LATEST NEWS
రాష్ట్రం వేరు కావచ్చును. రాష్ట్రన్ని పాలించే పార్టీ వేరు కావచ్చును. అది జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలోని ఆంధ్ర ప్రదేశ్ అయినా, కేసీఆర్, కేటీఆర్ పాలిస్తున్న తెలంగాణ అయినా, ఉద్దవ థాకరే ఎలుబడిలోని మహారాష్త్రే అయినా ... శివరాజ్ చౌహాన్ పాలిస్తున్న ఎంపీనే అయినా  ఇతరత్రా విషయాల్లో ఎలా ఉన్నా, మద్యం విషయంలో మాత్రం అందరిదీ ఒకటే మాట, ఒకటే బాట. ఒకటే ఆలోచన. అన్ని ప్రభుత్వాలు మందు బాటలోనే ముందుకు సాగుతున్నాయి.      ఒకప్పుడు ఏమో కానీ, ఇప్పుడు మాత్రం పార్టీ లేబుల్స్’తో పని లేకుండా, గుజరాత్, బీహార్ లాంటి ఒకటి రెండు రాష్ట్రాలు మినహ మిగిలి రాష్ట్ర  ప్రభుత్వాలు అన్నీ మందును ప్రధాన ఆదాయ వనరుగానే చూస్తున్నాయి.అందుకే, మధ్య నిషేధం మాటలకే పరిమితం అవుతోంది. గుజరాత్, బీహార్’లో కుడా మధ్య నిషేధం అమలులో ఉన్నా,ఆ రాష్ట్రాల్లోనూ పర్మిట్ల పేరున మరో దారిలో ‘మధ్య’ మార్గంలో  ఎంతో కొంత ఆదాయం వస్తూనే ఉంది. అయినా, ఇతర రాష్ట్రాల కంటే కొంత బెటర్  అంటారు.  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంచెల వారీగా  సంపూర్ణ మధ్య నిషేధం తెచ్చేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ, గడచిన రెండున్నర మూడేళ్ళ కాలంలో ఏమి జరిగిందో వేరే ప్రత్యేకించి చెప్ప నవసరం లేదు ... మద్యం మీద వచ్చే ఆదాయం ఏటికేడాది పెరుగుతూనే ఉంది.అంచల వారీ మధ్య నిషేధం అంటూనే, మద్యం మీద వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు జగన్ రెడ్డి పభుత్వం, దేశంలో ఇంకెక్కడా లేని విధంగా మద్యం దుకాణాలు  నడుపుతోంది. అంతేకాదు, మరో పాతికేళ్ళ పాటు, ప్రజల చేత పుష్టుగా మందు తాగించి ఆదాయం తగ్గకుండాచూసే పవిత్ర కర్తవ్యాన్ని కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. పాతికేళ్ళ మద్యం ఆదాయాన్ని కుదువ పెట్టి,వేల కోట్ల మేర అప్పులు తెచ్చుకుంది. అంటే, రాష్ట్రంలో  పాతికేళ్ళ పాటు సంపూర్ణ  కాదు కదా పాక్షిక మధ్య నిషేధం కూడా అమలు కాదు. ఇంకా అవసరం అయితే, ఇంటింటికీ ఉచిత డెలివరీ, ప్రత్యేక బ్రాండ్లు, బార్లు వంటి వినూత్న ఆలోచనలు చేసినా చేస్తుంది కానీ, నిషేధం జోలికి మాత్రం పోదు. ఆ విషయం  ‘అప్పు పత్రం’ సాక్షిగా  ప్రభుత్వమే  చెప్పింది.  తెలంగాణ కూడా తక్కువ తినలేదు ..సారీ, తక్కువ తాగలేదు.. 2021 చివరి ఐదు రోజుల్లోనే ఇంచుమించుగా ఒక  కోటి అటూ ఇటుగా ఒక వెయ్యి కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి,డిసెంబర్ నెలలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏకంగా రూ.3,435 కోట్ల  మేర మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ స్వయంగా, సగౌరవంగా ప్రకటించింది.అంటే సంవత్సరంలో  ఎన్ని వేల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు సాగాయో, వేరే చెప్పనక్కర లేదు. అయితే, అదలా ఉంటే మందు దార్లో మరో వినూత్న విధనాన్ని ప్రవేశ పెట్టిన  ఘనత మత్రం మహా రాష్ట్ర  మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికే దక్కింది. మూడు పర్టీల మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మద్యానికే కిక్కిచే వినూత్న విధానాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి మహా రాష్ట్రలో మందు కావాలంటే, వైన్ షాప్’కో, బార్’కో పోనవసరం లేదు..దగ్గర్లో ఉన్న సూపర్ మార్కెట్’కో లేదా వాక్ – ఇన్ – స్టోర్’కో వెళితే చాలు, ఇంచక్కా ఎవరికీ తెలియకుండా పప్పులు, ఉప్పులతో పాటుగా, రెండు మందు బాటిల్స్ కూడా బ్యాగ్’ లో వేసుకుని వచ్చేయ వచ్చును. ఎంత సౌలభ్యం... వైన్  షాపులకు  వెళ్ళలేని మహిళలు, వృద్ధులు కూడ ఇప్పుడు ఇంచక్కా ఇంటి పక్క షాపుకు వెళ్లి మందు బాటిల్ తెచ్చుకుని ‘ఎంజాయ్’ చేసే సౌలభ్యం మహా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇలా సూపర్ మార్కెట్లు, వాక్-ఇన్ షాపుల్లో వైన్ విక్రయాలను అనుమతించే ప్రతిపాదనను మహారాష్ట్ర మంత్రివర్గం రెండు రోజుల క్రితం ఆమోదించింది. జస్ట్ ఓ రూ. 