LATEST NEWS
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరు తారక  రామ రావు,,జయంతి రేపు.(శనివారం) 1923 మే 23 న జన్మిచిన ఎన్టీఅర్, 1996 జనవరి 18 కన్ను మూశారు. అప్పటి నుంచి తెలుగు దేశం పార్టీ, హైదరాబాద్’లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రతి సంవత్సరం ఎన్టీఅర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా, తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. అయితే, ఈ సంవత్సరం వేడుకలకు ఒక ప్రత్యేకత వుంది. ముఖ్యంత్రి కేసీఆర్ జయంతి వేడుకలకు హాజరవుతున్నారు.  అంతకు ముందు తెలుగు దేశం పార్టీలో ఉన్న రోజుల్లో ఏమో కానీ, తెరాస ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఎప్పుడూ పాల్గొనని, తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా, ఎన్టీఅర్ నివాళులు అర్పించేందుకు, ఎన్టీఆర్ ఘాట్’ వెళుతున్నారు. నిజమే, మీరు విన్నది నిజమే. నిజంగానే ముఖ్యమంత్రి కేసేఆర్, రేపు ( మే 28 శనివారం) పార్టీ ముఖ్యులతో కలసి ఎన్టీఅర్ ఘాట్’కు వెళ్లి పెద్దాయనకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. అయితే, గత 20 ఏళ్లలో  ఏనాడు లేని విధంగా, ముఖ్యమంత్రి కేసీఆర్’కు ఎన్టీఆర్ మీద ఇంత ప్రేమ, ఇంత భక్తి ఒక్క సారిగా ఎందుకు పుట్టుకొచ్చాయి? ఇప్పడు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా తెరాస వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే, కేసేఆర్ ఏది చేసినా, ఉచితంగా చేయరు. ప్రయోజనం లేదనుకుంటే మహాత్ముల జయంతి వర్ధంతి వేడుకలనే స్కిప్ చేస్తారు. అలాగే, కేసీఆర్ అనూహ్యంగా ఒక అడుగు వేశారంటే దాని వెనక ఒక రాజకీయ వ్యూహం, ఎత్తుగడ ఉండి తీరతాయి, అనే విషయంలో ఎవరికీ అనుమానం లేదని, అదే విధంగా ఈ నిర్ణయం వెంక కూడా ఎదో వ్యూహం ఉండే ఉంటుందని, పరిశీలకు భావిస్తున్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్, అవసరం అయితే బొంత పురుగును అయినా ముద్దాడతానని ప్రకటించారు.ఇంకొక సందర్భంలో తెలంగాణలో స్థిరపడిన అంద్రోళ్ళ ఓట్ల కోసం, అంద్రోళ్ళ కాలిలో ముళ్ళు దిగితే, తన పంటితో తీస్తానని నమ్మ పలికారు. అంటే అవసరం అయితే, ఎవరిని అయినా సొంతం చేసుకునేదుకు, కేసీఆర్ ఎప్పుడు సిద్దంగా ఉంటారని వేరే చెప్ప నక్కరలేదని అంటారు. అలాగే, అవసరం తీరన తర్వాత అంతే, ‘ప్రేమ’ గా బయటకు గేన్తెస్తారని కూడా అంటారు అనుకోండి, అది వేరే విషయం.  ఇక ఇప్పడు, ముందస్తు ఎన్నికలకువెళ్ళే ఆలోచనలో ఉన్న కేసీఆర్, అటు ఆంద్ర ఆరిజిన్ ఓటర్లను, ఇటు తెలుగు దేశం పార్టీ నాయకులు, క్యాడర్’ను బుట్టలో వేసుకునేందుకే ఎప్పుడు లేని విధంగా ఇప్పడు ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారనే చర్చ రాజకీయ వర్గాలో జరుగుతోంది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ అంత బలంగా లేక పోయినా, పార్టీకి సుశిక్షితులైన కార్యకర్తలు, బలమైన నాయకులు ఉన్నారు. నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ మంత్రి వర్గంలో సగం మందికి పైగా మంత్రులు అంతా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు సిశిక్షణలో నాయకులుగా ఎదిగిన మాజే టీడీపీ నాయకులే ఉన్నారు. అన్నిటినీ మించి బీసీల గుండెల్లో ఈనాటికీ ఎన్టీఅర్ బొమ్మ పదిలంగా వుంది, అందుకే, తెలుగు దేశం పార్టీ నాయకుల నుంచి క్యాడర్, ఓటర్ల వరకు అందరినీ తమ వైపుకు తిప్పుకునే ఎత్తుగడలోభాగంగానే కేసీఆర్, ఎన్టీఆర్ జయంతిని వినియోగించుకునే వ్యూహంతో ఉన్నారని అంటున్నారు. అంతే కాదు, అవసరం అనిపిస్తే, రేపు ఎన్టీఅర్ ఘాట్’నుంచే కేసేఆర్, ఎన్టీఅర్ పేరున ఒక పథకమో మరొకటో ప్రకటించినా ప్రకటిస్తారని, అదే విధంగా, ఎన్టీఆర్’ కు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసినా  చేస్తారని అంటున్నారు.   నిజానికి, పార్టీలతో సంబంధం లేకుండా పనికొచ్చే, ‘పెద్ద’ లను సొంతం చేసుకోవడం కేసీఆర్ ‘కు కొత్త కాదని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు శత జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించి పీవీ కుటుంబాన్ని, పీవీ సామాజిక వర్గాన్ని తమ  వైపుకు తిప్పుకున్న చరిత్రను గుర్తు చేస్తున్నారు. పేవీని సొంతంచేస్కోవడమే కాకుండా దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ వరస ఓటముల క్రమంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలో, పీవీ కుమార్తె, సురభి వాణీ దేవికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు.  సో.. ఇప్పడు ఎన్టీఅర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం కూడా పెద్దాయన మీద ఉన్న గౌరవంతోనో, భక్తితోనో కాదు, రాజకీయ అవసరం కోసమే అంటున్నారు.   ఆయన అప్పుడు, పీవీని సొంతం చేసుకున్నారు. ఇప్పడు ఎన్టీఅర్’ను సొంతం చేసుకుంటున్నారు. అదే కేసీఆర్ జాతిపిత మహాత్మా గాంధీ, రాజకీయ నిర్మాత బీఆర్ అంబేద్కర్, జయంతి, వర్ధంతి వేడుకలకే ఈ నాడు హాజరు కాని, కేసీఆర్, ఎన్టీఅర్ జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు.అంటే..ఆయన ఎంతటి రాజకీయ చతురుడో వేరే చెప్పనక్కరలేదు. అదే సమయంలో ఆయన్ని ఎన్నికల ఓటమి భయం ఎంతగా వెంతాడుతోందో కూడా .. తెలియచేస్తుందని, పరిశీలకులు అంటున్నారు.
స్పీకర్ పదవికి ఒక గౌరవం ఉంటుంది. ఆ పదవిలో ఉన్న వారు రాజకీయాలు మాట్లాడరు. తాము గెలిచి వచ్చిన పార్టీ కార్యక్రమాలలో పాల్గొనరు. బాధ్యత గలిగిన రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఎవరైనా పాటించాల్సిన నైతికత ఇది. అలాంటి బాధ్యత కలిగిన రాజ్యంగ పదవిలో ఉన్న తమ్మినేని ఆ గౌరవానికి తగరని తన వ్యాఖ్యలతో నిరూపించుకున్నారు. తెలుగుదేశం మహానాడుపై అనుచిత వ్యాఖ్యలతో బరితెగించి స్పీకర్ పదవికి మాయని మచ్చ తీసుకొచ్చారు. మహానాడును వల్లకాడనీ, చచ్చిపోయిన పార్టీకి దహన సంస్కారాలు చేస్తున్నారనీ సంస్కార హీనమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ పై పెల్లుబుకుతున్న వ్యతిరేకతతో వైసీపీ నేతలలో గుబులు పెరుగుతోంది. ఫ్రస్ట్రేషన్ తో ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. బాలినేని సభ్య సమాజం వినడానికి కూడా ఇష్టపడని పదజాలంతో దేశం నేతలను దూషించడం ఇందులో భాగంగానే చూడాలి. అదే ఫస్ట్రేషన్ తో స్పీకర్ పదవికే తలవంపులు తెచ్చేలా  తమ్మినేని వ్యాఖ్యలు చేశారు.  గడప,గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసిపి మంత్రులు,ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. మా గడపకు రావద్దంటూ జనం మొహంమీదే చెప్పేశారు. మూడేళ్ళుగా ఏం చేశారు?ఎందుకొచ్చారు అంటూ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు.  మా ఇంటికి రావద్దు,మీ పథకాలకు,మీకో  నమస్కారం అంటూ ప్రజలు తిరగపడటంతో పధకాల ప్రచారం ఆపేసి   బస్సు యాత్రతో సిగ్గు దాచుకునేందుకు వైసీపీ నాయకులు రెడీ అయిపోయారు.  రాష్ట్రంలో ప్రజలు ఎదోర్కొంటున్న సమస్యలు పరిష్కరించలేక  ప్రజల దృష్టిని మరల్చేందుకే తెలుగుదేశం పార్టీ మహానాడు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారనడంలో సందేహం లేదు. గెలిచినప్పుడు పొంగిపోవడం, పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు కుంగిపోవడం కాకుండా రెంటినీ సమానంగా స్వీకరించే హుందాతనం నేతలలో ఉండాలి. కానీ వైసీపీ నేతలలో అది కనిపించడంలేదు. విజయంతో అహంకారం తలకెక్కి ఇష్టారీతిన వ్యవహరించడం, పరిస్థితులు ప్రతికూలంగా మారగానే సంయమనం కోల్పోయి రాజకీయ ప్రత్యర్థి పార్టీల నేతలపై నోరు పారేసుకోవడం ఏ విధంగా చూసినా సమర్ధనీయం కాదు.    తమ్మినేని మాటలు, బాలినేని బూతులు వైసీపీలో ఓటమి భయానికి నిదర్శనాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కానీ దొంగ శత్రువులు ఉంటారా అంటే మాత్రం కచ్చితంగా ఉంటారంటూ మోడీ, కేసీఆర్ లను చూపుతున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తే కేసీఆర్ నగరం విడిచి వెళ్లడం రాజకీయ కుమ్మక్కులో భాగమేనంటున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మోడీ నినాదాన్ని కేసీఆర్ అందిపుచ్చుకుని దానిని తెలంగాణకు అనుగుణంగా కాంగ్రెస్ ముక్త తెలంగాణగా సవరించుకున్నారని, ఆ లక్ష్యం సాధించేందుకే బీజేపీకి రాష్ట్రంలో లేని ప్రాధాన్యతకు కట్టబెడుతున్నారన్నది వారి విశ్లేషణ. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలం చెక్కు చెదరకపోవడం, నేతలు బలహీనపడినా కార్యకర్తల బలం తెలంగాణలో కాంగ్రెస్ కు ఎలా ఉన్నది అలాగే ఉండటాన్ని వారు ఎత్తి చూపుతున్నారు.   ఈ నేపథ్యంలోనే రెండు ధఫాలు వరుసగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తీవ్రమైన యాంటీ ఇన్ కంబెన్సీని ఎదుర్కొంటోందనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మళ్ల కుండా ఉండాలంటే బీజేపీ బలోపేతం అయ్యిందన్న భావన ప్రజలలో కలిగించేందుకే ఆ పార్టీకి అధిక ప్రాధాన్యతను కేసీఆర్ ఇస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  కేంద్రం అవినీతి వైఫల్యాలపై కేసీఆర్ గళమెత్తడం, కేసీఆర్ కుటుంబ అవినీతిపై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించండం రెండు పార్టీల రాజకీయ నాటకంలో బాగమేనని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిజంగా కేసీఆర్ అవినీతి నిగ్గు తీయాలంటే ఎంత సేపని వారు ప్రశ్నిస్తున్నారు.  తాజాగా కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిందనీ, అలాగే  జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావలసిందిగా  జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నో్టీసులు జారీ చేసింది.   తాజాగా మహారాష్ట్ర మంత్రి శివసేన నేత అనిల్‌ పరబ్‌ నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించి మనీలాండరింగ్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ దాడుల పరంపర కొనసాగుతుంటే ..   స్వయంగా మోడీయే కేసీఆర్ అవినీతి, ఆయన కుటుంబ దోపిడీపై విమర్శలు, ఆరోపణలు  గుప్పిస్తుంటే ఈడీ ఎందుకు దాడులు చేయడం లేదని, సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదనీ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మోడీ కేసీఆర్ పై విమర్శలు గుప్పించినా, కేసీఆర్ కేంద్రంపై, ప్రధానిపై ఆరోపణలు సంధించినా.. అదంతా రాజకీయ క్రీడలో భాగమే తప్ప నిజం కాదన్న సంగతిని బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. తెలంగాణలో తెరాసకు, కేంద్రంలో బీజేపీకి నిజమైన ప్రత్యర్థి కాంగ్రెస్ అన్న అవగాహనతోనే కేసీఆర్, మోడీలు ఆ పార్టీని తగ్గించి చూపేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకే కేసీఆర్, మోడీ రాజకీయ ప్రత్యర్థులుగా ప్రజలకు బిల్డప్ ఇస్తున్నారని వారు అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం అన్న అంశం కూడా అంతిమంగా మోడీకి మేలు చేసేందుకేనని అంటున్నారు. మూడో ఫ్రంట్, కూటమి అంటూ కేసీఆర్ కలుస్తున్న ప్రాంతీయ పార్టీల రాజకీయ మూడ్ ఏమిటన్నది బీజేపీ అగ్రనాయకత్వానికి చేరవేసే వ్యూహంలో భాగమే కేసీఆర్ పర్యటనలని వారు విశ్లేషణలు చేస్తున్నారు. గురువారం తెలంగాణ పర్యటనలో భాగంగా మోడీ బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో కేసీఆర్ కుటుంబ అవినీతిపై చేసిన విమర్శలను  తెలంగాణ బీజేపీ నాయకలే సీరియస్ గా తీసుకోవడం లేదని ఆ పార్టీకి సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి. 
