LATEST NEWS
వైసీపీలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తున్నారు? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే నెపంతో ఏకపక్షంగా నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని  ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, పార్టీ క్యాడర్ ఎలా చూస్తున్నారు? మరీ ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్ గురించి ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ   సామాన్య ప్రజల నుంచి మేథావుల వరకు అందరూ అందరి నోటా వ్యక్తమౌతున్న ఎకాభిప్రాయం  ‘రోజులు దగ్గర పడ్డాయి’ అనే. పట్టభద్రుల నియోజక వర్గాల్లో వైకాపా ఓటమి, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలలో ఉన్న సొంత పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఉన్న అసంతృప్తిని బహిర్గతం చేసిందని అంటున్నారు. ముఖ్యంగా, వైకాపా ఎమ్మెల్యేలో అసమ్మతి కొత్త వవిషయం కాదు. చాలా కాలంగా  చాలా మంది  ఎమ్మెల్యేలో అసమ్మతి అగ్గి రాగులు తూనే వుంది. భగ్గు మనేందుకు సిద్ధంగా వుంది. అయితే  ఇంతకాలం పిల్లి మేడలో గంట కట్టేదేవరనే దగ్గర ఆగిన అసమ్మతి లావా ప్రవాహానికి  స్వయంగా పార్టీ అధినాయకత్వమే గేట్లు ఎత్తేసింది. పొమ్మన కుండా పొగ పెట్టి  ఆనం రామ నారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని బయటకు పంపిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్రాస్ వోటింగ్ సాకు చూపి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఇక అసమ్మతి కట్టలు  తెంచుకుంటుందన్న పార్టీ లో చర్చ మొదలైంది.  ఈ నేపథ్యంలోనే  వైసీపీలో  చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని సస్పెన్షన్‌కు గురైన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు బహిరంగంగానే బయటికి వస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో చాలా మంది లోలోపల ఉడికిపోతున్నారని చెప్పారు. మరో పార్టీలో చేరిక కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు.  2024 ఎన్నికలలో ఎవరికి ఓటేయాలన్న విషయంలో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీ శాశ్వతంగా డిస్మిస్‌( సస్పెండ్) అవుతుందని జోస్యం చెప్పారు. 2024లో రాజకీయ ప్రజా సునామీ రాబోతోందని.. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమే స్పష్టమైన ప్రజా తీర్పు అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలనే తపన ఉన్న తాను.. విసిగి వేసారి చివరికి గట్టిగా మాట్లాడానని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. చివరికి పార్టీ (వైసీపీ)కి విధేయుడిగా ఉన్న తనపైనే నిఘా పెట్టారన్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే అనుమానించారని.. పరిష్కరించకుండా రాజకీయ కోణంలో ఆలోచించారని చెప్పారు.  అదలా ఉంటే, కడప మొదలు ప్రతి జిల్లాలోనూ, వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు,కార్యకర్తలు జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా నిట్టనిలువుగా చీలిపోయారని అంటున్నారు. అక్కడక్కడా రహస్య సమావేశాలు జరుగుతున్న  సమాచారం కూడా పార్టీ పెద్దలకు చేరుతోందని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల ప్రతి కదలిక పైనా ఒకరికి తెలియకుండా మరొకరిని నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలో ఒకరిని ఒకరు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని, చివరకు మంత్రులు కూడా రాజకీయాల గురించి మాట్లాడేందుకు జంకుతున్నారని అంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే నిజంగానే కోటంరెడ్డి అన్నట్లుగా  వైసీపీని అసమ్మతి సునామీ ముంచేసేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపునకు.. క్రాస్ ఓటింగే కారణమంటూ.. అందుకు సంబంధించి నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితోపాటు ఉండవల్లి శ్రీదేవిపై అధికార ఫ్యాన్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు మీడియా ముందుకు వచ్చి తమదైన శైలిలో స్పందించారు.  ఇక ఆనం రామనారాయణరెడ్డి అయితే సైకిల్ పార్టీలో చేరేందుకు చాలా కాలంగా వేచి చూస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆయన పార్టీ మారే క్రమంలో క్రాస్ ఓటింగ్ వేయడం ద్వారా టీడీపీ అభ్యర్థిని బలపరిచి ఉంటారని అంతా భావిస్తున్నారు. అంత వరకు బానే ఉంది. కానీ ఇంత తతంగం జరిగినా... జరుగుతున్నా.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాత్రం ఇప్పటి వరకు.. ఈ అంశంపై స్పందించక పోవడం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకొన్న తర్వాత తాడికొండ శ్రీదేవి ఎక్కడా కనిపించడం లేదు.ఆమె అజ్ణాతంలోకి వెళ్లారన్న చర్చ సమాజిక మాధ్యమంలో జోరుగా సాగుతోంది.  మరోవైపు  క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినది ఈ  నలుగురు ఎమ్మెల్యేలే అని వైసీపీ అధిష్ఠానం ప్రకటించగానే గుంటూరులోని ఎమ్మెల్యే శ్రీదేవి కార్యాలయంపై ఫ్యాన్ పార్టీ శ్రేణులు దాడి చేసి ఆమె ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. శ్రీదేవికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  ఒక వైపు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకొంటుంటే.. కోటంరెడ్డి, మేకపాటి లాగా ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి.. ఏ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని.. తమ పార్టీ సూచించిందో.. ఆ అభ్యర్థికే తాను ఓటు వేశానని... అంతేకానీ.. తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని.. అయితే ఎవరో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి.. తన మీద ఇటువంటి ఆరోపణలు చేసి.. తన రాజకీయ జీవితాన్ని బలి చేస్తున్నారంటూ ప్రకటించే అవకాశం ఉన్నా.. ఎమ్మెల్యే శ్రీదేవి ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు.   తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీకి మరో సమన్వయకర్తగా గతంలో మాజీ మంత్రి డొక్క మాణిక్య వర ప్రసాద్‌ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో డొక్కా నియామకాన్ని శ్రీదేవితో పాటు ఆమె అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలో అప్పటి కప్పుడు అర్థరాత్రి వేళ.. జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌, హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత నివాసానికి చేరుకొని.. ఎమ్మెల్యే శ్రీదేవితోపాటు ఆమె అనుచరులు ఆందోళనకు దిగారు.  దాంతో వారిని మేకతోటి సుచరిత సముదాయించి.. ఆ తర్వాత ఆ పంచాయతీని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో పెట్టడంతో... ఎమ్మెల్యే శ్రీదేవి తాత్కాలికంగా కూల్ అయ్యారు. ఆ తరువాత కొద్ది రోజులకే.. పార్టీ జిల్లా  ఇన్‌చార్జ్ బాధ్యత నుంచి మేకతోటి సుచరిత తప్పుకోవడంతో.. ఆ బాధ్యతలను సైతం డొక్కా మాణిక్య వర ప్రసాద్‌కు వైసీపీ అధిష్టానం అప్పగించింది.    ఇంకోవైపు తాడికొండ నియోజకవర్గంలో పార్టీ అదనపు సమన్వయ కర్తగా కర్తగా సురేష్ కుమార్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో అతడి ఆధ్వర్యంలోనే స్థానికంగా  వైసీపీ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాలు సైతం కత్తెర సురేష్ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి.  దీంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి ఉత్సవ విగ్రహాంగా మారడంతో.. ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారనే చర్చ సైతం స్థానికంగా  కొనసాగుతోంది. అలాంటి వేళ ఆమె తెలుగుదేశం గూటికి చేరాలని నిర్ణయించుకొని ఉంటారని.. అందులో భాగంగానే ఎమ్మెల్యే శ్రీదేవి తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదీకాక తాడికొండ నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో శ్రీదేవిని కాకుండా మరో  అభ్యర్థిని  బరిలోకి దింపేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నారనీ, ఆ విషయం గ్రహించే శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఉంటారనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానని హ్యాండిల్  చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందా? అంటే అవుననే అంటున్నారు  రాజకీయ విశ్లేషకులు. నిజానికి, రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాదు అధికార బీఆర్ఎస్ నాయకులు కూడా అదే మాట అంటున్నారు.