5000ల రూపాయల లైసెన్స్ ఫీజు కట్టి సూపర్ మార్కెట్లు లేదా వాక్ – ఇన్ – స్టోర్లు మద్యం విక్రయాలు జరుపుకోవచ్చును. అయితే ఇదేదో ప్రభుత్వం ఆదాయం కోసం చేస్తోందని అనుకోకూడదు..ట. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. పండ్ల ఆధారిత వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించాల‌ని ఉద్దేశం కూడా ఉంద‌ని ఆ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు.  అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని, ప్ర‌తిప‌క్ష బీజేపీ త‌ప్పుబ‌ట్టింది. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద్యం వినియోగాన్ని ప్రోత్స‌హిస్తోంద‌ని ఆరోపించింది.“మహారాష్ట్రను మద్య రాష్ట్రంగా మార్చడానికి మేము అనుమతింబోము’’ అని మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ప‌డ్న‌వీస్ హెచ్చరించారు.  అయితే ఇక్కడ మహా రాష్ట్రలో కిరాణ కొట్లలో మందు అమ్మడాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ, తాము అధికారంలో ఉన్న మధ్య  ప్రదేశ్’ అదే చేస్తోంది. మహారాష్ట ప్రభుత్వం రాష్రం మొత్తంలో ప్రవేశ పెట్టిన కొత్త విధానాన్ని నాలుగు ప్రధాన నగరాలకు పరిమితం చేస్తూ,అదే నిర్ణయం తీసుకుంది. ఆ నాలుగు నగరాల్లో ఎంపిక చేసిన సూపర్ మార్కెట్లలో, విమానాశ్రయాలలో  మద్యం విక్రయాలకు  అనుమతి ఇచ్చింది. అంతే కాదు చౌహాన్ సర్కార్ మరో వినూత్న ‘మందడుగు’ కుడా వేసింది. ఇంట్లోనే బార్ పెట్టుకునే మహాదవకాశాన్ని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కల్పించారు. సంవత్సర ఆదాయం కోటి రూపాయలు అంతకు ఎక్కువ ఉన్న కుటుంబాలకు  హోమ్ బార్ లైసెన్స్  జారీ చేయడానికి, చౌహాన్ సర్కార్ అనుమతించింది. మొత్తానికి ... ముందే అనుకున్నట్లుగా ... పాలకపార్టీల లేబుల్స్’తో పని లేకుండా రాష్ట్రాలు, తాగుడు వలన జరుగతున్న అనర్ధాలను పట్టించుకోకుండా మందును ఆదాయ  వనరుగా చూస్తున్నాయి. మందు బాటలో ముందడుగు వేస్తున్నాయి.
తెలంగాణలో మళ్లీ బడిగంట మోగేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈనెల 31 నుంచి అంటే సోమవారం నుంచే పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో జనవరి 31 నుంచి స్కూల్స్ తెరవాలని నిర్ణయించారు. తెలంగాణలో డ్రగ్స్ విషయంలో సీరియస్ గా ఉన్న కేసీఆర్... దాని వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ కు ఎలా అడ్డుకట్ట వేయాలో సుదీర్ఘంగా చర్చించారు. అదే సమయంలో స్కూల్స్ విషయంలోనూ ఓ కీలక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.  అయితే పాఠశాలల్లో కరోనా కట్టడికి అన్ని చర్యలూ తీసుకోవాలని, నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. ఫలితంగా సోమవారం స్కూల్స్ మొదలవుతున్నాయి.  దాదాపు గత రెండేళ్లుగా కరోనా కారణంగా అన్నింటికన్నా ఎక్కువ దెబ్బతిన్నది విద్యా వ్యవస్థే. పిల్లలకు ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠాలు అర్థం కావడం లేదని, ఇక పల్లెల్లో అయితే ఫోన్లు కూడా చాలామందికి అందుబాటులో లేని కారణంగా ఆన్ లైన్ క్లాసులతో పెద్దగా ప్రయోజనం ఏమీ మిగల్లేదు. అటు పేరెంట్స్ కూడా ఆన్ లైన్ క్లాసులు ఆపాలంటూ పలు సందర్భాల్లో వినతిపత్రాలు సమర్పించారు. అయినా కరోనా విజృంభణ రీత్యా స్కూల్స్ ప్రారంభించేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. కేవలం ఫీజుల వసూళ్ల వరకే అనుమతిస్తూ ఆ తరువాత స్కూల్స్ మూసేస్తున్నారన్న అపవాదు కూడా మూట గట్టుకుంది. మరోవైపు పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా సంక్రాంతి సెలవులు పొడిగిస్తారని భావించినా జగన్ మాత్రం ఆ దిశగా  నిర్ణయమేమీ తీసుకోలేదు. దీంతో కేసీఆర్ సర్కారు కూడా స్కూల్స్ ఓపెన్ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది.   
