LATEST NEWS
విశాఖ నగరపాలక సంస్థ లో మరో వైసీపీ వికెట్ పడిపోయింది. గతవారం జీవీఎంసీ మేయర్ పదవిని కోల్పోయిన వైఎస్ఆర్సిపి డిప్యూటీ మేయర్ పదవిని కూడా కోల్పోయింది. డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.   దీంతో వైసీపీ డిప్యూటీ పదవిని కూడా కోల్పోయినట్లే. వచ్చే నెలలో మరొక డిప్యూటీ మేయర్ నాలుగేళ్ల పదవి కాలం ముగియడంతో అప్పుడు కూడా మరో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి సభ్యులు నిర్ణయించారు ఇదిలా ఉండగా కేవలం పదవి మాత్రమే కాక వైఎస్ఆర్సిపి పాలనలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు జియ్యాని శ్రీధర్ పాల్పడినట్లు ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకునే దిశలో కూటమి కార్పొరేటర్లు అడుగులు వేస్తున్నారు ఇప్పటికే అతనితో వ్యాపార సంబంధాలు నెరపే కూటమి నాయకులపై చర్యలు తీసుకుంటామని మూడు పార్టీల అధిష్టానాలూ హెచ్చరికలు జారీ చేశాయి.
సర్వత్రా అదే ఉత్కంఠ! భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభకు సర్వం సిద్దమైంది. ఆదివారం (ఏప్రిల్ 27) జరిగే రజతోత్సవ సభ  వరంగల్ జిల్లా  ఎల్కతుర్తి సభా ప్రాంగణం సర్వాంగ సుదరంగా వెలిగి పోతోంది. సభా ప్రాంగణమే కాదు పరిసరాలు మొత్తం గులాబీ మయమయ్యాయి.ఇంచుమించుగా పది లక్షల  మంది  సభకు వస్తారన్న అంచనాలతో  ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. స్థానిక నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. లక్షలాదిగా వచ్చే ప్రజలకు ఏ లోటూ లేకుండా, ఎలాంటి అసౌకర్యం కలగా ఃకుండ.. వైద్య సేవలు, అంబులెన్స్ లు సహా అని సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  మరో వంక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27న ఏర్పడిన గులాబీ పార్టీ పాతికేళ్ల   పండుగను, ధూమ్ ధామ్ గా, అత్యంత వైభవంగా, నభూతో నభవిష్యత్  అన్న విధంగా నిర్వహించేందుకు గులాబీ పార్టీ గత నెల రోజులకు పైగానే కసరత్తు చేస్తోంది. ఓ వంక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు  జిల్లాల వారీగా, నియోజక వర్గాల వారీగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తునారు. సభను ఎలా సక్సెస్ చేయాలనే విషయంలో నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.  ఒక్కసారి ఓడిపోయినా, మళ్ళీ వచ్చేది మనమే  అన్న భరోసా ఇస్తున్నారు. నాయకుల్లో ఉత్సాహం నింపుతున్నారు. మరో వంక పార్టీ కార్యనిర్వక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఇతర ముఖ్యనాయకులు జిల్లాలలో పర్యటించి నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా గట్టిగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా జన సమీకరణ పై గులాబీ దళం ప్రత్యేక దృష్టిని కేద్రీకరించింది. ఒక విధంగా చూస్తే రజతోత్సవ సభను బలప్రదర్శన సభగా నిర్వహించే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.   అయితే  రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహించడం సహాజమే.  అయితే..  ఎన్నికల సమయంలో లేదా ఎన్నికలు సమీపిస్తున్నసమయంలో మాత్రమే రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభలను ప్లాన్ చేస్తాయి.  అయితే, బీఆర్ఎస్  ఇప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయని బల ప్రదర్శన లక్ష్యంగా సభను నిర్వహిస్తోంది  అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదని అంటున్నారు. సమీప భవిష్యత్ లో పంచాయతీ ఎన్నికలు,  వస్తే గిస్తే, ఆ పది నియోజక  వర్గాల ఉప ఎన్నికలు మినహా చెప్పుకోదగ్గ ఎన్నికలు ఏవీ కనిపించడం లేదు.అయినా, బీఆర్ఎస్ పదిలక్షల మందితో భారీ బహిరంగ సభను ఈ సమయంలో ఎందుకు నిర్వహిస్తోంది? ఈ సభ నిర్వహించేందుకు గులాబీ  పార్టీ  ఇంచుమించుగా రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని అంటున్నారు. అందులో ఎంత నిజం ఉందో ఏమో కానీ..  జరుగుతున్న ఏర్పాట్లు, ప్రచార హోరు చూస్తుంటే, ఇంకొంచెం ఎక్కువే ఖర్చయినా ఆశ్చర్య పోనవసరం లేదని కారు నేతలే అంటున్నారు. అవును.. డబ్బుకు వెనకాడకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నేతలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.  అయితే.., ఈ సమయంలో  ఎందుకింత ఆర్భాటం, ఎందుకీ బల ప్రదర్శన అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదని అంటున్నారు.  ఆఫ్కోర్స్.. ఒక పార్టీ చరిత్రలో రజతోత్సవాలకు ఉండే ప్రాధాన్యతను, ప్రాముఖ్యతని ఎవరూ కాదన లేరు. నిజానికి  ఒక ప్రాంతీయ పార్టీ పాతికేళ్లు  మనుగడ సాగించడమే గొప్ప విషయం.   ముఖ్యంగా.. ఒక ఉద్యమ పార్టీగా.. తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే సింగల్ పాయింట్ ఎజెండాగా  పుట్టిన పార్టీ పాతికేళ్ళు ప్రస్థానం సాగించడం సాధారణ విషయం కాదు.  అందుకే    బీఆర్ఎస్ గాపేరుమార్చుకున్న టీఆర్ఎస్  రజతోత్సవాలను ఎంత ఘనంగా జరుపుకున్నా అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. అందులోన.. ,ఈ పాతికేళ్లలో గులాబీ పార్టీ,రాష్రాన్ని సాధించి, లక్ష్యాన్ని చేరుకోవమే కాకుండా, దేశ  రాష్ట్ర రాజకీయాలను ఎంతో కొంత  ప్రభావితం చేసింది. అవును..  ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీగా (14 ఏళ్ళు) ప్రజాస్వామ్య పద్దతిలో రాజకీయ పోరాటం చేసి రాష్ట్రన్ని సాధించినగులాబీ పార్టీ, పదేళ్ళ అధికార పార్టీగా ఓ వెలుగు వెలిగిన పార్టీ రజతోత్సవాలను జరుపుకోవడం ఎంత మాత్రం తప్పు కాదు. కానీ..  కోట్లు ఖర్చు పెట్టి, ఎన్నికల సభను తలపించే విధంగా లక్షల మందితో సభను నిర్వహించడం  ఎందు కోసం?  దేనికి సంకేతం?  అనే ప్రశ్నలకు ఆస్కారం కల్పిస్తోందని అంటున్నారు. అదొటి అయితే..  రజతోత్సవ సభ వేదిక నుంచి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసేఅర్  ఏమి మాట్లాడతారు?  అనేది   ఆసక్తిని రేకెత్తిస్తోందని అంటున్నారు. గడచిన 15- 16 నెలల్లో కేసీఆర్ ఫార్మ హౌస్ గడపదాటి బయటకు వచ్చిన సందర్భాలు పెద్దగా లేవు. ఇక బహిరంగ సభలో ప్రసంగించి కూడా చాల కాలమైంది. ఎప్పుడో  సంవత్సరం సంవత్సరం క్రితం నల్గొండ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభల్లో కనిపించారు. అంతే..  ఆ తర్వాత కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన లేదు. సో .. సహజంగానే  కేసీఆర్ ఏమి మాట్లాడతారు అన్నది  మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్లు బీఆర్ఎస్ వారికే కాదు, కాంగ్రెస్, బీజేపీ వారికి, సామాన్య ప్రజలకు కూడా ఆసక్తి కల్గిస్తోంది. అయితే..  విశ్వసనీయ సమాచారం మేరకు  కేసీఆర్... తెలంగాణ ఉద్యమ చరిత్రతో  మొదలు పెట్టి.. బీఆర్ఎస్పదేళ్ళ పాలన,  ప్రస్తుత కాంగ్రెస్ పాలన గురించి ప్రసంగించే అవకాశాలే ఎక్కువగా  కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల పైనే, కేసీఆర్ ఫోకస్  ఉంటుందని, అంటున్నారు. మరోవంక, జాతీయ రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ ఏమి మాట్లాడతారు? అనేది కూడా ఆసక్తిని రేకిస్తోందని అంటున్నారు. అలాగే.. ఈ సభ తర్వాత కేసీఆర్ ఏమి చేస్తారు?  బ్యాక్ టూ ఫార్మ్ హౌస్ అంటారా? ముందుండి పార్టీని నడిపిస్తారా అ నేది అన్నిటినీ మించిన  వంద కోట్ల ప్రశ్న.
జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డిని  పోలీసులు శుక్రవారం (ఏప్రిల్ 25) అరెస్టు చేసి విజయవాడ తరలించారు. ఇప్పటి వరకూ జగన్ హయాంలో ప్రభుత్వంలో, పార్టీలో అన్నీ తానై వ్యవహరించి  సకల శాఖల మంత్రిగా, సీఎం జగన్ కు కళ్లు, చెవులూ నోరుగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే డిఫాక్టో సీఎంగా చక్రం తిప్పిన రామకృష్ణారెడ్డి, అలాగే వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా  సామాజిక మాధ్యమంలో అడ్డగోలు పోస్టులు, అనిచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలతో రెచ్చిపోయి భ్రష్టుపట్టిన పిల్ల సజ్జల అదేనండి సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రరత్నం సజ్జల భార్గవ  రెడ్డే అందరికీ సుపరిచితులు. కానీ ఇప్పుడు జగన్ హయాంలో జరిగిన భారీ మద్యం  కుంభకోణం కేసులో అరెస్టయిన ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరు అన్న  ఆసక్తి  సర్వత్రా వ్యక్తం అవుతోంది.  ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అని చెప్పబడుతున్న రాజ్ కసిరెడ్డి తరువాత అరెస్టైన వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డి. మద్యం  కకుంభకోణంలో  ఈ సజ్జల శ్రీధర్ ెడ్డి వసూల్ రాజాగా వ్యవహరించారనీ,  మద్యం తయారీ కంపెనీలు కమీషన్లు చెల్లించేలా కంపెనీలను వాటిని బెదిరించడం, వసూలు చేసిన కమిషన్లను చేర్చాల్సిన చోటికి చేర్చడం వంటి కీలక బాధ్యతలు నిర్వహించినది   సజ్జల శ్రీధర్ రెడ్డిది దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. సరే ఇప్పుడు అసలు ఎవరీ సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే.. మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకే వెళ్లాల్సి ఉంటుంది.  జగన్ ప్రభుత్వంలో కీలక ప్రాత పోషించిన, సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి సమీప బంధువు. జగన్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో  సజ్జల రామకృష్ణారెడ్డి  తన పలుకుబడిని ఉపయోగించి.. తన కుమారుడు  సజ్జల భార్గవ్ రెడ్డి (పిల్ల సజ్జల) సహా తన   మిత్రులు,బందువులు, సన్నిహితులే కీలక వ్యవహారాల్లో చక్రం తిప్పేలా చర్యలు తీసుకున్నారు. అలాంటి వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి సమీపబందువు సజ్జల శ్రీధర్ రెడ్డి  ఒకరు. ఈ సజ్జల శ్రీధర్ ెడ్డి   నంద్యాల మాజీ ఎంపి ఎస్పీవై రెడ్డికి అల్లుడు కూడా.  ఎస్పీవై రెడ్డికి చెందిన ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ర్. అదనపు క్వాలిఫికేషన్ ఏమిటంటే.. శ్రీధర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామం.2012 పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  2019లో నంద్యాల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాతే వైసీపీలో చేరారు. చేరి  మద్యం స్కామ్ లో కీలకంగా వ్యవహరించారు.  
  తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి.  తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ లో ఏనుగులు భీభత్సం చేశాయి. కొత్తపల్లి సమీపంలో పొలం వద్ద పనిచేసుకుంటున్న రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులు తొక్కడంతో రైతు చనిపోయాడని స్థానికులు తెలిపారు. శరీరంలోని భాగాలు బయటకు వచ్చి భయానక పరిస్థితి నెలకొందని తోటి రైతులు చెబుతున్నారు. మృతుడ్ని దాసరగూడెనికి చెందిన సిద్దయ్యగా గుర్తించారు. వరుస ఘటనలతో రాత్రివేళతో పాటు పగలు సైతం ఆ ప్రాంతాల్లో తిరగాలంటే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. జనవరి 19వ తేది నారావారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి ని ఏనుగులు తొక్కి చంపడం తెలిసిందే. 
  ఏపీ లిక్కర్ స్కాంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేపట్టింది. ఈ కేసు విషయంలో సిట్ అధికారులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు.  ఈ స్కాంలో ఎవరున్నా విడిచి పెట్టవద్దని ఏపీ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. దీంతో సిట్ అధికారులు ఈ కేసు విషయంలో దూకుడు పెంచారు. ఆ క్రమంలో ఇప్పటికే ఇదే కేసులో రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సెట్ అధికారులు తాజాగా మరో కీలక వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపధ్యంలో మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లిక్కర్ స్కాంకి అసలు బిగ్ బాస్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్ అని , ముందు  ఆయన్ని జైలుకు సోమిరెడ్డి డిమాండ్ చేశారు. బిగ్ బాస్ దురాశ వల్ల నాసిరకం మద్యం తాగి ఎందరో పేదలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.  మద్యం కుంభకోణం విషయంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీని రంగంలోకి దింపాలని అన్నారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మద్యపానం నిషేధ హామీతో అధికారంలోకి వచ్చి, మద్యంతో పేదల ప్రాణాలు తీయటం క్షమించరాని నేరమని అన్నారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఇప్పటి వరకూ రూ.3200కోట్లు మాత్రమే సీఐడీ వెలికితీసిందని, అనధికార లావాదేవీలు ఇంకా పెద్దమొత్తంలో జరిగాయని ఆరోపణలు గుప్పించారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమని షాకింగ్ కామెంట్స్ చేశారు. రూ.1.35లక్షల కోట్లు నగదు రూపంలో బదిలీ చేసి డిజిటల్ ఆంధ్రాని కాస్తా క్యాషాంధ్రగా మార్చారని విమర్శించారు. జగన్ హయాంలో అడిగిన లంచాలు ఇవ్వలేక నాటి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మెక్ డోవెల్స్ కంపెనీని మూసేసుకున్నారని అన్నారు. మొత్తానికి సోమిరెడ్డి చేస్తున్న ’బిగ్‌బాస్ అరెస్ట్‘ డిమాండ్ వైరల్‌గా మారుతోందిప్పుడు
ALSO ON TELUGUONE N E W S
Megastar Chiranjeevi and Sri Devi have made Jagadeeka Veeru Athiloka Sundari a memorable classic. Their comic timing and the screenplay keep us engaged throughout. Raghavendra Rao took a masterclass in crafting a socio-fantasy with all commercial elements in tact.  Ilaiyaraaja's music at his prime, and each song becoming a repeat-worthy chartbuster boosted the movie's life to many decades. Even after 35 years, the film and its music has good number of fans. While all of this is fine, the movie makers have caught on to re-releasing trend with this film.  But they have announced 3D converted version release as well. The movie had never been shot with 3D in plan and now, this tactic looks like trying to pull audiences to the theatres. A normal re-release would have sufficied but converting the movie to 3D, doesn't bode well with this one.  The makers have suddenly decided to bring it on 9th May, the exact date it released 35 years ago. Actually, Pawan Kalyan's Hari Hara Veera Mallu team locked the date and as the movie postponed, Chiranjeevi's re-release got the ideal date. Still, 3D conversion for this film doesn't feel really necessary. 
