LATEST NEWS
  జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఫైనల్ పోలింగ్ శాతం 48.43%  నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడంలో హైదరాబాదీలు వెనకడుగు వేస్తున్నారు. ఇది మరోసారి నిరూపించారు. సెలవు ఇచ్చి రండి వచ్చి తమకు నచ్చిన నాయకులను ఎన్నుకొమని చెప్పిన జూబ్లీ ఓటర్ల ఆమడ దూరం పోయారు. దేశంలో 8 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా అత్యల్పంగా జూబ్లీహిల్స్‌లోనే 48.43 శాతం నమోదు అయింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యం సమస్యతో మృతి చెందటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుంది. జూబ్లీహిల్స్‌ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.  ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్నాట్లు తెలుస్తోంది.  
  తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అవకాశముందని ఎక్కువ సర్వే సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేసినందుకు ఆమెను, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్నవారికి.. ఓటు వేసేందుకు అధికారులు ఛాన్స్ ఇచ్చారు చాణక్య స్ట్రాటజీస్‌  కాంగ్రెస్‌ 46%, బీఆర్‌ఎస్ 43%, బీజేపీ 6% ఓట్లు పీపుల్స్‌ పల్స్‌: కాంగ్రెస్‌ 48%, బీఆర్‌ఎస్ 41%, బీజేపీ 6% ఓట్లు నాగన్న సర్వే: కాంగ్రెస్‌ 47%, బీఆర్‌ఎస్ 41%, బీజేపీ 8% ఓట్లు ఆపరేషన్‌ చాణక్య: 8 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌దే విజయమని సర్వే JANMINE సర్వే: కాంగ్రెస్‌కు 42.5%, బీఆర్‌ఎస్ 41.5%, బీజేపీ 11.5% ఓట్లు ఆరా మస్తాన్ సర్వే :  కాంగ్రెస్‌  47.49% బీఆర్‌ఎస్ 39.25%, బీజేపీ 9.31% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని వెల్లడించింది
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. మంగళవారం (నవంబర్ 11) రెండో విడత పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వివిధ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో బీహార్ లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది ఎన్డీయే కూటమే అని పేర్కొన్నాయి. అయితే ఒక సంస్థ మాత్రం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టనున్నది మహాగట్ బంధనే అని పేర్కొంది. మాసివ్ మెజారిటీతో కాకపోయినా అధికారం చేపట్డేందుకు అవసరమైన మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగట్ బంధన్ గెలుచుకుంటుందని అంచనా వేసింది..  ఇక పోలింగ్ శాతం చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా బీహార్ ఓటర్లు ఈ సారి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో వెల్లువెత్తారు. రెండో దశలో సాయంత్రం ఐదు గంటల వరకూ 67.14శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడతలో 64.46 శాతం ఓటింగ్ నమోదైంది. రెండు విడతలూ కలిపి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం   66.11శాతం పోలింగ్ నమోదైంది. బీహార్ రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక పోలింగ్ ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయడానికి ఏ కూటమికైనా కావలసిన మ్యాజిక్ ఫిగర్ 122. ఇలా ఉండగా యాక్సిస్ మై ఇండియా, సీవోటర్, ఐపిఎస్ఓఎస్, జన్ కిబాత్, టుడేస్ చాణక్య సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వివిధ  చానళ్లు, వెబ్ సైట్లు, సోషల్ మీడియా ద్వారా వెలువరించాయి.  పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీహార్ లో మరో సారి ఎన్డీయే అధికారం చేపడుతుంది. రాష్ట్రంలోని 243 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి 133 నుంచి 159 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది.   మహాఘట్ బంధన్ కూటమి 75 నుంచి 101 స్థానాలకు పరిమితమౌతుంది.  ఇతరులకు 2 నుంచి 13 స్థానాలు దక్కు అవకాశం ఉంది.  ఇక చాణక్య సర్వే మేరకు ఎన్డీయే కూటమి 140 నుంచి 147 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 86 నుంచి 92 స్థానాలలో గెలుపొందే అవకాశం ఉంది. ఇతరులు 2 నుంచి 4 స్థానాలలో విజయం సాధిస్తారు. ఇక బీకాన్ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమి 139 నుంచి 144 స్థానాలలోనూ, మహాఘట్ బంధన్ 95 నుంచి 101 స్థానాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. ఇతరులకు 7 నుంచి 10 స్థానాలు లభించే అవకాశం ఉంది.  అయితే సత్తాబజార్ వెలువరించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ 125 నుంచి 130 స్థానాలలో విజయం సాధించి అధికారం చేపడుతుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 93 నుంచి 99 స్థానాలకే పరిమితమౌతుంది. ఇతరులు ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన సంస్థలలో అత్యధిక సంస్థలు ఎన్డీయే కూటమే రాష్ట్రంలో మరోసారి అధికార పగ్గాలు చేపడుతుందని అంచనా వేయగా, ఒక్క సంస్థ మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ బీహార్ లో అధికారంలోకి వస్తుందని పేర్కొంది. 
  జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో సాయంత్రం 5  గంటల వరకూ 47.16 శాతం నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆయా పోలింగ్ బూత్‌లలో ఓటర్లు తమ హక్కును వినియెగించుకుంటున్నారు. మరో అరగంట పోలింగ్ అవకాశం ఉండడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తుది ఫలితం ఈ నెల 14వ తేదీన తెలుస్తుంది.  పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించేందుకు రెడీగా ఉన్నాయి.. ఈ పోల్స్ ఫలితాలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ ఉంది. అనేక సంస్థల అంచనాల ప్రకారం.. అధికార కాంగ్రెస్ పార్టీ లేదాబీఆర్‌ఎస్ ల మధ్యే గెలిచే ఛాన్స్ ఉంది. తక్కువ పోలింగ్ శాతం కారణంగా పోల్స్ అంచనాలలోనూ కొంత భిన్నత్వం కనిపించనుంది. 
  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సంద‌ర్భంగా ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియామ‌వ‌ళిని ఉల్లంఘించిన ప‌లువురిపై హైద‌రాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు బీర్ల ఐల‌య్య,  రామ‌చంద్ర‌నాయ‌క్‌,  రాందాస్ పై మ‌ధురాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో రెండు కేసులు , మాజీ ఎమ్మెల్యేలు  దాస్యం విన‌య్ భాస్క‌ర్,  మెతుకు ఆనంద్‌పై బోర‌బండ పోలీస్ స్టేష‌న్‌లో ఒక కేసు న‌మోద‌య్యాయి. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప్ర‌కారం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు స్ప‌ష్టం చేస్తున్నారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియామ‌వ‌ళిని గౌర‌వించాల‌ని సూచిస్తున్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు గ‌మ‌నిస్తే వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం మాత్రమే నమోదైంది. పోలింగ్ మొదలై సుమారు 9 గంటలు గడుస్తున్నా ఓటింగ్ శాతం పెరగలేదు. చివరి రెండు గంటల్లో పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.