మరో రెండు మూడు నెలలు ఆగండి, మీకో సంచలన వార్త చెపుతా .. గురువారం  బెంగుళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మరో సంచలన ప్రకటన ఇది.  ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “జాతీయస్థాయిలో మార్పు రాబోతోంది.. దాన్ని ఎవరూ ఆపలేరు. రెండు మూడు నెలల తర్వాత మీకు సంచలన వార్త అందుతుంది” అని మీడియాకు చెప్పారు.అయితే ఆ సంచలన ప్రకటన ఏమిటో, ఆయన మనసులో ఏముందో మాత్రం ఆయన బయట పెట్టలేదు. కానీ, ఆయన బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన తర్వాత, కుమార స్వామి అసలు గుట్టు విప్పేశారు. అదేమంటే, వడ్ల గినజలో బియ్యపు గింజ... కేసీఆర్ చాలా కాలంగా చెపుతున్న ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు ముచ్చటే, ఆ ‘సంచలన’ వార్తని కుమార స్వామి చెప్పారు.  “ప్రాంతీయ పార్టీలన్నీ విబేధాలను పక్కనపెట్టి జాతీయ ప్రయోజనాల రీత్యా ఏకతాటిపైకి వచ్చేస్తాయి, కేసీఆర్‌ చొరవతో భారత భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి” అని కుమార స్వామి చెప్పు కొచ్చారు. అందుకు ఆయన ముహూర్తం కూడా ఖరారు చేశారు. దేశమంతా విజయదశమి జరుపుకొనే రోజుల్లోనే విజయవంతమయ్యే సంచలన ప్రకటన రానుందని కుమారస్వామి అన్నారు.  అయితే ఇదేమన్నా కొత్త ప్రకటనా అంటే కాదు, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కేసీఆర్ ఇదే చెపుతున్నారు. అంతే కాదు, అయన తాను స్వయంగా  చెప్పిన ఫ్రంట్ ఏర్పాటును ఆయనే, ఫ్రంటూ లేదు టెంటు లేదంటూ ఖండించారు. నిజానికి, జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక గురించి ముఖ్యమంత్రి కేసీఆర్’కు కూడా స్పష్టత లేదని, అయన ప్రకటనలే సూచిస్తున్నాయి.  అదలా ఉంటే గత ఐదారు  నెలలుగా జాతీయ రాజకీయాల పై దృష్టి కేంద్రీకరించైనా కేసీఆర్ , దేశవ్యాప్త రాజకీయ యాత్రలు చేస్తున్నారు, అయితే, ఎందుకనో గానీ, ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఏదో ఒక అపశకునం అనాలో ఇంకేమనాలో కానీ ,అనుకున్న యాత్ర అనుకున్నట్లు సాగడం లేదు. గత వారం ఢిల్లీ వెళ్ళిన సమయంలో ఆయన అక్కడినుంచి అటే పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక మీదుగా మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి, షిర్డీ వెళ్లి  అన్నా హజారే, షిర్డీ సాయిబాబాలను దర్శించుకుని, 28 తేదీకి గానీ హైదరాబాద్ తిరిగి రారని అన్నారు. కానీ, ఈ యాత్రలో, ఒకటికి రెండు బ్రేకులు పడ్డాయి. ఢిల్లీ టూర్’కు సంబంధించి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండాల్సింది. అటు తర్వాత బెంగళూరు, రాలేగావ్ సిద్ధి, షిర్డీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ, రెండు రోజుల ముందుగా మే 23నే ఆయన  అకస్మాత్తుగా హైదరాబద్ తిరిగి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ గురువారం ( మే 26) ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలోనే, బెంగుళూరు వెళ్లారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బెంగళూరు నుంచి ఆయన శుక్రవారం (మే 27న) మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దికి వెళ్లి, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలవవలసి ఉంది. ఆపై శిరిడీలో సాయిబాబాను దర్శించుకొని హైదరాబాద్ తిరిగిరావాల్సిఉంది. కానీ కేసీఆర్ అనూహ్యంగా బెంగళూరు పర్యటన ముగియగానే నేరుగా హైదరాబాద్ తిరిగొచ్చారు.  నిజానికి, జాతీయ రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ ప్రయాణం సాఫీగా సాగడం లేదు. ఢిల్లీకి ముందే, తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలు పర్యటించి, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఎన్సీపీ అదినేత పవార్ వంటి సీనియర్ నాయకులను కలిసి  కాంగ్రెస్ యేతర, బీజేపీ యేతర ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించి వచ్చారు. అయితే, ఆ చర్చలు ఏవీ ఫలించలేదు. కాంగ్రెస్ ’చేయి’ వదిలేది లేదని పవార్ నుంచి స్టాలిన్ వరకు అందరూ స్పష్టం చేయడంతో, కేసీఆర్ స్వరం  మార్చి మరో రూట్’లో వెళుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితిలో కేసీఆర్ ఆశిస్తున్నట్లుగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావడం అయ్యే పనేనా  అంటే, రాజకీయ విశ్లేషకులు, 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు ఏకం కావడం అయ్యే పని కాదనే అంటున్నారు.అయితే, కేసీఆర్’కు ఈవిషయం తెలియదా అంటే, తెలియదాని కాదు, కానీ, లోక్ సభ ఎన్నికలకంటే ముందు వచ్చే అసెంబ్లీ ఎన్నికల గండం గట్టేక్కే ఎత్తుగడలో భాగంగానే ఆయన. 2018లో ప్లే చేసిన ట్రిక్’నే మళ్ళీ మరోమారు ప్లే చేస్తున్నారని, అంటున్నారు. అందుకే కేసీఆర్ ప్రస్తుత రాజకీయాని, ‘జాతీయ అజెండా,  ప్రాంతీయ జెండా’ గా పేర్కొంటున్నారు.
విజయనగరం జిల్లాలో జరగాల్సిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర రద్దైంది. మంత్రి బొత్ ఇలాకాలోనే సామాజిక న్యాయ భేరి వైఫల్యం ఆ పార్టీని తీవ్ర నిరాశలో ముంచేసింది. సామాజిక న్యాయ భేరి విజయనగరంలో రద్దు కావడానికి వర్షం కారణమంటూ నేతలు నెపం వర్షం మీదకు తోసేస్తున్నారు. విజయనగరంలో భారీ వర్షం కురిసింది నిజమే. కానీ వర్షం ఆగిపోయిన తరువాత 17 మంది మంత్రులూ వేదిక మీదకు వెళ్లినా కూడా వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరూ లేకపోవడంతో గత్యంతరం లేక సభను రద్దు చేసుకుని మంత్రులు బస్సులో విశాఖ వెళ్లిపోయారు.  మంత్రుల బస్సు విజయనగరంలోనికి ప్రవేశించే సమయానికి భారీ వర్షం కురుస్తోంది. దీంతో వైసీపీ కష్టపడి సమీకరించిన జనం ఇళ్లకు వెళ్లి పోయారు. సభా స్థలి వద్దకు మంత్రులు చేరుకునే సమయానికి కూడా వర్షం కురుస్తూనే ఉండటంతో మంత్రులు బస్సులోనే ఉండిపోయారు. తరువాత వర్షం తెరిపిచ్చినప్పటికీ, మంత్రులు వేదిక మీదకు చేరుకున్న తరువాత కూడా సభ స్థలి ఖాళీగానే దర్శనమివ్వడంతో నిరాశ చెందిన మంత్రులు సభను రద్దు చేశారు.  తొలి రోజే సభకు స్పందన కరవవ్వడం చూస్తుంటే ఈ యాత్ర ముందు ముందు ఎలా సాగుతుందా అన్నా అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కాగా  మొత్తంగా వైసీపీ చేపట్టిన బస్సు యాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పాలన మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ మూడేళ్లలో తమ ప్రభుత్వం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించే లక్ష్యంతో తలపెట్టిన ఈ యాత్రను కేవలం బహిరంగ సభలకే పరిమితం చేశారు. అంతే కానీ బస్సులో సామాజికంగా వెనుకబడిన వర్గాల వారి కాలనీలకు, వాడలలోకి వెళ్లాలి కానీ, వారిని బహిరంగ సభలకు సమీకరించడం అంటే గడపగడపకూ అనుభవంతో ఏదో రకంగా ఈ కార్యక్రమాన్ని మమ అనిపించేయడానికే నిర్ణయించుకున్నారని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఎస్సీ వాడలకు దూరంగా  బస్సు యాత్ర జరుగుతున్న తీరు పట్ల ప్రజలలో కూడా ఆసక్తి కరవైంది. 