సోము వీర్రాజు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు. ప్లవర్ పార్టీని ఫైర్ పార్టీగా మార్చి.. ఆంధ్రప్రదేశ్‌‌లో అధికారంలోకి తీసుకు రావాలని భావిస్తూ... ఆ దిశగా ముందుకు వెళ్లే క్రమంలో.. నోటికి పని చెప్పి.. అటు అధికార పార్టీ వాళ్ల నోట్లోనే కాదు.. ఇటు సొంత పార్టీ కాషాయ దళంతో కూడా తిట్లు దండకం చదివించుకోగల సత్తా ఉన్న నేత ఈ సోము వీర్రాజు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. సైకిల్ పార్టీ మద్దతుతోనే.. ఎమ్మెల్సీగా గెలిచి.. పెద్దల సభలో అడుగు పెట్టి.. సదరు సభలోనే కాదు.. వరుస ప్రెస్ మీట్ల్ పెట్టి మరీ పసుపు పార్టీపైనే రంకెలేసిన ఘనమైన చరిత్ర గలిగిన నేతగా ఈ సోము వీర్రాజు వాసికెక్కారు. ఆ తర్వాత బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కషాయ పార్టీ అధిష్టానం సోము వీర్రాజుకు పదవి కట్టబెట్టింది. అయితే ఆయన ఏ ముహూర్తాన.. బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చెప్పట్టారో కానీ.. ఎప్పుడు ఏదో కామెంట్ చేసి... సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారీ సోము వీర్రాజు. ఈ నోరున్న నేతతో వేగలేకపోతున్నామంటూ కమలం పార్టీ వారే నెత్తి నోరు బాదుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  గతంలో రాష్ట్రంలో మద్యం రేట్ల గురించి చాలానే మాట్లాడారు ఈ సోము వీర్రాజు. కానీ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. క్వార్టర్ చీప్ లిక్కర్ 70 రూపాయిలకే ఇస్తామని.. ఓ వేళ ప్రభుత్వ ఖజానాలో కాసులు  గలగలమంటే మాత్రం క్వార్టర్ చీప్ లిక్కర్  50 రూపాయిలకే ఇస్తామని.. అంతేకాదు రాష్ట్రంలో కోటి మంది మందుబాబు ఉన్నారని.. తాము అధికారంలోకి వస్తే.. వారందరి భవిష్యత్తు గ్లాసులు గలగల మనేలా.. మూడు పెగ్గులు .. ఆరు క్వార్టర్లుగా మార్చేస్తామంటూ సారాంశాన్ని మొత్తం సోము వీర్రాజు.. సారాయి వీర్రాజు స్టైల్ల్‌లో చెప్పేశారు.  ఈ సారాయి వీర్రాజు గారి  వ్యాఖ్యలు.. నేషనల్ మీడియాలో సైతం వైరల్ కావడంతో.. దేశంలోని విపక్షాలన్నీ.. కాషాయ దళాన్ని టార్గెట్‌గా చేసుకుని..  ఓ రేంజ్‌లో ఓ ఆటాడేసుకున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. తిరుపతి వచ్చి.. అమరావతికి మద్దతు ఇవ్వండి అంటే అప్పటికప్పుడు మెల్కోని వారికి మద్దతు ప్రకటించిన ఈ సోము వీర్రాజు... అలాగే సంక్రాంతి పండగ వేళ గుడివాడ కేసీనోలో గోవా గువ్వుల చిందులు.. దాదాపు 500 కోట్ల రూపాయిల నగదు చేతులు మారాయంటూ తెలుగు దేశం పార్టీ నేతలు రంగంలోకి దిగి రచ్చ రచ్చ చేస్తే.. టీడీపీకీ మొత్తం క్రెడిట్ వెళ్లిపోతుందంటూ ఆగమేఘాల మీద రంగంలోకి దిగిన ఈ సారాయి వీర్రాజు బ్యాచ్‌ను పోలీసులు అడ్డుకుని..  అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. అయితే అలాంటి ఈ సోమ వీర్రాజుకు మైక్ దొరికితే చాలు.. మైకాసురుడు అవతారంలో ఏదేదో మాట్లాడేస్తారని కమలం పార్టీలోని నేతలే చెవులు కొరుకుంటారు. అయితే తాజాగా ఈ సోము వీర్రాజు.. కడపపై ఫోకస్ పెట్టి.. కడప ప్రజలు హత్యలు చేస్తారంటూ.. అలాంటి కడప ప్రాంతానికి ఎయిర్ పోర్టా? అని మీడియా సాక్షిగా ప్రశ్నించారు. దీంతో కడప జిల్లా వాసులకే కాదు.. అధికార పార్టీలోని కీలక నేతలతో సైతం కడుపు మండింది... దాంతో వారు.. సోము వీర్రాజుపై గట్టగానే  అక్షింతలు వేశారు. దీంతో దిగి వచ్చిన సోము వీర్రాజు... తన మాటలను వక్రీకరించారంటూ తనదైన శైలిలో మళ్లీ సన్నాయి నొక్కులు నొక్కారు. అయితే ఈ వ్యాఖ్యలతో కమలం పార్టీకి ఎంత డ్యామేజ్ జరగాలో అంతా అప్పటికే జరిగిపోయిందని.. ఆ పార్టీలోని వారే అంటున్నారు. ఓ వైపు బూతుల మంత్రి కొడాలి నానిపై విరుచుకు పడే ఈ సోము వీర్రాజు... ఇలా మాట్లాడడం ఎంత వరకు సబబు అని అధికార పార్టీ నేతలే కాదు.. కమలం పార్టీ నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు. కామ్ ఉండు.. సోము..  