LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మరో బాదుడుకు రంగం సిద్ధమవుతోంది.  పాత వాహనాలపై గ్రీన్‌ట్యాక్స్‌ విధించాలని అధికారులు  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రవాణా వాహనాలు ఏడేళ్లు దాటితే రూ.4వేలు, పదేళ్లు దాటితే రూ.5వేలు, పన్నెండేళ్లు దాటితే రూ.6వేలు చొప్పున గ్రీన్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. మోటార్ సైకిల్ పదిహేనేళ్లు దాటితే రూ.2వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.5వేలు, కార్లు, జీపులు పదిహేనేళ్లు దాటితే రూ.5వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.10వేల చొప్పున పన్నులను వేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదం కోసం రవాణాశాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. హరిత పన్నును రద్దు చేయాలని రవాణా రంగం ప్రతినిధులు కోరుతున్నారు.   ఖజానా ఖాళీ కావడంతో ఎక్కడెక్కడ పన్నులు వేయాలా అని ఆలోచిస్తున్న జగన్ సర్కార్ .. రవాణాశాఖ అధికారుల ప్రతిపాదనలను వెంటనే ఆమోదించే అవకాశాలున్నాయి. కొన్ని రోజులుగా జనాలపై భారాలు మోపుతూనే ఉంది వైసీపీ ప్రభుత్వం. ఇంటి పన్నులు పెంచింది. చెత్తకు పన్ను వసూల్ చేస్తోంది. లిక్కర్ పైనా ట్యాక్సులు పెంచుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. దేశంలో పెట్రోల్, డీజిల్ రేటు ఎక్కువగా ఉన్న టాప్ రాష్ట్రాల్లో ఏపీ ఉంది.  ఇటీవల ఎక్సైజ్ ట్యాక్ తగ్గించిన కేంద్రం.. రాష్ట్రాలు తమ పరిధిలోని వ్యాట్ తగ్గించాలని సూచించింది. కేంద్రం సూచనతో బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై కొంత వ్యాట్ తగ్గించాయి. కాని జగనన్న సర్కార్ మాత్రం పైసా కూడా తగ్గించలేదు. తాజాగా గ్రీన్ ట్యాక్స్ విధించాలని చూస్తుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. చమురు ధరలతోనే తమకు చుక్కలు కనిపిస్తున్నాయి.. ఇంకా గ్రీన్ ట్యాక్స్ తో మరింత భారం పడుుతుందని గగ్గోలు పడుతున్నారు. 
అసెంబ్లీ అంటే అత్యంత భద్రత ఉండే ప్రాంతం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే సెక్యూరిటీ మరింత పెరుగుతుంది. సామాన్యులు అక్కడికి వెళ్లడం కుదరదు. అలాంటిది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. అసెంబ్లీ ఆవరణలో మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. ఇదే దారుణం అనుకుంటే.. మరో సంచలన విషయం కూడా ఉంది. ఆ రాష్ట్రంలో మద్యపాన నిషేదం అమలవుతోంది. అంటే మద్యపాన నిషేదం ఉన్న రాష్ట్రంలో. అసెంబ్లీ ఆవరణలో ఖాళీ లిక్కర్ బాటిల్స్ దొరకడం ఇప్పుడు రచ్చరచ్చగా మారింది.  మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో, అందులోనూ అసెంబ్లీ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు వెలుగు చూడడం కలకలం రేపింది. మద్య నిషేధానికి అనుకూలంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని నాలుగు నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రతిజ్ఞ చేసిన మరునాడే ఈ మద్యం సీసాలు వెలుగు చూశాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు. మద్యంపై రాష్ట్రంలో పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. మద్య నిషేధాన్ని ‘కంటితుడుపు’గా అభివర్ణించిన తేజస్వీయాదవ్.. నితీశ్ కుమార్ పోలీసులు మద్యం కొనే వినియోగదారులను మాత్రమే అరెస్ట్ చేస్తారని, అసలు దోషులైన లిక్కర్ మాఫియాపై కన్నెత్తి కూడా చూడరని మండిపడ్డారు.  అసెంబ్లీలోనూ నితీశ్ కుమార్‌పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో మద్యం మాఫియాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని దుమ్మెత్తిపోశాయి. అసెంబ్లీ ఆవరణలో మద్యం సీసాలు బయటపడడంపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, దీనిపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ కనుక అనుమతిస్తే ముఖ్యకార్యదర్శి, డీజీపీని దర్యాప్తు కోరుతామని అన్నారు. 
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అత్యంత కీలక అంశం. విభజనతో నష్టపోయిన ఆంధ్రాకి ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందన్నది అందరి మాట. విభజన చట్టంలోనూ  ఏపీకి ప్రత్యేక హోదా  అంశం ఉంది. కాని ఏడున్నర ఏండ్లు అవుతున్నా ప్రత్యేక హోదా కలగానే మిగిలిపోయింది. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను సాధిస్తామనే హామీతోనే ఎన్నికల ప్రచారం చేసింది. గెలిచి అధికారం చేపట్టింది. కాని హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చింది లేదు. పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం పోరాడటం లేదు వైసీపీ ఎంపీలు. తన కేసుల కోసం కేంద్రానికి ప్రత్యేక హోదాను జగన్ రెడ్డి తాకట్టు పెట్టారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ప్రత్యేక హోదాపై మరో షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్ర సర్కార్. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని మరోసారి స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందని స్పష్టం చేశారు.   విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి  చెప్పారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతోపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామని చెప్పారు నిత్యానందరాయ్. 2015-16 నుంచి 2019-20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తి కింద వచ్చే మొత్తాన్ని ప్రత్యేక సాయంగా ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించామని తెలిపారు. 2015-16 నుంచి 2019-20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని కూడా కేంద్రమే చెల్లిస్తుందని నిత్యానందరాయ్‌ తెలిపారు.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానంలో  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక సాయం చేయడానికి అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది. విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని, మిగిలిన వాటికి కొంత సమయం ఉందని కేంద్ర హోం శాఖ పేర్కొంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో అద్బుత విజయం సాధించి అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్ ఓటమిని సీఎం కేసీఆర్ ఇంకా మరిచిపోకముందే మరో దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా కేసీఆర్ చెప్పుకునే కరీంనగర్ నుంచే మరో షాక్ ఇచ్చేందుకు ఈటల రాజేందర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈటల ఎత్తులతో గులాబీ పార్టీ ఆగమాగమవుతోందని తెలుస్తోంది.  రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు ఏకగ్రీవం కాగా... మిగితా ఐదు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. ఇందులో కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు జరగనున్న ఎన్నిక రసవత్తరంగా మారింది. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ గులాబీ పార్టీకి హ్యాండిచ్చి... ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఈటల రాజేందర్ డైరెక్షన్ లో రవీందర్ సింగ్ బరిలో నిలిచారు. హుజురాబాద్ తరహాలోనే ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచేందుకు ఈటల వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ప్రతినిధులు అధికార పార్టీకే ఎక్కువగా ఉన్నా రవీందర్ సింగ్ గెలుపు కోసం తనదైన శైలిలో  పావులు కదుపుతున్నారు ఈటల రాజేందర్. రవీందర్ సింగ్ కూడా కాంగ్రెస్ మద్దతు కూడగడుతున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి మద్దతు కోరారు. ఈటల కూడా రవీందర్ సింగ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రోజు రోజుకు రవీందర్ సింగ్ కు బలం పెరుగుతుందని తెలుస్తోంది. టీఆర్ఎస్ తమ సభ్యులను క్యాంపులకు తరలించినా.. ఆ పార్టీలో భయం కనిపిస్తోంది. క్యాంపులో ఉన్న సభ్యులు కూడా లోపాయకారిగా ఈటలతో మంతనాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. దీంతో జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేతలు హడలిపోతున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తేడా జరిగితే కేసీఆర్ ఆగ్రహిస్తారనే భయంతో పార్టీ సభ్యులను కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఎంపీటీసీతో ఫోన్ లో మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడిన ఆడియో లీకై వైరల్ గా మారింది.  పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్‌ ఎంపీటీసీ సభ్యుడు దండె వెంకటేశ్వ ర్లుకు ఫోన్‌ చేసిన మంత్రి కొప్పుల ‘‘ ఏం వెంకటేశ్‌! అందర్ని జమ చేస్తున్నవట! అవతలి వాళ్లిచ్చే రూ. 50 వేలే కావాల్నా? మేమిచ్చేది అవసరం లేదా?’’ అంటూ ప్రశ్నించారు. తాను ఎవరినీ జమ చేయలేదని, తన వద్దకు వస్తే తీసుకోలేదని వెంకటేశ్వర్లు చెప్పగా, ‘‘అందరూ నీ పేరే చెప్తున్నరు. ఏదైనా ఉంటే నాతోనే మాట్లాడు. వాళ్ల పేరు, వీళ్ల పేరు ఎందుకు చెప్పుతవ్‌? పైసలు కావాలంటే ఇప్పించేది మనమే. ఏం చేయాలన్నా చేసేది మనమే. వేరేటోడికి మంది ఉన్నరా? మనకు 900 మంది ఉన్నరు’’ అని మంత్రి కొప్పుల అన్నారు. అయితే తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎవరి వద్దకూ వెళ్లలేదని వెంకటేశ్వర్లు బదులిచ్చారు. దీంతో, ‘‘కొందరు పి.. కుంట్లోళ్లు ఉన్నరు. వాళ్లు పోతే పోనియ్యి. రఘువీర్‌సింగ్‌ అనేటోడు పి.. కుంట్లోడు. ఉంటే ఉంటడు.. పీకితే పీ కుతడు. పుట్ట మధు వాళ్లు ఈటల రాజేందర్‌తో పోతరు. నువ్వు కూడా పోతవా?’’ అని మంత్రి ప్రశ్నించారు. తనకు ఆ అవసరం లేదని వెంకటేశ్‌ చెప్పగా.. ఎవరన్నా వస్తే తన వద్దకు తీసుకురావాలని మంత్రి అన్నారు. ఈ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. 
కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా మహమ్మారితో వైరస్ పేరు ప్రస్తుతం పాపులర్ అయింది. చైనా వైరస్ అంటూ కరోనాను పిలుస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా వైరస్ తో పోల్చుతూ మాట్లాడుతున్నారు. తాజాగా ప్రముఖ భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర చేసిన ట్విట్టర్ పోస్టు వైరల్ గా మారింది. భారత్ లో పుట్టిన టీకాలేని మహమ్మారి అంటూ ఆయన పెట్టిన పోస్టుకు పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.  ట్విట్టర్ కు కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ఎంపికయ్యారు. ట్విట్టర్ కొత్త సీఈవోగా భారతీయుడు ఎంపికవడంపై ఆనంద్ మహీంద్ర తనదైన శైలిలో స్పందించారు అది టీకాలేని ఇండియన్ వైరస్ అంటూ చలోక్తి విసిరారు. ‘‘ఇది భారత్ లో పుట్టిన మహమ్మారి. ఆ విషయం చెప్పేందుకు ఎంతో గర్విస్తున్నా. ఆ వైరస్ పేరు ‘ఇండియన్ సీఈవో వైరస్’. దానికి టీకా కూడా లేదు’’ అంటూ మహీంద్రా ట్వీట్ చేశారు.  స్ట్రైప్ అనే కంపెనీ సీఈవో పెట్టిన పోస్టుకు మహీంద్రా ఈ విధంగా బదులిచ్చారు. ‘‘గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబి, ఐబీఎం, పాలో ఆల్టో నెట్ వర్క్స్.. ఇప్పుడు ట్విట్టర్ సీఈవోలంతా భారతీయులే. టెక్నాలజీ ప్రపంచంలో భారతీయుల ఇంతటి విజయాన్ని చూడడం అద్భుతంగా ఉంది. అంతేగాకుండా వలసవచ్చేవారికి అమెరికా ఎన్ని అవకాశాలిస్తుందో దీన్నిబట్టి అర్థమవుతుంది’’ అంటూ ప్యాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు. దానికి బదులుగానే ఇది ఇండియన్ సీఈవో వైరస్ అంటూ ఆనంద్ మహీంద్ర రిప్లై ఇచ్చారు.
ALSO ON TELUGUONE N E W S
  ఆక‌స్మికంగా క‌న్నుమూసి, సంగీత ప్రియుల‌నంద‌ర్నీ దుఃఖ‌సాగ‌రంలో ముంచేసిన‌ అస‌మాన గేయ‌ర‌చయిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి క‌లం నుంచి ఉరికురికి వ‌చ్చిన ప‌దునైన పాట‌లు అనేకం. వాటిలో క్రిష్ డైరెక్ట్ చేసిన 'కంచె' సినిమాలోని "విద్వేషం పాలించే దేశం ఉంటుందా?" అనే పాట ఒక‌టి. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన రెండో సినిమా 'కంచె'. రెండో ప్ర‌పంచ యుద్ధం నేప‌థ్యంలో న‌డిచే అంద‌మైన ప్రేమ‌క‌థ‌తో రూపొందిన ఈ సినిమాలో 'మ‌నుషుల మ‌ధ్య‌, దేశాల మ‌ధ్య ఉండాల్సింది ద్వేషం కాదు, ప్రేమ' అనే ఒక ఉదాత్త భావ‌న‌ను బ‌లంగా వ్య‌క్తీక‌రించే పాట కావాల్సి వ‌చ్చింది.  చిరంత‌న్ భ‌ట్ బాణీలు సిద్ధ‌మ‌య్యాయి. ఆ పాట‌ను ఎవ‌రితో రాయాల‌నే ఆలోచ‌న రావ‌డం ఆల‌స్యం.. క్రిష్ మ‌దిలో మెదిలిన క‌వి ఒక్క‌డే.. సీతారామ‌శాస్త్రి. సంద‌ర్భం చెప్ప‌గానే కొంత స‌మ‌యం తీసుకొని క‌లాన్ని ఝ‌ళిపించారు శాస్త్రి.  "విద్వేషం పాలించే దేశం ఉంటుందా?  విధ్వంసం నిర్మించే స్వ‌ర్గం ఉంటుందా?" అని ప్ర‌శ్నిస్తూ ప‌ల్ల‌వి రాసిన ఆయ‌న "ప్రేమ‌ను మించిందా బ్ర‌హ్మాస్త్ర‌మైనా.. ఆయువుపోస్తుందా ఆయుధ‌మేదైనా" అని మొద‌టి చ‌ర‌ణం, "అంద‌రికీ సొంతం అందాల లోకం.. కొంద‌రికే ఉందా పొందే అధికారం" అంటూ రెండో చ‌ర‌ణం రాశారు. సీతారామ‌శాస్త్రి రాసిన వంద‌లాది అర్థ‌వంత‌మైన పాట‌ల్లో 'కంచె'లోని ఈ పాట కూడా ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఆయ‌న స్వ‌ద‌స్తూరితో ఆ పాట ఇలా ఉంటుంది...
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణం తెలుగు సినీపరిశ్రమకు తీరని లోటు అంటూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. "తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అంటూ జగన్ ట్వీట్ చేశారు. "అద్భుత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దాదాపు 3000లకు పైగా పాటలు రాసి సంగీత ప్రియులను అలరించిన పద్మశ్రీ సీతారామశాస్త్రి గారి మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటు. సీతారామశాస్త్రి గారి ఆత్మశాంతికై భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి విషయమని వార్తలొస్తున్న సమయంలో "మీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న" అని ట్వీట్ చేసిన బాలకృష్ణ.. సిరివెన్నెల మరణవార్త తెలిసిన తర్వాత "కళామ్మతల్లి కన్నీరు పెట్టుకుంది.. సినీపరిశ్రమ మూగబోయింది" అని ట్వీట్ చేశారు.
`నిశ్శ‌బ్దం` త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న స్టార్ హీరోయిన్ అనుష్కా శెట్టి.. త్వ‌ర‌లో యూవీ క్రియేష‌న్స్ కాంబినేష‌న్ లో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `మిర్చి`, `భాగ‌మ‌తి` త‌రువాత స్వీటీ - యూవీ కాంబోలో హ్యాట్రిక్ ఎటెంప్ట్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనుష్క ఓ కోలీవుడ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్. రీసెంట్ గా `త‌లైవి` వంటి బ‌యోపిక్ తో ప‌ల‌క‌రించిన వెర్సటైల్ డైరెక్ట‌ర్ ఎ.ఎల్. విజ‌య్ కాంబినేష‌న్ లో ఈ మూవీ రూపొంద‌నుంద‌ట‌. ఇప్ప‌టికే విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో `దైవ తిరుమ‌గ‌ళ్` (తెలుగులో `నాన్న‌`), `తాండ‌వం` (తెలుగులో `శివ తాండ‌వం`) వంటి చిత్రాల్లో న‌టించింది స్వీటీ. అయితే, ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో.. థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్ మూవీతోనైనా అనుష్క - విజ‌య్ కాంబో స‌క్సెస్ అందుకుంటుందేమో చూడాలి.  కాగా, జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని.. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో సిల్వ‌ర్ స్క్రీన్ పైకి వ‌స్తుంద‌ని కోలీవుడ్ బ‌జ్. త్వ‌ర‌లోనే అనుష్క - విజ‌య్ కాంబో మూవీపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.   
