LATEST NEWS
 సల్మాన్ రష్దీపై దాడి చేసిన వ్యక్తి న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హదీ మటర్‌గా గుర్తించారు. న్యూయార్క్ పోలీసులు దాడి చేసిన వ్యక్తి పై ఇంకా అభియోగాలు మోపలేదని, రుష్దీ పరిస్థితిని బట్టి అభియోగాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ రష్దీ ప్రసంగించేందుకు వేదికపైకి వచ్చిన కొద్దిసేపటికే హాదీ మటర్ ర‌ష్దీ మెడపై ఒక్కసారైనా, పొత్తికడుపుపైనా ఒక్కసారైనా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: వేదికపై కత్తి పోట్లకు గురైన సల్మాన్ రష్దీ కి శస్త్రచికిత్స చేస్తున్నారు. సల్మాన్ రష్దీ  ఉపన్యాసానికి హాజరు కావడానికి హదీ మటర్ పాస్ సంపాదించాడు. అత‌ను మాన్‌హాటన్ నుండి హడ్సన్ నదికి అవత‌ల‌ ఉన్న ఫెయిర్‌వ్యూలో ఉంది. మాటర్ దాడికి గల ఉద్దేశ్యం అస్పష్టంగానే ఉందని పోలీసులు తెలిపారు. అతను ఒంటరి గానే ఉన్నాడ‌ని, అత‌నికి మ‌ద్ద‌తుదారులు, స‌హాయ‌కులూ  కూడా లేర‌ని తెలుస్తోంది.  తొలిద‌శ‌ దర్యాప్తులో ఎఫ్ బీ ఐ సహాయం చేస్తోందని న్యూయార్క్ స్టేట్ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఓ బ్యాగు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు గుర్తించారు. రష్దీ మరణానికి పిలుపునిచ్చిన ఇరాన్ ప్రభుత్వం పట్ల హదీ మాతర్‌కు సాను భూతి ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అతని ఫేస్‌బుక్ ఖాతాలో 1989లో సల్మాన్ రష్దీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసిన ఇరాన్ నాయకుడు అయతుల్లా ఖొమేనీ ఫోటో ఉంది. ఎన్ బిసి వార్తల ప్రకారం, ఇరాన్, దాని రివల్యూషనరీ గార్డ్‌కు మద్దతుగా, షియా తీవ్రవాదానికి మద్దతుగా హాదీ మాటర్ సోషల్ మీడియా పోస్ట్‌లు చేసాడు. హదీ మటర్ నల్లటి దుస్తులు ధరించి, నల్లనిముసుగు ధరించి ఉన్నాడు, ఒక ప్రత్యక్ష సాక్షి మీడియా కు  తెలియ‌జేశారు.  దాడి చేసిన వ్యక్తి వేదికపైకి దూకినప్పుడు, సల్మాన్ రష్దీ వివాదాస్పద వ్యక్తి కాబట్టి ఇది కొట్లాట‌లా వారు భావించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు, అయితే కొన్ని సెకన్ల తర్వాత, అది స్పష్టమైంది. దాదాపు 20 సెకన్ల పాటు దాడి జరిగింది. ఆ స‌భ‌లో ఉన్న మీడియా నివేదిక‌ల  ప్రకారం, సల్మాన్ రష్దీని వేదికపై 10 నుండి 15 గుద్దులు లేదా కత్తితో పొడిచారు. ఈవెంట్ నిర్వాహ‌కుడు  హెన్రీ రీస్‌కీ  తలకు స్వల్ప గాయమైంది. ప్రవాసంలో ఉన్న కళాకారులకు ఆశ్రయమీయ‌డం వంటి యునై టెడ్ స్టేట్స్ ప‌నుల‌ గురించి రీస్ రష్దీతో చర్చించవలసి ఉంది. ఆకస్మిక దాడి తర్వాత, సల్మాన్ రష్దీని హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తర లించారు. ఇప్పు డు వెంటిలేటర్‌పై ఉన్నారు. అతను ఒక కన్ను కోల్పోవచ్చని అతని ఏజెంట్ చెప్పాడు. ర‌ష్డీ కాలేయం దెబ్బ తింది  ర‌ష్డీ చేతి నరాలు తెగిపోయాయి.
తలసాని శ్రీనివాస యాదవ్ ఆజాదీ కా అమృతోత్సవాలలో భాగంగా శనివారం నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అత్యుత్సాహం ప్రదర్శించి వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధ్వర్యంలో జరుగుతున్న భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు నిర్వహించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఉన్నట్లుండి అందరూ చూస్తుండగానే పక్కను ఉన్న పోలీసు నుంచి తుపాకి తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపారు.  ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసు అధికారులు కనీసం మంత్రిని వారించను కూడా వారించలేదు. తాను గాలిలోకి కాల్పులు జరుపుతున్న ఫొటోలను తలసాని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు తగునా ఇది తలసానీ అంటూ ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇలా ఉండగా తాను చేసిన పనిని మంత్రి తలసాని సమర్ధించుకున్నారు.  భారీజ‌న సందోహం హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో పోలీసుల తుపాకీ తీసుకుని మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జ‌రుపుతారంటూ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న   తాను కాల్చింది ర‌బ్బ‌ర్ బుల్లెట్ అని పేర్కొన్న శ్రీనివాస్ గౌడ్‌... తాను రైఫిల్ అసోసియేష‌న్ స‌భ్యుడిన‌ని,  క్రీడా శాఖ మంత్రిగా త‌న‌కు ఇలా గాల్లోకి కాల్పులు జ‌రిపే అర్హ‌త ఉంద‌ని తలసాని చెప్పారు. అంతే కాకుండా తానేమీ పోలీసు చేతిలోంచి తుపాకీ లాక్కోలేదనీ, ఎస్పీయే స్వయంగా తనకు తుపాకీ అందించారని అన్నారు.  
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఇటీవలే పోస్ట్ కోవిడ్ సమస్యలతో సోనియా గాంధీ చికిత్స తీసుకున్న సంగతి విదితమే.  కాగా సోనియాగాంధీ కరోనా బారిన పడిన విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జై రాం రమేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.  అంతకుముందు జూన్ మొదటివారంలో సోనియా గాంధీకి కరోనా సోకిన సంగతి విదితమే.  ఆ సమయంలో ఢిల్లీలోని సర్ గంగారామ్ హస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. కోవిడ్ కారణంగా ఆ సమయంలో ఈడీ విచారణకు హజరు కాలేదు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ జూన్ నెలలో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. అయితే ఆ సమయంలో సోనియా కరోనా బారినపడటంతో విచారణ వాయిదా పడింది. సోనియా గాంధీ పూర్తిగా కోలుకున్న తరువాత జూలైలో ఈడీ విచారించింది. అయితే నెల రోజులు గడవక ముందే సోనియాగాంధీ మరోసారి కరోనా బారిన పడటం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీ కూడా నెల రోజుల వ్యవధిలో రెండో సారి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ప్రియాంకా గాంధీ కూడా ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల సోనియా గాంధీని ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీలో పాటు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఢిల్లీలోని ఆందోళనల్లో కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ ఆందోళనల తరువాత నుంచి ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. సోనియా, ప్రియాంకా గాంధీలతో పాటు కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా, పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కూడా కోవిడ్ బారిన పడ్దారు. ఈ మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా తనకు కోవిడ్ సోకినట్లు.. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఎన్ని డ్రామాలాడినా, ఏకంగా ఎస్పీ చేతే ఆ వీడియోను ఫొరెన్సీక్ పరీక్ష కూడా ఒరిజనలో కాదో తేల్చలేదని చెప్పించినా, ఆ ఎస్పీ చెప్పిన దానిని పట్టుకుని గోరంట్ల మాధవ్ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నా.. దానిని పట్టుకుని మంత్రి రోజా వంటి వారు ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించేసినా నిజం మాత్రం నిప్పులా బయటపడింది. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజనలేనని అమెకిరా ఫోరెనసిక్ ధృవీకరించింది. ఈ విషయాన్ని తెలుగుదేశం నాయకుడు పట్టాభి విలేకరుల సమావేశంలో చెప్పారు. అమెరికా ఫోరెన్సిక్ మాధవ్ పోర్న్ వీడియో కాల్ వీడియో ఒరిజనలేనని ధృవీకరిస్తూ ఇచ్చిన నివేదికను బయట పెట్టారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకోవడానికి ఈ ఆధారం సరిపోతుందా జగన్ రెడ్డీ అని ప్రశ్నించారు.   అసలు ఫోరెన్సిక్ నివేదిక లేకుండానే గోరంట్ల మాధవ్ కు క్లీన్ చిట్ ఎలా ఇస్తారని నిలదీసారు. అమెరికా ఫోరెన్సిక్ నివేదికే సాక్ష్యం గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వీడియో ఒరిజనలేననడానికి అని పట్టాభి అన్నారు. ఈ నివేదిక చాలు గోరంట్ల మాధవ్ ను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడి కావడానికి అని పేర్కొన్నారు. వైసీపీ సర్కార్ పోలీసులను అడ్డం పెట్టుకుని తమ ఎంపీని కాపాడడానికి చూస్తోందని, అందుకే అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ లో వీడియో టెస్ట్ చేయించి నివేదిక బయటపెడుతున్నానని పట్టాభి అన్నారు. గోరంట్ల వీడియో ఒరిజనల్ అని తేలితే చర్యలు తీసుకుంటానని మీడియా ముఖంగా చెప్పిన ప్రభుత్వ సలహాదారు సజ్జల దీనిపై ఏం చెబుతారని ప్రశ్నించారు. ఇలాంటి ఛండాలపు పని చేసిన మాధవ్ సిగ్గూ ఎగ్గూ లేకుండా అనంతపురంలో హోర్డింగ్ లు ఎలా పెట్టించుకుంటారని పట్టాభి అన్నారు.  