ఏందుకు నేలన పోయేదానిని నెత్తిన రాసుకుంటావంటూ.. అధ్యక్షుల వారికి కమల దళం సూచిస్తోంది. మరీ సోము వీర్రాజు వారు.. కామ్‌గా ఉంటారో లేక.. మళ్లీ సార్రాయి వీర్రాజులా రెచ్చిపోతారో వేచి చూడాలి.  
ఒకప్పుడు దేశంలో సంపన్న రాజకీయ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పేరే వినిపించేంది. ఆ తర్వాత పేదల పార్టీ కమ్యూనిస్ట్ పార్టీల వార్షిక టర్నోవర్ కొంత ఘనంగానే ఉండేదని అంటారు. అయితే ఇప్పుడు దేశ రాజకీయం కొత్త మార్గంలో ముందుకు సాగుతున్న నేపధ్యంలో  ప్రజాదరణ, ఓట్లు సీట్ల లెక్కలు మారినట్లుగానే, ఆదాయ వ్యయం లెక్కలు కూడా మరాయి. మారుతున్నాయి. ఒకప్పుడు ఆదాయంలో అగ్ర స్థానలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పు అప్పుల్లో ఫస్ట్ ప్లేస్’లో ఉంది. దేశాన్ని,మూడింట రెండు వంతుల రాష్ట్రాలను పాలిస్తున్న బీజేపీ, ఆదాయం, ఆస్తులు కూడా అదే రేంజ్’లో పెంచుకుంటోంది. దేశంలోని ఏడు జాతీయ పార్టీల్లో బీజేపీ ఆస్తుల విలువ ఇంచుమించుగా రూ. 5,000 కోట్లకు చేరుకుంది. 2019-20 సంవత్సరానికి సంబంధించి దేశంలోని 7 జాతీయపార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్.. ఏడీఆర్ వెల్లడించింది.ఈ నివేదిక ప్రకారం దేశంలో బీజేపీకి అత్యధికంగా రూ. 4,847.78కోట్ల మేర ఆస్తులున్నట్లు వెల్లడైంది.ఆ తర్వాతి స్థానంలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ నిలిచింది. ఆ పార్టీకి రూ. 698.33కోట్ల ఆస్తులున్నట్లు నివేదికలో వెల్లడైంది. ఇక రూ. 588.16 కోట్ల విలువైన ఆస్తులతో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉంది. జాతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో బీజేపీ వాటా 69.37శాతం ఉన్నట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది. ఫిక్స్డ్ డిపాజిట్లు, రుణాలు, ముందస్తు చెల్లింపులు, పెట్టుబడులు తదితర వివరాల ప్రాతిపదికన ఈ ఆస్తుల విలువ లెక్కగట్టారు. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే, ఉత్తర ప్రదేశ్’ను మూడు నాలుగు సార్లు పాలించిన ములాయం/ అఖిలేష్ యాదవ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఫస్ట్ ప్లేస్’లో ఉంటే, తెలంగాణలో ఉద్యమ పార్టీగా అవతరించి కుటుంబ పార్టీగా ఎదిగిన కేసీఆర్/కేటేఆర్ పార్టీ తెరాస రండవ స్థానంలో ఉంది. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలిచింది. ప్రాంతీయ పార్టీలలో ఫస్ట్ ప్లేస్’లో ఉన్న ఎస్పీకి  రూ.563.47కోట్లు, సెకండ్ ప్లేస్’లో ఉన్న తెరాసకు రూ.301.47 కోట్లు, థర్డ్ ప్లేస్’లో ఉన్న అన్నా డీఎంకేకు రూ 267.61 కోట్ల ఆస్తులున్నట్లు ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. ఆసక్తికరంగా టీడీపీ రూ.188.19 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. వైఎస్సార్‌సీపీ రూ.143.6 కోట్ల విలువైన ఆస్తులతో ఏడో స్థానంలో ఉంది. ఇక అప్పుల విషయానికి వస్తే, జాతీయ పార్టీల్లో రూ. 49.55కోట్ల అప్పుతో కాంగ్రెస్’ ఫస్ట్ ప్లేసులో వుంది. రూ. 11.32 కోట్ల రుణాలతో తృణమూల్ కాంగ్రెస్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ప్రాంతీయ పార్టీల్లో 30.34 కోట్ల అప్పులతో టీడీపీ టాప్ ప్లేస్ లో ఉండగా.. రూ.8.05 కోట్ల రుణాలతో డీఎంకే రెండోస్థానంలో ఉంది.తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులలో టీఆర్ఎస్ పార్టీ, అప్పులలో టీడీపీ టాప్‌లో ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో  హస్తం పార్టీకి ఐదింట ఒక్క వేలూ చిక్కకుండా చేసేందుకు, బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఓ వంక ‘జీ’ 23 పేరిట పార్టీ సీనియర్ నాయకులు పెట్టిన వేరు కుంపటితో వేగలేక పార్టీ అధిష్టానం తల పట్టుకుంటే, మరో వంక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీ 23 కీలక నేత గులాం నబీ ఆజాద్’కు పద్మభూషణ్ ప్రకటించి, కాంగ్రెస్ పార్టీలో మరో కుంపటి రాజేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటన వెలువడి నాలుగు రోజులు అయినా ఇంతవరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేదా పార్టీ ‘అగ్ర’ నేతలు రాహుల గాంధీ, ప్రియాంక వాద్రా కానీ ..ఊ.. అనలేదు ..ఊహూ అనలేదు. పెదవి విప్పి  స్పందించ లేదు.కానీ,పార్టీ నాయకులు ఆజాద్ పద్మ పురస్కారానికి అటూ ఇటుగా చీలిపోయారు. నిజమే కావచ్చు బీజేపీ కాంగ్రెస్’లో చిచ్చుపెట్టేందుకే, ఆజాద్’కు పద్మభూషణ్ ప్రకటించి ఉండవచ్చును. అయినా, కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆజాద్’ ను అభినందిస్తూ ఒక ప్రకటన చేస్తే, రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేస్తే, కమల దళం వ్యూహం కొట్టుకు పోయేది. కానీ, కాంగ్రెస్ నాయకత్వం ఎందుకనో .. ఆమాత్రం విజ్ఞత చూపలేక పోయింది. పార్టీలో ఓపెన్ వార్’కు అధిష్టానమే అవకాశం కల్పిచింది. ఈ ఓపెన్ వార్ ప్రభావం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై ఉంటుందని అంటున్నారు. అదలా ఉంటే, ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో  పోలింగ్ తేదీలు దగ్గరవుతున్నకొద్దీ, సీనియర్ నాయకులు పార్టీని వదిలి పోతున్నారు.ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పార్టీకి.. సీనియర్లు హ్యాండివ్వడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. అది కూడా గాంధీ కుటుంబానికి విధేయులు అనుకున్నవారు వరస పెట్టివెళ్లిపోతుంటే అధినాయకత్వం కళ్ళప్పగించి చూడడం తప్ప ఏమీ చేయలేని దుస్థితి, కాంగ్రెస్ శ్రేణులను కలవర పాటుకు గురిచేస్తోంది.  ఎప్పుడోనే పార్టీ వదిలి పోయిన మాధవ రావు సింధియా.. జితిన్ ప్రసాద..ఇత్యాదులు పక్కన పెట్టి తాజా ఫిరాయింపులను చూసినా, యూపీలో కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్, 35 ఏళ్ల పార్టీ అనుబంధాన్ని తెంచుకుని, చేయి వదిలి కమలం గూటిని చేరారు. అంతకు ముందే, యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నినాదం, ‘లడ్‌కీ హూ.. లడ్ సక్‌తీ హూ (నేను బాలికను.. పోరాడగలను) అంటూ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తూ జనం దృష్టిని ఆకర్షించిన  పోస్టర్ గర్ల్ ప్రియాంక మౌర్య కాంగ్రెస్’కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. గోవాలో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణే పోటీ నుంచి తప్పుకున్నారు. వరసగా 11 సార్లు ఆయన విజయ కేతనం ఎగరేసిన పోరియేం నియోజక వర్గం నుంచి ఆయన కోడలు దివ్య విశ్వజిత్ రాణే  బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగడంతో ఆయన పోటీ నుంచి తప్పు కున్నారు. కాంగ్రెస్ ఖాతాలో ఖాయం ఆనుకున్న సీటు కమలం ఖాతాలోకి చేరిపోయింది.  