LATEST NEWS
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.  మంగళవారం (నవంబర్ 11) ఉదయం ఏడుగంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ  ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంది. ఈ పోలింగ్ పరిశీలన, పర్యవేక్షణకు తొలి సారిగా డ్రోన్లను వినియోగిస్తున్నారు.  జూబ్లీ బైపోల్ కోసం మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో  226 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన అధికారులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యూసుఫ్ గూడలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  
  అభ్యర్థుల గెలుపోటములను, పార్టీల భవిష్యత్తును నిర్ణయించేది ఓటర్లే కాబట్టి.. జూబ్లీహిల్స్‌లో ఈసారి భారీ పోలింగ్ నమోదవుతుందా? ఎప్పటిలాగే 50 శాతం లోపే ఆగిపోతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. జూబ్లీహిల్స్ ఓటర్లు పోలింగ్ బూత్ దాకా వచ్చి, ఓ పది నిమిషాలు క్యూలో నిల్చొని.. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారా? లేక.. పోలింగ్‌ని లైట్ తీసుకొని రిలాక్స్ అవుతారా? అన్నదానిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయ్. ఎందుకంటే.. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే.. జూబ్లీహిల్స్‌లో 50.1 శాతం పోలింగ్ నమోదైంది.  ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ 50 శాతం మార్క్‌ని దాటలేదు. జూబ్లీహిల్స్‌లో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. పోలింగ్ బూత్ దాకా వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ బైపోల్‌లోనైనా.. జూబ్లీహిల్స్ ఓటర్ల తీరు మారుతుందా? ఎప్పటిలాగే మెజారిటీ ఓటర్లు ఉపఎన్నికని కూడా లైట్ తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. పార్టీల గెలుపోటముల గురించి ఎంత చర్చ నడుస్తుందో.. పోలింగ్ శాతం పెరుగుతుందా? లేదా? అనే దానిమీద కూడా అంతే డిబేట్ నడుస్తోంది. జూబ్లీహిల్స్ లాంటి అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో.. తక్కువ పోలింగ్ నమోదవడం.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు. ఎందుకంటే.. ఓటు మన హక్కు మాత్రమే కాదు.. బాధ్యత కూడా. ప్రశ్నించడానికైనా, ప్రాంత ప్రగతికైనా.. ఓటే ఆయుధం. ఏ ఎన్నిక జరిగితే నాకేంటి? ఎంతో కొంత మంది వేస్తున్నారుగా? నేనొక్కడిని ఓటు వేయకపోతే.. ఏమవుతుందిలే అనే ఆలోచన, నిర్లక్ష్య ధోరణి.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం! ఇలా ఆలోచిస్తే.. పోలింగ్ శాతం తగ్గిపోతోంది. తక్కువ మార్జిన్‌తో.. ఫలితం మారిపోతోంది. అప్పుడు.. మీరు అనుకున్న నాయకుడికి బదులుగా.. మరొకరు గెలిచే అవకాశం ఉంటుంది.  మీకు నచ్చిన నాయకుడు గానీ, పార్టీ గానీ గెలుపొందాలంటే.. మీరు కచ్చితంగా గడప దాటి వెళ్లి ఓటు వేయాల్సిందే! నేను కాకపోతే మరొకరు వేస్తారులే అని ఇంట్లో కూర్చుంటే.. వాళ్లు కూడా మీలాగే ఆలోచించి ఇంట్లోనే ఉండిపోతే.. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య ఎప్పటికీ పెరగదు. ఇది.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. ముఖ్యంగా.. జూబ్లీహిల్స్ లాంటి విద్యావంతులు, ధనవంతులు, పేద, మధ్యతరగతి ప్రజలు కలబోతగా ఉన్న నియోజకవర్గంలో.. 50 శాతం పోలింగ్ కూడా నమోదవకపోవడం ఆందోళనకరం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటూ.. సరైన అక్షరాస్యత లేని వాళ్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  కానీ.. ఉన్నత చదువులు చదివి, సిటీలో ఉంటూ.. ఓటు హక్కు వినియోగించు కోకపోవడమేంటి? చివరికి.. బీహార్ ఓటర్లు కూడా.. పోలింగ్ సెంటర్లకు పోటెత్తారు. మరి.. జూబ్లీహిల్స్ ఓటర్లకు ఏమైంది? పోనీ.. పోలింగ్ కేంద్రాలేమైనా పదుల కిలోమీటర్ల దూరంలో ఉంటాయా? అంటే అదీ లేదు. అందరికీ.. దగ్గర్లోనే ఉంటాయ్. లైన్‌లో ఓ పది నిమిషాలు నిల్చుంటే సరిపోతుంది. మహా అయితే.. అరగంట. అంతకుమించి పోలింగ్ సెంటర్‌లో వేచి ఉండే పరిస్థితే లేదు. అయినప్పటికీ.. జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతం పెరగడం లేదు. మారుమూల ప్రాంతాల ప్రజలని చూసైనా.. మేల్కోవాలనే సూచనలు వినిపిస్తున్నాయ్. ఓటు హక్కు.. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక బాధ్యత మాత్రమే కాదు. మన భవిష్యత్తుని నిర్ణయించే.. విలువైన అధికారం. ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకోకపోతే.. ప్రశ్నించే నైతిక హక్కుని కోల్పోతాం. పోలింగ్‌లో పాల్గొనే ప్రతి పౌరుడికి.. ఎన్నికల తర్వాత తమ నాయకుడిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లభిస్తుంది. ఎవరికైనా ఓటు వేసుకోండి.. మీకు నచ్చిన అభ్యర్థికే ఓటేయండి.  కానీ.. ఓటు మాత్రం వేయండి. ఓటరుగా అభ్యర్థిని ఎన్నుకున్నప్పుడు, అధికారం కట్టబెట్టినప్పుడు, పాలనలో లోపాలు కనిపిస్తే.. నిలదీసే హక్కు దక్కుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలారా వింటున్నారా? పోలింగ్ డే రోజున.. ఇంటి నుంచి కదలండి. ఆనవాయితీగా మారిన లో ఓటింగ్ మచ్చని చెరిపేయండి. ఈసారైనా చరిత్రని మార్చండి. మీ ఒక్క ఓటుతో ఏమవుతుందనుకోకండి. మీ ఒక్క ఓటే.. తీర్పుని మార్చొచ్చు. పోలింగ్ సెంటర్‌లో మీరు తీసుకునే నిర్ణయమే.. సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. నియోజకవర్గ భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది.