ఎనిమిదేళ్ళ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ ఒకెత్తు అయితే, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం చేసిన తప్పు ఒక్కటీ ఒకెత్తని బీఆర్ఎస్ నాయకులే వాపోతున్నారు. అంతేకాదు ఇప్పటికైనా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే  రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు.  ముఖ్యంగా అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) విచారణ ఎదుర్కోవలసి రావడంతో, ముఖ్యంత్రి టీఎస్పీఎస్సీ లీకేజీపై దృష్టి పెట్టలేదనీ, అందువలన  లీకేజీ వ్యవహారం కోతి పుండు బ్రహ్మరాక్షసి చందంగా మరింత జటిలంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నేతలు అంటున్నారు. అలాగే  మంత్రి కేటీఆర్ లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడిన సమస్యతో తమకు సంబంధం లేదన్న విధంగా మాట్లాడడంతో విద్యార్ధులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని అంటున్నారు. మళ్ళీ పరీక్షలు రాయండి అన్నం పెడతాం, ఫీజులు కడతాం అంటూ నిరుద్యోగులను అవమానపరిచే విధంగా మాట్లాడడం కూడా విద్యార్థుల ఆగ్రహానికి కారణం అవుతోందని అంటున్నారు. కొందరు నిరుద్యోగ యువకులు భౌతిక దాడులకు సైతం వెనుకాడమని హెచ్చరిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోందని అంటున్నారు. ఒక విధంగా సున్నితంగా పరిష్కరించవలసిన సమస్యను ప్రభుత్వ పెద్దల ధోరణి వలన జటిలం అయిందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.  అలాగే  ‘సిట్’ విచారణలో  టీఎస్సీఎస్సీ నిర్వాకం బయట పడిందని,  తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన, ‘నియామకాలు’ విషయంలో ప్రభుత్వం డొల్లతనం బయట పడిందని అంటున్నారు. ఒక విధంగా, టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల విషయంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వమే ఆయుధాన్ని అందించిందనే అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాలలోనే వినవస్తోంది.  అదలా ఉంటే, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఇదే విషయంగా పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ,రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బీజేపీ, శనివారం(మార్చి 25) నిరుద్యోగ మహాధర్నా నిర్వహించింది. గ్రూప్ వన్  పరీక్షల పేపర్‌ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్‌ అంధకారంలో పడిన నేపథ్యంలో వారి తరపున పోరాడేందుకు పార్టీ దశల వారీ ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో ఇందిరాపార్క్‌ వద్ద వేలాది మందితో ‘మా కొలువులు మాగ్గావాలే’ అనే నినాదంతో,   నిరుద్యోగ మహాధర్నా నిర్వహించారు.  కాగా  నిరుద్యోగ మహాధర్నా బీజేపీకే పరిమితమైన కార్యక్రమం కాదని, 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్ కు ముడిపడి ఉన్న సమస్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. వారందరికీ అండగా ఉంటామని, కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేసేవరకూ వదలిపెట్టబోమని తేల్చి చెప్పారు. టీఎస్పీఎస్పీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్‌ పాత్ర లేదని సీఎం కేసీఆర్‌ భావిస్తే తక్షణం, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి ఆధ్వర్యంలో విచారణను కోరాలని, సకాలంలో పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలని అన్నారు. తన కుమారుడి ప్రమేయాన్ని ఖండించని కేసీఆర్  రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు లక్షలాది మంది నిరుద్యోగులు, వారి కుటుంబాలను అంధకారంలోకి నెట్టడం కేసీఆర్‌ దుర్మార్గ చర్యలకు పరాకాష్ఠ  అని విమర్శించారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్ళీ మరోమారు, ఉద్యమం నాటి, వాతావరణం కనిపిస్తోందిని అంటున్నారు.  రెండు రోజుల కిందట వివిధ విద్యార్ధి సంఘాలు సంయుక్తంగా నిరుద్యోగ దీక్ష, ర్యాలీ నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలను పోలేసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందల మంది విధ్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే  దీక్షలో పాల్గొనేందుకు సిద్దమైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యు నాయకులను ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ చేశారు.  మరో వంక ఏప్రిల్ రెండవ వారంలో లక్షమందితో నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని  సమస్య పరిష్కారానికి కృషి చేయాలని  లేదంటే  రాజకీయంగా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని, బీఆరేస్ నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.
రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి.  అందుకే,   రాజకీయాలు నిశ్చలన చిత్రాలు కాదు, పాలిటిక్స్ ఈజ్ డైనమిక్  అనే నానుడి ఏర్పడింది. నిజం. ఎమ్మెల్సీ ఎన్నికల వరకు  ఏపీ రాజకీయాలు ఎటు  వెళుతున్నాయి, అనే విషయంలో చాలామందికి చాలా సందేహాలున్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి  వచ్చింది మొదలు, మీటల మీదనే దృష్టి పెట్టి పేద ప్రజల ఓట్లను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. అప్పులు చేసి మరీ ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామనే బిల్డప్  ఇచ్చారు.  అయితే, మీటలు నొక్కి ప్రజల ఖాతాల్లో పైసలు వేసినా ప్రజలను ఆకట్టుకోలేక పోయారు. సంక్షేమ ప్రయోజనాలు పొందుతున్న వర్గాల ప్రజల్లోనూ సర్కార్ విధానాల పట్ల వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఓ వంక మీటలు నొక్కుతూ మరో వంక  పన్నుల మోత, చార్జీల వాతలతో ప్రజలపై మోయలేని భారం వేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వంతో ప్రజలు విసిగెత్తి పోయారు. ఇసుక పాలసీ, మద్యం పాలసీ వంటి తలాతోకా లేని విధానాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న జగన్ సర్కార్ పై  ప్రజలు మండిపడుతున్నారు. ఇదేమి పాలనా ఇదెక్కడి పాలన  ఒక చేత్తో ఇచ్చి  చెత్త పన్ను వంటి చెత్త ఆలోచనలతో రెండు చేతులా దోచుకుంటున్న జగన్ రెడ్డికి  రెండో ఛాన్స్ ఇచ్చేది లేదనే నిర్ణయాని కొచ్చారు. అయితే. ఇంతవరకు అందుకు ఒక స్పష్టమైన రుజువు, ఆధారం దొరకలేదు. కానీ  ఇప్పడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం పట్ల  ముఖ్యంగా  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అహంకార పోకడల పట్ల ప్రజాగ్రహం స్పష్టమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం సారథ్యంలోనే వైసీపీ వ్యతిరేక కూటమి ఏర్పడుతుందనే స్పష్టత వచ్చందని అంటున్నారు. ఎమ్యెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఏకైక ప్రత్యాన్మయంగా టీడీపీ ఏమర్జ్  అయిన నేపథ్యంలో, పొత్తుల విషయంలో కూడా క్లారిటీ వస్తోందని పరిశీలకులు అంటున్నారు. నిజానికి  రాష్ట్రంలో రాజకీయ పొత్తులకు సంబంధించి చాలా కాలంగా చాలా చాలా చర్చలు,  వ్యూహాగానాలు సాగుతున్నా ఇంతవరకు ఒక స్పష్టత అయితే రాలేదు. ఈ నేపథ్యంలో  మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు పితాని సత్యనారాయణ కొత్త చర్చకు తెర తీశారు. పొత్తులపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం జరగలేదని చర్చలు మాత్రమే జరుగుతున్నాయన్నారు. ఏదైనా పార్టీ తమతో కలుస్తానంటేనే పొత్తులపై అధిష్ఠాన నిర్ణయం తీసుకుంటుందన్నారు.