దక్షిణ భారతదేశం బీజేపీకి అంతు చిక్కని ప్రాంతం. క‌ర్ణాట‌క‌ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో  ఇంత వరకూ ఆ పార్టీకి   గెలుపు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే బీజేపీ మాత్రం అందని ద్రాక్ష పుల్లన అని వదిలేయకుండా.. దక్షిణాది రాష్ట్రాలలో పాగాకు విశ్వ యత్నం చేస్తోంది.  బీజేపీ మిషన్‌ సౌత్‌కు తెలంగాణ ఇప్పుడు సారవంతమైన ప్రాంతంగా భావిస్తోంది. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు బీజేపీకి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది.  రెండు దఫాలుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత ప్రబలుతోందనడానికి  నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె   కవిత ఓడిపోవడంతో ప్రస్ఫుటమైందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. దీంతో 2019 ఎన్నికలు పూర్తయిన క్షణం నుంచీ బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం ప్రణాళికా బద్ధంగా పని చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.   లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో  17 స్థానాలకు గానూ బీజేపీ  కేవలం నాలుగింటిని గెలుచుకున్నప్పటికీ,   ఓట్ల శాతం 19 శాతానికి పైగా ఉంది. ప్రతిపక్షంగా బలమైన ప్రాంతీయ పార్టీ లేకపోవడంతో, బిజెపి ఆ గ్యాప్ పూర్తి చేయడానికి ప్రయత్నాలు ఉధృతం చేసింది. అలాగే రాష్ట్ర అసెంబ్లీలో కేవలం మూడు స్థానాలు మాత్రమే ఉన్నప్పటకీ, రాష్ట్రంలో ప్రధాన విపక్షాని దీటుగా ఎదిగింది.  తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కి సన్నిహితంగా  ఏఉండటం కూడా బీజేపీకి కలిసి వచ్చిందని చెప్పవచ్చు.  అయితే బీజేపీ మాత్రం ప్రధానంగా తన విమర్శలకు కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిపైనే కేంద్రీకరించడం ప్లస్ పాయింట్ అయ్యిందని పరిశీలకులు చెబుతున్నారు.   అన్నిటికీ మించి బీజేపీకి ఉన్న ప్రధాన ఆకర్షణ   ప్రధాన మంత్రి మోదీ. ఆయనకు ఉన్న జనాకర్షణ, వాగ్ధాటి. ఇటీవలి కాలంలో తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే బీజేపీ ప్రతిపాదించిన అభివృద్ధి నమూనా కూడా ప్రజలను ఆకర్షిస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే  అర్బన్  ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల్లోని యువత మెరుగైన అభివృద్ధి, ఉద్యోగావకాశాల వాగ్దానాలను ఉపయో గించి తమవైపు తిప్పుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికీ అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ జరగలే దని తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న ఆశయాలను కేసీఆర్ విఫలం చేస్తున్నారని బీజేపీ చేస్తున్న ప్రచారం కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అన్నిటికీ మించి ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటం, కాళేశ్వరం వైఫల్యం, వర్గీకరణ అంశం, హామీల అమలు పూర్తి కాకపోవడం వంటి అంశాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నది. 
ALSO ON TELUGUONE N E W S
The Tollywood film industry is once again leading the charge, producing hit after hit. Tollywood, the most fruitful industry during the covid-19 pandemic, is back on track with Bimbisara and Sita Ramam, both of which are on their way to becoming massive blockbusters, and now another Telugu film is about to join the party.     Karthikeya 2, a supernatural adventure thriller starring Nikhil Siddharth, was released in theatres today to a packed house. The film was repeatedly postponed, but the producers never let the buzz die. It was the film that the makers promised would be a big-screen spectacular, and it did not disappoint.     "Karthikeya 2" is getting positive reviews from critics and audiences alike, and the initial box office response indicates that the film will be a sure-shot hit, helping the industry to prolong its winning streak that began with the afore mentioned two films.     The Chandoo Mondeti-directed picture has been assessed at 12 crores in Telugu states, and it appears that the total investment will be recovered within a week. The following few days will be crucial, but with such encouraging reviews, "Karthikeya 2" is unlikely to suffer a setback. It also features significant performances by Anupama Parameswaran and Anupam Kher.
Mohanlal’s highly-anticipated Malayalam thriller Drishyam will get its third part. After the makers brought the highly anticipated movie Drishyam 2 for release on February 19, 2021, director Jeethu Joseph confirmed that he has written a magnificent climax for Drishyam 3.   The preceding two parts created a sensation by impressing both the audience and the critics. The first chapter was remade in several languages and became a huge hit in each. Drishyam 2 in Telugu, starring Venkatesh, was also released in OTT and thrilled the audience.   Today, a poster relating to Drishyam 3 began circulating on social media. Mohan Lal is shown in handcuffs on the poster. The film will be a sequel to Mohanlal's 2021 film Drishyam 2, which picks up where the original film left off. Drishyam 3 The Conclusion will be the series' final part and climax of the series.   Drishyam 2 featured Mohanlal, Meena, Siddique, Asha Sharath, Murali Gopy, Ansiba, Esther and Saikumar in key roles. The film has emerged as a much-needed boost for the Malayalam film industry. The film was scheduled to release last year but the makers had to delay it due to the pandemic. The film once again takes the audience on a journey of lies, deceit, suspicion, conspiracy, and thriller.
Rebel Star Prabhas' close friends production company, UV Creations, which has produced many Telugu films such as Run Raja Run, Mirchi, and Radhe Shyam, among others, has been making efforts to participate in almost all of Prabhas' projects. Attempting to co-produce his films.   However, Prabhas has already completed three films under this banner. Only one of those three films, Mirchi, was a box office success, while Radhe Shyam and Saaho were flops. Also, if Prabhas makes a film under the UV Creations banner, his fans will be upset since film updates will not be released on time, and promotions will be hindered.   That is why they all believe it would be best if he did not do films in UV Creations. However, there is word that Prabhas may surprise his fans. According to reports, Prabhas has given the go-ahead to make a film under the banner of UV Creations.   However, it is still unclear who will direct the film. Previously, there was speculation that the Maruti film will be produced by UV creations. There is still no word on whether the film will be made under this banner or whether another project has been given the go-ahead. But the fans are expressing concern after knowing that Prabhas is doing a movie under this banner again.
Pawan Kalyan been unhealthy since last month, and the doctors who treated him advised him to relax. Pawan Kalyan has recovered after following their advice and instructions. However, those who expect Pawan Kalyan to shoot soon are still waiting for confirmation. The remake of Vinodhaya Sitham is set to begin this month. However, no shooting has yet begun.   There is widespread speculation in Tollywood that Pawan is still in a waiting mood and has not returned to the sets. So when Pawan will emerge on the sets has also become a source of speculation. Also, if filming begins, will he begin work on the Vinodhaya Sitham remake? or  Will he join Hari Hara Veera Mallu sets? This is being discussed among film experts.   Let's see what comes out of Pawan Kalyan's compound in the coming days. Pawan Kalyan, on the other hand, plans to finish these two films and will have a bus trip in AP from Dussehra as part of his political strategy. Fans are curious to see how the filming schedule will be planned in this context.
The film "Sita Ramam," directed by Hanu Raghavapudi and starring Dulquer Salmaan and Mrunal Thakur as hero and heroine, has become a box office smash. While the industry is unsure whether or not the audience will come to the theatres to watch movies, "Sita Ramam" has proven that if the content of the film is strong, the audience will come to the theatres regardless of the circumstances.   In recent years, a beautiful love tale has not hit the theatres. In many such cases, "Sita Ramam" astounded both the audience and the trade circles. Hanu Raghavapudi, the film's director, is now the talk of the industry.   Hanu Raghavapudi, who had no real offers until yesterday, now has many. Even those who felt Hanu Raghavapudi's career was over after "Padi Padi Leche Manasu" are now waiting for him to make another film after the success of "Sita Ramam." Leading production houses are already lining up to work with Hanu Raghavapudi. Hanu Raghavapudi's next film is yet to be officially announced.
Prabhas is now working on Pan India movies. Prabhas, who recently disappointed audiences with 'Radhe Shyam,' has shifted his focus entirely to his own films. He has four films under his belt as of now. One of these is the Prashant Neel project.   The audience has already placed high expectations on this combination. After seeing 'KGF Chapter-2,' the expectations for the Salaar film reached to another level. Meanwhile, it's time for the rebel star fans to rejoice who have been requesting and waiting with bated breath for a update from Salaar.   Today team Salaar announced the date and time for the massive update. Most Violent Man will be arriving on August 15th at 12:58 PM. This news raised expectations and now everyone eagerly awaiting to see what kind of announcement it is.