  వైసీపీ అధినే జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని  ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసీపీ శాసన సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై సభాపతి స్పందించారు. జగన్‌కు సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చిన సమయమే  ఇస్తామని స్ఫష్టం చేశారు. ఆయన మీడియా ముందు కాకుండా అసెంబ్లీ కొచ్చి మాట్లాడాలని హితవు పలికారు.  నా ముందు అధ్యక్ష అనడం ఇష్టం లేక అసెంబ్లీకి  రావడం లేదని తెలిపారు. వైసీపీ 10 మంది  ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు జగన్‌ తప్ప..  కానీ అసెంబ్లీకి మాత్రం రావడం లేదని స్పీకర్ తెలిపారు. గత జగన్ హయాంలో ఏపీ సర్వనాశనమైందని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో 41 రోజుల పాటు నిర్వహిస్తున్న మహాకోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, రుద్రయాగ, చంఢీయాగ, నవగ్రహ యాగాల్లో సభాపతి అయ్యన్న సోమవారం పాల్గొన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని కాపాడారని. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు  చిత్తశుద్ధిగా పని చేస్తుంటే వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరి డాక్టర్   సునీతకు ఏళ్ల తరబడి చేస్తున్న న్యాయపోరాటంలో ఎట్టకేలకు భారీ ఊరట దక్కింది.  2019లో తన తండ్రి దారుణ హత్యకు గురైనప్పటి నుంచీ తండ్రి హంతకులకు చట్ట ప్రకారం శిక్ష పడాలంటూ చేస్తున్న న్యాయపోరాటంలో డాక్టర్ సునీత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయినా మొక్కవోని పట్టుదలతో  న్యాయం కోసం అవిశ్రా పోరాటం సాగించారు. సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో ఎన్నెన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.  ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన సోదరుడు జగన్  ఉన్న సమయంలోనే ఆమెకు ఈ సవాళ్లు ఎదురయ్యాయి. వైఎస్ వివేకా హత్య కేసులో  పోలీసులు ఆమె, ఆమె భర్తపై  క్రిమినల్ కేసులు నమోదు చేశారు.  విచారణలంటూ వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సునీత, ఆమె భర్తపై నమోదు చేసినవన్నీ తప్పుడు కేసులంటూ కొట్టివేసింది. అంతే కాదు.. ఈ తప్పుడు కేసులు నమోదు చేసిన అప్పటి అధికారులపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది. ఇంతకీ అప్పట్లో సునీతపై, ఆమె భర్తపై అక్రమంగా కేసులు నమోదు చేసిన అధికారులు ఎవరంటే.. అప్పటి  ఏఎస్ఐ రామకృష్ణ రెడ్డి, అప్పటి ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి.  ఆ ఇద్దరూ కూడా ప్రస్తుతం పదవీవరమణ చేశారు. అయినా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారిరువురిపై శాఖాపరమైన విచారణకు నిర్ణయించిందని చెబుతున్నారు.  ఆ ఇరువురిపై శాఖాపరమైన విచారణ లేదా దర్యాప్తు పూర్తయ్యే వరకూ  వారి పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.  ఆ తప్పుడు కేసుల నమోదుకు తెరవెనుక ఉండి చక్రం తిప్పిన వారిని సౌతం గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు.    ఇప్పటికే ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కొత్తగా ఫిర్యాదు నామోదైంది. లింగాలకు చెందిన కుళ్లాయప్ప అనే వ్యక్తి సునీత, ఆమె భర్తపై అక్రమ కేసులు నమోదు చేయడం, వేధించడంలో కీలక పాత్ర పోషించిన  అప్పటి ఎఎస్పీ రామకృష్ణారెడ్డి, ఏఎష్పీ రాజేశ్వరరెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కొత్తగా ఫిర్యాదు చేశారు.  ఆ ఫిర్యాదుపై వారిరువురిపై కేసు నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  సంవత్సరాల పోరాటం తరువాత దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతకు ప్రస్తుత పరిణామం నైతిక విజయంగా పరిశీలకులు ఆవిర్భవిస్తున్నారు. నాడు తప్పుడు కేసులతో తనను వేధించిన అధికారులే ఇప్పుడు నిందితులుగా బోనెక్కాల్సిరాడమంటే ఇది క చ్చితంగా వివేకా హత్య కేసులో న్యాయం దిశగా పడిన కీలక అడుగుగా భావించాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  
తిరుమలలో అన్న ప్రసాదం నాణ్యత విషయంలో వైసీపీ హార్డ్ కోర్ నేతలు కూడా ప్రశంసించక తప్పడం లేదు. ప్రత్యర్థుల ప్రశంసలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎత్తి చూపడానికీ, వంక పెట్టడానికి ఇసుమంతైనా అవకాశం లేకుండా.. తెగడ్తలు గుప్పిద్దామన్నా నోటినుంచే పొగడ్తలు వచ్చేలా అన్న ప్రసాదం నాణ్యత, రుచి, శుభ్రత ఉంటున్నాయి. ఇందుకు తాజా నిదర్శనమే..నిత్యం తెలుగుదేశం ప్రభుత్వంపైనా, ఆ పార్టీ నాయకులపైనా విమర్శలతో విరుచుకుపడిపోయే అంబటి రాంబాబు తిరుమలలో అన్నప్రసాదం నాణ్యత, అన్న ప్రాసాదం క్యాంటిన్ లో శుచి, శుభ్రతల గురించి మైమరిచి మరీ పొగడ్తల వర్షం కురిపించారు.  వైసీపీ హయాంలో అన్న ప్రసాదం ఒక్కటే కాదు, చివరాఖరికిరి తరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకంగా ఉందన్న ఆరోపణలు భక్తుల నుంచే వచ్చాయి. అవేమీ రాజకీయ ఆరోపణలకు కావని లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ గురించిన సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది కూడా. వైసీపీ హయాంలో అసలు తిరపతిలో భక్తుల సౌకర్యాలను గురించి పట్టించుకోలేదన్న విమర్శలూ ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను కాపాడుతూ, తిరుమల కొండపై పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపడటమే కాకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సౌకర్యాల కల్పన ఉందన్న ప్రశంశలు వస్తున్నాయి. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వరంలో నడుస్తున్న శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు.   ఆ క్యాంటిన్ ను నిర్వహిస్తున్న తీరు, అక్కడి శుచి, శుభ్రత, అన్నప్రసాదం నాణ్యత, రుచి అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు గుప్పించారు. అక్కడితో ఆగకుండా.. తాను కుటుంబ సభ్యులతో కలిసి  శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో  భోజనం చేస్తున్న వీడియోను  షేర్ చేశారు.  ఆహారం నాణ్యత, నిర్వహణ, పారిశుధ్యం, భక్తులకు అన్నప్రసాదం వడ్డన ఇలా అన్నీ ఏగ్రేడ్ లో ఉన్నాయంటూ ప్రశంసించారు.  ఇదే ప్రశంస వేరే ఎవరినుంచైనా వచ్చి ఉంటే.. వైసీపీ.. రాజకీయం చేసి ఉండేది. ఎల్లో మీడియా ప్రచారం అంటూ ఊరూవాడా ఏకం చేసేసేది.  కానీ ఇక్కడ ఈ పొగడ్తలు వైసీపీ సీనియర్ నాయకుడు, కరుడుగట్టిన తెలుగుదేశం వ్యతిరేకి అయిన అంబటి రాంబాబు నుంచి వచ్చాయి.   దీంతో వైసీపీకి గొంతులో పచ్చవెలగకాయ పడినట్లు అయ్యింది.  ఇటీవలి కాలంలో టీటీడీపై వైసీపీయులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇకపై వారు టీటీడీపై విమర్శ చేయాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించకతప్పని పరిస్థితిని అంబటి రాంబాబు పొగత్తలు కల్పించాయి.  