ALSO ON TELUGUONE N E W S
NBK107: It is known that Nandamuri Balakrishna's upcoming film is directed by Gopichand Malineni, a young director. While the director is making the film as an all-out action entertainer, Balayya is playing two different roles in it.   The first look posters for the film have already heightened hopes for the flick. While filming is presently underway, the film crew is eager to conclude the project as soon as possible.   This film's title has been making the rounds in the industry for the past few days. The title of the film is of interest to both Nandamuri fans and the general public. According to social media sources, the film's title would be 'Annagaru.'   However, there is now speculation that the film's title is not 'Annagaru.' Another title is being considered by the film team. The film team appears to be poised to finalise the powerful title 'Jai Balayya' for this film. It is well known that 'Jai Balayya' has become every Balayya fan's catch phrase.   The film crew is now ready to use the same word as the title. However, the film is bound to gain more attention, and with Balayya's powerful performance, the audience is in for a real treat.
There is no doubt that the film that Ram Charan is making after RRR and Acharya would have high expectations. Dil Raju is financing the film, which is directed by Shankar and stars Ram Charan, on a massive scale.   The movie concept poster alone costed around Rs. 2crs. It appears to have a budget of Rs 200 crore. The soundtrack is being composed by SS Thaman.   The film is now being shot quickly. The film crew has now taken a brief break after completing three schedules. The shooting will soon resume on the larger sets. It appears that an intriguing title has been chosen for this film.   The title "Adhikaari" is said to be finalised for the film. An official announcement will be made soon. The producers are considering two other titles that fit the film's theme.   The film's non-theatrical rights were purchased by the leading media company ZEE Channel for around Rs 150 crore. Furthermore, ZEE5 has agreed to serve as the film's streaming partner.   According to rumours, Charan will play three characters in the film. According to netizens, the news has heightened hopes for Shankar's film. Jayaram, Anjali, Sunil, Srikanth, Naveen Chandra, and others play important roles in the film.
"F2: Fun and Frustration," starring Venkatesh, Varun Tej, Thamanna, and Mehreen as the heroines, was released on the occasion of Sankranthi in 2019 and became a box office smash.   "F3: Fun and Frustration" is now slated to be released as a sequel to Anil Ravipudi's film. The film's producers and crew hyped it up, claiming that it would be 10 times more fun and comedy than "F2." The trailer also generated a lot of interest in the film. The film was released in theatres today, May 27, after much anticipation. And let us see how well this film was received by the audience.   Story: Venky (Venkatesh) and Varun Yadav (Varun Tej) are two regular persons. The two are continuously battling for money while living in the middle class. When they discover that a wealthy industrialist is looking for a heir to his estate. With this, they travel to Vizag and pose as the industrialist's heirs. And did they receive the money they desired? Was Venky and Varun caught by anyone? What transpired in the end? You'll have to watch a movie to find out.   Cast: Venkatesh is the film's main character. Venky's exceptional acting chops enabled him to excel in his part.  No need to say anything special about Venkatesh comedy timing anymore.Varun Tej is also tasked with bringing his role to life. Varun acted more naturally in this film than in "F2." His comedy was also helpful to the film.   Thamanna and Mehreen are huge assets to this film. They drew everyone's attention not just because of their beauty, but also because of their acting skills. Their comedy was very entertaining. In this film, Ali's character is completely different. He was terrific in his role and performed admirably. Rajendra Prasad plays a police officer in the film and makes the audience laugh in his own style. Sunil finally got a nice comic job after a long time. Vennela Kishore and Murali Sharma have also performed admirably in their roles.   Technical Team: Despite being a sequel to "F2," Anil Ravipudi has written a new story for the film. Anil Ravipudi, who is a big cinema aficionado, concentrates on humour in this film. Although there is no major plot in the picture, the most of the time is spent entertaining the audience. However, there are some variations in the narration between "F2" and this film. Devi Sri Prasad's music appeared monotonous. The cinematographer contributed to the film's visuals. Tammi Raju's editing is likewise excellent.   Strengths: Vintage victory Venkatesh mark entertainment and veteran comedians timing Weaknesses: Some sequences are illogical. The narrative is weak. Some scenes from the second half are also included. Last but not least, the film begins with a bang. The first half is filled with comedic moments that make the audience laugh. However, compared to the first half, the humour in the second half feels a little over the top. The humour appears to be good in some sections but tedious in others. Venkatesh's night blindness and Varun Tej's stammering scenes worked well in this film. The episodes that air on it are quite humorous. The Rajendra Prasad subplot is equally enjoyable. The pre-climax and climax episodes appear to be over-the-top and loaded with humour. Bottom line: It's both fun and frustrating at times.
యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ మూవీ 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. విద్యా సాగర్ చింత డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 6న విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. విశ్వక్ సేన్ అద్భుత నటన, సహజమైన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. 'అశోక వనంలో అర్జున కళ్యాణం' విడుదల సమయానికి థియేటర్స్ లో 'కేజీఎఫ్-2' ప్రభంజనం కొనసాగుతోంది. దానికి తోడు విడుదలైన ఆరు రోజులకే 'సర్కారు వారి పాట' విడుదలైంది. దీంతో అర్జున కళ్యాణం కలెక్షన్ల పై తీవ్ర ప్రభావం పడింది. లేదంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ఇంకా పెద్ద హిట్ గా నిలిచేది. థియేటర్స్ లో చూసిన మెజారిటీ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా ఆహా అధికారికంగా ప్రకటించింది. 
అధిక టికెట్ ధరలు కారణంగా సాధారణ ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇది సినిమా కల్లెక్షన్లపై ప్రభావం పడుతుండటంతో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ దిగొస్తున్నారు. తాజాగా విడుదలైన 'F3' సినిమా ప్రభుత్వం నిర్ణయించిన సాధారణ టికెట్ ధరలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పేరుకి అదనపు ఛార్జ్ వసూలు చేయనప్పటికీ.. హైదరాబాద్ లో ఈ సినిమా టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్ లో రూ.200, మల్టీప్లెక్స్ లలో రూ.300 ఉన్నాయి. ఇవి కూడా ఎక్కువని ప్రేక్షకులు ఫీల్ అవుతున్న టైంలో 'మేజర్' టీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ 'మేజర్'. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి శశి కిరణ్ తిక్క దర్శకుడు. జూన్ 3న విడుదలవుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాని  ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా అందుబాటు ధరల్లో రిలీజ్ చేస్తున్నారు. జీఎస్టీతో కలిపి తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో రూ.150, మల్టీప్లెక్స్ లలో రూ.195.. ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్స్ లో రూ.147, మల్టీప్లెక్స్ లలో రూ.177 గా ధరలు నిర్ణయించారు. ఈ నిర్ణయం సినీ ప్రేమికులను, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సోనీ పిక్చర్స్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 
ఈ ఏడాది `ఆర్ ఆర్ ఆర్`, `ఆచార్య‌`.. ఇలా బ్యాక్ టు బ్యాక్ మ‌ల్టిస్టార‌ర్స్ లో సంద‌డి చేశాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. వీటిలో యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించిన `ఆర్ ఆర్ ఆర్` పాన్ - ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌గా.. త‌న తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న `ఆచార్య‌` ఆశించిన విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇదిలా ఉంటే, చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ పొలిటిక‌ల్ డ్రామా చేస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్ కి జంట‌గా కియారా అద్వాని న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్, జ‌య‌రామ్, సునీల్, అంజ‌లి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు. కాగా, ఈ సినిమాకి `స‌ర్కారోడు` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్లు గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. `అధికారి` అనే పేరుని కూడా ప్ర‌ముఖంగా ప‌రిశీలిస్తోంద‌ట శంక‌ర్ అండ్ టీమ్. మ‌రి..  చ‌ర‌ణ్ తాజా చిత్రానికి `స‌ర్కారోడు`, `అధికారి`లో ఏ టైటిల్ ఫైన‌లైజ్ అవుతుందో చూడాలి. కాగా, 2023 వేస‌విలో జ‌నం ముందుకు రానున్న ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా రామ్ చ‌ర‌ణ్ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.
రైటర్ డైమండ్ రత్నబాబు 'బుర్రకథ' సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పరాజయం పాలైనప్పటికీ రెండో సినిమాగా మోహన్ బాబుతో 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమా రత్నబాబుకి విజయాన్ని అందించకపోగా.. ట్రోల్స్ కి గురైంది. దర్శకుడిగా మొదటి విజయం కోసం ఎదురుచూస్తున్న రత్నబాబు ఇప్పుడు బిగ్ బాస్-5 విన్నర్ సన్నీతో ఓ సినిమా చేస్తున్నాడు. బిగ్ బాస్ తో సన్నీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్న సన్నీ.. తాజాగా మరో సినిమాకి సిగ్నల్ ఇచ్చాడు. ఏ2బీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఈ సినిమా అధికారిక ప్రకటన ప్రక్కన మే 31న రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. మే 31న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది.
సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కొత్త చిత్రంలో నంద‌మూరి కుటుంబానికి చెందిన ఓ హీరో.. నెగ‌టివ్ రోల్ లో ఎంట‌ర్టైన్ చేయ‌నున్నారా? అవున‌న్న‌దే ఫిల్మ్ న‌గ‌ర్ బ‌జ్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. మ‌హేశ్ బాబు క‌థానాయ‌కుడిగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. `అత‌డు`, `ఖ‌లేజా` వంటి క‌ల్ట్ క్లాసిక్స్ త‌రువాత మ‌హేశ్, త్రివిక్ర‌మ్ జ‌ట్టుక‌డుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో.. `బుట్ట‌బొమ్మ‌` పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించ‌నుండ‌గా, యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ బాణీలు అందించ‌నున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. వ‌చ్చే నెల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. కాగా, ఈ చిత్రంలో  క‌థానాయ‌కుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న ఓ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. అంతేకాదు.. ఇదో నెగ‌టివ్ క్యారెక్ట‌ర్ అని స‌మాచారం. త్వ‌రలోనే మ‌హేశ్ - త్రివిక్ర‌మ్ చిత్రంలో తార‌క‌ర‌త్న ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది. ఇదిలా ఉంటే, తార‌క‌ర‌త్న గ‌తంలో `అమ‌రావ‌తి` చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించ‌డ‌మే కాకుండా `బెస్ట్ విల‌న్`గా `నంది` అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు.