'పెళ్లి'(Pelli)మూవీలో అద్భుతమైన నటనతో పాటు 'రుక్కు రుక్కుమణి సాంగ్' తో  ఓవర్ నైట్ స్టార్ నటుడుగా గుర్తింపు పొందారు పృథ్వీ(Babloo Prithiveeraj). ఆ తర్వాత చేసిన పెళ్లిపందిరి, సమరసింహారెడ్డి, నువ్వు నాకు నచ్చావ్, దేవుళ్ళు, ప్రేయసిరావే' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడుగా మారాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో పాన్ ఇండియా హిట్ గా నిలిచిన 'యానిమల్' లో విలన్ గా  మెప్పించిన పృథ్వీ  రీసెంట్ గా నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ల అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో కీలక పాత్రలో కనిపించాడు. తాజాగా ఒక పాడ్ కాస్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్న పృథ్వీ మాట్లాడుతు 2024 లో రిలీజైన 'ఉత్సవం'(Utsavam)మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వేరే సినిమాల షూటింగ్స్ నుంచి పర్మిషన్ తీసుకొని మరి వెళ్ళాను. ఆ ఫంక్షన్ లో దర్శక నిర్మాతలని పలకరిస్తే  పట్టించుకోకపోయే సరికి బిజీగా ఉన్నారేమో అనుకున్నాను. స్టేజ్ ముందు వరుసలో కూర్చొని ఉంటే వేరే వాళ్ళు వచ్చిన ప్రతి సారి పక్కకి జరగమన్నారు. అలా జరుగుతు జరుగుతు అదే వరుసలో చివరికి వెళ్ళిపోయాను. స్టేజ్ పైకి  నటినటులతో పాటు నా పక్కనే కూర్చున్న సాంగ్ రైటర్, మేకప్ ఆర్టిస్ట్ ని పిలిచారు. కానీ నన్ను పిలవలేదు. చివరకి గ్రూప్ ఫోటో కోసం స్టేజ్ పైకి రమ్మంటే వెళ్ళాను. అక్కడ అనిల్ రావిపూడితో మాట్లాడుతుంటే ఆయన్ని పక్కకి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత గ్రూప్ ఫొటోలో వెనక్కి వెళ్లి నుంచోమంటే వెనక్కి వెళ్ళాను. నా పక్కనే గిరిబాబు గారు రాగానే ఆయన్ని ముందుకు తీసుకెళ్లి నుంచో బెట్టారు. యానిమల్ తో పెద్ద స్టార్ అయిపోయానని అనుకున్నాను కానీ ఎవరు పట్టించుకోకపోయే సరికి ఎంతగానో బాధపడ్డానని చెప్పుకొచ్చాడు. 1975 లో ఏంజి రామచంద్రన్ హీరోగా తెరకెక్కిన 'నాళై నమ్మదే'  చిత్రం ద్వారా బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పృథ్వీ ఇప్పటి వరకు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వంద సినిమాల దాకా చేసాడు. పలు సీరియల్స్ లో కూడా నటించాడు  
  తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో భారీ సినిమాలతో పాటు, మీడియం రేంజ్ సినిమాలకు కూడా.. ఏపీలో టికెట్ రేట్ హైక్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు హిట్-3 వంతు వచ్చింది. (Hit 3)   న్యాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన మూవీ 'హిట్-3'. మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ కాగా, సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే మూవీ టీమ్.. ఏపీలో టికెట్ ధరల పెంపుకి అనుమతి కోరినట్లు తెలుస్తోంది. సింగిల్ స్క్రీన్స్ లో రూ.50, మల్టీప్లెక్స్ లలో రూ.75 పెంచుకోవడానికి అనుమతి లభించినట్లు సమాచారం.   అయితే దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సినిమాకి ఇలా పెంచుకుంటూ పోతే.. థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  
చిరంజీవి,(Chiranjeevi)బాలకృష్ణ(Balakrishna)నాగార్జున(Nagarjuna)వెంకటేష్(Venkatesh)వంటి అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోగా తన సత్తా చాటిన భామ సిమ్రాన్(Simran). గ్లామర్,పెర్ఫార్మెన్స్ ,డాన్స్ ల పరంగా ఆ నలుగురు హీరోలతో పోటీపడి మరి నటించిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో వివిధ క్యారెక్టర్స్ లో నటిస్తు ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. రీసెంట్ గా అజిత్(Ajith)హిట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly)లో ప్రాముఖ్యత గల పాత్రలో కనపడి  మెప్పించింది. ఇటీవల జరిగిన ఒక అవార్డు కార్యక్రమంలో సిమ్రాన్  మాట్లాడుతు ఒక సినిమాలో కీలక పాత్ర పోషించిన నటికి బాగా నటించావని చెప్పి మెసేజ్ చేశాను. దాంతో ఆమె నాకు రిప్లైగా ఆంటీ రోల్స్ లో నటించడం కంటే ఆ క్యారక్టర్ ఎంతో ఉత్తమం అని మెసేజ్ చేసింది. సినిమాల్లో పనికి మాలిన డబ్బా రోల్స్ లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ రోల్స్ లో నటించడం ఎంతో బెటర్ అని సిమ్రాన్ మాట్లాడింది. ఇప్పడు ఆ మాటలపై సిమ్రాన్ మరోసారి వివరణ ఇచ్చింది. ఆమె మాట్లాడుతు  నా తోటి నటి ప్రవర్తనతో ఎంతో బాధపడ్డాను. అందుకే అవార్డు ఫంక్షన్ లో నాకనిపించింది చెప్పాను. నేను కూడా ఆంటీ రోల్స్ చేశాను. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ స్నేహితులనుకున్న వాళ్ళు తమ కామెంట్స్ తో మనల్ని ఎంతగానో బాధిస్తారు. నాకు ఎదురైన ఈ  అనుభవంతో ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఎప్పటికి స్నేహితులు కాలేరని  మరోసారి నిజమయ్యింది. . అవార్డుల కార్యక్రమం తర్వాత ఆ నటి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. కానీ ఇంతకు ముందులా మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇప్పుడు లేదని చెప్పుకొచ్చింది.    
The Telugu Film Journalists Association (TFJA), in association with Phoenix Foundation and Shankar Eye Hospital, organized a health camp on Saturday (April 26) at the Telugu Film Chamber in Hyderabad. Free eye-screening tests were conducted exclusively for film journalists as part of the initiative. Talented young actor Priyadarshi, prolific producer Suryadevara Naga Vamsi, Phoenix Group Director Avinash Chukkapalli, and Shankar Eye Hospital Unit Head Vishwa Mohan graced the event as chief guests. The health camp was inaugurated with a ribbon-cutting ceremony by Priyadarshi and Naga Vamsi. Avinash Chukkapalli, Vishwa Mohan, TFJA President Lakshmi Narayana, Vice President Raghu, and General Secretary YJ Rambabu lit the sacred lamp (jyothi prajwalana) and launched the event.   Priyadarshi also underwent an eye checkup at the event, and the doctors confirmed that his vision was perfectly fine. Speaking on the occasion, Priyadarshi said, "I feel elated to be part of this wonderful health initiative organized by the Telugu Film Journalists Association at the Telugu Film Chamber. My sincere thanks to Avinash Chukkapalli garu from Phoenix Foundation, Vishwa Mohan garu from Shankar Eye Hospital, and the TFJA heads for taking such a thoughtful step towards journalists' health. Everyone should prioritize their health." The camp witnessed a great turnout with over 100 journalists and their family members undergoing the free eye screening services. The event, held from morning to afternoon, was well-received and appreciated by everyone.