అంతే కాదు  నిజం అయినా కాకున్నా ఇంతవరకు జనసేన, బీజేపీ కూటమితో  పొత్తుకు టీడీపీ తహతహా లాడుతోందనే ప్రచారం జరిగింది. అయితే  పితాని  బీజేపీ పార్టీ పొత్తుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని, వైసీపీ తో విడిపోతేనే ఆ పార్టీతో పొత్తు గురించి ఆలోచిస్తామని  బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టారు.  అదే సమయంలో పితాని  టీడీపీ క్యాడర్ కు కూడా హిత బోధ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో సంబరాలు చేసుకుంటే సరిపోదు కష్టపడితేనే గెలుపు సాధ్యం అవుతుందన్నారు. ఆత్మ విమర్శ చేసుకుని చేసిన తప్పులు, సవరించుకుంటేనే విజయం వరిస్తుందని పితాని పేర్కొన్నారు. ప్రత్యేకించి తాడేపల్లిగూడెంలో టీడీపీ ఇంచార్జ్ వలవల బాబ్జీ గెలుపు కోసం క్యాడర్ ఇప్పటినుంచే కష్ట పడాలని సూచించారు. అధికార పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. జగన్ మరలా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. జగన్ కు ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ అయ్యిందన్నారు. ఏమైనా  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఏపీ రాజకీయాల్లో కొత్త డైమెన్షన్  తీసుకొచ్చాయి. ఇది మాత్రం నిజం.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు  పార్లమెంట్ మాజీ సభ్యుడు రాహుల్ గాంధీ  ప్రధాని నరేంద్ర మోడీపై, తగ్గేదే లే అన్న తరహాలో మరో మారు విరుచుకు పడ్డారు. ప్రశ్నాస్త్రాలను సందించారు. గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా, ‘మోడీలంతా దొంగలే’ అనే అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్య.. పై బీజేపీ ఎమ్మెల్యే ఒకరు సూరత్ కోర్టులో  వేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసులో నాయస్థానం ఆయనకు రెండేళ్ళు జైలు శిక్ష విధించిన విషయం. కోర్టు తీర్పు నేపధ్యంగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ అనర్హత వేటు పడినా  తగ్గేదేలే అనే రీతిలో, అదానీ, మోడీ సంబంధాలను మరోమారు గట్టిగా గళమెత్తారు.  అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. డిఫెన్స్ సెక్టార్‌తో ముడిపడి ఉన్న అదానీ షెల్ కంపెనీలలో ఎవరు పెట్టుబడి పెట్టారో చెప్పాలని ప్రధాని మోడీని ప్రశ్నించారు. అలాగే అదానీ కంపెనీ పెట్టుబడులలో  ఒక చైనా జాతీయుడికి కూడా సంబంధం  ఉందని ఆరోపించారు. అందుకే ఆ పెట్టుబడుల వివరాలేంటో చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అలాగే  దేశంలో ప్రజస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతోందని, దేశ విదేశాల్లో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ,  తాను భారత దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను, పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. భారత్‌ జోడో యాత్రతో  ప్రజల్లోకి వెళ్లానని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజాస్వామ్యం పై విశ్వాసం లేదని,   ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తే అయితే తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ఫైరయ్యారు. భారత ప్రజల ప్రజాస్వామిక గొంతు వినిపించేందుకు, కాపాడేందుకే  తాను ఉన్నానని  భయపడేది లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు ఇదివరకటిలా మీడియా సంస్థల నుంచి లభించిన మద్ధతు ఇప్పుడు లేదు. ఇది ఓబీసీల వ్యవహారం కాదు. ఇది మోడీ, అదానీల సంబంధానికి సంబంధించిన వ్యవహారం. దాన్నుంచి దృష్టి మళ్లించడం కోసం విదేశాల్లో నా వ్యాఖ్యల గురించి మాట్లాడతారు. అనర్హత అంశాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు ఓబీసీ అంటున్నారు. నేను నిజం మాట్లాడతాను. మాట్లాడుతూనే ఉంటాను. నాపై అనర్హత వేటు వేసినా, జైల్లో పెట్టినా నాకు పెద్ద తేడా ఏమీ లేదు. అనర్హతలు లాంటివి నన్ను ఏం చేయలేవు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. నా పోరాటాన్ని యథావిధిగా కొనసాగిస్తాను. మోడీని  ప్రశ్నిస్తూనే ఉంటాను. ఇది ఓబీసీ వ్యవహారం కాదు... మోదీ, ఆదానీ మధ్య ఉన్న బంధం పై ప్రశ్నిస్తున్నాను. రూ. 20 వేల కోట్లు ఎక్కడివి, ఎక్కడి నుంచి ఆదానీ షెల్ కంపెనీల్లోకి వచ్చాయో చెప్పాలని రాహుల్ గాంధీ విలేకరుల సమవేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు.   కేసు, శిక్ష, తదుపరి కార్యాచరణ గురించి అడిగియన ప్రశ్నకు సమాధానమిస్తూ రాహుల్ గాంధీ, నేను దేశ న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. అందుకే న్యాయపరమైన అంశాల గురించి నేను ఇప్పుడు మాట్లాడను. . పార్లమెంటులో నేను మాట్లాడబోయే అంశాల గురించి మోదీ భయపడ్డారు. నాపై అనర్హత వేటు వేయడానికి అదే కారణం. నాకు సంఘీభావం, మద్ధతు ప్రకటించిన విపక్షాలకు కృతజ్ఞతలు. అందరం కలసి కట్టుగా పనిచేద్దాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, లేకున్నా నా పని నేను చేస్తా అని రాహుల్ ఉద్ఘాటించారు.   ప్రధాని ప్రతిపక్షాలకు ఒక గట్టి ఆయుధాన్ని ఇచ్చారు. ప్రధాని చర్యలతో ఆయన చేసిన తప్పు గురించి చర్చ జరుగుతోంది. అదానీ ఒక అవినీతి, అక్రమార్కుడని ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాంటి వ్యక్తిని ప్రధాని మోడీ ఎందుకు కాపాడాలని చూస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు. అదానీ గురించి అడిగితే.. దేశంపై దాడి అంటున్నారు. అంటే అదానీయే దేశం అని ప్రధాని చెబుతున్నారా?  అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాగా  విలేకరుల సమావేశంలో రాహుల్  ప్రవర్తించిన తీరును గమనిస్తే  ఆయన  మోదీ మహా సంగ్రామానికి సిద్దమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
'దాస్ కా ధమ్కీ'తో యంగ్ హీరో విశ్వక్ సేన్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. విశ్వక్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి అంచనాలతో మార్చి 22న విడుదలైంది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా విశ్వక్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఆ తరువాత కూడా అదే జోరుని కొనసాగిస్తున్న ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. 'దాస్ కా ధమ్కీ' మూవీ ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ.7.5 కోట్లు కాగా మొదటి రోజే సగానికి పైగా రాబట్టడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.4.08 కోట్ల షేర్, రెండో రోజు రూ.1.45 కోట్ల షేర్, మూడో రోజు రూ.1.33 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.1.54 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ.. నాలుగు రోజుల్లోనే రూ.8.37 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల వసూళ్లను పరిశీలిస్తే.. నైజాంలో రూ.2.69 కోట్ల షేర్(బిజినెస్ రూ.3 కోట్లు), సీడెడ్ లో రూ.91 లక్షల షేర్(బిజినెస్ రూ.1 కోట్లు), ఆంధ్రాలో రూ.2.75 కోట్ల షేర్(బిజినెస్ రూ.2.8 కోట్లు)గా ఉన్నాయి. రెస్టాఫ్ ఇండియా రూ.92 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.1.10 కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ.. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా రూ.8.37 కోట్ల షేర్ వసూలు చేసింది. ఐదో రోజు ఆదివారం కావడంతో మరో కోటిన్నరకు పైగా షేర్ రాబట్టి.. పది కోట్ల షేర్ క్లబ్ లో చేరే అవకాశముంది.
బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ దృష్టి తెలుగు హీరోలపై పడింది. ఇప్పటికే ప్రభాస్ తో 'ఆదిపురుష్'ని రూపొందిస్తున్న ఈ సంస్థ.. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించింది. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ తర్వాతి సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్ ల తర్వాత తారక్ చేయబోయే సినిమా గురించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఓ భారీ పాన్ ఇండియా మూవీ కోసం ఎన్టీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దర్శకుడు, ఇతర విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం.