`చ‌మ్మ‌క్ చ‌ల్లో` చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన కేథ‌రిన్ ట్రెసా.. ఆపై `ఇద్ద‌ర‌మ్మాయిల‌తో`, `పైసా`, `ఎర్ర‌బ‌స్సు`, `రుద్ర‌మ‌దేవి` వంటి సినిమాల్లో మెరిసింది. అయితే, అల్లు అర్జున్ తో ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుక‌ట్టిన `స‌రైనోడు` సినిమాతోనే టాలీవుడ్ లో తొలి హిట్ చూసింది మిస్ ట్రెసా. స‌ద‌రు బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అనంత‌రం మ‌రి కొన్ని తెలుగు చిత్రాల్లో మెరిసిన కేథ‌రిన్ కి వాటిలో `నేనే రాజు నేనే మంత్రి` మాత్ర‌మే స‌క్సెస్ అందించింది. ఇక ప్రీవియ‌స్ మూవీ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` ఘోర‌ప‌రాజ‌యం త‌రువాత‌ తెలుగు తెర‌పై మ‌ళ్ళీ క‌నిపించ‌ని కేథ‌రిన్.. ఇప్పుడిప్పుడే తిరిగి బిజీ అవుతోంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కి జోడీగా న‌టించిన `బింబిసార‌` త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వ‌గా.. శ్రీ విష్ణుతో క‌లిసి న‌టిస్తున్న `భ‌ళా తంద‌నాన‌` సెట్స్ పై ఉంది. అలాగే నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న పొలిటిక‌ల్ డ్రామా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`లో కృతి శెట్టి మెయిన్ లీడ్ గా నటిస్తుండ‌గా.. సెకండ్ లీడ్ గా ఎంట‌ర్టైన్ చేయ‌నుంది కేథ‌రిన్. మొత్త‌మ్మీద‌.. వ‌రుస చిత్రాల‌తో మ‌ళ్ళీ బిజీ తార‌గా మారిపోయిన కేథ‌రిన్.. రాబోయే సినిమాల‌తో ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటుందో చూడాలి.  
సిరివెన్నెల సీతారామశాస్త్రి.. తెలుగు సినీ పరిశ్రమలోని పాటల పూదోటలో ఆయనో మహావృక్షం. తన కలంతో ఎన్నో హృదయాలను కదిలించారు. తన పాటలతో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశారు. ఆయన లేని తెలుగు సినీ పాటల ప్రపంచాన్ని ఊహించుకోలేం. ఆయన లేకపోయినా ఎన్నో గొప్ప పాటల రూపంలో ఆయన బ్రతికే ఉంటారు. మూడు దశాబ్దాల పైగా సాగిన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో గొప్ప పాటలు అందించారు. మరే గేయ రచయితకు సాధ్యం కానీ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'జననీ జన్మభూమి(1984)'తో గేయ రచయితగా టాలీవుడ్ కి పరిచయమయ్యారు చంబోలు సీతారామశాస్త్రి. ఆ తర్వాత 1986 లో విశ్వనాథ్ దర్శకత్వంలోనే వచ్చిన 'సిరివెన్నెల' సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని పొందారు సీతారామశాస్త్రి. ఆ సినిమాలో ఆయన రాసిన అన్ని పాటలూ ఆణిముత్యాలు. 'విధాత తలపున' పాట అయితే ఆయనకి  గేయ రచయితగా మొదటి నంది అవార్డు తెచ్చిపెట్టింది. 'సిరివెన్నెల'నే తన ఇంటిపేరుగా చేసుకుని సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారిన ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి చేసుకున్నది లేదు. సిరివెన్నెల(1986) తర్వాత.. శ్రుతిలయలు(1987) లోని 'తెలవారదేమో', స్వర్ణకమలం(1988)లోని 'అందెల రవమిది' పాటలకు ఆయనకు నందులు వరించాయి. గేయ రచయితగా వరుసగా మూడు సార్లు నంది అవార్డు గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత గాయం(1993)లోని సురాజ్యమవలేని, శుభలగ్నం(1994) లోని చిలకా ఏ తోడులేక, శ్రీకారం(1995)లోని మనసు కాస్త కలత, సింధూరం(1997)లోని అర్ధ శతాబ్దపు, ప్రేమకథ(1999) లోని దేవుడు కరుణిస్తాడని, చక్రం(2005)లోని జగమంత కుటుంబం నాది, గమ్యం(2008)లోని ఎంతవరకూ ఎందుకొరకూ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(2013) లోని 'మరీ అంతగా' పాటలకు ఆయన నందులు గెలుచుకున్నారు. ఆయన సినీ కెరీర్ లో మొత్తం 11 నంది పురస్కారాలను అందుకున్నారు. కెరీర్లో ఉత్తమ గేయరచయితగా నంది అవార్డులతో పాటు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు కూడా గెలుచుకున్నారు సిరివెన్నెల. వీటితో పాటు కళాసాగర్, మనస్విని వంటి ఎన్నో పురస్కారాలు ఆయన అందుకున్నారు. సినీ పరిశ్రమకు సిరివెన్నెల చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.
  తెలుగు పాట‌కు సంబంధించిన త‌న యుగాన్ని రాసుకున్న వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి ఉండ‌గానే తెలుగు చిత్ర‌సీమ‌లోకి గేయ‌ర‌చ‌యిత‌గా అడుగుపెట్టిన చెంబోలు సీతారామ‌శాస్త్రి.. 'సిరివెన్నెల' (1986) సినిమాకు అందించిన పాట‌లతో ఒక్క‌సారిగా సంగీత‌ప్రియుల‌నంద‌ర్నీ త‌న‌వైపు దృష్టి సారించేలా చేసుకున్నారు. 'సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి'గా ప్ర‌ఖ్యాతుల‌య్యారు. అప్ప‌ట్నుంచీ వేటూరితో పాటు తెలుగు సినిమా పాట సాహిత్యానికి తాను కూడా ఉన్నానంటూ త‌న క‌లం ప్ర‌భావాన్ని చూపిస్తూ వ‌చ్చారు. తెలుగు సినిమా పాట స్థాయిని పెంచారు. వేటూరి తర్వాత తెలుగు సినిమా పాట‌కు త‌నే పెద్ద దిక్కుగా మారారు.  సీతారామ‌శాస్త్రి క‌లం నుంచి జాలువారిన అమృత తుల్య‌మైన పాట‌లు ఎన్నో.. ఎన్నెన్నో! వేటూరి పాట‌లో తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటే, సీతారామ‌శాస్త్రి పాట‌లో ఆర్ద్ర‌త ఎక్కువ‌గా వినిపిస్తుంది. అలా అని శక్తివంత‌మైన పాట‌ల‌ను ఆయ‌న రాయ‌కుండా ఉండ‌లేదు. 'క‌ళ్లు' సినిమాలో "తెల్లారింది లెగండో కొక్కొరొక్కో" పాట.. ర‌చ‌యిత‌గా ఆయ‌న‌లోని మ‌రో కోణాన్ని వెలికితీసింది. గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం స్వ‌రాలు కూర్చిన ఆ పాట‌ను సీతారామ‌శాస్త్రి స్వ‌యంగా ఆల‌పించారు. ఆయ‌న గొంతులో ఆ పాట ఒక విల‌క్ష‌ణ‌త్వాన్ని సంత‌రించుకుంది. ఇప్ప‌టికీ ఆ పాట త‌ర‌చూ ఎక్క‌డోచోట వినిపిస్తూనే ఉంది. త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేయ‌గా త‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చిన ఇటీవ‌లి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'అల‌.. వైకుంఠ‌పురములో'లో హీరోయిన్ పూజా హెగ్డే కాళ్ల అందాన్ని వ‌ర్ణిస్తూ ఆయ‌న రాసిన "సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌.. నిను చూసి ఆగ‌గ‌ల‌నా" అంటూ ఆయ‌న రాసిన పాట జ‌నం నోళ్ల‌లో ఎంత‌గా నానిందో! మూడున్న‌ర ద‌శాబ్దాలుగా ఆయ‌న క‌లం ప‌దును ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఎంత‌మంది గేయ‌ర‌చ‌యిత‌లు వ‌చ్చినా, ఆయ‌న డిమాండ్ చెక్కుచెద‌ర‌లేదు. ఫ‌లానా సంద‌ర్భానికి సీతారామ‌శాస్త్రి అయితేనే న్యాయం చేకూరుస్తార‌ని ద‌ర్శ‌కులు, సంగీత ద‌ర్శ‌కులూ ఇప్ప‌టికీ న‌మ్ముతూ వ‌చ్చారంటే ఆయ‌న కాలాన్ని జ‌యించిన క‌వి కాక మ‌రేమిటి? ఆయ‌న ఆక‌స్మిక మృతితో తెలుగు సినిమా సాహిత్యం కోలుకోలేని కుదుపుకు లోనైంది. ఆయ‌న లేని లోటు నిజంగా ఎవ‌రూ తీర్చ‌లేనిది. త‌న పాట‌తో ఆయ‌న మ‌న త‌లపుల్లో ఎన్న‌టికీ నిలిచే ఉంటారు.