`ఏమైంది ఈ వేళ‌`, `ర‌చ్చ‌`, `బెంగాల్ టైగ‌ర్`, `గౌత‌మ్ నంద‌`, `సీటీమార్`.. ఇలా ప‌రిమిత సంఖ్య‌లోనే సినిమాలు తీసినా ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంప‌త్ నంది. కాగా, త్వ‌ర‌లో ఓ సీనియ‌ర్ స్టార్ తో సంప‌త్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని తీయ‌బోతున్నాడ‌ట‌.   ఆ వివ‌రాల్లోకి వెళితే.. కింగ్ నాగార్జున‌తో సంప‌త్ నంది ఇటీవ‌ల సంప్ర‌దింపులు జ‌రిపార‌ట‌. క‌థ‌, పాత్ర న‌చ్చ‌డంతో నాగ్ కూడా ఈ ప్రాజెక్ట్ కి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని బ‌జ్. అంతేకాదు.. మ్యాట్నీ ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నార‌ని స‌మాచారం. అలాగే, ఇందులో నాగ్ ఓ డిఫ‌రెంట్ రోల్ లో ఎంట‌ర్టైన్ చేస్తార‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే నాగ్ - సంప‌త్ నంది కాంబినేష‌న్ పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఇదిలా ఉంటే.. నాగార్జున ప్ర‌స్తుతం `గ‌రుడ వేగ‌` ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్ లో `ద ఘోస్ట్` అనే మూవీ చేస్తున్నారు. మాజీ `రా` ఏజెంట్ గా నాగ్ క‌నిపించ‌నున్న ఈ సినిమాలో అత‌నికి జోడీగా సోనాల్ చౌహాన్ న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం.. ఇదే ఏడాది ద్వితీయార్ధంలో తెర‌పైకి రాబోతోంది. `బంగార్రాజు` వంటి హిట్ చిత్రం త‌రువాత నాగ్ నుంచి రాబోతున్న సినిమా కావ‌డంతో `ద ఘోస్ట్`పై మంచి అంచ‌నాలే ఉన్నాయి.
టాలీవుడ్ లో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన మ‌ల్టిస్టార‌ర్స్ లో `సుల్తాన్` ఒక‌టి.  న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా, విల‌న్ గా రెండు విభిన్న పాత్ర‌లు పోషించిన‌ ఈ చిత్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణ‌, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. బాల‌కృష్ణ‌, కృష్ణ‌, కృష్ణంరాజు.. ఇలా `కృష్ణ‌` త్ర‌యంతో కుటుంబ కథా చిత్రాల స్పెష‌లిస్ట్ శ‌ర‌త్ తెర‌కెక్కించిన ఈ మ‌ల్టిస్టార‌ర్ ని..  పి.బి. ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై బాల‌కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో ఎం. ఆర్. వి. ప్ర‌సాద్ నిర్మించారు. అంతేకాదు.. ఎం.ఆర్. వి. ప్ర‌సాద్ నే క‌థ‌ను అందించ‌డం విశేషం. `స‌మ‌ర‌సింహారెడ్డి` (1999) వంటి ఇండ‌స్ట్రీ హిట్ అనంత‌రం బాల‌య్య నుంచి వెనువెంట‌నే వ‌చ్చిన ఈ చిత్రం.. యాక్ష‌న్ ప్రియుల‌ను భ‌లేగా ఆక‌ట్టుకుంది. మ‌రీముఖ్యంగా.. `సుల్తాన్`గా టైటిల్ రోల్ లో బాల‌య్య అభిన‌యం అభిమానుల‌ను ఫిదా చేసింది.  బాల‌కృష్ణ స‌ర‌స‌న‌ రోజా, ర‌చ‌న‌, దీప్తి భ‌ట్నాగ‌ర్ న‌టించిన ఈ సినిమాలో బ్ర‌హ్మానందం, ర‌విబాబు, స‌త్య‌ప్ర‌కాశ్, అన్న‌పూర్ణ‌, సుధ‌, శివ పార్వ‌తి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్నారు. కోటి సంగీత‌మందించిన ఈ చిత్రంలో ``ఓ క‌లికి రామ‌చిల‌కా``, ``పంచ‌దార చెట్టుమీద‌``, ``చిమ చిమ‌``, ``నంది కొండ మీద‌``, ``ఆకాశం గుండెల్లో``, ``ష‌బ్బా ష‌బ్బారే`` అంటూ మొద‌ల‌య్యే పాట‌ల‌న్నీ ఆక‌ట్టుకున్నాయి. కాగా, 1999 మే 27న విడుద‌లైన `సుల్తాన్`.. నేటితో 23 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ నెల 9వ తేదీన మొదలైన పోలింగ్, ఆదివారం జరిగిన నాల్గవ విడత పోలింగ్ తో ముగిసింది. ఇంచుమించుగా సంవత్సరంపాటు సాగిన పంచయతీ వివాదం చివరాఖరుకు ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్లుగా మొత్తం 10,890 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగాయి.   ఈ ఎన్నికలలో ఎవరు గెలిచారు,ఎవరు ఓడిపోయారు అనే విషయాన్నిపక్కన పెడితే  కొవిడ్ భయాన్ని, ఇతరత్రా ఎదురైన సమస్యలను పక్కన పెట్టి, గ్రామీణ ఓటర్లు, ప్రజాస్వామ్య స్పూర్తిని పుష్కలంగా కురిపించారు. నాలుగు దశల్లో పోలింగ్ జరిగితే, ప్రతి దశలోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్’లో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే 80.14 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క విజయనగరం జిల్లా మినహా మరే జిల్లాలోనూ పోలింగ్ 70 శాతానికి తగ్గలేదు.ఇది ఒక విధంగా, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు బద్దకించే, చదువుకున్నాళ్ళకు, మంచి  గుణ పాఠం.  పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, జెండాల ప్రమేయం ఉండదు.. ఉండ కూడదు. అయినా అన్నిరాజకీయ పార్టీలు పంచాయతీ పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు ఆపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమైన అధికార పార్టీ గెలిచినాళ్ళు అందరూ మావాళ్ళు అంటూ .. గెలుపు గ్రాఫ్ ను పైపైకి పట్టుకు పోయింది. అలాగని మెజారిటీ పంచాయతీలను అధికార పార్టీమద్దతుదారులు గెలవలేదని కాదు. అధికార పార్టీ మద్దతుదారులే అధిక పంచయతీలలో జెండా ఎగరేశారు. అందులో సందేహంలేదు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా కుప్పంలో ఓటమి లాంటి కొన్ని గట్టి ఎదురుదెబ్బలు తిన్నా, ప్రధాన పతిపక్ష హోదాను నిలుపుకుంది.  తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి అధికార తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ, ఏపీలోనూ  తెలుగు దేశం పార్టీని ప్రధాన ప్రత్యర్ధి స్థానం నుంచి పక్కకు నెట్టాలనే ప్రయత్నం చేసింది కానీ, ఫలితం దక్కలేదు. చంద్రబాబు నాయకత్వం, తెలుగు దేశం పార్టీకి ఉన్న సంస్థాగత బలం ముందు బీజేపీ వ్యూహాలు ఫలించలేదు, ఒకవిధంగా బెజేపీ మిత్రపక్షం, జనసేన కొంతలో కొంత మెరుగైన ఫలితాలు సాధించింది.  అయితే ఈ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో పార్టీల బలాబలాకు నిదర్శనమా అంటే కాదు. పంచాయతీ ఎన్నికలు పక్కా లోకల్ ఎన్నికలు, పైగా పార్టీల పాత్రా, ప్రమేయం ఏ మాత్రం ఉండని ఎన్నికలు. సో .. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల బలాబలాలకు ప్రామాణికం కాదు. వచ్చే నెల 10 తేదీన జరిగే నగర పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలు, పార్టీ గుర్తులపై జరుగుతాయి. సో ..వచ్చే నెల 14 వరకు ఆగితే, పురపాలక సంఘాల ఎన్నికలఫలితాలు వస్తాయి. పార్టీల బలాబలాలు, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం స్పష్ట మవుతుంది.  అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబదించినంతవరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరైనా అభినందించక తప్పదు. కోర్టు చిక్కులు, ప్రభుత్వ సహాయ నిరాకరణ, నిధుల కొరత, సమయం తక్కువ కావడం ఇలా అనేక అవరోధాలు ఎదురైనా, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్,  స్థితప్రజ్ఞత చూపారు. అందుకు ఆయన్ని, రాజకీయ పార్టీలు ఎంతగా రచ్చచేసినా,పవిత్ర హక్కును అంతే పవిత్రంగా  పవిత్రంగా వినియోగించుకున్న ఓటర్లను అభినందించక తప్పదు.     అయినా  ఈ ఎన్నికలలో గత 2013పంచాయతీ ఎన్నికల్లో కంటే ఏకాగ్రీవలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాలలో కలిపి, 1,835 గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయితే, ఈ ఎన్నికల్లో 2,197 గ్రామపంచాయతీలు ఏకాగ్రీవ మయ్యాయి.  సజావుగా, సక్రమంగా ఏకాగ్రీవాలు జరిగితే అది అభినందనీయమే, అయినా, ప్రలోభాలకు గురిచేసి సాగించిన బలవంతపు ఏకాగ్రీవాలే ఎక్కువకావడం ... అభ్యతరకరమే.  