సినిమాల్లో క‌లిసి ప‌నిచేసిన బంధం ఎప్ప‌టిదాకా ఉంటుందంటే, ఆ షెడ్యూల్ పూర్త‌య్యేవ‌ర‌కు. మ‌హా అయితే సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కు. కొన్నిసార్లు పోస్ట్ రిలీజ్ ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొనే వ‌రకు అని అనుకుంటే మాత్రం మీరింకా పాత‌కాలంలో ఉన్న‌ట్టే. ఇప్పుడు బంధాలు బియాండ్ ద మూవీస్ వెళ్తున్నాయి. సినిమాల‌తో ప‌నేంటి? కొంచెం టచ్‌లో ఉంటే చాలు అనుకుంటున్నారు సెల‌బ్రిటీలు. ఇప్పుడు ఆలియా, తార‌క్ ఫ్రెండ్‌షిప్ చూసిన వారు కూడా ఈ మాట‌ల‌నే అనుకుంటున్నారు. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఆర్ఆర్ఆర్‌. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించారు ఆలియా. కానీ ఆమెకు చ‌ర‌ణ్‌తో పోలిస్తే తార‌క్‌తోనే మ‌రిన్ని సీన్లున్నాయి. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లోనూ తార‌క్ - ఆలియా చాలా బాగా స్టేజ్ షేర్ చేసుకున్నారు. ఆలియా పెళ్లి, ప్రెగ్నెన్సీ లేక‌పోయి ఉంటే, ఎన్టీఆర్ 30లో ఆమెనే హీరోయిన్‌గా న‌టించే ఛాన్సులున్నాయని కూడా వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. సినిమా చేయ‌క‌పోయినా, తార‌క్‌తో ట‌చ్‌లోనే ఉన్నారు ఆలియా. ఆమె న‌టిగా కంటిన్యూ అవుతూనే చిల్డ్ర‌న్ బ్రాండ్ కాస్ట్యూమ్స్ ఆన్‌లైన్ లో సేల్ చేస్తున్నారు. రీసెంట్‌గా తార‌క్ పిల్ల‌ల‌కు ఆలియా దుస్తులు పంపించారు. అభ‌య్‌, భార్గ‌వ్ పేర్ల మీద రెండు బ్యాగ్‌ల‌ను పంపించారు. ఆ దుస్తులు చూసిన పిల్ల‌లు తెగ సంబ‌రపడిపోయార‌ని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు తార‌క్‌. అంతే కాదు, త‌న పేరు మీద బ్యాగ్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? అని ఎదురుచూస్తున్న‌ట్టు తెలిపారు. దీనికి ఆలియా కూడా సో స్వీట్ అంటూ స్పందించారు. తార‌క్ పిల్ల‌ల కోసం దుస్తులు పంపిన ఆలియా అంటూ నెట్టింట బ్యాగ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తార‌క్ పిల్ల‌ల‌కు బ‌ట్ట‌లు పంపిన ఆలియా, రామ్‌చ‌ర‌ణ్‌కి కూతురో, కొడుకో పుడితే నేరుగా వ‌చ్చి చూసేస్తారేమో అంటూ చెర్రీ ఫ్యాన్స్ సంబ‌ర‌పడిపోతున్నారు. ఇంత‌కీ ఆలియా కూతురు ర‌హాకి ఎన్టీఆర్ ఏమైనా పంపారా? ఒకవేళ పంప‌క పోతే, ఇప్పుడు రిట‌ర్న్ గిఫ్ట్ గా ఏమైనా పంపిస్తారా? అంటూ ఆలియా గురించి ఆలోచిస్తున్న‌వారూ లేకపోలేదు.
'అతడు', 'ఖలేజా' సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'ఎస్ఎస్ఎంబి 28'(వర్కింగ్ టైటిల్). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ ని సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం ఓ కొత్త పోస్టర్ ను వదిలారు. "సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఎస్ఎస్ఎంబి 28'తో సరికొత్త మాస్ అవతార్‌లో జనవరి 13, 2024 నుండి ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో అలరించనున్నారు" అంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ అసలుసిసలైన సంక్రాంతి సినిమాని తలపిస్తూ విశేషంగా ఆకట్టుకుంటోంది. మేకర్స్ చెప్పినట్టుగా తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు సరికొత్త మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ ని బట్టి చూసే ఇది మిర్చి యార్డ్ లో జరిగే యాక్షన్ సన్నివేశం అనిపిస్తోంది. మిర్చి యార్డ్ లో కొందరికి బుద్ధిచెప్పి.. కళ్లద్దాలు, నోట్లో సిగరెట్ తో గుంటూరు మిర్చి ఘాటుని తలపిస్తూ స్టైల్ గా నడిచొస్తున్న మహేష్ బాబు మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి మాస్ బొమ్మ చూపించబోతున్నారని పోస్టర్ తోనే అర్థమవుతోంది. మహేష్ బాబు సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. మహేష్ బాబు నటించిన 'ఒక్కడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాలను అందుకున్నాయి. ఇక దర్శకుడు త్రివిక్రమ్ గత చిత్రం 'అల వైకుంఠపురములో' సైతం 2020 సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ రికార్డులను సృష్టించడం విశేషం. అసలే హ్యాట్రిక్ కాంబినేషన్, అందులోనూ సంక్రాంతి సీజన్ కావడంతో 'ఎస్ఎస్ఎంబి 28' చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ గా నవీన్ నూలి , కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్ వ్యవహరిస్తున్నారు.
Superstar Mahesh Babu's SSMB28, directed by filmmaker Trivikram, is undoubtedly one of the most keenly awaited actor-director collaborations among audiences. The film features Pooja Hegde and Sreeleela as female leads. S.Radha Krishna (China Babu) is producing the entertainer under Haarika and Hassine Creations.   As previously reported, the release date of SSMB28 was confirmed today. The film will hit screens on January 13, 2024. With all the commercial ingredients in the right mix, the project promises to be an ideal festive treat.    A special poster, confirming the news, features Mahesh Babu in a brand-new stylish avatar, where he sports a beard and a thin moustache, donning a black shirt and blue jeans, while smoking a cigarette in front of a lorry.    A series of red chillies are flying mid air as Mahesh Babu arrives and a few men look up to him. The Super Star is at his massy best in the poster.    SSMB28 is the third association between Mahesh Babu and Trivikram, after two much-celebrated films Athadu and Khaleja. While hit composer S Thaman scores the music for SSMB28.
Ustaad Bhagat Singh is directed by Harish Shankar and has power star Pawan Kalyan as the lead. Regular shooting of this movie will start from April 5.    Today, BRS Minister Malla Reddy attended Sumanth Prabhas Mem Famous teaser launch event. Malla Reddy said in this program that recently Harish Shankar came and requested him to play the villain role in the movie. He said that he rejected the role after one and half hour request.   Minister Mallareddy's comments are going viral on social media. As it is the second film of Power Star Pawan Kalyan and director Harish Shankar's combination, there are huge expectations on the film.   This film also confirms that this film is remake of Tamil film Theri. It is being produced by Mythri Movie Makers, a leading production company. Devi Sri Prasad is the music director for this film.
After the success of Unstoppable and Akhanda, there have been many changes in Balayya. He is also doing commercial ads. Recently Balayya's decision shocked not only his fans but also the common audience.   So, the decision taken by Balayya is something exciting. Balayya will take on the avatar of commentator in IPL 2023 at the latest. Star Sports has announced that Balayya will provide commentary in the IPL, which will start from March 31.   Natasimham Nandamuri Balayya has won crores of fans with his acting. He left his mark in politics as well. Besides, he is shaking OTT as a talk show host. Now this commentary for IPL (only for few matches).    On the other hand, Balayya is competing with the young heroes by doing films consecutively. Also recently he showed his mark as the host of the show Unstoppable 2. It can be said that he is on a row and working hard.