క్రేజీ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తున్న యువ సంగీత ద‌ర్శ‌కుల్లో త‌మ‌న్ ఒక‌రు. కాగా, త‌మ‌న్ స్వ‌ర‌ప‌రిచిన బిగ్ టికెట్ ఫిల్మ్స్ లో ఒక‌టైన `అఖండ‌`.. డిసెంబ‌ర్ 2న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. ఇదిలా ఉంటే.. గ‌త రెండేళ్ళుగా డిసెంబ‌ర్ నెల‌లో విడుద‌లైన త‌మ‌న్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాన్నే అందుకున్నాయి. 2019లో డిసెంబ‌ర్ మాసంలో జ‌నం ముందు నిలిచిన `వెంకిమామ‌`, `ప్ర‌తి రోజూ పండ‌గే` బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ గా నిల‌వ‌గా.. 2020 డిసెంబ‌ర్ నెల‌లో వ‌చ్చిన `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` క‌రోనా ఫ‌స్ట్ వేవ్ త‌రువాత థియేట‌ర్స్ లో రిలీజైన‌ తొలి నోట‌బుల్ తెలుగు చిత్రంగా నిలిచి మంచి ఆరంభ వసూళ్ళ‌తో వార్త‌ల్లో నిలిచింది. ఓవ‌రాల్ గా ఓకే అనిపించుకుంది. ఈ నేప‌థ్యంలో.. భారీ అంచ‌నాల న‌డుమ 2021 డిసెంబ‌ర్ 2న‌ విడుద‌ల‌వుతున్న `అఖండ‌`.. త‌మ‌న్ డిసెంబ‌ర్ సెంటిమెంట్ ని కొన‌సాగిస్తూ విజ‌య‌ప‌థంలో ప‌య‌నిస్తుందేమో చూడాలి.  న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన `అఖండ‌`కి బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌గ్యా జైశ్వాల్, పూర్ణ‌, శ్రీ‌కాంత్, జ‌గ‌ప‌తి బాబు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాని ద్వార‌కా క్రియేష‌న్స్ సంస్థ నిర్మించింది.
ర‌జినీకాంత్, చిరంజీవి, మోహ‌న్ లాల్, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్, ఎన్టీఆర్, విజ‌య్, విక్ర‌మ్, ర‌వితేజ‌.. ఇలా ద‌క్షిణాదిలోని దాదాపు అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ జోడీక‌ట్టిన క‌థానాయిక‌గా త‌న త‌రంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రియ‌. అంతేకాదు.. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డం, హిందీ, ఆంగ్లం వంటి విభిన్న భాష‌ల్లో వైవిధ్య‌భ‌రిత‌మైన‌ పాత్ర‌ల్లోనూ ఆక‌ట్టుకున్న వైనం త‌న సొంతం. అదే విధంగా.. అటు గ్లామ‌ర్ తోనూ, ఇటు పెర్ఫార్మెన్స్ తోనూ అల‌రించిన అతి త‌క్కువ మంది క‌థానాయిక‌ల్లో ఒక‌రిగానూ గుర్తింపు ద‌క్కించుకుంది ఈ ఉత్త‌రాది సోయ‌గం.  అలాంటి శ్రియ‌.. వెండితెర‌పై మెరిసి నేటికి (న‌వంబ‌ర్ 30) స‌రిగ్గా ఇర‌వై ఏళ్ళు. నేటి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన విక్ర‌మ్ కె. కుమార్ మ‌రో ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ తో క‌లిసి సంయుక్తంగా రూపొందించిన `ఇష్టం` (2001)తో శ్రియ సినీ ప్ర‌స్థానం మొద‌లైంది. దిగ్గ‌జ నిర్మాణ సంస్థ ఉషాకిర‌ణ్ మూవీస్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాలో నేహా అనే యువ‌తి పాత్ర‌లో త‌న అందం, అభిన‌యంతో మెస్మ‌రైజ్ చేసింది శ్రియ‌. ఆ సినిమా ఆశించిన ఫ‌లితం అందుకోలేక‌పోయినా.. నాగ్ కి జోడీగా న‌టించిన `సంతోషం` (2002)తో తొలి విజ‌యాన్ని అందుకుని ఆపై వ‌రుస సినిమాల‌తో, విజ‌యాల‌తో స్టార్ హీరోయిన్ గా రాణించింది. 20 ఏళ్ళ పాటు త‌న గ్లామ‌ర్ తో వెండితెర‌పై వెలుగులు పంచుతూ మురిపిస్తూ వ‌స్తోంది. కాగా, త్వ‌ర‌లో ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్ `గ‌మ‌నం`, `ఆర్ ఆర్ ఆర్` వంటి పాన్ - ఇండియా మూవీస్ లో అభినయానికి ఆస్కార‌మున్న పాత్ర‌ల్లో క‌నువిందు చేయ‌నుంది.   మ‌రి.. రెండు ద‌శాబ్దాల పాటు వ‌న్నె త‌ర‌గ‌ని అందంతో ఫిదా చేస్తూ వ‌స్తున్న‌ శ్రియ‌.. మున్ముందు కూడా ఇదే శైలిలో త‌న అందం, అభిన‌యంతో మురిపిస్తుందేమో చూడాలి.
  ఎన్నో గొప్ప పాట‌ల‌కు త‌న క‌లంతో అద్భ‌త‌మైన సాహిత్యాన్ని అందించిన‌ ప్ర‌ఖ్యాత గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ఈరోజు (న‌వంబ‌ర్ 30) క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 66 సంవ‌త్స‌రాలు. జ్వ‌రం, శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ను ఈ నెల 24న కుటుంబ‌స‌భ్యులు సికింద‌రాబాద్‌లోని కిమ్స్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఆయ‌న న్యుమోనియాతో బాధ‌ప‌డుతున్న‌ట్లు వైద్యులు తెలిపారు. అప్ప‌ట్నుంచీ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ వ‌స్తున్నారు. ఈరోజు సాయంత్రం 4:07 గంట‌ల‌కు ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. సీతారామ‌శాస్త్రి ఆక‌స్మిక మృతితో తెలుగు చిత్ర‌సీమ యావ‌త్తూ దిగ్భ్రాంతికి లోనైంది. రెండు రోజుల క్రిత‌మే సీనియ‌ర్ కొరియోగ్రాఫ‌ర్ శివ‌శంక‌ర్ కొవిడ్‌తో బాధ‌ప‌డుతూ మృతిచెంద‌గా, ఇప్పుడు సీతారామ‌శాస్త్రి క‌న్నుమూయ‌డంతో టాలీవుడ్ విషాద సాగ‌రంలో మునిగిపోయింది. ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నార‌ని అనుకున్నారే కానీ, క్రిటిక‌ల్ కండిష‌న్‌లో ఉన్నార‌ని ఎవ‌రూ ఊహించ‌లేక‌పోయారు. 1955 మే 20న విశాఖప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లిలో సీతారామ‌శాస్త్రి జ‌న్మించారు. ఆంధ్రా యూనివ‌ర్సిటీలో ఎం.ఎం. చ‌దువుతూ కె. విశ్వ‌నాథ్ సినిమా 'సిరివెన్నెల' (1986)తో గేయ‌ర‌చ‌యిత‌గా ప‌రిచ‌య‌మై, తొలిచిత్రంతోటే పాపుల‌ర్ అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌ల‌గ‌లేదు. 