ఆడపిల్లకు మగవాడు రక్షణ. ఈ సమాజంలో ఇలాగే ఉంది. ఒక కూతురికి తండ్రి రక్షణ, తరువాత తమ్ముళ్లు, లేక అన్నలు. తరువాత భార్యకు భర్త రక్షణ, తల్లిదండ్రులు లేక, భర్త లేక నిస్సహాయంగా ఉన్నవారికి భర్త తమ్ముడో, భర్త తండ్రి(మామయ్య), ఇంకా ఇతర బంధాలు కలిగినవాళ్ళు బాసటగా నిలుస్తూ మేమున్నాం అనే ధైర్యం చెబుతూ ఉంటారు. అలాంటి ధైర్యంతో జీవితాన్ని ముందుకు సాగించే వాళ్ళు ఎందరో ఉన్నారు.  అయితే ఇలా మేమున్నామని ధైర్యం ఇవ్వాల్సిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే. ఒక ఆడపిల్లకు ఈ కాలంలో లోపించిన రక్షణ ఏదంటే నిస్సందేహంగా మాన రక్షణ లేదని చెప్పుకోవచ్చు. ప్రతి అడ్డమైన వెధవకూ అమ్మాయిల్ని చూస్తే అదొక కోరిక పుట్టేస్తుంది. వాడు బలవంతుడు అయితే బలవంతంగానే అమ్మాయిల్ని పాడుచేస్తాడు. ఇలాంటివి బయట ఎక్కడో జరిగితే అందరూ అనే మాట ఒకటి ఉంది. ◆"ఉద్యోగమని ఏదో పొడిచేద్దామని తెగ తిప్పుకుంటూ పోయిందిగా ఏమయ్యింది ఎవడో మాయమాటలు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లి చేయాల్సింది చేసాడు" ◆"వీళ్ళేదో వీరనారులు అనుకుని ఫీలవుతూ సాయంత్రం అయినా ఇంటికి పోవడంలేదు. ఇక ఏమవుతుంది ఎక్కడో తాగిన వెధవలు చూసి వెంటబడి వాడి పని వాడు చేసుకుపోయాడు" ◆"అయినా ఒంటరిగా పోవడం ఎందుకు?? అంత పర్సనల్ పనులు ఏముంటాయి. ఏదో గూడు పుటానీ ఉంటుందిలే" ◆"బట్టలు సరిగ్గా వేసుకుంటే కదా!! ఫాషన్ పేరుతో వగలు పడతారు. మగవాళ్లను రెచ్చగొడతారు"  ఇలా ఒక్కొక్కరు ఒకో మాట మాట్లాడతారు ఎక్కడైనా ఏదైనా రేప్ జరిగిందని తెలిస్తే. సరే వీటన్నిటికీ కారణాలు ఉంటాయి. కానీ వేరే సంగతి ఏంటి?? తాగిన మత్తులో కూతుర్ని తండ్రి బలవంతం చేయడం. భర్త చనిపోయి ఇంట్లో ఉంటున్న కోడల్ని మామ బలవంతం చేయడం. అన్న భార్య మీద మనసు పడి మరిది వదినను బలవంతం చేయడం. సమాజంలో వావి వరుస అనేవి ఎప్పుడో అంతరించి పోయాయి అనే డైలాగ్ కు నిదర్శనంగా ఎక్కడ చూసినా ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి.  వీటన్నిటికి ఎవరు ఏమని సంజాయిషీ ఇస్తారు??  జాగ్రత్తలు కావాలిప్పుడు!! ఇలా జరుగుతున్నప్పుడు ఎవరు ఎవరినీ ఏమనీ నిందించలేం. చాలామంది జరుగుతున్న వాటికి కారణాలు చెప్పి, విమర్శలు చేసి, శిఖలూ వేస్తారు కానీ పరిష్కారాలు ఏంటి అనేది మాత్రం తక్కువే. ఇక్కడ పరిష్కారం అంటే అమ్మాయిలకు నష్టం జరిగిపోయాక వేసే శిక్షలు, ఇచ్చే నష్టపరిహారాలు అనుకుంటున్నారు అందరూ. కానీ అది చాలా తప్పు, అది కాదు కావాల్సింది అసలు ఇలంటివి జరగకుండా చూడాలి. అమ్మాయిలు తమను తాము రక్షించుకోగలిగే సామర్థ్యము కలిగి ఉండాలి. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి. ఈ కాలానికి తగ్గట్టు ఒకరి మీద ఆధారపడటం మానేయాలి, అలాగే మగవాళ్లను చనువుగా మాట్లాడించడం మానుకోవాలి. లేకపోతే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే మహామహులు ఉంటారు.  తోడుగా!! అమ్మాయిలకు జరుగుతున్న ఈ ఘోరాలను ఆపాలి అంటే ఒకరి నుండి మరొకరికి సపోర్ట్ చాలా అవసరం. అమ్మాయిలు ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు ఒంటరిగా కాకుండా కలసికట్టుగా చెయ్యాలి. స్నేహితులు, చుట్టాలు, చనువుగా ఉన్నవారు ఇలా మగవాళ్లను ఎవరిని కూడా అతిగా  నమ్మేయకూడదు. ఎవరితో కూడా వెళ్లకూడదు.  పైనవి ఎన్ని చెప్పుకున్నా ఈ సమాజంలో పక్కనుండి ఇలా పాముకాటు వేసేవాళ్ళు ఎక్కువైపోతూనే ఉన్నారు. అందుకే అమ్మాయిలూ…… జాగ్రత్త!!                                 ◆వెంకటేష్ పువ్వాడ.
ఎల్. కె.జీ బుడ్డోళ్ల నుండి గ్రూప్స్, సివిల్స్ టార్గెట్ గా ఉన్న యంగ్ డైనమిక్స్ వరకు అందరికీ ఈ కాలంలో పరీక్షల గోల తప్పదు, పుస్తకాలు పట్టుకుని చదవడం అంతకన్నా తప్పదు. ఒకప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు బెత్తం పట్టుకుని, ముందు కూర్చుని పిల్లలకు చదివించేవాళ్ళు. ఇప్పుడు నువ్వు చదువుకొని ఎక్సమ్స్ బాగా రాయిరా బాబు నీకు కావలసింది కొనిస్తాం అని లంచాల ఆశ చూపిస్తారు. ఇదంతా పిల్లొళ్ల గోల. మరి పెద్దోళ్ళ గోల సంగతేంటి?? బుక్ తీస్తే పక్కనే ఉన్న మొబైల్ టింగుమని వాట్సాప్ లేదా fb మెసేజ్ అలర్ట్ ఇస్తుంది. మొబైల్ ను దూరంగా పెట్టేసామా కుంకుమపువ్వొ, కార్తీక దీపమో లేక ఇంకా వేరే ఛానెల్స్ పేర్లయినా పెటుకొండి వాటి తాలుకూ డైలాగులు హింసగా సాగిపోయే సెంటమెంట్లు, పిన్ చేంజ్ పెన్సిల్ లాగా పైకి కిందకి ఎక్కి దిగుతూనే ఉంటాయి. వాటి గోల ఒకటి. పోనీ అవి కూడా లేనప్పుడు, మొబైల్  దూరంగా ఉన్నప్పుడు, చదువుకోడానికి ఇంటరెస్ట్ పుట్టినప్పుడు అప్పుడే ఇంట్లో అమ్మ, లేదా నాన్న టింగుమని పిలిచి బయట షాపుకెళ్లి ఏదో ఒకటి తెమ్మని చెబుతారు.  ఇలా యూత్ కు మా చెడ్డకాలం నడుస్తూ ఉంటుంది. దాన్ని మార్చుకోవడానికి ఒక్కొరు ఒకో దారి ఎంచుకుంటారు, వాటిని ఫాలో అవుతారు.  ఇంతకూ ఏంటవి?? ఫ్రెండ్స్ తో గ్రూప్ స్టడీ!! ఇందులో బాగుపడటానికి ఎంత అవకాశం ఉంటుందో, చెడిపోవడానికి అంతే అవకాశం ఉంటుంది. చదువుకోవాల్సిన టైమ్ లో చదువుకోకుండా  మూడు కోతులు కలిసి నాలుగో కోతిని కూడా చెడగొట్టినట్టు కాస్తో, కూస్తో చదవాలనే ఇంటరెస్ట్ ఉన్నోడు కూడా నాశనం అయిపోతాడు. కాబట్టి సీరియస్ గా ప్రిపేర్ కావాలని అనుకున్నవాళ్ళు కలసి గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ చదివితే చాలా కొద్ది సమయంలోనే బోలెడు డౌట్స్ క్లియర్ అయిపోతాయి. పైగా ఒక్కొక్కరు ఒకో బుక్ తెచ్చుకుని నలుగురు డిస్కస్ చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి. కావాల్సిందల్లా సీరియస్నెస్ మాత్రమే.  ఏకాంతం!! చాలామంది బుక్స్ ఎత్తుకుని ఏ పార్క్ కో, లేక ఏ చెట్ల కిందకో వెళ్ళిపోతారు. అబ్బాయిలకు ఈ మార్గం బాగానే ఉంటుంది. కానీ అమ్మాయిలకు ఇబ్బంది. సెక్యూరిటీ ఉండదు. పైగా ఏదైనా వేరే బుక్ లేదా నోట్స్ లాంటివి అవసరం అయితే తిరగడానికి టైమ్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సైకిల్, బైక్ ల మీద వెళ్లే వాళ్లకు ఇది కొంచెం బెస్ట్. లైబ్రరీ!! అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఇదే. ఎలాంటి భయం ఉండదు, బుక్స్ చేతుల్లో మోసుకుపోవాల్సిన అవసరం ఉండదు. న్యూస్పేపర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి హాయిగా రెగులర్ కరెంట్ అఫైర్స్ తో పాటు జనరల్ నాలెడ్జ్ రౌండ్ కొట్టేయచ్చు. అలాగే పోటీ పరీక్షలకు కావల్సిన ఎన్నో బుక్స్ లైబ్రరీలలో ఉంటాయి కాబట్టి చక్కగా చదివేసుకోవచ్చు. అనవసర చర్చలు, మాటలు లేకుండా కీప్ సైలెన్స్ బోర్డ్ ఉంటుంది కాబట్టి ఏ గోలా లేకుండా హాయిహయిగా ఇంటరెస్ట్ గా చదివేయచ్చు. ఇలా ఒకటికి మూడు మార్గాలతో నచ్చిన దారిలో పుస్తకాలతో కుస్తీ పడితే పరీక్షల అంతు చూడచ్చు. ఎడ్యుకేషన్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎలిజిబుల్ ఎక్సమ్ కావచ్చు. అన్నిటినీ చీల్చి చెండాటమే కావలసింది.  అయితే ఓ మాట. చదివే ముందు మరీ ఫుల్లుగా తినద్దు, తినకుండా చదువులో మునగద్దు, తాగడానికి ఒక మంచినీళ్లు బాటల్ దగ్గరే పెట్టుకోండి. ఇక బస్ చదుకోండి!!                                ◆వెంకటేష్ పువ్వాడ.
