల ఆధారంగా బడ్జెట్  రూపొందించినట్లు చెప్పిన విత్త మంత్రి,  ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్ ఉంటుందన్నారు.  సంక్షేమం కేవలం కాగితాలకు   క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు.  
ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకు మందు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం బడ్జెట్ ను ఆమోదించింది.   రూ.3,32,205 కోట్లతో పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో  రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు,  మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా వేశారు. ఇక రెవెన్యూ లోటు  రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు.ద్రవ్య లోటు రూ.75,868 కోట్లుగా అంచనా వేశారు.  ఇలా ఉండగా పయ్యావుల తన బడ్జెట్ లో పాఠశాల విద్య రూ.32,308 కోట్లు కేటాయించారు. ఇక  వైద్యానికి రూ.19,306 కోట్లు, వ్యవసాయానికి రూ.11,745 కోట్లు,  సాంఘిక సంక్షేమం రూ.11,118 కోట్లు కేటాయించారు. 
ALSO ON TELUGUONE N E W S
పాతతరం నుంచి ఇప్పటివరకు ఎంతో మంది నటీనటుల వ్యక్తిగత జీవితాలు అస్తవ్యస్తంగా ముగిశాయి. వాటిలో నటీమణులే ఎక్కువ శాతం ఉంటారు. సరైన సమయంలో పెళ్లి చేసుకోకపోవడం, చేసుకున్నా.. రెండో పెళ్లి, మూడో పెళ్లి వాళ్ళను చేసుకోవడం, ఆ తర్వాత కష్టాల పాలు కావడం మనం చూశాం. మరికొందరు అసలు పెళ్లే చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయారు. అలాంటి ఓ వింత పరిస్థితి ఒకప్ప్పుడు హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రేఖా వేదవ్యాస్‌కి వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో చాలా సినిమాలు చేసింది. అయితే ఆమె చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అవకాశాలు తగ్గాయి. దాంతో చిత్ర పరిశ్రమ నుంచి తప్ప్పుకుంది.    తెలుగు సినిమాల విషయానికి వస్తే.. 2001లో వచ్చిన ఆనందం చిత్రంతో పరిచయమైంది రేఖ. ఆ తర్వాత ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, అనగనగా ఓ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి, నాయుడమ్మ, నిన్న నేడు రేపు తదితర సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. 2012 తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. అప్ప్పుడప్ప్పుడు టీవీ షోల్లో కనిపించే రేఖ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంది.    ‘గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. శారీరకంగా, మానసికంగా కూడా చాలా కుంగిపోయాను. గతంలో నాకు పెళ్లిపై ఆసక్తి ఉండేది కాదు. ఆ తర్వాత మనసు మారి పెళ్లి చేసుకుందామంటే నా పరిస్థితిని చూసి ఎవరూ ముందుకు రావడం లేదు. ఏదో తొందరపడి పెళ్లి చేసుకుని విడాకుల దాకా వెళ్లే బంధాలకంటే, ఆలస్యమైనా మంచి సంబంధం కావాలన్నది నా అభిప్రాయం’ అని  అంటున్నారు రేఖ. 
దక్షిణాదిలో ఉన్న టాప్ డైరెక్టర్స్‌లో లోకేష్ కనకరాజ్ ఒకరు. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఆయన చేసే సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్ప్పుడు డైరెక్షన్ నుంచి యాక్టింగ్ వైపు వెళుతున్నాడు లోకేష్.    అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘డిసి’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు లోకేష్. అతని సరసన వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. సమ్మర్ స్పెషల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డార్క్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. తనకు నటనపై ఎంత ప్యాషన్ ఉంది అనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. పూర్తి వయొలెంట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో హీరోగా తనేమిటో ప్రూవ్ చేసుకోబోతున్నారు లోకేష్.     రగ్‌డ్‌గా ఉంటే దేవదాసు క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నాడు లోకేష్. ఒక సినిమాలో హీరోగా నటిండం లోకేష్ అభిమానులకు కూడా షాకింగ్‌గానే ఉంది. కేవలం డైరెక్షన్‌కే పరిమితం కాకుండా నటనపై కూడా దష్టి పెట్టడం అందర్నీ ఆకర్షిస్తున్న అంశం. ఈ చిన్న వీడియో గ్లింప్స్‌లో లోకేష్ కనగరాజ్ చాలా హ్యాండ్సమ్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. గతంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యామియో రోల్స్ చేసినా, ఈసారి ఒక ఫుల్ లెంగ్త్ పాత్రలో లేదా కీలక పాత్రలో ఆయన నటిస్తున్నట్లు సమాచారం. 
Cast: Aishwarya Arjun, Niranjan Sudhindra, Prakash Raj, Satyaraj, Kovai Sarala, Siri Hanumanth, Arjun Sarja (Cameo), Dhruv Sarja (cameo) Crew: Written by Arjun Sarja, Sai Madhav Burra Music by Anup Rubens Cinematography by G. Balamurugan Edited by Ayoob Khan Directed and Produced by Arjun Sarja Arjun Sarja has decided to introduce his daughter Aishwarya Arjun as leading lady with Seetha Payanam. The movie created buzz due to Vishwak Sen walking out. Now, the movie released on 14th February, 2026 for Valentine's Day weekend. With Anup Rubens composing music and Sai Madhav Burra writing dialogues, the gathered good momentum before release. Let's discuss about it in detail.  Plot:  Seetha (Aishwarya Arjun), who is highly efficient as a chef, doesn't want to get married or settle down. Her father (Satyaraj) worries about her well-being. She decides to go to Hyderabad for a chef workshop and in the drive, she meets Abhi (Niranjan) and slowly becomes his friend. She encounters Giri (Arjun Sarja) and different people. Due to these encounters, she reaches workshop 30 seconds later and escapes a freak accident that would have killed her. So, she decides to go and thank everyone who caused the delay on her road trip. Whom does he encounter? What role does Abhi play in all this? Watch the movie to know more.  Analysis: Arjun Sarja did direct blockbusters starring him in the lead roles. His prowess in directing action sequences resulted in them becoming big hits. Now, he decided to launch his own daughter but the problem lies in his outdated scene writing and execution. He had some very good ideas and very necessary points to say but the emotional touch and impact that these ideas require is missing.  Things go haywire from the beginning and even though there are good portions they are sparse. The scene writing and handling has been more or more less very old school that young audiences cannot connect with. He looks to pack the movie with songs and lengthy dialogues and good characters but the scenes needed to be interesting. The screenplay needed to follow fresh and novel ideas.  