అల్లు అర్జున్ త‌న‌య అల్లు అర్హ గురించి ఇంట్ర‌స్టింగ్ విష‌యం వైర‌ల్ అవుతోంది. అల్లు అర్హ‌కు ఇంగ్లిష్ మాట్లాడ‌టం రాద‌ట‌. హాయ్ అని కూడా ఇంగ్లిష్ లో చెప్ప‌ద‌ట అర్హ‌. ఈ విష‌యాన్ని స‌మంత ఓ ఇంట‌ర్వ్యూలో పంచుకున్నారు. అల్లు అర్హ బోర్న్ సూప‌ర్‌స్టార్ అని అన్నారు. స‌మంత మాట్లాడుతూ "అల్లు అర్హ‌కు ఎక్క‌డా భ‌యం ఉండ‌దు. త‌ను చాలా యాక్టివ్ గ‌ర్ల్. త‌న‌కు ఇంగ్లిష్ మాట్లాడ‌టం రాదు. హాయ్ అని చెప్పినా తెలుగులోనే చెబుతుంది. చాలా క్యూట్‌గా తెలుగు మాట్లాడుతుంది. అది కూడా రూటెడ్ తెలుగు త‌ను మాట్లాడుతుంటే చాలా ముద్దుముద్దుగా ఉంటుంది. ఇవాళ్రేపు స్కూల్లోనూ, కాలేజ్‌ల్లోనూ ఇంగ్లిష్ ఎలాగూ వ‌స్తుంది. కానీ మాతృభాష‌ను చిన్న‌త‌నంలో అంత అందంగా నేర్చుకునే పిల్ల‌లు అరుదై పోతున్నారు. అల్లు అర్హ వండ‌ర్‌కిడ్‌" అని అన్నారు.  అర్హ యాక్టింగ్ గురించి చెబుతూ "అర్హ క‌నిపించే ప్ర‌తి ఫ్రేమ్‌నీ జ‌నాలు మైమ‌రిచి చూస్తుండిపోతారు. అంత అద్భుతంగా ఉంటాయి. త‌న ఫ‌స్ట్ డే షూట్ పెద్ద ప్యాల‌స్ సెట్లో జ‌రిగింది. చుట్టూ చాలా మంది జ‌నాలున్నారు. అయినా ఎక్క‌డా అదురూ బెదురూ లేకుండా న‌టించింది అర్హ‌. త‌న‌కు చాలా పెద్ద పెద్ద డైలాగులున్నాయి. వాటిని చాలా ఈజ్‌తో చెప్పింది. తెలుగులో అంత పెద్ద డైలాగులు చెప్ప‌డం మామూలు విష‌యం కాదు. పాప‌ను చూసిన వారంద‌రూ వాళ్ల నాన్న‌ను గుర్తు చేసుకుంటున్నారు. బోర్న్ ఆర్టిస్ట్ అంటూ పొగుడుతున్నారు. నా దృష్టిలో అర్హ ప్యాన్ ఇండియ‌న్ ఆర్టిస్ట్. ఎక్క‌డా త‌గ్గేదేలే అన్న‌ట్టు న‌టించింది. సినిమా చూసిన త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ అర్హ యాక్టింగ్‌కి ఫిదా అయిపోతారు. త‌న‌ని అడ్మ‌య‌ర్ చేస్తారు" అని అన్నారు. స‌మంత న‌టించిన శాకుంత‌లంలో కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుంది అల్లు అర్హ‌. ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లి త‌న కుమార్తె కొన్ని ఇంగ్లిష్ ప‌దాలు నేర్చుకుంటుంద‌ని, గుణ‌శేఖ‌ర్‌తో కంప్ల‌యింట్ కూడా చేశార‌ట బ‌న్నీ. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా శాకుంత‌లం. ఈ సినిమాలో అల్లు అర్హ‌కి కూడా నిజ‌మైన బంగారు న‌గ‌లే వాడిన‌ట్టు స‌మాచారం. దాదాపు 14 కోట్ల రూపాయ‌లు విలువ చేసే న‌గ‌ల‌ను ఈ సినిమా కోసం వాడారు. మేన‌క కేర‌క్ట‌ర్ కోసం వాడిన‌వ‌న్నీ డైమండ్ న‌గ‌లే కావ‌డం విశేషం.
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హరీష్ శంకర్, తెలంగాణ మంత్రి మల్లారెడ్డిని సంప్రదించడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా మల్లారెడ్డే రివీల్ చేశారు. కొంతకాలంగా మల్లారెడ్డి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. "పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. కష్టపడినా.. సక్సెస్ అయినా" అంటూ ఇలా ఆయన ఏ స్పీచ్ ఇచ్చినా అది వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సినిమా వాళ్ళు సైతం ఆయన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా 'మేం ఫేమస్' మూవీ టీజర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న మల్లారెడ్డి.. 'ఉస్తాద్ భగత్ సింగ్'లో విలన్ రోల్ చేయమని ఆఫర్ వచ్చిందని చెప్పి సర్ ప్రైజ్ చేశారు. ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ తనని కలిసి 'ఉస్తాద్ భగత్ సింగ్'లో విలన్ గా నటించమని అడిగారని, కానీ తాను అంగీకరించలేదని మల్లారెడ్డి తెలిపారు. ఒకవేళ ఆయన అంగీకరించి ఉంటే పవన్-మల్లారెడ్డి కాంబో కొత్తగా క్రేజీగా ఉండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
లైఫ్ లో ప‌ర్ఫెక్ష‌న్ అనే మాట‌ను ఇష్ట‌ప‌డటం లేదు స‌మంత‌. త‌న వ‌ల్ల అయినంత మేర ఏ ప‌నినైనా చేయాల‌ని అనుకుంటున్నారు. ఇప్ప‌టికి త‌న మాన‌సిక ప‌రిస్థితి అదేనంటున్నారు స‌మంత‌. ఆమె నటించిన సినిమా శాకుంత‌లం వ‌చ్చే నెల 14న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా సుమ‌కు స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు స‌మంత‌. ఆమె మాట్లాడుతూ "నా లైఫ్‌లో నేను మూడేళ్లుగా భ‌య‌ప‌డుతూ ఉన్నా. అయితే ఆ భయాన్ని దాటిన ప్రతిసారీ ఏదో సాధించ‌గ‌లుగుతున్నా. ఆ సాధించ‌డం వెనుక అతీత‌మైన క‌ష్టం ఉంటోంది. శ్ర‌మ‌ను ఓర్చుకున్న ప్ర‌తిసారీ వ్య‌క్తిగా ప‌రిప‌క్వ‌త సాధిస్తున్న‌ట్టు అనిపిస్తోంది" అని అన్నారు.  చిన్నప్ప‌టి నుంచీ డిస్నీ మూవీస్ చూసి పెరిగాన‌ని చెప్పారు స‌మంత‌. "నాకు డిస్నీ మూవీస్ అంటే ఇష్టం. వాటిలో క‌నిపించే జంతువులు, ప‌క్షులు నాకు చాలా స‌ర‌దాగా ఉంటాయి. శాకుంత‌లం మన క‌థ‌. ఈ సినిమాను నేను ఇండియ‌న్ డిస్నీ మూవీ అని అంటాను" అని చెప్పారు. శాకుంత‌లం సినిమాను మొద‌ట ఒప్పుకోలేద‌ట స‌మంత‌. దీనికి కార‌ణం చెబుతూ "నేను శాకుంత‌లం సినిమాను మొద‌ట అంగీక‌రించ‌లేదు. అప్పుడే నేను ఫ్యామిలీమేన్ 2లో రాజీ కేర‌క్ట‌ర్ చేశాను. ఆ పాత్ర‌కు, ఈ పాత్ర‌కు ఫిజిక‌ల్‌గానే కాదు, మెంట‌ల్‌గానూ చాలా మార్పు కావాల్సి వ‌చ్చింది. నా చిన్న‌త‌నంలో నేను క్లాసిక‌ల్ ఆర్ట్స్ ఏవీ నేర్చుకోలేదు. అందుకే ఈ సినిమాలో న‌డ‌క‌కు, ప‌రిగెత్త‌డానికి కూడా నేను స్పెష‌ల్ కోచింగ్ తీసుకున్నాను. దాదాపు మూడు వారాలు అవ‌న్నీ నేర్చుకున్నా" అని అన్నారు. త‌న‌కు బ‌రువులెత్త‌డం అల‌వాటే కాబ‌ట్టి, ఇందులో బంగారు న‌గ‌లు ధ‌రించడాన్ని బ‌రువుగా ఫీల్ కాలేద‌ని అన్నారు. సినిమా క‌థ‌గా విన్న‌ప్ప‌టికీ, తెర మీద చూసుకున్న‌ప్ప‌టికీ చాలా సంతృప్తిగా అనిపించింద‌ని అన్నారు. య‌శోద స‌మ‌యంలో ఒకే ఒక్క ఇంట‌ర్వ్యూ త‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లింద‌ని, ఆ స‌మ‌యంలో మెడికేష‌న్‌లో ఉండటం వ‌ల్ల బ‌య‌ట‌కు రాలేక‌పోయాన‌ని చెప్పారు. ఇప్పుడు ఆరోగ్య‌ప‌రంగా కోలుకున్న‌ట్టు తెలిపారు సమంత‌.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