డబ్బెవరికి చేదు టైపులో జుట్టెవరికి చేదు చెప్పండి. జుట్టేమైనా తింటామా చేదు, తీపి, కారం అనడానికి అని డౌట్ వస్తే దాన్ని అవతలికి తరిమేయ్యండి. ఒకప్పుడు నాగుపాము జడలు, జులపాల జుట్టులు, గాలికి ఎగిరెగిరి పదే హెయిర్ క్రాఫులు అబ్బో ఆ కాలమే వేరబ్బా!! మరిప్పుడో….. హెయిర్ ఫాల్ అనే సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉన్న జుట్టుపోకుంటే చాలు దేవుడా అని కోటి నమస్కారాలు చేసేవాళ్ళు ఎక్కువున్నారు. చెబితే నమ్మరు కానీ అమ్మయిలలో కూడా బట్టతల సమస్య కనబడుతూ ఉంటుందనే మాట వింటే విచిత్రంగానే ఉంటుంది. అవన్నీ వొద్దులే కానీ ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి, తెలిసిన విషయం గురించి కాసింత మాట్లాడుకోవాలి, మాట్లాడుకుంటూ ఆలోచించాలి, ఆలోచించి ఇంకేం చేస్తాం మనం అలా చెయ్యకుండా ఉండాలి. ఎలా చెయ్యకుండా ఉండాలి? జుట్టెవరికీ చేదు కాదు. మళ్లీ అదేమాట ఎందుకంటారా?? సరే జుట్టు అంటే అందరికీ ఇష్టమే. కొంతమందికి అదృష్టవశాత్తు బాగానే ఉంటుంది. జుట్టు లేకపోవడం రాలిపోవడం, క్రమేణా దాని వాల్యూమ్ తగ్గిపోవడం వీటికి కారణాలు బోలెడు ఉంటాయి.  వాటిలో మొదటిది డిప్రెషన్. ఈకాలంలో ఈ మాట సహజం అయిపోయింది. అందుకే జుట్టు తక్కువున్నోళ్లు కూడా ఎక్కువైపోయారు. బట్టతలలు, ఎలుక తోకలు కామన్ అయిపోయాయి. ఏదో ఈకాలం లో ఫాషన్ పుణ్యమా అని కాస్త జుట్టు లూజుగా వదుల్తారు కాబట్టి ఎలుక తోక కూడా చిన్న కాలువలాగా కళకళలాడుతూ ఊగుతూ ఉంటుంది. రెండవ కారణం డిఎన్ఏ. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఫ్యామిలీస్ లో బట్టతల వంశపార్యపరంగా వస్తున్నవాళ్ళు పాపం బోలెడు ఉంటున్నారు. జుట్టు పలుచగా ఉండటం, బట్టతల రావడం మాత్రమే కాకుండా అతిగా జుట్టు పెరగడం కూడా డిఎన్ఏ మాజిక్కే. మూడవ కారణం లైఫ్ స్టైల్. ఆహారంలో biotin పుష్కలంగా ఉండాలి. జుట్టు, గోర్లు, చర్మం మొదలైనవి ఆరోగ్యంగా పెరగాలంటే ఈ పోషకం అవసరం. అలాగే శరీరానికి కావలసినంత విటమిన్ డి, చర్మానికి విటమిన్ ఈ కూడా అవసరం. మొత్తంగా చెప్పాలంటే విటమిన్, ప్రోటీన్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. దాంతో పాటు జుట్టు సంరక్షణ ముఖ్యం. ప్రస్తుత కాలంలో పొల్యూషన్, జంక్ ఫుడ్ వంటివి మనిషి భౌతిక స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుంటాయి. అదే అదే భౌతిక స్వరూపమంటే బాడీ షేప్ అన్నమాట. ఇలా ఇన్ని సమస్యలు మనిషి చుట్టూరా ఉన్నప్పుడు ఆ జుట్టును కోల్పోయేవాళ్ళు కూడా  లోలోపల బాధపడుతూనే ఉంటారు. కానీ ఆ బాధ కంటే కూడా బయటి వాళ్ళు వేలెత్తి చూపించి వెకిలిగా నవ్వుతూ జోక్స్ వేస్తుంటే మాత్రం ఇంకా ఇంకా కుమిలిపోవడం జరుగుతుంది. లేనిదాన్ని ఎక్కడి నుండి తెస్తారు? అదే లేని జుట్టును ఎక్కడి నుండి తెస్తారూ అని ఎవరైనా ఆలోచిస్తారా?? ఎంతసేపూ నీ పిలక, నీ బట్టతల అని ఏకసెక్కాలే కానీ జట్టులో ఏముందిలే మనిషి స్వభావం మంచిది అని ఎవరైనా అనుకుంటారా?? లేదే ఇతరుల్ని ఇన్సల్ట్ చేయడం అదొక రాచకార్యం అయిపోయింది అందరికీ.  ఇవన్నీ తెలిసాక ఇంకొక విషయం. ఉత్తరప్రదేశ్ లో ఉన్నావ్ లో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లో పెళ్లిలో పెళ్లి కొడుకు పాపం కళ్ళు తిరిగి పడిపోయాడు. అమ్మాయి వాళ్ళ అన్నయ్య పెళ్లి కొడుకు ముఖం మీద నీళ్లు జల్లి పైకి లేపుతున్నపుడు అతడి టైమ్ బాగలేక పెట్టుకున్న విగ్గు జారిపోయింది, అప్పటివరకు పెళ్లి కొడుక్కు స్టైల్ హెయిర్ స్టయిల్ అనుకున్న అమ్మాయి డిజప్పాయింట్ అయిపోయింది. ఇంకేముంది సినిమాటిక్ గా ఈ పెళ్లి క్యాన్సిల్ డైలాగ్ కూడా చెప్పేసింది. చెప్పేసాక ఇక ఏమవుతుంది ?? పెళ్లి ఆగిపోయింది. ఇలా ఇలా అన్నీ బాగున్నా కేవలం జుట్టు కారణంగా మనుషుల మధ్య ముఖ్యంగా ఆడ, మగ రిలేషన్స్ మధ్య ఈ జుట్టు పెద్ద సమస్యలే తెచ్చిపెడుతోంది.  అందుకే జుట్టు విషయంలో పిచ్చిగా ఉండకండి. లైట్ తీసుకోండి.                              ◆వెంకటేష్ పువ్వాడ.
శరీరంలో వస్తున్న మార్పులకు కారణం థైరాయిడ్ కావచ్చు.శరీరం లోని హార్మోన్ల లోపం వల్ల వచ్చే సంకేతంగా చెప్పవచ్చు. థైరాయిడ్ సమస్య ముఖ్యంగా స్త్రీల పైనే తీవ్ర ప్రభావం చూపిస్తుంది.నేడు స్త్రీలు ఎదుర్కుంటున్న అనారోగ్య సమస్యలలో బిపి,డయాబెటిస్,లాంటి సాధారణ సమస్యలతోపాటు,ఇంఫెర్టిలిటి,సంతాన లేమి సమస్య లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం,లేదా ఇతర అనారోగ్య సమస్యలు వారిని వేదిస్తున్నాయి. థైరాయిడ్ వచ్చిందని తెలిపే సంకేతాలు ఇవే... థైరాయిడ్ ఎలాంటి వ్యాధి అంటే నేడు ప్రపంచంలో నేడు ప్రతి ఐదు గురిలో థైరాయిడ్ బాధితులు ఉన్నారన్నది వాస్తవం. నేటి పరిస్థితులలో పురుషులకంటే మహిళల లోనే ఈ సమస్య ఎక్కువ చూడవచ్చని ఆరోగ్యనిపుణులు భావిస్తున్నారు. థైరాయిడ్ హార్మోన్ మన శరీరం పనిచేయడం లో కీలకంగా ఉంటుంది.శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనా తక్కువ అయినా ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపిస్తుంది.థైరాయిడ్ వల్ల వస్తున్న మార్పులు స్పష్టం గా కనిపిస్తాయి.థైరాయిడ్ హార్మోన్ ఇచ్చే సంకేతాలు కొన్ని ఉపచారాలఅవసరం అలా థైరాయిడ్ ను నియంత్రించడం లో యోగా సహకరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. థైరాయిడ్ లో రకాలు... హైపర్ థైరాయిడ్ -- ఇందులో థైరాయిడ్ చాలా ఎ క్కువ సంఖ్యలో తయారు అవుతుంది.ఈ కారణంగా శరీరంలో బరువు చాలా త్వరగా త్గగ్గిపోతుంది. హైపో థైరాయిడ్ --- ఇందులో థైరాయిడ్ చాలా తక్కువగా సంఖ్యలో తయారు అవుతుంది.దీనికి తోడు పంచేంద్రియాలలో  సమస్యలు ప్రారంభ మౌతాయి. ఊబకాయం,సంతాన లేమి సమస్యలు వేదిస్తాయి. థైరాయిడ్ లక్షణాలు /హార్మోన్ సమస్యలు... థైరాయిడ్ హార్మొన్ నియంత్రణలో లేకపోవడం వల్ల మీ జుట్టు ఊడిపోవడం,మీ కనుబొమ్మలు తగ్గిపోతాయి.రాత్రి అంతా నిద్ర పోయినప్పటికీ పగలు అంతా తీవ్రమైన అలసట అనిపిస్తుంది.బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. లక్షణాలలో భాగంగా.. --కారణం లేకుండానే చింతించడం-ఒత్తిడికి గురికావడం-- --థైరాయిడ్ హార్మోన్ నియంత్రణ లేనికారణం గా ఊబకాయం పెరుగుతుంది.లేదా ఒక్కోసారి బరువు తగ్గిపోతారు. ---మహిళలలో థైరాయిడ్ హార్మోన్ తగ్గడం వల్ల స్త్రీలలో నెలసరి సమస్యలు వస్తాయి. --థైరాయిడ్ కారణం గానే ఎప్పుడూ వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది.చాలా వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. --థైరాయిడ్ గ్రంధిలో వాపు దీనివల్ల స్వరంలో మార్పు ఉంటుంది. --పైన పేర్కొన్న అంశాలాలో ఏ లక్షణం మీకు కనిపించినా అలస్యం డాక్టర్ ను సంప్రదించండి.డాక్టర్ సూచనలు పాటించండి థైరాయిడ్ నియంత్రణ  చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి. ఖర్చులేకుండా సహజ పద్దతుల ద్వారా థైరాయిడ్ నియంత్రించ వచ్చు.దీనిప్రభావం చాలా త్వరగా ఉంటుంది. థైరాయిడ్ సమస్యకు చికిత్స లేదన్నది వాస్తవం కాదు.సమయాను గుణంగా నియంత్రించడం ద్వారా అన్ని సమస్యల మాదిరిగాదీనిని నియంత్రించ వచ్చు ఇతర చికిత్స లో ఖర్చులేకుండా యోగ సాధన ద్వారా థైరాయిడ్ ను నియంత్రించవచ్చు. మన శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.శరీరంలో ఒక్కో భాగం ఒక్కొరకం గా పని చేస్తాయి.అందుకోసం అత్యవసరమైన హార్మోన్లు ఉత్పత్తి  చేస్తుంది.థైరాయిడ్ గ్రంధి ఒక చిలక బటర్ ఫ్లై రూపంలో ఉంటుంది.అక్కడ నుంచి థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది.అది మన శరీరానికి అవసరం ఒక్క సారి థైరాయిడ్ ఉత్పత్తి ఎక్కువగా తక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది.దీనివల్ల శరీరంలో పనితీరు పై తీవ్ర ప్రభావం చూపుతుంది.దీనిని నియంత్రించేందుకు కొంత సేపు యోగా చేయడం ద్వారా ప్రభావం చూపవచ్చని నిపుణుల విశ్లేషణ అసలు ఎలాంటి ఆసనాలు వేయాలి వాటివల్ల ప్రయోజనం ఏమిటో చూద్దాం. సర్వాంగ ఆసనం... సర్వాంగ ఆసనం థైరాయిడ్ ని నియంత్రించడం లో చాలా ప్రభావ వంత మైన అసనంగా పేర్కొన్నారు.