ALSO ON TELUGUONE N E W S
NTR and Aamir Khan have been at a race to star in the biopic of Father of Indian Cinema, Dadasaheb Phalke. The news reports have suggested that SS Rajamouli is going to produce the film with NTR while Rajkumar Hirani will direct Aamir Khan's version. Recently, NTR has dropped out of the project.  While his close sources have denied that NTR even considered to be part of the biopic, the recent reports have given his fans a sigh of relief. They did not want their action hero to play such a period film, at this juncture. Now, reports suggest that Aamir Khan and Rajkumar Hirani have decided to shelve their project.  Close sources have revealed that the actor did not feel the movie could live up to expectations risen by their union after films like 3 Idiots and PK. He felt that any other script would do justice rather than this one. Even Hirani agreed and started working on his next without Aamir in consideration.  Aamir Khan is busy finalising his next film script and he is apparently hearing to 25 scripts and he might announce his next in a couple of months. For now, Dadasaheb Phalke biopic is not happening in any language of Indian Cinema.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Bhagyashree Borse, the leading lady of Dulquer Salmaan's highly anticipated period drama Kaantha, has expressed immense excitement about her role ahead of the November 14th release. Directed by Selvamani Selvaraj and jointly produced by Dulquer Salmaan and Rana Daggubati, the film also features Rana and Samuthirakani. Bhagyashri interacting with media, called Kaantha as a very special project, offering her a "pure performance-oriented character" named Kumari. She considered the role a blessing and a challenge, particularly due to its 1960s setting. Though Kaantha was the first script she signed, due to delays others films have released first.  Her preparation included watching classic films and drawing inspiration from legendary actresses like Sridevi and Savitri to authentically portray the era. She praised the positive work environment and the support from Director Selvaraj, who crafted the Kumari character beautifully.  Bhagyashri highlighted her enriching experience working with the producers. Having worked with major stars early in her career, she looks forward to the film's success. Her ultimate hope is that Kaantha will elevate her from a commercial performer to being recognized as a serious performer in the industry. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ఒకప్పుడు కామెడీ హీరోగా తనదైన ముద్ర వేసిన అల్లరి నరేష్.. ఇటీవల కాలంలో విభిన్న చిత్రాలతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్ 21న '12A రైల్వే కాలనీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. (12A Railway Colony)   శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'పొలిమేర' ఫేమ్ అనిల్ విశ్వనాథ్ కథ అందించడం విశేషం. నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.   '12A రైల్వే కాలనీ' ట్రైలర్ తాజాగా విడుదలైంది. దాదాపు రెండు నిమిషాల నిడివితో రూపొందిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఒక హత్య కేసు విచారణ నేపథ్యంలో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అసలు ఈ కేసుతో అల్లరి నరేష్ కి సంబంధం ఏంటి? ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? అనే క్యూరియాసిటీని కలిగిస్తూ ట్రైలర్ ను కట్ చేశారు.   Also Read: అఖండ-2.. పక్కా ప్లానింగ్ తో పాన్ ఇండియా తాండవం!   ముఖ్యంగా "బహుశా ప్రపంచంలో ఇలాంటి కేసు ఎవరూ చూసుండరు" అంటూ సాయికుమార్ చెప్పిన డైలాగ్ తో.. ఈ సినిమాలోని మర్డర్ మిస్టరీ ఎంత కొత్తగా ఉండబోతుందో అర్థమవుతోంది.   ఊహించని మలుపులు, కట్టిపడేసే ఎమోషన్స్ తో '12A రైల్వే కాలనీ' మూవీ ఎంగేజింగ్ గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. పొలిమేర తరహాలోనే క్షుద్ర పూజల ప్రస్తావన ఉంటుందని ట్రైలర్ లో హింట్ ఇచ్చారు.    చూద్దాం మరి '12A రైల్వే కాలనీ'తో అల్లరి నరేష్ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడేమో.    
Allari Naresh’s upcoming thriller, 12A Railway Colony, has consistently heightened anticipation, and the newly released trailer engrosses viewers immediately. It masterfully builds curiosity through a series of riveting and enthralling elements. The chemistry between Naresh and leading lady Kamakshi Bhaskarla is a pivotal element driving the investigation. The trailer features CCB Chief Sai Kumar acknowledging Naresh's exceptional ability to solve an "unsolvable case."  Intriguingly, it juxtaposes shots of the actor skiing through snowy avalanches with scenes of him struggling financially, underscoring a compelling character journey. The plot centers on the murder of an influential figure, propelling a complex investigation full of exciting twists and turns involving numerous characters. Dr. Anil Vishwanath, Polimera fame, penned the story, which is directed and edited by Nani Kasaragadda. Produced by Srinavasaa Chitturi, this high-quality thriller is set for release on November 21st, with the trailer successfully escalating the excitement. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో 'అఖండ-2' ఒకటి. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న 14 రీల్స్ ప్లస్ నిర్మిసున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. (Akhanda 2 Thandavam)   'అఖండ-2' విడుదలకు ఇంకా మూడు వారాలే ఉండటంతో.. మూవీ టీమ్ భారీ ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తోంది. ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ కి శ్రీకారం చుడుతోంది.   డివోషనల్ టచ్ ఉన్న అఖండ తరహా సినిమాలు పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటున్నాయి. ఇదే బాటలో అఖండ-2 కూడా పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టుగానే పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.   