LATEST NEWS
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్వల్ప వ్యవధిలోనే..  పలు కీలక నిర్ణయాలతో రాజకీయాలకు అతీతంగా మంచి మార్కులు కొట్టేస్తున్నారు.   ఈ తరుణంలో  ఎన్నికలలో తన సొంత నియోజకవర్గమైన  కోలత్తూరులో  ఊహించని రీతిలో ఓటమి పాలైన స్టాలిన్ కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు.  అదలా ఉంటే.. అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు   తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో రంగంలోకి దిగాలని స్టాలిన్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈస్ట్ తిరుచ్చి నుంచి టీవీకే అధినేత విజయ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.  నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో విజయ్  తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా త్వరలోనే తిరుచ్చి ఈస్ట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.  ఈ ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీకి దిగి.. విజయ్‌తో  నేరుగా తలపడేందుకు సిద్ధంగా ఉన్నానని నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మరోవైపు..  డీఎంకే శ్రేణులు కూడా ఈ స్థానంపై తీవ్రంగా దృష్టి సారించాయి. తిరుచ్చి సౌత్ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ మేరకు కీలక తీర్మానాన్ని కూడా ఆమోదించింది.  తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్వయంగా పోటీ చేయాలని పార్టీ స్థానిక నాయకత్వం, శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావచ్చని వారు అంటున్నారు. అయితే, ఈ స్థానంలో పోటీ చేయడం స్టాలిన్‌కు అంత తేలికైన విషయం కాదు. ఇది ఒక రకంగా అతిపెద్ద జూదమనే చెప్పాలి. ఎందుకంటే..  విజయ్ నేతృత్వంలోని టీవీకే కి ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా స్టాలిన్ ఓటమి పాలైతే, అది ఆయన రాజకీయ జీవితంలో   కోలుకోలేని దెబ్బగా మారే అవకాశం ఉంది. కాగా ఈస్ట్ తిరుచ్చి ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీ చేస్తారన్న అధికారిక ప్రకటన అయితే ఇంత వరకూ రాలేదు. ఈ స్థానం నుంచి స్టాలిన్ నిజంగానే బరిలోకి దిగుతారా అన్న విషయంలో స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.  
తమిళనాడు మాజీ ఉపముఖ్యమంత్రి, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో యూటర్న్ తీసుకున్నారా?  అన్న విషయంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  గతంలో సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన..  తాజాగా  తాను సమాజంలో కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమని, దేవాలయాలలో పూజా విధానాలు, ప్రజల మత స్వేచ్ఛకు తాను వ్యతిరేకంగా కాదనీ పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది.  ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఓటమి పాలైనప్పటికీ.. ఉదయనిధి స్టాలిన్  తన పాత పంథాను వీడలేదు.   తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని రాష్ట్రం నుండి పూర్తిగా తుడిచిపెట్టాలనే డిమాండ్‌ను ఆయన మళ్లీ గట్టిగా వినిపించారు. అయితే..  ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై   తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.  అలాగే తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) కూడా ఉదయనిథి స్టాలిన్ కు గట్టి రిటార్డ్ ఇచ్చింది. సనాతన ధర్మ నిర్మూలన అంటే   అర్థం ఏమిటో, దానిపై ఉదయనిథి స్టాలిన్ కు ఉన్న ఖచ్చితమైన అభిప్రాయం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. అధికార పక్షం నుండి ఊహించని విధంగా ఒత్తిడి రావడంతో ఉదయనిధి స్టాలిన్ డిఫెన్స్ లో పడ్డారు. టీవీకే డిమాండ్ పై స్పందించిన ఆయన తన స్వరం మార్చి..  తాను సమాజంలో ఉన్న అసమానతలకు, కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమన్నారు.  దేవాలయాల పూజా విధానాలపై కానీ, ప్రజల మత స్వేచ్ఛపై కానీ ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు.  ఉదయనిధి స్టాలిన్ హఠాత్తుగా ఇలా యూటర్న్ తీసుకోవడంపై కూడా నెటిజనులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.  సనాతన ధర్మం పట్ల నిజంగానే ఆయనకు అంత మృదువైన అభిప్రాయం ఉంటే..  దానిని పూర్తిగా నిర్మూలించాలంటూ ఎందుకు  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నిలదీస్తున్నారు.   రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన అప్పట్లో మాట్లాడారని దుమ్మెత్తి పోస్తున్నారు.  
తిరుమల తిరుపతి దేవస్థానం  మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి సైకిలెక్కారు. తిరుపతి నగరంలో ఆయన సైకిల్ పై తిరుగుతూ అందరి దృష్టినీ ఆకర్షించారు.  పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో ఇంధనాన్ని పొదుపు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించి  భూమన  తిరుపతి నగర వీధుల్లో దాదాపు 10 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుతూ ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు  సామాజిక మాధ్యమాల్లో  వైరల్ అయ్యాయి.  వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, తెలుగుదేశం పార్టీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే నాయకుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. సాధారణంగా  అవకాశం ఉన్నా లేకున్నా టీడీపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకునే భూమన.. ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌ను ఎక్కి ప్రయాణించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రధాని పిలుపునిచ్చిన వెంటనే కాకుండా..   రాష్ట్రంలో అధికార కూటమి నేతలు ఇంధన పొదుపు కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత భూమన  సైకిల్ ప్రయాణం చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ పరిణామంపై రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు సైతం  స్పందిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ గుర్తుపై ప్రయాణించినప్పటికీ, ఇంధన పొదుపు అనే మంచి ఆశయం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భూమన అనుచరులు సమర్ధించుకుంటున్నారు. అదలా ఉంటే భూమన  సైకిల్ ప్రయాణానికి సంబంధించిన వార్తా కథనాలను వైసీపీ అనుకూల మీడియా సంస్థలు కూడా ప్రముఖంగా ప్రసారం చేయడం విశేషం. పర్యావరణ పరిరక్షణ, దేశ ఆర్థిక భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒకరోజు ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని భూమన ఈ సందర్భంగా సూచించారు. ప్రధాని మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు రకరకాలుగా తమ మద్దతును ప్రకటిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంధన పొదుపు కోసం బైక్ ఉపయోగించగా, బిహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రతి శుక్రవారం కాలినడకన సచివాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  స్కూటీపై ప్రయాణించారు.  
