LATEST NEWS
ఇబ్రహీం పట్నం మండలం రాయపోలులో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడైన పరమేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. కులాంతర వివాహం, ఆస్తి తగాదా కారణంగా నాగమణిని ఆమె తమ్ముడు పరమేష్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు సహకరించిన శివ కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నాగమణి తన భర్తకు విడాకులిచ్చి శ్రీకాంత్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత తన ఆస్తి వాటా అడగడంతో పరమేష్ అక్కమీద కక్ష్య పెంచుకున్నాడు. డ్యూటీ  కోసం స్కూటీపై వెళ్లిన నాగమణిని తన కారుతో ఢీ కొట్టడంతో నాగమణి పడిపోయింది.  కారులోంచి వేట కొడవలి తీసి పరమేష్  విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. 
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని ఉక్కుపాదంతో అణచివేయాలని యోచిస్తున్నారు.   దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ మార్షల్ లా తీసుకురావాలని అధ్యక్షుడు తెలిపారు.  రాజ్యాంగ పరిరక్షణలో భాగంగానే ఈ లా ను పరిచయం చేసినట్టు యూన్ సుక్  యోల్ తెలిపారు. యూన్ సుక్ యోల్ 2022లో దక్షిణ కొరియా అద్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  ప్రతిపక్షాల నియంత్రణలో ఉన్న పార్లమెంటుకు వ్యతిరేకంగా తన అజెండాను ముందుకు తీసుకెళుతున్నారు. ఎమర్జెన్సీ మార్షల్ లా  ప్రభావం ఎంత మేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే. 
ఆగ్రాలోని తాజ్ మహల్ పేల్చేస్తామని ఉత్తర ప్రదేశ్ పర్యాటశాఖకు మంగళవారం ఈ మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాండ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తాజ్ మహల్ పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ బాంబుకు సంబంధించి ఎలాంటి క్లూ లభించకపోవడంతో ఫేక్ అని తేల్చేశారు. ఉత్తుత్తి మెయిల్ చేసింది ఎవరో పోలీసులు ఆరా తీస్తున్నారు. 
భక్తి దేవుడిపై కాదు.. ప్రసాదం మీద అన్నట్లుగా ఆర్. కృష్ణయ్య తీరు ఉంటుంది. బీసీలకు తానే నాయకుడినని చెప్పుకుంటూ  ఆ పేరుతో అధికారంలో ఉన్న పార్టీల పంచన చేరి బడా పదవులు కట్టేస్తుంటారు. స్వల్ప వ్యవధిలోనే దాదాపు అన్ని పార్టీలనూ చుట్టేశారు.  ఏ పార్టీలోకి వెళ్లినా బ‌డా ప‌ద‌వులు ద‌క్కించుకోవ‌టం ఆయ‌నకు వెన్న‌తో పెట్టిన విద్య. పార్టీల అధిష్టానాలు సైతం ఆయ‌నకు ప‌ద‌వి ఇస్తే బీసీల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లేన‌ని భావిస్తాయి. కానీ, ఆయ‌న ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మెజార్టీ బీసీలు దూర‌మైన‌ట్లే. ఈ విష‌యం అనేక‌ సార్లు రుజువైంది. కానీ, ఆయ‌న మాత్రం బీసీలంతా తన వెంటే.. తన వైపే అంటూ ఇప్ప‌టికీ రాజకీయ పార్టీలను నమ్మించి పెద్ద పెద్ద పదవులను తన ఖాతాలో వేయించేసుకుంటారు.  తాజాగా మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు ఆయ‌న‌ సిద్ధ‌మ‌వుతున్నారు.. ఈ సారి మ‌రో కొత్త‌ పార్టీ నుంచి. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌ర‌ని తెగ ఆలోచిస్తున్నారా.. అంత అవ‌స‌రం లేదు.. తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న పేరు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మే. ఆయ‌నే రాజ్య‌స‌భ స‌భ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ . కృష్ణ‌య్య. మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగిన కృష్ణ‌య్య‌.  ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ప్ర‌స్తుతం బీజేపీ కండువా క‌ప్పుకొని ఆ పార్టీ నుంచి మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు రెడీ అయిపోయారు. అయితే బీసీ నాయ‌కుడి హోదాలో ఆర్‌. కృష్ణ‌య్య బ‌డా ప‌దవులు ద‌క్కించుకుంటున్న‌ప్ప‌టికీ.. బీసీ వ‌ర్గాల‌కు, ఆయ‌న‌కు ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించిన పార్టీల‌కు ఇసుమంతైనా మేలు చేకూర్చ‌లేక పోతున్నారు సరికదా, పదవులిచ్చిన పార్టీలకు ఆయన వల్ల తేరుకోలేని నష్టం వాటిల్లుతోంది. ఆర్.కృష్ణయ్యకు పెద్ద పీట వేసిన వెంటనే ఆయా పార్టీలకు బీసీలు దూరం అవుతున్నారు. పాలిటిక్స్ లో ఇదో సెంటిమెంటుగా ధృవపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆర్.కృష్ణయ్య ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి  మెజార్టీ బీసీలు హ్యాడిచ్చేస్తారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం (డిసెంబర్ 3(నోటిఫికేషన్‌ విడుదలైంది. 10వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది. వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీల రాజీనామాలతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాజీనామా చేసిన ముగ్గురు ఎంపీల్లో మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావు తెలుగుదేశంలో చేరారు.  ఆర్‌.కృష్ణయ్య మాత్రం తాను ఏ పార్టీలోనూ చేరను, సొంత పార్టీ పెడతా అంటూ బీరాలు పలికినా.. బీజేపీ పెద్దలతో మాత్రం టచ్‌లో ఉన్నారు.  ఆర్.కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడిగా ఉండగానే రాజీనామా చేశారు. అదీ ఎన్నికలలో తాను ఏ పార్టీ తరఫునైతే ప్రాతినిథ్యం వహిస్తున్నారో ఆ వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తరువాత రాజీనామా చేశారు. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బీజేపీ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన బీసీ నేత‌గా పేరున్న ఆర్‌. కృష్ణ‌య్య బీజేపీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఎందుకంటే ఆ పార్టీ నుంచి మ‌రోసారి ఆయ‌న‌ రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు రూట్ క్లియర్ అయ్యింది కాబట్టి. ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్లే వారిలో ఇద్ద‌రు తెలుగుదేశం నుంచి నుంచి కాగా.. మ‌రొక‌రు కూటమి కోటాలో బీజేపీ నుంచి వెళ్ల‌నున్నారు. బీజేపీ నుంచి వెళ్లే రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఆర్‌. కృష్ణ‌య్య పేరు   ఖాయ‌మైందని తెలుస్తోంది. ఆర్ కృష్ణ‌య్య‌కు పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు పంపించ‌డం ద్వారా తెలంగాణ‌లోని బీసీలంతా బీజేపీవైపు వ‌స్తార‌ని కమలనాథుల అంచ‌నా వేస్తున్నారు. అయితే, గ‌తంలో ఆర్ కృష్ణ‌య్య‌కు పెద్ద‌పీట వేసిన పార్టీలు కూడా ఇలానే ఆలోచించి చేతులు కాల్చుకున్నాయి.  ప్ర‌స్తుతం బీజేపీ ఆ జాబితాలో చేరేందుకు సిద్ధ‌మైంది. 2014 లో రాష్ట్ర విభ‌జ‌నకు ముందు వ‌ర‌కూ ఆర్‌.కృష్ణ‌య్య బీసీ సంఘం నేత‌గా కొన‌సాగారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత అనూహ్యంగా తెలంగాణ తెలుగుదేశంలో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో ఎల్బీన‌గ‌ర్ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు.  2018లో తెలంగాణ‌లో జరిగిన ముందస్తు ఎన్నికల స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కృష్ణయ్య  కాంగ్రెస్ గూటికి చేరారు.  ఆ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా మిర్యాలగూడ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ త‌రువాత కొద్ది కాలానికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2 019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న జ‌గ‌న్ తో స‌న్నిహిత సంబంధాలు ఏర్ప‌ర్చుకున్నారు. వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. వైసీపీ అధికారానికి దూరం కాగానే ఆ పార్టీకి, ప‌ద‌వికి ఆర్‌. కృష్ణ‌య్య రాజీనామా చేశారు.  ప్ర‌స్తుతం బీజేపీలో చేరి మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక్క‌డ విశేషం ఏమిటంటే.. ఆర్. కృష్ణ‌య్య ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాద‌న్న వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తుంటుంది. దీనికి కార‌ణం లేక‌పోయ‌లేదు. ఆయా పార్టీలు ఆర్‌. కృష్ణ‌య్య మ‌న‌ పార్టీలో ఉంటే బీసీలంతా మ‌న‌వైపు ఉంటార‌న్న భ్ర‌మ‌ల్లో ఉంటారు. కానీ, ఫ‌లితం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటూ వస్తోంది.  ఊసరవిల్లి రంగులు మార్చడం కంటే వేగంగా  కృష్ణయ్య పార్టీలు మార్చేస్తుండటం కూడా సహజంగానే బీసీలలో ఆయన పట్ల విశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నది. అందుకే ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీకీ బీసీలు దూరం అవుతున్నారన్న వాదన కూడా ఉంది.  ఆ వాదన ప్రకారం వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పాగావేయాల‌ని భావిస్తున్న‌ బీజేపీకి.. ఆర్ కృష్ణ‌య్య చేరిక ఎదురుదెబ్బే అవుతుంద‌న్న భావన రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఆర్. కృష్ణ‌య్య బీజేపీలో చేర‌డాన్ని ఆ పార్టీలోని ప‌లువురు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఒక‌వేళ‌ పార్టీ కండువా క‌ప్పినా కీల‌క ప‌ద‌వులు అప్ప‌గించొద్ద‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు ఇప్ప‌టికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. అయితే, బీజేపీ అధిష్టానం మాత్రం ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ఇచ్చి గౌర‌వించేందుకు సిద్ధ‌మైపోయింది. అయితే, ఆర్‌. కృష్ణ‌య్య ఈసారైనా రాజ్య‌స‌భ హోదాలో బీసీ వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంతోపాటు.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చేలా ఏమేర‌కు కృషి చేస్తారో వేచి చూడాల్సిందే.