  సినిమా పేరు: కార్తికేయ-2 తారాగ‌ణం: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష, తులసి, ఆదిత్య మీనన్, సత్య, ప్రవీణ్  మ్యూజిక్: కాలభైరవ సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: చందూ మొండేటి బ్యాన‌ర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుద‌ల తేదీ: 13 ఆగ‌స్ట్ 2022   నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ' 2014లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అప్పుడు ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రూపొందిన 'కార్తికేయ-2' ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'కార్తికేయ'కు సీక్వెల్ కావడంతో పాటు టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో 'కార్తికేయ-2'పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి 'కార్తికేయ-2' ఆ అంచనాలను అందుకుందా? కార్తికేయగా నిఖిల్ అలరించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోనున్నాడా? అనేది రివ్యూలో చూద్దాం.   కథ: కలియుగం ప్రారంభం కావడానికి ముందు, ద్వాపర యుగం ముగింపు సమయంలో శ్రీకృష్ణుడి కాలి కడియం ఓ రహస్య ప్రదేశంలో ఉంచబడుతుంది. భవిష్యత్ లో మానవాళికి వచ్చే ముప్పుల నుంచి రక్షించే శక్తి అందులో ఉంటుంది. దానిని దక్కించుకోవడం కోసం వేల ఏళ్ళ నుంచి ఎందరో ప్రయత్నించి విఫలమవుతుంటారు. ఆ కడియం ఉన్న ప్రదేశాన్ని చేరుకోవాలంటే ఎన్నో రహస్యాలను ఛేదించాలి, ఎన్నో విపత్కర పరిస్థితులను దాటాలి. ఇప్పటికీ ఆ కడియం కోసం కొందరు అన్వేషణ సాగిస్తూనే ఉంటారు. అయితే సమాధానాలు తెలియని ప్రశ్నలకు ఛేదించడం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న డాక్టర్ కార్తికేయ(నిఖిల్).. తనకోసం తల్లి మొక్కిన మొక్కు తీర్చడానికి అయిష్టంగానే ద్వారకకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక నిఖిల్ కి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కొందరు కార్తికేయను అంతమొందించే ప్రయత్నం చేస్తారు. అసలు కృష్ణుడి కాలి కడియానికి, కార్తికేయకి సంబంధమేంటి? కార్తికేయను ఎవరు, ఎందుకు చంపాలనుకుంటున్నారు? అయిష్టంగా ద్వారకకి వెళ్లిన కార్తికేయ ప్రయాణం ఆ తర్వాత ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ ప్రయాణంలో అతను తెలుసుకున్న, ఛేదించిన విషయాలేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   ఎనాలసిస్: పార్ట్-1 లో కార్తికేయ ఒక గుడిలోని మిస్టరీని ఛేదిస్తే, పార్ట్-2 లో ఏకంగా ఒక దైవ రహస్యాన్ని ఛేదించే పనిలో ఉంటాడు. శ్రీకృష్ణుడి కాలి కడియం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చందూ మొండేటి చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్.. వేల సంవత్సరాల క్రితమే మనం దేశంలో ఇప్పుడు మనం చూస్తున్న సైన్స్, టెక్నాలజీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండేది. కృష్ణుడు, ద్వారక ఇవేవీ పురాణాలు కాదు.. మన చరిత్ర. అయితే ఈ విషయాన్ని చెప్పే క్రమంలో ఎన్నో లాజిక్స్ వదిలేసినట్లు అనిపిస్తుంది. ఆ లాజిక్స్ ని పక్కనపెట్టి ఒక సినిమాలా చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పించే అడ్వెంచర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు.   చందూ మొండేటి చెప్పినట్లు పార్ట్-1 చూడని వాళ్ళకి కూడా పార్ట్-2 అర్థమవుతుంది. తెలియని విషయాలను తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్న వ్యక్తిగా కార్తికేయ పాత్ర పరిచయమవుతుంది. కార్తికేయ ద్వారక వెళ్లడం, అక్కడ తన తల్లి మిస్ అవ్వడం, తనని కొందరు చంపడానికి చూడటం, ముగ్ద(అనుపమ పరమేశ్వరన్)తో పరిచయం వంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగింది. ఇక సెకండాఫ్ మరింత ఉత్కంఠభరితంగా, ఆకట్టుకునేలా సాగుతుంది. మనకి క్లైమాక్స్ ఏంటో తెలిసినప్పటికీ బోర్ కొట్టకుండా నడిపించిన విధానం ఆకట్టుకుంది. సెకండాఫ్ లో వచ్చే కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. ముఖ్యంగా అనుపమ్ ఖేర్ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆయన కృష్ణుడి గురించి చెప్పే క్రమంలో వచ్చే సంభాషణలు కానీ, ఆ సన్నివేశానికి తగ్గట్లు వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆడియన్స్ కి గూజ్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.   కొన్ని కొన్ని సన్నివేశాలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం సినిమా ఆకట్టుకునేలా ఉంది. అనవసరమైన లవ్ ట్రాక్, సాంగ్స్ ని ఇరికించే ప్రయత్నం చేయకుండా.. కథని పక్క దారి పట్టించకుండా దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ ని చెప్పడం బాగుంది. ఒకవేళ లవ్ ట్రాక్, సాంగ్స్ ఇరికించినట్లైతే నిడివి పెరిగి, కథనం ఇప్పుడున్నంత గ్రిప్పింగ్ గా అయితే సాగేది కాదు.   ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, కాలభైరవ మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచాయి. చందూ మొండేటి విజువలైజేషన్ కి కార్తీక్ సినిమాటోగ్రఫీ తోడై బ్యూటిఫుల్ అవుట్ పుట్ వచ్చింది. ఎడిటర్ కూడా కార్తీకే కావడం మరింత కలిసొచ్చింది. సన్నివేశాలను కెమెరాలో ఎంత అందంగా బందించాడో, ఆ సన్నివేశాల కూర్పు కూడా అంతే అందంగా చేశాడు. ఇక కాలభైరవ తన అనుభవానికి మించి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. తన మ్యూజిక్ తో ఎన్నో సన్నివేశాలను మరోస్థాయికి తీసుకెళ్లాడు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఆకట్టుకుంది. కొన్ని కొన్ని సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ వర్క్ శభాష్ అనేలా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.   నటీనటుల పనితీరు: కార్తికేయ పాత్రలో నిఖిల్ చక్కగా ఒదిగిపోయాడు. తన ముఖ కవళికలు, హావభావాలలో ఎంతో పరిణితి కనబరిచాడు. అనుపమ కూడా ముగ్ద పాత్రను సునాయాసంగా చేసింది. ప్రత్యేక పాత్రలో మెరిసిన అనుపమ్ ఖేర్ ఉన్నది కాసేపే అయినా తన నటనతో కట్టి పడేశారు. శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష ఉన్నంతలో బాగానే నవ్వించారు. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి తన కామెడీ టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. తులసి, ఆదిత్య మీనన్, సత్య, ప్రవీణ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.   తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్: గత వారం విడుదలైన 'బింబిసార', 'సీతా రామం' సినిమాలు విజయాలను అందుకొని టాలీవుడ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పుడు 'కార్తికేయ-2' రూపంలో మరో విజయం వచ్చినట్లే అని చెప్పొచ్చు. థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులను నిరాశపరచకుండా కథాకథనాలు, విజువల్ పరంగా మంచి థ్రిల్లింగ్ అనుభూతినిచ్చే సినిమా 'కార్తికేయ-2'.   రేటింగ్: 3/5  -గంగసాని
Story: Dr. Karthikeya (Nikhil) is a rational individual who seeks scientific explanations for superstitions. Karthikeya pursues an incident to highlight an interesting point about Lord Krishna. At this point, Mugdha (Anupama Parameswaran) and Srinivasa Reddy are in trouble due to gangs seeking for Lord Krishna's jewels. What challenges did Karthikeya encounter after that? What adventure awaited him after that? The true plot of the film is what he learned about Lord Krishna during this process.   Analysis: Karthikeya 2, the sequel to the 2014 film Karthikeya, has been widely awaited since its beginning.  A major plus point is that director Chandoo Mondeti gets the story lead when he comes to the sequel. The audience gets more connected to the story as it progresses. The new elements were highlighted by a fresh backdrop. During the interval, the team was also successful in keeping the audience interested in the block. The elevated moments in the second half regarding Lord Krishna were equally remarkable. The first half of the film centres around Dwarka and a hidden society seeking Lord Krishna-related ornaments. The majority of the situations in the second half are linked to those in the first half, and the adventure continues. There are numerous distinctions between Karthikeya and Karthikeya 2. The first part was a spoof horror, a short thriller with solid mystery aspects. It appears to have been improved in every way in the sequel. The mystery adventure genre is prominently featured. On the other side, the director who conveyed some truths brought out the spiritual feeling really well. He delivered an excellent presentation without divulging any sensitive topics. This is thought to be highly commercially beneficial for the response curve to Hindu films. Furthermore, it has the potential to be a good pan-India film. Nikhil's performance as Karthikeya is outstanding. His gestures in the second half adventure scenes are particularly impressive. On the other hand, the heroine Anupama's role was underutilised. And the rest of them played great in their roles. This film's background music excels in maintaining the intensity. Some of the standout scenes deserve special mention since Kaala bhairava's soundtrack lifted them to new heights. Apart from some predictable scenes and unnecessary characters, there isn't much to criticise about the film. However, there are several sequences in the early half that appear a little boring. Finally, it can be stated that Karthikeya will be a film that will do well at the box office this holiday season.