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన మధ్యంతర బెయిలు కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది.  భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో దనలు సుదీర్ఘంగా సాగాయి.  భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది, వైసీపీ ఎంపి  నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.   ఆయనను అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు  తెలిపింది.  ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తదుపరి విచారణలో ఈ పిటిషన్‌పై తుది తీర్పును వెల్లడిస్తామని పేర్కొన్న హైకోర్టు విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.   అదలా ఉంటే.. తన కుమారుడిపై పోస్కో కేసుకు సంబంధించి  తన పేరును ముడిపెడుతూ సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న కథనాలు, పోస్టులను వెంటనే తొలగించాలని కోరుతూ బండి సంజయ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు బండి సంజయ్ పేరును ముడిపెడుతూ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, పోస్టులను తక్షణమే తొలగించాలని   మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బండి బగీరథ కేసు విషయంలో బండి సంజయ్ పేరును  ఎక్కడా ప్రస్తావించరాదని స్పష్టం చేసింది.  భవిష్యత్తులో కూడా ఈ కేసుకు సంబంధించి బండి సంజయ్ పేరుతో ఎలాంటి వార్తలు ప్రసారం చేయరాదని, ప్రచురించరాదని కోర్టు  ఆదేశించింది.   కాగా బండి సంజయ్ తన కుమారుడు బండి బగీరథ్ ను విచారణకు పంపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.   కేంద్రమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్  హుందాగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తనకు తానుగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా తన కొడుకును విచారణకు అప్పగించి, చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కొనేలా చేయాలని సీఎం అన్నారు. బండి సంజయ్ కింది స్థాయి నుంచి స్వయం కృషితో ఈ స్థాయికి ఎదిగారనీ, ఇప్పుడు కుమారుడి కారణంగా తలవంపులు ఎదుర్కొంటున్నారనీ సీఎం అన్నారు.  ఏది ఏమైనా విచారణను ఎదుర్కోకుండా బండి  భగీరథ్ పారిపోవడంసరికాదన్నారు. బండి సంజయ్ బాధ్యత తీసుకుని తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలనీ, అలా చేస్తే..  అలా చేస్తే బండి సంజయ్ గౌరవం మరింత పెరుగుతుందన్న రేవంత్ రెడ్డి.. ఎలాంటి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, పారిపోతే సమస్యలకు పరిష్కారం దొరకదన్నారు.  
  తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్ విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర కమిటీ సభ్యులంతా టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. మహానాడును పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించిన చంద్రబాబు, ఎన్టీఆర్ భవన్‌లో ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేసి అక్కడి నుంచే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ పండుగగా భావించే మహానాడు కార్యక్రమం జరగనుంది.
ALSO ON TELUGUONE N E W S
The "Chiru Leaks" phenomenon originally started as innocent fun. Megastar Chiranjeevi had a charming habit of genuinely slipping up and revealing well-kept secrets about upcoming films during live events. However, his recent post about the highly anticipated Peddi trailer feels quite different.   Taking to X, he tweeted: "#PeddiTrailer చూసాను!!  Just… WOW  3 నిమిషాలు… PURE CINEMA MAGIC MOMENT!!  చరణ్… బుచ్చి… రెహమాన్… ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు!  ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. Emotion… Elevation… Madness… అన్నీ next level లో ఉన్నాయి!  అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి  "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు..." Sorry బుచ్చి బాబు… చూసి కంట్రోల్ తప్పా! " Instead of an organic slip of the tongue, this heavily formatted post appears to be a highly strategic move designed to build promotional hype. Praising Ram Charan, director Buchi Babu, and AR Rahman is expected, but packing a specific dialogue reveal into a promotional tweet and intentionally branding it as a "Chiru Leak" seems like a bit of a stretch. It completely lacks the spontaneous innocence of his earlier stage blunders.   Yet, it is hard to deny that the strategy works. The carefully placed dialogue—hinting that Peddi is not just playing, but fighting—successfully builds massive curiosity. Even if the leak was thoroughly planned, the hype certainly makes you want to see what actual madness the trailer has in store.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తెలుగు సినీ పరిశ్రమలో వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటిగా నటించి తనదైన నటనతో ప్రేక్షకులను నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Shyamala) దీనస్థితి ఇప్పుడు అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. ఖడ్గం, ఆంధ్రావాలా, గోలీమార్ వంటి చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరిచిన ఆమె.. వయోభారం, తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఆమెకు ఎదురైన ఒక అత్యంత అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పావలా శ్యామల.. అర్ధరాత్రి సమయంలో కూకట్‌పల్లి నడిరోడ్డుపై నిస్సహాయ స్థితిలో ఒంటరిగా మిగిలిపోవడం సినీ వర్గాల్లో, సామాన్య ప్రజల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తీవ్రమైన గుండెనొప్పితో బాధపడుతున్న పావలా శ్యామల అత్యవసర వైద్యం కోసం కూకట్‌పల్లిలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. అయితే, చికిత్సకు అవసరమైన డబ్బులు ఆమె వద్ద లేకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించిందని సమాచారం. తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆమెను ఆసుపత్రి సిబ్బంది బయటకు పంపించి, ఒక ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసి అందులో పంపించేశారు. కానీ, ఆ క్యాబ్ డ్రైవర్ మరింత అమానవీయంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి సమయంలో తీవ్ర అనారోగ్యంతో కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధురాలనే మానవత్వం కూడా లేకుండా, కూకట్‌పల్లి వై జంక్షన్ (Kukatpally Y Junction) వద్ద ఉన్న ఫుట్‌పాత్‌పై ఆమెను అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ కారు డ్రైవర్ చేసిన దారుణానికి పావలా శ్యామల అర్ధరాత్రి నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో, తీవ్ర అస్వస్థతతో కనిపించారు. అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు ఆమెను గుర్తుపట్టి, వెంటనే అలర్ట్ అయ్యారు. ఒక సీనియర్ నటి నడిరోడ్డుపై అలా పడి ఉండటం చూసి చలించిపోయిన స్థానికులు, వెంటనే స్థానిక పోలీసులకు, ఆమెకు గతంలో ఆశ్రయం కల్పించిన 'ఆర్కే ఫౌండేషన్' నిర్వాహకులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను సనత్‌నగర్‌లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా ఆర్కే ఫౌండేషన్‌లో ఉచితంగానే వైద్యం పొందుతున్నప్పటికీ, అక్కడ కార్డియాలజీ విభాగం లేకపోవడంతోనే ఆమె బయట ఆసుపత్రికి రావాల్సి వచ్చిందని ఫౌండేషన్ అధినేత డాక్టర్ రామకృష్ణ తెలిపారు. గతంలో పావలా శ్యామల ఆర్థిక కష్టాల గురించి తెలిసి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, సాయి దుర్గ తేజ్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. ప్రస్తుతం ఆమె తిరుమలగిరిలోని ఒక స్వచ్ఛంద ఆశ్రయంలో తన కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. ప్రముఖులు సాయం చేసినప్పటికీ.. ఆమె వయోభారం, నిరంతర అనారోగ్య ఖర్చుల కారణంగా పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక వృద్ధురాలిని, సీనియర్ నటిని ఆసుపత్రి చేర్చుకోకపోవడం, క్యాబ్ డ్రైవర్ నడిరోడ్డుపై వదిలేయడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA), సినీ పెద్దలు శాశ్వతంగా ఆమెకు వైద్య సదుపాయం అందేలా చూడాలని అభిమానులు కోరుతున్నారు. కాగా, పావలా శ్యామల పరిస్థితి తెలుసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. సాయం చేయడం కోసం తన టీంను ఆసుపత్రికి పంపినట్లు సమాచారం.   
  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)బుచ్చిబాబు(Buchibabu)కాంబోలో  తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది(Peddi)జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ల్యాండ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ గ్రాండ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రమోషన్స్ కూడా జోరందుకోవడంతో ఎక్కడ చూసినా పెద్ది హంగామానే కనపడుతుంది. Also read: Trisha: దళపతి విజయ్ కోసం 12 కోట్ల భారీ ఆఫర్‌  తిరస్కరించిన త్రిష! బుచ్చిబాబు వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే  చరణ్ కుస్తీ పోటీల్లో పాల్గొనే సన్నివేశం జరుగుతుంది. ఆ సమయంలో ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంది. అప్పుడే చిరంజీవి గారు వచ్చారు. ఎండలో చరణ్ కష్టపడటం చూడలేక చిరంజీవి(chiranjeevi)గారు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. దాంతో తండ్రి ఎంత కష్టమైనా పడతాడు కానీ, తండ్రి కష్టాన్ని చూడలేడు కదా అనిపించిందని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులని హార్ట్ టచింగ్ కి గురిచేస్తున్నాయి.  
సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వారి వైవాహిక బంధాల్లో వచ్చే విభేదాలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా టాలెంటెడ్ నటుడు రవి మోహన్ (జయం రవి) తన వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న తీవ్రమైన ఒడిదుడుకుల కారణంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్య ఆర్తీతో సాగుతున్న విడాకుల వివాదం పూర్తిగా సమసిపోయేంత వరకు తాను నటనకు, సినిమాలకు తాత్కాలికంగా గుడ్‌బై చెబుతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చిన ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎంతో బాధతో తాను ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా చక్కదిద్దుకున్న తర్వాతే మళ్లీ వెండితెరపైకి క్లీన్‌గా తిరిగి వస్తానని ఆయన స్పష్టం చేశారు. తన భార్య ఆర్తీ తనపై సైబర్ బుల్లింగ్ ముఠాలను ప్రయోగించి, సమాజంలో తనకున్న ఇమేజ్‌ను, గౌరవాన్ని పాడుచేయడానికి ప్రయత్నిస్తోందని రవి మోహన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకప్పుడు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న సొంత ఇంటిని, ఆస్తులన్నింటినీ వారి కోసమే వదిలేసి, కేవలం కట్టుబట్టలతో నాలుగు సంవత్సరాల క్రితమే తాను ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసానని ఆయన గుర్తుచేసుకున్నారు. కనీస గౌరవం దక్కని చోట తాను ఉండలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. సింగర్, స్పిరిచువల్ హీలర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో తనకు ఉన్న స్నేహాన్ని అడ్డం పెట్టుకుని, తన క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 45 ఏళ్ల వయసున్న నటుడిగా రోజువారీ జీవితంలో ఎందరో అందమైన హీరోయిన్లతో కలిసి నటిస్తుంటానని, ఎవరి అందం కోసమో తాను ఎవరి వెనకాలో వెళ్లాల్సిన అవసరం లేదని రవి మోహన్ ఘాటుగా సమాధానమిచ్చారు. తాను ఎప్పుడూ మహిళల హక్కులను గౌరవించే వ్యక్తిని (ఫెమినిస్ట్) అని, ఇప్పటివరకు తన భార్య లేదా కుటుంబానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని ఆయన అన్నారు. అయితే తన పిల్లలకు దక్కాల్సిన కనీస స్వేచ్ఛను కూడా హరిస్తూ, వారి ఫోన్లను లాక్కుని కనీసం తనతో మాట్లాడనివ్వడం లేదని చెబుతూ రవి మోహన్ మీడియా ముందే కన్నీరు పెట్టారు.  తనకు సొంతంగా కనీసం ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేదని, భార్యతో ఉన్న జాయింట్ అకౌంట్ వల్ల తాను రూపాయి లేకుండా రోడ్డున పడ్డానని ఆవేదన చెందారు. ఈ మానసిక క్షోభ కారణంగా గత ఆరు నెలలుగా తాను ఎలాంటి సినిమాల్లో నటించలేకపోయానని తెలిపారు. తన బాధను అర్థం చేసుకున్న కెనీషా కూడా ఈ సైబర్ బుల్లింగ్ వేధింపులు తట్టుకోలేక చెన్నై వదిలి వెళ్లిపోయిందని, తన జీవితాన్ని నరకం చేసిన వారిని తాను అస్సలు వదిలిపెట్టనని ఆయన హెచ్చరించారు. అలాగే ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ నటి కూడా తన విషయాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలని ఆయన ఘాటుగా హెచ్చరించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నానని, ఈ మానసిక ఒత్తిడి వల్ల సినిమాలపై అస్సలు దృష్టి పెట్టలేకపోతున్నానని రవి అన్నారు. ఇప్పటివరకు తన పిల్లల భవిష్యత్తు కోసమే తాను మౌనంగా ఉన్నానని, ఈ కేసును ఒక్క రోజులోనే ముగించే సత్తా తనకు ఉందని చెప్పారు. ఇకపై తాను మౌనంగా ఉండే ప్రసక్తే లేదని, తన వద్ద ఉన్న అన్ని నిజమైన ఆధారాలను కోర్టు ముందు ఉంచి, ఈ విడాకుల వివాదానికి త్వరలోనే ముగింపు పలుకుతానని స్పష్టం చేశారు. అవసరమైతే ఆర్తీ కుటుంబ సభ్యుల్లో కొందరు కూడా తన తరుపున మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ ఇద్దరి మధ్య వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడటంతో సినీ వర్గాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.  
   త్రిష(Trisha)ప్రస్తుతం సూర్య(Suriya)తో కలిసి వీరభద్రుడి(Veerabhadrudu)తో థియేటర్స్ లో సందడి చేస్తుంది. రీసెంట్ గా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కోసం  పన్నెండు కోట్ల రూపాయల వరకు వదులుకుందనే న్యూస్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజెన్స్ ని షాక్ కి గురి చేస్తుంది. మరి పూర్తి న్యూస్ ఏంటో చూద్దాం. కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి మల్టి స్టారర్ చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ రాజకీయ ప్రత్యర్థి డిఎంకె నేత, ఎంఎల్ఏ ఉదయనిధి స్టాలిన్‌ తన  రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం కోసమే త్రిషకి  12 కోట్ల భారీ డీల్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే విజయ్‌తో ఉన్న సుదీర్ఘ కాలపు స్నేహం,  విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మరియు అధికార డీఎంకే వర్గానికి మధ్య తీవ్రమైన రాజకీయ పోటీ నెలకొన్న ఈ తరుణంలో, ప్రత్యర్థి క్యాంప్‌లో సినిమా చేయడం సరికాదని త్రిష భావించినట్లుగా తెలుస్తుంది. Also read: Manchu Manoj: మంచు మనోజ్ టీమ్ లో మిస్టరీ డెత్.. చంపారా! చనిపోయాడా! తన అత్యంత ఆప్తమిత్రుడు, రాజకీయాల్లో సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన విజయ్ సెంటిమెంట్లను గౌరవిస్తూ, ఆయనకు నైతిక మద్దతుగా నిలిచేందుకే త్రిష ఈ అత్యంత భారీ పారితోషికాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడిందని చెన్నై వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. కేవలం డబ్బు కంటే స్నేహానికి, నమ్మకానికి ఆమె ఇచ్చిన ప్రాధాన్యతను చూసి అభిమానులు సోషల్ మీడియాలో నీరాజనాలు పడుతున్నారు. ఏదేమైనా ఒక హీరోయిన్ కేవలం రాజకీయ సమీకరణాలు మరియు స్నేహం కోసం  12 కోట్ల ఆఫర్‌ కి  నో అని చెప్పడం ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌.   