'అఖండ-2' మొదటి సాంగ్ ని నవంబర్ 14న ముంబైలో విడుదల చేయనున్నారు. అలాగే, వారణాసిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సన్నాహాలు చేస్తున్నారు. కొచ్చి, బెంగళూరు, చెన్నైలోనూ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారట.   Also Read: ప్రభాస్ 'స్పిరిట్'లో ఆ ఫ్లాప్ తెలుగు హీరో..!   పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ చేస్తూ.. విడుదలకు ముందు నవంబర్ 29 లేదా 30న తెలుగునాట భారీ ప్రీ రిలీజ్ నిర్వహించబోతున్నారట. ఈ వేడుకకు హైదరాబాద్ లేదా అమరావతి వేదిక కానుందని చెబుతున్నారు.   మొత్తానికి ఈ మూడు వారాలు అఖండ మయం కాబోతుంది. అసలే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రమోషన్స్ తో ఆ అంచనాలు రెట్టింపు అవుతాయి అనడంలో సందేహం లేదు.   ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు.. 'అఖండ-2' ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  
Dulquer Salmaan is one of the biggest and most popular stars of Indian Cinema. He started his career as next in kin to legendary actor Mammootty. But he is able to carve a following of his own by acting in different languages and in diverse scripts. His Telugu Films have all been highly successfull at the box office.  Now, he is starring in a period drama, Kaantha, that features him playing the character of a big star of 1950's and 1960's South Indian Cinema. Talking about the film, he shared how he never took filmmaking and film based career for granted. He further revealed that he saw how his father Mammootty felt insecure about ageing.  He stated that he saw his father finding age has his enemy and telling to his lawyer, doctor friends that in their professions age gives them higher paycheck but for him, it is different. DQ shared that he saw Mammootty hating to age on screen and being driven by the ambition to stay relevant for long and in demand.  Later, he revealed that Mammootty has been more happy with his choices and ageing roles in recent days as the times have changed. Well, Kaantha is releasing on 14th November and the movie had been in the making for 6 years. Rana Daggubati has produced the film and Bhagyashri Borse is playing the leading lady role.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -ది గర్ల్ ఫ్రెండ్ షాకింగ్ కలెక్షన్స్  -పాన్ ఇండియా నటిగా రష్మిక మెరుపులు  -కలెక్షన్స్ తగ్గాయా! పెరిగాయా!   తనని పాన్ ఇండియా నటీమణి అని ఎందుకు అంటారో సిల్వర్ స్క్రీన్ పై మరోసారి 'ది గర్ల్ ఫ్రెండ్'(The GirlFriend)తో చాటి చెప్పింది రష్మిక(Rashmika). భూమా అనే క్యారక్టర్ లో రష్మిక కనపర్చిన నటనకి పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. కెరీర్ పరంగా చూసుకున్నా తన సినీ చాట్ లిస్ట్ లో గర్ల్ ఫ్రెండ్ మూవీ బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కూడా సినీ పండితులు వ్యక్తం చేస్తున్నారు.   ఇక ఈ మూవీ మరో రెండో రోజుల్లో తొలి వారంలోకి అడుగుపెట్టబోతుంది.ఈ లోపు మొదటి నాలుగు రోజుల కలెక్షన్స్ ని ట్రేడ్ వర్గాల వారు ప్రకటించారు. వాళ్ళ అంచనా ప్రకారం నాలుగు రోజులకి 7 .50 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా రష్మిక ప్రీవియర్స్ మూవీస్ తో పోల్చుకుంటే తక్కువే. కానీ తొలి రోజు సాధించిన కలెక్షన్స్ కంటే వీకెండ్ రోజులు ఎక్కువ వసూళ్లు సాధించింది. ఇక  మేకర్స్  అధికారికంగా చెప్పకపోయినా గర్ల్ ఫ్రెండ్ మూవీకి సుమారు 42 కోట్ల బడ్జెట్ అయినట్టుగా టాక్. మరి టోటల్ రన్నింగ్ లో సేఫ్ జోన్ లోకి అడుగుపెడుతుందా లేదా అనే ఆసక్తి అందరిలో ఉంది.   Also Read:  తమన్నా ఓజంపిక్ ఇంజెక్షన్స్ వాడుతోందా!   నూతన కథానాయకుడు దీక్షిత్ శెట్టి(Deekshit Shetty)హీరోగా విక్కీ అనే క్యారక్టర్ లో మంచి పెర్ పెరఫార్మెన్స్  నే ప్రదర్శించాడు. గర్ల్ ఫ్రెండ్ ని తెరకెక్కించిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran)కూడా కీలక పాత్రలో కనపడ్డాడు.అను ఇమ్మానియేల్ నటన కూడా ప్రధాన ఆకర్షణ. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు  సంయుక్తంగా నిర్మించాయి.      
  -తమన్నా పై ఆరోపణలు  -వివరణ ఇచ్చిన తమన్నా  -మహిళల్లో ప్రతి ఐదేళ్లకి మార్పులు -అప్ కమింగ్ మూవీస్ ఇవే    పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై స్టార్ నటీమణి 'తమన్నా'(Tamannaah Bhatia)కి ఉన్న చరిష్మా మరో నటీమణికి లేదంటే అతిశయోక్తి కాదు. 2005 లో సినీ రంగ ప్రవేశం చేసి రెండున్నర దశాబ్దాల నుంచి తన హవా కొనసాగించడం అంటే అతిశయోక్తి కాదు. ఇందుకు అభిమానులని, ప్రేక్షకులని ఆకట్టుకునే గ్లామర్ చాలా ముఖ్యం. పైగా హీరోయిన్ గా ఎంత పాపులారిటీ ని సంపాదించిందో, ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ లోను అంతే పాపులారిటీ ని సంపాదించింది. పైగా తమన్నా స్పెషల్ సాంగ్ ఉందంటే చాలు ఆ సినిమాకి ప్రేక్షకులు అభిమానులు క్యూ కడుతున్నారు. బడా హీరోలు, మేకర్స్ సైతం తమ సినిమాలో 'తమన్నా' సాంగ్ ఉండాలని కూడా కోరుకుంటున్నారంటే తమన్నా బ్రాండ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.   కొంత కాలం నుంచి తమన్నా ఒంటి తీరుపై సోషల్ మీడియా వేదికగా చాలా రూమర్స్ వస్తున్నాయి. బరువు తగ్గేందుకు తమన్నా 'ఓజంపిక్'(ozempic)లాంటి ఇంజెక్షన్స్ తీసుకుంటుందనేది సదరు సారాంశం. ఈ వార్తలపై రీసెంట్ గా తమన్నా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తు పదిహేను సంవత్సరాల వయసు నుంచి కెమెరా ముందు నటిస్తున్నాను. కాబట్టి నేను దాచడానికి ఏమి లేదు. కెమెరా తోనే నా ప్రయాణం కొనసాగుతుంది.టీనేజ్ లో స్లిమ్ గా ఉన్నాను. ఇప్పుడు అలాగే ఉండాలని అనుకుంటున్నాను. అంతే గాని ఇందులో దాచడానికి ఏం లేదు. పైగా నాకు నేను కొత్తగా కనిపించడం లేదు. సాధారణంగా మహిళల్లో ప్రతి ఐదేళ్లకి మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఎప్పుడు ఒకే శరీరాకృతిలో కనిపించలేమని చెప్పుకొచ్చింది.   Also Read:  బెల్లంకొండ సురేష్‌ పై కబ్జా ఆరోపణలు!..ఫిల్మ్‌నగర్‌లో కేసు నమోదు   ప్రస్తుతం తమన్నాలిస్ట్ లో ఓ రోమియో రేంజర్, వ్యాన్, రాగిణి ఎంఎస్ఎస్ 3 తో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. తమన్నా ఇటీవల బెట్టింపుల యాప్ కి సంబంధించి ప్రమోషన్ చేసిన కేసులో ఇరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.    
  ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసిన 'బాహుబలి' సినిమాలో ఆయనను ఢీ కొట్టే పాత్రలో దగ్గుబాటి హీరో రానా నటించాడు. ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'స్పిరిట్'లో కూడా ఆయనను ఢీ కొట్టే పాత్రలో మరో దగ్గుబాటి హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది.   ప్రస్తుతం 'ది రాజా సాబ్', 'ఫౌజీ' సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో 'స్పిరిట్' చేయనున్నాడు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇటీవల విడుదలైన సౌండ్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.    'స్పిరిట్'లో త్రిప్తి డిమ్రీ, వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో కీలక పాత్ర కోసం దగ్గుబాటి అభిరామ్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.   Also Read: అసలు రవితేజ ఎలాంటి సినిమాలు చేయాలి..?   తేజ డైరెక్షన్ లో వచ్చిన 'అహింస'తో రానా సోదరుడు అభిరామ్ హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమాతో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు అభిరామ్. 'అహింస' వచ్చి రెండేళ్లు దాటిపోయినా.. ఇంతవరకు ఆయన కొత్త సినిమా అప్డేట్ రాలేదు. ఇలాంటి తరుణంలో 'స్పిరిట్'లో నటించే అవకాశం దక్కించుకున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.   అణువణువునా అహంకారం నిండి ఉండే ఓ పవర్ ఫుల్ కోసం అభిరామ్ ని సందీప్ రెడ్డి సంప్రదించాడట. అభిరామ్ ఎపిసోడ్ 'స్పిరిట్' మూవీ మేజర్ హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.   సందీప్ రెడ్డి సినిమాల్లో పాత్రలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో తెలిసిందే. యాక్టర్స్ లైఫ్ టర్న్ అయ్యేలా రోల్స్ ని డిజైన్ చేయడంలో సందీప్ దిట్ట. ఇప్పుడు 'స్పిరిట్'తో అభిరామ్ కి కూడా యాక్టర్ గా మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి.    
  - సీనియర్‌ హీరో సినిమా రిజెక్ట్‌ చెయ్యడానికి రీజన్‌ అదే! - హిందీలో బిజీ అవుతున్న హీరోయిన్‌! - చిన్న వయసు హీరోయిన్లతో స్టెప్పులేస్తున్న సీనియర్‌ హీరోలు!   మన ఇండియన్‌ సినిమాల్లో హీరోకి హీరోయిన్‌ కూడా విధిగా ఉండాలి. ఇది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే హీరోయిన్‌ లేకుండా సినిమాలు తీసిన సందర్భాలు కూడా మనం చూశాం. ఇక హీరో అంటే పాతిక సంవత్సరాల కుర్రాడు అయి ఉండక్కర్లేదు అనేది సినిమా థియరీ. మన సినిమాల్లోనే కాదు, హాలీవుడ్‌ సినిమాల్లో సైతం వయసు మీద పడిన వారు హీరోలుగా నటిస్తుంటారు. వారి పక్కన హీరోయిన్లుగా తక్కువ వయసు ఉన్నవారే ఉంటారు.    మన తెలుగు సినిమాల విషయానికి వస్తే.. 1980వ దశకంలో హీరోలుగా నటించిన వారంతా వయసు మీద పడిన వారే. పక్కన నటించే హీరోయిన్లు వారి కంటే ఎంతో చిన్నవారు. అయినప్పటికీ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆయా హీరోలతో కలిసి నటించారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతానికి వస్తే.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి సీనియర్‌ హీరోలు ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. తమ కంటే చాలా తక్కువ వయసున్న హీరోయిన్లతో స్టెప్పులు వేస్తున్నారు. కానీ, తను మాత్రం అలాంటి పని చెయ్యను అంటోంది రాశీ ఖన్నా.    Also Read: అసలు రవితేజ ఎలాంటి సినిమాలు చేయాలి..?   తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశీ.. చాలా మంది యంగ్‌ హీరోలతో సినిమాలు చేసింది. తెలుగులో అవకాశాలు తగ్గుతున్న తరుణంలో హిందీలో అవకాశాలు వస్తున్నాయి. అక్కడ హీరోయిన్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. తెలుగు విషయానికి వస్తే.. పవన్‌కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రంలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.    ఇదిలా ఉంటే.. ఇటీవల ఒక సీనియర్‌ హీరో సినిమాని రాశి రిజెక్ట్‌ చేసిందట. అయితే ఆ హీరో ఎవరు అనేది బయటకు రాలేదు. ఆ హీరోకి సంబంధించిన టీమ్‌ రాశిని అప్రోచ్‌ అయింది. ఆ సినిమా చేసేందుకు మొదట ఓకే చెప్పింది. అగ్రిమెంట్‌ చేసుకునేందుకు కూడా రెడీ అయిన తర్వాత సినిమాలో ఆమె క్యారెక్టర్‌ గురించి చెప్పారు డైరెక్టర్‌. దాంతో తను ఆ సినిమా చెయ్యడం లేదని చెప్పేసింది. తనకు ఆ క్యారెక్టర్‌ నచ్చలేదని చెప్పింది.    