This week's main release is Laal Singh Chaddha. The primary actors in this official remake of the Hollywood classic Forrest Gump are Aamir Khan and Kareena Kapoor. The film was a huge letdown for the crowd. Many components of the film bombed at the box office on the first day.     On the first day, this film grossed Rs. 11.63 crore. According to rumours, numerous shows have been cancelled due to a lack of demand in this film. This is a low result for this Bollywood giant, who also fell short of Young superstar Karthika Aryan's "Bhool Bhulaiya 2" Day 1 collections. Even after receiving excellent reviews, Akshay Kumar's Raksha Bandhan is failing at the box office.     The second day is considerably worse for both films. Many theatres cancelled shows due to a lack of audiences, and the situation is much worse in Telugu states.     Naga Chaitanya, a Tollywood young hero, also appeared in Laal Singh Chaddha. The film is directed by Advait Chandan and produced by Aamir Khan Productions, Viacom 18 Studios, and Paramount Pictures. Pritam composed the music for this Biggie. It remains to be seen how well the film performs in the long run.
The special shows of Pokiri were screened in as many as 369 theaters across Andhra Pradesh and Telangana. Almost all of these shows ran with packed houses. The mass euphoria in every theatre is unimaginable and the collections are also on massive level.     The most recent developments indicate that the stage is being prepped for Pawan Kalyan's Jalsa special shows. Yes, Powerstar Pawan Kalyan's massive comeback film is set to be re-released. Today, celebrity fan Sai razesh shared the exciting news that 4K Print is now available for the film. In addition, he stated that senior fans will organise special shows in both Telugu states.     Apparently, Jalsa special shows will be screened across the Telugu states very soon. It could well be on the occasion of Pawan Kalyan’s birthday, which is on the 2nd of September. But the same is yet to be confirmed though.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్….. అంటాడు ఓ కవి. ఓడిపోవడం మాట అటుంచితే ఈ కుడి ఎడమ అయినందుకు అదృష్టమే ఎడమచేతిలో వచ్చి పడ్డట్టు అనిపిస్తుంది వివరాలు అన్నీ తెలిస్తే.  సాధారణంగా ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏదైనా పని చేయాలన్నా ఇతర ఏ విషయాలలో అయినా కుడిచేయి వాడటం సహజం. కనీసం ఎదుటివారు పలకరించినపుడు ఆప్యాయంగా అందుకునే షేక్ హాండ్ అయినా సరే కుడిచేత్తో ఇవ్వడం ఒక సంస్కారం, ఇంకా చెప్పాలంటే అదొక గౌరవం కూడా. భోజనం, పూజలు పునస్కారాలు, దైవకార్యాలు, బట్టలు వేసుకునేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి అనే సెంటిమెంట్ చాలా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు అక్షరాలు దిద్దడానికి బలపాన్ని కుడిచేత్తో కాక ఎడమచేత్తో పట్టుకున్నప్పుడు, అక్షరాలు ఎడమచేత్తో దిద్దుతున్నప్పుడు పిల్లలను చాలా వారిస్తారు. వారితో ఎడమచేతి అలవాటు మాన్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు.  కానీ అందరూ తెలుసుకోవలసినది ఏమిటంటే ఎడమచేతి వాటం తప్పేమీ కాదు. ఇంకా చెప్పాలంటే అదొక గొప్ప ప్రత్యేకత, అదొక అదృష్టం అంటున్నారు ప్రపంచ విశ్లేషకులు.  ప్రతి సంవత్సరం ఆగస్ట్ 13 న ఎడమచేతివాటం ప్రజల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సమస్యలు మొదలైన విషయాల మీద చర్చించాల్సిన అవసరం ఉంటుంది. బడిలో పిల్లలు పక్కపక్క కూర్చుని రాసుకునేటప్పుడు కుడి, ఎడమ చేతివాటం కలవారు పక్కపక్కనే ఉంటే చెప్పలేనంత ఇబ్బంది ఉంటుంది. సాధారణంగా ఈ ప్రపంచం మొత్తం మీద 90% మంది కుడిచేతివాటం కలవారు అయితే 10% మంది ఎడమచేతివాటం ఉంటారు. ప్రతి పదిమందిలో ఒకరు ఎడమచేతి వాటం వారుంటారని సర్వేలు తెలుపుతున్నాయి. కానీ కుడిచేతివాటం అనేది సాధారణం కాబట్టి, ఎడమచేతివాటం వారికి అక్కడక్కడా అవమానాలు, విమర్శలు ఎదురవుతుంటాయి.  అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఎడమచేతివాటం వారే భవిష్యత్తులో గొప్ప స్థానానికి చేరుతారని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచం మొత్తం మీద ప్రముఖులుగా గుర్తింపబడిన వారిలో ఎడమచేతి వాటం వారు ఎక్కువగా ఉన్నారని చెబుతారు. దాదాపు 10 నుండి 12 శాతం మంది ఎడమచేతివాటం ప్రముఖులు ఉన్నారట. ప్రత్యేకతలు!! ఎడమచేతివాటం వారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అవే వారిని ఉన్నతమైన వారిగా మలుస్తాయని చెబుతారు.  వీరిలో స్వతంత్ర్యభావాలు ఎక్కువ, జ్ఞాపకశక్తి, ఏదైనా సాధించాలనే పట్టుదల, ముఖ్యంగా గొప్ప సృజనాత్మకత వీరిలో ఉంటుంది. గొప్ప లక్ష్యాలను ఏర్పరుచుకోవడమే కాదు, ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నాలు కూడా ఎంతో పట్టుదలతో చేస్తారు. ఇంకా చెప్పాలంటే కలలు కనడం వాటిని సాకారం చేసుకోవడం వీరిలో ఉన్న గుణం. వీరు బహుముఖ ప్రజ్ఞను కలిగి ఉంటారు. ఒకేసారి ఎక్కువ పనులను చేయగల సత్తా వీరిలో ఉంటుంది.  కళలు, భాష, సంగీతం వంటి రంగాలలో వీరు ఎక్కువ నైపుణ్యం కలిగిఉంటారట. పైన చెప్పుకున్నవన్నీ వీరిలో ప్రత్యేకలు అయితే వీరు బొమ్మలు గీయడంలో ఎడమవైపు వంపులున్న చిత్రాలు బానే గీస్తారట, కానీ కుడివైపు వంపులున్నవి గీయడానికి కష్టపడతారట. ఎడమచేతివాటం వారిలో మెదడు సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇంకా వీరు మానసిక రుగ్మతలతో ఎక్కువగా ఇబ్బంది పడుతారట.   వారికున్న మరొక సమస్య ఏదైనా శుభకార్యాలు పండుగలప్పుడు వారు తొందరగా ఎడమచెయ్యి వాడేస్తుంటారు. అందరూ దాన్నేదో అపశకునంగా  భావిస్తారు. ఇదే వారికి పెద్ద సమస్య.  కుడిచేతివాటం వారి కోసం తయారుచేయబడుతున్న ఎన్నో వస్తువులు ఎడమచేతివాటం వార సరిగా ఉపయోగించలేరు. ఈ కారణం వల్ల ప్రతి సంవత్సరం 2500 మంది ఎడమచేతి వాటం వారు మరణిస్తున్నారట.  ఇవీ వీరి ప్రత్యేకతలు వీరు పడే అగచాట్లు. ఇకపోతే ఎడమచేతి వాటం వారిలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక, క్రీడా రంగాల్లో ఎందరో ప్రముఖులు ఉన్నారు.  రాణీ లక్ష్మీబాయి, మహాత్మాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌, చార్లెస్‌ డార్విన్‌, న్యూటన్‌, బెంజిమిన్‌ ప్రాంక్లిన్‌, బిల్‌క్లింటన్‌, జార్జిబుష్‌, ఒబామా, రతన్‌టాటా, సచిన్‌ టెండూల్కర్‌, రవిశాస్త్రి, సౌరవ్‌గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, శిఖర్‌థావన్‌, కుంబ్లే, జహీర్‌ ఖాన్‌, అమితాబచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, మహానటి సావిత్రి, సూర్యకాంతం, మమ్ముట్టి ఇలాంటి ప్రముఖులు ఉన్నారు.  అందుకే మరి కుడి ఎడమ అయితే ఖంగారు వద్దు. పిల్లలు ఎడమచేతి వాటంగా తయారయ్యారని బెంగ వద్దు. కుదిరితే వాళ్లకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేసిపెట్టండి. ఏమో మీ పిల్లల పేరు ఏ ప్రముఖుల మధ్యనో చేర్చబడచ్చు.                                      ◆నిశ్శబ్ద.