Aishwarya Arjun tried her best and rest of the cast handled the scenes easily. As the writing is too old school, the film feels jaded and dated. Arjun's cameo, Dhruv's cameo and all are packed back to back that they lose any sort of impact at all. Overall, the movie is hampered by over indulgence of the makers. Seetha tried hard to reach her destination but needed a better ride to take her to it.  Positives: Production values are good Aishwarya looks good Few ideas are well-intentioned. Negatives: Outdated execution Lethargic Screenplay Music and BGM Dragged scenes Bottomline:  Good Intentions need better writing and excecution.  Rating: 2/5 Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  -ధనుష్ కి షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ  -నెక్స్ట్ ఏం జరగబోతుంది -ధనుష్ నెక్స్ట్ సినిమా పరిస్థితి ఏంటి! ధనుష్(Dhanush)కి ఉన్న సినీ ప్రొటాన్షియల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తన స్వశక్తితో స్టార్ గా అవతరించాడు. సదరు స్టార్ ఇమేజ్ ని సైతం పక్కన పెట్టి 'డి' గ్లామర్ క్యారెక్టర్స్ చేస్తున్నా సరే, స్టార్ స్టేటస్ మాత్రం తనని వదిలి వెళ్లడం లేదు. అంతలా అభిమానులు, ప్రేక్షకులు ధనుష్ ని తమ నెత్తిన పెట్టుకుంటున్నారు. ప్రస్తుతంతో తన 55 వ చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. సాయి పల్లవి(Sai Pallavi),శ్రీలీల(Sreeleela)హీరోయిన్స్ గా చేస్తుండటంతో క్రేజీ ప్రాజెక్ట్ మారింది. రీసెంట్ గా ధనుష్ కి ఒక సినిమా లీగల్ నోటీసులు పంపించింది. ఆ వివరాలేంటో చూద్దాం. నాన్ రుద్రన్.. 2016 వ సంవత్సరంలో తేనాండాల్ ఫిలిమ్స్ బ్యానర్ లో చెయ్యాల్సిన మూవీ..స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించాలని భావించాడు. కారణాలు తెలియదు గాని దర్శకుడిగా ధనుష్ మారాడు. సదరు జరిగిన మొత్తం  విషయంపై తేనాండాల్ ఫిలిమ్స్ స్పందిస్తూ దర్శకుడు మారడంతో ధనుష్ పూర్తి స్క్రిప్ట్ ని ఇవ్వడంలో జాప్యం చేస్తున్నాడు. షూటింగ్ కి కూడా హాజరు కావడం లేదు. దీంతో మాకు 20 కోట్ల రూపాయిలు నష్టం వచ్చింది. ఇతర చిత్రాలని మాత్రం అంగీకరిస్తున్నాడని చెప్తూ లీగల్ నోటీసులు పంపించింది. ఈ విషయంపై ఇంతవరకు ధనుష్ టీం నుంచి రెస్పాన్స్ రాలేదు. Also read:  Funki.. ఫంకీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! దీన్ని బట్టి హిట్టా! ప్లాపా!    తేనాండల్ ఫిల్మ్స్‌ కి తమిళ చిత్రపరిశ్రమలో సుదీర్ఘ చరిత్ర ఉంది. 1976లో నిర్మాణ రంగంలో ప్రవేశించి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలని నిర్మించిన ఘనత వాళ్ళ సొంతం. ఇళయ దళపతి విజయ్, అట్లీ ల 'మెర్సీ'  మూవీ సదరు సంస్థ నుంచి వచ్చిందే.      
‘ఒక సినిమా రిలీజ్ అయ్యిందంటే వెంటనే సోషల్ మీడియాలో దాని రివ్యూ పెట్టేస్తున్నారు. నాకు తెలిసి అందులో 90 శాతం మూర్ఖులే ఉంటారు. వారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతికే మీరు, టికెట్ కూడా కొనకుండా ఫ్రీగా సినిమాలు చూసే మీరు.. దాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు. అలా చెయ్యడానికి మీకు మనసెలా వస్తుంది? వారం రోజులు ఆగితే ఆడియన్స్ కూడా సినిమా చూస్తారు. ఈలోగా మీ రివ్యూలతో వారిని ఎందుకు భయపెడుతున్నారు. రివ్యూలు రాసేవాళ్లు సినిమాలు తీసి ఫెయిల్ అయ్యారు, వారికి కనీసం స్క్రీన్‌ప్లే కూడా రాయడం రాదు. సినిమా లేకపోతే మీకు బతుకు లేదు. అదే సినిమాని నాశనం చేస్తూ అన్నం ఎలా తింటున్నారు? మీకు కనీసం సిగ్గు అనిపించడం లేదా?’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. గత 30 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ విభిన్నమైన కథాంశాలతో సినిమాలు రూపొందించే కష్ణవంశీ. ఆయన కెరీర్‌లో చెప్ప్పుకోదగ్గ సినిమాలు చాలా ఉన్నప్పటికీ చెప్ప్పుకోవడానికి కూడా వీలులేని సినిమాలు కూడా ఆయన తీశారు. 2023లో రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వంశీ.. మూడేళ్లుగా సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్నారు. తనకు సంబంధం లేని వ్యవహారాలలో ఎప్ప్పుడూ తలదూర్చని ఆయన.. తాజాగా సినిమాలపై సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూలపై స్పందిస్తూ..  ఆ రివ్యూలు రాసేవారిపై నిప్ప్పులు చెరిగారు.  సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి ఆట పూర్తయిన వెంటనే సినిమాపై నెగెటివ్ ప్రచారం మొదలు పెడుతున్నారని, ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికి ఇలాంటి నీచానికి ఒడికట్టడం సరైంది కాదని హెచ్చరించారు. ఒక సినిమా వెనుక చాలా కష్టం ఉంటుందని, దాన్ని అవహేళన చేస్తూ రివ్యూలు రాయడం అంటే వారి శ్రమని తక్కువ  చేసినట్టే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం కష్ణవంశీ చేసిన సినిమాలుగానీ, రిలీజ్ అవ్వాల్సిన సినిమాలుగానీ ఏమీ లేవు. ఏ సినిమాను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
    -నిన్న థియేటర్స్ లో అడుగుపెట్టిన ఫంకీ  -రిపోర్ట్ ఎలా ఉంది -ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత  -ట్రేడ్ సర్కిల్స్ ఏమంటున్నాయి   తన చిత్రాల్లో ఇక శృతిమించిన బూతులు ఉండవనే మాటకి కట్టుబడి నిన్నమాస్ కా దాస్ 'విశ్వక్ సేన్'(Vishwak Sen)ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఫంకీ'(Funky)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. పంచ్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రెస్స్ లో ఒకడిగా ఉన్న అనుదీప్(Anudeep)దర్శకత్వంతో పాటు కయదు లోహర్(Kayadu LOhar)హీరోయిన్ కావడంతో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ కి భారీగానే పోటెత్తారు. ఎంటర్ టైన్ మెంట్ వర్కవుట్ అయ్యిందని ఒక కొత్త విశ్వక్ సేన్ కనిపించాడనే అభిప్రాయాన్ని వారంతా వ్యక్తం చేస్తున్నారు. మరి తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఐదు కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల్లో టాక్ వినపడుతుంది. మేకర్స్ అయితే ఇంకా కలెక్షన్స్ గురించి అధికారంగా వెల్లడి చెయ్యలేదు. విశ్వక్ సేన్ గత చిత్రాలకి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్స్ తో  పోలిస్తే ఫంకీ ఎక్కువే రాబట్టినట్టు. కెరీర్ కి మంచి బూస్టప్ ని ఇచ్చిందని కూడా  చెప్పవచ్చు. ప్రెజెంట్ సినీ మార్కెట్ లో పర్వాలేదనే టాక్ ఉంది.వీకెండ్ తో పాటు మహాశివరాత్రి పర్వదినం కలిసి రావడంతో ఫంకీ కి ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. దీంతో కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.    Also read: కపుల్ ఫ్రెండ్లీ ద్వారా ఏం మెసేజ్ వెళ్తుంది..హైలెట్స్ ఇవేనా!      సితార ఎంటర్ టైన్ మెంట్స్,శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా వరల్డ్‌వైడ్‌గా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 13 కోట్ల రూపాయల మేర జరిగిందనేది టాక్. మరి థియేటర్స్ లో అందర్నీ నవ్విస్తున్న ఫంకీ తను థియేటర్స్ లో రావడానికి కారణమైన వాళ్ళ ముఖాల్లో కూడా నవ్వులు పూయిస్తుందేమో చూడాలి.   