Also Read: అసలు రవితేజ ఎలాంటి సినిమాలు చేయాలి..?   అసలు విషయానికి వస్తే.. సీనియర్‌ హీరో సినిమా అయినప్పటికీ ఒక ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ అనే ఉద్దేశంతో ఓకే చెప్పిందట. అది హీరోయిన్‌ పాత్ర అని తెలుసుకొని ఆ సినిమా క్యాన్సిల్‌ చేసుకుంది. ఒక సీనియర్‌ హీరోకి లవర్‌గా నటిస్తే తన కెరీర్‌కి చాలా ఇబ్బంది అవుతుందని రాశి ఆలోచన. ఈ సినిమా చేస్తే ఆ తర్వాత యంగ్‌ హీరోల సినిమాల్లో తనకు అవకాశాలు ఇవ్వరని ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇటీవలి కాలంలో ఇలా ఒక స్టార్‌ హీరో సినిమా నుంచి హీరోయిన్‌ బయటికి వచ్చెయ్యడం అనేది జరగలేదు. దాంతో రాశీ ఖన్నా నిర్ణయానికి ఇండస్ట్రీలోని ప్రముఖులతోపాటు ప్రేక్షకులు కూడా షాక్‌ అవుతున్నారు. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ఈ ప్రపంచంలో భార్యాభర్తల బంధం  చాలా అపురూపమైనది.  వేర్వేరు ప్రాంతాలలో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహం పేరుతో కలిసి జీవించడం,  ఎలాంటి పరిస్థితులు  ఎదురైనా ఒకరికి ఒకరు తోడుండటం ఈ బంధాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.  అయితే భార్యాభర్తల బంధంలో తమదే పై  చేయి ఉండాలనే పిచ్చి ఆలోచన చాలామందిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా మగవారు భార్యల విషయంలో ఆధిపత్య ప్రవర్తన కలిగి ఉంటారు.  ఈ వివాహ బంధంలో చాలామంది ఆడవారు ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అదే ట్రోఫీ వైఫ్.. అసలు ట్రోఫీ వైఫ్  అంటే  ఏంటి? ఇలాంటి పరిస్థితిలో ఎక్కువమంది భార్యలు ఎందుకు ఉన్నారు? ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్పడానికి భార్యాభర్తల మధ్య  ఉండే పరిస్థితులు ఏంటి? తెలుసుకుంటే.. ట్రోఫీ భార్య అంటే.. ట్రోఫీ భార్య అంటే.. భర్త కేవలం భార్య బాహ్య రూపానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం. అతని దృష్టిలో భార్యకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.  మూడు ముళ్లు వేసి పెళ్లి పేరుతో తన ఇంటికి తీసుకుని వచ్చి భార్యను కేవలం తన అవసరానికి వాడుకోవడం చేస్తుంటాడు.  ఇలాంటి పరిస్థితిలో ఉన్న బార్యలు అందరూ ట్రోఫీ భార్యలే.  ట్రోఫీ భార్యల పరిస్థితులు.. భార్యాభర్తల బంధంలో ఏ నిర్ణయం తీసుకున్నా భార్యాభర్తలు ఇరువురూ కలిసి తీసుకోవాలి అనుకుంటారు.  భర్త అయినా, భార్య అయినా తమ పార్ట్నర్ తమను కూడా అబిప్రాయం అడగాలని అనుకుంటారు. కానీ ట్రోఫీ భార్యలు మాత్రం ఇలాంటి ప్రాధాన్యతకు నోచుకోరు.  భర్త ఏ నిర్ణయం తీసుకున్నా తన సొంతంగా తీసుకుంటాడు.  భార్య అభిప్రాయంతో కానీ,  భార్య  ఆలోచనలతో కానీ అతనికి ఆసక్తి ఉండదు. భార్యాభర్తల బంధంలో ప్రేమ ఉండాలని చాలామంది అనుకుంటారు. ముఖ్యంగా భర్త చూపించే ప్రేమ భార్యకు ఎంతో ముఖ్యం. కానీ ట్రోఫీ భార్యలు మాత్రం భర్త ప్రేమకు నోచుకోరు. భర్తలు ఒక వేళ ప్రేమ చూపించినా అదంతా షో-ఆఫ్ కే.. అంటే నలుగురు చూడాలని, తనను మంచి భర్తగా ట్యాగ్ వేయాలనే కోరికతో  నలుగురిలో భార్యల పట్ల ప్రేమ చూపిస్తుంటారు. భార్యాభర్తలు అంటే.. ఒకరి వల్ల మరొకరు సంతోషంగా ఉండాలి. కానీ కొందరు మాత్రం తమ సంతోషాన్ని మరచి ఇతరులకు బాగా కనిపించాలని, ఇతరుల దృష్టిలో ఏది సరైనది అయితే.. అలాగే తాము ఉండాలని అనుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఉండే భార్యలు అందరూ ట్రోఫీ భార్యలే. భర్త ఎప్పుడూ భార్యను అన్ని విషయాలలో నియంత్రణ చేస్తుంటే.. ఆ బార్య ట్రోఫీ భార్య అని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. ఏం మాట్లాడాలి? ఏం తినాలి? ఏ దుస్తులు ధరించాలి? ఇలా ప్రతి విషయంలో భర్త జోక్యం చేసుకుంటూ ఉంటారు. భార్య ఎమోషన్స్ ను ఎప్పుడూ పట్టించుకోకుండా కేవలం తనకు నచ్చినది జరగాలని భర్త డిమాండ్ చేస్తుంటే ఆ  భార్య ట్రోఫీ వైఫ్ అని అర్థమట. వివాహం అయిన తరువాత ఆడపిల్లను కేవలం తనకు భార్య  అనే కోణంలో మాత్రమే చూస్తూ ఆమెకంటూ ఎలాంటి వ్యక్తిగత జీవితం,  స్పేస్ లేకుండా చేస్తుంటారు కొందరు భర్తలు.  ఇలా తమను తాము కోల్పోయే భార్యలు అందరూ ట్రోఫీ వైప్ లు.                                 *రూపశ్రీ.
మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సలహాలను నేటికీ మనం మన పెద్దలు లేదా తెలిసిన వారి నుండి వినవచ్చు. భగవద్గీత యొక్క ఈ జ్ఞానం నేటి ఆధునిక యుగంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. మీరు ఈ బోధనలను తెలుసుకుని, వాటిని తెలివిగా అనుసరించి, వాటిని మీ జీవితంలో చేర్చుకుంటే, మీ పురోగతిని ఎవరూ ఆపలేరు. భగవద్గీతలో జీవిత సారాంశం ఉందని మన పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశాలు మీ జీవితంలో కూడా ఉపయోగపడతాయి. ఐతే భగవద్గీతలో మనిషి ప్రగతి సాధించాలంటే ఏం చేయాలి అని చెప్పారు..? మీ కోపాన్ని నియంత్రించుకోండి: కోపం గందరగోళాన్ని సృష్టిస్తుంది, గందరగోళం తెలివిని పాడు చేస్తుంది, బుద్ధి చెడిపోతే, తర్కం నాశనం అవుతుంది, తర్కం నాశనం అయినప్పుడు, వ్యక్తి నాశనం అవుతాడు. అందువల్ల అతను తన అన్ని పనులలో వైఫల్యాన్ని ఎదుర్కొంటాడు. అదే వీక్షణ: జ్ఞానాన్ని,  చర్యను ఒకటిగా చూసే వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి. ఎవరైతే జ్ఞాని అయినా లేదా అతను జ్ఞానవంతుడు అయినా, అతని అభిప్రాయం కూడా సరైనదే. ఏ సమస్యను ఏ కోణంలో చూడాలో ఆయనకు అవగాహన ఉంది. మానసిక నియంత్రణ: మన మనస్సు ఎప్పుడూ మన అదుపులో ఉండాలి. మన మనస్సును అదుపులో ఉంచుకున్నప్పుడే అన్ని కార్యాలలో విజయం సాధించగలుగుతాము. మనసును అదుపులో పెట్టుకోని వారికి మనస్సే శత్రువులా ప్రవర్తిస్తుంది. స్వపరీక్ష: పురోగతి సాధించడానికి స్వీయ మూల్యాంకనం చాలా ముఖ్యం. మనం చేస్తున్న పని, ఎంచుకున్న మార్గం, తీసుకున్న నిర్ణయం అన్నీ సరైనవేనా.? లేక తప్పా? దాని గురించి ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆత్మజ్ఞానం అనే ఖడ్గంతో మన హృదయాల్లోని అజ్ఞానపు సందేహాలను తొలగించి, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఎంచుకుంటే, మీరు తప్పకుండా అందులో పురోగతి సాధిస్తారు. ప్రతి చర్యకు ప్రతిఫలం ఉంటుంది: ఈ జీవితంలో మనం ఏమీ కోల్పోలేదు లేదా వృధా చేయలేదు. మీరు ఏమి చేసినా, దాని నుండి మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఇది మీ జీవితాన్ని మార్చడానికి మీకు సహాయం చేస్తుంది. సాధన తప్పనిసరి: మనస్సు చంచలంగా ఉంటే లేదా మీ మనస్సును నియంత్రించడం మీకు కష్టంగా అనిపిస్తే, మీరు మంచి అలవాట్ల ద్వారా దానిని నియంత్రించవచ్చు. మీ మనస్సు నియంత్రణలో ఉన్నప్పుడే మీ చర్యలు, మీ భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఆలోచించండి: మనిషి తాను సాధించాలనుకున్నది ఆత్మవిశ్వాసంతో ఆలోచిస్తే ఏదైనా సాధించగలడు. ఏ పని చేసినా అందులో నమ్మకం ఉంటేనే చేయాలి. ఇలా చేయండి: క్రియలో నిష్క్రియతను,  నిష్క్రియంలో చర్యను చూసేవాడు తెలివైనవాడు. ఈ వ్యక్తులు తాము చేసే పనిలో ఆనందాన్ని పొందినప్పుడు మాత్రమే సంతృప్తిని అనుభవిస్తారు.
ఇంట్రోవర్ట్.. ఎవ్వరితోనూ ఎక్కువ కలవరు. ఎవరైనా పలకరించినా, మాట్లాడినా ఎప్పుడెప్పుడు అక్కడి నుండి పారిపోదామా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు.  ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఈ కారణంగానే ఇంట్రోవర్ట్ అనే మాట బయటకు తెలిస్తే అదేదో వాళ్లకు ఏదో జబ్బు ఉందన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటుంది సమాజం. అయితే ఇంట్రోవర్ట్ లను తేలిగ్గా తీసిపడేయకూడదని, ఇంట్రోవర్ట్ లు గా ఉండి ప్రపంచాన్ని తమ ప్రతిభ ద్వారా, విజయాల ద్వారా ఆకర్షించిన వారి గురించి తెలిస్తే వాళ్లను తక్కువ అంచనా అస్సలు వేయకూడదని అనిపిస్తుంది. ఇంట్రోవర్ట్ ల గురించి.. మనిషన్నాక సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరూ మాట్లాడటం అస్సలు అవసరం లేదు. కొంతమంది మౌనంగా ఉండి తమ ఎనర్జీ లెవెల్‌ని మెయింటైన్ చేసి దానిని తమ శక్తిగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఏదో మాటవరుసకు చెబుతున్నది కాదు. సాక్షాత్తూ మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ పరిశోధన ఇలా చెబుతోంది. గ్లోబల్ శాంపిల్‌పై అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 56.8% మంది వ్యక్తులు అంతర్ముఖులుగా ఉన్నారు.  అంటే తమతో తాము ఉండటానికి  లేదా మౌనంగా ఉండటానికి వీరు ఇష్టపడతారు. బహిర్ముఖ వ్యక్తుల కంటే  అంతర్ముఖులే ఎక్కువ విజయాలు సాధిస్తారని, ప్రపంచ రూపురేఖలను మార్చిన ఎంతో మంది ప్రసిద్ద వ్యక్తులు అంతర్ముఖులే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాట్లాడటం.. సమయానికి మాట్లాడటం.. కొందరు వ్యక్తులు అంతర్ముఖులతో వ్యవహరించడం కొంచెం కష్టమని అంటుంటారు. ఎందుకంటే అంతర్ముఖులు తమ భావాలను ఎవరికీ చెప్పరు. కానీ తక్కువ మాట్లాడటం అంటే ఏదో దాచడం అని కాదు. పరిశోధన ప్రకారం అంతర్ముఖులు ఆలోచనాత్మకంగా మాట్లాడతారు. వారి  మాటలు చాలా విస్తృతంగా సరైన కారణాలతో కూడుకుని ఉంటాయి. వీరు ఎవరికీ త్వరగా స్పందించరు. ఎమోషనల్ అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది.  అందుకే  ఇతర వ్యక్తుల కంటే వీళ్లు   సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వీరు వారికి నచ్చింది మాత్రమే మాట్లాడుతారు. ఒంటరితనమే బలం.. మానసిక  రోగుల వైద్యుల అభిప్రాయం ప్రకారం అంతర్ముఖ వ్యక్తులు బహిర్ముఖుల కంటే బలంగా , శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే వారు ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా, తెలివిగా ఆలోచిస్తారు. దానికి తగినట్టే నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రశాంత స్వభావం కారణంగా ఇంట్రోవర్ట్ లు  ఎప్పుడూ కోపం తెచ్చుకోరు. లేదా దూషించే మాటలు మాట్లాడరు.  