ఆగష్టు 12న అంతర్జాతీయ యువ దినోత్సం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. యువతలో లోపించేది నమ్మకం, ఆత్మవిశ్వాసం, పట్టుదల. యువత చిన్న చిన్న వాటికి నిరుత్సాహానికి లోనవుతుంటారు. ఏమి చేస్తే విజయం సాధించగలమో, యువతకు చదువు ఎంత అవసరమో, మానసిక పరిణితి ఎలా ఉండాలో తెలుసుకుంటే యువత ఆలోచనల్లో మార్పు మొదలవుతుంది. అందుకే యువతను ఉత్తేజపరిచే వాక్య ప్రవాహంలోకి వెళ్లాలిప్పుడు!! సమాజంలో మనం ఏదైనా సాధించాలంటే చదువు చాలా అవసరం...! చదువుంటే మనిషికి విలువ కూడా పెరుగుతుంది. విలువ పెరగడం ద్వారా మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే విజయసోపానం అవుతుంది. ఎందుకంటే మన అందరికి విజయాలకు తొలిమెట్టు నమ్మకం కాబట్టి!! ఏ పనైనా చెయ్యగలమనే నమ్మకం మన మీద మనకు ఉన్నప్పుడు అవకాశాలను మనమే సృష్టించుకోగలుగుతాము. ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం విజేతలు ఎలా కావాలో. ఏం చేస్తే విజయం లభిస్తుందో తెలుస్తుంటుంది. కొన్ని కొన్ని అవకాశాలను మనం వినియోగించుకుంటున్నప్పుడు వాటి ద్వారా మనం ఓర్పు, మానసిక ధైర్యాన్ని పొందుతాము. విజేత కావాలనుకునే వ్యక్తికి ఓర్పు, మానసిక ధైర్యం చాలా అవసరం. విజయాన్ని సాధించాలి అనే ఆలోచన మనలో వున్నప్పుడు అనుకోకుండా సమయాన్ని సేవ్ చేసుకునే ఒకానొక లక్షణం చేసే  మనలో ఏర్పడుతుంది. సమయాన్ని సేవ్ చేయడం అనేది సాధారణమైన విఆహాయం కాదు. విజయం సాధించాలంటే మొదట సమయం ఎంత విలువైనదో అర్థం కావాలి.   మనం పట్టుదలతో ఉన్నప్పుడే విజయం మన సొంతమవుతుంది. అలాగే మంచి  వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే మంచి వ్యక్తిత్వం ద్వారానే సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తించబడతాము. ఇక్కడ మంచి వ్యక్తిత్వం అంటే ఏంటి అని ఆలోచన వస్తే సమాజ ఆమోడయిగ్యమైనది మాత్రమే కాదు నైతిక విలువలు కలిగినదే మంచి వ్యక్తిత్వం. ఇది ఉంటే  నిరాశావాదాన్ని తరిమికొడుతుంది. ఆ  నిరాశావాదం లేకపోతే అపజయం అనే మాట వినబడదు.   ఆశ అనేది మనుష్యుల్లో నమ్మకాన్ని, బాధ్యతలను పెంచుతుంది. మనం బాధ్యతలను స్వీకరించడం ద్వారా కొంత వరకు కొన్ని కొన్ని విషయాలలో అనుభవాన్ని పొందవచ్చు. ఈ అనుభవం అనేది విజయానికి తోడ్పడుతుంది. అలాగే మనం చేసే పనిమీద నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. నమ్మకం లేకపోతే మనం ఏ పని చేయలేము. పండు కాస్తుంది, లేక పువ్వు పూస్తుంది అన్న నమ్మకం వల్లే మనం మొక్కల్ని నాటుతాము. ఆ నమ్మకమే లేకపోతే మనం మొక్కల్ని కూడా నాటం. మనకు మనం చేసేపని ద్వారా ఫలితం వస్తుంది అన్న భావన వుండడం వల్లనే మనం అన్ని పనులూ చేయగలుగుతున్నాము. ప్రతి మనిషికి లక్ష్యం అనేది వుండాలి. లేకపోతే మనిషి జీవితం నిస్సారంగా వుంటుంది. అందుకే ప్రతీ మనిషి లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్న లక్ష్యాన్ని ఏకాగ్రతతో సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఆ లక్ష్యాన్ని సాధించే మార్గంలో కొంతమంది స్నేహితులు ఎదురువుతారు. మనం నిజమైన స్నేహితులను ఎన్నుకోవాలి. అదేవిధంగా మనం ఇతరులకు మంచి స్నేహితులుగా నిలిచిపోవాలి. మనం ఏ విషయంలో కూడా మొహమాట పడకూడదు. మొహమాటపడడం వల్ల కొన్ని కొన్నిసార్లు నష్టపోవలని వస్తుంది.  మన విజయ సాధనలో జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి. ప్రతీక్షణం సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడటాన్ని ఇష్టపడాలి, అవిశ్రాంతంగా కృషి చేయాలి. కష్టేఫలి అన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు. కష్టంలేకపోతే ఫలితం కూడా లేదు. మనం కష్టపడినప్పుడు ఫలితం లభిస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనం ఏర్పరచుకున్న మంచి లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాలి. అందులో మనం మంచినే గ్రహించడానికి ప్రయత్నించాలి. మంచి వల్ల మనలో పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి. ఏ పనినైనా ఇష్టంతో చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇష్టంతో చేస్తే కష్టాన్ని మర్చిపోవచ్చు. ఏ విషయంలో కూడా భయపడకూడదు. భయం అనేది మనల్ని వెనుకడుగు వేసేలాగా దోహదపడుతుంది. జీవితం అంటేనే సుఖదు:ఖాలమయం. రెండూ అనుభవించినప్పుడే జీవితం యొక్క విలువ మనకు అర్ధమవుతుంది. ఈ సుఖ దుఃఖాలను అనుభవించే సమయంలో మనకు అహంకారం అనేది పెరిగిపోతుంది. అహంకారం వల్ల అపజయాలు ఎదురవుతాయి. అందుకే వినయవిధేయతలే విజయాన్ని నిర్దేశిస్తాయంటారు పెద్దలు. కాబట్టి నమ్మకం నుండి వినయంగా నడుచుకోవడం వైపు యువత ప్రయాణం సాగాలి.                                                         ◆నిశ్శబ్ద.
ఈ ప్రపంచంలో రేపు ఎలా ఉంటుంది అనేది యువత మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే యువతలో ఉత్సాహం, వారి ఆలోచనలు, వారి ప్రణాళికలే రేపటిని గొప్పగా ఉంచాలన్నా, అధఃపాతాళంలోకి నెట్టివేయలన్నా మూలకారణం అవుతాయి.  నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు, నేటి యువత రేపటిని నడిపించే బాధ్యతాయుత సూత్రధారులు  అవుతారు. ప్రపంచం మొత్తం మీద జనాభాలో యువత శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే యువత ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిలో నిరుద్యోగం ఎంతో ముఖ్యమైనది. డిగ్రీ పట్టాలు చేతిలో ఉన్నా, ఉన్నత విద్యలు చదివినా ఉద్యోగ అవకాశాలు సరైనవిధంగా లేక మిగిలిపోతున్న యువత ఎందరో ఉన్నారు. అయితే యువతకు సరైన మార్గం చూపేందుకు ఈ ప్రపంచం కూడా కృషి చేస్తోంది. అంతర్జాతీయ యువ దినోత్సవ కర్తవ్యం అదే. తేడా!! చాలామంది యువ దినోత్సవం అని వినగానే అది వివకానందుడి జన్మదిన సందర్భంగా నిర్వహించుకునే జాతీయ యువజన దినోత్సవం అని అనుకుంటారు. అయితే జాతీయ యువజన దినోత్సవానికి, అంతర్జాతీయ యువ దినోత్సవానికి మధ్య బేధాన్ని గుర్తించడం అవసరం. అంతర్జాతీయ యువ దినోత్సవం!! ఈ ప్రపంచంలో ఉన్న యువతకు సరైన మార్గనిర్దేశకత్వం  అవసరమని, వారికి సరైన సలహాలు, సూచనలు దొరికితే ఈ ప్రపంచాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ప్రపంచదేశాల అభిప్రాయం. దానికి అనుగుణంగానే 1999లో 54/120 అనుసరణ ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న అంతర్జాతీయ యువ దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించారు. కార్యక్రమాలు!! ప్రతి రోజుకూ ఒక ప్రత్యేకత ఉన్నట్టు, ఆ ప్రత్యేకమైన రోజు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం సహజం. అంతర్జాతీయ యువ దినోత్సవం రోజున యువతకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయడం, ఆచరణ విషయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, వాటిని అధిగమించేందుకు పరిష్కారాలు, యువత తమ ఆలోచనలను, నైపుణ్యాలను పెంచుకునేందుకు అవగాహన కల్పించడం. ప్రపంచ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడం, వర్క్ షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేసి యువతలో ఉన్న నైపుణ్యాలు బయటకు తీయడం చేస్తారు. యువత కోసం కొన్ని మాటలు!! స్వేచ్ఛ అనేది అడగాల్సినది కాదు అది ఎవరికి వారు తీసుకునేది అంటారు సుభాష్ చంద్రబోస్. యువతకు లభించే స్వేచ్ఛ వారిని అభివృద్ధి చేసేదిగా ఉండాలి. ఆ అభివృద్ధి దేశాన్ని కూడా ముందుకు నడిపించగలగాలి. యువతలో ఉండే విభిన్న ఆలోచనలను నిరుత్సాహ పరచకుండా వారిని ప్రోత్సహించాలి. యువత గట్టిగా ఏదైనా నమ్మితే దాన్ని సాధించే ఆవేశం, కసి, పట్టుదల వారిలో ఉంటాయి కాబట్టి సాధించగలరు. కావాల్సిందల్లా వారిని ప్రోత్సహించడమే. భారంగా మారిన నాలుగు మేఘాలు ఆకాశంలో పక్కపక్కనే చేరితే కుండపోతగా వర్షం ఎలా కురుస్తుందో, మెండైన ఆలోచనలు కలిగిన యువకులు ఒకచోట చేరితే ఎంతో గొప్ప ఆలోచనలు కలుగుతాయి. ఎన్నో గొప్ప అద్బుతాలు ఈ ప్రపంచానికి పరిచయం అవుతాయి.  చట్టపరంగానూ, సమాజికంగానూ, ఆర్థిక, కుల, మత బేధాలతో ఎన్నో అవకాశాలు అందుకోలేకపోతున్న యువతకు తెలియాల్సిన విషయం ఒకటుంది. తమ ప్రతిభే తమా భవిష్యత్తుకు, తమ జీవితానికి పెట్టుబడి అనే విషయం గ్రహించడం. కాబట్టి యువత తమ జీవితాన్ని దురదృష్టం పేరుతోనో, నమ్మకాల పేరుతోనో, సోమరితనంతోనో, ఇంకా అవకాశాలు లేవని చెబుతూనో చేజార్చుకోకుండా అవకాశాలను సృష్టించుకుంటే అది యువత శక్తి అవుతుంది.                                     ◆ నిశ్శబ్ద.