ALSO ON TELUGUONE N E W S
  సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో, ఆడియన్స్ ని ఎలా ఎగ్జైట్ చేయాలో దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)కి తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది.    రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు.   మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ ని SSMB29/గ్లోబ్ ట్రాటర్(GlobeTrotter) వంటి పేర్లతో పిలుస్తున్నారు. ఈ మూవీ ఈవెంట్ నవంబర్ 15 సాయంత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.   'గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్' పేరుతో జరగనున్న ఈ వేడుకలో మూవీ టైటిల్, మహేష్ లుక్ రివీల్ చేయడంతో పాటు.. సినిమా ఎలా ఉండబోతుందో తెలిపేలా ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.   అయితే ఈవెంట్ కన్నా ముందే, రాజమౌళి వరుస సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. ఇటీవల కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక తాజాగా గ్లోబ్ ట్రాటర్ సాంగ్ ని విడుదల చేసి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.   ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా.. శృతి హాసన్, కాలభైరవ ఆలపించారు. అసలు ఈ సాంగ్ ని రిలీజ్ చేయడమే సర్ ప్రైజ్ అంటే.. సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.   Also Read: ఈ వారం సినీ ప్రియులకు పండగే.. సినిమాలు, సిరీస్ లతో సందడే సందడి!   "కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజూ పరుగేలే" అంటూ సాగిన ఈ పాట నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కీరవాణి సంగీతం, చైతన్య ప్రసాద్ సాహిత్యం ఎంత బాగున్నాయో.. అంతకుమించి అనేలా శృతి హాసన్ గాత్రం పవర్ ఫుల్ గా ఉంది.    మహేష్ బాబు పాత్ర ఎలా ఉండబోతుందో తెలిపేలా "సంచారి.. సంహరి" అంటూ ఈ పాట సాగింది. అతను ప్రపంచాన్ని చుట్టేసే యాత్రికుడు అని చెబుతూనే, రాక్షసులను సంహరించే ధీరుడు అన్నట్టుగా లిరిక్స్ ఉన్నాయి. మృత్యువుపై సవారీ అన్నట్టుగా తన ప్రయాణం ఉంటుందని లిరిక్స్ తెలుపుతున్నాయి. మొత్తానికి ఇందులో మహేష్ పాత్ర యొక్క ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరంగా, థ్రిల్ ని పంచేలా ఉంటుందని అర్థమవుతోంది.   గ్లోబ్ ట్రాటర్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుండటంతో పాటు, ట్రెండింగ్ లో ఉంది. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది.    ఈ సినిమాకి రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే కొద్దిరోజులుగా మూవీ టీం 'గ్లోబ్ ట్రాటర్'(GlobeTrotter) పేరుతో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది. అదే టైటిల్ గా ప్రకటించినా ఆశ్చర్యంలేదు.   'RRR' సినిమాకి కూడా మొదట ఆ టైటిల్ అనుకోలేదు. అది ఆడియన్స్ కి బాగా రీచ్ అవ్వడంతో దానినే టైటిల్ గా ఫిక్స్ చేశారు. ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' కూడా ఆడియన్స్ లోకి బాగా వెళ్ళడంతో.. దీనినే టైటిల్ గా ఫిక్స్ చేస్తారేమో అనిపిస్తోంది.    
  భారతీయ సిల్వర్ స్క్రీన్ పై ధర్మేంద్ర(Dharmendra)కి ఉన్న సినీ చరిష్మా అంతో ప్రతేకమైనది.  యాక్షన్ హీరోగా ,ఎవర్ గ్రీన్ హీరోగా సిల్వర్ స్క్రీన్ పై  తన కంటు  ఒక చరిత్రనే సృష్టించుకున్నాడు. కొన్ని రోజుల నుంచి ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటు ఉన్నాడు. ఈ రోజు ఉదయం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారనే వార్తలు దాదాపుగా అన్ని మీడియా ఛానల్స్ లో ప్రసారమవుతున్నాయి. ఈ వార్తలపై ధర్మేంద్ర కుమార్తె ఇషా డియోల్ స్పందించడం జరిగింది.ఆమె మాట్లాడుతూ మా నాన్నకి ముంబైలో బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కొనసాగుతుంది. ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. మేము నాన్న గారి హెల్త్ కండిషన్ గురించి చెప్పేవరకు ఎవరు ఎలాంటి వార్తలు ప్రచారం చెయ్యవద్దని చెప్పుకొచ్చింది. ధర్మేంద్ర కి ఇద్దరు భార్యలు. ఒకరు ప్రకాశ్ కౌర్ కాగా, ఇంకొకరు హేమమాలిని. భారతీయ సినిమా రంగంలో నటిగా హేమమాలిని సృష్టించిన సంచలనం అందరకి తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి డ్రీమ్ గర్ల్ గా ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్ తొలి భార్య సంతానం. ఆ ఇద్దరు  రీసెంట్ గా తమ చిత్రాలతో సందడి చేస్తు వస్తున్నారు. ప్రముఖ హీరోయిన్లు ఇషా డియోల్ ,అహనా డియోల్ కూడా నటన పరంగా బాలీవుడ్ లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు.ఇషా డియోల్ హీరోయిన్ గాను చేస్తున్న విషయం తెలిసిందే.
  -చరణ్ గ్లోబల్ స్టార్ కాదా! -మెగా పవర్ స్టార్ అని చెప్పారు. -చికిరి సాంగ్స్ సంచలనం -పెద్ది పై అభిమానుల భారీ అంచనాలు      మొత్తానికి 'రామ్ చరణ్'(Ram Charan)తన అప్ కమింగ్ మూవీ 'పెద్ది' (Peddi)తో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా ఉన్నాడు. గత పరాజయానికి గట్టిగా గుణపాఠం చెప్పేలా సిల్వర్ స్క్రీన్ పై ఒక భారీ హిట్ ని అందుకోబోతున్నాడనే సంకేతాలు కూడా చాలా స్పష్టంగానే కనపడుతున్నాయి. ఇందుకు ఇప్పటికే రిలీజైన టీజర్ తో పాటు, రీసెంట్ గా విడుదలైన 'చికిరి' సాంగ్ ఉదాహరణగా నిలుస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు ప్రేక్షకులు వెల్లడి చేస్తు వస్తున్నారు. అదే సమయంలో మరో విషయంలో కూడా ఆ అందరి మధ్య ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. చికిరి సాంగ్ టీజర్ లో రామ్ చరణ్ పేరుని మెగాపవర్ స్టార్ గా సంబోధించారు. కానీ ఆర్ఆర్ ఆర్ హిట్ తర్వాత  చరణ్ ని  గ్లోబల్ స్టార్ అనే టైటిల్ తో అభిమానులు పిలుస్తు వస్తున్నారు. గేమ్ చేంజర్ టైటిల్స్ లో కూడా గ్లోబల్ స్టార్ అని ప్రస్తావించడం జరిగింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గ్లోబల్ స్టార్ అనే క్యాప్షన్ తో చరణ్ రేంజ్ గ్లోబల్ స్థాయిలో కొనసాగాలని వాళ్లంతా కోరుకున్నారు. అలాంటిది ఇప్పుడు 'పెద్ది'కి మెగా పవర్ స్టార్ అనే క్యాప్షన్ ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంపైనే అభిమానులు, మూవీ లవర్స్ ఎందుకు అలా జరిగిందని చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై చరణ్, మేకర్స్ అధికారకంగా తెలిపే దాకా సోషల్ మీడియా వేదికగా రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉంటాయి.   ఇక ఏ ఆర్ రెహ్మాన్(Ar Rehman)మ్యూజిక్ లో వచ్చిన 'చికిరి'(Chikiri)సాంగ్ వరల్డ్ వైడ్ గా ఉన్న మెగా అభిమానులనే కాకుండా, పాన్ ఇండియా మూవీ లవర్స్ ని ఒక ఊపు ఊపుతుంది. అమెరికా నుంచి అనకాపల్లి దాకా చికిరి సాంగ్ కి చరణ్ చేసిన హుక్ స్టెప్ తో ఇనిస్టా లో రీల్స్ ఒక రేంజ్ లోనే సాగుతున్నాయి. సదరు రీల్స్ కి ఆడ, మగ, చిన్న,పెద్ద అనే ఏజ్ తారతమ్యం కూడా లేకుండా పోయింది.  తెలుగులోనే కాకుండా సాంగ్ రిలీజైన అన్ని బాషల్లోను ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇక  తెలుగుకి సంబంధించి విడుదలైన మూడు రోజులకే 38 మిలియన్ల కి పైగా  వ్యూస్ ని దాటి 40 మిలియన్ల వ్యూస్ కి అతి చెరువులో ఉంది. చరణ్ బర్త్ డే కానుకగా వచ్చే ఏడాది మార్చి 26 , 2026 న వరల్డ్ వైడ్ గా 'పెద్ది' పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మరి రిలీజ్ అయ్యే లోపు ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి. చరణ్ సరసన అచ్చాయమ్మా గా 'జాన్వీ కపూర్'(Janhvi Kapoor)జత కడుతుండగా బుచ్చిబాబు సాన(BuchiBabu Sana)దర్శకుడు. వృద్ధి(Vruddi)సినిమాస్ భారీ వ్యయంతో నిర్మిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బాగస్వామ్యులుగా వ్యహరిస్తున్నారు.    