దీనివల్ల పైన పేర్కొన్న అంశాలలో రక్త ప్రసారం సరైన పద్దతిలో జరుగుతుంది.ఈ ఆసనం సాధన చేయడం ద్వారా థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది.దానిపని తీరు మెరుగు పడుతుంది. హలాసనం... హలాసనం ద్వారా థైరాయిడ్ పిట్యుటరీ గ్రంధుల పనితీరు మెరుగు పడుతుంది.ఆసనం వల్ల మన శరీరం లో ముఖ్యంగా వెన్నుపూసలోని మెరుగు పాడేందుకు ఉపయోగ పడుతుంది.దీనితోపాటు పొట్ట పెరగడాన్ని చాలా ఫలప్రదంగా ఉపయోగ పడుతుంది.ఈ ఆసనం సాధన చేయడం ద్వారా మాంసం కండరాలు పై ఒత్తిడి తగ్గుతుంది. మస్చ్య ఆసన... వెనుక వైపుకు ఒంగే ఈ ఆసనం గొంతు,చాతి,భుజాలు,పొట్ట ను పెంచుతుంది.లేదా తెరుస్తుంది.యోగాలో వేసే ఈముద్ర పొట్ట శరీరం పై భాగాలను యాక్టివ్ చేస్తుంది. అవిసక్రమంగా తమ పని చేసుకుపోతాయి.' విపరీత కారిణీ... ఈ ఆసనం వల్ల లాభాలు ఏమిటి అంటే సర్వాంగ ఆసనం లాగానే ఉంటుంది.ఇందులో కూడా పొట్ట పైకి తల క్రిందికి ఉంటుంది.ఆసనం సాధన చేస్తున్నప్పుడు మనం వీపుతో పాటు గొంతు ఒత్తిడి పెరుగుతుంది.ఆసనం వేస్తున్నప్పుడు మనం వీపుతోపాటు గొంతు పై ఒత్తిడి పెరుగు తుంది.దీనివల్ల థైరాయిడ్ గ్రంధి యాక్టివ్ గా ఉంటుంది. ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం సందర్భంగా థైరాయిడ్ ను నిర్లక్ష్యం చేయవద్దని సరైన వైద్యం తో పాటు సాంప్రదాయ యోగాసధనాల ద్వారా థైరాయిడ్ కు అడ్డకట్ట వేయవచ్చని నిపుణులు   
మన శరీరం లో కొన్ని రసాయనాలు పోరాడతాయి. మీ కణాలలో దీనిని అక్సిడేషన్ ముఖ్య కారణం. కొన్ని మొక్కల ఆధారం గా లభించే ఆహారం కాని మీ శరీరం కొన్ని రకాల పోషకాల వల్ల ఆరోగ్యంగా  ఉంటారు.అది ఆక్సిడెంట్స్ అని చెప్పవచ్చు. అసలు ఆక్సిడెంట్ అంటే ఏమిటి?... మనశరీరం లో ఉండే రాసాయనాలు మీ కణాలను కాపాడేందుకు పోరాడతాయి.దీనిని ఆక్సిడేషన్ అని  పిలుస్తారు.దీనికి ఆధారం కొన్ని రకాల ఆకు కూరలుఅవి మీకు విటమిన్ సి డి లను అందిస్తాయి. బీటా కెరటన్,మినరల్స్ సెలనియం మాంగనీస్,ప్లాంట్ న్యుట్రియంట్స్ మరియు రసాయనాలు.ఫ్లావో  నాయిడ్స్ ముఖ్యంగా పల్లీలు పోటి సినట్స్, పిటో ఈస్ట్రో జన్స్ ,కూడా యాంటి ఆక్సిడెంట్స్ అని అంటారు. యాంటి ఆక్సిడెంట్స్ ఏమి చేస్తాయి... ఒక్కొకటి వివిధ రకాలుగా పనిచేస్త్గాయి.అన్ని కలిసి సమూహంగా ప్రీ రాడికల్స్ పై పోరాడతాయి.ఈ రసాయనాలను ఆక్సిడేషన్ తయారు చేస్తాయి.  అది మీకణాలను నాశనం చేస్తాయి.వాటిలో జనటిక్ మెటీరియల్ ఉండచ్చు.అందులో మన శరీరాన్ని ప్రీ రాడికల్స్ ఆహారాన్ని తయారు చేస్తాయి.ఎండ,టాక్సిన్స్ అందులోనూ పొగలు ప్రకృతి కాలుష్యం ఆల్కాహాల్ వంటివి యాంటి అక్సిడెంట్స్ ప్రీ రాడికల్స్ ను ఆపాలి అవి తయారయ్యే ముందు నిండిపోవాలి లేదా విచ్చిత్తి కావాలి.లేదా అది హానికారకం కావు.అని నిపుణులు అంటున్నారు. విటమిన్ ఇ... ఆక్సిడెంట్స్ ఫ్యాట్స్ లో నిల్వ ఉంటాయి.వాటిని ఫ్యాట్ సాలబుల్ అవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడు తాయి.మీ శరీరంలో ఉన్న కొవ్వు కణాలు గోడల పై దాడి చేస్తుంది.ఎల్ డి ఎల్ కొలస్ట్రాల్  ఆర్టిప్ లో చేరతాయి.అది మీ గుండె సంబంధిత సమస్యలు వ్యాధులు దారి తీస్తుంది. విటమిన్ ఇ ని ఎలాతీసుకోవాలి.. పప్పులు,కూరగాయలు,ఆలివ్ ఆయిల్,సన్ ఫ్లవర్ఆయిల్ ,కనోల్,ఆకు కూరలు,కొన్ని నట్స్ ద్వారా విటమిన్ ఇ పొందవచ్చు. విటమిన్ సి.... దీనిని అస్కి బిక్ యాసిడ్ అది నీటిలో నిల్వ ఉంటుంది.దీనిని వాటర్ సోలబుల్ దీని ని వాడడం వల్ల పొట్టలో వచ్చే క్యాన్సర్, లేదా ఊపిరి తిత్తులలో వచ్చే క్యాన్సర్ ,ఆహారం అరుగుదల తదితరాలకు విటమిన్ సి ఉపయోగ పడుతుంది.పచ్చటి ఆకుకూరలు టమాటాలు సిట్రస్ ఫ్రూట్స్,ఆరంజ్,సంత్ర,ద్రాక్ష పచ్చి ఆహారాలు వండడం ద్వారా అందులో ఉండే ఇతర విటమిన్స్ నాశనం అవుతాయి. బీట్ కెరోటిన్... అవి ఫ్యాట్స్ ను అందిస్తాయి.అవిపసుపు రంగులో,పసుపచ్చ,ఆరంజ్ ,ఎర్రటి రంగులో ఉండే ఆహారం పళ్ళు మన శరీరం రేటినట్ రంగులోకి మారుతుంది.అది మీకు సప్లిమెంట్స్ రూపం లో తీసుకుంటే ప్రమాదం కావచ్చు.ఆహారం ద్వారా తీసుకోవడం మంచిది అది కొన్నిరకాల పండ్లు పప్పులు క్యారట్స్ ,పాల కూర ఇతర ఆకుకూరలలో లభిస్తుంది. లైకో పెన్... కెరోట నైడ్ వల్ల మనశరీరంలో వచ్చే ప్రోస్టేట్,ఊపిరి తిత్తుల వక్షోజాలక్యాన్సర్ నుండి రక్షిస్తుంది. లైకో పెన్ ను తీసుకోవడం ఎలా వండిన తయారు చేసిన ట మాటాల నుండి లభిస్తుంది.పాస్తాలో మీరు తీసుకునే మారినా సాస్, టమాటాలను వేడి చేయడం ద్వారా శరీరానికి చాలా సులభంగా లైకో పెన్ కలిసి పోతుంది.దీనిలో ఆలివ్ ఆయిల్ వేయడం ద్వారా కొవ్వు చేరి శరీరానికి విటమిన్లను అందిస్తుంది. సీలినియం... సెలీనియం మనకు నీటిలో భూమిలో కనిపిస్తుంది.మనకు దీనిద్వారా లభించే మినరల్స్ థైరాయిడ్ కు పనిచేస్తాయి.వీటిపై చేసిన పరిశోదనలో సెలీనియం ప్రత్యేకంగా ఎక్కువగా తీసుకుంటే ఊపిరి తిత్తుల క్యాన్సర్ లేదా పెద్దపేగు లో వచ్చే క్యాన్సర్,ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి వస్తాయి.వీటిని సప్లిమెంట్ రూపం లో తీసుకుంటే సమస్యలు తప్పవు.అది ఒక్కోసారి అన్నవాహిక సమస్యలకు కారణం  అవుతుంది.దీనికారణం గా జుట్టు,గోళ్ళు కోల్పోక తప్పదు. సిలినియం తీ సుకోవాలంటే పాప్పులు, ఉల్లిపాయాలు,వెల్లుల్లి, సోయాబీన్స్,సముద్రపు ఆహారం,మాంసం,లివర్ ద్వారా సిలినియం పొందవచ్చు. ఫ్లావో నాయిడ్స్... శాస్త్రజ్ఞులకు 4,౦౦౦ రకాలకు పైగా ఉన్న యాంటి ఆక్సిడెంట్స్ పండ్లు కూరగాయలలో యాంటి ఆక్సిడెంట్ ఉన్నట్లు గుర్తించారు.కాగా ప్రతి మొక్కలో రకరకాల వాసనలలో యాంటి ఆక్సిడెంట్ ఉంటాయని గుర్తించారు.అవి మీ గుండె సంబంధిత సమస్యలకు క్యాన్సర్ ఆర్తరైటిస్,జ్ఞాపక శక్తి కోల్పోవడం స్ట్రోక్,ఇన్ఫెక్షన్ ఇంఫ్లామేషణ్ నుండి రక్షిస్తాయ ఒమేగా ౩... ఒమేగా 6 ఫ్యాంటి యాసిడ్స్ ఒమేగా౩ గుండె సంబంధిత సమస్య నుండి రక్షణ కల్పిస్తుంది. స్ట్రోక్ అర్తరైటిస్ క్యాట్రాక్ట్,క్యాన్సర్,నివారణలో సహాయ పడగలవు. ఒమేగా 6 ఎస్ ఎక్జిమా,సోరియాసిస్,ఆస్టియో ప్రోరోసిస్,వంటి వాటిని నియంత్రించడం లో సహకరిస్తుంది. మీ శరీరం లో అత్యవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ ను తయారు చేయాలేదు.ఇంఫ్లామేషన్ ను నిరోదిస్తుంది అందుకే చాలామంది అమెరికన్లు ఒమేగా 6 లేదా ఒమేగా ౩ లేదా మాంసకృత్తులు ఉంచేందుకు ఒమేగా 6 ను ఆహారం లో తీసుకుంటారు. అయితే ఒమేగా౩ ని తక్కువగా ను వినియోగిస్తారు.మనకు ఒమేగా6 ఒక భాగం కాగా ఒమేగా ౩ సప్లిమెంట్ మాత్రమే అది ఆహారం ద్వారా లభిస్తే మరీ మంచిది. ఒమేగా మనకు ఎలా లభిస్తుంది... వాల్ నెట్స్,సాల్మన్,ట్యూన్,సార్టి నిస్ లో ఒమేగా ౩ ఒమేగా6 కూరగాయలు,నూనెలు, నట్స్,ఫౌల్ట్రీ లలో ఒమేగా6 ,ఒమేగా ౩ లభిస్తుంది. మీరు ఒక మాత్ర మాత్రమే వేస్తే సరిపోదు... దీర్ఘ కాలం పాటు జరిపిన పరిశోదనలో వేయికి పైగా ప్రజలతో నిర్వహించిన పరిశోదన.యాంటి అక్సిడెంట్స్ మాత్ర ద్వారా తీసుకుంటే అనారోగ్యం తగ్గదని ఎవరైతే గుండె సమస్యలు క్యాన్సర్,క్యాట్రాక్ట్,ఒకే స్థాయిలో ఉండడానికి వయసుతో సంబంధం లేదని లేదా వయస్సు రీత్యా వచ్చిన అరుగుదల యాంటీ ఆక్సిడెంట్స్ సప్లిమెంట్స్ మెల్లగా అభివృద్ధి చేస్తాయి.కంటికి సంబందించిన సమస్యలకు చాలా ఆలస్యంగా తీసుకుంటారు. అతిగా యాంటి అక్సిడెంట్స్ తీసుకోవడం మంచిదేనా?... చలారకాల యాంటి ఆక్సిడెంట్స్ ఆహారం ద్వారా తీసుకోవడం లేదా సప్లిమెంట్ ఫాం లో అతిగా తీసుకోవడం వల్ల మీకు తాగే అలవాటు ఉంటె ఊపిరి తిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.విటమిన్ ఇ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్,స్ట్రోక్ వచ్చే అవకాశం ఈ ఉత్పత్తులు కొన్ని మార్గాలు మాత్రమే అని మీరు వాడె అన్ని విషయాల గురించి పూర్తిగా వివరించండి.మరో మందు రూపం లో ఇవ్వరు. కాబట్టి యాంటి ఆక్సిడెంట్స్ శరీరానికి ఉపయోగము అతిగా వాడితే ప్రమాదము అన్న విషయం మీరు గ్రహించాలి.               