సాధారణంగా వీరు ఇతరులకు చాలా పొగరు వ్యక్తులుగా అనిపిస్తారు. కానీ వీరు అర్థమయ్యే కొద్దీ.. వీరి మీద గౌరవం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా.. అంతర్ముఖులు తమ భావోద్వేగాలను బయటకు  వ్యక్తం చేయకపోవచ్చు. కానీ వారు మానసికంగా బలంగా ఉంటారు. వీరు సులభంగా ఎవరికీ  భయపడరు. తక్కువ మాట్లాడటం వల్ల  వీరిని చాలామంది పిరికివాళ్లు అని అంటూ ఉంటారు. కానీ అంతర్ముఖుల శక్తి అసాధ్యం. వారు మానసికంగా దృఢంగా ఉంటారు. జ్ఞాపకశక్తి ఎక్కువ.. 2007లో రష్యాలో అంతర్ముఖులపై నిర్వహించిన పరిశోధనలో   వీరు ఏవైనా సంఘటనలు, విషయాలను చాలా కాలంపాటూ గుర్తుంచుకుంటారని తెలిసింది. ఎందుకంటే ఇంట్రోవర్ట్ వ్యక్తులకు ఫ్రంటల్ లోబ్‌లో ఎక్కువ రక్త ప్రసరణ ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ అనేది మెదడులోని జ్ఞాపకాలను నిల్వ చేసే భాగం. ఇది సమస్యలకు పరిష్కాలు ఆలోచించడం, సరైన ప్రణాళికలు రచించడం వంటి విషయాలలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అంతర్ముఖులు బాగా ప్రణాళిక వేయడంలో ,సమస్యలను పరిష్కరించడంలో కూడా తెలివిగా ఉంటారు.  లాజిక్‌పై దృష్టి పెట్టడంతో పాటు, వీరు  సృజనాత్మకంగా , శక్తివంతంగా ఉంటారు.                                          *నిశ్శబ్ద.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అన్ని అవయవాలు పర్పెక్ట్ గా  పనిచేయాలి. ఇలా అన్ని అవయవాలు సరిగా పని చేయాలంటే దీనికి తగినంత స్వచ్ఛమైన రక్తం సరఫరా అవసరం. మన శరీరమంతా ఆక్సిజన్, హార్మోన్లు,  అవసరమైన పోషకాలను రవాణా చేయడానికి రక్తం చాలా అవసరం, కానీ  రక్తం స్వచ్ఛంగా,  శుభ్రంగా లేకపోతే ఈ ప్రక్రియ కష్టంగా జరుగుతుంది. అసలు రక్తం ఎలా మలినం అవుతుంది? రక్తం శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? రక్తాన్ని శుభ్రం చేసే ఆహారాలు  ఏమిటి? తెలుసుకుంటే.. రక్తం ఎలా కలుషితం అవుతుంది? సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల  కాలక్రమేణా రక్తంలో అనేక విష పదార్థాలు పేరుకుపోతాయి. ఇది శరీరంలోని అనేక అవయవాలలో విషప్రక్రియకు దారితీస్తుంది. సాధారణంగా, మూత్రపిండాలు,  కాలేయం వంటి జీర్ణవ్యవస్థ అవయవాలు సహజంగానే రక్తాన్ని నిరంతరం ఫిల్టర్ చేస్తాయి. అయితే రక్తం ఎక్కువ కలుషితం కావడం   ఈ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అందువల్ల సరైన ఆహారాన్ని తీసుకోవడం,  రక్తంలో విష పదార్థాలు తొలగించి రక్తాన్ని శుభ్రం  చేసే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. రక్తం కలుషితం అయితే ఎదురయ్యే సమస్యలు.. ఆహారంలో మలినాలు ఎక్కువ ఉంటే..  రక్తంలో మలినాలు కూడా  పెరుగుతాయి. ఇది మన చర్మంతో సహా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. రక్తంలో మలినాలు ఉంటే కాలేయం సరిగా పనిచేయదు. ఇది జీర్ణ సమస్యలను పెంచుతుంది.  చర్మ ఇన్ఫెక్షన్లు, పదే పదే ఒకదాని తరువాత ఒకటి  మొటిమలు వస్తూ ఉండటం, దద్దుర్లు,  చికాకు, తరచుగా అలసట,  ముఖంపై మెరుపు లేకపోవడం మొదలైనవి రక్తం శుభ్రంగా లేదనే సంకేతాన్ని ఇస్తాయి. రక్తాన్ని శుభ్రం చేసే ఆహారాలు.. గోరువెచ్చని నీరు, నిమ్మరసం.. నిమ్మరసం  రక్తాన్ని, జీర్ణవ్యవస్థను రెండింటినీ శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది సహజంగా ఆమ్లంగా ఉంటుంది. ఇది pH స్థాయిలను తగ్గించడానికి,  రక్తం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. శరీరం నుండి మలినాలను తొలగించుకోవడానికి ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో  తాజా నిమ్మరసం కలిపి  త్రాగాలి. ఇది  రక్తాన్ని శుభ్రంగా ఉంచడానికి  చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నీరు.. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో టాక్సిన్లు  తొలగడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలోని మలినాలను తగ్గిస్తుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల కాలేయం,  మూత్రపిండాల పనితీరు కూడా సరిగ్గా ఉంటుంది. ఈ అవయవాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి,  మలినాలను తొలగించడానికి  సహాయపడతాయి. నేషనల్ కిడ్నీ అసోసియేషన్ ప్రకారం రోజుకు సుమారు 6 కప్పుల మూత్రం ఉత్పత్తి అయ్యేంత నీరు త్రాగాలి. పసుపు.. పసుపు  రక్తాన్ని శుద్ధి చేయడానికి,  వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. పసుపులో కనిపించే కర్కుమిన్ అనే సమ్మేళనం వాపు,  ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం పసుపు పాలు  తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.   శరీరం నుండి విషాన్ని తగ్గిస్తుంది.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