  -థియేటర్స్ లో అడుగుపెట్టిన కపుల్ ఫ్రెండ్లీ  -పక్కా రొమాంటిక్ డ్రామా -ప్రేక్షకులు ఏం చెప్తున్నారు వాలెంటైన్స్ డే ని పురస్కరించుకొని ఈ రోజు 'కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly)తెలుగు,తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. పూర్తిగా చెన్నై సిటీలో చిత్రీకరించగా పెళ్లి కానీ యువతీ, యువకుడు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తే ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం, తదనంతరం ఆ ఇద్దరి జీవితాలు ఎలా ముగిశాయనే పాయింట్ తో తెరకెక్కింది. సదరు యువతీ యువకులైన శివ, చైత్ర క్యారెక్టర్స్ లో సంతోష్ శోభన్, మానస వారణాసి సూపర్ గా చేసారని మూవీ చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు. మంచి మెసేజ్ కూడా ఇచ్చిందనే అభిప్రాయం వాళ్ళ దగ్గర్నుంచి వ్యక్తమవుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం.  కథ పాయింట్ చాలా బాగుంది. తనని ఇష్టపడి పెళ్లి అవ్వకుండానే తన శరీరాన్ని అర్పించిన చైత్రకి హెల్త్ బాగోకపోతే శివ నిలబడిన తీరు హాట్స్ హాఫ్. శివ మంచి కోసం ఆలోచించిన చైత్ర క్యారక్టర్ డిజైన్ కూడా మెప్పించింది. లివింగ్ రిలేషన్ లో ఉండే వాళ్ళల్లో భావోద్వేగాలు ఉంటాయని, వాళ్ళని చెడు ఆలోచనలతో చూడకూడదనే పాయింట్ ని కూడా చెప్పారు.మూవీ మొత్తానికి ఇవే ప్రధాన హైలెట్స్  అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.    Also read:  Couple Friendly: కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ టాక్ పరంగా చూసుకుంటే మెజారిటీ ప్రేక్షకులు పర్వాలేదని చెప్తున్నారు.రివ్యూస్ కూడా నాట్ బాడ్ అని చెప్తున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో అజయ్ కుమార్ రాజు నిర్మించిన కపుల్ ఫ్రెండ్లీ కి  అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు.రాజీవ్ కనకాల, గోపరాజు రమణ, యోగిబాబు ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించారు. ఆదిత్య రవీంద్రన్  మ్యూజిక్.    
      Cast: Santhosh Sobhan, Manasa Varanasi, Rajeev Kanakala, Yogi Babu, Goparaju Ramana Crew:  Music Direction by Aditya Ravindran Cinematography by Dinesh Purushothaman Edited by Ganesh Siva Written and Directed by Ashwin Chandrasekar Produced by Ajay Kumar Raju.P Aiming for this year's Valentine's Day, Santhosh Sobhan has starred in a romantic film, Couple Friendly. Manasa Varanasi is playing the female lead role in this city based new-age romantic film produced by UV Concepts. The movie released today, on 14th February 2026, and let's discuss about it in detail.  Plot:  Shiva (Santosh Shoban), hailing from Nellore, finds himself as a loser who is deemed to be "fit-for-nothing" by his father (Goparaju Ramana). With an eye for aesthetics, he tries to make it as an independent interior designer in Chennai. He meets Mithra (Manasa Varanasi), who hails from Chittoor and trying to get placed in a big IT company as a bike pooling rider. Both decide to share a room as their problems pile up.  Mithra spots Shiva's talent and slowly starts to understand his lack of communication skills that are hampering his progress. So, she starts to help him putting aside her ambition. They confess to their strong feelings and convert their roommates situationship into live-in relationship. After he finds success, she starts to look to fulfil her dream but this results in a dire argument. What happens next? Where will their story lead to? Watch the movie to know more.  Analysis:  Santosh Shoban is good in his role and he brings believability to a struggling individual in a big city. After achieving success, he is able to bring that contrast in his body language brilliantly. His performance is a highlight for the film. Manasa Varanasi looked good, performed well in first half but towards climax, she needed to bring a bit more finesse to her expressions to increase the impact.  Writing by Ashwin Chandrasekar is good and relatable in the first hour as he fills it with genuine moments. He never over simplifies or exaggerate the situationship and live-in relationship. The sequences are designed to be grounded and real without trying to over-sell anything.  But similar level precision is missing in second hour. The film tends to run in circles at times as the resolution seems to be predictable. Here, the moments needed to be written and executed in even more impactful manner. There are beats but not enough material that really shines through for the resolution to work.  In the second hour, the ease in writing and groundedness are replaced by stretching and dragging at places. Sequences don't really hit home and hence, the film ends up being less impactful than the first hour. Technical values are good and better music would have helped film. It's a good attempt from makers but the moments needed much more polish for it to make an impact.  Positives: Santhosh Sobhan performance.  First half chemistry between leads  Genuine feel in first half  Technical values  Negatives:  Tonal shift in second hour  Predictable and draggy climax  Diluted impact Bottomline:  A good attempt that is undermined by an impactless second hour.  Rating: 2.5/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them