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi). మే 18న ముంబై వేదికగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతున్న తరుణంలో, ఇండస్ట్రీలో ఒక ఊహించని భారీ సర్ప్రైజ్ లీక్ అయింది.  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన కుమారుడు రామ్ చరణ్ నటించిన ఈ 'పెద్ది' చిత్ర ట్రైలర్‌ను అందరికంటే ముందే చూసేశారు. అంతేకాదు, ఆ ట్రైలర్ చూసి ఆయనకు కలిగిన అద్భుతమైన అనుభూతిని, ఎమోషన్‌ను ఆపుకోలేక సోషల్ మీడియా వేదికగా ఒక పవర్‌ఫుల్ రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన ట్రేడ్‌మార్క్ అయిన 'చిరు లీక్స్' (Chiru Leaks) ద్వారా సినిమాలో రామ్ చరణ్ చెప్పే ఒక అదిరిపోయే పవర్‌ఫుల్ డైలాగ్‌ను కూడా లీక్ చేసి మెగా అభిమానులకు పూనకాలు తెప్పించారు. చిరంజీవి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. "పెద్ది ట్రైలర్ చూశాను!! జస్ట్... వావ్! 3 నిమిషాల ప్యూర్ ఫైర్‌పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ఇది" అంటూ చిత్ర యూనిట్‌ను చిరంజీవి ఆకాశానికెత్తేశారు. సినిమాలో హీరోగా నటించిన చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ముగ్గురూ ఒకరికొకరు పోటీ పడి మరీ తమ బెస్ట్ అవుట్‌పుట్‌ ఇచ్చారని చిరు కొనియాడారు. "ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు... కలిసి మాత్రం రఫ్పాడించేశారు! మనం ఈ సినిమా గురించి ఎంత ఊహించుకున్నా... దాన్ని మించి ఈ ట్రైలర్ ఉంటుంది. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్... అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి" అంటూ మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ సినిమాపై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే 'చిరు లీక్స్' సర్ప్రైజ్ ఇస్తూ.. "అన్నట్టు... చాలా రోజులయ్యింది మీకు చిరు లీక్స్ ఇచ్చి" అని పేర్కొంటూ ట్రైలర్‌లోని అత్యంత ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ డైలాగ్‌ను చిరంజీవి ట్వీట్ చేశారు. "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు..." అనే ఈ డైలాగ్ రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్‌ను, సినిమాలో ఉండే పవర్‌ఫుల్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఇంటెన్సిటీని స్పష్టం చేస్తోంది. ఒక సాధారణ విలేజ్ క్రికెటర్, కుస్తీ వీరుడిగా రామ్ చరణ్ చేసే ఈ పోరాటం థియేటర్లలో ప్రేక్షకులను కదిలించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ డైలాగ్ లీక్ చేసినందుకు గానూ చివర్లో చిరంజీవి చాలా సరదాగా "సారీ బుచ్చిబాబు... చూశాక కంట్రోల్ తప్పా!" అంటూ డైరెక్టర్‌కు క్షమాపణలు చెప్పడం విశేషం. మెగాస్టార్ స్వయంగా రివ్యూ ఇవ్వడం, అందులోనూ పవర్‌ఫుల్ డైలాగ్‌ను లీక్ చేయడంతో మే 18న రాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో, దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ విజువల్ వండర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే ఓవర్సీస్‌లో రికార్డులు సృష్టిస్తోంది. మెగాస్టార్ ఇచ్చిన ఈ బూస్టింగ్ రివ్యూతో 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు.   https://x.com/KChiruTweets/status/2055583268905615570
  మంచు మనోజ్(Manchu Manoj)ప్రస్తుతం హనుమ రెడ్డి(Hanuma Reddy)యాక్కంటి దర్శకత్వంలో  'డేవిడ్ రెడ్డి'(David Reddy)చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ మూవీలో  మంచు మనోజ్ మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్‌ఫుల్ పీరియాడిక్ వారియర్ పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ నుండి తాజాగా ఒక అత్యంత బాధాకరమైన వార్త బయటకు వచ్చింది.  ఈ చిత్ర నిర్మాణంలో కీలక భాగమైన ఒక ముఖ్యమైన చిత్ర బృందం సభ్యుడు (క్రూ మెంబర్) హఠాన్మరణం చెందడం టాలీవుడ్ వర్గాలని  తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. షూటింగ్ లొకేషన్‌లో అందరితో ఎంతో యాక్టివ్‌గా ఉండే వ్యక్తి ఇలా అకస్మాత్తుగా మరణించడంతో చిత్ర యూనిట్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాదకర ఘటనపై హీరో మంచు మనోజ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా మరణించిన ఆ చిత్ర బృందం సభ్యుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. కేవలం సంతాపం తెలపడమే కాకుండా, ఆ ట్వీట్‌లో మనోజ్ రాసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలోనూ మరియు సోషల్ మీడియాలోను తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అనుమానాస్పద స్థితిలో మరణించడంతో మనోజ్ తెలంగాణ, కర్ణాటక  డీజీపీలకి మరణం విషయంపై  ట్వీట్ చేసి నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నాడు. Also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు న్యూస్ చూద్దాం   ఈ హఠాన్మరణం వల్ల 'డేవిడ్ రెడ్డి' సినిమా షూటింగ్‌కి  తాత్కాలికంగా విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డెత్ మిస్టరీ మరియు మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.    
సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో సెలబ్రిటీలకు, ముఖ్యంగా కథానాయికలకు ఒక పెద్ద శాపంగా మారుతోంది. తారలు పంచుకునే అందమైన ఫోటోలు, వీడియోలపై కొందరు ఆకతాయిలు అత్యంత దారుణమైన కామెంట్లు చేస్తూ పచ్చి బూతులతో వేధిస్తున్నారు. చాలా మంది నటీమణులు ఇలాంటి వాటిని చూసీచూడనట్లు వదిలేస్తుంటారు. దీనివల్ల మరింత రెచ్చిపోతున్న ట్రోలర్స్, తాము ఏం మాట్లాడినా అడిగేవారు లేరనే ధీమాతో రెచ్చిపోతున్నారు. అయితే అందరిలా తాను మౌనంగా ఉండే రకం కాదని నిరూపించింది కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి, సింగర్ చైత్ర జే ఆచార్. తనపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన ఒక నెటిజన్‌కు ఆమె ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. (Chaithra J Achar) ‘సప్త సాగరదాచే ఎల్లో’ వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలెంటెడ్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైత్ర ఆచార్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఒక ఫోటో కింద, ఒక నెటిజన్ తన హద్దులు దాటి ప్రవర్తించాడు. పోలీస్ యూనిఫామ్‌ ధరించిన ప్రొఫైల్ పిక్చర్‌తో ఉన్న సదరు వ్యక్తి, కన్నడ భాషలో అత్యంత అసభ్యకర పదజాలం వాడుతూ, "నువ్వు అసలు హీరోయిన్‌వా లేక సెక్స్ వర్కర్‌వా? పద్ధతిగా ప్రవర్తించడం నేర్చుకో" అంటూ ఒక దారుణమైన కామెంట్ పెట్టాడు.  