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మత్తు వదలరా'. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సింహా-రితేష్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా తాజాగా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు మంగళవారం నాడు హైదరాబాద్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ఎస్ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టగా.. గుణ్ణం గంగరాజు కెమెరా స్విఛాన్ చేశారు. ఫస్ట్ షాట్ కి కొరటాల శివ దర్శకత్వం వహించారు. యాక్షన్- కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాళ భైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. 'మత్తు వదలరా'తో మ్యాజిక్ చేసిన సింహా-రితేష్ కాంబో లావణ్యతో కలిసి ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ నెల 9వ తేదీన మొదలైన పోలింగ్, ఆదివారం జరిగిన నాల్గవ విడత పోలింగ్ తో ముగిసింది. ఇంచుమించుగా సంవత్సరంపాటు సాగిన పంచయతీ వివాదం చివరాఖరుకు ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్లుగా మొత్తం 10,890 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగాయి.   ఈ ఎన్నికలలో ఎవరు గెలిచారు,ఎవరు ఓడిపోయారు అనే విషయాన్నిపక్కన పెడితే  కొవిడ్ భయాన్ని, ఇతరత్రా ఎదురైన సమస్యలను పక్కన పెట్టి, గ్రామీణ ఓటర్లు, ప్రజాస్వామ్య స్పూర్తిని పుష్కలంగా కురిపించారు. నాలుగు దశల్లో పోలింగ్ జరిగితే, ప్రతి దశలోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్’లో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే 80.14 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క విజయనగరం జిల్లా మినహా మరే జిల్లాలోనూ పోలింగ్ 70 శాతానికి తగ్గలేదు.ఇది ఒక విధంగా, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు బద్దకించే, చదువుకున్నాళ్ళకు, మంచి  గుణ పాఠం.  పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, జెండాల ప్రమేయం ఉండదు.. ఉండ కూడదు. అయినా అన్నిరాజకీయ పార్టీలు పంచాయతీ పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు ఆపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమైన అధికార పార్టీ గెలిచినాళ్ళు అందరూ మావాళ్ళు అంటూ .. గెలుపు గ్రాఫ్ ను పైపైకి పట్టుకు పోయింది. అలాగని మెజారిటీ పంచాయతీలను అధికార పార్టీమద్దతుదారులు గెలవలేదని కాదు. అధికార పార్టీ మద్దతుదారులే అధిక పంచయతీలలో జెండా ఎగరేశారు. అందులో సందేహంలేదు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా కుప్పంలో ఓటమి లాంటి కొన్ని గట్టి ఎదురుదెబ్బలు తిన్నా, ప్రధాన పతిపక్ష హోదాను నిలుపుకుంది.  తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి అధికార తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ, ఏపీలోనూ  తెలుగు దేశం పార్టీని ప్రధాన ప్రత్యర్ధి స్థానం నుంచి పక్కకు నెట్టాలనే ప్రయత్నం చేసింది కానీ, ఫలితం దక్కలేదు. చంద్రబాబు నాయకత్వం, తెలుగు దేశం పార్టీకి ఉన్న సంస్థాగత బలం ముందు బీజేపీ వ్యూహాలు ఫలించలేదు, ఒకవిధంగా బెజేపీ మిత్రపక్షం, జనసేన కొంతలో కొంత మెరుగైన ఫలితాలు సాధించింది.  అయితే ఈ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో పార్టీల బలాబలాకు నిదర్శనమా అంటే కాదు. పంచాయతీ ఎన్నికలు పక్కా లోకల్ ఎన్నికలు, పైగా పార్టీల పాత్రా, ప్రమేయం ఏ మాత్రం ఉండని ఎన్నికలు. సో .. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల బలాబలాలకు ప్రామాణికం కాదు. వచ్చే నెల 10 తేదీన జరిగే నగర పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలు, పార్టీ గుర్తులపై జరుగుతాయి. సో ..వచ్చే నెల 14 వరకు ఆగితే, పురపాలక సంఘాల ఎన్నికలఫలితాలు వస్తాయి. పార్టీల బలాబలాలు, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం స్పష్ట మవుతుంది.  అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబదించినంతవరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరైనా అభినందించక తప్పదు. కోర్టు చిక్కులు, ప్రభుత్వ సహాయ నిరాకరణ, నిధుల కొరత, సమయం తక్కువ కావడం ఇలా అనేక అవరోధాలు ఎదురైనా, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్,  స్థితప్రజ్ఞత చూపారు. అందుకు ఆయన్ని, రాజకీయ పార్టీలు ఎంతగా రచ్చచేసినా,పవిత్ర హక్కును అంతే పవిత్రంగా  పవిత్రంగా వినియోగించుకున్న ఓటర్లను అభినందించక తప్పదు.     అయినా  ఈ ఎన్నికలలో గత 2013పంచాయతీ ఎన్నికల్లో కంటే ఏకాగ్రీవలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాలలో కలిపి, 1,835 గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయితే, ఈ ఎన్నికల్లో 2,197 గ్రామపంచాయతీలు ఏకాగ్రీవ మయ్యాయి.  సజావుగా, సక్రమంగా ఏకాగ్రీవాలు జరిగితే అది అభినందనీయమే, అయినా, ప్రలోభాలకు గురిచేసి సాగించిన బలవంతపు ఏకాగ్రీవాలే ఎక్కువకావడం ... అభ్యతరకరమే.  
అనగనగా ఓ రాజుగారు ఉండేవారు. ఆయన అద్భుతమైన, అందమైన కోటలెన్నింటిలో నిర్మించాడు. కానీ ఎందుకనో ఆయనకు తనివి తీరలేదు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఓ చిత్రమైన మహలుని నిర్మించాలనుకున్నాడు. శిల్పులందరూ వచ్చి తలా ఓ నమూనాను చూపించారు కానీ ఏవీ రాజుగారికి నచ్చలేదు. చివరికి ఓ శిల్పి చూపించిన అద్దాలగది నమూనా ఆయనకు నచ్చింది. పని కానియ్యమన్నాడు.   శిల్పి చూపించిన అద్దాల గది, అలాంటి ఇలాంటి గది కాదు. ఆ గదిలోకి ఎవరన్నా ప్రవేశిస్తే వారిని ప్రతిబింబించేలా గదిలో అన్నివైపులా అద్దాలే! గది పైకప్పు, కింద గచ్చు కూడా అద్దాలతోనే తయారుచేశాడు. కంట్లో నలుసు కూడా కనిపించేంత స్పష్టంగా ఉన్నాయా అద్దాలు. లోపలికి ప్రవేశించిన మనిషికి తాను ఎక్కడ నిల్చున్నాడో కూడా తెలియనంతగా నలుదిశలా కమ్ముకుని ఉన్నాయి ఆ అద్దాలు. అంతేకాదు! ఆ అద్దాల గదిలోని శబ్దాలు కూడా ఎంతో స్పష్టంగా ప్రతిధ్వనించేవి. రాజుగారు నిర్మించిన ఈ కొత్త మహలు గురించి రాజ్యమంతా తెలిసిపోయింది. అందులోకి తొంగిచూసే అదృష్టం తమకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు తెగ ఎదురుచూడసాగారు. ఓ రాత్రి అనుకోకుండా రాజుగారి కుక్క అందులోకి ప్రవేశించింది. లోపలికి అడుగుపెట్టగానే దానికి మతి పోయింది. తనలాంటి వందలాది కుక్కలు తనని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ మహలులో రాజుగారి చెంతన ఉండే అర్హత తన ఒక్కదానికే ఉందనుకుందది. ఆ కుక్కలను భయపెట్టడానికి ఒక్కసారిగా తన వాడి పళ్లను చూపించింది. చిత్రం! అవి కూడా అలాగే తనని భయపెట్టేందుకు కోరలు చూపించాయి. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఒక్కసారి గట్టిగా మొరిగింది కుక్క! దానికి నాలుగువైపుల నుంచీ భీకరంగా శబ్దాలు ప్రతిధ్వనించాయి. ఇక తన చుట్టూ ఉన్న కుక్కలతో పోరాటం చేయక తప్పలేదు. గాల్లోకి ఎగిరెగిరి పడుతూ, లేని శత్రువులను ఉన్నారనుకుని అద్దాల మీద పడుతూ నానా భీభత్సం సృష్టించింది. ఉదయాన్నే అద్దాల గదిలోకి వచ్చిన భటులకి ఆ కుక్క నిర్జీవంగా కనిపించింది. రాత్రంతా తన ప్రతిబింబాలతో పోరాటం చేసిన ఆ కుక్క ఓడిపోయింది. మన మనసు కూడా అద్దాల గదిలాంటిదే! భయాలు నిజమవకుండానే వాటితో తలపడుతూ ఉంటాము. లేనిపోని అనుమానాలతో మనమీద మనమే పోరాటం చేస్తూ ఉంటాము! కానీ అందులో గెలుపుకి అవకాశం లేదు. ఉండేదల్లా ఓటమే!