మనిషి జీవితంలో ఒకదాని తరువాత ఇంకోటి కావాలని అనుకుంటూనే ఉంటాడు. అంటే మనిషికి తృప్తి ఉండటం లేదు. ఇంకా ఇంకా కావాలనే అత్యాశ మనిషిని నిలువనీయదు. కానీ ఈ ప్రపంచంలో తృప్తి మించిన సంపద లేదన్నది అందరూ నమ్మాల్సిన వాస్తవం. అది పెద్దలు, యువత అందరూ గుర్తించాలి. ముఖ్యంగా యువతరం తృప్తి గురించి తెలుసుకుని  దాన్ని గుర్తించాలి.   ఈ సమాజంలో అందరికీ కూడా తృప్తి అనేది కరవు అయ్యింది. ఎందుకు అంటే మనిషిలో ఇంకా కావాలి అనే అత్యాశ వల్ల తృప్తి అనేది లేకుండా అందరూ స్వార్థంతో జీవిస్తున్నారు. దాని వలన మనశ్శాంతి కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం ఏదీ లేదు. ఈ సమాజానికి మేథావులు, శక్తివంతులు, ఆదర్శవ్యక్తులు ఎంత అవసరమో అంతకంటే గుణవంతులు ఎక్కువ అవసరం. అటువంటి గుణసంపద యువతీ యువకులు కలిగి ఉండాలి. సంస్కారం, సమగ్ర వ్యక్తిత్వం, సేవాగుణం ఈ కాలంలో ఉన్న యువతలో ఉండటం చాలా అవసరం.  మనిషి దిగజారితే పతనం అంటారు. ఈ పతనావస్థ స్థాయికి జారడం  చాలా సులభం. పతనావస్థకు జరినంత సులువు కాదు విజయం సాధించడమంటే. విజయం గురించి ఆలోచించటం మంచిదే కాని పతనం చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా అవసరం. గొప్పపేరు సంపాదించడం కంటే మంచితనం సంపాదించటం చాలా మేలు. వినయ విధేయతలతో కూడిన క్రమశిక్షణ అనేది ఈ కాలంలో యువతకు చాలా ముఖ్యం. తాము ఈ సమాజానికి ఎలా ఉపయోగపడతాం అనే ఆలోచన యువతలో ఉండాలి తప్ప ఈకాలంలో మనకు తీసుకోగలిగినంత స్వేచ్ఛ ఉంది కాబట్టి మనకు సమాజంతో పని ఏంటి?? అనే ఆలోచనతో అసలు ఉండకూడదు.   ఈ దేశ భవిష్యత్తు అనేది యువతీ యువకులపై ఆధారపడి వుంది. అందుకే యువతకు ఓ బాధ్యత ఉందని,  యువత తాను చెయ్యవలసిన పనిని సక్రమంగా ఒక క్రమపద్ధతితో చేయాలని పెద్దలు చెబుతారు. ఏ పనిని అయినా సక్రమంగా చేయగలిగినట్లయితే తాను అభివృద్ధి చెందగలడు. అట్లాగే దేశాన్ని అభివృద్ధి చేయగలడు. ఇదీ యువతలో దాగున్న శక్తి. వ్యక్తిగత అభివృద్ధిపై దేశాభివృద్ధి ఆధారపడి వుంటుంది. దేశాభివృద్ధి అనేది ఆ దేశంలో నివసించే ప్రజల ఆర్థికాభివృద్ధిని బట్టి చెప్పవచ్చు. ఇకపోతే ఈ దేశానికి మూలస్థంబాలు అయిన యువత భవిష్యత్తు అంతా వారు విద్యావంతులు అవ్వడంలోనే ఉంటుంది. ఎంత కష్టపడి చదివితే అంత గొప్ప స్థాయికి చేరుకొగలరు అనే విషయాన్ని యువత ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. యువత కష్టపడి ఇష్టంతో చదవాలి. ఇవి చెప్పటం చాలా సులభం కాని చెయ్యటం కష్టం. కానీ ఆర్థిక స్థోమత పెంచుకోవాలంటే కష్టపడటం అవసరమే అవుతుంది. సవాళ్ళను అధిగమించి అనుకున్నది సాధించాలి. అనుకున్నది సాధించగలిగినట్లయితే సంతృప్తి అనేది దానంతట అదే వస్తుంది. తృప్తికి మించిన సంపద ఇంకొకటి లేదు.  అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మనిషి జీవితంలో ఉండాల్సిన గొప్ప గుణం ఏదైనా ఉందంటే అది తృప్తిపడటమే అని.                                         ◆నిశ్శబ్ద.
ఈ ప్రపంచంలో ఎంతో మంది కలలు కనే పదం విజయం. ఈ పదాన్ని పలకడం ఎంత సులభమో.. ఆ విజయాన్ని సాధించడం అంత కష్టం. కేవలం కష్టం మాత్రమే కాదు.. వ్యక్తిలో కృషి, పట్టుదల, తెలివితేటలు, ఆత్మస్తైర్యం, పోటీపడే తత్వం, విషయం పట్ల అవగాహన ఇవన్నీ ఉండాలి విజయం సాధించాలంటే.. అందుకే విజయానికి కొందరు మాత్రమే అర్హులు అవుతున్నారు.  ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన world achievers day ని జరుపుకుంటారు. ఆయా రంగాలలో కృషి చేసి విజయాలు సాధించినందుకు వారిని గుర్తుచేసుకోవడం ఈ అచీవర్స్ డే ని జరుపుకుంటారు.   జనాదరణ పొందినవారినో.. కేవలం ప్రముఖులు, ప్రభావవంతమైన వారినో  గౌరవించే రోజు కాదు ఇది.  ప్రతి వర్గంలో.. ప్రతి వ్యక్తిని గుర్తించే దినం. వ్యక్తి స్తాయితో సంబంధం లేకుండా.. ప్రతిభ కలిగిన అందరినీ గుర్తించాలని చెప్పడమే ఈ రోజు ఉద్దేశం. పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, పౌర సేవకులు ఇలా ప్రతి ఒక్కరూ వారి స్థాయికి కాకుండా వారి కృషికి అనుగుణంగా గౌరవించబడతారు, గుర్తుచేసుకోబడతారు.  వారి తెలివితేటలు, ధైర్యం, నిస్వార్థత, సృజనాత్మకత ద్వారా  ప్రపంచాన్ని మరింత మెరుగ్గా  మార్చడానికి కృషి చేశారు. అలాగే దేశాల ప్రగతిని ఇనుమడింపజేస్తూ  తెలివితేటలతో ఎదుగుతున్న  అత్యుత్తమ విద్యార్థులు కూడా ఈ సందర్భంగా గౌరవానికి అర్హులే.. ఈ రోజున ఎవరైనా సరే..  వారి వయస్సు, లింగం, సామాజిక స్థితి, విద్యా స్థాయి లేదా జాతితో సంబంధం లేకుండా..  జీవితంలోని ఏ రంగంలోనైనా ఏదైనా వినూత్నమైన లేదా ప్రత్యేకమైన ఘనత సాధించిన వారికి పతకం, సర్టిఫికేట్, బహుమతి లేదా ఏదైనా ఇతర అవార్డును అందజేయడం జరుగుతుంది. తద్వారా వారు మరింత కృషి చేసేదిశగా గొప్ప ప్రోత్సాహం అందించినట్టు అవుతుంది.  ఈ అచీవర్స్ డే సందర్భంగా.. పిల్లలకు వివిధ రంగాలలో కృషి చేసిన గొప్పవారి గురించి పరిచయం చేయడం, పిల్లల్లో ప్రతిభ పెంచుకోవాలనే తపనను క్రమంగా పెంచడం. లక్ష్య సాధనకై పిల్లలను నడిపించడం చేయవచ్చు.  విజయం ఎలా చేకూరుతుంది?? ఈ ప్రపంచంలో గొప్ప ఆవిష్కరణలు చేసి, గొప్పగా ఎదిగిన వ్యక్తులు విజయాన్ని అక్కున చేర్చుకోవడానికి వెనుక ఎంత కృషి చేసారు?? వారి కష్టాలు, సమస్యలు, సవాళ్లు, త్యాగాలు ఇలా ఎన్నో విషయాలను పిల్లలకు వివరించడం ద్వారా పిల్లలో విజేతలు లక్షణాలు పెంపొందించవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు.. నేటి ప్రతిభావంతులు రేపటి విజేతలు అవుతారు. కాబట్టి పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని వ్యక్తుల చేతుల్లోనే ఉంది.                               ◆నిశ్శబ్ద.