ఈ కామెంట్ చూసిన ఎవరికైనా ఒళ్ళు మండిపోవడం ఖాయం. చైత్ర కూడా దీనికి అస్సలు భయపడకుండా, సమాజంలో మహిళలపై జరుగుతున్న ఇలాంటి ఆన్‌లైన్ వేధింపులకు చెక్ పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది.వెంటనే ఆమె ఆ అసభ్యకరమైన కామెంట్‌ను స్క్రీన్‌షాట్ తీసి, సదరు వ్యక్తి ప్రొఫైల్ వివరాలతో సహా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అంతటితో ఆగకుండా, బెంగళూరు సిటీ పోలీస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ పబ్లిక్‌గా ఫిర్యాదు చేసింది.  "గౌరవనీయులైన బెంగళూరు సిటీ పోలీస్.. మీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక వ్యక్తి మహిళల పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు సమాజానికి ఎలాంటి రక్షణ ఇస్తారు?" అంటూ తీవ్ర స్థాయిలో నిలదీసింది. ఒక నటిగా, ఒక మహిళగా తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆ ఆకతాయిని నడిరోడ్డుపై నిలబెట్టినంత పని చేసింది. చైత్ర తీసుకున్న ఈ లీగల్ అండ్ పబ్లిక్ యాక్షన్‌తో సదరు నెటిజన్‌కు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగే అవకాశం ఉందని గ్రహించి, అతనిలో వణుకు మొదలైంది. వెంటనే తన తప్పు తెలుసుకుని, చైత్రకు పర్సనల్ మెసేజ్‌లలో క్షమాపణలు చెప్పడం ప్రారంభించాడు.  "నన్ను క్షమించండి, నేను కేవలం ఒక అభిమానిగా, మీపై ఉన్న ఆందోళనతోనే ఆ కామెంట్ చేశాను. దయచేసి ఆ సోషల్ మీడియా పోస్టును డిలీట్ చేయండి. ఈ వివాదం పెద్దదైతే నా ఉద్యోగానికి, నా కెరీర్‌కు ముప్పు వస్తుంది" అంటూ బ్రతిమిలాడుకున్నాడు. కానీ, చైత్ర అంతటితో శాంతించలేదు. తప్పు చేసేటప్పుడు లేని భయం, ఇప్పుడు ఉద్యోగం పోతుందనేసరికి వచ్చిందా అంటూ ఆమె మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు వ్యక్తి పంపిన క్షమాపణల మెసేజ్‌లను కూడా స్క్రీన్‌షాట్ తీసి మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది.  "నువ్వు ఆ నీచమైన కామెంట్ పెట్టేటప్పుడు ఒక మహిళగా నా గౌరవం ఏమౌతుంది, నా వృత్తి ఏమౌతుంది అని ఆలోచించలేదా? ఇప్పుడు నీ ఉద్యోగం కోసం భయపడుతున్నావా?" అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై బెంగళూరు సీనియర్ పోలీస్ అధికారులు స్పందిస్తూ, ఇలాంటి అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం చట్టరీత్యా నేరమని, అయితే ఆ అకౌంట్ వాడుతున్న వ్యక్తి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందినవాడు కాదని, కేవలం పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఫోటోను వాడుకున్నాడని స్పష్టం చేశారు. ప్రస్తుతం చైత్ర చూపించిన ఈ ధైర్యానికి, ఆమె ఇచ్చిన గట్టి కౌంటర్‌కు నెటిజన్లు సెల్యూట్ కొడుతున్నారు. ట్రోలర్స్‌కు బుద్ధి రావాలంటే ఇలాంటి గట్టి నిర్ణయాలు అవసరమని మద్దతుగా నిలుస్తున్నారు.    
  నిర్మాతలు,  ఎగ్జిబిటర్స్  థియేటర్స్ విషయంలో ఏదేదో మాట్లాడుకుంటారు. కానీ నేను మాత్రం తగ్గేదెలే అంటు పలు తెలుగు సినిమా తాజా న్యూస్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం  1 . విజయ్ కి నాకు పోలికా అంటున్న పవన్ పవన్ కళ్యాణ్  విజయ్ విజయంపై పవన్ స్పందిస్తు ఒక రాష్ట్రంలో జరిగింది ఇక్కడ కూడా అలాగే జరుగుతుందని భావించడం సరికాదు. అక్కడి రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు కొందరు అనవసర ప్రచారం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తనతో ఉన్న చాలామంది నాయకులు పార్టీని వీడిపోయారు. జనసేన అనేది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. దాదాపు పాతికేళ్లుగా తనలో పెరిగిన ఆలోచనకి రూపమని పవన్ చెప్పుకొచ్చాడు  2 . వీరభద్రుడు ఫస్ట్ డే రికార్డు  కలెక్షన్స్  సూర్య నిన్న వరల్డ్ వైడ్ గా వీరభద్రుడుతో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఒకరోజు లేటుగా వచ్చినా కూడా ఎవరు ఊహించని విధంగా తొలి రోజు  20.66 కోట్ల గ్రాస్ వసూళ్లతో అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది. తెలుగు స్టేట్స్ లో  2.4 కోట్ల గ్రాస్, తమిళ వెర్షన్ '13.10 కోట్లు, ఓవర్ సీస్ 4 కోట్లుతో టోటల్ గా   20.66 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. 3 .మహేష్ బాబు రెస్టారెంట్ బిల్లు వైరల్.. వాటర్ బాటిల్ రేటు చూస్తే షాకవుతారు ఏషియన్ గ్రూప్, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ భాగస్వామ్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో 'ఏఎన్‌ ప్యాలెస్ హైట్స్' అనే లగ్జరీ రెస్టారెంట్‌ని నడుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక హైదరాబాద్ బేస్డ్ ఫుడ్ బ్లాగర్ ఈ రెస్టారెంట్‌ ని  సందర్శించి వీడియో షేర్ చేసింది. సదరు వీడియోలో  ఒక చికెన్ టిక్కా స్టార్టర్ ధర  700 ,ఒక మటన్ బిర్యానీ ధర  600 గా ఉంది. అయితే  వాటర్ బాటిల్ ధర 299 రూపాయలుగా ఉండటం ఇప్పుడు  వైరల్ గా మారింది. 4 .ముంబైలో చేతి బ్యాండేజ్‌తో కనిపించిన రామ్ చరణ్.. ఫ్యాన్స్‌లో టెన్షన్ చరణ్ రీసెంట్ గా ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హాకీమ్ ఆలిం సెలూన్‌కి వెళ్ళాడు. చరణ్ కుడి చేతికి ఉన్న బ్యాండేజ్‌ ఉండటంతో  ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. అయితే తాజాగా చేతి గాయంపై చరణ్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చరణ్‌ కుడి చేతి మణికట్టు వద్ద ఒక చిన్న మైల్డ్ స్ప్రెయిన్ స్వల్ప నలిగుడు లాంటి మితమైన నొప్పి మాత్రమే అయింది. ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదు. కేవలం ముందుజాగ్రత్త చర్యగా, ఆ నొప్పి మరింత ఎక్కువ కాకుండా ఉండటానికి  డాక్టర్ల సలహా మేరకుసపోర్ట్ బ్యాండేజ్ ధరించినట్లు క్లారిటీ వచ్చింది.   5 . మళ్ళీ థియేటర్స్ లోకి హనుమాన్  టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ 'హనుమాన్' మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఈసారి సరికొత్త త్రీడీ  విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులని  అలరించేందుకు జూన్ 25, 2026న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.  6 . పర్శంటేజ్ సిస్టం నుంచి మినహాయింపు కోరిన 17 సినిమాలు కొన్ని రోజులుగా నిర్మాతలు, థియేటర్స్ ఓనర్స్ మధ్య పర్సంటేజ్ సిస్టమ్ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే పెద్ది, డ్రాగన్ , విశ్వంభర,  కల్కి 2', స్పిరిట్', వారణాసి, ది ప్యారడైజ్, రాకా, ఎన్ బి కె 111 , మెగా 158 ,రామ్ చరణ్, సుకుమార్ కాంబో మూవీ, ఏ కె 47 ,నాని, సుజిత్ కాంబో, వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో, అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్, జై హనుమాన్ ఇలా సుమారు 17 చిత్రాలకి   పర్శంటేజ్ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది.  