కొన్ని రకాల ఆహారాల వల్ల లాభము నష్టము ఉందన్న విషయం మీకు తెలుసా? ఇది నిజం అనికొన్ని పరి శోదనలు నిరూపించాయి.అసలు మానవులు దీర్ఘకాలం ఎలా జీవించాలి? ప్రతిఒక్కరు వారు దీర్ఘకాలం పాటు జీవించాలని కోరుకుంటారు. వరల్డ్ లైఫ్ ఎక్స్ పెక్టేన్సీ ఇచ్చిన సమాచారం ప్రకారం భారత్ పురుషులు 69.5 సంవత్సచ్చరాలు మహిళల వయస్సు 72.2 సంవత్చరాలు జీవిస్తున్నారు.గుండె సంబందిత రోగాలు, ఊపిరి తిత్తుల వ్యాధులు, వివిధరకాల స్ట్రోక్లు,డయాబెటిస్ తోపాటు దాదాపు దాదాపు 5౦ రకాల వ్యాధుల వల్ల మానవుల ఆయుహ్ ప్రమాణం తగ్గిపోతోంది. చిన్న వయస్సులో మరణాలు సంభవిస్తున్నాయి. సైన్స్ ఏమంటోంది అంటే ఎవరైతే మంచి ఆహారం తీసుకుంటారో వారి వయస్సు పెరుగుతుందని.ఎవరైతే సరైన పోషక ఆహారం తీసుకోరో వారివయస్సు తగ్గిపోతుందని మీరు దీర్ఘకాలం పాటు జీవించాలంటే ఇది  చదవండి.ఈ ఆహారం తీసుకుంటే వయస్సు తగ్గిపోతుంది వివిదరకాల కద నాల ప్రకారం నిపుణులు ఏమని అంటున్నారంటే కొన్నిరకాల ఆహారాలు వారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందని. ఒకపరిశోదనలో తేలిందని అన్నారు. కొన్నిరకాల ఆహారాలు ఎలాఉంటాయంటే మీవయస్సు 2 నిమిషాలపాటు పెరిగిపోతుంది. కొన్ని ఆహారాల వల్ల మీ వయస్సు తగ్గిపోతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.ఉదాహరణకు నట్రాస్ సర్వింగ్ వల్ల 26 నిమిషాలపాటు పెరిగిపోతుంది.కాని హాట్ -టాంగ్ సర్వింగ్  తీసుకుంటే వారి వయస్సు ౩6 నిమిషాలు మీవయస్సు తగ్గిపోతుంది.దీంతోపాటు పీనట్ బట్టర్ జాం సాండ్ విచ్ వంటివి మీ వయస్సును అరగంటలో పెంచేస్తాయి. 1౦౦౦ రకాల ఆహారాల పై పరిశోదన... సహజమైన ఆహారం అంశం పై చేసిన పరిశోదనల ప్రకారం వ్యక్తి జీవన స్తితిగతిలో మంచిగుణాలు అలవాట్లు పై ఆధారపడి ఉందని.పరిశోదనలో శాస్త్రజ్ఞులు దాదాపు 6,౦౦౦రకాల వేరు వేరు అంశాలు అంటే అల్పాహారం మధ్యాహ్న భోజనం,ఇతర పానీయాలపై పరిశోదనలు చేసారు.ఎవరైనా ఒక వ్యక్తి ప్రాసెస్ చేసిన మాంసం తీసుకుంటారో వారు ప్రతిరోజూ వారు 48  అదనపు సెకండ్లు వారు బరువు పెరుగుతుంది. ఇది తింటే తప్పనిసరిగా మీ వయస్సు తగ్గుతుంది... ఈ పదార్ధాలు తింటే తప్పనిసరిగా తింటే మీ వయస్సు తగ్గుతుంది.అందులో ఒకటి డాంట్ -డాంగ్...మీజీవితాన్ని ౩6 నిమిషాలు తగ్గిస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసం జీవితాన్ని 26 నిమిషాలు తగ్గిస్తుంది.  చీజ్ - బర్గర్...మీ వయస్సు 8.8 నిమిషాలు తగ్గిస్తుంది సాఫ్ట్ డ్రింక్స్...మీజీవితాన్ని 12.4 నిమిషాలు తగ్గిస్తుంది. పిజ్జా...మీ వయస్సును 7.8 నిమిషాలు తగ్గిస్తుంది. ఈ పదార్ధాలు తింటే మీ వయస్సు పెరుగుతుంది... కొన్ని పదార్ధాలు తీసుకుంటే వయస్సు పెరుగుతుంది అలాగే మరికొన్ని పదార్ధాలు తింటే వయస్సు పెరుగుతుంది.  పీనట్ బట్టర్ జామ్,సాండ్ విచ్...మీ వయస్సు ౩౩.1 నిమిషం పెరుతుంది. ఉడికించిన సాల్మన్ చేపలు...1౩.5 నిమిషాల వయస్సు పెంచుతుంది. అరటి పండు...మీ వయస్సును 1౩.5 నిమిషాలు పెంచుతుంది. టమాటా...మీ వయస్సు ౩.8 నిమిషాలు పెంచుతుంది. అవకాడో...మీ వయస్సును 1.5 నిమిషాలు పెంచుతుంది. మీఆరోగ్యం సరిగా ఉండాలంటే మీ ఆహారంలో మార్పులు చేయాలి. పరిశోదనా ఉద్దేశ్యం... ఆరోగ్యం,పార్యవరణ ప్రభావం ,భోజన ప్రభావం రెండింటిని చూడాలి. నిపుణుల సూచనల ప్రకారం సాల్మన్ చేపలలో కొన్నిరకాల పోషకాల న్యుట్రీ షియన్ విలువలు ఉన్నందున జీవితం 16 నిమిషాలు పెరగ వచ్చు. పరిశోదనల సభ్యుల బృందం లో ఒలేవియర్ జూలియట్ మాట్లాడుతూ పరిశోదనల ఫలితాలు ముందుకు వచ్చాయని.ప్రజలు వారి వారి ఆరోగ్యం పర్యావరణం అద్భుతంగా నిర్మాణం చేసుకోవచ్చని. దాని ద్వారా సహకారం లభిస్తుందని మానవ ఆరోగ్యం పర్యావరణం మధ్య సమతౌల్యం సాధించేందుకు మన ఆహారం లో మార్పులు చేయాలని సూచించారు.  