నిజానికి ఆయన కుమారుడు విశ్వజిత్ రాణే 2017 ఎన్న్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి బీజేపే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.  ఈ ఎన్నికల్లో ఆయన వాల్పోయీ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.  ఉత్తరాఖండ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ్’ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన బీజేపీలో చేరారు. ఇక పంజాబ్ విషయం చెప్పనే అక్కరలేదు, ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో తేల్చమంటూ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దూ, రాహుల్ గాంధీని బహిరంగంగా నిల దీశారు. జలంధర్‌లో వర్చువల్‌ ఎన్నికల ర్యాలీలో సిద్దూ ... రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాలను అమలు చేసే,’చెహారా’  (మిఖం)ఏదో చెప్పాలని, లేదంటే ఎన్నికలలో గెలవడం కష్టమని అన్నారు.  ఈ విధంగా 2024 లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్’గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు ఎటు దారి తీస్తాయో అర్థం కాకుండా ఉందని పరిశీలకులు అంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిల్వర్ స్క్రీన్ పై విజువల్‌ వండర్స్‌ క్రియేట్‌ చేశారు ఆయన. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో RC15 తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన వారసులు సినీ పరిశ్రమలో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శంకర్‌ కూతురు అదితి శంకర్‌.. కార్తీ సరసన ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో శంకర్‌ కొడుకు అర్జిత్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. 2004లో శంకర్‌ నిర్మించిన 'కాదల్' సినిమా తమిళనాట సంచలనం సృష్టించింది. భరత్, సంధ్య జంటగా శక్తివేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ 'ప్రేమిస్తే' పేరుతో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందని తెలుస్తోంది. శంకర్ నిర్మించనున్న ఈ సీక్వెల్ మూవీతోనే అర్జిత్‌ హీరోగా పరిచయం కానున్నాడని సమాచారం. మరి శంకర్ వారసులు వెండితెరపై ఏ స్థాయిలో సత్తా చాటుతారో చూడాలి.
గ‌త నెల‌లో విడుద‌లైన `పుష్ప - ద రైజ్`తో కెరీర్ హయ్య‌స్ట్ గ్రాస‌ర్ చూశాడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్. ఇక కొత్త సంవ‌త్స‌రంలోనూ త‌న స్వ‌రాల‌తో ఎంట‌ర్టైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్ప‌టికే జ‌న‌వ‌రిలో `రౌడీ బాయ్స్`, `గుడ్ ల‌క్ స‌ఖి` చిత్రాల‌తో సంద‌డి చేసిన డీఎస్పీ.. ఫిబ్ర‌వరిలోనూ రెండు సినిమాల పాటే పాడబోతున్నాడు. ఆ నెల‌లోనూ `ఖిలాడి`, `ఆడ‌వాళ్ళు మీకు జోహ‌ర్లు` చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు దేవి శ్రీ ప్ర‌సాద్. Also Read: తార‌క్ తో మ‌రోసారి డీఎస్పీ!? ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి మాసాల్లో దేవి శ్రీ నుంచి వ‌చ్చిన‌, వ‌స్తున్న చిత్రాల‌న్నీ కూడా రెండు వారాల వ్య‌వ‌ధిలో థియేట‌ర్ బాట ప‌డుతున్నాయి. జ‌న‌వ‌రి 14న `రౌడీ బాయ్స్` రిలీజ్ కాగా.. ఆపై రెండు వారాల త‌రువాత అంటే జ‌న‌వ‌రి 28న `గుడ్ ల‌క్ స‌ఖి` వ‌చ్చింది. క‌ట్ చేస్తే.. మ‌రో రెండు వారాల అనంత‌రం అంటే ఫిబ్ర‌వ‌రి 11న `ఖిలాడి` రాబోతోంది. ఆపై మ‌రో రెండు వారాల త‌రువాత అంటే ఫిబ్ర‌వ‌రి 25న `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు` తెర‌పైకి రాబోతోంది. మొత్తంగా.. రెండు వారాలకో సినిమా బాట‌లో రాక్ స్టార్ ముందుకు సాగుతున్నాడ‌న్న‌మాట‌. Also Read: నానితో సేమ్ టు సేమ్!  మ‌రి.. జ‌న‌వ‌రిలో వ‌చ్చిన `రౌడీ బాయ్స్`, `గుడ్ ల‌క్ స‌ఖి`తో హిట్స్ కొట్ట‌లేక‌పోయిన డీఎస్పీ.. ఫిబ్ర‌వ‌రిలో రానున్న `ఖిలాడి`, `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు`తోనైనా బాక్సాఫీస్ స‌క్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