అటు తెలుగువారి ఉగాది పండుగ అయిపోగానే.. ఇటు ఇస్లాం మతస్థుల పవిత్రమాసం ప్రారంభమవుతుంది. ముస్లిం మస్తస్తులకు ఎంతో పవిత్రమైన మాసం రంజాన్ మాసం.  ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల అయిన రంజాన్, ఉపవాసాలతో పవిత్ర మాసంగా భాసిల్లుతుంది.  ఈ సంవత్సరం ఇది మార్చి 23 నుండి ఏప్రిల్ 22 వరకు నడుస్తుంది. అల్లా ఇస్లాం మతానికి అయిదు ముఖ్యవిషయాలు తెలిపాడు.  అవి.. షహదా, సలాత్, జకాత్, స్వామ్ మరియు హజ్. స్వామ్ (ఉపవాసం) అనేది రంజాన్‌లో పాటించేది. ఈ పేరు అరబిక్ మూలం 'అర్-రామద్' నుండి వచ్చింది, దీని అర్థం మండే వేడి. రంజాన్ ప్రారంభ, ముగింపు తేదీలు ప్రతి ఏటా మారుతూ ఉంటాయి.  ఎందుకంటే చంద్రుని గమనాన్ని బట్టి వీరి సమయం ఉంటుంది. వివిధ దేశాలలో వేర్వేరు ప్రారంభ ముగింపు తేదీలు ఉంటాయి. ఇస్లామిక్ సంవత్సరం గ్రెగోరియన్ సంవత్సరం కంటే తక్కువగా ఉంటుంది అందువల్ల రంజాన్ ప్రతి సంవత్సరం 10-12 రోజుల ముందుగా ప్రారంభమవుతుంది, ఇది 33 సంవత్సరాల చక్రంలో ప్రతి సీజన్‌లో వస్తుంది. రంజాన్ చాలా ప్రత్యేకమైన ఆశీర్వాద రాత్రి. దేవదూత జిబ్రీల్ ప్రవక్త ముహమ్మద్‌కు మొదటిసారిగా ఖురాన్‌ను వెల్లడించాడు. అదే లైలతుల్ ఖద్ర్.  ఈ రాత్రి రంజాన్ చివరి పది రాత్రులలో ఉంటుంది. ప్రతి రంజాన్‌లో పదిలో నిర్దిష్ట రాత్రి మారుతుంది. అల్లాహ్ ఇలా అంటాడు..  "ఆ దేవుడి  ఆజ్ఞ దొరికిన రాత్రి వెయ్యి నెలల కంటే ఉత్తమమైనది" అని.   ఇక ఈ రంజాన్ నెలలో ఉపవాసం, మసీదులో ప్రార్థనలు,  ఖురాన్ పఠించే సమయం. చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి.  రంజాన్ సందర్భంగా, అల్లా పాపాలను క్షమిస్తాడు. తప్పులు చేసిన వారిని ప్రతి రాత్రి నరకాగ్ని నుండి విడిపిస్తాడు. ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మంచినీళ్లు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసం చేస్తారు.  సూర్యాస్తమయ ప్రార్థన తర్వాత వారి ఉపవాసాన్ని విరమించుకోవడానికి వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో వారి ఇళ్లలో లేదా మసీదులలో సమావేశమవుతారు. ఈ భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. ఉపవాసం ప్రారంభానికి ముందు తెల్లవారుజామున జరిగే భోజనాన్ని సుహూర్ అంటారు. కాబట్టి, ఉపవాసం సుహూర్ నుండి ఇఫ్తార్ వరకు విస్తరించి ఉంటుంది. రంజాన్ తర్వాత ఈద్ అల్-ఫితర్ వస్తుంది. ఇది ఉపవాసం ముగింపును సూచిస్తుంది. ఇది మూడు రోజుల పాటు కొనసాగుతుంది, ఈ సమయంలో ముస్లింలు ఆనందంగా ఉంటారు. సంతోషాన్ని ఒకరికొకరు పంచుకుంటారు. ఈ నెలలోనే దానధర్మాలు చేస్తారు. బీదలకు సహాయం చేస్తారు. ఈద్ ప్రత్యేక ప్రార్థన ఉంటుంది.  ఇకపోతే ఉపవాసం చేయలేని వారు కొందరు ఉంటారు. ఇలాంటి వారు బీదలకు సహాయం చేయడం, ఉపవాసం ఉండే ఇతరులకు ఇఫ్తార్ విషయంలో సహాయం చేయడం లాంటివి చేయొచ్చు. వీలైనంత వరకు పేదవారికి చేసే సహాయం ఎంతో ప్రముఖ్యతగా ఉంటుంది రంజాన్ మాసంలో. రంజాన్ మాసం గురించి కొన్ని ముఖ్య విషయాలు.. *క్రీ.శ570లో  ప్రవక్త ముహమ్మద్ జన్మించారు. క్రీ.శ 610 లో  ఖురాన్ మొట్టమొదట దేవదూత జిబ్రీల్ ద్వారా ప్రవక్త ముహమ్మద్‌కు వినిపించారు. ఇలా ఖురాన్ అవతరించింది. క్రీ.శ622లో  చంద్ర ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభబమయ్యింది. క్రీ.శ622లో  ప్రవక్త ముహమ్మద్ హింస నుండి తప్పించుకోవడానికి మక్కా నుండి మదీనాకు వలస పూర్తి చేశాడు. క్రీ.శ624 అల్లా రంజాన్‌లో ఉపవాసాన్ని విధిగా పాటించాలని సూచించాడు. ఖురాన్ అవతరించిన ఈ మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు ముస్లిం సోదరులు. ఖురాన్ ను ఇస్లాం మతానికి పవిత్ర గ్రంథంగా భావిస్తారు. అందుకే ఈ నెలకు అంత ప్రాముఖ్యత.                                         ◆నిశ్శబ్ద.
కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. కొలెస్ట్రాల్ రక్త నాళాలలో పేరుకుపోయి సాధారణ రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. అధిక స్థాయి కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది, ఎందుకంటే ఈ ప్రమాదం చిన్న వయస్సు నుండి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరికీ వస్తోంది ఈ కాలంలో, దీన్ని నివారించడం చాలా ముఖ్యం. ఆహారం జీవనశైలిలో ఆటంకాలు కలగడం కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం కావచ్చు. అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను సరైన సమయంలో  గుర్తించడం, దానికి తగిన చికిత్స చేయడం ద్వారా, తీవ్రమైన వ్యాదులు అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. దురదృష్టవశాత్తు, అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు ప్రారంభ దశల్లో స్పష్టంగా కనిపించవు. కానీ శరీరంలోని కొన్ని సంకేతాలను జాగ్రత్తగా గమనించడం ద్వారా గుర్తించవచ్చు. కాళ్లలో నొప్పికి అధిక కొలెస్ట్రాల్ కి లింకేమిటి? పెరుగుతున్న కొలెస్ట్రాల్ పరిస్థితి కారణంగా, రక్తపోటులో తరచుగా సమస్య, గుండెపోటు, నడవడంలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు కొన్ని పాదాలలో కనిపిస్తాయి. ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోయిన సందర్భంలో, కాళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా మొదలవుతాయి, దీనిని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. పాదాలలో నొప్పి ఉండటం, ఆ నొప్పి కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత అది మెరుగుపడినట్లయితే, అది శరీరంలో  కొలెస్ట్రాల్ పెరుగుతున్న సంకేతంగా పరిగణించబడుతుంది రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది  రక్తంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్  ధమనుల పనితీరు  తగ్గిస్తుంది లేదా నిరోధిస్తుంది. ధమనులలో కొలెస్ట్రాల్ పెరిగే సమస్యను పట్టించుకోకపోతే, దీని కారణంగా, శరీరంలోని అనేక భాగాలలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గడం ప్రారంభించినప్పుడు  పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ సమస్య వస్తే ఏం జరుగుతుంది? పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ సమస్యలో, కాళ్లలో అడపాదడపా నొప్పి ఉంటుంది. ఈ లక్షణాలు సాధారణంగా వాకింగ్ లేదా ఏదైనా ఇతర శారీరక శ్రమ సమయంలో అధ్వాన్నంగా ఉంటాయి, అయితే కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అవి మెరుగవుతాయి. మరోవైపు మందులు చికిత్స లేకుండా పాదాల నొప్పికి అంత త్వరగా ఉపశమనం లభించదు. మీరు అలాంటి లక్షణాలను ఎదుర్కొంటుంటే, ఖచ్చితంగా దీని గురించి వైద్యుడిని సంప్రదించండి శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెరుగుతోందని సూచించే మరికొన్ని సంకేతాలు. అధిక కొలెస్ట్రాల్‌ గుర్తించడానికి ప్రత్యేకంగా ఇదీ.. అని ఎలాంటి  లక్షణం లేనప్పటికీ, దానిని గుర్తించడానికి రక్త పరీక్ష మాత్రమే మార్గం. అయితే, కొన్ని శారీరక సంకేతాల ఆధారంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతోందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు తరచుగా వికారం అవయవాల తిమ్మిరి విపరీతమైన అలసట ఛాతీ నొప్పి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. చేతులు కాళ్ళలో తిమ్మిరి లేదా చల్లదనం. అధిక రక్తపోటు సమస్య. ఈ సమస్యల్లో కొన్ని మీకూ ఉంటే తప్పకుండా వైద్యుడిని కలవండి.                                    ◆నిశ్శబ్ద.
జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా సమతుల్యతను గట్ హెల్త్ అంటారు. రోగనిరోధక శక్తి, శారీరక, మానసిక ఆరోగ్యం  ఇతర కారకాలు ప్రేగులలో ఈ సూక్ష్మజీవులు సమతుల్యంగా ఉండటంపై దోహదం చేస్తాయి.  అయితే ఇప్పట్లో చాలామందికి ఈ గట్ ఆరోగ్యం బలహీనంగా ఉంటోంది.   పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని విషయాలు తెలుసుకుంటే..  నోటి ఆరోగ్యం బాగుండాలి..  దంతాలను క్రమం తప్పకుండా బ్రష్ చేయాలి.  నోటి నుండి బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశించి సమస్యలను సృష్టిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.  దంతాలను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా, చెడు మైక్రోబయోమ్  కడుపులోని మంచి మైక్రోబయోమ్‌ను నాశనం  చేయకుండా నిరోధించవచ్చు. ఒత్తిడి స్థాయిలను బ్యాలెన్స్ చెయ్యాలి. ఒత్తిడి లేదా ఆందోళన ప్రభావాన్ని అనుభవించే శరీరంలోని మొదటి భాగాలలో కడుపు ఒకటి కావచ్చు. ఒత్తిడి సమయంలో, శరీరంలో నాడీ వ్యవస్థ మరింత చురుకుగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, జీర్ణక్రియకు రక్తాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని నిరోధిస్తుంది. బదులుగా, ప్రతిస్పందనను ప్రేరేపించడానికి  శరీరం దాని శక్తిని  కండరాలు మరియు గుండెకు నిర్దేశిస్తుంది. నిదానంగా జీర్ణం కావడం వల్ల కడుపులోని ఆమ్లాల పెరుగుదల గుండెల్లో మంట, ఉబ్బరం వంటి జీర్ణవ్యవస్థ సమస్యలకు దారితీయవచ్చు. చాలా ఆహారాలలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సాధారణ కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి, అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గట్ ఆరోగ్యానికి అంతరాయం ఏర్పడుతుంది. గట్‌లోని అవాంఛిత బ్యాక్టీరియాను వదిలించుకోవాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే తక్కువ చక్కెర సహాయపడుతుంది. పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, రెస్టారెంట్ ఫుడ్‌లో అధిక చక్కెర కంటెంట్ సర్వసాధారణం ఎందుకంటే ఇది రుచిని పెంచుతుంది. విభిన్నమైన ఆహారాన్ని తినాలి.. ప్రేగులలో వందలాది రకాల బాక్టీరియాలు ఉంటాయి.  వీటిలో ప్రతి ఒక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో.. విభిన్న పోషకాహార అవసరాలలో ప్రత్యేకమైన పనితీరును కలిగి ఉంటాయి. సాధారణంగా చెప్పాలంటే, డైవర్సిఫైడ్ మైక్రోబయోమ్ ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎక్కువ బ్యాక్టీరియా జాతులు  ఆరోగ్యంపై మరింత సానుకూల ప్రభావాలకు దారితీయవచ్చు అనే వాస్తవం దీనికి కారణం. వైవిధ్యభరితమైన మైక్రోబయోమ్ అనేక రకాల ఆహారాలు తీసుకోవడం లభ్యమవుతాయి.  నిద్ర ముఖ్యం.. కడుపు, మెదడు నరాలు మరియు రసాయనాలను ఉపయోగించి ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. వాటి మార్పిడి మీ మానసిక స్థితి, నిద్ర విధానాలను ప్రభావితం చేయవచ్చు. సిర్కాడియన్ రిథమ్ ను తరచుగా "జీవ గడియారం" అని పిలుస్తారు, ఇది అంతర్గత టైమర్. ఇది జీర్ణక్రియ వంటి క్లిష్టమైన ప్రక్రియలను నియంత్రిస్తుంది. రౌండ్-ది-క్లాక్ షెడ్యూల్‌లో నిద్రిస్తుంది. మన గట్ సూక్ష్మజీవులు కూడా షెడ్యూల్‌కు కట్టుబడి ఉంటాయి, కానీ మీకు తగినంత నిద్ర లేకపోతే, మీ జీర్ణక్రియ మైక్రోబయోమ్ ప్రభావితం కావచ్చు. వ్యాయామం ఏమి పనులు చేయకుండా ఒకే చోట ఉండి పనులు చేసుకునేవారికి తక్కువ వైవిధ్యమైన జీర్ణాశయ సూక్ష్మజీవులు  కలిగి ఉంటాయి. అందువల్ల, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అనేది  శరీరంలో మీరు తినే వాటితో పాటు జీవనశైలి మీద కూడా ఆధారపడి ఉంటుంది.  వ్యాయామాల వల్ల ఈ గట్ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. దీని వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యకరమైన బాక్టీరియా చలనాన్ని  ప్రేరేపించవచ్చు. ఇవన్నీ పాటిస్తే గట్ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.                                   ◆నిశ్శబ్ద.
పోషకమైన ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, తప్పుడు మార్గంలో పోషకాలను తీసుకోవడం కూడా హానికరం. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందరికీ చవగ్గా.. అందుబాటులో ఉండే పండ్లు ఏవైనా ఉన్నాయంటే అవి అరటిపండ్లే..  బరువు పెరగాలనుకునే లేదా బాడీ బిల్డింగ్ చేయాలనుకునేవారు, సన్నగా ఉండేవారు అరటిపండ్లను తినాలి. టోన్డ్ బాడీ మరియు బలమైన కండరాల కోసం అరటిపండ్లు తినడం మంచిదని వైద్యులు కూడా చెబుతారు. అయితే అరటిపండు శారీరక దృఢత్వాన్ని సమతుల్యం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అరటిపండులో అనేక గుణాలు ఉన్నాయి, ఇవి వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయి. కానీ శరీరాన్ని బలోపేతం చేయడానికి అరటిపండ్లను తీసుకుంటే అది సరైన మార్గంలో ఉండాలి.  అరటిపండ్లను తప్పుగా తినడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి, దానికి తోడు ఆరోగ్యానికి హానికరం కూడా. అరటిపండ్లను సరిగ్గా ఎలా తీసుకోవాలో, అరటిపండ్లు తినేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుంటే సమస్యే ఉండదు.. ◆అరటిపండులోని పోషక గుణాలు రోజూ ఒక అరటిపండు అనేక వ్యాధుల నుండి కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, థయామిన్, రిబోఫ్లేవిన్ ఉన్నాయి. అరటిపండులో నీరు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. ◆అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు బలహీనత అరటిపండు తింటే పొట్ట త్వరగా నిండుతుంది. మీరు ఉదయం అల్పాహారంగా అరటిపండ్లు తిన్న తర్వాత బయటకు వెళితే, మధ్యాహ్నం భోజనం వరకు మీ కడుపు నిండుగా ఉంటుంది> దానికి తగినట్టే శక్తి ఉంటుంది. జీర్ణక్రియ అరటిపండు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అరటిపండులో ఉండే స్టార్చ్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. దీంతో గుండెల్లో మంట సమస్యను కూడా నయం చేసుకోవచ్చు. బరువు అరటిపండులో ఉండే పీచు, పిండి పదార్ధాలు చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతాయి. దీని వల్ల ఆకలి ఉండదు. బరువు అదుపులో ఉంటుంది. ◆అరటిపండు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు మలబద్ధకం మలబద్ధకం ఉన్నవారు అరటిపండు తినకుండా ఉంటేనే మంచిది.  చక్కెర స్థాయి అరటిపండు షుగర్ రోగులకు హానికరం. అరటిపండులో సహజమైన చక్కెర ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ◆అరటిపండ్లు తినడానికి సరైన సమయం  అరటిపండ్లను తినడానికి సరైన సమయం సమయం.. ఉదయం అల్పాహారంలో అరటిపండు తీసుకోవడం. అరటిపండును ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. రాత్రి పడుకునే ముందు అరటిపండు తినకూడదు. రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. దీని వల్ల దగ్గు సమస్య వస్తుంది. దీనితో పాటు, కడుపు అధికంగా నింపడం వల్ల నిద్రలేమి కూడా ఉండవచ్చు. ◆ అరటిపండ్లను ఎలా తినకూడదు.. అరటిపండ్లతో పాలు తాగకూడదు. ఆయుర్వేదంలో అరటిపండు, పాలు కలపడం నిషేధించబడింది. వైద్యుల ప్రకారం, ఇది జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. నిద్రలేమికి కారణం అవుతుంది. బనానా స్మూతీ తినవచ్చు.  అరటిపండు, నెయ్యి కలిపి సేవించవచ్చు. మీరు ఉదయం అల్పాహారంలో అరటిపండు పెరుగు కలిపి తినవచ్చు. అరటిపండు, పెరుగు వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు.                                    ◆నిశ్శబ్ద.