అన్ని ఉన్నా ఆరోగ్యం లేకుంటే మనిషిజీవితం వృధా . ఆరోగ్యంగా ఉంటేనే బతుకు.ఆరోగ్యంగా ఉంటేనే అడవిలోనైన బ్రతికేయవచ్చు. వందేళ్ళు నిండు నూరేళ్ళు బతకచ్చు అని నిపుణులు నిరూపించారు. నేను అంటున్న మాట మనిషికే కాదు ప్రతిజీవికి ఇదే సూత్రం వర్తిస్తుంది అని అదే మనుగడ లో ముఖ్యమన సూత్రమని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎరోగాలు రాకుండా ముందుజాగ్రత్త తీసుకుంటే జబ్బులు వచ్చిన వెంటనే చికిత్చ తీసుకోవాలి.బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యంగా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధాన మని.జీవితం అంటే అందమైన హరివిల్లు జీవితం కలర్ ఫుల్ గా ఉండాలని అంటారు అలాగే జీవితానికి కలర్స్ కి సంబంధం ఏమిటి అన్నదే పెద్ద సందేహం అసలు కొన్ని రకాల సమస్యలకి కలర్ తెరఫీ చికిత్చ చేయవచ్చని అంటున్నారు నిపుణులు ఏమిటి కలర్ తెరఫీ దానిగురించి తెలుసుకుందాము.సూర్యరస్మి మనకు తెల్లగా కనిపిస్తుంది. కాని సూర్యరస్మిలో 7 రంగులు ఉంటాయి. అన్నవిషయం అందరికీ తెలుసు. మానవ శరీరంలో 7 చక్రాలకు 7 రంగులకు సంబంధం ఉందని అలాగే 14 మేరీడియన్స్ 2,72,౦౦౦ వేల నాడులపై ప్రభావం చూపిస్తుందని మానవ శరీరం పై సూర్య కిరణాలు ప్రసరింప బడలేదో దానికి సంబందించిన చక్రం నాడులు దెబ్బతింటాయని ప్రాచీన వైద్యం చెపుతోంది.సూర్యకిరణాలు రంగులు శరీరంలోని వాత,పిత్త,కఫ, దోషాలను సవరించేది సమతౌల్యం చేస్తుంది.సూర్యరశ్మిలోని వివిధరంగులు వాటి ఉపయోగాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం.  గమనిక.. కలర్ థెరఫీ లేదా ఇతరాచికిత్చలు ప్రధమ చికిత్చ మాత్రమే అని మంచి చికిత్చకోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.కలర్ తెరఫీ నికేవలం ప్రాత్యామ్నాయ వైద్య విధానం గా భావించాలని ప్రాముఖ్య మైనదిగా భావిస్తున్నారు.నిపుణులు. ముఖ్యంగా మనకు ఇంద్ర ధనుస్సు లో కనిపించే సహజ రంగులన్నిటికీ స్వస్థత చేకూర్చే గుణాలు ఉన్నవిషయం మనకు తెలుసు.ముఖ్యంగా సూర్య రశ్మి లేనిదే జీవరాసి కి మొక్కలకు మనుగడ లేదన్నది వాస్తవం. ముఖ్యంగా సూర్యారస్మికి ఆరోగ్యానికి సంబంధం ఉందని ఒక్కో సారి బాగా మబ్బు పట్టిన సమయంలో రెండు రోజులపాటు సూర్యుడు కనపడకుంటే ఆరోగ్యంగా ఉండలేమని పేర్కొన్నారు. సూర్యరస్మి లేకుంటే ఆందోళనకు గురిఅవుతారని కొందరు సూర్య దర్శనం కానిదే ముద్దకూడా ముట్టరని అంటారు. చీకట్లో ఉండలేరని మనసికరోగులు వెలుతురు చూడలేరని వెలుతురు లేకుంటే వ్యక్తులు ఒత్తిడికి అంటే డిప్రెషన్ కు గురి కవడాన్నిఅనేక పరిశోదన లలో  గమనించవచ్చు.అందుకు కలర్ తెరఫీ సాధన చేసేవారు అటు రంగులను ఇటు వెలుతురును తమ పరికరాలలో ఉపయోగిస్తూ ఉంటారు.  కలర్ తెరఫీ మానసిక బౌతిక ఉదేవగాలకు,ఆధ్య్యాత్మిక సమస్యలకు వేటి కైనా ఉపయోగించ వచ్చునని నిపుణులు విశ్లేషించారు. కలర్ తెరఫీ చరిత్ర... కలర్ తెరఫీ ప్రాచీన ఈజిప్ట్ లో పుట్టిందని తెలుస్తోంది. వివిధ ప్రాచీన నాగరికతలలో కూడా దీనిని ఉపయోగిస్తున్నట్లు పరిశోధకులు శాస్త్రజ్ఞులు వెల్లడించారు. రంగులు వెలుగులపై విస్తృతంగా చేసిన పరిశోదన లలో వ్యాక్తులలో భావోద్వేగా పరమైన ప్రతిస్పందనలు కలిగిస్తాయని చెబుతున్నారు. అయితే ఒకరంగు పట్ల అందరూ ఒకేలా స్పందించక పోవడం విచిత్రంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. మనం ఆకర్షిత మయ్యే రంగులు మనలో మనలో అసమతౌల్యత ఉందొ పట్టి చెప్తాయని కొన్నిరంగులు మనలో సానుకూల భావాలు మరికొన్ని ప్రతికూల భావాలు,రేకేత్తిస్తాయని వీటిని అధ్యయనం చేసిన వారే కలర్ తెరఫీ చేస్తారు. కలర్ తెరఫీ కి వాడే పరికరాలు... రత్నాలు,కొవ్వొత్తులు,దీపాలు,క్రిస్టల్ క్రిస్టల్ లేక గాజు పట్టకం,రంగు బట్టలు,రంగునీటితో స్నానపు చికిత్చ,రంగుకళ్ళ జోళ్ళు, లేజర్లు ప్రధానంగా ఈ పరికరాలను దేరపిస్ట్ చికిత్చ చేస్తారు.ముందుగా మనం వేసుకునే ఎంచుకునే దుస్తులు రంగులు వాటి ప్రభావాల గురించి తెలుసుకుందాము.కొన్ని దుస్తులు గమనిస్తే లేతరంగుల్లోనే ఉంటాయి. వారికి ఆహ్లాదాన్ని విశ్రాంతిని ఇవ్వడానికే ఆరంగులను ఎంచుకుంటారు.మనం ఎంచుకునే రంగులు కూడా మన వ్యక్తిత్వాన్ని ఎంతో కొంత వ్యక్తీకరిస్తాయి.ఫ్యాషన్ పేరుతో వెర్రిగా మనకి సరిపడని రంగులు ధరించడం వల్ల దుష్పరిణామాలు కూడా సంభావుస్తాయి కొన్ని రకాల రంగుల దుస్తులు మన మూడ్స్ నుకూడా ప్రభావితం చేస్తాయి.ఏరంగు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుందో చూద్దాం. 1) ఎరుపు.. ఈ రంగు ఉత్తేజాన్ని నింపుతుంది. అది మనశరీరం లో కొన్నిలక్షణాలను దంకేతంగా ఉంటుంది.ధైర్యం,బలం, ఉత్తేజం,ఉల్లాసం,లక్ష్యం,అప్రమత్తత,లైంగిక ,సృజనాత్మకత,సంకల్ప బలం ,తీవ్రత వంటి లక్షణాలకు ఎరుపుసంకేతం. అయితే ఎరుపురంగు వల్ల కలిగే లాభాలు అనేకం.ఈ రంగును ఉపయోగించడం వల్ల మనలో ఉండే నకారాత్మక ఆలోచనలు అధిగమించ వచ్చు. ఆత్మవిశ్వాసం,స్థిరత్వం,భధ్రత, ఆధిపత్యం,భావన వంటివి పొందవచ్చు. అంతేకాదు ఎరుపు ఆకలిని పెంచుతుంది.అయితే ఎరుపును ఎక్కువగా వినియోగిస్తే అసహనం శత్రుత్వం,భావన,చికాకు ఆగ్రహం వంటివి పెరుగుతాయి.కోపం అధికంగా ఉంటుంది. 2)ఆరంజ్.. ఆరంజ్ రంగు సంతోషానికి ఉల్లాసానికి సంకేతం.వ్యక్తిలోని మానసిక ఉద్వేగాలకు ప్రభావితం చేస్తుంది.ఈ రంగు వ్యక్తిపై కలుపుగోలు తనం,నలుగురికి విశ్వాసంగా ఉండడం విజయం సంతోషం ఉంటాయి. ఈ రంగు వాడడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. సానుకూల దృక్పదం,ఏర్పడడం ఉల్లాసంగా ఉండగలగడం వంటివి జరుగుతాయి.ఈరంగుస్పూర్తినిస్తుందని ఆసక్తులను పెంచి మన కార్యకలా పాలను విస్త్రుత మయ్యేలా చేస్తుంది. వ్యక్తిగత సంబంధాలతో సంతోషానికి మనలోని సందేహాలను సంకోచాలను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఈ రంగును అతిగా వాడారో అసహనం చిరాకు ఆకలిపెరగడం జరుగుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ౩)పసుపు.. పసుపు అన్నిటా శుభప్రదం ఉత్తేజాన్ని ఎక్కువ స్థాయిలో కలిగిస్తుంది. మానసిక స్పష్టత సంతోషం సానుకూల వైఖరి ఆత్మ గౌరవం,వివేకం స్పూర్తిగా నిలుస్తుంది.ఈ రంగు వాడకం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత ఆశక్తి పెరగడం డిప్రెషన్ తగ్గడం సాదికరాత ఆత్మవిశ్వాసం ,ధైర్యం, ఆందోళన నుండి బయట పడడం శక్తి పెరగడం వంటివి జరుగుతాయి. సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకునేందుకు కూడా తోడ్పడుతుంది పసుపు రంగును అతిగా వాడితే సారహీన ప్రవార్తన,ఆతి క్రియాశీలత వంటి దుష్పరిణామాలు కలుగుతాయి. 