7 . పెద్ది సెట్ లో చిరంజీవి గంటన్నర కూడా ఉండలేకపోయారు  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో పెద్ది జూన్ 3 నుంచే ప్రీమియర్స్ కి సిద్దమవుతుంది. రీసెంట్ గా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతు చరణ్ కుస్తీ పోటీల్లో పడుతున్న కష్టం చేసి చిరంజీవి గారు గంటన్నర కూడా సెట్స్ లో ఉండలేకపోయారని చెప్పాడు. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా నిలిచాయి. 8 . 12 కోట్ల ఆఫర్ ని వదులుకున్న త్రిష  రజినీ, కమల్ ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష ఒక హీరోయిన్ గా చేస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ త్రిష ఈ చిత్రంలో చెయ్యడం లేదని, మేకర్స్ 12 కోట్లరూపాయలు ఆఫర్ చేసిన త్రిష రిజెక్ట్ చేసినట్టుగా ఆంగ్ల మీడియాలో కధనాలు వినిపిస్తున్నాయి 9 . పెద్ది క్లైమాక్స్ ఎపిసోడ్ వైరల్    రీసెంట్ గా పెద్ది దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతు పెద్ది చివరి 50 నిమిషాల ఎపిసోడ్ హై వోల్టేజ్ ఎమోషన్స్‌తో సాగుతుంది. ఆ సీన్స్ చూస్తున్నప్పుడు ప్రేక్షకుల గుండె బరువెక్కడం మాత్రమే కాదు. థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని  బుచ్చిబాబు  ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేసాడు. ఈ మాటలు అభిమానుల్లో జోష్ తెప్పిస్తున్నాయి. 10 . మంచు మనోజ్ టీంలో  మిస్టరీ డెత్  మంచు మనోజ్ అప్ కమింగ్ మూవీ  'డేవిడ్ రెడ్డి' సినిమా షూటింగ్ లో  తీవ్ర విషాదం నెలకొంది. DOP విభాగంలో పనిచేసే  లక్ష్మణ్ రావు అనే వ్యక్తి పని చేస్తున్నాడు. రీసెంట్ గా లక్ష్మణ రావు చనిపోయారు. అకస్మాత్హుగా జరిగిన ఈ ఘటనతో మంచు మనోజ్ తో సహా టీం షాక్ కి గురైంది. అనుమానాస్పద స్థితిలో మరణించడంతో మనోజ్ తెలంగాణ, కర్ణాటక  డీజీపీలకి మరణం విషయంపై  ట్వీట్ చేసి నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నాడు     
టాలీవుడ్ లో కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించేందుకు దర్శకులు కథలో అదిరిపోయే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. ఒక పవర్‌ఫుల్ హీరో, గ్లామరస్ హీరోయిన్, ఊపు తెప్పించే ఫైట్లతో పాటు థియేటర్లలో ఈలలు వేయించే ఒక ఐటెం సాంగ్ ఉంటే ఆ సినిమా రేంజ్ మారిపోతుంది.  హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న మూవీ 'నేను రెడీ' (Nenu Ready). తాజాగా ఈ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఒక మైండ్ బ్లోయింగ్ గ్లామర్ అప్‌డేట్‌ను పంచుకుంది. టాలీవుడ్ వెండితెరపై మొదటిసారిగా ఒక అద్భుతమైన గ్లామర్ విస్ఫోటనం జరగబోతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో 'రాక్‌స్టార్' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ సంపాదించుకుని, తన హాట్ లుక్స్‌తో ఇంటర్నేషనల్ వైడ్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) ఇప్పుడు నేరుగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.  'నేను రెడీ' చిత్రంలో ఒక స్పెషల్ మాస్ మసాలా ఐటెం సాంగ్‌లో నర్గీస్ ఫక్రీ నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్ స్క్రీన్‌పై నర్గీస్ ఫక్రీ కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ స్పెషల్ నంబర్‌పై ఇండస్ట్రీలో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ఈ పాటలో ఆమె తన హాట్ అండ్ బోల్డ్ స్టెప్పులతో థియేటర్లలో సెగలు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ మాస్ ఆడియన్స్‌కు ఇదొక అల్టిమేట్ గ్లామర్ బ్లాస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్రినాథరావు నక్కిన మార్క్ మాస్ పల్స్, మిక్కీ జే మేయర్ వెరైటీ ట్యూన్స్ కలయికలో రాబోతున్న ఈ స్పెషల్ ఐటెం సాంగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు టాక్. 
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ కొన్నిసార్లు, అనుకోకుండా అనేసిన కొన్ని మాటలు ఆ సంబంధాన్ని పాడుచేసే అవకాశం ఉంటుంది. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వచ్చే ఏ చిన్న అపార్థమైనా.. ఏ చిన్న తప్పు మాట అయినా.. ఇద్దరి మధ్య దూరం పెంచి  బంధాన్ని నాశనం చేసి  అవకాశం ఉంటుంది.  బంధం చాలా కాలం పాటు ప్రేమ, నమ్మకంతో నిండి ఉండాలంటే చేయకూడని తప్పులేంటో తెలుసుకుంటే.. పాత బంధాల ప్రస్తావన.. కొత్తగా పెళ్లైన  తర్వాత గత సంబంధాల గురించి ప్రస్తావించడం తరచుగా భాగస్వామికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పదేపదే  పాత రిలేషన్ లో ఉన్న వ్యక్తితో  పోల్చడం లేదా పాత జ్ఞాపకాలను పంచుకోవడం సంబంధంలో అభద్రతను పెంచుతుంది. వైవాహిక బందంలో ఎప్పుజూ ప్రస్తుత కాలంపై దృష్టి పెట్టాలి. అప్పుడే బంధం బాగుంటుంది. కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడటం.. పెళ్లి తర్వాత రెండు  కుటుంబాలను గౌరవించడం చాలా ముఖ్యం. లైఫ్ పార్ట్నర్  కుటుంబం గురించి చెడుగా మాట్లాడటం లేదా వారిని ఎగతాళి చేయడం సంబంధంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. ఒకవేళ ఏదైనా విషయం నచ్చకపోతే దాన్ని ప్రశాంతంగా వివరించడానికి ప్రయత్నించాలి. ఫిర్యాదులు.. చిన్న చిన్న విషయాల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటే అది  సంబంధంలో ప్రతికూలతను పెంచుతుంది. కొత్త పెళ్లిలో ఒకరి అలవాట్లను ఒకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అందువల్ల, ఓర్పు , అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. పోలిక.. లైఫ్ పార్ట్నర్ ను  స్నేహితుడు, బంధువు లేదా సోషల్ మీడియా జంటతో పోల్చడం  బంధానికి  హాని కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి, ప్రతి సంబంధం భిన్నంగా ఉంటాయి. పోలికలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, విభేదాలను పెంచుతాయి. స్వేచ్ఛ.. పెళ్లి తర్వాత అన్ని విషయాల గురించి క్వశ్చన్లు వేయడం  లేదా మితిమీరిన జోక్యం చేసుకోవడం చేస్తే అది  భాగస్వామికి బాధ కలిగించే అవకాశం ఉంటుంది. ప్రేమతో పాటు వైవాహిక జీవితంలో కూడా  వ్యక్తిగత స్వేచ్ఛ కూడా చాలా అవసరం. ఒకరినొకరు నమ్మితేనే  బంధం  బలంగా ఉంటుంది.                               *రూపశ్రీ.