 ఇళ్ళు,  ఆఫీసులు మంచి వాసన రావడానికి  తరచుగా రూమ్ ఫ్రెషనర్లు, పెర్ఫ్యూమ్‌లు, సువాసనగల ధూపం లేదా సువాసనగల కొవ్వొత్తులను ఉపయోగిస్తుంటారు. ఇది ఒక సాధారణ అలవాటులా అనిపిస్తుంది. కానీ ఈ "సువాసన" నెమ్మదిగా  ఆరోగ్యానికి "సైలెంట్ కిల్లర్"గా మారుతుందని తెలుసా.. చాలామంది ఇలాంటి సువాసన వల్ల ఇల్లు వాతావరణం బాగుంటుందని,  ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటారు.  కానీ ఈ రూమ్ ఫ్రెషనర్ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. రూమ్ ఫ్రెషనర్ల తయారీలో ఉపయోగించే రసాయనాలు.. రూమ్ ఫ్రెషనర్లు, పెర్ఫ్యూమ్‌లు, సౌందర్య సాధనాలు, శుభ్రపరిచే ఉత్పత్తులు,  సువాసనగల కొవ్వొత్తులు వంటి ఉత్పత్తులలో ఆరోగ్యానికి హానికరమైన వేలాది రసాయనాలు ఉంటాయి. వీటిలో ప్రధానంగా ద్రావకాలు, స్టెబిలైజర్లు, UV-అబ్జార్బర్‌లు, ప్రిజర్వేటివ్‌లు,  రంగులు ఉంటాయి. ఇవి ఇండోర్ వాయు కాలుష్యానికి కారణం అవుతాయి. ఈ రసాయనాలు ఎక్కువ కాలం పీల్చడం వల్ల అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్,  న్యూరోటాక్సిసిటీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రూమ్ ఫ్రెషనర్లు ఎక్కువకాలం వాడితే కలిగే సమస్యలు.. రూమ్ ఫ్రెషనర్లలో ఉండే రసాయనాలు కళ్ళు, గొంతు,  ఊపిరితిత్తులను కప్పే సున్నితమైన పొరలను చికాకుపరుస్తాయి. ఇది చికాకు, దగ్గు,  శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఎటువంటి కారణం లేకుండా తరచుగా మైగ్రేన్లు లేదా తలనొప్పుల సమస్య ఉంటే అది రూమ్ ఫ్రెషనర్ల వల్ల ఏర్పడే సమస్య కావచ్చని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా, ప్లగ్-ఇన్ ఎయిర్ ఫ్రెషనర్లు, ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్లు,  లాండ్రీ క్రిస్టల్స్, పెర్ఫ్యూమ్‌లు, కొలోన్‌లు వంటి ఉత్పత్తులు మెదడులో సున్నితమైన నరాల ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి. తలనొప్పిని పెంచుతాయి. చాలా మందికి  రూమ్ ఫ్రెషనర్లు అంటే అలెర్జీ ఉంటుంది. రసాయనాల వాసన రియాక్షన్ కు తొందరగా గురయ్యేవారిలో  దగ్గు, తుమ్ము, కళ్ళు దురద,  వాయుమార్గాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి దీర్ఘకాలం కొనసాగితే ఉబ్బసం,  శ్వాసకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. థాలేట్లు,  కొన్ని సింథటిక్ రసాయనాలు శరీరం  హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. ఇది సంతానోత్పత్తి,  జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలికంగా వీటికి గురికావడం వల్ల లైంగిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.  పురుషులు,  స్త్రీలలో సంతానోత్పత్తి ప్రమాదాలు పెరుగుతాయి. ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో ఈ రూమ్ ఫ్రెషనర్లు ఊపిరితిత్తులను చికాకుపరుస్తాయి. దగ్గు, గురక లేదా శ్వాస ఆడకపోవడానికి కారణమవుతాయి. తక్కువ స్థాయిలో ఎక్స్‌పోజర్ కూడా పిల్లలు,  పెద్దలలో ఆస్తమా ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు అంటున్నారు. రూమ్ ఫ్రెషనర్  పదార్థాలలో ఉండే ఫార్మాల్డిహైడ్,  కొన్ని అస్థిర సేంద్రియ సమ్మేళనాలు క్యాన్సర్ కలిగించే ప్రధాన సమ్మేళనాలుగా గుర్తించబడ్డాయి. ఈ సమ్మేళనాలను ఎక్కువ కాలం పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, కాలేయం,  చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ ఉత్పత్తులను ఎక్కువ కాలం పీల్చడం  వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, కాలేయ పనితీరు దెబ్బతినడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రసాయనాలు శరీరంలోని హార్మోన్లు,  జీవక్రియ వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తాయి.                                     *రూపశ్రీ.
  చల్లని,  పొడి వాతావరణంలో గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. ఇది చర్మం పై పొర నుండి తేమను త్వరగా తొలగిస్తుంది. దీని వల్ల చర్మం  పొడిగా  గరుకుగా మారుతుంది. దీని కారణంగా పగుళ్లు ఏర్పడతాయి. చలి నుండి ఉపశమనం కోసం చాలా మంది  హీటర్ వాడతారు. మరికొంత మంది  వేడి నీటి స్నానం ద్వారా ఉపశమనం పొందాలని అనుకుంటారు.  కానీ వీటి వల్ల  పొడిదనం మరింత ఎక్కువ అవుతుంది. అసలు చలికాలంలో చర్మం ఎందుకు పొడిగా మారుతుంది. చర్మం పొడిగా మారి పగుళ్లు రాకూడదంటే ఏం చేయాలి? ఏం తినాలి? తెలుసుకుంటే.. చర్మం ఎందుకు పొడిగా మారుతుందంటే.. శీతాకాలంలో గాలిలో తేమ తగ్గి చర్మం త్వరగా ఎండిపోతుంది. బయట చల్లని గాలి నుండి చర్మానికి ఉపశమనం కలిగించుకోవడం కోసం వేడికి దగ్గరగా ఉండాలని అనుకుంటారు.  ఇది చర్మంలోని తేమను తొలగిస్తాయి. ఈ సమయంలో చర్మం సహజ నూనెలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా తగ్గి, చర్మం  రక్షణ పొరను బలహీనపరుస్తుంది. వేడి నీటిలో స్నానం చేస్తే లేదా తగినంత నీరు త్రాగకపోతే పొడిబారడం మరింత పెరుగుతుంది.   బయటి వాతావరణానికి ప్రభావితమయ్యే శరీర భాగాలైన మఖం,  చేతులు, కాళ్లలో ఈ పొడిబారే సమస్య ఎక్కువగా ఉంటుంది. చర్మం పొడిబారి పగుళ్లు రాకుండా చేసే ఆహారాలు.. ఆహారం చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చేపలు, అవిసె గింజలు,  వాల్‌నట్‌లు వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చర్మంలోని నూనె సమతుల్యతను కాపాడుతాయి. బాదం, వేరుశెనగలు,  పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి విటమిన్ E సమృద్దిగా ఉన్న ఆహారాలు   చర్మాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తాయి. క్యారెట్,  పాలకూర వంటి విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు చర్మ కణాలను మరమ్మతు చేయడంలో సహాయపడతాయి. తగినంత నీరు త్రాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉండటంలో సహాయపడుతుంది.  అసమతుల్యమైన లేదా ప్రాసెస్ చేసిన ఆహారం చర్మ సహజ కాంతిని తగ్గిస్తుంది.  పొడిబారడాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే చర్మానికి మేలు చేసే ఆహారాలు తీసుకోవాలి.                                *రూపశ్రీ.