King Nagarjuna has re-written box office history and even Indian Cinema style of filmmaking with his all-time cult classic, Shiva. Telugu Cinema has always been talked about as Before Shiva and After Shiva. Such a film is re-releasing on 14th November with 4K upgradation and Dolby Atmos Sound enhancement.  Nag and director Ram Gopal Varma, interacted with the press after screening special show for them. The movie has been unanimously praised by press people for such a great effort in detailing while converting sound and visuals. RGV overlooked the project and stated that they used AI for multi-track sound but did not add anything.  Nagarjuna  remembered his father legendary actor Akkineni Nageswara Rao words and exclaimed that they have turned true. He revealed that post Shiva release he heard mixed reactions from all corners as industry people told him that movie won't be such a big hit and it doesn't have comedy and women won't like violence.  But at that time, ANR drove the car with him besides and took him out. Then the great man told Nag, "I don't know where the movie is going to end, it's a blockbuster." Nag stated that his father's words have come true. He thanked RGV for overlooking everything and appreciated Annapurna Studios team for top notch work. The movie release is coinciding with 50th anniversary of the revered studio.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The Great Pre-Wedding Show, starring Thiruveer and Teena Sravya, has emerged as the sleeper hit of the season, proving that genuine content still dominates the Telugu box office. Released on November 7, this charming slice-of-life entertainer has quickly won hearts, grossing an impressive ₹2.22 crores in just three days. Produced by Sandeep Agharam and Ashmitha Reddy Basani and directed by Rahul Srinivas, the film succeeds through its refreshing honesty and perfect blend of laughter, warmth, and emotion. Despite its modest scale, the film’s strong performance is purely driven by massive word-of-mouth, leading to an increase in screen count across major centers—a rare feat for a small-budget production. Set against a charming rural backdrop, the film captures the hilarious chaos of a pre-wedding photo shoot gone wrong. Thiruveer shines as Ramesh, the wedding photographer, with his effortless comic timing, while Teena Sravya adds grace and freshness. Viewers and critics are praising the film’s authenticity, engaging screenplay, and relatable characters. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
This week, November 9th - November 14th, is bringing a massive lineup to Indian streaming platforms, highlighted by major film premieres, highly anticipated series returns, and content across multiple languages.   Cinema Releases & Films:    A strong roster of films is making its digital debut, featuring Bollywood, Hollywood, and regional hits:   Dude | November 14 | Netflix: The superhit Tamil romantic comedy, starring Pradeep Ranganathan and Mamitha Baiju, is set for its multi-language streaming premiere following a successful theatrical run.   Jolly LLB 3 | November 14 | Netflix & JioCinema (Reported): The return of the beloved Hindi legal comedy franchise, featuring Akshay Kumar and Arshad Warsi in a witty courtroom battle.   Jurassic World: Rebirth | November 14 | Disney+ Hotstar: The latest installment in the global dinosaur sci-fi adventure series makes its digital debut.   Nishaanchi | November 14 | Amazon Prime Video: A Hindi action-thriller with an intense storyline.   Telusu Kada | November 14 | Netflix: A Telugu romantic drama film directed by Neeraja Kona.   Dashavatar | November 14 | ZEE5: A Marathi-language suspense thriller featuring a strong cast.   Inspection Bungalow | November 14 | ZEE5: A Malayalam horror thriller about a police station moving into a haunted bungalow.   Playdate | November 12 | Amazon Prime Video: An English action-comedy film for a lighter viewing experience.   A Merry Little Ex-Mas | November 12 | Netflix: An English Christmas-themed romantic comedy. Web Series & Shows:    The biggest series event of the week is the return of an Emmy-winning crime drama:   Delhi Crime Season 3 | November 13 | Netflix: Shefali Shah returns as DCP Vartika Chaturvedi in the highly anticipated third season of the Emmy-winning series, tackling a major new case involving international human trafficking.   Last Samurai Standing | November 13 | Netflix: A Japanese period drama series, produced by Junichi Okada, focusing on themes of courage and honor.   The Big C | November 14 | Netflix: The complete series of the American dramedy starring Laura Linney will become available.   Bat-Fam Season 1 | November 10 | Amazon Prime Video: An English animated series centered on the DC Comics family of characters.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ఈ వారం సినీ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీలోనూ పలు సినిమాలు సందడి చేయనున్నాయి.   నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ 'శివ' నవంబర్ 14న రీ రిలీజ్ అవుతోంది. 4K లో విడుదలవుతున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.   మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్.. తమిళ డబ్బింగ్ చిత్రం 'కాంత'తో నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.   అలాగే, నవంబర్ 14న 'సంతాన ప్రాప్తిరస్తు', 'Cమంతం', 'జిగ్రీస్', 'గత వైభవ' వంటి పలు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.   ఓటీటీలోనూ ఈ వారం పలు సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను అలరించనున్నాయి. నెట్ ఫ్లిక్స్: మెరైన్స్‌ వెబ్‌సిరీస్‌ - నవంబరు 10  ఢిల్లీ క్రైమ్ 3 (హిందీ సిరీస్) - నవంబరు 13  లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ (జపనీస్ సిరీస్) - నవంబరు 13  డ్యూడ్‌ మూవీ (తెలుగు/తమిళ) - నవంబరు 14  తెలుసు కదా తెలుగు మూవీ - నవంబరు 14    అమెజాన్ ప్రైమ్ వీడియో: ప్లే డేట్‌ ఇంగ్లీష్ మూవీ - నవంబరు 12  నిషాంచి హిందీ మూవీ - నవంబరు 14    ఈటీవీ విన్: ఏనుగు తొండం ఘటికాచలం తెలుగు మూవీ - నవంబరు 13    జియో హాట్‌ స్టార్‌: జాలీ ఎల్‌ఎల్‌బీ హిందీ మూవీ - నవంబరు 14  అవిహితం మలయాళ చిత్రం - నవంబరు 14  జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఇంగ్లీష్ మూవీ - నవంబరు 14    జీ5: ఇన్‌స్పెక్షన్‌ బంగ్లా (మలయాళ సిరీస్‌) - నవంబరు 14  దశావతార్ (మరాఠీ చిత్రం) - నవంబరు 14    ఆహా: కె-ర్యాంప్ తెలుగు మూవీ - నవంబరు 15   
  ఇటీవల 'మాస్ జాతర'తో ప్రేక్షకులను పలకరించారు మాస్ మహారాజా రవితేజ. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజ, ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూశారు. కానీ, 'మాస్ జాతర' కూడా మెప్పించలేకపోయింది. దీంతో నెక్స్ట్ సినిమాపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.   రవితేజ తన 76వ సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇదే టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. రవితేజ నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.   Also Read: తెలంగాణ సాహితీ శిఖరం 'అందెశ్రీ' కంటతడి పెట్టిన సందర్భం..!   'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ ని బట్టి చూస్తే.. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. సంక్రాంతి సీజన్ లో ఈ తరహా సినిమాలకు మంచి ఆదరణ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.   రవితేజ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. అలాగే దర్శకుడు కిషోర్ తిరుమల ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని అందించడంలో దిట్ట. అలాంటిది ఈ ఇద్దరు కలిసి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ తో వస్తున్నారంటే.. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని చెప్పవచ్చు.   మరి ఈ సినిమాతో రవితేజ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చి.. ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తారేమో చూడాలి.    