Cast: Mohanlal, Shobana, Prakash Varma, Binu Pappu, Bharatiraja, Vijay Sethupathi, Kalpana Thomas Mathew, Amritha Varshini, Farhaan Faasil, Aarsha Chandini Baiju Crew:  Written by K. R. Sunil, Tharun Moorthy Cinematography by Shaji Kumar Music by Jakes Bejoy Editing by Nishadh Yusuf, Shafeeque V. B.  Directed by Tharun Moorthy Produced by M. Renjith   Mohanlal is one of the biggest superstars of Indian Cinema based in Malayalam. The star has not been able to deliver the kind of knockout films that we got accustomed to watching from him, over the years. His recent releases like Marakkar: Arabikadalinte Simham, Alone, Malaikottai Vaaliban, Barroz 3D have been underwhelming at best. L2: Empuraan, did get a huge opening but not the level of success anticipated. Now, he has come up with Thudaram and Shobana acted as his pair, after a long time. Let's discuss about the film in detail.    Plot:  Benz aka Shanmugham (Mohanlal) drives an old ambassador and he is only one to still stick to such dated vehicle. He used to work as a stuntmen under his master Palani Sir (Bharatiraja) and due to an accident, he became taxi driver. As the black ambassador is a gift from his master, he loves it more than his life. His wife Lalitha (Shobana) runs a tight shop at the home and he is happily scared about her short temper. One day, he hits his son Pavi (Thomas Mathew) for taking his car without intimation.  Pavi stops talking to him and an upset Benz tries to rectify this. Suddenly, he gets a call that Palani sir passed away and when he returns, he finds his car being seized by Police. He tries to convince SI Benny (Binu Pappu) but SI takes it to his ego to not release the car. Upon CI George (Prakash Varma)'s insistence, SI gives the car but George starts using Benz's car and asks him to help them dump a body. Unable to comprehend the guilt, Benz finds out that the body is actually his son Pavi's. Why did police kill his son? How does Benz take his revenge? Watch the movie to know more.    Analysis:  The movie starts off brilliantly with Mohanlal, after a long time, appearing in a simpleton role and bringing his vintage comic timing to the fore. The intense, massy star gives way to this simpleton character to shine in the first 45 minutes. But then, the director slides into using the usual mass troupes with the star in full flow than the actor. This is where the movie looses its grip and falls completely into regular zone.  Mohanlal tries to salvage the situation with his massy image and larger-than-life on-screen persona. But the writing is so basic in the second hour that it feels like Drishyam has been re-imagined in a massy film style. While that is not a bad thing, more imaginative writing could have helped the film to really sustain novelty it promised in the beginning portions.  Once it unveils the "twist", you tend to see the old school writing breaking into the film. From there on, we feel like the obvious being dragged to bits. There are chances making this bits also novel but they resort to taking the obvious route. Director Tharun Moorthy showcased great imagination in starting portions with character introductions but they go into un-realistic territory as the movie progress.  Trying to make a "real" looking big movie that also goes into mass hero worship mode is tricky and doesn't really bloom. The problematic things lie in mentioning few things at a random which needed time for us to breathe and digest. In trying to focus on them as twists, the makers did not do as good a job as Sookshmadarshini. The movie needed a lot more focused and inventive approach to make it more than just another Mohanlal starrer with "Drishyam-esque" premise.  Bottomline:  Mohanlal saves this thriller that losses itself into many incohesive bits as we progress.  Rating: 2.5/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. 
శర్వానంద్(Sharwanand)రచ్చ మూవీ ఫేమ్ 'సంపత్ నంది'(Sampath nandi)కాంబినేషన్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో కూడిన చిత్రం ఒకటి  తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. 1960 వ కాలం నాటి నేపథ్యంలో తెలంగాణ(Telangana)మహారాష్ట్ర(Maharashtra)బోర్డర్ లో జరిగే కథగా తెలుస్తుంది. త్వరలోనే  షూటింగ్ ప్రారంభం కానుండగా హైదరాబాద్ సమీపంలో సుమారు పదిహేను ఎకరాల్లో భారీ సెట్ ని వేశారు. మూవీకి సంబంధించిన షూటింగ్ ఎక్కువ భాగం అక్కడే జరగనున్నట్టుగా తెలుస్తుంది.  'శర్వానంద్' కి జోడిగా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran)కనపడనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించడంతో మూవీకి మరింత క్రేజ్ వచ్చినట్లయింది. ఇంతకు ముందు ఈ జంట 2017 లో వచ్చిన  'శతమానంభవతి' లో కలిసి చేశారు. ఆ ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత ఈ జంట సంపత్ నంది(Sampath Nandi)సినిమా ద్వారా ప్రేక్షకులని మరోసారి కనువిందు చేయనుంది. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కెకె రాధామోహన్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. గతంలో సంపత్ నంది, సత్య సాయి ఆర్ట్స్ కాంబోలో ఏమైంది ఈ వేళ, బెంగాల్ టైగర్ లాంటి చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. సత్యసాయి ఆర్ట్స్ గత ఏడాది గోపీచంద్ తో 'భీమా' తెరకెక్కించింది.    
  లెజండ్రీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(Ar Rahman)కంపోజ్ చేసిన ఎన్నో హిట్ సాంగ్స్ ల్లో 'వీరారాజవీరా' (Veera Raja Veera)కూడా ఒకటి. ఈ సాంగ్ మద్రాస్ టాకీస్ పై మణిరత్నం(Manirathnam)దర్శకత్వంలో 2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2'(ponniyin selvan part 2)చిత్రంలోనిది. జయం రవి, శోభిత అక్కినేనిపై చిత్రీకరణ జరుపుకున్న ఈ సాంగ్ అన్ని భాషల్లోను విశేష ఆదరణ పొందింది. ఈ 'వీరారాజవీరా’ సాంగ్ ట్యూన్ ని రెహమాన్ కాపీ కొట్టారని ఢిల్లీ హైకోర్టులో సింగర్ 'ఉస్తాద్ ఫయాజ్ వసిఫుద్దీన్ డగర్' కొంత కాలం క్రితం పిటీషన్ వెయ్యడం జరిగింది. తన పిటిషన్ లో చాలా స్పష్టంగా ఆ ట్యూన్ తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ సంగీతాన్ని అందించిన 'శివస్తుతి' పాట నుంచి రెహమాన్ కాపీ కొట్టారని పేర్కొన్నాడు. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తీర్పుని వెల్లడించింది. ఏఆర్ రెహమాన్, మద్రాస్ టాకీస్ సదరు పిటీషన్‌దారుడికి రెండు కోట్ల రూపాయలని చెల్లించాలని  తన ఆదేశాల్లో పేర్కొంది. రెహమాన్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో 'పెద్ది' చేస్తున్న విషయం తెలిసిందే. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజవ్వగా, రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మంచి పేరు వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ సాంగ్ విషయంలో రెహమాన్ కి కోర్ట్ షాక్ ఇవ్వడంతో,పెద్ది విషయంలో  ఇలాంటివి జరగకుండా ఉండాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.    
  తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో శనివారం (ఏప్రిల్ 26 న) ఫీనిక్స్ ఫౌండేషన్ & శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా తెలుగు ఫిలిం చాంబర్‌లో హెల్త్ క్యాంప్ నిర్వహించాయి. జర్నలిస్టులకు 'ఐ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాక్టర్ ప్రియదర్శి, ప్రొడ్యూసర్ నాగ వంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.    ప్రియదర్శి, నాగ వంశీ రిబ్బన్ కట్ చేసి హెల్త్ క్యాంప్ ప్రారంభించగా... అనంతరం ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిక్ హెడ్ విశ్వమోహన్, TFJA ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రఘు, జనరల్ సెక్రటరీ వై.జె. రాంబాబు చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన జరిగింది.     హెల్త్ క్యాంప్‌లో భాగంగా ప్రియదర్శి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆయన చూపు పర్ఫెక్ట్ ఆల్ రైట్ అని వైద్యులు తెలిపారు. హెల్త్ క్యాంప్ గురించి ప్రియదర్శి మాట్లాడుతూ... ''తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన హెల్త్ క్యాంప్‌కు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్యాంప్ నిర్వహిస్తున్న అసోసియేషన్ పెద్దలకు, ఫీనిక్స్ ఫౌండేషన్ అవినాష్ చుక్కపల్లి గారికి, శంకర్ ఐ హాస్పిటల్ మోహన్ గారికి థాంక్స్. జర్నలిస్టుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటున్న అసోసియేషన్ పెద్దలకు స్పెషల్ థాంక్స్. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి'' అని చెప్పారు.    శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన 'ఐ స్క్రీనింగ్' హెల్త్ క్యాంప్‌లో‌ జర్నలిస్టులు, వాళ్ల కుటుంబ సభ్యులు 100 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.  
  "కళాకారులు సున్నిత మనస్కులు" అని అంటుంటారు. ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ ని చూస్తే, ఆ మాట నిజమే అనిపిస్తోంది. లేకపోతే చిన్న విషయానికి చిన్న పిల్లలా కంటతడి పెట్టుకోవడం ఏంటి?. ఆమె కన్నీళ్లు పెట్టుకున్న వీడియో చూస్తే శృతి మరీ ఇంత సున్నితమా? అనిపించక మానదు. (Shruti Haasan)   ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్ లో మాత్రం చతికిల పడింది. పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ లో ఉంది. శుక్రవారం చెన్నై, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో అయినా గెలిచి సీఎస్కే కమ్ బ్యాక్ ఇస్తుందనుకుంటే, మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మ్యాచ్ ను చూడటానికి వెళ్ళిన శృతి హాసన్.. తన హోమ్ టీం చెన్నై ఓడిపోవడంతో కంటతడి పెట్టుకుంది. చిన్న పిల్లలా ఏడుస్తూ కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో "శృతి మరీ ఇంత సెన్సిటివ్ ఆ?" అంటూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ఈ జనరేషన్ ను ఆల్ఫా యుగం అనవచ్చు. ఇది AI, స్మార్ట్ పరికరాలు, ఆన్‌లైన్ లెర్నింగ్,  సోషల్ మీడియా మధ్య పెరుగుతోంది. ఈ తరం వారు టెక్నాలజీకి త్వరగా అలవాటు పడతారు,  యాప్‌లతో పాటు వివిధ గాడ్జెట్‌లను ఉపయోగించడంలో వారి తల్లిదండ్రుల కంటే చాలా ముందున్నారు. యూట్యూబ్, గేమింగ్,  ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో కూడా దీని పట్టు బలంగా మారింది.  ఇప్పుడు జనరల్ బీటా కూడా మన మధ్య ఉన్నారు. వారు సాంకేతికత అభివృద్ధితో  పెరుగుతారు. ఇది నేర్చుకోవడం, వినోదం కోసం AIని ఉపయోగిస్తుంది. కానీ ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు పుట్టినప్పటి నుండి స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు,  ఇతర గాడ్జెట్‌లతో పరిచయం ఉన్న ఈ పిల్లలు తరచుగా టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు సమాధానం చెప్పకపోతే వారు  నిరాశ చెందుతారు.  సమాధానం చెప్పలేకపోవడం వల్ల తల్లిదండ్రులు కూడా  బాధపడతారు. కొన్నిసార్లు నిస్సహాయంగా భావిస్తారు.   అపరాధ భావన తల్లిదండ్రులలో  చుట్టుముడుతుంది. కానీ ఇది టెక్నాలజీ యుగం.  పిల్లలకు రోల్ మోడల్‌గా మారాలంటే తల్లిదండ్రులు కూడా  టెక్నాలజీతో కనెక్ట్ అవ్వాలి.  'టెక్నో స్మార్ట్ మామ్'గా మారాలి.  ఇది చాలా సులభం. ఎలాగంటే.. పిల్లలను గురువులుగా చేసుకోవాలి.. సాధారణంగా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి సాంకేతికత లేదా సాంకేతిక విషయాలను అర్థం చేసుకోవడం సులభం. అదే సమయంలో సాంకేతికత లేని వ్యక్తికి లేదా ఈ విషయాలపై ఆసక్తి లేని మహిళలకు ఇది కొంచెం కష్టంగా మారుతుంది. నిజానికి కొందరు మహిళలు టెక్నాలజీని ఉపయోగించడం పట్ల భయపడుతున్నారు.  దీనికి కారణం ఏదైనా పొరపాటు చేస్తే నవ్వుల పాలవుతారనే భయం. చాలా మంది తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. పిల్లలు ప్రతి ప్రశ్నకు తమ తల్లి సమాధానం చెప్పాలని ఆశించరు. కానీ వారు కొత్త యాప్ లేదా టెక్నాలజీపై ఆసక్తి చూపినప్పుడు దాని గురించి వారికి ఏమి తెలుసు లేదా దానితో వారు ఏమి చేయాలనుకుంటున్నారో అడగాలి. పిల్లలు పెద్దవారైతే వారి ఫోన్‌లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని,  దానిని ఎలా సెటప్ చేయాలో,  ఎలా ఉపయోగించాలో చూపించమని అడగాలి. అనేక సర్వేల ప్రకారం 47 శాతం తల్లిదండ్రులు,  సంరక్షకులు తమ పిల్లలకు డిజిటల్ టెక్నాలజీ గురించి తమకన్నా ఎక్కువ తెలుసని భావిస్తున్నారు. కాబట్టి వారిని ఏదైనా అడగడానికి వెనుకాడతారు. నిజంగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారని పిల్లలు భావిస్తే  తమ తల్లిదండ్రులు నిపుణులుగా మారడానికి ట్రై చేస్తున్నారని, కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారని తెలుసుకుని పిల్లలు సంతోషపడతారు. పర్యవేక్షించడం సులభం.. డిజిటల్ యుగంలో సాంకేతికత మనం కమ్యూనికేట్ చేసే, పని చేసే,  పిల్లలను పెంచే విధానాన్ని కూడా మార్చింది. కొంతమంది స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం హానికరమని వాదించవచ్చు. కానీ సాంకేతికత గొప్ప సాధనంగా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి. నేడు అనేక యాప్‌లు,  ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా  పిల్లల మొబైల్ పరికరాలు, వీడియో గేమ్‌లు, సోషల్ మీడియా కార్యకలాపాలు, వారి నిద్ర,  వారి ఆహారాన్ని కూడా పర్యవేక్షించవచ్చు.  