4)ఆకు పచ్చ.. ఆకు పచ్చ నూతన ఉత్చాహానినికి శాతికి గుర్తు ఈరంగు. ఇది ప్రేమకు సంకేతం,శాంతి,నవీకరణ, ప్రేమ,ఆశ, సమతుల్యత,సామరస్యం, స్వీయ నియంత్రణ, జీవితం లో వృద్ధి వంటి వాటికి సంజేతమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆకుపచ్చ రంగును వాడడం వల్ల ఒత్తిడి తగ్గడం, విశ్రాంతి, స్థిరత్వం, శాంతి సౌఖ్యం, సమైక్య భావన,సంభావన వంటి అంశాలు వ్యక్తిపై ప్రభావం చూపుతాయి.అతిగా ఆకుపచ్చని వాడితే బద్ధకం వస్తుందని  దీనిని ఉపయోగించడం లో జాగ్రత్త అవసరం. 5)నీలం రంగు.. నీలం ఇది సంపూర్ణ ఆలోచనలతో అనుసంధానం అయిఉండే రంగు సమాచార మార్పిడి, సృజనాత్మకత వ్యక్తీకరణ, ఉత్తేజం నిర్ణయాత్మకం, విజ్ఞానం, ఆరోగ్యానికి సంకేతాలు ఈరంగును ఎక్కువగా ఉపయోగించడం వల్ల మానసిక విశ్రాంతి నిశ్చలత, నిద్రపట్టేందుకు సహాయపడడం, మాటల్లో ఆత్మవిశ్వాసం, స్పష్టమైన సమాచారం. పిల్లలలో హైపర్ యాక్టివిటీ తగ్గేందుకు సహాయపడుతుంది. అందుకే చాలా పాట శాలలో నీలిరంగు యునిఫాం ఉపయోగించడం గమనించవచ్చు. నీలిరంగును ఎక్కువగా వినియోగిస్తే అభద్రత, నిరాశ, అలసట,ఒత్తిడి, ఉదాసీనత, ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 6) లేత నీలం.. లేత నీలం ప్రశాంతతకు చిహ్నం, భావ వ్యాక్తీకరణకు సంకేతంగా ఉంటుంది. స్వచ్చత, ఓదార్పు, శాంతం, ఆత్మవిశ్వాసం, అనర్గళంగా మాట్లాడ గలగడం మనసులో నిష్కల్మష మైన ఆలోచనలు లేతనీలం వల్ల విశ్రాంతి,ప్రేమ పూర్వక అభివ్యక్తి, స్వేచ్చాపూరిత భావ వ్యాక్తీకరణ, సుఖనిద్ర,సున్నితత్వం వంటి వాటిని సాధించవచ్చు. లేత నీలం ఎక్కువగా వడం వల్ల పెద్దగా దుష్పరిణామాలు ఏమిలేక పోవడం విశేషం. 7)నెమలి కంఠం రంగు.. ఈరంగు మననరాల వ్యవస్థ విశ్రాంతి పొందేందుకు సాయాపడుతుంది. పైగా మన శరీరం అచేతన వ్యక్తిత్వం తో అనుసంధాన మయ్యే రంగుగా నిపుణులు విశ్లేషించారు.ప్రశాంతత సృజన అవగాహనకు సంకేతమని సహజంగా వారిలో జ్ఞానం చైతన్యం, స్పష్టమైన దృక్పదం గాఢ నిద్ర వంటి ఫలితాలు కలుగుతాయని రంగును వినియోగిస్తే ఒత్తిడి ఇతరులనుండి వేరు పడే భావన కలుగుతాయట. 8) వైలెట్ .. వైలెట్ మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి అనుసంధాన మై ఉంటుంది. ఈ రంగు వాడడం వల్ల ఉదారత,నిస్వార్ధ తత్వం, గాఢ నిద్ర నరాలను నేమ్మదింప చేయడం భావోద్వేగాల నియంత్రణ చిరాకు అతిగా ఆకలి వేయడం వంటి ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ఈరంగును అతిగా వాడారో డిప్రెషన్ అభద్రతా భావం, ఆగ్రహం వంటి ఉద్వేగాలు అణచివేయడం వంటివి సాధ్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 9)మేజెంటా రంగు.. వ్యక్తిలో ఉండే భక్తి ప్రేమకు అనుసంధానంఅవుతుందని అంటున్నారు. మేజెంటా విశ్రాంత స్థితి, ఓదార్పు, సున్నితత్వం, వంటి భావాలకు సంధాన మై ఉంటుంది. ఈ రంగును వాడడం వల్ల అంతర్గత  బహిర్గత ఉద్వేగాలు సమతౌల్యం అవుతాయి. శాంతి లభిస్తుంది. అయితే ఈ రంగును అతిగా వాడడం వల్ల నలుగురితో కలవ లేని వారికి మంచిది కాదు.             
శరీరం లో రక్తానికి సంబందించిన అన్నిరేపెర్లు చేసేది ప్లేటిలేట్లే. అలాంటిది డెంగు మలేరియా వచ్చిందో రోగికి శరీరం లో ప్లేటిలెట్స్ సమర్ధవంతంగా చేస్తాయి.ప్లేతిలేట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు మనిషి ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. మనం తినే ఆహారం లో నే ప్లేటిలేట్స్ సంఖ్య పెంచాలంటే అసలు మన శరీరానికి ప్లేటిలెట్స్ అందించాలంటే సహకరించే ఆహార పదార్ధాలు ఏమిటి?అసలు మనరక్తం లో ఎన్ని ప్లేటిలేట్స్ ఉండాలి అన్నవిష్యం మీకు తెలుసా ఆవిషయాలు తెలుసుకుందాం.ప్లేటిలేట్స్ సంఖ్య ఎంతఉండాలి?--మనశరీరంలో ప్లేటిలేట్స్ 1,5౦,౦౦౦ నుండి 4,5౦,౦౦౦ ప్లేటిలేట్స్ ఉంటాయి.శరీరంలో గాయాలు అయినప్పుడు.రక్తం గడ్డకట్టడానికి గాయాలు త్వరగా మానడానికి ప్లేటిలెట్స్ సహాయ పడతాయి. ప్లేటిలెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. ప్లేటిలేట్స్ తగ్గాయా తీవ్ర జ్వరం,బిపి, హార్ట్ ఎట్టాక్ నీరసం వచ్చే ప్రమాదం ఉంది.ఎప్పటికప్పుడు ప్లేటిలెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. రక్త పరీక్ష చేయించుకుంటే మనరక్తంలో ఎన్ని ప్లేటిలెట్స్ ఉన్నాయో తెలుస్తుంది.మనం తీసుకునే ఆహారం పైనే ప్లేటిలేట్స్ సంఖ్య ఆధార పడి ఉంటుంది.ప్లేటిలేట్స్ వృద్ది చెందేందుకు ఏఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. 1) బొప్పాయి... బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి జ్యూస్ చేసుకుని తాగడం.లేదా బొప్పాయి ఆకులను బాగా ఉడకపెట్టి వడపోసిన కషాయాన్ని రోజుకు రెండుసార్లు తాగడం వల్ల ప్లేటిలెట్స్ పెరుగుతాయి. అలాగే బొప్పాయి వల్ల రక్త్గం వృద్ధిచెందుతుంది.రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది. 2)బీట్ రూట్... బీట్ రూట్ వల్ల రక్తం వల్ల ప్లేటిలెట్స్ పెరగడానికి బీట్ రూట్ మంచిది. అనిమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్ రూట్ ను తీసుకోవాలి. ౩) క్యారెట్... క్యారెట్ వల్ల రక్తం వృద్ధిచెంది ప్లేటిలేట్స్ పెరుగుతాయి. కనీసం వారానికి మూడుసార్లు అయినా క్యారెట్ తినాలి. 4)వెల్లుల్లి... శరీరంలో సహజంగా ప్లేటిలేట్స్ పెంచుకోవాలంటే వెల్లుల్లి మంచిది. అని నిపుణులు సూచిస్తున్నారు .కాగా కొందరు ఉదయం వేళల్లో పరగడుపునే కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే గుండే సంబందిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. 5)ఆకుకూరలు... శరీరంలో ప్లేటిలేట్స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ కే పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.కాగా శరీరంలో రక్త్ఘహీనత అనీమియా ఉన్న వారికి తోటకూరను తినిపించడం ద్వారా రక్తం పుష్కలంగా లభిస్తుంది.అందుకే ఆకుకూరాలు తీసుకోవడం మంచిది. 6)దానిమ్మ.. శరీరం లో ప్లేటిలెట్స్ కౌంట్ పెరగాలంటే దానిమ్మ ఉపయోగ పడుతుంది.దీనిలో విటమిన్లు పోషకాలు అధికంగా ఉంటాయి. 7)ఎండు ద్రాక్ష... ప్లేటి లెట్స్ కౌంట్ పెంచడానికి సహజంగా పెరగాలంటే ఎందుద్రాక్షను తీసుకోవాలి.లేదా రాత్రి నీళ్ళలో నానపెట్టి ఉదయాన్నే పరగడుపునే ఎండుద్రాక్ష ను తీసుకుంటే మచిదని నిపుణులు సూచిస్తున్నారు.కాగా వేదినీళ్ళ లో ఎందుద్రాక్షను నానపెట్టి తీసుకుంటే మలబద్దకం వంటి సమస్యనుండి బయపదవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 8) ఖర్జూరం... ఖర్జూరం పండ్లలో ఐరన్,కాల్షియం,రక్తహీనత,ఇతర న్యుత్రీశియన్స్ అధికంగా లభిస్తాయి.ఎప్పటికప్పుడ్డు రక్త్ఘ పరీక్షలు చేయిస్తూ ఉంటె శరీరంలో ప్లేటిలేట్స్ సంఖ్య ఎంత ఉందొ తెలుసుకుంటూ ప్లేటిలెట్స్ సంఖ్య   తగ్గకుండా చూసుకోవాలి. మనం తీసుకునే ఆహారం పైనే ప్లేటి లెట్స్ సంఖ్య ఆధార పడిఉంటాయి.పైన పేర్కొన్న ఆహారం తీసుకోవడం వల్ల మీ ప్లేటిలేట్స్ పెరుగుతాయి. కీప్ యువర్ సెల్ఫ్హేల్తీ