పార్కిన్ సన్స్ కు స్టెమ్ సెల్ తెరఫీ చికిత్స ద్వారా లక్షణాలను రివర్స్ చేయవచ్చుఅంటున్నారు శాస్త్రజ్ఞులు. పార్కిన్ సన్స్ వ్యాధి మెదడులోని న్యురాన్స్ మెదడు మధ్య భాగం లో నాశనం చేస్తాయి.మెదడులోని డిపో మైన్ న్యూరో ట్రాన్స్ మీటర్ ద్వారా కదలికలను నియంత్రించ వచ్చు. ఒక నూతన పరిశోదన లో శాస్త్రజ్ఞులు నాన్ న్యూరోసెల్స్ ను మార్పు చెందడం ద్వారా న్యురా న్స్ ను తిరిగి పని చేయించ వచ్చు.న్యురాన్ ను ఇప్పటికే ఎలుకల పై న్యూరాన్లు గ్రాఫ్ట్ చేయగా అవి రివర్స్ అయ్యాయి.పార్కిన్ సన్స్ ను కొంతమేర రివర్స్ చేయవచ్చని వివరించారు. ప్రపంచం లో 1౦,౦౦౦ మిలియన్ల ప్రజలు పార్కిన్ సన్స్ వ్యాధితో బాధ పడుతున్న వారికి ఇది ఊరట నిస్తుందని అంటున్నారు శాస్త్రజ్ఞులు. పార్కిన్ సన్స్ ఫౌండేషన్ అందించిన వివరాల ప్రకారం పార్కిన్ సన్స్ కు ఎల్ డోపా మందు బ్రెయిన్ లో ఉండే డో పామైన్ కొన్ని లక్షణాలను ఎలివేట్ చేస్తుంది.ఏది ఏ మైనప్పటికి ఈ మందు ను అదే పనిగా వాడితే డిస్కి నీషియా అంటే శరీరం లో తన ప్రమేయం లేకుండానే కదలికలు వస్తాయి. న్యూరో డీ జనరేటివ్ డి జార్దర్ లో ఒక ముందడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తారు. పార్కిన్ సన్స్ మధ్య మెదడులో న్యురాన్స్ ను గుర్తించి నాశనం చేస్తుంది.న్యూరాన్లు డో పామైన్ ను న్యూరో ట్రాన్స్ మీటర్ వల్ల కదలికలలో కీలక పాత్ర పోషిస్తుంది. మెదడులో డోపమైన్ లోపం వల్ల పార్కిన్ సన్స్ లక్షణాలు వస్తాయి.దీనికారణం గా నే ట్రీమర్స్, స్టిఫ్ నెస్,వినికిడి శక్తి తగ్గడం. ఈకారణం గానే సమన్వయ లోపం వస్తుంది. శాస్త్రజ్ఞులు అవిశ్రాంతం గా చేస్తున్న పరిశోదనలు ప్రభావ వంతమైన చికిత్స అందించేందుకు దోహదం చేస్తుంది.మరింత సమాచారం సేకరించ వచ్చని తెలుస్తోంది. ఒక నూతన పరిశోదన లో రీ జన రేటివ్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించారు.ముఖ్యంగా పార్కిన్ సన్స్ లో మోటార్ సిస్టం ను రివర్స్  చేయడం కోసం ఫ్లూరి పొంటేంట్ స్టెమ్ సేల్స్ ను ఎలుకల లో ఇంప్లాంట్ చేయడం ద్వారా న్యురాన్స్ మార్చడం ద్వారా వ్యాధిని నాశనం చేస్తాయని పేర్కొన్నారు. ఐ పి ఎస్ సి సేల్స్ కు చికిత్స డో పామైన్ ఉత్పత్తి ద్వారా న్యురాన్స్ ను పనిచేయించడం ద్వారాడాక్టర్ జేమ్స్ బెక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ సైన్స్ ఆఫీసర్ పార్కిన్ సన్స్ ఫెడరేషన్ స్వచ్చంద సంస్థ పార్కిన్ సన్స్ తో ఇబ్బంది పడే వారిజీవితాలాను వృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నారు. పార్కిన్ సన్స్ నివారణకు ఆధునిక పరిశోధన జరుపుతున్నారు. ఎలుకలలో సేల్స్ ను బ్రెయిన్ కు ఇంప్లాంట్ చేసినప్పుడు ఒక పరిశోదన లో ఫైబర్ బ్రాంచ్ కనక్ట్ చేయడం ద్వారా మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేస్తుంది. నియమ నిబంధనల అమలు... పార్కిన్ సన్స్ పై చేస్తున్న పరిశోధనలకు కొన్ని నియమనిబంధనలు పరిమితుల ను విజయ వంతం గా అమలు చేసారు.ముజ్హ్యంగా న్యూరో సేల్స్ కానివాటిని న్యురాన్స్ గా పనిచేయించడం అంటే కణాలు ఉత్తమ మైన వని డాక్టర్ జెఫ్రీ కోర్టోవర్ డైరెక్టర్ ఏ ఎస్ యు బి ఏ ఎన్ ఎన్ ఇ ర్ న్యూరో డీ జన రేటివ్ రీ సెర్చ్ సెంటర్ ఆరిజోనా స్టేట్ యునివర్సిటి లోనిపుణులు  తెలిపారు. కణాలను పూర్తిగా 17 నుండి24 రోజుల వరకు కల్చర్ చేసారు.కణాల అభివృ ద్ది ఉత్తమ ఫలితాలు అందిస్తుందని డాక్టర్ బెక్ తెలిపారు. మొత్తం మీద ఈ పరిశోదనలో17 మంది పాల్గొన్నారు.17 రోజులపాటు వారికి చికిత్స కల్చర్ చేసినట్లైతే వారిలో ఉన్న వివిదరకాల సమస్యలు మార్పులు వర్గీకరించి ఉత్తమం గా పని చేయవచ్చని.డాక్టర్ కోర్ట్ వర్ అభిప్రాయ పడ్డారు. ఈ కణాలను ఎలుకల్ మెదడులోకి క్రాఫ్ట్ చేసినప్పుడు వాటికికణాలు  త్వరగా పెరిగాయని డాక్టర్ కోర్టోవర్ అన్నారు. కణాలను మామూలుగా వాటి వాటి మెదడులో ఇంప్లాంట్ చేయడం ద్వారా వారిలో దీర్ఘకాలం పాటు ఉండే శక్తి ఉంటుందని డాక్టర్ కొడోవర్వివరించారు.తిరిగి అవికోలుకోవాలంటే డోస్ పైనే ఆధార పడి  ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక పరిశోదనలో పరిశోధకులు ఐ పిఎస్ సి ఇచ్చిన డోస్ లో ప్రభావం ఎలాఉంటుంది పరిశీలించలేదని డాక్టర్ కోరోవర్  అన్నారు. న్యూరో సర్జన్లకు మాత్రమే ఎన్ని సేల్స్ ఇంప్లాంట్ చేయవచ్చో తెలుస్తుందనిఅనారు. కొన్ని కణాలు బాగానే ఉన్నా అవి తగ్గించబడి దీర్ఘకాలం గా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చునని మీరు చూడాలనుకున్న ప్రభావం మీరు చూడవచ్చని.నిపుణులు స్పష్టం చేసారు.    కొన్ని కణాలు ఇంప్లాంట్ చేస్తే ఉదాహరణకు 5,౦౦౦ వేస్తే పనిచేసేందుకు రికవరీ  ఉండవని డాక్టర్ కోరోవర్ వివరించారు.1౦,౦౦౦ కణాలు ఆపైన కణాలు ఇంప్లాంట్ చేసినా 4 నెలలో పూర్తిగా పనిచేయడం కోలుకోవడం ఎలుకలలో కనిపించిందని పేర్కొన్నారు. చికిత్స చాలా సురక్షితమని పేర్కొన్నారు.అయితే మెదడులో ఎటువంటి ట్యూమర్లు రాలేదని చూడలేదని కొన్ని కణాలు మాత్రమే వేరు పడ్డాయని పెద్దగా ఇబ్బంది లేదని వీటిని అమలు చేయవచ్చని తెలిపారు. ఇక హ్యూమన్ ట్రైల్స్ మిగిలి ఉన్నాయి.... మేము చేసిన పరిశోదన చాలా నమ్మకం కలిగించిందని.ఇక రోగులపై నేరుగా ట్రయల్స్ నిర్వహిస్తామని అన్నారు.క్లినికల్ ట్రైల్స్ కూడా డాక్టర్ కొడోవర్ ఇన్వెస్టి గేషణ్ పరిశోదన2౦2౩ వరకు కొనసాగుతుందని ప్రజలలో వ్యక్తిగతంగా పార్కిన్సన్స్ లో రక రకాల మార్పులు వస్తున్నాయని జన్యు పరమైన మార్పులను గమనించ నున్నట్లు.తెలిపారు. వ్యక్తి గతంగా పార్కిన్ సన్స్ అనుభవాలు డోపమైన్ విధానం తిరిగిపోవడం మోటార్ పని చేయక పోవడం వంటివి పార్కిన్ సన్స్ దిమ్నీషియా వృద్ది చెందడం వల్ల ఖచ్చితంగా సేల్స్ మార్పిడి ప్రణాళిక బద్ధమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉటుంది.అప్పుడు మాత్రమే పరిశోదన ఉపయోగ పడుతుందని తెలిపారు. పరిశోదన విజయవంత మైతే పెద్దస్థాయిలో పరిశోనలు ట్రైల్స్ ప్రజలతో నిర్వహించాల్సి ఉంటుంది.జంతువుల పై చేసిన పరిశోదనలు ఎల్లప్పుడూ వాటిని తర్జుమా చేయలేమని మనుషులపై చేసే ప్రయోగాలు మాత్రం నిత్యం మార్చడం సాధ్యం కాదు.