`స‌రిలేరు నీకెవ్వ‌రు`, `భీష్మ‌`, `పుష్ప - ద రైజ్` చిత్రాల‌తో తెలుగునాట హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్న‌. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి చేతిలో తెలుగు, హిందీ భాష‌ల్లో క‌లుపుకుని నాలుగు సినిమాలున్నాయి. కాగా, వాటిలో ఒక‌టైన `ఆడవాళ్ళు మీకు జోహార్లు`.. ఫిబ్ర‌వ‌రి 25న ముందుగా థియేట‌ర్స్ లో ఎంట‌ర్టైన్ చేయ‌నుంది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. టాలీవుడ్ లో ఫిబ్ర‌వ‌రి నెల ర‌ష్మిక‌కి ఎంతో సెంటిమెంట్. ఎందుకంటే.. త‌ను న‌టించిన మొద‌టి తెలుగు సినిమా `ఛ‌లో` 2018లో ఇదే ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. అంతేకాదు.. 2020లో ఇదే ఫిబ్ర‌వ‌రి మాసంలో జ‌నం ముందు నిలిచిన `భీష్మ‌` కూడా క‌మ‌ర్షియ‌ల్ గా మెప్పించింది. ఇలా.. రెండు సార్లు తెలుగు సినిమాల ప‌రంగా ఫిబ్ర‌వ‌రి నెల ర‌ష్మిక‌కి భ‌లే అచ్చొచ్చింది. ఈ నేప‌థ్యంలో.. ముచ్చ‌ట‌గా మూడోసారి ఫిబ్ర‌వ‌రి నెల‌లో వ‌స్తున్న స్ట్ర‌యిట్ తెలుగు పిక్చ‌ర్ `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు` కూడా విజ‌యం సాధిస్తే.. ర‌ష్మిక సెంటిమెంట్ కొన‌సాగి టాలీవుడ్ లో ఆ నెల ప‌రంగా త‌న‌కి హ్యాట్రిక్ హిట్ క్రెడిట్ అయిన‌ట్టే. మ‌రి.. ఫిబ్ర‌వ‌రి నెల‌లో రెండేళ్ళ‌కోసారి సంద‌డి చేస్తూ వ‌స్తున్న ర‌ష్మిక‌.. `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు`తో ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి. కాగా, శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్న `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు`ని తిరుమ‌ల కిశోర్ డైరెక్ట్ చేస్తున్నాడు.
నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకతవరంలో రూపొందిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. డిసెంబర్ 24 న థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా.. ఇటీవల ఓటీటీలో విడుదలై రికార్డు వ్యూస్ తో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాపై సెలబ్రిటీలు కూడా ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి మధుబాల కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తాను సాయి పల్లవికి బిగ్గెస్ట్ ఫ్యాన్ ని అని చెప్పారు. తాజాగా 'శ్యామ్ సింగ రాయ్' సినిమా చూశానని చెప్పిన మధుబాల.. తాను రీసెంట్ టైంలో చూసిన అద్భుతమైన సినిమా ఇది అని కొనియాడారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను సాయి పల్లవి బిగ్గెస్ట్ ఫ్యాన్ ని అని ఆ వీడియోలో తెలిపారు. అందంగా ఉంటుంది, రియలిస్టిక్ గా చేస్తుంది, మంచి డ్యాన్సర్ అంటూ ప్రశంసించారు. అలాగే నాని అద్భుతంగా నటించాడని, 'శ్యామ్ సింగ రాయ్' లవ్లీ మూవీ అంటూ మూవీ టీమ్ కి మధుబాల విషెస్ తెలిపారు. మధుబాల తన ఫ్యాన్ అని చెబుతూ, తనపై ప్రశంసలు కురిపించడంపై సాయి పల్లవి సంతోషం వ్యక్తం చేశారు. మీ మాటలు ప్రేమతో కూడిన కౌగిలిలా ఉన్నాయంటూ, మధుబాలకు ధన్యవాదాలు తెలుపుతూ సాయి పల్లవి ట్వీట్ చేశారు.