పుష్ప 2 సినిమా టికెట్ ధర పెంపుపై  తెలంగాణ హైకోర్టులో విచారణ  జరిగింది. అల్లు అర్జున్ హీరోగా , సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 టికెట్ ధరల పెంపుపై వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన రిలీజ్ కు తెలంగాణ హైకోర్టులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం జరిగిన విచారణలో పుష్ప 2 సినిమాకు  హైకోర్టు పచ్చజెండా ఊపింది. టికెట్ల ధరల పెంపుపై ఓ న్యాయవాది వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. టికెట్ల ధరల పెంపు వల్ల వారం రోజుల్లో ఆదాయం సమకూర్చుకోవాలని నిర్మాత ప్రయత్నిస్తున్నట్టు పిటిష్ నర్ పేర్కొన్నారు.   టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షో ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడ మళ్లిస్తున్నారని  హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించిన నివేదికను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 
ALSO ON TELUGUONE N E W S
Niddhi Agerwal is acting besides both Pawan Kalyan and Prabhas in her next projects. She did an Ask session on X and gave some interesting answers for fans queries. She is part of Hari Hara Veera Mallu and The Raja Saab, so major of the questions about them.  She stated that she is grateful to God, for giving her opportunity to work in big projects at the same time. She wrote, "I am grateful to be working on these two projects at the same time. God has been kind to me.. when i have support from fans like you nothing is difficult." Later, Niddhi revealed that she had maximum fun on The Raja Saab sets and also called it a proper Horror Comedy, with every scene having all the elements. She hoped or the people to get to see a BTS video from The Raja Saab sets.  Talking about Prabhas, she wrote, "I am having the best experience working with Prabhas sir.. now I know why he is everybody’s DARLING.. he has a golden heart and is a box office KING.. what a combination."  How can she leave behind Pawan Kalyan. She wrote, "One word is not enough for Pawan Kalyan garu, so I will try my best to keep it to a few ... magnanimous, kind, Aandhi, Legend, Brave, Powerful eyes, brave spirit… many more."  Looks like the actress is having a blast working with two big stars. Also, she is completely in awe of both the films and expecting them to create great magic at the box office. We too! 
Nandamuri Balakrishna has been keen on releasing at least one film for every Sankranti Season. He is coming up with Daaku Maharaaj in the direction of Bobby, for 2025 Sankranti season. The movie has been long in production, even though it did not get delayed, this is the longest in recent times, NBK shot for a film.  Director Bobby has made sure that the teaser will increase curiosity about the film for everyone. He introduced NBK's young getup in the teaser which looked close to his Nippu Ravva look. Hence, fans are eager to watch him on the big screen in his full glory.  A good news for them is that the makers have wrapped complete shoot. Bobby himself updated this on his social media, X handle. Pragya Jaiswal, Chandini Chowdary, Shraddha Srinath are playing other prominent roles with Bobby Deol playing the antagonist. Movie produced by Sithara Entertainments will release on 12th Jan, worldwide.
Pushpa 2 The Rule makers have rushed to complete the film for 5th December release while the shooting did not complete till November last week. They completed and locked first half in October but they had to complete second half while shooting simultaneously.  During the time, Devi Sri Prasad could not allocate dates as many as Sukumar needed for the second half to compose Background score. So, the makers have brought in S Thaman and even Sam CS to compose background score. Thaman has been in the news for openly stating that he is part of the project.  But DSP publicly showcased his anger towards Mythri Movie Makers on stage at Chennai and then, he continued to compose for second half while Sam CS also did his part. Actually, the makers wanted to see if someone else can compose even better BGM than DSP in the meantime. They cut few sequences and then gave to other composers.  Apparently, while finalising the edit, Sukumar did not like some portions with Thaman's music but did use Sam CS music, it seems. The composer has thanked the makers for making him part of the film while Thaman is silent. Sukumar acknowledged DSP's BGM for the climax of Pushpa 2 and this rises questions if Thaman's music at least used anywhere.  As the movie is going to release with premiere shows on 4th December, the answer will be known to everyone in just 30 hours more. Allu Arjun is playing the coveted Pushpa character again in the second one and he will reprise in third one, Pushpa 3 The Rampage as well. 
మూవీ లవర్స్‌, బన్నీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ‘పుష్ప2 ది రూల్‌’ డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అంతకుముందు రోజు రాత్రి నుంచే ప్రీమియర్స్‌ కూడా వేస్తున్నారు. ఇప్పుడెక్కడ చూసినా పుష్ప2 గురించే చర్చ జరుగుతోంది. ఈసారి పుష్పరాజ్‌ ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేయబోతున్నాడు అనే దానిపై రకరకాల అంచనాలు వేస్తున్నారు. ‘పుష్ప2’ రిలీజ్‌ అవుతున్న ఈ తరుణంలో ‘పుష్ప3 ది ర్యాంపేజ్‌’కి సంబంధించిన అప్‌డేట్‌ బయటకు వచ్చింది. పుష్పకి మూడో పార్ట్‌ ఉంటుందని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. అది నిజమేనని చెప్పే ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది చిత్ర యూనిట్‌. ‘పుష్ప 2’ చిత్రానికి సౌండ్‌ ఇంజినీర్‌గా పనిచేసిన రసూల్‌ పూకుట్టితో కలిసి చిత్ర యూనిట్‌ దిగిన ఓ ఫోటోను షేర్‌ చేశారు. ఈ గ్రూప్‌ ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న స్క్రీన్‌పై ‘పుష్ప3 ది ర్యాంపేజ్‌’ అనే టైటిల్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోటోను షేర్‌ చేసిన కొద్ది సేపటికే డిలీట్‌ చేసారు. అయితే అప్పటికే అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.  ఓ పక్క ‘పుష్ప2’ గురించి మాట్లాడుకుంటూనే మరో పక్క ‘పుష్ప3’కి సంబంధించిన అప్‌డేట్‌ గురించి కూడా చర్చించుకుంటున్నారు. ‘పుష్ప2’ ఎండిరగ్‌లోనే ‘పుష్ప3’కి సంబంధించిన లీడ్‌ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. వాస్తవానికి పార్ట్‌ 3కి సంబంధించిన అప్‌డేట్‌ విజయ్‌ దేవరకొండ మూడేళ్ళ క్రితమే ఇచ్చేశాడు. సుకుమార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అతను చేసిన ట్వీట్‌లో ‘2021 ది రైజ్‌, 2022 ది రూల్‌, 2023 ది ర్యాంపేజ్‌’ అని పేర్కొన్నాడు. అయితే అతను చెప్పిన ఇయర్స్‌లో ఆ సినిమాలు రాకపోయినా పార్ట్‌ 3 ఉంటుందని మాత్రం స్పష్టమైంది. తాజాగా రసూల్‌ పూకుట్టి పోస్ట్‌తో అందరికీ పూర్తి క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు, ఇటీవల పుష్ప2కి సంబంధించిన ప్రెస్‌మీట్‌లో పుష్ప3 గురించి అడిగిన ప్రశ్నకు నిర్మాతల్లో ఒకరైన వై.రవిశంకర్‌ స్పందిస్తూ పుష్ప2ని సూపర్‌ డూపర్‌ హిట్‌ చేస్తే తప్పకుండా పార్ట్‌ 3 చేస్తామని తెలియజేశారు. అంతేకాదు, పార్ట్‌ 2లో పార్ట్‌3కి సంబంధించిన లీడ్‌ తప్పకుండా ఉంటుందన్నారు. ‘పుష్ప’ చిత్రాన్ని ఫ్రాంచైజీగా మార్చాలన్న ఆలోచన ఉందని, దీనికి సంబంధించి సుకుమార్‌ దగ్గర అద్భుతమైన ఐడియాలు ఉన్నాయని తెలిపారు. సోమవారం జరిగిన పుష్ప2 ఈవెంట్‌లో కూడా సుకుమార్‌ పార్ట్‌ 3పై క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్‌ మరో మూడేళ్ళు తనకు ఇస్తే పుష్ప3 తప్పకుండా చేస్తాను అన్నారు. 