పరికరంలో తల్లిదండ్రుల నియంత్రణలను ఉపయోగించడం ద్వారా వారి స్క్రీన్ సమయాన్ని నియంత్రించవచ్చు. దీని కోసం  డిజిటల్  స్టేజ్ ను అర్థం చేసుకోవాలి, అంటే తల్లి సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటే, ఆమె ఆన్‌లైన్ భద్రత,  సైబర్ బెదిరింపు వంటి ఇతర ప్రమాదాల గురించి వారిని హెచ్చరించగలదు.  పిల్లలు టెక్నాలజీని సరైన విధంగా  ఉపయోగిస్తున్నారా లేదా అనే దానిపై నిఘా ఉంచగలుగుతారు. ముఖ్యంగా వారు స్మార్ట్‌ఫోన్‌లు,  వీడియో గేమ్‌లకు బానిసలైనప్పుడు ఇది ఉపయోగపడతుంది. కష్టమేమి కాదు.. ఏదైనా చేయాలనే సంకల్పం ఉంటే ఆ మార్గం స్వయంచాలకంగా సృష్టించబడుతుంది. ఐదు సంవత్సరాల క్రితం కూరగాయల నుండి ఇతర రోజువారీ అవసరాల వరకు ప్రతిదీ కొనడానికి డిజిటల్ చెల్లింపులు చేస్తారని ఎవరూ ఊహించలేదు.  కానీ ఇప్పుడు అందరు చేస్తున్నారు.  కోవిడ్ సమయంలో పాఠశాలలు,  కళాశాలలు మూసివేయబడి తరగతులు ఆన్‌లైన్‌లోకి మారినప్పుడు, ఉపాధ్యాయులతో పాటు ఇంట్లో ఉండే తల్లులు కూడా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇలాంటి వాటిని టెక్నాలజీనే సులువు చేసింది. ఉపయోగాలు.. పిల్లలు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. 9 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పిల్లలు ప్రతిరోజూ మూడు గంటలు సోషల్ మీడియా,  గేమింగ్‌లో గడుపుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.  ఈ రోజుల్లో సోషల్ మీడియాలో తల్లిదండ్రులుగా ఉండటం,  సాంకేతికతపై దృష్టి సారించి చర్చలు,  కంటెంట్‌ను పంచుకునే గ్రూపులు ఉన్నాయి. వీటి ద్వారా చాలా డవలప్ అవవచ్చు.  నచ్చినది నేర్చుకోవడం ఎల్లప్పుడూ మంచిదని అంటారు. టెక్నాలజీ అనేది ప్రతిరోజూ, ప్రతి క్షణం మారుతూ ఉంటుంది, కానీ  చుట్టూ ఉన్న టెక్నాలజీ గురించి ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండటం,  దానిని  అవసరాలకు తగినట్టు మార్చుకోవడం ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది. టెక్నాలజీని స్వీకరిస్తే రూల్ మోడల్ అవుతారు..  టెక్నాలజీకి భయపడాల్సిన అవసరం లేదు.  పిల్లలకు ఆదర్శంగా నిలిచేందుకు ఇది తల్లులకు ఒక అవకాశం.  టెక్నీషియన్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ టెక్నాలజీని  జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. మంచి విషయం ఏమిటంటే అది అంత కష్టం కాదు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న తల్లిగా మారడం ద్వారా  పిల్లలకు మార్గనిర్దేశం చేయడమే కాకుండా సాంకేతికత  చెడు ప్రభావాల నుండి పిల్లలను రక్షించడానికి అనేక చర్యలను కూడా తీసుకోవచ్చు. దీని కోసం సాంకేతిక రంగం వైపు మొదటి అడుగు వేయడం ముఖ్యం. అంటే పిల్లలను వారి స్వంత ఉపాధ్యాయులుగా మార్చడం.  ఇది వారితో తల్లులకు గల సంబంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా వారు అనేక ముఖ్యమైన నైపుణ్యాలను కూడా నేర్చుకుంటారు. ఇవన్నీ ఆచరిస్తే స్మార్ట్ మామ్ అవుతారు.                                   *రూపశ్రీ.  
నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం. మలేరియా గురించి అవగాహన పెంచడానికి,  వ్యాధిని నియంత్రించడానికి, నివారించడానికి,  చివరికి మలేరియాను రూపుమాపడానికి  చర్యలను ప్రోత్సహించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఏర్పాటు చేసిన రోజిది.  ప్రతి సంవత్సరం మలేరియా దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తారు.  ఈ సంవత్సరం మలేరియా దినోత్సవం  థీమ్.. "మలేరియా మనతోనే అంతం అవుతుంది.  ఇది మలేరియా నిర్మూలన వైపు పురోగతిని వేగవంతం చేయడానికి అన్ని స్థాయిలలో ప్రయత్నాలను  శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.  ఆడ అనాఫిలిస్ దోమల కాటు ద్వారా సంక్రమించే పరాన్నజీవుల వల్ల వచ్చే మలేరియా లక్షలాది మంది ప్రజలను, ముఖ్యంగా ఉష్ణమండల,  ఉపఉష్ణమండల ప్రాంతాలలో ప్రభావితం చేస్తూనే ఉంది. మలేరియా దినోత్సవం  మలేరియాను ఎదుర్కోవడంలో సాధించిన పురోగతిని అందరికీ గుర్తు చేస్తుంది.  ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకునేందుకు అవకాశం ఇస్తుంది.   వ్యాధి భారాన్ని తగ్గించడానికి వనరులు, ఆవిష్కరణలు,  ప్రజల భాగస్వామ్యాన్ని సమీకరిస్తుంది. చికిత్సతో పాటు, ఈ ప్రాణాంతక అనారోగ్యం నుండి వ్యక్తులు,  సమాజాలను రక్షించడంలో నివారణ చిట్కాలు కీలకమైనవి. మలేరియా ముందస్తు హెచ్చరిక సంకేతాలు & లక్షణాలు.. మలేరియా ముందస్తు హెచ్చరిక సంకేతాలు,  లక్షణాలు ఇతర వైద్య పరిస్థితులకు దగ్గరగా ఉండవచ్చు. అయితే మలేరియా తీవ్రత మారవచ్చు.  మలేరియాను వ్యాప్తి చేసే  దోమ కుట్టిన 10-15 రోజుల తర్వాత లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, మలేరియా అవయవ వైఫల్యం, కోమా లేదా మరణం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మలేరియా అని  అనుమానించినట్లయితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మలేరియా  సాధారణ ముందస్తు హెచ్చరిక సంకేతాలు.. జ్వరం అకస్మాత్తుగా వచ్చే అధిక జ్వరం అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. చలి చాలా మందికి చలి వస్తుంది. అది తీవ్రంగా ఉండవచ్చు. తరువాత చెమట పడుతుంది. చెమటలు పడటం చలి తర్వాత, జ్వరం తగ్గవచ్చు,   విపరీతంగా చెమట పట్టవచ్చు. తలనొప్పి మలేరియా కేసుల్లో తలనొప్పి, తరచుగా మధ్యస్థం నుండి తీవ్రంగా ఉండటం సాధారణం. అలసట చాలా అలసటగా లేదా బలహీనంగా అనిపించడం విలక్షణమైనది, ఇతర లక్షణాలు తగ్గిన తర్వాత కూడా ఇది కొనసాగవచ్చు. వికారం,  వాంతులు మలేరియా ఉన్న చాలా మంది వ్యక్తులు వికారం,  వాంతులు అనుభూతి చెందుతారు. కండరాలు,  కీళ్ల నొప్పి కండరాలు,  కీళ్లలో నొప్పులు సర్వసాధారణం. రక్తహీనత ఈ పరాన్నజీవి ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది. ఇది రక్తహీనతకు (తక్కువ ఎర్ర రక్త కణాల సంఖ్య) దారితీస్తుంది. దీని వలన అలసట, బలహీనత,  పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు కొంతమందికి తేలికపాటి దగ్గు వస్తుంది. కడుపు నొప్పి కొంతమంది వ్యక్తులు పొత్తికడుపులో అసౌకర్యం లేదా నొప్పిని అనుభవిస్తారు. పై లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.                                        *రూపశ్రీ.