   సినిమా పేరు: కపుల్ ఫ్రెండ్లీ న‌టీన‌టులు: సంతోష్ శోభన్, మానస వారణాసి, రాజీవ్ కనకాల, గోపరాజు రమణ, యోగిబాబు తదితరులు   సినిమాటోగ్ర‌ఫీ: దినేష్ పురుషోత్తమన్ ఎడిట‌ర్‌: గణేష్ శివ  మ్యూజిక్: ఆదిత్య రవీంద్రన్  నిర్మాత‌: అజయ్ కుమార్ రాజు  రచన, దర్శకత్వం:అశ్విన్ చంద్రశేఖర్  బ్యానర్ : యువి క్రియేషన్స్  రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 14 , 2026  సంతోష్ శోభన్(Santhosh Soban)మానస వారణాసి(Manasa varanasi)వాలెంటైన్స్  డే కానుకగా ఈ రోజు 'కపుల్ ఫ్రెండ్లీ'(couple Freindly)అనే మూవీతో థియేటర్స్ లోకి వచ్చారు. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా కావడం, ప్రచార చిత్రాలతో మంచి క్రేజ్ ఏర్పడటంతో నిన్న ప్రీమియర్స్ కూడా ప్రదర్శించడం జరిగింది.. మరి కపుల్ ఫ్రెండ్లీ మెప్పించిందా లేదా చూద్దాం.   కథ నెల్లూరు కి చెందిన శివ(సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైన్ కోర్స్ పూర్తి చేసి ఉద్యోగం కోసం చెన్నై చేరతాడు. చిత్తూరుకి చెందిన చైత్ర (మానస వారణాసి) ఉద్యోగం పని మీదే చెన్నైలోనే ఉంటుంటుంది.లేడీస్ హాస్టల్ తన స్టే. ఆ తర్వాత శివతో కలిసి శివ ఉన్న ఇంట్లోనే ఉంటుంది. మైండ్ మెచ్యూరిటీ పరంగా ఇద్దరు ఎంతో ఉన్నతమైన వ్యక్తులు. ఒక రోజు శారీరకంగా కలుస్తారు.ఆ తర్వాత ఇద్దరి బిహేవియర్ లో చేంజ్ వస్తుంది. అదే టైమ్ లో చైత్ర గురించి ఒక భయంకరమైన నిజం శివ కి తెలుస్తుంది. శివ కి చైత్ర గురించి తెలిసిన నిజం ఏంటి? నిజం తెలిసిన శివ ఏం చేశాడు?ఆ ఇద్దరికి ఎలా పరిచయం జరిగింది? అసలు ఆ ఇద్దరు మంచి వాళ్ళా చెడ్డ వాళ్ళా? చివరకి వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ముగిసాయి అనేదే కపుల్ ఫ్రెండ్లీ.   ఎనాలసిస్    ఖచ్చితంగా మంచి కథే. పెళ్లి కాని ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన తప్పుగా అనుకోకూడదు. ఒక వేళ ఆ ఇద్దరు తప్పు చేసినా అది స్వచమైన ప్రేమకి నిదర్శనం. శారీరక సుఖం కంటే ప్రేమ గొప్పది అని కూడా ఈ కథ  చెప్పింది. చివరకి  శివ, చైత్ర క్యారెక్టర్స్ ముగిసిన విధానం కన్నీళ్లు కూడా తెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే శివ, చైత్ర క్యారెక్టర్స్ మధ్య పరిచయం సందర్భంగా వచ్చిన సీన్స్  బాగున్నాయి. కానీ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి రీజన్ మాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఒక కారణంతో హాస్టల్ నుంచి బయటకొచ్చిన చైత్రకి మళ్ళీ చెన్నై లాంటి మహానగరంలో ఉండటానికి హాస్టల్ దొరకదా? పైగా ఎన్నో హాస్టల్స్ తిరగడం కూడా చూపించారు.కథ మొత్తానికి ఈ ఇద్దరు కలిసి ఉండటమే ముఖ్యం కాబట్టి వేరేలా ప్లాన్ చేసి ఉండాల్సింది.   లైఫ్ లో శివ ఎదుగుదలకి చైత్ర చెప్పిన టిప్స్ తో పాటు సీన్స్ మొత్తం ఫ్రెష్ నెస్ తో ఉన్నాయి. మధ్య మధ్యలో రివర్స్ స్క్రీన్ ప్లే తో కేరళలో వచ్చిన సీన్స్ క్యూరియాసిటీ కలిగించాయి. శివ, చైత్ర వాళ్ళ ఫ్యామిలీ సీన్స్ రొటీన్. ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించిందే. సెకండ్ హాఫ్ ని సాగదీసినట్టుగా అనిపించింది. శివ, చైత్ర మధ్య ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ని ఇవ్వలేకపోయారు. చైత్రకి తన ప్రాబ్లమ్ తెలుసు కాబట్టి శివ బాగుండాలనే లక్ష్యంతో  యాంటీ గా మారవలసింది. తద్వారా శివ తో పాటు చైత్ర లో ఎమోషనల్ వర్క్ అవుట్ అయ్యేది. ఆ దిశగా వెళ్లకుండా చైత్ర క్యారక్టర్ లో కన్ఫ్యూజ్ ని క్రియేట్ చేసారు. హాస్పిటల్ సీన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా వర్క్ అవుట్ కాలేదు.   నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు  శివ గా సంతోష్ శోభన్ తన పెర్ ఫార్మెన్స్ తో బాగానే  మెప్పించాడు. కాకపోతే కథ మొత్తం  ఒకే వేరియేషన్ లో సాగడంతో యాక్టింగ్ లో మెరుపులు చూపించడానికి అవకాశం రాలేదు. చైత్ర గా మానస వారణాసి పర్ఫెక్ట్ గా సూటవ్వడంతో పాటు సదరు క్యారక్టర్ కి జీవాన్ని పోసింది. రాజీవ్ కనకాల, గోపరాజు రమణ, యోగిబాబు  తమ క్యారెక్టర్ల పరిధి మేరకు సెటిల్డ్ పెర్ ఫార్మ్ తో మెప్పించారు. అశ్విన్ చంద్రశేఖర్(Ashwin Chandrasekhar)దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు.  కథకుడుగా శివ, చైత్ర క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేయలేకపోయాడని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు, ఫొటోగ్రఫీ సూపర్. ఈ రెండే ప్రధాన హైలెట్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆదిత్య రవీంద్రన్ మ్యూజిక్ నుంచి వచ్చిన సాంగ్స్ మనసుని హత్తుకోవడంలో విఫలమయ్యాయి. ఓవర్ ఆల్ గా చూసుకుంటే మంచి కథ. సంతోష్ శోభన్, మానస వారణాసి తమ పెర్ ఫార్మెన్స్ తో మెప్పించారు. కాకపోతే సెకండ్ హాఫ్ ని సాగతీయ్యడంతో పాటు ఫీల్ ని సృష్టించడానికి క్యారెక్టర్స్ ని ఎండ్ చేసినట్టుగా ఉంది. బలాలు   1 సంతోష్ శోభన్, మానస వారణాసి పెర్ ఫార్మెన్స్  2 . ఫస్ట్ హాఫ్  3 .చెన్నై,కేరళ లో కథ జరగడం  4 ఫొటోగ్రఫీ  5 .టోటల్ కథ 6 .ఎడిటింగ్  బలహీనతలు  1 .మానస, సంతోష్ శోభన్ కలిసి ఉండటానికి సరైన రీజన్ సెట్ కాకపోవడం  2 . స్లో గా నడిచిన సెకండ్ హాఫ్  3 . మానస క్యారక్టర్ ని ఎండ్ చేసిన విధానం  4 . డైలాగ్స్  5 .సరైన సాంగ్స్ లేకపోవడం  6 .ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్   Rating 2.5/5                                                                                                                              అరుణాచలం  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