Popular streaming platform Zee5 has been delivering promising content since its inception. The latest web series to join Zee5's illustrious list is Vikatakavi, which is streaming since November 28. It has captured audiences with its unique content and become an instant hit.  Produced by renowned producer Ram Talluri under the SRT Entertainments banner and directed by Pradeep Maddali, this detective series, set against the Telangana backdrop, is the first of its kind. The series achieved an impressive milestone of 100 million streaming minutes within hours of its release. The team held a press meet to celebrate their success. They cut a cake, marking a significant milestone for this groundbreaking series. It was also revealed that a sequel is already in the works, promising more entertainment for fans. At the event, director Pradeep said, “I extend my heartfelt thanks to the audience for embracing Vikatakavi. Reaching 100 million streaming minutes is a moment of immense pride. The support from the Zee5 team, writer Teja, and my entire crew made this possible. Everyone contributed immensely to ensure the series was completed without compromising quality." Executive Producer Sagar said, “Our writer, Teja, is the hero behind this series, having conceptualized this story over three years. Director Pradeep brought his vision to life brilliantly. This series showcases the production values that SRT is known for. Thanks to Zee5 for giving us this platform to prove ourselves.”   Producer Rajani Talluri said, “A heartfelt thanks to Zee5 for supporting this project after appreciating Teja’s story. Director Pradeep’s meticulous planning and execution were exceptional. Naresh Agastya’s grounded performance and Raghu Kunche’s impactful role added great value. Thanks to the entire team for their dedication.”   Lead actor Naresh Agasthya said, “My journey with Zee5 started in 2013, and I’m delighted to continue it with Vikatakavi. Working with SRT Entertainments has been an incredible experience. Achieving 100 million streaming minutes so quickly is a testament to the audience’s love for the series. Thank you all for your support!”   Music director Ajay Arasada said, “It’s thrilling to see Vikatakavi perform so well. Director Pradeep and writer Teja created something special, and Naresh Agastya’s portrayal of the title character was outstanding. Thanks to everyone involved in this project for their support.”   Writer Teja Desharaj said, “I take immense pride in being the first writer to create a detective series in Telangana. Vikatakavi has set new records and become the biggest hit on Zee5. Thanks to SRT Entertainments for their faith and to director Pradeep Maddali for delivering beyond expectations. We’re already planning a sequel to this success!”   Music director turned actor Raghu Kunche said, “Vikatakavi is a clean family entertainer. Kudos to writer Teja for the excellent story and to director Pradeep for bringing it to life. Shoaib garu's cinematography and Ajay Arasada garu's music elevated the series. Thanks to everyone involved and the audience for their love.”
ఛత్రపతి శివాజీ జీవిత కథతో ఇండియన్‌ స్క్రీన్‌పై ఇప్పటికి చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా కాంతార హీరో రిషబ్‌ శెట్టి ఆ క్యారెక్టర్‌కి జీవం పోసే పనిలో ఉన్నాడు. బాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ సింగ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘ది ప్రైడ్‌ ఆఫ్‌ భారత్‌.. ఛత్రపతి శివాజీ మహరాజ్‌’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 జనవరి 21న చాలా భాషల్లో విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ ప్రధాన పాత్రలో రాజా శివాజీ పేరు ఓ సినిమా తెరకెక్కుతోంది. అతని డైరెక్షన్‌లో సతీమణి జెనీలియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరో పక్క రిషబ్‌శెట్టి సినిమా కూడా ప్రారంభమైంది. ఛత్రపతి శివాజీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఈ రెండు సినిమాల్లో ఆవిష్కరించనున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. రిషబ్‌ శెట్టి.. ఛత్రపతి గెటప్‌లో అద్భుతంగా ఉన్నాడనే ప్రశంసలు వస్తున్నాయి.  ‘మన గౌరవం, భారతదేశపు గ్రేటెస్ట్‌ వారియర్‌ కింగ్‌ శివాజీ మహారాజ్‌ యొక్క ఎపిక్‌ సగాను సినిమా రూపంలో తీసుకొస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఎవరికీ తెలియని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కథని మేము చెప్పబోతున్నాం. ఇంతకముందెన్నడూ చూడని సినిమాటిక్‌ అనుభవాన్ని అందించబోతున్నాంలి అని మేకర్స్‌ పేర్కొన్నారు. ఒక సాధారణమైన సినిమాగా విడుదలైన కాంతార చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. రూ.400 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు రిషబ్‌. ప్రస్తుతం ‘కాంతార’ ప్రీక్వెల్‌గా ‘కాంతార - ఎ లెజెండ్‌: ఛాప్టర్‌ 1’ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ‘హనుమాన్‌’ సీక్వెల్‌ గా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ రూపొందిస్తున్న ‘జై హనుమాన్‌’ మూవీలో రిషబ్‌ నటిస్తున్నారు.