వివాహం అన్ని సంబంధాల కంటే విభిన్నమైన కోణం. వివాహం ప్రారంభ రోజుల్లో భార్యాభర్తల  మధ్య ప్రేమ, ఉత్సాహం,  ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ క్రమంగా భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది.  చాలామంది వివాహం అయిన కొద్ది కాలానికే మనుషులు మారిపోయారు అని అంటూ ఉంటారు. అయితే ఇది చాలా వరకు భార్యాభర్తల మధ్య జరిగేదే. కానీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గకుండా తిరిగి ప్రేమను పెంచుకోవడం భార్యాభర్తల ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తల బంధం కొందరికి  బోరింగ్‌గా మారుతుంది.ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడం,  బంధంలో ఉత్సాహం వంటివి అస్సలు కనిపించవు.  దీనికి బదులు వారి బంధంలో విసుగు చెందడం,  గొడవ పడటం చాలా సహజం అయిపోతుంది. కానీ వివాహం అయిన కొన్ని రోజులకే   భార్యాభర్తల మధ్య ప్రేమ ముగిసిపోవడం అనేది ఉండదు.  పెళ్లైన కొత్త రోజుల్లో ఉండే ప్రేమ ఎన్నైళ్లైనా భార్యాభర్తల మధ్య అలాగే ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.  అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గడానికి కారణమయ్యేవి ఏంటో కూడా తెలుసుకోవాలి. బాధ్యతలు, ఒత్తిడి వివాహం తర్వాత, ఉద్యోగం, ఇంటిని చూసుకోవడం, కుటుంబ అంచనాలు,  పిల్లలను పెంచడం వంటి బాధ్యతలు భార్యాభర్తలపై భారంగా మారతాయి.  ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం కష్టం అవుతుంది. క్రమంగా ప్రేమ కాస్తా బాధ్యతల్లోకి జారిపోతుంది. ఒకే దినచర్య.. ఒకే  దినచర్య సంబంధంలో విసుగును కూడా తెస్తుంది. ప్రతిరోజూ ఆఫీసు, ఇల్లు,  ఇతర పనుల మధ్య,  ప్రేమ ఎక్కడో వెనుకబడిపోతుంది. కొత్త శక్తి,  ఉత్సాహం లేకపోవడం సంబంధాన్ని మందకొడిగా చేస్తుంది. కమ్యూనికేషన్.. భార్యాభర్తల  మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం కూడా ప్రేమ తగ్గిపోవడానికి  ఒక పెద్ద కారణం. భార్యాభర్తలు తమ భావాలను, అంచనాలను,  సమస్యలను ఒకరితో ఒకరు పంచుకోనప్పుడు దూరం పెరుగుతుంది.  ఈ దూరం క్రమంగా సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ప్రేమ పెరగాలంటే.. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య  మునుపటిలా  ప్రేమను తిరిగి పుంజుకోవడానికి కొన్ని పద్ధతులను అనుసరించవచ్చు.  ఉదాహరణకు కొన్ని.. ఒకరికొకరు సమయం ఇవ్వడం... రోజంతా బిజీగా ఉన్నప్పటికీ కనీసం అరగంటైనా  ఇద్దరూ సంతోషంగా ఉండటానికి  మాత్రమే కేటాయించాలి. డేటింగ్ నైట్ ప్లాన్ చేసుకోవడం...   డేటింగ్ కి వెళ్లడం వల్ల పెళ్లైన సంవత్సరాల తర్వాత కూడా సంబంధానికి కొత్త జీవం పోస్తుంది. ఆశ్చర్యకరమైన బహుమతులు ఇవ్వడం.. చిన్న బహుమతులు కూడా పెద్ద ప్రేమ బయటకు వ్యక్తం  చేస్తాయి. సంభాషణకు ప్రాముఖ్యత ఇవ్వడం.. ప్రతిరోజూ కొంత సమయం ఒకరితో ఒకరు ఓపెన్ మాట్లాడుకోండి. శారీరక సాన్నిహిత్యంపై.. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం,  దగ్గరగా కూర్చోవడం కూడా ప్రేమను తిరిగి రేకెత్తించడానికి ఒక మార్గం కావచ్చు. నిజానికి వివాహం అయిన తరువాత పిల్లలు పుట్టగానే శారీరకంగా బంధం బలహీనమవుతుంది.  అందుకే చాలా వరకు ప్రేమ తగ్గినట్టు అనిపిస్తుంది.  సురక్షిత మార్గంలో భార్యాభర్తలు శారీరక బంధాన్ని సాగిస్తే వారి మధ్య ప్రేమ ఎప్పుడూ తాజాగా ఉంటుంది.                                  *రూపశ్రీ.
  ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలని కోరుకుంటాడు.  మానసిక సమస్యలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు.  నేటి కాలంలో కొందరు  అనారోగ్యంతో బాధపడుతుంటే  మరికొందరు  కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదని,   మరికొందరు తమకు జీతం తక్కువ అని, ఇంకొందరు జీతం సరిగా రావడం లేదని.. ఇలా  సగం ప్రపంచం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఎటువంటి ఆందోళన లేకుండా  సంతోషంగా ఉంటుంటారు. వాళ్లు అసలు అంత సంతోషంగా ఎలా ఉన్నారు? అనే విషయం కూడా కొందరికి అర్థమే కాదు.. అసలు  జీవితాన్ని సంతోషంగా,  ప్రశాంతంగా ఉంచగల మార్గాలు ఏమిటి? దుఃఖాలకు, సమస్యలకు దూరంగా ఉండటం ఎలా తెలుసుకుంటే.. తల్లిదండ్రుల సూచనలు..  పిల్లలు తల్లిదండ్రుల  మాట విని సరైన మార్గాన్ని అనుసరిస్తే, అది తల్లిదండ్రులకు  చాలా సంతోషకరమైన విషయం. అలాంటి పిల్లలు కుటుంబానికి కీర్తిని తెస్తారు.  వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. కాబట్టి జీవితంలో ఆనందం,  శాంతి కోరుకుంటే, ఎల్లప్పుడూ  తల్లిదండ్రుల సూచనలను పాటించాలి.  సరైన మార్గాన్ని అనుసరించాలి.  నేటి జెనరేషన్ అప్డేట్ అయి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల దగ్గర అనుభవం ఉంటుంది.  కాబట్టి వారి అనుభవ పూరిత సలహాలు ఎప్పుడూ నష్టం మాత్రం కలిగించవు.  జీవిత భాగస్వామి మద్దతు.. జీవితంలో లైఫ్ పార్ట్నర్ చాలా ముఖ్యమైవారు.   జీవిత భాగస్వామి  సుఖదుఃఖాలన్నిటిలోనూ సపోర్ట్ ఇస్తూ అవగాహనతో మసలుకుంటే  జీవితం సులభంగా, సంతోషంగా మారుతుంది. జీవిత భాగస్వామి  అంటే పంచుకునేవారు. ఎలాంటి పరిస్థితిని అయినా అర్థవంతంగా చెప్పగలిగితే బాగస్వామి తప్పకుండా అర్థం చేసుకుంటారు.  ఎవరు అర్థం చేసుకోకపోయినా,  ఎవరు కష్టాలలో తోడు ఉండకపోయినా లైఫ్ పార్ట్నర్ తోడు ఉంటే బాధ, సమస్య ప్రభావం తెలియకుండా ఉంటుంది. తృప్తి.. ఈ కాలంలో మనిషికి లోపించినది తృప్తి.   ఎక్కువ కోసం ఆరాటపడకపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా సంతోషంగా ఉంటాము. ముఖ్యంగా డబ్బు గురించి గొడవ చేసేవారు ఎప్పుడూ ఉన్నదాంతో  సంతృప్తి చెందరు. అందుకే మొదట డబ్బు దగ్గర ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకుంటే  అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉండవచ్చు. ఆశించడం..  ఇతరుల సంపద,  ఆస్తి,  ఇతర వస్తువులు వంటివి కోరుకోవడం, తప్పని,  అది చాలా చీప్ మెంటాలిటీ అని  ఎప్పుడైతే తెలుసుకుంటారో.. అప్పుడు జీవితంలో దురాశను వదిలిపెడతారు. ఎవరినుండి అయినాఏదైనా ఆశించడం దురాశ చెందడమే. ఇట్లా దురాశను వదిలిన రోజు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.  ఎటువంటి కోరిక లేకుండా జీవితాన్ని గడుపుతాము. భూత దయ.. నా వాళ్లు, మనవాళ్లు అని మాత్రమే కాదు.. అందరినీ, అన్ని జీవులను ప్రేమించాలి.అందరి పట్ల,  మూగ ప్రాణుల  పట్ల కూడా  దయ,  కరుణ కలిగి ఉంటే,   ప్రేమ,  శాంతిని నింపుకోగలుగుతారు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు,  మంచి ఆలోచనలు,  ఇతరులను ఇబ్బంది పెట్టని,  అన్ని జీవులను సమానంగా చూసే సమభావం అలవడుతుందో.. అప్పుడు మనిషి జీవితం ఎన్ని దుఃఖాలు, సమస్యలు వచ్చినా బాధకు లోనుకాకుండా ఉంటుంది.                               *రూపశ్రీ.