సినిమా ఇండస్ట్రీలో రూమర్స్‌ అనేవి సర్వసాధారణం. సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తితోనే రూమర్స్‌ని ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఫాలో అవుతుంటారు. ఇదే అదనుగా కొన్ని మీడియా సంస్థలు, కొందరు నెటిజన్లు ఇలాంటి రూమర్స్‌ని క్రియేట్‌ చేస్తుంటారు. నిజమా, అబద్ధమా అని తెలుసుకొనేలోపే అవి ప్రపంచాన్ని చుట్టి వస్తాయి. అలాంటి ఒక రూమర్‌ డైరెక్టర్‌ రవిబాబు విషయంలో పుట్టుకొచ్చింది. దానివల్ల మానసికంగా ఎంతో వ్యధకు లోనయ్యానని చెబుతారాయన. ఇంతకీ ఆ రూమర్‌ ఏమిటో, ఎలా స్ప్రెడ్‌ అయిందో చూద్దాం.   నటుడు చలపతిరావు తనయుడు రవిబాబు అమెరికాలో చదువుకొని అక్కడ కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు. అయితే టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనతో ఇండియాకి వచ్చి తెలుగులో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఆ తర్వాత ఇ.వి.వి.సత్యనారాయణ తనయుడు నరేష్‌తో  ‘అల్లరి’ వంటి డిఫరెంట్‌ సినిమాని తెరకెక్కించి నరేష్‌కి దాన్నే ఇంటి పేరుగా మార్చాడు. రవిబాబు చేసే సినిమాలు రెగ్యులర్‌ ఫార్మాట్‌లో ఉండవు. మునుపెన్నడూ చూడని ఓ కొత్త కాన్సెప్ట్‌ అతని సినిమాల్లో కనిపిస్తుంది. నటీనటుల కాస్ట్యూమ్స్‌ నుంచి బ్యాక్‌గ్రౌండ్‌ వరకు డిఫరెంట్‌గా ఉంటాయి.    అలా అమ్మాయిలు అబ్బాయిలు, పార్టీ, సోగ్గాడు వంటి సినిమాలు చేశాడు. భూమిక ప్రధాన పాత్రలో తను విలన్‌గా చేసిన అనసూయ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత అమరావతి, అవును, అవును2, ఆవిరి వంటి హారర్‌ మూవీస్‌ ప్రేక్షకుల్ని అలరించాయి. అలాగే నచ్చావులే, నువ్విలా, మనసారా వంటి సినిమాలు కూడా చేశారు. ఇప్పటివరకు డైరెక్టర్‌గా 15 సినిమాలు చేశారు రవిబాబు. ప్రస్తుతం ‘ఏనుగుతొండం ఘటికాచలం’ చేస్తున్నారు. పూర్తి స్థాయి కామెడీతో రూపొందిన ఈ సినిమాను నవంబర్‌ 13 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమ్‌ చేయబోతున్నారు.   ఇదిలా ఉంటే.. పూర్ణ హీరోయిన్‌గా మూడు సినిమాలు డైరెక్ట్‌ చేశారు రవిబాబు. వరసగా ఆమెతోనే సినిమాలు చేయడంతో ఇద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అనే రూమర్‌ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో రెక్కలు కట్టుకొని రౌండ్లు వేసింది. అయితే పూర్ణ 2022లో పెళ్లి చేసుకుంది. అప్పటివరకు పూర్ణ, రవిబాబు మధ్య ఏదో ఉందనే వార్తలు వస్తూనే ఉండేవి. అప్పట్లో ఈ రూమర్‌ గురించి రవిబాబు స్పందించారు కూడా.    తాజాగా రవిబాబు రష్‌ అనే సినిమా చేస్తున్నారు. ఈ సందర్భంగా పూర్ణ ప్రస్తావన వచ్చినపుడు ఆమె గురించి మాట్లాడారు. ‘పూర్ణ ఎంతో డెడికేషన్‌ ఉన్న ఆర్టిస్ట్‌. సెకండ్‌ టేక్‌ లేకుండా సింగిల్‌ టేక్‌లోనే షాట్‌ ఓకే చేసేది. అందుకే ఆమెతో వరసగా సినిమాలు చేశాను. సినిమాలోని క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయితే వరసగా సినిమాలు చెయ్యడంలో తప్పేముంది? ప్రస్తుతం నేను చేస్తున్న రష్‌ సినిమాలో ఫైట్స్‌ ఉంటాయి. పూర్ణ మంచి డాన్సర్‌ తప్ప ఫైట్స్‌ చెయ్యలేదు. అందుకే ఆమెని తీసుకోలేదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు రవిబాబు. 
Mass Maharaja Ravi Teja has been sticking to action entertainers and the routine commercial beats have been earning him backlash from the audiences. His films have lost the appeal that they used to have with masses. While Mass Jathara is still holding slightly, the movie has been rejected by major part of audiences.  With BMW, Bhartha Mahasayulaku Wignyapthi, he seems to have taken a step in right direction. He is offering something different from sticking to action films. The film is a hilarious family entertainer that too with Ravi Teja, as a married man, being offered something he is worried about to reject or accept.  Ashika Ranganath is playing his office boss lady while Dimple Hayati is playing his wife, from the glimpse. Ravi Teja is seen meditating to come out of his stressful situation but what is it? Well, Kishore Tirumala has been a promising filmmaker with good content being offered consistently, in his movies.  If the movie clicks for Sankranti, which is already over crowded, we have to wait and see, how the market will be divided between Mana Shankara Vara Prasad Garu, Nari Nari Naduma Murari, BMW and Anaganaga Oka Raju, all being family entertainers. For now, Ravi Teja is offering something new and let's hope it is better than his other films.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ఈ ప్రపంచంలో భార్యాభర్తల బంధం  చాలా అపురూపమైనది.  వేర్వేరు ప్రాంతాలలో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహం పేరుతో కలిసి జీవించడం,  ఎలాంటి పరిస్థితులు  ఎదురైనా ఒకరికి ఒకరు తోడుండటం ఈ బంధాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.  అయితే భార్యాభర్తల బంధంలో తమదే పై  చేయి ఉండాలనే పిచ్చి ఆలోచన చాలామందిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా మగవారు భార్యల విషయంలో ఆధిపత్య ప్రవర్తన కలిగి ఉంటారు.  