Released today (February 13) as a Valentine’s Day treat, Funky is receiving praise from audiences across all sections while bringing waves of laughter to theatres. On this occasion, the film’s team held a success press meet and expressed their gratitude to the audience. Funky marks the collaboration between Mass Ka Das Vishwak Sen, who has earned a distinct identity with diverse films, and director K.V. Anudeep, known for his comedy entertainers. Presented by Srikara Studios, the film is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas. The music is composed by Bheems Ceciroleo, and Kayadu Lohar plays the female lead. As the first collaboration between Vishwak Sen and Anudeep, and with promotional content generating strong buzz, Funky released in theatres on February 13 amid high expectations. The film, which runs as a full-on entertainer from start to finish, has kept audiences laughing for two hours straight. As a result, it has been receiving an excellent response from the very first show. The team recently conducted a success press meet to share their happiness and thank the audience wholeheartedly.   Vishwak Sen said: “It’s natural to feel pressure before a film’s release. But before Funky, I felt very calm. This morning, I watched the film with the audience at Sriramulu Theatre. Everyone thoroughly enjoyed it. Anudeep has made this film as a breezy entertainer that families can sit together and laugh at. Funky has given me great relief. The response from all sections of the audience has been wonderful. Doing a film like Funky in my career has given me immense happiness.” Kayadu Lohar said: “We watched Funky with the audience this morning. Seeing them laugh and enjoy every joke made us very happy. Thank you to the audience for showering so much love on our film.” Director K.V. Anudeep said: “We made Funky with the intention of creating a family entertainer that can be enjoyed together. Along with comedy, the film also has a well-developed love story and emotional moments. I am very happy with the response we are receiving from the audience.”   Producer Suryadevara Naga Vamsi said: “I believe you all liked Funky. From the beginning, we have been saying it’s a film that will make you laugh comfortably for two hours. Our belief has come true, and we are getting a very positive response from audiences. This film was made purely to make people laugh, and we have succeeded in that. Distributors are calling and saying the film is good. They say the comedy works well, and the mother sentiment in the second half is very effective. I request everyone to go to theatres and watch the film. Your ticket money will definitely be worth it. Come to the theatre to laugh you will not be disappointed.” Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు,  ధనవంతులకు డబ్బు గురించి ఎలాంటి చింత ఉండదు. కానీ మధ్యతరగతి కుటుంబాలు మాత్రం డబ్బు విషయంలో తెలిసీ తెలియక కొన్ని తప్పులు చేస్తారు.  ఈ కారణంగా చాలామంది డబ్బు నష్టపోతున్నారు.  ఈ విషయాన్ని స్వయానా ప్రపంచంలోనే ప్రముఖ మిలియనీర్ అయిన వారెన్ బఫెట్ పేర్కొనడం గమనార్హం. మధ్యతరగతి ప్రజలు తాము ఎంతో కష్టపడి పోగు చేసిన డబ్బును చేతులాగా నష్టపోతారని ఆయన అంటున్నారు. ఇంతకీ మధ్యతరగతి ప్రజలు డబ్బు ఎలా నష్టపోతున్నారు? తెలుసుకుంటే.. క్రెడిట్ కార్డు ఇంట్రెస్ట్.. ఈ రోజుల్లో మధ్యతరగతి ప్రజలు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఇది వారు చేసే  అతిపెద్ద తప్పట. నిజానికి, క్రెడిట్ కార్డులపై అధిక వడ్డీ రేట్ల భారం మధ్యతరగతిపై పడింది. మధ్యతరగతి వారు  క్రెడిట్ కార్డు వడ్డీ  సైకిల్  నుండి తప్పించుకోలేకపోతున్నారు.  దీని వలన ఎలాంటి  పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. కొత్త కారు కొనడం.. కారును హోదాకు చిహ్నంగా చూస్తారు. కానీ కారును హోదాకు చిహ్నంగా భావించి కొనుగోలు చేస్తే తప్పు చేసినట్టే.  కారు అనేది  ప్రయాణ సాధనంగా ఉండాలి. కొత్త కారు కొనుగోలు కారణంగా మధ్యతరగతి వారు ఎక్కువగా  అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. లోన్లు  తీసుకోవడం వల్ల కారు మార్కెట్ ధర కంటే ఖరీదైనదిగా మారుతుంది. అయితే కాలక్రమేణా కారు విలువ కూడా తగ్గుతుంది. దీని ఫలితంగా  మధ్యతరగతి వారు  డబ్బును పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. లాటరీ లేదా జూదం.. మధ్యతరగతి వారు తరచుగా జూదం ఆడి లేదా లాటరీ టిక్కెట్లు కొనడం ద్వారా ధనవంతులు కావాలని ప్రయత్నిస్తారు.  దీని కారణంగా వారు తమ డబ్బును కోల్పోయే పొరపాటు చేస్తారు.  మధ్య తరగతి కుటుంబాలలో చాలామంది  అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా డబ్బును వృధా చేస్తారు. అదే  డబ్బును వ్యాపారంలో పెట్టుబడి పెట్టగలిగినప్పుడు,కష్టాన్ని నమ్ముకుని ప్రయత్నాలు చేసినప్పుడు  అది విలువను పెంచుతుంది. అవసరానికి మించి.. మధ్యతరగతి కుటుంబాలలో కొందరు తమ ఆర్థిక స్థాయి,  తమ అవసరానికి మించి  ఇళ్లను  కట్టుకుంటారు.   ఇళ్లు గ్రాండ్ గా ఉండాలని అనుకుంటారు,  దీనికోసం అప్పులు తీసుకుంటారు.  ఇల్లు కేవలం జీవన సాధనం, హోదా,  చిహ్నం కాదని గుర్తించరు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మధ్యతరగతి కుటుంబాలలో చాలా శాతం.. తమ జీవితాంతం ఇల్లు కట్టుకోవడానికి చేసే ప్రయత్నాలలోనే కాలాన్ని గడుపుతాయి. ఈ కారణంగా ఆస్తులు కూడబెట్టుకోవడానికి మధ్య తరగతి వారి వద్ద ఏమీ మిగలదు.                           *రూపశ్రీ.
వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్  హడావిడి మొదలవుతుంది.  వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ,  ఒకో రోజు ఒకో విధంగా ప్రేమను వ్యక్తం చేస్తారు.  ఇందులో ప్రేమ అయినా, స్నేహం అయినా,  అభిమానం అయినా ఏదైనా సరే.. ఆ బంధం పట్ల ఉన్న ప్రేమను,  అభిమానాన్ని వ్యక్తం చేయడానికి వాలెంటైన్స్ వీక్ బాగా సహాయపడుతుంది. అయితే రోజ్ డే తో మొదలయ్యే ఈ హడావిడి వాలెంటైన్స్ డే తో ముగుస్తుంది.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. రోజ్ డే.. వాలెంటైన్స్ వీక్ లో మొదటి రోజును రోజ్ డే గా జరుపుకుంటారు. రోజ్ డే అంటే కేవలం పువ్వులు బహుమతిగా ఇవ్వడం మాత్రమే కాదు. ఇది ఎమోషన్స్ ను అంగీకరించడం అనే విషయాన్ని కూడా చాటి చెప్తుంది. ఎర్ర గులాబీలు లోతైన ప్రేమ,  అభిరుచిని సూచిస్తాయి. పసుపు గులాబీలు స్నేహం,  ఆనందాన్ని సూచిస్తాయి. గులాబీ రంగు గులాబీలు ఎదుటి వారిని మెచ్చుకోవడాన్ని వ్యక్తపరుస్తాయి. తెల్ల గులాబీలు శాంతి,  కొత్త ప్రారంభాలను సూచిస్తాయి. ప్రపోజల్ డే.. వాలెంటైన్స్ వీక్ లో రెండవ రోజును ప్రపోజ్ డే గా జరుపుకుంటారు.  ఈ రోజు తాము ప్రేమించిన వారికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. చాక్లెట్ డే.. చాక్లెట్ అంటే తీపిదనం, ఆనందం.  ఈ రోజున ప్రేమిస్తున్న వారికి చాక్లెట్ ను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ప్రేమించిన వారితో గడిపే క్షణాలు మరింత సంతోషంగా,  మరిచిపోలేనిది చేయాలని చెప్పడమే చాక్లెట్ ఇవ్వడంలో అంతరార్థం  అని చెబుతున్నారు. టెడ్డీ డే.. టెడ్డీ డే వాలెంటైన్ వీక్ లో  నాల్గవ రోజు.  ఫిబ్రవరి 10 న వస్తుంది. ఈ రోజున జంటలు  అంతులేని ప్రేమ,  స్నేహానికి గుర్తుగా  టెడ్డీ బేర్‌లను ఇచ్చి పుచ్చుకుంటారు. ప్రామిస్ డే.. ప్రామిస్ డే కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.  భాగస్వామిని ఎల్లప్పుడూ బేషరతుగా ప్రేమిస్తానని వాగ్దానం చేయడమే ప్రామిస్ డే లో ఉన్న ముఖ్య భాగం. బలమైన సంబంధానికి పునాది వాగ్దానంపై  ఆదారపడి ఉంటుంది.  అందుకే ప్రామిస్ చేస్తారు. హగ్ డే.. కౌగిలింత ఉద్రిక్తతలను తగ్గించి  ఉత్సాహపరుస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రేమను వ్యక్త పరిచేందుకు వాలెంటైన్ వీక్ లో ఆరవ రోజుగా హగ్ డే ను జరుపుకుంటారు.  కౌలిగి ఒక భరోసా ఇస్తుందని చెబుతారు. కిస్ డే.. వాలెంటైన్ వీక్ లో ఏడవ రోజును కిస్ డే గా జరుపుకుంటారు.  ప్రేమించిన భాగస్వామికి ముద్దు పెట్టడం ద్వారా తమ ప్రేమను, ఇష్టాన్ని వ్యక్తం చేస్తారు. ప్రేమికుల దినోత్సవం.. చివరగా ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు.  ఎల్లలు లేని ప్రేమను చాటిచెబుతూ జీవితాంతం ఒకరికొకరు ఉంటామని తెలియజేసుకునే రోజు ఇది.  అయితే ప్రేమకు గౌరవం దక్కినప్పుడే అది విలువైనదిగా ఉంటుంది.  ప్రేమను ఎప్పుడూ పరిహారం చేయకూడదు. అలాగే ప్రేమను తమ విచ్చలవిడితనానికి వాడుకోకూడదు.                                 *రూపశ్రీ
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు. ఈ కారణంగా మధ్యతరగతి, దిగువ తరగతి వారిగానే ఉండిపోతారు తప్ప, ధనవంతుల లిస్ట్ లోకి వెళ్లలేరు.  అయితే దీనంతటికి కారణం ఆ వ్యక్తులే అంటున్నారు ఆర్థిక నిపుణులు,  లైఫ్ స్టైల్ విశ్లేషకులు.  ఇంతకీ మనిషి చేసే తప్పులు మనిషిని ధనవంతుడు కాకుండా ఎలా  ఆపుతాయి.  ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే.. మనిషి చేసే తప్పు.. శ్రమ మనిషికి నిజమైన సంపద, కానీ మనిషి చాలా సార్లు శ్రమిస్తాడు కానీ అతనికి సొంతంగా ఎదగడం తెలియదు.  గంధం తీయాలంటే గందపు చెక్కను అరగదీయాలి,  అలాగే ఒక మంచి పూల హారం కావాలంటే పూలను దారంలోకి జొప్పించి అల్లాలి.  ఇవన్నీ వ్యక్తిలో ఓపిక,  శ్రమకు చక్కని నిదర్శనాలు. అలాంటి శ్రమ, ఓపిక ఉన్నప్పుడే.. దేవుడి ముందు నిలబడి దేవుడిని తృప్తిగా ప్రార్థిస్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా పొందగలుగుతారు. అదే విధంగానే.. మనిషి కష్టపడి పనిచేస్తేనే తనకు తాను ఫలితాన్ని పొందగలుగుతాడు. అంతేకానీ కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడి చివరిలో ఫలితం రావాలని అనుకుంటే అది ఆశాజనకంగా ఉండదు. సద్గుణాలు.. మనిషిలో సద్గుణాలు ఉంటే అతను ధనవంతుడు కావడానికి మార్గాలు పదే పదే కలిసి వస్తూనే ఉంటాయి.  పేదరికంలో ఉన్న వ్యక్తికి ఓర్పు ఉంటే గొప్ప అవకాశాలు చూపిస్తుంది.  మాసిపోయిన బట్టలు మంచి నీటితో ఉతికితేనే అవి తెల్లగా మెరుస్తాయి. అలాగే వ్యక్తి మొదట సద్గుణాలు అలవర్చుకున్నప్పుడు అతను  అతను ఆకర్షిస్తాడు.  అతని వ్యక్తిత్వంలో మంచి, చెడు బయటకు ప్రకాశిస్తాయి.  