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన అలవాట్ల కారణంగా మూత్రపిండాలు క్రమంగా దెబ్బతింటాయి. నేటికాలంలో ఆహారపు అలవాట్లు,  తీసుకునే పానీయాలు,  జీవనశైలి కారణంగా మూత్రపిండాల ఆరోగ్యం చాలా దెబ్బతింటోంది. గతంతో పోలిస్తే.. నేటికాలంలో మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎక్కువ అయ్యారు. మూత్రపిండాల పనితీరు బలంగా ఉండాన్నా,  మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలన్నా కొన్ని అలవాట్లు చాలా బాగా సహాయపడతాయి.   రోజువారీ జీవితంలో పాటించదగిన ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. నీరు.. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినంత నీరు త్రాగడం చాలా సులభమైన,  ప్రభావవంతమైన మార్గం. నీరు మూత్రం ద్వారా శరీరం నుండి విషపదార్థాలను , అదనపు ఉప్పును బయటకు పంపడానికి సహాయపడుతుంది. చాలా తక్కువ నీరు త్రాగడం వల్ల డీహైడ్రేషన్, మూత్రపిండాల్లో రాళ్లు , మూత్రపిండాలపై ఒత్తిడి పెరగడానికి దారితీస్తుంది. సగటు వ్యక్తికి రోజుకు 2–3 లీటర్ల నీరు త్రాగడం చాలా అవసరం.  ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది. ఉప్పు.. అధికంగా ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మూత్రపిండాలు దెబ్బతినడానికి ఒక ప్రధాన కారణం అవుతుంది. ప్యాక్ చేసిన స్నాక్స్, చిప్స్, ఊరగాయలు , ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉప్పు అధికంగా ఉంటుంది.   ఉప్పు తక్కువగా తీసుకునేందుకు  ప్రయత్నించాలి. అలాగే  తాజాగా, ఇంట్లో వండిన భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ ఉప్పు ఉన్న ఆహారం మూత్రపిండాలపై భారాన్ని తగ్గించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జంక్ ఫుడ్.. జంక్ ఫుడ్‌లో అధికంగా నూనె, ఉప్పు, చక్కెర  ఉంటాయి, ఇవి క్రమంగా శరీరానికి , మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. బర్గర్లు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, శీతల పానీయాలు , ప్రాసెస్ చేసిన ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు , మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, తాజా పండ్లు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు ,  ఇంట్లో వండిన పోషకాలతో కూడిన  భోజనం తినడం ఉత్తమం. ధూమపానం.. ధూమపానం శరీరంలోని రక్తనాళాలను దెబ్బతీసి, మూత్రపిండాలకు తగినంత రక్త సరఫరాను అడ్డుకుంటుంది. సిగరెట్లలోని విష పదార్థాలు క్రమంగా మూత్రపిండాల పనితీరును బలహీనపరుస్తాయి. ధూమపానం మానేయడం వల్ల రక్త ప్రసరణ, శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడి, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ధూమపానం ఆపేయడం వల్ల  గుండె , ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాకింగ్.. ప్రతిరోజూ 30 నిమిషాల నడక శరీరాన్ని చురుకుగా , ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. నడక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, బరువును అదుపులో ఉంచుతుంది , రక్తపోటును నియంత్రిస్తుంది. క్రమం తప్పకుండా నడవడం మధుమేహం , ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది, తద్వారా ఎక్కువ కాలం  మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉదయం లేదా సాయంత్రం తేలికపాటి నడక మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.                            *రూపశ్రీ.
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో తల తిరగడం సమస్యకు మన ఇంట్లో ఉండే ధనియాలతో (Coriander Seeds) సులభమైన మరియు ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాలను వివరించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే అంశాలు: తల తిరగడానికి కారణాలు: అసలు వెర్టిగో లేదా తల తిరగడం ఎందుకు వస్తుంది? ధనియాల ప్రాముఖ్యత: ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ధనియాలు శరీరంలోని వేడిని తగ్గించి, నాడీ వ్యవస్థను ఎలా శాంతపరుస్తాయి? రెమెడీ తయారీ విధానం: ధనియాలను ఏ విధంగా ఉపయోగిస్తే తల తిరగడం తక్షణమే తగ్గుతుంది? ముందు జాగ్రత్తలు: ఈ సమస్య ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార నియమాలు మరియు జాగ్రత్తలు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ సహజ సిద్ధమైన చిట్కాను పాటించి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానల్ చూడండి: సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి ఇది ఒక పెద్ద అడ్డంకి అని అంటున్నారు ప్రముఖ ఫ్యాట్ లాస్ కోచ్ విజయ్ మంగం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాత్రిపూట అన్నం తినడం వల్ల కలిగే నష్టాలు మరియు ఆరోగ్యకరమైన మార్పుల గురించి ఈ VIDEO లో వివరించారు. రాత్రిపూట అన్నం ఎందుకు వద్దు? మనం పగటిపూట రకరకాల పనులు చేస్తూ ఉంటాం కాబట్టి శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కానీ రాత్రిపూట శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట అన్నం తిని వెంటనే పడుకోవడం వల్ల ఆ శక్తి ఖర్చు కాక, అది కొవ్వుగా (Fat) మారి శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల ముఖ్యంగా పొట్ట రావడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రత్యామ్నాయాలు ఏమిటి? విజయ్ మంగం సూచనల ప్రకారం, రాత్రిపూట అన్నానికి బదులుగా కూరగాయలు (Vegetables), ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఉత్తమం. సలాడ్లు, సూప్స్ లేదా తక్కువ పరిమాణంలో ఇతర చిరుధాన్యాలను ఎంచుకోవచ్చు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీరానికి అనవసరమైన కొవ్వు చేరదు. ముఖ్య గమనిక: మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఫిట్‌గా కనిపించాలన్నా కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు, సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. బరువు తగ్గాలనుకునే వారు విజయ్ మంగం గారి ఈ టిప్స్ పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health ను సందర్శించండి.  సబ్‌స్క్రైబ్ చేసుకోండి!