ఈ వివాహ బంధంలో చాలామంది ఆడవారు ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అదే ట్రోఫీ వైఫ్.. అసలు ట్రోఫీ వైఫ్  అంటే  ఏంటి? ఇలాంటి పరిస్థితిలో ఎక్కువమంది భార్యలు ఎందుకు ఉన్నారు? ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్పడానికి భార్యాభర్తల మధ్య  ఉండే పరిస్థితులు ఏంటి? తెలుసుకుంటే.. ట్రోఫీ భార్య అంటే.. ట్రోఫీ భార్య అంటే.. భర్త కేవలం భార్య బాహ్య రూపానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం. అతని దృష్టిలో భార్యకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.  మూడు ముళ్లు వేసి పెళ్లి పేరుతో తన ఇంటికి తీసుకుని వచ్చి భార్యను కేవలం తన అవసరానికి వాడుకోవడం చేస్తుంటాడు.  ఇలాంటి పరిస్థితిలో ఉన్న బార్యలు అందరూ ట్రోఫీ భార్యలే.  ట్రోఫీ భార్యల పరిస్థితులు.. భార్యాభర్తల బంధంలో ఏ నిర్ణయం తీసుకున్నా భార్యాభర్తలు ఇరువురూ కలిసి తీసుకోవాలి అనుకుంటారు.  భర్త అయినా, భార్య అయినా తమ పార్ట్నర్ తమను కూడా అబిప్రాయం అడగాలని అనుకుంటారు. కానీ ట్రోఫీ భార్యలు మాత్రం ఇలాంటి ప్రాధాన్యతకు నోచుకోరు.  భర్త ఏ నిర్ణయం తీసుకున్నా తన సొంతంగా తీసుకుంటాడు.  భార్య అభిప్రాయంతో కానీ,  భార్య  ఆలోచనలతో కానీ అతనికి ఆసక్తి ఉండదు. భార్యాభర్తల బంధంలో ప్రేమ ఉండాలని చాలామంది అనుకుంటారు. ముఖ్యంగా భర్త చూపించే ప్రేమ భార్యకు ఎంతో ముఖ్యం. కానీ ట్రోఫీ భార్యలు మాత్రం భర్త ప్రేమకు నోచుకోరు. భర్తలు ఒక వేళ ప్రేమ చూపించినా అదంతా షో-ఆఫ్ కే.. అంటే నలుగురు చూడాలని, తనను మంచి భర్తగా ట్యాగ్ వేయాలనే కోరికతో  నలుగురిలో భార్యల పట్ల ప్రేమ చూపిస్తుంటారు. భార్యాభర్తలు అంటే.. ఒకరి వల్ల మరొకరు సంతోషంగా ఉండాలి. కానీ కొందరు మాత్రం తమ సంతోషాన్ని మరచి ఇతరులకు బాగా కనిపించాలని, ఇతరుల దృష్టిలో ఏది సరైనది అయితే.. అలాగే తాము ఉండాలని అనుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఉండే భార్యలు అందరూ ట్రోఫీ భార్యలే. భర్త ఎప్పుడూ భార్యను అన్ని విషయాలలో నియంత్రణ చేస్తుంటే.. ఆ బార్య ట్రోఫీ భార్య అని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. ఏం మాట్లాడాలి? ఏం తినాలి? ఏ దుస్తులు ధరించాలి? ఇలా ప్రతి విషయంలో భర్త జోక్యం చేసుకుంటూ ఉంటారు. భార్య ఎమోషన్స్ ను ఎప్పుడూ పట్టించుకోకుండా కేవలం తనకు నచ్చినది జరగాలని భర్త డిమాండ్ చేస్తుంటే ఆ  భార్య ట్రోఫీ వైఫ్ అని అర్థమట. వివాహం అయిన తరువాత ఆడపిల్లను కేవలం తనకు భార్య  అనే కోణంలో మాత్రమే చూస్తూ ఆమెకంటూ ఎలాంటి వ్యక్తిగత జీవితం,  స్పేస్ లేకుండా చేస్తుంటారు కొందరు భర్తలు.  ఇలా తమను తాము కోల్పోయే భార్యలు అందరూ ట్రోఫీ వైప్ లు.                                 *రూపశ్రీ.
మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సలహాలను నేటికీ మనం మన పెద్దలు లేదా తెలిసిన వారి నుండి వినవచ్చు. భగవద్గీత యొక్క ఈ జ్ఞానం నేటి ఆధునిక యుగంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. మీరు ఈ బోధనలను తెలుసుకుని, వాటిని తెలివిగా అనుసరించి, వాటిని మీ జీవితంలో చేర్చుకుంటే, మీ పురోగతిని ఎవరూ ఆపలేరు. భగవద్గీతలో జీవిత సారాంశం ఉందని మన పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశాలు మీ జీవితంలో కూడా ఉపయోగపడతాయి. ఐతే భగవద్గీతలో మనిషి ప్రగతి సాధించాలంటే ఏం చేయాలి అని చెప్పారు..? మీ కోపాన్ని నియంత్రించుకోండి: కోపం గందరగోళాన్ని సృష్టిస్తుంది, గందరగోళం తెలివిని పాడు చేస్తుంది, బుద్ధి చెడిపోతే, తర్కం నాశనం అవుతుంది, తర్కం నాశనం అయినప్పుడు, వ్యక్తి నాశనం అవుతాడు. అందువల్ల అతను తన అన్ని పనులలో వైఫల్యాన్ని ఎదుర్కొంటాడు. అదే వీక్షణ: జ్ఞానాన్ని,  చర్యను ఒకటిగా చూసే వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి. ఎవరైతే జ్ఞాని అయినా లేదా అతను జ్ఞానవంతుడు అయినా, అతని అభిప్రాయం కూడా సరైనదే. ఏ సమస్యను ఏ కోణంలో చూడాలో ఆయనకు అవగాహన ఉంది. మానసిక నియంత్రణ: మన మనస్సు ఎప్పుడూ మన అదుపులో ఉండాలి. మన మనస్సును అదుపులో ఉంచుకున్నప్పుడే అన్ని కార్యాలలో విజయం సాధించగలుగుతాము. మనసును అదుపులో పెట్టుకోని వారికి మనస్సే శత్రువులా ప్రవర్తిస్తుంది. స్వపరీక్ష: పురోగతి సాధించడానికి స్వీయ మూల్యాంకనం చాలా ముఖ్యం. మనం చేస్తున్న పని, ఎంచుకున్న మార్గం, తీసుకున్న నిర్ణయం అన్నీ సరైనవేనా.? లేక తప్పా? దాని గురించి ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆత్మజ్ఞానం అనే ఖడ్గంతో మన హృదయాల్లోని అజ్ఞానపు సందేహాలను తొలగించి, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఎంచుకుంటే, మీరు తప్పకుండా అందులో పురోగతి సాధిస్తారు. ప్రతి చర్యకు ప్రతిఫలం ఉంటుంది: ఈ జీవితంలో మనం ఏమీ కోల్పోలేదు లేదా వృధా చేయలేదు. మీరు ఏమి చేసినా, దాని నుండి మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఇది మీ జీవితాన్ని మార్చడానికి మీకు సహాయం చేస్తుంది. సాధన తప్పనిసరి: మనస్సు చంచలంగా ఉంటే లేదా మీ మనస్సును నియంత్రించడం మీకు కష్టంగా అనిపిస్తే, మీరు మంచి అలవాట్ల ద్వారా దానిని నియంత్రించవచ్చు. మీ మనస్సు నియంత్రణలో ఉన్నప్పుడే మీ చర్యలు, మీ భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఆలోచించండి: మనిషి తాను సాధించాలనుకున్నది ఆత్మవిశ్వాసంతో ఆలోచిస్తే ఏదైనా సాధించగలడు. ఏ పని చేసినా అందులో నమ్మకం ఉంటేనే చేయాలి. ఇలా చేయండి: క్రియలో నిష్క్రియతను,  నిష్క్రియంలో చర్యను చూసేవాడు తెలివైనవాడు. ఈ వ్యక్తులు తాము చేసే పనిలో ఆనందాన్ని పొందినప్పుడు మాత్రమే సంతృప్తిని అనుభవిస్తారు.