గత కొంత కాలంగా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కి, మెగా ఫ్యాన్స్‌కి మధ్య వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప2 రిలీజ్‌కి ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయోనని బన్నీ ఫ్యాన్స్‌ అందోళన చెందారు. అయితే టికెట్‌ రేట్ల పెంపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రబుత్వం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అనుమతులు మంజూరు చేసింది. దీనిపై అల్లు అర్జున్‌ స్పందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి బన్నీ ఫ్యాన్స్‌కి, మెగా ఫ్యాన్స్‌కి మధ్య చిచ్చు పెట్టేందుకు రామ్‌గోపాల్‌వర్మ నడుం కట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే మరోసారి మెగా ఫ్యాన్స్‌ని తన ట్వీట్‌తో కెలికాడు. అది ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.  రామ్‌గోపాల్‌వర్మ చేసిన ట్వీట్‌లో ఏముందంటే.. ‘పుష్ప2కి మెగా క్రేజ్‌ వచ్చింది. కొత్త మెగాస్టార్‌గా అల్లు అర్జున్‌ రాబోతున్నాడు అనడానికి ఇదే నిదర్శనం. హే.. అల్లు అర్జున్‌.. నువ్వు బాహుబలి కాదు.. కానీ, స్టార్స్‌ అంతా మెగాబలి’ అంటూ చేసిన పోస్ట్‌ మరో కొత్త వివాదానికి దారితీసేలా ఉంది. బన్నీ ఫాన్స్‌, మెగా ఫ్యాన్స్‌ మధ్య ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న వార్‌ కాస్త తగ్గింది అనుకుంటున్న తరుణంలో ఆర్జీవీ చేసిన ట్వీట్‌ మెగా ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది. సోమవారం జరిగిన పుష్ప2 ఈవెంట్‌లో మెగా ఫ్యామిలీ ప్రస్తావన రాలేదు. అంతేకాదు, అల్లు అర్జున్‌ కూడా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు. ఈ సమయంలో ఆర్జీవీ తన ట్వీట్‌తో కొత్త వివాదానికి తెరతీశారు. ఆ ట్వీట్‌లో విశేషం ఏమిటంటే.. దాని కిందే తన కాంపౌండ్‌ నుంచి వస్తున్న ‘శారీ’ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశాడు వర్మ. జనవరి 30న ఈ సినిమా విడుదల కాబోతోందనేది ఆ పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్(rajinikanth)నుంచి గత సంవత్సరం ఆగస్టులోప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జైలర్(jailer).రజనీని వరుస పరాజయాల నుంచి బయటపడేసిన ఈ మూవీ,రజనీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు ఆరువందల యాభై కోట్ల రూపాయిలని వసూలు చేసింది.దీన్ని బట్టి జైలర్ హిట్  రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.నెల్సన్ దిలీప్ కుమార్(nelson dilipkumar)ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఎవీఎం సంస్థ అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది.     జైలర్ కి సీక్వెల్ గా జైలర్ పార్ట్  2(jailer 2)కూడా ఉందన్న విషయం తెలిసిందే. జైలర్ రిలీజ్ టైంలోనే మేకర్స్ ఈ విషయాన్నీ అధికారకంగా వెల్లడి కూడా చేసారు.నెల్సన్ ఇప్పటికే జైలర్ 2 స్క్రిప్టును కూడా  రెడీ చేశాడు.స్వయంగా నెల్సన్ నే ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాడు.కాకపోతే కొన్ని రోజులుగా   జైలర్ 2 గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.కానీ ఇప్పుడు డిసెంబర్ 5న జైలర్ 2 నుంచి సాలిడ్ ట్రీట్ రానున్నట్టుగా  కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  ఇక  జైలర్ 2 లో పార్ట్ 1 ని మించి సర్ ప్రైజ్ లు ఉండబోతున్నాయని తెలుస్తుంది.పార్ట్ 1 లో మోహన్ లాల్,శివ రాజ్‌కుమార్,జాకీష్రాఫ్ వంటి మేటి నటులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్ట్ 2 లో కూడా వాళ్ళని మించిన స్టార్స్ స్పెషల్ క్యారెక్టర్స్ లో కనపడబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.అయితే ఆ స్టార్స్ ఎవరెవరు అనే ఆసక్తి రజనీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులోను ఉంది.  
Pushpa 2 The Rule fever has hit the nation and the eagerly awaited film is gearing up to release finally on 5th December. Makers Mythri Movie Makers seeked price hikes and they have asked for Rs.800 hike on ticket rates for Premiere shows in both Telugu States on 4th December.  Both the governments have allowed for the hike and permitted show after 9:30 PM everywhere and even for 1 AM, 5 AM shows on 5th December, they gave permission to makers. But the ticket rates being more than Rs.1000 for premieres did not go down well with everyone.  A petitioner moved to Telangana High Court challenging the decision to hike the ticket rates for such astronomical prices. HC asked Mythri Movie Makers lawyer to reason with the prices and commented that it a family of 10 has to spend Rs.10,000 just to watch one show of the film.  Such prices are disturbing, the judge remarked. Petitioner also asked for whose benefit are these benefit shows are being conducted and that too at such prices. He demanded the producers to put the amount in an escrow account. Mythri Movie Makers lawyer asked for two weeks time to clarify on this issue.  But the petitioner stated that the movie would release and nothing can be done about the hikes. Telangana High Court judge has stated that his final decision will be announced only in the evening. Allu Arjun, Rashmika Mandanna have given 5 years for this movie and Sukumar is directing the film.
చాలా కాలం తర్వాత అక్కినేని ఫ్యామిలీలో ఓ శుభకార్యం జరగబోతోంది. గత కొన్నిరోజులుగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళ వివాహానికి సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇటీవల పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకను సంప్రదాయ బద్ధంగా జరిపారు. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ శుభ ఘడియ రానే వచ్చింది. డిసెంబర్‌ 4 రాత్రి గం.8.13లకు ఈ జంట వివాహ బంధంలోకి వచ్చేందుకు ముహూర్తం నిర్ణయించారు. హిందూ బ్రాహ్మణ సంప్రదాయంలో వీరి వివాహాన్ని జరపాలని పెద్దలు నిర్ణయించారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో చైతన్య, శోభిత వివాహం చాలా గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ వివాహానికి అతి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారని తెలుస్తోంది. ఇండస్ట్రీలోని కొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు వివాహ సమయంలో ఉంటారు. అలాగే డి.రామానాయుడు కుటుంబంలోని వారంతా హాజరవుతున్నారు. నాగార్జునకు సంబంధించి కొందరు బిజినెస్‌ పార్టనర్స్‌ కూడా హాజరవుతున్నారు. 300 నుంచి 400 మంది మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.  బుధవారం రాత్రి జరగబోతున్న చైతన్య, శోభిత పెళ్ళికి సంబంధించి కొన్ని విశేషాలు ఉన్నాయి. అవేమిటంటే.. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌, హల్దీ ఫంక్షన్‌ను ఎలాంటి ఆర్భాటం లేకుండా జరిపారు. రేపు జరగబోయే పెళ్లి తంతుకు మాత్రం ఎంతో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నాగచైతన్య తనకు కాబోయే భార్యకు ఖరీదైన బహుమతులు అందించారు. రూ.1 కోటికిపైగా ఖరీదైన లెక్సస్‌ కారును బహూకరించారు. అలాగే లెక్కకు మించిన ఖరీదైన బంగారు ఆభరణాలను కూడా శోభిత కోసం తీసుకున్నారని తెలుస్తోంది. శోభితతో తన పెళ్ళి సందర్భంగా నాగచైతన్య స్పందిస్తూ ‘ఎంతో సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చింది శోభిత. ఆ కుటుంబం వారు నన్ను కొడుకులా చూసుకుంటారు. పెళ్లి తర్వాత శోభిత సినిమాల్లో నటిస్తుందా.. అని చాలా మంది అడుగుతున్నారు. పెళ్లి తర్వాత ఖచ్చితంగా సినిమాల్లో నటిస్తుంది’ అని క్లారిటీ ఇచ్చారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  “నన్ను నా సామర్ధ్యం నుంచి తెలుసుకో, నా  వైకల్యం నుంచి కాదు”  -  అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఈ లోకంలో ప్రతీ తల్లీతండ్రీ తమకి  పుట్టే  బిడ్డ అందంగా, ఆరోగ్యంగా పుట్టాలనే ఆశపడతారు. అలా ఇవ్వమనే  భగవంతుణ్ణి ప్రార్దిస్తారు. కానీ చాలా కారణాల వల్ల కొన్నిసార్లు పిల్లలు రకరకాల వైకల్యాలతో పుడుతూ ఉంటారు. అలాంటి పిల్లలు చాలామటుకు ఈ లోకంలోకొచ్చిన మొదటి క్షణం నుంచే కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎంతో వివక్షని ఎదుర్కొంటారు. పెద్దయ్యేవరకూ ఇదే వివక్ష కొనసాగిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. కానీ వాళ్ళు కూడా మన సమాజంలో భాగమేనని, వారికీ సామర్ధ్యాలు ఉంటాయని  గుర్తించి, వాళ్లపై వివక్ష చూపించకుండా వారి అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం అందరికీ ఉంది.  అందుకే వికలాంగుల హక్కులపై అవగాహన పెంచి, వారి సంక్షేమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించిన   ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా, 1992 నుంచి డిశంబర్3వ తేదీని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా  జరపటం మొదలుపెట్టింది. ఈ రోజు, సమాన అవకాశాలు, అందుబాటు, సమగ్రత యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తూ, వికలాంగుల విజయాలు గురించి, సమాజానికి వారు చేసిన  సేవలని గురించి ప్రశంసిస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబరు3న జరుపుకునే వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవం ఒకో ఏడాది ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రవేశపెడుతుంది. "వికలాంగుల నాయకత్వాన్ని పెంపొందించి, సమగ్రత,  స్థిరమైన భవిష్యత్తుకు దారితీయడం." ఇది ఈ ఏడాది థీమ్.  ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల విలువైన పాత్రను,  నాయకత్వాన్ని ఇది గుర్తిస్తుంది. అలాగే, వారి జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వారిని  చేర్చుకోవడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. ఈ రోజు, వికలాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి అవగాహన కలిగించడం,  సమాజంలోని అన్ని రంగాల్లో సమానంగా, సంపూర్ణంగా పాల్గొనేలా వారిని  కూడా  ప్రోత్సహించడం కోసం ఒక  వేదికగా పనిచేస్తుంది. వికలాంగుల జీవితాలను మెరుగుపరిచి, వారికి తగిన గౌరవం ఇవ్వటంలో  ప్రభుత్వాలు, సంస్థలు,  సమాజానికి అవకాశాన్ని అందిస్తుంది. వికలాంగుల హక్కులు, సంక్షేమానికి  మద్దతు ఇవ్వడం సాటి మనిషిగా మన బాధ్యత.  వివిధ మార్గాల్లో ప్రతీ ఒక్కరూ ఈ బాధ్యత తీసుకుని వారి అభివృద్ధికి సాయపడవచ్చు.  అందులో కొన్ని తెలుసుకుంటే..  అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం:  వికలాంగులకు సంబంధించిన సమస్యలపై చర్చలు, వర్కుషాపులు నిర్వహించటం ద్వారా ప్రజలకి వారి సమస్యలపై అవగాహన తెప్పించవచ్చు. వైకల్యం అనేది కేవలం  బయటకి కనిపించేది మాత్రమే కాదు, బయటకి కనిపించని (ఆటిజం, డిస్లెక్సియా, డిస్కాల్కులియా) వైకల్యాలు కూడా ఉంటాయని పాఠశాల స్థాయినుంచే గుర్తించి, అటువంటివారి అభివృద్ధి కోసం మనం అందించగలిగే సహకారం ఏమిటనేది అందరికీ అవగాహన కల్పించాలి.   విజయాలను గుర్తించటం:   పుట్టినప్పటి నుంచో లేక ప్రమాదం వల్లనో వైకల్యం వచ్చినప్పటికీ, కఠిన పరిస్థితులకి తలొగ్గకుండా, ఏ వైకల్యం  మమ్మల్ని ఆపలేదని నిరూపిస్తూ,  విజయాలు సాధించిన ఎంతో మంది వికలాంగుల విజయాలను గుర్తించి ప్రశంసించాలి. అప్పుడే అలాంటివారిని చూసి మిగిలిన వారికి ప్రేరణ కలుగుతుంది.  జీవిత అనుభవాలు చెప్పించటం:   ఈ వివక్ష చూపించే సమాజంలో తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యలు గురించి ,  వికలాంగుల అనుభవాలను పంచుకుని అవగాహన పెంచవచ్చు. టెక్నాలజీ,  విధానాలలో మార్పులు తీసుకురావటం:  వికలాంగులు కూడా మనలాగే  రోజువారీ జీవితాన్ని గడపగలగాలంటే,   వికలాంగులకి తగిన మౌలిక సదుపాయాలు, రవాణా,  డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రోత్సహించటం ద్వారా వారు కూడా మనలాగే  అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. సమాజంలోని  వైద్య, విద్య, రవాణా సంస్థల్లోనూ,  వారు పని చేసే సంస్థల్లోనూ కొన్ని విధానాల్లో మార్పులు తీసుకురావటం, వారికి ఉపయోగపడే సాంకేతికతని అందుబాటులోకి తీసుకురావటం వంటివి చేయాలి.  అప్పుడే ఉద్యోగుల వృత్తిపరమైన అవసరాలు తీరి వారు కూడా సమాజ అభివృద్ధిలో భాగమవుతారు.  వికలాంగుల సంస్థలకు మద్దతు ఇవ్వటం:  వికలాంగుల సంక్షేమానికి పనిచేసే సంస్థలకు స్వచ్ఛందంగా సేవ చేయండి లేదా సహాయం చేయండి. ఈ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, గ్లోబల్ నుండి లోకల్ వరకు అన్నిరంగాల్లో, అన్ని విధాలుగా  మనం సులభతరం చేసే మార్గాలు గురించి మాత్రమే కాకుండా, వికలాంగులు కూడా తమ గొంతును వినిపించి, సమాజంలో వారి  భాగస్వామ్యాన్ని కూడా గుర్తించడానికి ఒక అవకాశం ఇస్తుంది. వికలాంగుల మేలు కోసం దీర్ఘకాలిక మార్పులను అమలు చేయడం ప్రారంభించి, వారికి ప్రాముఖ్యతని ఇవ్వటం ద్వారా మరింత సమర్థవంతమైన భవిష్యత్తును రూపొందించవచ్చు.  మనలో ఉన్న వైకల్యాన్ని ఒప్పుకొని క్రుంగిపోవటమే అసలు వైకల్యమని,  మానసికంగా  దృఢంగా నిలబడి,  వైకల్యాన్ని కూడా విజయపధం వైపు నడిచే ప్రేరణగా, బలంగా  మార్చుకున్న గొప్ప వ్యక్తులు ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అటువంటివారు మిగిలిన అందరికీ ఆదర్శంగా నిలిచి ఈ సమాజంలో వారి పాత్ర కూడా ఉందన్న నిజాన్ని ప్రపంచమంతా  అర్ధం చేసుకుని, వారిపై ఎటువంటి వివక్షా లేని సమాజం వైపు అడుగువేయాలని కోరుకుందాం…                                             *రూపశ్రీ 
  హరిత విప్లవం, శ్వేత విప్లవం అని అనేక  నూతన విధానాలు వచ్చి, చాలా మంది ఆకలి తీర్చినప్పటికీ, ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే, మనం రోజువారీ తినే తిండి స్వచ్ఛమైనదని చెప్పలేకపోతున్నాము. ఇప్పుడున్న రసాయన వినియోగానికి, కాలుష్యానికి, మన జీవన విధానంలో వచ్చిన మార్పుకి   మనం రోజూ ఆహారం తింటున్నామో, మందులు తింటున్నామో తెలియట్లేదు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయో తెలియట్లేదు.  ఉత్తరప్రదేశ్, లక్నో నివాసి అయిన  ఒక తల్లి, జ్యోతిపద్మ  బాధ కూడా ఇలాంటిదే...  ఏ పిల్లలకయినా పాలు ప్రధమ, ప్రధాన ఆహారంగా ఉంటాయి. కానీ తన కూతురు విషయంలో ఆ ఆకలి తీర్చే పాలు తాగటమే శాపంగా మారిందనే విషయం జ్యోతి పద్మ బాధకి కారణమైంది. జ్యోతి పద్మ కూతురుకు పాలు తాగిస్తే జీర్ణించుకునేది కాదు.  అయితే  తన కూతురుకి ఎందుకు ఇలా జరుగుతుందో, మిగతా పిల్లల్లా ఎందుకు పాలని సహించుకోలేకపోతుందనే  విషయం అర్ధం చేసుకోలేక, పాలు తాగితే చాలు మంచం పడుతున్న  తన కూతురు పరిస్థితిని చూడలేక ఆ తల్లి తల్లడిల్లిపోయింది. చివరికి డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే, తన కూతురుకి ‘ లాక్టోజ్ ఇన్ టోలరెన్స్’ అనే లోపం ఉందని తెలుసుకుంది. తన కూతురు పాలుగానీ, పాల ఉత్పత్తులు కానీ ఎందుకు జీర్ణించుకోలేకపోతుందన్న నిజం తెలుసుకున్న ఆమె ఆశ్చర్యానికి గురయింది.   