వివాహం అనేది భారతీయ సమాజంలో జీవితాంతం నిలిచే బంధంగా పరిగణించబడే సంబంధం. అయితే  ఈ జీవిత బంధాన్ని సంతోషంగా గడపాలనుకుంటే ఆ సంబంధంలో ప్రేమ, గౌరవం అవసరం. చాలా మంది భార్యాభర్తలు ఒకరినొకరు చాలా ప్రేమిస్తారు కానీ  వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు, వాటిలో ఒకటి నిరాశ. ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని వదిలి తన భర్త ఇంటికి వచ్చినప్పుడు, ఆమె అతన్ని అంగీకరించడమే కాకుండా తన భర్త పద్ధతులను, ఇష్టాయిష్టాలను కూడా స్వీకరిస్తుంది. కానీ ఒక పురుషుడు తన భార్య తనకు ఎంత ప్రత్యేకమైనదో ఆమెకు తెలియజేయడంలో విఫలమవుతాడు. ఈ కారణంగా  స్త్రీలు తమ భర్తల పట్ల,  ఆ సంబంధం పట్ల నిరాశ చెందుతారు.  భర్త భార్యను నిరాశపరచకూడదనుకుంటే, ఆమె భర్తను ఎల్లప్పుడూ ప్రేమించాలని,   సంబంధం సంతోషంగా ఉండాలని కోరుకుంటే ప్రతి భర్త ఈ ఐదు పనులు ప్రతిరోజూ చేయాలి. ప్రేమను వ్యక్తపరచడం..  అవకాశం దొరికినప్పుడల్లా భార్యతో "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పాలి.  ప్రేమను వ్యక్తపరచడం వల్ల  భార్య పట్ల  శ్రద్ధ వహిస్తున్నారని ఆమెకు భరోసా లభిస్తుంది. రోజూ  ప్రేమను వ్యక్తపరచడంతో పాటు వారితో రోజుకు రెండు మూడు సార్లు ప్రేమగా మాట్లాడితే మహిళలు కూడా దీన్ని చాలా ఇష్టపడతారు. ప్రేమ ఉంది కానీ దానిని వ్యక్తపరచకపోతే లేదా చూపించకపోతే భార్యకు ఎలా తెలుస్తుంది? కలిసి తినడం.. దంపతులు ఎంత బిజీగా ఉన్నా కనీసం  భోజనం కలిసి తినాలి. భర్త రోజుకు ఒకసారి అయినా భార్యతో కూర్చుని భోజనం చేయాలి. అల్పాహారం అయినా, భోజనం అయినా, రాత్రి భోజనం అయినా ఇద్దరూ కలిసి కూర్చుని భోజనం చేసినప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలాగే కుటుంబం ఉన్నప్పటికీ భర్త లేకుండా భార్య భోజనం చేసినప్పుడు ఆమె ఒంటరిగా ఫీలవుతుంది. కాబట్టి భర్త  తన భార్యతో కలిసి భోజనం  చేయడానికి సమయం కేటాయించాలి. బయటకు వెళ్ళే ముందు.. ఆఫీసుకు వెళ్లే ముందు భార్యతో సమయం గడపాలని కోరుకుంటున్నారని, కానీ మీరు పనికి వెళ్లాలని ఆమెకు అనిపించేలా చేయండి. దీనికోసం మీరు ప్రేమపూర్వకమైన ఒక నోట్ రాయవచ్చు లేదా ఇంటి నుండి బయలుదేరే ముందు వారిని కౌగిలించుకుని  జాగ్రత్త చెప్పవచ్చు.  ఈ చిన్న  విషయాలు వారికి  ప్రేమను అర్థం అయ్యేలా చేస్తుంది. కౌగిలి.. ఉదయం నిద్ర లేవగానే  భార్యను కౌగిలించుకోవడం ప్రతి భార్య చాలా సేఫ్ ఫీలింగ్ అనుభూతి చెందుతుంది. ప్రతి భార్య తన భర్త చేతుల్లో సురక్షితంగా,  సుఖంగా ఉంటుంది. ప్రేమను వ్యక్తపరచడానికి,  భార్య హృదయాన్ని గెలుచుకోవడానికి కౌగిలించుకోవడం మంచి మార్గం.  ఆఫీసుకు వెళ్ళేటప్పుడు లేదా తిరిగి వచ్చినప్పుడు భార్యను కౌగిలించుకోవడం ఇద్దరికీ చాలా ఊరట ఇస్తుంది. ఫిర్యాదు వద్దు, మద్దతు ఇవ్వాలి.. మహిళలు తమ భర్తలను, అత్తమామలను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఆమె తన భర్త మద్దతు మాత్రమే కోరుకుంటుంది. అయితే, భర్త తమ భార్య లోపాల గురించి ఫిర్యాదు చేసినప్పుడు భార్య నిరుత్సాహపడుతుంది. మీరు వారితో ఉన్నారనే భావన వారికి కలిగించాలి. ఫిర్యాదు చేయడానికి బదులుగా, చిన్న పనులలో వారికి మద్దతు ఇవ్వాలి. మంచం సర్దడం లేదా  టీ తయారు చేయడం వంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా  వారి హృదయాలను గెలుచుకోవచ్చు.                                 *రూపశ్రీ
  కుంకుమ పువ్వు ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంద ద్రవ్యం. దీన్ని సాధారణంగా ఖరీదైన వంటకాలలోనూ, తీపి పదార్థాల తయారీ లోనూ, గర్భవతులు,  బిర్యానీ వంటి వంటకాలలోనూ ఉపయోగిస్తారు. అయితే కుంకుమ పువ్వుతో టీ తయారు చేసుకుని తాగుతారని మీకు తెలుసా? కుంకుమ పువ్వు చాలా ఖరీదైనదే అయినా దాని ఖరీదుకు తగినట్టు ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది.  ముఖ్యంగా రాత్రి సమయంలో పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.  అవేంటో తెలుసుకుంటే.. జీర్ణక్రియ.. కుంకుమ పువ్వు టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్దకం, అజీర్ణం,  కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.  రాత్రి పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల ఆహారం  సజావుగా జీర్ణమవుతుంది. నెలసరి.. నెలసరి సమస్యలు ఉన్నవారికి కుంకుమ పువ్వు టీ అద్భుతం అని చెప్పవచ్చు. కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల కడుపు కండరాల తిమ్మిరి,  కడుపు ఉబ్బరం,  అలసట, నెలసరికి ముందు, తరువాత వచ్చే లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్ర.. కుంకుమ పువ్వులో సఫ్రానల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి.  ఇవి మనసుకు, మెదడుకు ప్రశాంతతను ఇస్తాయి. పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల మనసు,  శరీరం రెండూ విశ్రాంతి పొందుతాయి. నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడేవారు,  పదే పదే నిద్రలో మెలకువ వచ్చే వారు పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగితే చాలా మంచిది. రోగనిరోధక శక్తి.. కుంకుమ పువ్వులో విటమిన్-సి,  విటమిన్-బి,  రిబోప్లేవిన్ వంటి విటమిన్లు ఉంటాయి.  ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్.. కుంకుమ పువ్వులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.  అలాగే మెగ్నీషియం,  పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.  ఇవి రక్తపోటును,  శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. బరువు.. ఖాళీ కడుపుతో కుంకుమ పువ్వు టీ తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎందుకంటే కుంకుమ పువ్వు టీ ఆకలిని తగ్గిస్తుంది.  తద్వారా కేలరీలు ఎక్కువ తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే కొద్దిపాటి ఫైబర్ చాలా శక్తివంతమైనది. ఇది  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాన్సర్.. కుంకుమ పువ్వులో పెద్ద మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి శరీరంలో కాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించే సామర్థ్యం కలిగి ఉంటాయి. చర్మ ఆరోగ్యం.. చర్మ ఆరోగ్యానికి కుంకుమ పువ్వు దివ్యౌషధం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పలు బ్యూటీ ఉత్పత్తులలో కూడా కుంకుమ పువ్వు ను వినియోగిస్తారు. కుంకుమ పువ్వు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో,  మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.                                        *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  మునక్కాయలు వేసవి కాలంలో విరగకాస్తాయి.  చాలామందికి మునగ కాయలతో చేసే వంటకాలు అంటే చాలా ఇష్టం.  ఈ మధ్య కాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చూస్తూనే ఉన్నాం. ఇలా కిడ్నీలో రాళ్ల సమస్యకు మునక్కాయ మంచి పరిష్కారం అవుతుందని  సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారో పూర్తీగా తెలుసుకుంటే.. మునగకాయలను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు విచ్చిన్నమవుతాయట. అవి బయటకు వచ్చేస్తాయట. ఈ విషయాన్ని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు మునక్కాయలను ఎడాపెడా తింటున్నారు.  మునక్కాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పోషకాలు కూడా మెరుగ్గా ఉంటాయి. మునక్కాయలు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది మూత్ర పిండాల ఆరోగ్యాన్ని, ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా మెరుగుపరుస్తుంది.  ఇవన్నీ నిజమే కానీ.. మూత్రపిండాలలో రాళ్లను విచ్చిన్నం చేసి వాటిని బయటకు రావడంలో మునక్కాయలు సహాయపడతాయి అనే మాట మాత్రం అస్సలు నిజం కాదని వైద్యులు అంటున్నారు. మునక్కాయలు మాత్రమే కాదు.. ఏ కూరగాయ కూడా కిడ్నీలో రాళ్లు పోగొట్టడంలో నేరుగా సహాయపడదు అని వైద్యులు అంటున్నారు.  మునక్కాయలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు పోతాయనే అపోహతో వాటిని ఎక్కువ తింటే అది ఆరోగ్యానికి హాని చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. మునగతో లాభం.. మునగ తినడం వల్ల ఖనిజాలు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది. ఇది కొత్త రాళ్ళు ఏర్పడే ప్రక్రియను ఖచ్చితంగా ఆపుతుంది. ఈ కూరగాయలోని యాంటీఆక్సిడెంట్లు,  నిర్విషీకరణ లక్షణాలు మూత్రపిండాల నిర్విషీకరణకు,  మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది అనేక ఇతర ఆరోగ్య సమస్యల  నుండి దూరంగా ఉంచుతుంది. మునగతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కానీ మునగను తినడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు పోతాయనే మాట మాత్రం వాస్తవం కాదు. కిడ్నీలో రాళ్ల సమస్యకు ఇలాంటి ప్రయోగాలు చేయకుండా వైద్యులను సంప్రదించడమే మంచిది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
  మలేరియా జ్వరంగా పరిగణించబడే సమస్య.  మలేరియా వ్యాధి గురించి చాలామందిలో చాలా అపోహలు ఉంటాయి.  వాటినే నిజం అనుకుంటూ ఉంటారు.  దీని వల్ల మలేరియా కారణంగా కలిగే నష్టమే ఎక్కువ ఉంటుంది.  అపోహలు,  వాస్తవాల గురించి.. అలాగే  మలేరియా వ్యాధి నివారించడానికి చేయవలసిన పనుల గురించి తెలుసుకుంటే.. అపోహ: మలేరియా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే వస్తుంది. వాస్తవం: గ్రామీణ,  పట్టణ ప్రాంతాలలో మలేరియా సంభవించవచ్చు. నీరు నిలిచి ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాలు దోమల వృద్ధికి ఎక్కువగా గురవుతుండగా, ముఖ్యంగా పారిశుధ్యం,  నీటి నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక ప్రాంతాలలో దోమలు ఎక్కువ ఉంటే  నగరాల్లో కూడా మలేరియా వ్యాప్తి చెందుతుంది. అపోహ: రాత్రిపూట మాత్రమే ఇన్పెక్షన్  దోమ నుండి మలేరియా వస్తుంది. వాస్తవం: మలేరియాను వ్యాప్తి చేసే అనాఫిలిస్ దోమలు ప్రధానంగా సంధ్యా సమయంలో,  తెల్లవారుజామున చురుకుగా ఉంటాయి. కొన్ని జాతులు రోజంతా కూడా కుట్టగలవు. అన్ని సమయాల్లో..  ముఖ్యంగా మలేరియా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలలో దోమ కాటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం. అపోహ: మలేరియా వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది. వాస్తవం: మలేరియా వ్యక్తి నుండి వ్యక్తికి నేరుగా సంక్రమించదు. రక్త మార్పిడి ద్వారా లేదా గర్భధారణ సమయంలో తల్లి నుండి బిడ్డకు వంటి అరుదైన సందర్భాలలో తప్ప. ఇది ప్రధానంగా సోకిన అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. అపోహ: ఒకసారి మలేరియా బారిన పడిన తర్వాత జీవితాంతం దానికి రోగనిరోధక శక్తి ఉంటుంది. వాస్తవం: ఒకసారి మలేరియా బారిన పడటం వల్ల జీవితాంతం రోగనిరోధక శక్తి లభించదు. పదే పదే వ్యాధి బారిన పడటం వలన కాలక్రమేణా పాక్షిక రోగనిరోధక శక్తి ఏర్పడవచ్చు. కానీ అది పూర్తి రక్షణకు హామీ ఇవ్వదు. గతంలో మలేరియా బారిన పడిన వ్యక్తులు కూడా పరాన్నజీవికి గురైతే మళ్ళీ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. మలేరియా నివారణ కోసం చేయవలసినవి.. మలేరియా నివారణలో దోమల బారిన పడటాన్ని తగ్గించే,  పరాన్నజీవి వ్యాప్తి చెందకుండా నిరోధించే పద్ధతుల ఉంటాయి. వీటితో పాటు, ప్రభావవంతమైన నివారణ,  చికిత్స కోసం మలేరియాను ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. ఇవి మలేరియా సంక్రమించే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించడానికి,  ఈ ప్రమాదకరమైన వ్యాధి నుండి తమను తాము మాత్రమే కాకుండా  ఇతరులను రక్షించుకోవడానికి  సాధారణంగా చేయవలసినవి ఏంటంటే.. కీటక వికర్షకాలను వాడాలి.. దోమలను దూరంగా ఉంచడానికి  చర్మంపై DEET, పికారిడిన్ లేదా నిమ్మకాయ యూకలిప్టస్ నూనె కలిగిన క్రిమి వికర్షకాన్ని పూయాలి. దోమల తెర.. ముఖ్యంగా రాత్రిపూట దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నిద్రపోయేటప్పుడు దోమతెర ఉపయోగించాలి. రక్షణ.. ముఖ్యంగా సాయంత్రం,  తెల్లవారుజామున దోమలు ఎక్కువగా ఉండే సమయంలో పొడవాటి చేతుల చొక్కాలు,  పొడవాటి ప్యాంటు ధరించాలి. దోమల తెరలు.. దోమలు ఇంటి లోపలికి రాకుండా నిరోధించడానికి కిటికీలు,  తలుపులకు దోమల తెరలు ఉండేలా చూసుకోవాలి. దోమలు పెరిగే ప్రాంతాలు..  ఇంటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించాలి.  ఎందుకంటే దోమలు ఎక్కువ కాలం నిలిచి ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. బకెట్లు,  పూల కుండలు,  వర్షపు నీటితో నిండిన పాత టైర్లు వంటివి తొలగించాలి. యాంటీమలేరియల్ మందులు..  మలేరియా వ్యాప్తి చెందుతున్న ప్రాంతానికి ప్రయాణిస్తుంట, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి  వైద్యుడు సూచించిన యాంటీమలేరియల్ మందులను తీసుకోవాలి.  వైద్య సహాయం.. ముఖ్యంగా మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతానికి ప్రయాణించిన తర్వాత జ్వరం, చలి లేదా అలసట వంటి లక్షణాలు ఎదురైతే ముందస్తు రోగ నిర్ధారణ,  చికిత్స కోసం వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...