ఇంట్రోవర్ట్.. ఎవ్వరితోనూ ఎక్కువ కలవరు. ఎవరైనా పలకరించినా, మాట్లాడినా ఎప్పుడెప్పుడు అక్కడి నుండి పారిపోదామా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు.  ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఈ కారణంగానే ఇంట్రోవర్ట్ అనే మాట బయటకు తెలిస్తే అదేదో వాళ్లకు ఏదో జబ్బు ఉందన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటుంది సమాజం. అయితే ఇంట్రోవర్ట్ లను తేలిగ్గా తీసిపడేయకూడదని, ఇంట్రోవర్ట్ లు గా ఉండి ప్రపంచాన్ని తమ ప్రతిభ ద్వారా, విజయాల ద్వారా ఆకర్షించిన వారి గురించి తెలిస్తే వాళ్లను తక్కువ అంచనా అస్సలు వేయకూడదని అనిపిస్తుంది. ఇంట్రోవర్ట్ ల గురించి.. మనిషన్నాక సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరూ మాట్లాడటం అస్సలు అవసరం లేదు. కొంతమంది మౌనంగా ఉండి తమ ఎనర్జీ లెవెల్‌ని మెయింటైన్ చేసి దానిని తమ శక్తిగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఏదో మాటవరుసకు చెబుతున్నది కాదు. సాక్షాత్తూ మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ పరిశోధన ఇలా చెబుతోంది. గ్లోబల్ శాంపిల్‌పై అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 56.8% మంది వ్యక్తులు అంతర్ముఖులుగా ఉన్నారు.  అంటే తమతో తాము ఉండటానికి  లేదా మౌనంగా ఉండటానికి వీరు ఇష్టపడతారు. బహిర్ముఖ వ్యక్తుల కంటే  అంతర్ముఖులే ఎక్కువ విజయాలు సాధిస్తారని, ప్రపంచ రూపురేఖలను మార్చిన ఎంతో మంది ప్రసిద్ద వ్యక్తులు అంతర్ముఖులే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాట్లాడటం.. సమయానికి మాట్లాడటం.. కొందరు వ్యక్తులు అంతర్ముఖులతో వ్యవహరించడం కొంచెం కష్టమని అంటుంటారు. ఎందుకంటే అంతర్ముఖులు తమ భావాలను ఎవరికీ చెప్పరు. కానీ తక్కువ మాట్లాడటం అంటే ఏదో దాచడం అని కాదు. పరిశోధన ప్రకారం అంతర్ముఖులు ఆలోచనాత్మకంగా మాట్లాడతారు. వారి  మాటలు చాలా విస్తృతంగా సరైన కారణాలతో కూడుకుని ఉంటాయి. వీరు ఎవరికీ త్వరగా స్పందించరు. ఎమోషనల్ అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది.  అందుకే  ఇతర వ్యక్తుల కంటే వీళ్లు   సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వీరు వారికి నచ్చింది మాత్రమే మాట్లాడుతారు. ఒంటరితనమే బలం.. మానసిక  రోగుల వైద్యుల అభిప్రాయం ప్రకారం అంతర్ముఖ వ్యక్తులు బహిర్ముఖుల కంటే బలంగా , శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే వారు ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా, తెలివిగా ఆలోచిస్తారు. దానికి తగినట్టే నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రశాంత స్వభావం కారణంగా ఇంట్రోవర్ట్ లు  ఎప్పుడూ కోపం తెచ్చుకోరు. లేదా దూషించే మాటలు మాట్లాడరు.  సాధారణంగా వీరు ఇతరులకు చాలా పొగరు వ్యక్తులుగా అనిపిస్తారు. కానీ వీరు అర్థమయ్యే కొద్దీ.. వీరి మీద గౌరవం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా.. అంతర్ముఖులు తమ భావోద్వేగాలను బయటకు  వ్యక్తం చేయకపోవచ్చు. కానీ వారు మానసికంగా బలంగా ఉంటారు. వీరు సులభంగా ఎవరికీ  భయపడరు. తక్కువ మాట్లాడటం వల్ల  వీరిని చాలామంది పిరికివాళ్లు అని అంటూ ఉంటారు. కానీ అంతర్ముఖుల శక్తి అసాధ్యం. వారు మానసికంగా దృఢంగా ఉంటారు. జ్ఞాపకశక్తి ఎక్కువ.. 2007లో రష్యాలో అంతర్ముఖులపై నిర్వహించిన పరిశోధనలో   వీరు ఏవైనా సంఘటనలు, విషయాలను చాలా కాలంపాటూ గుర్తుంచుకుంటారని తెలిసింది. ఎందుకంటే ఇంట్రోవర్ట్ వ్యక్తులకు ఫ్రంటల్ లోబ్‌లో ఎక్కువ రక్త ప్రసరణ ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ అనేది మెదడులోని జ్ఞాపకాలను నిల్వ చేసే భాగం. ఇది సమస్యలకు పరిష్కాలు ఆలోచించడం, సరైన ప్రణాళికలు రచించడం వంటి విషయాలలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అంతర్ముఖులు బాగా ప్రణాళిక వేయడంలో ,సమస్యలను పరిష్కరించడంలో కూడా తెలివిగా ఉంటారు.  లాజిక్‌పై దృష్టి పెట్టడంతో పాటు, వీరు  సృజనాత్మకంగా , శక్తివంతంగా ఉంటారు.                                          *నిశ్శబ్ద.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అన్ని అవయవాలు పర్పెక్ట్ గా  పనిచేయాలి. ఇలా అన్ని అవయవాలు సరిగా పని చేయాలంటే దీనికి తగినంత స్వచ్ఛమైన రక్తం సరఫరా అవసరం. మన శరీరమంతా ఆక్సిజన్, హార్మోన్లు,  అవసరమైన పోషకాలను రవాణా చేయడానికి రక్తం చాలా అవసరం, కానీ  రక్తం స్వచ్ఛంగా,  శుభ్రంగా లేకపోతే ఈ ప్రక్రియ కష్టంగా జరుగుతుంది. అసలు రక్తం ఎలా మలినం అవుతుంది? రక్తం శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? రక్తాన్ని శుభ్రం చేసే ఆహారాలు  ఏమిటి? తెలుసుకుంటే.. రక్తం ఎలా కలుషితం అవుతుంది? సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల  కాలక్రమేణా రక్తంలో అనేక విష పదార్థాలు పేరుకుపోతాయి. ఇది శరీరంలోని అనేక అవయవాలలో విషప్రక్రియకు దారితీస్తుంది. సాధారణంగా, మూత్రపిండాలు,  కాలేయం వంటి జీర్ణవ్యవస్థ అవయవాలు సహజంగానే రక్తాన్ని నిరంతరం ఫిల్టర్ చేస్తాయి. అయితే రక్తం ఎక్కువ కలుషితం కావడం   ఈ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అందువల్ల సరైన ఆహారాన్ని తీసుకోవడం,  రక్తంలో విష పదార్థాలు తొలగించి రక్తాన్ని శుభ్రం  చేసే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. రక్తం కలుషితం అయితే ఎదురయ్యే సమస్యలు.. ఆహారంలో మలినాలు ఎక్కువ ఉంటే..  రక్తంలో మలినాలు కూడా  పెరుగుతాయి. ఇది మన చర్మంతో సహా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. రక్తంలో మలినాలు ఉంటే కాలేయం సరిగా పనిచేయదు. ఇది జీర్ణ సమస్యలను పెంచుతుంది.  చర్మ ఇన్ఫెక్షన్లు, పదే పదే ఒకదాని తరువాత ఒకటి  మొటిమలు వస్తూ ఉండటం, దద్దుర్లు,  చికాకు, తరచుగా అలసట,  ముఖంపై మెరుపు లేకపోవడం మొదలైనవి రక్తం శుభ్రంగా లేదనే సంకేతాన్ని ఇస్తాయి. రక్తాన్ని శుభ్రం చేసే ఆహారాలు.. గోరువెచ్చని నీరు, నిమ్మరసం.. నిమ్మరసం  రక్తాన్ని, జీర్ణవ్యవస్థను రెండింటినీ శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది సహజంగా ఆమ్లంగా ఉంటుంది. ఇది pH స్థాయిలను తగ్గించడానికి,  రక్తం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. శరీరం నుండి మలినాలను తొలగించుకోవడానికి ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో  తాజా నిమ్మరసం కలిపి  త్రాగాలి. ఇది  రక్తాన్ని శుభ్రంగా ఉంచడానికి  చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నీరు.. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో టాక్సిన్లు  తొలగడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలోని మలినాలను తగ్గిస్తుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల కాలేయం,  మూత్రపిండాల పనితీరు కూడా సరిగ్గా ఉంటుంది. ఈ అవయవాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి,  మలినాలను తొలగించడానికి  సహాయపడతాయి. నేషనల్ కిడ్నీ అసోసియేషన్ ప్రకారం రోజుకు సుమారు 6 కప్పుల మూత్రం ఉత్పత్తి అయ్యేంత నీరు త్రాగాలి. పసుపు.. పసుపు  రక్తాన్ని శుద్ధి చేయడానికి,  వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. పసుపులో కనిపించే కర్కుమిన్ అనే సమ్మేళనం వాపు,  ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం పసుపు పాలు  తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.   శరీరం నుండి విషాన్ని తగ్గిస్తుంది.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