తన కుటుంబంలో కానీ, తన భర్తవైపు కుటుంబంలో కానీ ఎవరికీ లేని  సమస్య తన కుమార్తెకి వచ్చేసరికి ఆమెకి ఏం చేయాలో అర్ధం కాలేదు.   తన కుమార్తెకి  వచ్చిన ఈ సమస్యని ఆమె సులువుగా వదల్లేకపోయింది. ఈ సమస్యకి  పరిష్కారం కోసం, తన కుమార్తెకి తగిన పోషకాలు అందించాలనే తపనతో  ఆమె తన ప్రయత్నాలు చేయటం మొదలు పెట్టింది. ఏ కంపెనీ పాలయినా తన కూతురు జీర్ణించుకోగలుగుతుందేమో అనే ఆశతో  మార్కెట్లో దొరికే రకరకాల  కంపెనీల  ప్యాకేజ్డ్ పాలు ఇచ్చేది. కానీ అవేవీ పడకపోవటంతో,   ఈసారి  స్థానిక డైరీల నుంచి పాలు తెచ్చి అవి ఇవ్వటం మొదలుపెట్టింది. కానీ ఆ పాల ఉత్పత్తిలో కూడా అపరిశుభ్రత, రసాయన ఆహారాల వినియోగం వంటివి ఉండటంవల్ల వాటిని కూడా ఆమె కుమార్తె శరీరం జీర్ణించుకోలేక తిప్పికొట్టింది. అయితే మన ప్రయత్నం బలంగా ఉంటే భగవంతుడు  కూడా సాయం చేస్తాడన్న మాటని నిజం చేస్తూ.. 2018లో, ఆమె సోదరి వాళ్ళ ఇంటి ఆవు  నుంచి తీసి, పంపించిన  పాలు జ్యోతి పద్మకి  పరిష్కారాన్ని చూపించాయి. ఆశ్చర్యకరంగా ఆ పాలను ఆమె కుమార్తె తేలికగా జీర్ణం చేసుకోగలిగింది.  మరలా అవే పాలని ప్రయత్నించి, తమ కుమార్తె జీర్ణం చేసుకోగలుగుతుందని ఒక నిర్ధారణకొచ్చాక జ్యోతి ఆనందానికి అవధులు లేవు.   అప్పుడే  ఆమె మనసులో ఒక ఆలోచన మెదిలింది. నేనెందుకు అటువంటి స్వచ్చమైన  పాలని ఉత్పత్తి చేసే డైరీ పెట్టకూడదు? తమ పిల్లలకి  స్వచ్చమైన పాలు అందించాలన్న నాలాంటి తల్లుల ఆవేదనకి ఎందుకు సమాధానం కాకూడదు? అనుకుంది. అయితే శుభ్రతని పాటించకపోవటం, సరైన పోషకాహారం ఆవులకి అందించలేకపోవటం వంటి కారణాల వల్ల నాణ్యత తగ్గి, వ్యాపారం చేయలేక   స్థానిక డైరీలు మూత పడుతున్నాయి. అలాంటి సమయంలో జ్యోతి మొదటిగా 15 సంకరజాతి ఆవులతో చిన్న డైరీ ఏర్పాటు చేసుకుంది. తాను రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కానప్పటికీ ప్రయత్నిస్తూ, తప్పులు సరిచేసుకుంటు ఆమె సంపాదించిన కొద్దిపాటి జ్ఞానం ఆవు పాల నాణ్యతని మెరుగుపర్చింది. ఆ తరవాత ఆమె మహారాష్ట్రలోని థానేకి షిఫ్టయ్యాక నగరాల్లో స్వచ్చమైన పాల అవసరాన్ని గుర్తించింది.  నగరాల్లో  స్వచ్ఛమైన పాలు దొరకని ఈ కాలంలో స్వచ్చమైన పాలు అందించే ఉద్దేశంతో, 2019లో  నగర శివార్లలో  లీజు తీసుకున్న  రెండెకరాల  భూమిలో,  ‘శ్రీ బాలకృష్ణ డైరీ ఫార్మ్’ (బికేడి మిల్క్)ను ప్రారంభించారు.  అక్కడ జ్యోతి,  ఆమె భర్త ఆవులని స్వేచ్ఛగా తిరగనిచ్చి, నేపియార్ గడ్డి,  గోధుమ గడ్డి,  మిల్లెట్స్ వంటి ఆర్గానిక్ మేతతో పోషించారు.    ఎటువంటి రసాయనాలు లేకుండా స్వచ్ఛమైన A2 పాలను అందించటమే లక్ష్యంగా పెట్టుకుని పని చేశారు.  రసాయన, యంత్ర వినియోగం కూడా లేకుండా సాంప్రదాయ పద్దతుల్లో పాలని తీసి స్వచ్ఛంగా నగరవాసులకి అందించారు. వీరి పాల నాణ్యత బాగుండటంతో అందరూ వీళ్ళ   దగ్గర పాలు తీసుకోవటం మొదలుపెట్టారు. ఈ రోజు బెకేడి మిల్క్ సుమారు 200 మంది కస్టమర్సుని సంపాదించుకుని, సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం పొందగలిగే డైరీగా ఎదిగింది. ఈ ప్రయాణంలో స్వచ్చమైన పాలని స్థిరంగా ఇవ్వటంలోనూ, నైతికతని కాపాడుకోవటంలోనూ ఆమెకున్న నిబద్ధతకి కొత్తతరపు రైతులని, కస్టమర్లని ప్రేరణ కలిగిస్తుంది.  అయితే ఆమె ప్రయాణం అక్కడితోనే ఆపేయకుండా, ఆధునిక రైతు  పరీక్షిత్ తో కలిసి,   ‘కౌ కరెన్సీ’ అనే వినూత్న మోడల్ తో  స్వచ్ఛమైన పాలను కోరుకుంటూ, ఆవుల పెంపకపు భారాన్ని మోయలేని నగర వాసులకు ఒకపరిష్కారం చూపించింది. నగర నివాసులకు పాలు, నెయ్యి అందించే ఈ వినూత్న పథకం ద్వారా గోవును స్వంతం చేసుకునే అవకాశం కల్పించారు. రూ.1,08,000 ప్రారంభ పెట్టుబడితో, మూడు సంవత్సరాల పాటు గోవును ఫార్మ్ నిర్వహిస్తుంది.  వీటితో రోజుకు రెండు లీటర్లు పాలు,  నెలకు రెండు కిలోల నెయ్యి అందజేస్తుంది. ఈ ప్రాజెక్టు దశల వారీగా విస్తరిస్తూ, జ్యోతి ఈ మోడల్‌ను మరింత మెరుగ్గా రూపొందించారు. వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న పరిక్షిత్, టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని సుస్థిరంగా చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ విధంగా స్వచ్ఛమైన పాల అవసరం నుండి ప్రారంభమైన ఓ తల్లి ప్రయత్నం  వ్యాపారంలా విస్తరించి, దాంతోపాటు  నైతిక వ్యవసాయ విధానాలతో లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసింది.                                       *రూపశ్రీ 
  “ధూమపానం ఆరోగ్యానికి హానికరం” అనే మాట నేడు “గాలి   పీల్చుకోవటం ఆరోగ్యానికి హానికరం” అనేలా మారిపోయిందా?.. అలాగే అనిపిస్తోంది నేటి సమాజంలో ఏర్పడిన పరిస్థితులు, జరుగుతున్న సంఘటనలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. డిసెంబర్ 2, 1984న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుండి విషపూరితమైన మిథైల్ ఐసోసయనేట్ గ్యాస్ లీక్ అయింది. ఈ సంఘటన వేల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసి, బ్రతికున్న  లక్షలమంది ఆరోగ్యంపై  దీర్ఘకాలిక  ప్రభావాన్ని  కలిగించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పరిశ్రమ వైపరీత్యాలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ సంఘటనలో మృతుల జ్ఞాపకార్థంగానూ, పరిశ్రమల భద్రత గురించి అవగాహన పెంపొందించడంలోనూ,  ఇంకా మున్ముందు అటువంటి విషాదాలు జరగకుండా నివారించేందుకు కాలుష్య నియంత్రణ చాలా అవసరం. ఈ కాలుష్య నియంత్రణ చర్యల ప్రాముఖ్యతను గుర్తు చేయడమే ఉద్దేశ్యంగా ప్రతీ సంవత్సరం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటాము. 2024 సంవత్సరానికి జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ థీమ్: "శుభ్రమైన గాలి, పచ్చని  భూమి: స్థిరమైన జీవన దిశగా ఒక అడుగు". ఇది పర్యావరణ సమస్యలను ఎదుర్కొనేందుకు శుభ్రమైన గాలి, అందుకోసం తీసుకోవాల్సిన  చర్యల అవసరాన్ని చూపుతుంది. కాలుష్య నియత్రణ  దినోత్సవం సంద్భంగా భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుని, మరలా అటువంటి విషాదంలో ఏ ఒక్కరి ప్రాణం బలికాకుండా ఉండటానికి ఏమేమి చెయ్యాలో చర్చించుకోవాలి.   ప్రస్తుతం  ఢిల్లీ వంటి ప్రధాన నగరాల పరిస్థితి ఎలా ఉందంటే, బ్రతకటం కోసం పీల్చే గాలే స్లో పాయిజన్లా  నెమ్మదిగా ప్రాణాలు తీసేస్తుంది. అందుకే కాలుష్యం అనేది మన ఆరోగ్యంపై, పర్యావరణంపై, ఆర్థిక వ్యవస్థపై చూపించే  ప్రభావాలను చర్చించి, దానిమీద  అవగాహన పెంపొందించటానికి ప్రయత్నించాలి.  ఏం చేయాలంటే. వ్యర్థ పదార్ధాల  నిర్వహణ, ఉద్గారాల తగ్గింపు, పునరుత్పత్తి శక్తుల వినియోగం వంటి పర్యావరణానికి మేలు చేసే  చర్యలను ప్రోత్సహించాలి.  పరిశ్రమలన్నీ  భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారా భోపాల్ గ్యాస్  వంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా నివారించాలి. పచ్చటి భూమి పది కాలాలపాటూ కొనసాగాలంటే ఏ ఒక్కరో ముందుకి వస్తే సరిపోదు, అందరూ కలిసి ఒక సైన్యంగా పనిచేస్తేనే, కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న మన భూమాతని కాపాడుకోగలము. భవిష్యత్తు తరాలకి కాలుష్య రహిత గాలినీ, నెలనీ, నీటినీ అందించగలం. దానికోసం మనం చేయాల్సిందల్లా,  కాలుష్యం అనేది కేవలం పర్యావరణ సమస్యే కాదు,  ఇది మొత్తం మానవాళికే సమస్య అన్న నిజాన్ని గ్రహించి అది తగ్గించటానికి మనం ఏం చేయగలమో అటువైపు అడుగులు వేయాలి.  కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా  స్థిరమైన జీవన విధానాలను స్వీకరించడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి  ప్రేరణ ఇచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుని అటువైపు దృష్టి సారించాలి.  చిన్న మార్పులు పెద్ద తేడాలను తీసుకువస్తాయి. ఈ భూ గ్రహం కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించలి.  కాలుష్యంతో పోరాటం నాతోనే ప్రారంభమవ్వాలని,  ఆ మార్పు నాతోనే మొదలవ్వాలని ప్రతీ ఒక్కరు అనుకుని  ముందడుగు వేయాలి.  స్వచ్ఛమైన గాలి అందరి హక్కు. ఈ కాలుష్య నియంత్రణ ద్వారానే అది సాధ్యమవుతుంది. అందుకే కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా పచ్చటి భూమాత కోసం పనిచేయడం లక్ష్యంగా పెట్టుకోవాల జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే  వివిధ కార్యక్రమాల్లో ప్రజలని భాగస్వామ్యం చేయడం ఉత్తమ మార్గం. ఇక్కడ కొన్ని ప్రయోజనకరమైన కార్యక్రమాలు ఉన్నాయి.. చెట్లు నాటే కార్యక్రమాలు: ప్రజలని  చెట్లు నాటటానికి ప్రోత్సహించడం వల్ల గాలి నాణ్యతను మెరుగుపరచడంలో, కార్బన్ డై  ఆక్సైడ్ ను తగ్గించడంలో  సహాయపడతాయి.  శుభ్రతా కార్యక్రమాలు: పార్కులు, నదులు లేదా బీచ్‌ల వంటి ప్రాంతాల్లో శుభ్రతా కార్యక్రమాలు  నిర్వహించి, పరిసరాల శుభ్రత ద్వారా కాలుష్యాన్ని ఎలా తగ్గించవచ్చో తెలియచేయాలి.  అవగాహన కార్యాక్రమాలు: గాలి, నీటి కాలుష్యానికి గల  కారణాలు,  కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలు, దాన్ని తగ్గించే మార్గాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి సెమినార్లు, వర్క్ షాప్‌లను నిర్వహించటం.   పర్యావరణ హిత ఉత్పత్తులు పంపిణీ: వ్యాపార సంస్థలు,  వ్యక్తులను రీయూసబుల్ బ్యాగులు, బాటిళ్లు,  స్ట్రాల వంటి ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను అందించి,  స్థిరమైన ఉత్పత్తులను ఉపయోగించడానికి ప్రోత్సహించడం.  చిత్రకళల పోటీలు నిర్వహణ: విద్యార్థులను పర్యావరణ అవగాహనపై పోస్టర్లు లేదా బొమ్మలు రూపొందించేందుకు ప్రోత్సహించాలి.  వర్షపు నీటి సేకరణ :  వర్షపు నీటిని సేకరించి భద్రపరిచే విధానం ద్వారా నీటి పరిరక్షణను ప్రోత్సహించండి. కాంపోస్టింగ్ యూనిట్లను నిర్మించండి: కమ్యూనిటీలకు సేంద్రీయ వ్యర్థాలను సమర్థవంతంగా కాంపోస్ట్ చేయడం వల్ల రసాయన ఎరువుల ద్వారా భూమి కాలుష్యం కాకుండా నివారించవచ్చు. జీరో-వేస్ట్ వర్కుషాప్‌లు నిర్వహణ: వ్యర్థాలను తగ్గించడానికి,  పదార్థాలను పునర్వినియోగం చేసేందుకు ప్రజలను ప్రేరేపించండి. ప్రజా రవాణాను ప్రోత్సహించడం: వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు, కార్బన్  ఉద్గారాలను తగ్గించేందుకు ప్రజలను ప్రేరేపించండి. గ్రీన్ రూఫ్ ప్రాజెక్టులు: భవనాలపై గ్రీన్ రూఫ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరచవచ్చు. స్విచ్ ఆఫ్ క్యాంపెయిన్లు: అవసరం లేని లైట్లు, పరికరాలు ఆఫ్ చేయడం ద్వారా శక్తిని ఆదా చేయొచ్చని, ఆదా చేయటం కూడా ఒక రకంగా సృష్టించటమేననే అవగాహన పిల్లలు,పెద్దల్లో కల్పించాలి.    సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించండి: మోటారు వాహనాలపై ఆధారపడకుండా ఉండేందుకు సైక్లింగ్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మోటార్ సైకిల్ పొగ ద్వారా జరిగే కాలుష్యం ను తగ్గించవచ్చు. కమ్యూనిటీ గార్డెనింగ్: నగర ప్రాంతాల్లో హరిత ప్రాంతాలను సృష్టించడానికి కమ్యూనిటీ గార్డెన్లను ప్రారంభించడం. సోషల్ మీడియా ప్రచారాలు: సోషల్ మీడియా వేదికలపై ప్రత్యేక హాష్‌ట్యాగ్‌లు సృష్టించి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా వ్యాప్తి చేయడం.  పర్యావరణాన్ని కాపాడటానికి,  కాలుష్యాన్ని తగ్గించటానికి  ప్రజలకు ఉండే బాధ్యతను కాలుష్య నియంత్రణ దినోత్సవం  గుర్తుచేస్తుంది. స్థిరమైన జీవన శైలిని ఆచరించడం, అవగాహన పెంచడం,  సమిష్టిగా పని చేయడం ద్వారా భవిష్యత్ తరాల కోసం మరింత పచ్చదనం,  ఆరోగ్యకరమైన భూమిని అందించవచ్చు.  భూమిని సంరక్షించడంలో  సరైన అడుగులు వేయడానికి మనకి  ఈ రోజు ప్రేరణనివ్వాలి. ప్రకృతి మన బాధ్యత.. మన చర్యలే మన భవిష్యత్తు! అనే విషయం మర్చిపోకండి.                                     *రూపశ్రీ 
శరీరానికి పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి.  ఆరోగ్యం బాగా లేనప్పుడు పండ్లను బాగా తీసుకుంటే తొందరగా అనారోగ్యం నుండి బయటపడతారు.  అయితే పండ్లు కూడా సీజన్ ను బట్టి తీసుకుంటే శరీరానికి ఎక్కువ లాభం కలుగుతుంది.  ప్రస్తుతం చలికాలం సాగుతున్న తరుణంలో చలికాలంలో బొప్పాయి తింటే మంచిదని అంటున్నారు.  బొప్పాయి తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. చలికాలంలో కాస్త వేడి గుణం కలిగిన ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.  చలి కారణంగా శరీరం డిస్టర్బ్ అవ్వదు. బొప్పాయిలో కూడా వేడి గుణం కలిగి ఉంటుంది.  చలికాలంలో వీలైనపుడల్లా బొప్పాయిని తినాలి. చలికాలంలో బొప్పాయిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  బొప్పాయిలో విటమిన్-సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చలికాలంలో వచ్చే సీజన్ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.  దగ్గు, జలుబు, చలికారణంగా ఎదురయ్యే తలనొప్పి, ఫ్లూ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. బొప్పాయి పండులో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. అలాగే ఇందులో ఎంజైమ్ లు కూడా అధిక మొత్తంలో ఉంటాయి.  ఇవన్నీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.  మలబద్దకం,  మోషన్ కావడంలో ఇబ్బందులు,  అజీర్తి వంటి సమస్యలు బొప్పాయి తినడం వల్ల అధిగమించవచ్చు. బొప్పాయిలో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది.  ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.  ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.  గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తాయి. కఠినమైన  వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె యవ్వనంగా ఉండాలన్నా,  ఎంత వయసు పెరిగినా ఇంకా యవ్వనంగా ఉన్నవారిలా గుండె పనిచేయాలని కోరుకుంటున్నా బొప్పాయిని తినమని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయికి చాలా మేలు చేస్తుంది.  ఇందులో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.  విటమిన్-సి గొప్ప యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఇది చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.  చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. బొప్పాయిలో ఉండే పోషకాలు చలికాలంలో కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.  కేవలం ఆహారంగానే కాకుండా  చర్మ సంరక్షణలో కూడా బొప్పాయిని చేర్చుకోవచ్చు.  బొప్పాయి ఫేస్ వాష్,  బొప్పాయి ఫేస్ ప్యాక్ ట్రై చేయచ్చు. చలికాలంలో వేడి ఆహారాల మీద అందకీ కన్ను ఉంటుంది.  ముఖ్యంగా నూనెలో డీప్ ఫ్రై చేసే పకోడీలు,    వడలు,  సమోసా వంటి స్నాక్స్ ను ఇష్టపడతారు.  వీటి వల్ల బరువు వేగంగా పెరుగుతారు.  కానీ బొప్పాయి తీసుకుంటే ఆకలి ఎక్కువగా కాదు.  ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది.  కాబట్టి దీన్ని తింటే బరువు పెరగకపోవడమే కాకుండా.. బరువు తగ్గడం కూడా సులువు.                                                    *రూపశ్రీ.