జంతువులకి ఆకలి, ఆరోగ్యంలాంటి భౌతికమైన సమస్యలే ఉంటాయి. వాటి సమస్యలన్నీ ఉనికి చుట్టూనే తిరుగుతాయి. కానీ మనిషి అలా కాదయ్యే! అతను ఏర్పరుచుకున్న క్లిష్టమైన సమాజజీవితంలో ప్రతిదీ ఒక సమస్యే! ఉద్యోగంలో ప్రమోషన్‌ దగ్గర్నుంచీ, పిల్లల చదువుల దాకా... ఆర్థిక సమస్యల దగ్గర్నుంచీ అత్తగారి పోరుదాకా అన్నీ సవాళ్లే. ఈ సవాళ్లను కనుక ఎదుర్కోలేకపోతే, ఎదుర్కొని ఛేదించకపోతే జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందుకే సవాళ్ల గురించి నిపుణులు ఇస్తున్న సూచనలు కొన్ని ఇవిగో...   సమస్యని అంగీకరించండి చాలామంది సమస్య ఎదురుపడగానే దాని నుంచి ఎలాగొలా తప్పుకొనేందుకు ప్రయత్నిస్తారు. తాము కాసేపు కళ్లు మూసుకుని ఉంటే ఏదో ఒక అద్భుతం జరిగి సమస్య మాయమైపోతుందన్న భ్రమలో ఉంటారు. కాలం కొన్ని సమస్యలని తీర్చగల మాట నిజమే అయినా చాలా సమస్యలకి మన చేతలే అవసరం అవుతాయి. ఆ చేతలే లేకపోతే చిన్నపాటి సవాళ్లు కాస్తా జీవన్మరణ సమస్యలుగా మారిపోతాయి. అందుకనే ముందు మన ముందు ఒక సమస్య ఉన్నదనీ... దానిని అభివృద్ధీ, వినాశనం మన చేతుల్లోనే గుర్తించడం తొలి మెట్టు.   విశ్లేషణ సమస్య పట్ల భయంతో చాలామంది దాన్ని పైపైనే తడిమేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరేమో సమస్యని కేవలం తమ దృష్టికోణం నుంచే చూస్తారు. అలా కాకుండా సమస్యని లోతుగా, అన్నివైపులా విశ్లేషించిన రోజున దాని మూలాలు తెలుస్తాయి. అసలు సమస్య ఎక్కడ ఉంది? దానిని ఎటునుంచి పరిష్కరించాలన్న అవగాహన ఏర్పడుతుంది.   సలహా- సంభాషణ సమస్య గురించి మన లోలోనే కుమిలిపోయి ఉపయోగం లేదు. దానిని అనుభవజ్ఞులతోనో, పెద్దవారితోనో, ఆత్మీయులతోనో పంచుకోవడం వల్ల వారి దృష్టికోణం నుంచి కూడా సమస్యని అవగాహన చేసుకోవచ్చు. ఒక సమస్యకు అతీతంగా ఉన్న వ్యక్తి దానిని గమనించే తీరు ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. పైగా అలాంటి కష్టకాలంలో వారు అందించే నైతిక స్థైర్యం మనం ఆత్మన్యూనతకీ, క్రుంగుబాటుకీ లోను కాకుండా కాపాడుతుంది.   భేషజాలను వదులుకోవాలి చాలా సమస్యలు మన అహంకారం వల్లే ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా బంధాలకి సంబంధించిన సమస్యలెన్నో పంతాలు, పట్టింపుల వల్లే వస్తుంటాయి. మన తప్పు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా... నేను ఎక్కడా తగ్గాల్సిన పని లేదు, ఎవరికీ తలవంచాల్సిన పరిస్థితి రాదు అనుకుంటూ భేషజాలకి పోతే అంతిమంగా నష్టపోయేది మనమే! ఇతరులను క్షమాపణ కోరడమో, ఇతరుల సలహాను పాటించడమో, ఎదుటివారి సాయం తీసుకోవడమో చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే తప్పకుండా భేషజాలను వదులుకోవాల్సి ఉంటుంది.   అంగీకారం కట్టుదిట్టమైన ఇనుపగోడల మధ్య ఉన్నా ఏదో ఒక సమస్య రాక మానదు. సమస్యలనేవి జీవితంలో భాగమే అని అంగీకరించినప్పుడు, వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా వస్తుంది. సవాళ్లు లేకపోతే ఎదుగుదల అసాధ్యమని గ్రహించినప్పుడు ఎక్కడలేని తెగువా ఏర్పడుతుంది. ఏ సమస్యా లేనప్పుడు మనిషి సంతోషంగానే ఉంటాడు. కానీ సమస్య ఉన్నప్పుడు కూడా స్థిరిచిత్తంగా, ప్రశాంతంగా దానిని ఎదుర్కోగలిగే వారు విజయం సాధించగలుగుతారు.   సిద్ధంగా ఉండాల్సిందే! సమస్య తరువాత జీవితం ఎప్పటిలాగే ఉండకపోవచ్చు. చాలా సందర్భాలలో జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే, సమస్యని పరిష్కరించుకునే క్రమంలో కొన్ని బంధాలు చేజారిపోవచ్చు, కొన్ని సౌకర్యాలు దూరం కావచ్చు. వీటన్నింటికీ సిద్ధంగా ఉండి, జీవితాన్ని మళ్లీ ఎప్పటిలా గడిపేందుకు సిద్ధంగా ఉండాలి.   - నిర్జర.
ఈ ప్రపంచంలో ఏ విషయం ను అయినా రెండు కోణాల్లో చూస్తారు. ఒకటి న్యాయం, రెండోది అన్యాయం. ముఖ్యంగా భారదేశానికి చట్టాలు ఏర్పడ్డాక ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ ప్రతి వ్యవస్థలోనూ న్యాయాన్ని కాపాడటానికి న్యాయవ్యస్థను ఏర్పాటు చేసి, న్యాయం కోసం కృషి చేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1949 సంవత్సరం నవంబర్ 26 వ తేదీన తొలి ముసాయిదా కమిటీ సభ్యులు సంతకాలు చేశారు. అదే 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక లక్ష్యం ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని అందరికీ అందించడం. అలా ముసాయిదా కమిటీ సంతకాలు చేసిన ఆరోజును జాతీయ న్యాయదినోత్సవంగా జరుపుకోవాలని సుప్రీంకోర్టు ప్రకటించింది. అదే నేటి నేషనల్ లా డే.  న్యాయం ఎక్కడ!! న్యాయం ఎక్కడుంటుంది అంటే కోర్ట్ లో మాత్రమే అనుకోవడం పొరపాటు. ఈ న్యాయ దినోత్సవం అర్థం న్యాయవాదులు న్యాయం రక్షించడం కోసం కృషి చేయడమే కావచ్చు కానీ నిజానికి ప్రస్తుతం న్యాయాన్ని కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే తయారయ్యాయి. అందుకే ప్రతి ఒక్కరూ న్యాయాన్ని డబ్బులు పెట్టి కొనేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చేదు నిజం ఏమిటంటే డబ్బు పెట్టి ఏది నమ్మిస్తే అదే న్యాయం అయిపోవడం. అంటే అన్యాయాన్ని కూడా డబ్బు పెట్టి న్యాయంగా మార్చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రస్తుత సమాజంలో కోకొల్లలు.  మరేం చేద్దాం!! న్యాయానికి నల్లకోటు ప్రామాణికం కాదు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. నిజానికి అందరికీ తెలుసు కూడా కానీ తెలియనట్టే ఉంటారు. ఈ సమాజంలో, మన చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నో విషయాలు, అవకతవకలు మొదలైన వాటిని ఎవరి శక్తి మేరకు వాళ్ళు పరిష్కరిస్తూ, తమ ప్రమేయం ఉన్న ఏ విషయంలో అయినా నీతిగా ఉండటం అందరూ చేయదగిన పని. న్యాయం కోసం!! చాలామంది కొన్ని విషయాలు నేరుగా చూసి అందులో తమ పాత్ర ఉన్నా ఏదో నష్టం జరుగుతుందనో లేక మనకెందుకులే అనే ఆలోచనతోనో ఆ విషయాన్ని చూసి చూడనట్టు ఉంటారు. అది ఎంత తప్పో చాలామందికి అర్థం కాదు. తమ మాట వాళ్లకు ఎంత గొప్ప పరిష్కారాన్ని చూపిస్తుందో అర్థం కాదు. ఎప్పుడో పాఠశాలల్లో చదువుకున్న ఐకమత్యం అనే విషయాన్ని జీవన సరళిలో ఎప్పుడో వదిలేసుకున్న మహానుభావులం మనం. ప్రతీది ఆర్థిక కోణంలో చూసే ఆర్థికశాస్త్ర విశ్లేషకులం. ఇంకా చేస్తున్న పనులను సమర్థించుకుంటూ వాటికి ఉదాహరణలు కూడా బయటకు చెప్పగల గొప్ప ప్రవచనాకారులం. ఇలాంటి మన మధ్య న్యాయం కావాలంటే అంత సులువుగా దొరుకుతుందా?? నమ్మకాల వంతెన!! నిజానికి న్యాయానికి, నమ్మకానికి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది. కానీ నమ్మకం ఉన్నచోట న్యాయానికి వెక్కిరింపు ఎదురవుతుంది కూడా. ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరీ సహాయం చేసిన చోట ఇచ్చిన నమ్మకాన్ని, పొందిన సహాయాన్ని మరచి నమ్మకద్రోహం జరిగితే ఎవరూ న్యాయం కోసం ముందుకు రారు. ఉదాహరణకు ఈమధ్య కాలంలో కొందరు ఉద్యోగస్తులు లోన్ల విషయంలో ష్యురిటీ సంతకాలు పెట్టడానికి జంకుతున్నారు కారణం తీసుకున్నవారు  వాటిని కట్టడానికి వెనుకడుగు వేసి కట్టడం వదిలేస్తే సంతకాలు పెట్టిన సగటు వ్యక్తిని ఆ సంస్థ వారు కోర్ట్ ల చుట్టూ తిప్పి ఎన్నో ఇబ్బందులకు గురిచేయడం. నమ్మకంతో సంతకాలు పెట్టిన సగటు వ్యక్తికి జీవితమే ప్రశ్నార్థకమైతే మరెక్కడ న్యాయం.కాబట్టి ఇలాంటి  విషయాలలో పూర్వపరాలు పరిశీలించి కోర్ట్ వారు ఇచ్చే తీర్పు సగటు న్యాయమైన వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరూ ఎవరికి వారు బాధ్యతగా ఉండాల్సిన అవసరం అందరిపైనా ఉంది. ◆ వెంకటేష్ పువ్వాడ
వ్యాక్సిన్ వచ్చింది కోరోనా చచ్చింది అంటూ జబ్బలు చరుచుకున్న మనం ప్రస్తుతం కొత్తగా వస్తున్న వేరియంట్ ఒమి క్రాన్  పై ప్రభావం చూపడం లేదాని ఈ వేరియంట్ దేనికీ లోన్గాదని నిపుణులు తేల్చారు. వ్యాక్సిన్ వచ్చినరోజుల్లో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల  యాంటి బాడీలు 9౦ % పెరుగుతాయని ప్రచారం కల్పించారు.ఆడే మాదిరిగా వ్యాక్సిన్ వల్ల కోరోనా ను ఎదుర్కునే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని భారీ ఎత్తున ప్రచారం చేసారు. అయితే  ఈ విషయాన్ని గమనించిన  శాస్త్రజ్ఞులు శరీరంలో యాంటీ బోడీలు పెరిగినా 6 నెలలు మాత్రమే ఉంటాయని తేల్చిచెప్పారు. ఆతరువాత వ్యాక్సిన్ వేసుకొని వారికి కోరోనానుండి రక్షణ అసాధ్యమని కనీసం వ్యాక్సిన్ రెండుడోసులు తీసుకుంటే 3౦ % ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రక్షణ కల్పించవచ్చని ఉత్పత్తిదారులు నమ్మబలికారు.      అయితే రెండవ వేరియంట్ డెల్టా వేరియంట్  ప్రభావం తో  అసలు కోరోనా నుండి వివిదరకాల వేరియంట్ల నుండి రక్షణ అసాధ్యమని తేలిపోయింది.దీని కారణం గా వ్యాక్సిన్ పనితీరుపట్ల,దీనిప్రభావం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వ్యాక్సిన్  వైరస్ లను తట్టుకును రక్షణ కల్పించాలేనప్పుడు  వ్యాక్సిన్లు నిరర్ధకమని నిపుణులు  విమర్శలు గుప్పిస్తున్నారు. పనిచేయని వ్యాక్సిన్లు కోట్ల లో ఉత్పత్తిచేసిన వ్యాక్సిన్ ల పనితీరు అంతేనా బూదిడలో పోసిన పన్నీరేనా అన్నది ప్రశ్న ? ఇందుకు నిదర్సనంగా వయస్సుతో నిమిత్తం లేకుండా యాంటీ బోడీ లెవెల్స్ 5౦ % కి పడిపోయాయని శాస్త్రజ్ఞులు గుర్తించారు. యాంటీ బాడీ లెవెల్స్  మాధ్య వ్యత్యాసంగుర్తించారు. 65 సంవత్సరాల లోపు ఉన్న  వారిలో రెండింతలు కాగా,65 సంవత్సరాలు పై బడిన వారిలో రెండవ వ్యాక్సిన్ తరువాత గణనీయంగా పురుషుల కంటే స్త్రీలలో యాంటీ బాడీల శాతం ఎక్కువ టేక్రాస్ బయోమెడికల్ రీసెర్చ్ల్ఇన్స్టిట్యుట్ డాక్టర్ బ్రెండన్ మైకల్ హెన్రీ  భయ పెడుతున్న కోరోనా ఆసుపత్రిలో ఉన్న వారికి ఎలా సహకరించింది.? యాంటీ బాడీలు గణనీయంగా తగ్గినట్లు పరిశోదనలో కనుగొన్నారు.దీనికి అదనంగా బూస్టర్ వ్యాక్సిన్ అవసరమా కాదా అన్న అంశం కూడా పరిశోదన చేస్తున్నట్లు బ్రెండన్ తెలిపారు.రోగనిరోదక శక్తి పెంపు ,సార్క్ కోవిడ్ ను ఎదుర్కునేందుకు ఇన్ఫెక్షన్ ,కోవిడ్ పెరుగుదల,పై పరిశోదనలు చేస్తున్నామని డాక్టర్ హెన్రీ వెల్లడించారు.స్త్రీ,పురుషులలో యాంటీ బాడీల లో వ్యత్యాసానికి కారణం హార్మోన్లు అని పేర్కొన్నారు.స్త్రీల కంటే పురుషులలో టేస్టా స్టేరాన్ లు ఎక్కువగా ఉండడం.గమనించారు. హార్మోన్ తగ్గడం వల్ల వ్యక్తులలో ఇమ్యునిటీ వ్యవస్థ తేడాగామనిన్చావచ్చని.స్త్రీల కంటే పురుషులలో పెరగడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం క్రోమోజోములుగా గుర్తించారు.క్రోమోజోములలో ప్రత్యేక జీన్స్ కి ఇమ్యునిటీ కి సంబంధం ఉంది.స్త్రీలలో రండు రకాల క్రోమోజోమ్స్ ఉంటాయనిక్ష్ క్రోమోజోమ్స్ చాలా ఆక్టివ్ గా ఉంటాయని. కొన్ని డీ ఆక్టివ్ గా ఉన్నాయి. క్రోమోజోమ్స్ వల్ల ఇమ్యూన్ పెంచేందుకు సహకరిస్తాయి.అని డాక్టర్ హెన్రీ తమ పరిశోదనలో పేర్కొన్నారు. అయితే కొత్తగా పుట్టుకొచ్చిన ఒమి క్రాన్ సైతం ఏ వ్యక్సింకు లోన్గాదని నిపుణులు గుర్తించారు. అయితేinsa cog వేరియంట్ ను గమనిస్తున్నారు.దేశంలో ఒమి క్రాన్  వైరస్ దాఖలాలు ఎక్కడా కనపడలేదు.అయితే అంతర్జాతీయ ప్రయాణీకుల పై నిఘా  కేసులు పెరిగే పక్షం లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.అయితే రెండు డోసులు తీసుకున్న వారిలో కోరోనా సోకడం ఆందోళన వ్యక్తం అవుతోంది. అసలు వ్యాక్సిన్ తీసుకొని వారి పరిస్థితి ఏమిటి అన్నది మరోప్రస్న. త్వరిత గతిన విస్తరించే ఒమి క్రాన్  ను నవంబర్ 24న  సౌత్ ఆఫ్రికాలో కనుగొన్నట్లు గుర్తించారు. బోత్స్ వానా,బెల్జియం,హాంగ్ కాంగ్,ఇజ్రాయిల్,దేశాలలో వ్యాపించిందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. కోవిడ్19 తో  ఇప్పటికే ప్రపంచం వణికి పోతుంది.ఈ నేపధ్యం లో ఒమేక్రోన్  రొం లోని బంబినో గేసు ఆసుపత్రికి చెందిన డాక్టర్ల బృందం ఒమి క్రాన్ న్ ఇమేజ్ ను విడుదల చేయడంలో విజయం సాధించింది.  ఒమేక్రోన్ మూడు రకాల డైమెన్షన్ లలో ఇచ్చిన ఇమేజ్ లలో చాలా రకాల పరివర్తనలు రెండింతలు మ్యుతేట్ కావడాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు.డెల్టా వేరియంట్ కన్నా  ఎక్కువ గా ఒమిక్రాన్   పరివర్తనలు మ్యుటేషన్స్ ను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.ఈ రకమైన పరివర్తన అత్యంత ప్రమాదకరమని మూలకణాలను ప్రభావితం   చేస్తుఉండడాన్ని నిపుణులు గుర్తించారు.    