 ఇళ్ళు,  ఆఫీసులు మంచి వాసన రావడానికి  తరచుగా రూమ్ ఫ్రెషనర్లు, పెర్ఫ్యూమ్‌లు, సువాసనగల ధూపం లేదా సువాసనగల కొవ్వొత్తులను ఉపయోగిస్తుంటారు. ఇది ఒక సాధారణ అలవాటులా అనిపిస్తుంది. కానీ ఈ "సువాసన" నెమ్మదిగా  ఆరోగ్యానికి "సైలెంట్ కిల్లర్"గా మారుతుందని తెలుసా.. చాలామంది ఇలాంటి సువాసన వల్ల ఇల్లు వాతావరణం బాగుంటుందని,  ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటారు.  కానీ ఈ రూమ్ ఫ్రెషనర్ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. రూమ్ ఫ్రెషనర్ల తయారీలో ఉపయోగించే రసాయనాలు.. రూమ్ ఫ్రెషనర్లు, పెర్ఫ్యూమ్‌లు, సౌందర్య సాధనాలు, శుభ్రపరిచే ఉత్పత్తులు,  సువాసనగల కొవ్వొత్తులు వంటి ఉత్పత్తులలో ఆరోగ్యానికి హానికరమైన వేలాది రసాయనాలు ఉంటాయి. వీటిలో ప్రధానంగా ద్రావకాలు, స్టెబిలైజర్లు, UV-అబ్జార్బర్‌లు, ప్రిజర్వేటివ్‌లు,  రంగులు ఉంటాయి. ఇవి ఇండోర్ వాయు కాలుష్యానికి కారణం అవుతాయి. ఈ రసాయనాలు ఎక్కువ కాలం పీల్చడం వల్ల అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్,  న్యూరోటాక్సిసిటీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రూమ్ ఫ్రెషనర్లు ఎక్కువకాలం వాడితే కలిగే సమస్యలు.. రూమ్ ఫ్రెషనర్లలో ఉండే రసాయనాలు కళ్ళు, గొంతు,  ఊపిరితిత్తులను కప్పే సున్నితమైన పొరలను చికాకుపరుస్తాయి. ఇది చికాకు, దగ్గు,  శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఎటువంటి కారణం లేకుండా తరచుగా మైగ్రేన్లు లేదా తలనొప్పుల సమస్య ఉంటే అది రూమ్ ఫ్రెషనర్ల వల్ల ఏర్పడే సమస్య కావచ్చని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా, ప్లగ్-ఇన్ ఎయిర్ ఫ్రెషనర్లు, ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్లు,  లాండ్రీ క్రిస్టల్స్, పెర్ఫ్యూమ్‌లు, కొలోన్‌లు వంటి ఉత్పత్తులు మెదడులో సున్నితమైన నరాల ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి. తలనొప్పిని పెంచుతాయి. చాలా మందికి  రూమ్ ఫ్రెషనర్లు అంటే అలెర్జీ ఉంటుంది. రసాయనాల వాసన రియాక్షన్ కు తొందరగా గురయ్యేవారిలో  దగ్గు, తుమ్ము, కళ్ళు దురద,  వాయుమార్గాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి దీర్ఘకాలం కొనసాగితే ఉబ్బసం,  శ్వాసకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. థాలేట్లు,  కొన్ని సింథటిక్ రసాయనాలు శరీరం  హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. ఇది సంతానోత్పత్తి,  జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలికంగా వీటికి గురికావడం వల్ల లైంగిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.  పురుషులు,  స్త్రీలలో సంతానోత్పత్తి ప్రమాదాలు పెరుగుతాయి. ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో ఈ రూమ్ ఫ్రెషనర్లు ఊపిరితిత్తులను చికాకుపరుస్తాయి. దగ్గు, గురక లేదా శ్వాస ఆడకపోవడానికి కారణమవుతాయి. తక్కువ స్థాయిలో ఎక్స్‌పోజర్ కూడా పిల్లలు,  పెద్దలలో ఆస్తమా ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు అంటున్నారు. రూమ్ ఫ్రెషనర్  పదార్థాలలో ఉండే ఫార్మాల్డిహైడ్,  కొన్ని అస్థిర సేంద్రియ సమ్మేళనాలు క్యాన్సర్ కలిగించే ప్రధాన సమ్మేళనాలుగా గుర్తించబడ్డాయి. ఈ సమ్మేళనాలను ఎక్కువ కాలం పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, కాలేయం,  చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ ఉత్పత్తులను ఎక్కువ కాలం పీల్చడం  వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, కాలేయ పనితీరు దెబ్బతినడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రసాయనాలు శరీరంలోని హార్మోన్లు,  జీవక్రియ వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తాయి.                                     *రూపశ్రీ.
  చల్లని,  పొడి వాతావరణంలో గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. ఇది చర్మం పై పొర నుండి తేమను త్వరగా తొలగిస్తుంది. దీని వల్ల చర్మం  పొడిగా  గరుకుగా మారుతుంది. దీని కారణంగా పగుళ్లు ఏర్పడతాయి. చలి నుండి ఉపశమనం కోసం చాలా మంది  హీటర్ వాడతారు. మరికొంత మంది  వేడి నీటి స్నానం ద్వారా ఉపశమనం పొందాలని అనుకుంటారు.  కానీ వీటి వల్ల  పొడిదనం మరింత ఎక్కువ అవుతుంది. అసలు చలికాలంలో చర్మం ఎందుకు పొడిగా మారుతుంది. చర్మం పొడిగా మారి పగుళ్లు రాకూడదంటే ఏం చేయాలి? ఏం తినాలి? తెలుసుకుంటే.. చర్మం ఎందుకు పొడిగా మారుతుందంటే.. శీతాకాలంలో గాలిలో తేమ తగ్గి చర్మం త్వరగా ఎండిపోతుంది. బయట చల్లని గాలి నుండి చర్మానికి ఉపశమనం కలిగించుకోవడం కోసం వేడికి దగ్గరగా ఉండాలని అనుకుంటారు.  ఇది చర్మంలోని తేమను తొలగిస్తాయి. ఈ సమయంలో చర్మం సహజ నూనెలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా తగ్గి, చర్మం  రక్షణ పొరను బలహీనపరుస్తుంది. వేడి నీటిలో స్నానం చేస్తే లేదా తగినంత నీరు త్రాగకపోతే పొడిబారడం మరింత పెరుగుతుంది.   బయటి వాతావరణానికి ప్రభావితమయ్యే శరీర భాగాలైన మఖం,  చేతులు, కాళ్లలో ఈ పొడిబారే సమస్య ఎక్కువగా ఉంటుంది. చర్మం పొడిబారి పగుళ్లు రాకుండా చేసే ఆహారాలు.. ఆహారం చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చేపలు, అవిసె గింజలు,  వాల్‌నట్‌లు వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చర్మంలోని నూనె సమతుల్యతను కాపాడుతాయి. బాదం, వేరుశెనగలు,  పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి విటమిన్ E సమృద్దిగా ఉన్న ఆహారాలు   చర్మాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తాయి. క్యారెట్,  పాలకూర వంటి విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు చర్మ కణాలను మరమ్మతు చేయడంలో సహాయపడతాయి. తగినంత నీరు త్రాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉండటంలో సహాయపడుతుంది.  అసమతుల్యమైన లేదా ప్రాసెస్ చేసిన ఆహారం చర్మ సహజ కాంతిని తగ్గిస్తుంది.  పొడిబారడాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే చర్మానికి మేలు చేసే ఆహారాలు తీసుకోవాలి.                                *రూపశ్రీ.