శరీరానికి ఆహారం చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆహారంలో పండ్లు, కూరగాయలు,  డ్రై ఫ్రూట్స్,  డ్రై నట్స్ వంటివి ఉండాలి.  వీటి నుండి విటమిన్లు,  మినరల్స్, ప్రోటీన్లు అన్నీ శరీరానికి లభిస్తాయి. అయితే సీజన్ అనుగుణంగా లభించే వాటిలో శరీరానికి కావలసిన పోషకాలు, శరీరానికి మేలు చేసే సమ్మేళనాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటి వాటిలో వాటర్ చెస్ట్ నట్స్ కూడా ఒకటి.  వీటిని తెలుగులో సింగోడ అని అంటారు.  ఇవి శీతాకాలంలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.  శీతాకాలంలో ఈ వాటర్ చెస్ట్ నట్స్ ను తప్పకుండా తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.  ఇంతకీ ఇవి తింటే కలిగే లాబాలు తెలుసుకుంటే.. వాటర్ చెస్ట్ నట్ తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.  ఇది వివిధ రకాల వ్యాధులతో పోరాడటంలో సహాయపడుతుంది. ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు ఈ వాటర్ చెస్ట్ నట్స్ ను తింటూ ఉంటే తొందరగా రికవరీ కావచ్చు. చలికాలంలో జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది.  దీని కారణంగా ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.  మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. కానీ వాటర్ చెస్ట్ నట్స్ తింటే  జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది.  మలబద్దకం సమస్యలు తగ్గుతాయి. వాటర్ చెస్ట్ నట్స్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.  ఇది రక్త పోటును అదుపులో ఉంచుతుంది.  దీని కారణంగా చలికాలంలో గుండె సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుంది.  సాధారణంగా చలికాలంలో శరీరంలో రక్తప్రసరణ తగ్గడం వల్ల గుండె కండరాలు బిగుసుకుపోయినట్టు ఉంటాయి. కానీ ఈ సమస్య తగ్గించడంలో వాటర్ చెస్ట్ నట్స్ సహాయపడతాయి. వాటర్ చెస్ట్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చర్మం మెరుస్తూ ఉండేలా చేయడంలో సహాయపడతాయి. ముఖం మీద మొటిమలను  తొలగించడమే కాకుండా కాలుష్యం వల్ల వచ్చే సమస్యల నుండి కూడా ఇవి కాపాడతాయి. అన్నింటి కంటే ముఖ్యంగా వాటర్ చెస్ట్ నట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఈ ఫైబర్ శరీరానికి చాలా అవసరం.  ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది.  ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది.  ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.                                           *రూపశ్రీ.     
  ఆహారమే ఆరోగ్యం అనే మాట వినే ఉంటారు.  శరీరానికి శక్తిని ఇచ్చేది ఆహారమే.  అయితే ఆరోగ్యానికి ఔషధంలా పని చేసే ఆహారమే అనారోగ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. దీనికి కారణం సీజన్.. సీజన్ కు తగ్గట్టు ఆహారం తినాలని అంటుంటారు.  ఏ కాలంలో పండే కూరగాయలు, పండ్లు ఆ కాలంలో తింటే ఎలాంటి జబ్బులు పెద్దగా ఇబ్బంది పెట్టవు. కానీ నేటి కాలంలో పరిస్థితి వేరుగా ఉంది.  ఏ సీజన్ లో అయినా ఎలాంటి ఆహారం అయినా దొరుకుతుంది.  కొందరు  ఖరీదు ఎక్కువ పెట్టి సీజన్ లో లభించని ఆహారాలు కొని తినడాన్ని గొప్పగా ఫీలవుతారు కూడా. అయితే చలికాలంలో కొన్ని ఆహారాలు తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యం పాడయ్యి వ్యాధుల బారిన పడతారట. చాలా వరకు ఏ ఆహారాలు హాని కలిగిస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు.  సాధారణ రోజుల్లో ఎంతో ఆరోగ్యం అనుకునే ఆహారాలే ఆ తరువాత హాని కలిగిస్తాయి.  చలికాలంలో తినకూడని ఆహారాలేంటో తెలుసుకుంటే.. చలికాలంలో ఐస్ క్రీమ్ తినడం,  వర్షం పడుతుండగా ఐస్ క్రీమ్ ఆస్వాదించడం చాలామంది అదేదో  గొప్పగా చెబుతారు. కానీ చలికాలంలో చాలావరకు ఐస్ క్రీములు,  చల్లని జ్యూసులు తీసుకోవడం వల్ల జలుబు,  దగ్గు,  ఇతర సీజనల్ సమస్యలు చాలా తొందరగా వస్తాయి. చల్లని వాతావరణంలో వేడిగా ఏదైనా తినాలని అనుకునే చాలామంది నూనెలో వేయించిన ఆహారాలు,  కరకరలాడే ఫ్రై లు తినాలని అనుకుంటారు.  అలాంటి ఆహారానికే మొగ్గు చూపుతారు. కానీ చలికాలంలో సాధారణంగానే జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది.  ఇది జీర్ణవ్యవస్థను పాడు చేసి అజీర్ణం,  మలబద్దకం వంటి సమస్యలు కలిగిస్తుంది. బాగా కారంగా ఉన్న ఆహారం తినడాన్ని ఇష్టపడే వారు అధికం అయ్యారు.  కారం తినడం అంటే తమ వ్యక్తిత్వం, శరీరం బాగా బలంగా ఉందని వ్యక్తం చేయడం అనుకుంటారు. దీని కారణంగానే చాలామంది బిరియానీ,  మసాలా వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఇలాంటి ఆహారాలు తినడం వల్ల చలికాలంలో ఎసిడిటీ,  గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. చలికాలంలో జీర్ణ వ్యవస్థ పనితీరు నెమ్మదిగా ఉంటుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే ఆహారాలను ఈ కాలంలో తీసుకోకపోవడమే మంచిది.  అలాంటి ఆహారాలలో పచ్చి కూరగాయలు కూడా ఒక భాగం.  పచ్చి కూరగాయలను తినడం మానుకోవాలి. చక్కెర ఎక్కువగా జోడించిన ఆహారాలు తినడం వల్ల జలుబు, ఫ్లూ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.  వీటిని చలికాలంలో వీలైనంత వరకు తగ్గించాలి.                                                *రూపశ్రీ.