ధనవంతులు కావడం అంటే చెడు గుణాలు కలిగి ఉండటమా లేదా అనేది కాదని కొందరు అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. చెడు దారిలో కలిగే ధనం ఎప్పటికీ మనిషిని ఉన్నతంగా ఉంచదు. నిజమైన ధనవంతుడు.. పేదరికంలో ఉన్న వ్యక్తి అసలు పేదవాడిగా  పరిగణించకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఎందుకంటే నిజమైన పేదవాడు డబ్బు లేని వాడు.. జ్ఞానం,  వ్యక్తిత్వం లేనివాడే నిజమైన పేదవాడు అంటాడు ఆచార్య చాణక్యుడు. జ్ఞానం లేని వ్యక్తికి ఎంత సంపద ఉన్నా అతను వ్యర్థ్యం అంటాడు. అవకాశాలు.. మనిషి జీవితంలో అవకాశాలు రావడం లేదని వాపోతుంటాడు. కానీ నిజానికి అవకాశాలను సృష్టించుకునే వాడే ఆర్థికంగా ఎదగగలడని అంటారు. ఎడారిలో అయినా ఇసుకను లోతుగా తవ్వితేనే నీటి చెలమ లభించే అవకాశం ఉంటుంది. అలాగే అవకాశాలే లేవు అనుకున్నప్పుడు వాటిని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది. అపాత్ర దానం.. దానం చేయడం చాలా గొప్ప గుణం. కానీ దానం చేస్తే పుణ్యం వస్తుందనే కారణంతో చేతిలో ఉన్నది అనవసరమైన వ్యక్తులకు దానం చేయడం పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టే. దానం చేయడం ఎంత మంచి కార్యమో.. అర్హత లేని వారికి దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభించకపోగా, ఆర్థికంగా దిగజారిపోతారు.   పొదుపు.. చాలామందికి పొదుపు చేయడం అంటే అవసరాలు మాని మరీ దాచిపెట్టడం అనుకుంటారు. కానీ అవసరాలు మానుకుని దాచిపెట్టే డబ్బే పేదరికానికి కారణం అవుతుంది.                                   *రూపశ్రీ.
భారతీయులు ఆహార ప్రియులు.  భారతీయుల భోజనంలో చాలా రకాలు పదార్థాలు ఉంటాయి.  ముఖ్యంగా చాలామంది తమ భోజనంలో కొంచెం అన్నం  చపాతీ,  రెండు లేదా మూడు రకాల కూరలు.. ఇలా ఉండేలా చూసుకుంటారు. అయితే ఒకే భోజనంలో చపాతీ,  అన్నం రెండూ తినడం మంచిదేనా అని కొందరి అనుమానం.  నిజానికి నేటికాలంలో హోటళ్లలో కూడా  ఇలాంటి మెనూనే లంచ్ లో ఇస్తంటారు.  అయితే రెండూ తినడం ఎంత వరకు మంచిది? తెలుసుకుంటే.. బోజనంలో చపాతీ, అన్నం రెండూ కలిపి తినడం అనేది పూర్తీగా వ్యక్తి శారీరక స్థితి మీద ఆధారపడి ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు. కానీ స్పష్టంగా చెప్పాలంటే మాత్రం చపాతీ, అన్నం రెండూ భోజనంలో తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచి ఛాయిస్ కాదని అంటున్నారు. ఒక్క చపాతీ,  ఒక కప్పు అన్నం.. ఇది చాలా మంది ఎంచుకునే అలవాటు. దీన్ని చాలా ఇష్టంగా ఎంచుకుంటారు. పైగా దీన్ని చాలా బాలెన్స్డ్ ఫుడ్ అని కూడా పిలుస్తారు.  కానీ చపాతీ, అన్నం.. రెండూ భోజనంలో తీసుకోవడం అయితే అస్సలు మంచిది కాదట. చపాతీలోనూ, అన్నంలోనూ.. రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.  రెండూ భోజనంలో తినడం వల్ల కార్బోహైడ్రేట్లు అధికంగా శరీరానికి అందుతాయి. తద్వారా కేలరీలు కూడా ఎక్కువ తీసుకున్నట్టు అవుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు,  బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మరీ ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు అన్నం అవాయిడ్ చేసే చర్యలో భాగంగా కొంచెం అన్నం,  చపాతీ అని తమ లంచ్ ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇది  రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది.  అందుకే ఈ రెండింటి కాంబినేషన్ అస్సలు తినకూడదు. ప్రతి ఆహార పదార్థంలో ఉండే కార్బోహైడ్రేట్‌లకు  విభిన్నమైన శైలి ఉంటుంది.  గోధుమలలో ఉండే కార్బోహైడ్రేట్స్ వేరు,  అన్నంలో ఉండే కార్బోహేడ్రేట్స్ వేరు.. ఈ రెండింటికి విడివిడిగా తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ కలిపి తీసుకున్నప్పుడు జీర్ణం కావడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.  అందుకే ఈ కాంబినేషన్ తినడం మంచిది కాదు.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. అయితే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే  ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం ప్రేగులలోనే జీర్ణం అవుతుంది. కానీ నేటికాలంలో చాలామంది పేగు ఆరోగ్యం దెబ్బతినడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.  ముఖ్యంగా నేటికాలంలో ఫాస్ట్ ఫుడ్,  శీతల పానీయాలు తాగడం వల్ల పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరంలో కొన్ని లక్షణాలను బట్టి   ప్రేగు ఆరోగ్యం బాగుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.  ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే ప్రేగు ఆరోగ్యం ఎంతో ముఖ్యం.  ఎందుకంటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పేగులలోనే తయారవుతుంది. పేగు ఆరోగ్యం దెబ్బతింటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా తయారవదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రేగు ఆరోగ్యం దెబ్బతింటే జీర్ణక్రియ నుండి రోగ నిరోధక శక్తి దెబ్బతినడం వరకు చాలా రకాల సమస్యలు వస్తాయి. తరచుగా ఉబ్బరం, కడుపులో గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు వస్తుంటే ప్రేగు ఆరోగ్యం దెబ్బతినిందని,  ప్రేగు సమస్యలు ఉన్నాయని అర్థం. గట్ మైక్రోబయోమ్ అసమతుల్యత ఏర్పడినప్పుడు ఆహారం సరిగా జీర్ణం కాదు.  దీని వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడటం, కడుపు ఉబ్బరంగా మారడం, పొట్ట బరువుగా ఉండటం జరుగుతుంది. తరచుగా మలబద్దకం లేదా విరేచనాలు వంటి సమస్యలు వస్తున్నా కూడా ప్రేగు ఆరోగ్యం దెబ్బతిన్నదని అర్థం. ప్రేగు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల పోషకాలు సరిగా గ్రహించబడవు. ఇది తరచుగా అలసటకు దారితీస్తుంది.  ఎంత మంచి ఆహారం తీసుకున్నా శరీరం శక్తివంతంగా ఉండదు. శరీరంలో దాదాపు 70శాతం రోగనిరోధక వ్యవస్థ పేగు ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది.  కాబట్టి ప్రేగు సమస్యలు వస్తే రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా ఉండటం,  చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను కూడా శరీరం భరించలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. గట్ మైక్రోబయోమ్ అసమతుల్యత కావడం వల్ల జీవక్రియ కూడా ప్రభావితం అవుతుంది.  ఇది బరువు పెరగడానికి అయినా కారణం కావచ్చు, లేదంటే బరువు తగ్గడానికి అయినా కారణం కావచ్చు.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
వంటింట్లో సుగంధ ద్రవ్యాలు చాలా ఉంటాయి.  ఇవి అటు వంటలను ఘుమఘుమలాడించడమే కాకుండా.. ఇటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  చాలామంది రక్తంలో చక్కెర నియంత్రణకు,  ఇన్సులిన్ నిరోధకతకు పిసిఏస్ లేదా జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం దాల్చిన చెక్కను ఉపయోగిస్తారు. అయితే దాల్చిన చెక్క కొనేముందు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తప్పుగా ఉన్న దాల్చిన చెక్కను కొనుగోలు చేయడం,  దాన్ని వినియోగించడం వల్ల ప్రయోజనం చేకూరడానికి బదులు,  హాని జరిగే  అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు క్వాలిటీ ఉన్న దాల్చిన చెక్కను ఎలా గుర్తించాలి? దాల్చిన చెక్కలో రకాలేంటి? వీటి గురించి వివరాలు తెలుసుకుంటే.. సిలోన్ సిన్నమోన్.. సిలోన్ సిన్నమోన్ ను  నిజమైన దాల్చిన చెక్క అని కూడా పిలుస్తారు. ఇది  ప్రధానంగా శ్రీలంక నుండి వస్తుంది. ఇది సహజంగానే చాలా తక్కువ మొత్తంలో 'కూమరిన్' కలిగి ఉంటుంది. ఇది దీర్ఘకాలిక రోజువారీ ఉపయోగం కోసం సురక్షితమైనదని చెబుతారు. సిలోన్ దాల్చిన చెక్క సారం పై చేసిన అధ్యయనాలు ఇది ఆహారం తీసుకోవడానికి ముందు   రక్తంలో చక్కెర స్థాయిలను,  ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చూపించాయి . కాసియా సిన్నమోన్.. ఇది మార్కెట్లో లభించే అత్యంత సాధారణ దాల్చిన చెక్క. ఇందులో చాలా ఎక్కువ స్థాయిలో కూమరిన్ ఉంటుంది. దీన్ని అప్పుడప్పుడు మీ ఆహారంలో రుచి కోసం చేర్చుకుంటే పర్వాలేదు. కానీ  ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రతి రోజు పెద్ద పరిమాణంలో తీసుకుంటే అది కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని చెబుతున్నారు. ఇది గుర్తుంచుకోవాలి..  దాల్చిన చెక్కను దాని రుచి,  సువాసన కోసం మాత్రమే ఉపయోగిస్తుంటే ఏ రకమైన దాల్చిన చెక్కనైనా వాడవచ్చు, కానీ దాల్చిన చెక్కను రోజువారీ ఆరోగ్య దినచర్యలో భాగం చేసుకుంటూ ఉంటే సిలోన్ దాల్చిన చెక్కను ఎంచుకోవడం మంచిది. సిలోన్ దాల్చిన చెక్క ఎలా గుర్తించాలి.. దుకాణంలో నిజమైన దాల్చిన చెక్కను గుర్తించడానికి, ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. సిలోన్ దాల్చిన చెక్క.. దీని బెరడు మడతపెట్టిన కాగితంలాగా సన్నగా, మృదువుగా,  బహుళ పొరలుగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే చుట్టలాగా ఉంటుంది.  లోపల పొరలుగా కనిపిస్తూ ఉంటుంది. కాసియా దాల్చిన చెక్క.. కాసియా దాల్చిన చెక్క మందంగా, గట్టిగా,  కలపతో లాగా ఉంటుంది. దీనికి ఒకే పొర ఉంటుంది. పొడి కొనుగోలు చేస్తే.. దాల్చిన చెక్కను కొనుగోలు చేస్తే.. సిలోన్ దాల్చిన చెక్కను,  కాసియా దాల్చిన చెక్కను వాటి ఆకృతిని చూసి గుర్తించవచ్చు. కానీ పొడి కొనుగోలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్యాకేజీపై ఉన్న లేబుల్‌ను తప్పకుండా చదవండి. దానిపై 'సిలోన్ దాల్చిన చెక్క' లేదా 'సిన్నమోమమ్ వెరం' అని రాసి ఉండాలి. అలాంటి దాల్చిన చెక్క పొడినే కొనుగోలు చేయాలి.                                           *రూపశ్రీ.