 చలికాలం లో గుండె పోటు  నుండి కాపాడుకోండి. చలికాలం లో గుండె పోటు రాకుండా రక్షించ బడాలంటే  తప్పకుండా వ్యాయామం లేదా యోగ చేయాలి. అంటున్నారు నిపుణులు. గుండె సమస్యతో బాధ పడే వారు చలికాలం లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది నిపుణులు శాస్త్రజ్ఞులు గుండె పై చేసిన పరిశోదనలో తెలిసిన రహస్యం ఏమిటి  అంటే చల్లటి వాతావరణం లో గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని  ఈ వ్యాసం లో నిపుణులు సూచిస్తున్నారు. సహజంగా రోజుకి అరఘంట పాటు నడిచిన చాలని, అలాగే చిన్న పాటి వ్యాయామం చేసినముఖ్యంగా యోగా చేయడం ద్వారా ఎలాంటి సమస్య నుండి అయినా రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.చలికాలం లో ఎండవేడిమి తగ్గడం వల్ల  శరీరం లో రక్త ప్రవాహం సరిగా లేక రక్త నాళాలు కుంచించుకు పోతాయి. దీనిఫలితంగా బిపి  తో పాటు కొలస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.ఈ పరిస్థితిలో చలికాలం లో గుండె సమస్యలు  ఉన్న వారు తమ ఆహారం లో అప్రమత్తం గా ఉండాలని వ్యాయామం తో పాటు యోగ సాధన చేయాలని. యోగా ప్రాణా యామం కలిపి చేయడం ద్వారా శరీరం మనసు,ఆత్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏదైనా యోగా నిపుణులైన గురువుల సమక్షం లో యోగ సాధన చేస్తే గుండె పోటు వంటి వి జీవన శైలి సంబందించిన సమస్యలు నిలువరించవచ్చు.హార్ట్ అట్టాక్ ను నివారించ వచ్చు మూడురకాల యోగా పద్దతులు ఆసనాలు తప్పనిసరిగా చేయాల్సిందే ముందుగా యోగ చేసే పద్దతులు విధివిధానం,సాధన చేయాలి,అలాగే వజ్రాసనం,పవన ముక్తాసనం, మండూక ఆ సనం, వంటివి సాధన చేస్తే రక్త ప్రసారం సరిగా జరిగి గుండె పోటును నివారించవచ్చు.  మాండుకాసనం.... యోగ సాధనకు ముందు వజ్రాసనం లో కూర్చోవాలి.దీనిని వజ్రాసన ముద్ర అని అంటారు.మన శరీరంలో ని మోకాళ్ళ పై కూర్చుని వేసే సులభమైన ముద్ర.ఆ తరువాత మీ చేతుల లోని నాలుగు ఉంగరాల లోని లోపలి భాగాలను బాగా నొక్కండి. పిడ్ఫికిలిని మీ మొక్కకు రెండు వైపులా ముందుకు వంగండి.మీ పిడికిలి తో మీ నాభి భాగాన్ని నొక్కడం ప్రారంభించండి. మీ పొట్టను ఎంతవరకూ వీలైతే అంతనిలివుగా ఉంచండి.ఒంగిన తరువాత ముందుకు చూడండి.ఈ ముద్రలో మీ ఊపిరి ని బయటికి పంపండి.ఇలా కొంత సేపు చేయండి.ఇది కొంతమేర మీరు ఉపసమనం  కలిగిస్తుంది. ఈ ముద్రనుండి బయటికి వచ్చే టప్పుడు స్వాస తీసుకోండి.మీ వెనుక వైపు నుక్కును మోకాళ్ళ పైన  మెల్లగా పైకి తీయండి మీ చేతులను మీ భుజాల పైకి తీసుకోండి.మరల యధాస్థితికి రండి.                 
కోరోనా మూడవ వేవ్ వస్తుందా రాదా అన్న సందేహాలు అనుమానాలు వ్యక్జ్తం చేస్తూ నిపుణులు చేసిన విశ్లేషణలు పటాపంచలు చేస్తూ సౌత్ ఆఫ్రికాలో కోరోనా కొత్తవరియట్ ను గుర్తించినట్లు ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ హెల్త్ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యు హెచ్ ఓ కోరోనా కొత్తవేరియంట్ ను సౌత్ ఆఫ్రికాలో గుర్తించినట్లు తెలిపారు. కొత్తవేరియంట్ కు బి.1 .1 52 9 ను సౌత్ ఆఫ్రికాలో గుర్తించారు.  దీనికి ఒమిక్రాన్  గా  నామ కారణం చేసారు. ఇది చాలా వేగంగా పరివర్తన చెందుతోందని. ఈ వేరియంట్ అత్యంత  ప్రమాదకరమని వేరియంట్ అనూహ్యంగా పరివర్తన చెందడం ఆ, త్వరిత గతిన విస్తరిస్తోందని   ఆందోళన కలిగించే అంశంగాప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.ఈమేరకు అత్యవసర సమావేశం నిర్వహించిన డబ్ల్యు హెచ్ ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. డెల్టా వరియంట్ ప్రపంచం మొత్తం విస్తరించిందని కొత్తవేరియంట్ బి.1.1 .529 గా శాస్త్రజ్ఞులు గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మార్ తెలిపారు. కాగా చర్చల అనంతరం వేరియంట్ పై మరిన్ని పరిశోదనలు చేయాలనీ అన్నారు. ప్రపంచ దేశాలలో ఇప్పుడిప్పుడే విదేశి ప్రయాణీకులకు సడలింపులు ఇస్తున్న వేళ కొత్తవేరియంట్ తో సోతాఫ్రికా లేదా ఇతరా దేశాల నుండి వస్తున్న ప్రయాణీకుల పట్ల అప్రమత్తం గా ఉండాలని ముఖ్యంగా బ్రెజిల్,బంగ్లాదేశ్,బోత్స్ వానా,చైనా,మారిషస్,న్యూజీలాండ్,జింబాబ్వే,సింగపూర్,ఇజ్రాయిల్, హాంగ్ కాంగ్,యూరప్ దేశాలు ముఖ్యంగా యు కే దేశాల నుండి వచ్చే ప్రయానీకులకు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయాలని కేంద్రం సన్నద్ధం అయ్యింది. భారత్ లో కొత్త వేరియంట్ తో కొత్త కరోనా కేసులు పెరిగాయి..భద్రం భారత్ లో కొత్తవేరియంట్ ప్రభావం ఉందా? భారాత్లో రోజురోజుకి కోరోనా కేసులు పెరుగుతున్నాయి.ఈ క్రమం లో బెంగళూరు కు చెందిన స్పూర్తి వైద్య కళా శాలలో 182 మంది విద్యార్ధులు,ఉద్యోగులకు కోరోనా పోజిటివ్ గా గుర్తించడం తో తీవ్రకలకలం కొనసాగుతోంది. వివరాల లోకి వెళితే బెంగళూరు లోని నర్సింగ్ విద్యార్ధులు పూర్తిగా వ్యజ్సిన్ వేసుకున్నప్పటికీ కోరోనా సోకడం తీవ్రా ఆందోళన కలిగిస్తోంది.నర్సింగ్ వుద్యార్ధులు బీస్ సి చదువుతున్నారని.అందులో ఒక్క విద్యార్ధి మాత్రం వ్యాక్సిన్ వేయిన్చుకోలేదని.ఆమెకు  జూన్ లో పోజిటివ్ వచ్చిందని. ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఏమిటి  అంటే  ప్రతి 15 రోజులకు ప్రతి ఒక్కరికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు కళా శాల యాజామాన్యం చెపుతున్నది  నిజమేనా అన్నది సందేహం కలిగిస్తుంది.కాగా కళాశాలలో అందరికీ వ్యాక్సిన్లువేయించిందని చెప్పడం కొసమెరుపు. ఇదిలా ఉంటె బెంగళూరు విద్యార్ధులకు   దాదాపు 182 మంది విద్యార్ధులకి పోజిటివ్  కావడం పై దీనికి గల  కారణాలు అసలు వారికి సోకిన వేరియంట్డెల్టా వేరియంట్,లేదా కొత్తవేరియంట్ లక్షణాలు ఉన్నాయా, కొత్త వేరియంట్ ప్రభావం ఎలాఉంది ఎలా సోకింది. చికిత్స విధానం పై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉందని  కళా శాల యాజ మాన్యం పేర్కొంది. ఇదిలా ఉంటె హైదరాబాద్ లో కూడా కోవిడ్ మొదలు మొదలు అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. టెక్‌ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ 25 మంది విద్యార్థులకు, ఐదుగురు అధ్యాపకులకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. అయితే హైదరాబాదులోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్త్రోఎంట్రోలోజీలో చికిస్థ పొదుతున్నప్రముఖ నృత్యదర్శకుడు కూడా కోవిడ్ బారిన పడినట్లు ఆసుపత్రి వర్గాలు ద్రువికరించాయి. అలాగే ఖమ్మం జిల్లాలో కొందరు కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తో౦ది. మొత్తం మీద తెలంగాణలోను కోవిడ్ కలకలం మొదలై౦ది అని అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ మేరకు ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని ఫై వైద్య అధికారులు సూచించారు.