  చిరంజీవి ఎంత‌టి మెగాస్టార్ అయిన ఒక అమ్మ‌కు కొడుకే! వృత్తిపై ఎంత‌టి అంకిత‌భావం ప్ర‌ద‌ర్శిస్తారో, కుటుంబానికీ అంత‌టి ప్రాముఖ్యం ఇస్తారాయ‌న‌. ఇక అమ్మానాన్న‌ల‌పై ఆయ‌న చూపే ప్రేమ‌, భ‌క్తి భావాలు ఎలాంటివో ఆయ‌న స‌న్నిహితులంద‌రికీ తెలుసు. శ‌నివారం, జ‌న‌వ‌రి 29 ఆయ‌న మాతృమూర్తి అంజ‌నాదేవి జ‌న్మ‌దినం. మామూలుగా అయితే ఆమె పుట్టిన‌రోజు వేడుక‌లు ద‌గ్గ‌రుండి నిర్వ‌హించే మెగాస్టార్‌.. ఈసారి ఆ ప‌ని చేయ‌లేక‌పోయారు. కార‌ణం.. ఆయ‌న కొవిడ్‌తో బాధ‌ప‌డుతుండ‌టం. దీంతో ఆయ‌న బాధ చెప్ప‌రానిది. Also read: సునీల్‌శెట్టి ఇంట్లో ఈ ఏడాది రెండు పెళ్లిళ్లు! అలాగ‌ని ఆయ‌న కామ్‌గా ఉండిపోలేదు. సోష‌ల్ మీడియా ద్వారా అమ్మ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అమ్మ‌తో త‌ను, త‌న భార్య సురేఖ క‌లిసున్న ఒక ఫొటోను త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఆయ‌న, "అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు. క్వారెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ అభినందనలతో .... శంకరబాబు" అని ఆయ‌న రాసుకొచ్చారు. Also read: 'సారంగ దరియా' పాటకు మరింత అందం తీసుకొచ్చిన 'లయ'! చివ‌ర‌లో 'చిరంజీవి' అని కాకుండా అమ్మ త‌న‌ను ఏ పేరుతో పిలుస్తుందో ఆ పేరు 'శంక‌ర‌బాబు' అని త‌న పేరును ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న అస‌లు పేరు శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ అనే విష‌యం తెలిసిందే. ఇక చిరంజీవి తండ్రి వెంక‌ట్రావు 2007 డిసెంబ‌ర్‌లో మ‌ర‌ణించారు. అప్ప‌ట్నుంచీ అమ్మ అంజ‌నాదేవిని కంటికి రెప్ప‌లా చూసుకుంటూ వ‌స్తున్నారు మెగా బ్ర‌ద‌ర్స్‌.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలంగాణకు చెందిన దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ ప‌ద్మ‌శ్రీ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. అరుదైన 12 మెట్ల కిన్నెర‌ వాయిద్య‌కారునిగా పేరుపొందిన ఆయన ఇటీవ‌ల 'భీమ్లా నాయ‌క్‌' సినిమాలో పాట పాడ‌టం ద్వారా పాపులారిటీ ద‌క్కించుకున్నారు. తాజాగా మొగులయ్యను తెలంగాణ సీఎం కేసీఆర్ ఘనంగా సత్కరించి.. కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.  దర్శనం మొగులయ్య శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసారు. ఈ సందర్భంగా మొగులయ్యను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగులయ్య అభినందనీయుడన్నారు. మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. పద్మశ్రీ మొగులయ్యకు హైదరాబాద్ లో నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.  దర్శనం మొగులయ్యమొగిలయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు. ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శలను ఇచ్చాడు. మొగులయ్య జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉంది. మొగులయ్య నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల గ్రామంలో జన్మించారు. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీ మురికివాడలో కుటుంబంతో కలిసి జీవ‌నం సాగిస్తున్నారు. మొగులయ్య తొలిసారిగా 'భీమ్లా నాయక్‌' సినిమాలో "సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు" అనే పాట ద్వారా సినీరంగంలోకి వచ్చి, ఆ పాటతో మంచి గుర్తింపు అందుకున్నారు.
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. సీనియర్ నటీమణులు రాధిక, ఖుష్బూ, ఊర్వశి కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్స్ లో విడుదల కానుంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధానపాత్రల్లో నటిస్తున్న 'భీమ్లా నాయక్' కూడా ఫిబ్రవరి 25 నే విడుదల కానుంది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన చిరంజీవి 'ఆచార్య' సహా పలు సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో 'భీమ్లా నాయక్' విడుదలపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మూవీ టీమ్ నుంచి మాత్రం వాయిదా ప్రకటన రాలేదు. మరోవైపు ఫిబ్రవరి 24 నుంచి యూఎస్ ప్రీమియర్స్ అంటూ వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఫిబ్రవరి 25న విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది. 'భీమ్లా నాయక్' వాయిదా పడుతుందన్న క్లారిటీతో మేకర్స్ ఈ ప్రకటన చేశారో, లేక సినిమాపై నమ్మకంతో అదే తేదికి విడుదల చేస్తున్నారో తెలియాల్సి ఉంది. గతంలో 'శతమానంభవతి', 'ఎక్స్ ప్రెస్ రాజా' వంటి సినిమాలను పెద్ద సినిమాలకు పోటీగా విడుదల చేసి శర్వానంద్ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మరోసారి శర్వానంద్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. ఈ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
'స్వయంవరం' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన లయ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'మనోహరం', 'ప్రేమించు' వంటి సినిమాలతో ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకున్న ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలలో నటించి సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హోస్ట్ గా బుల్లితెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు యూట్యూబ్ ప్రేక్షకుకులను కూడా అలరించడానికి సిద్ధమయ్యారు. యాక్ట్రెస్ లయ టాకీస్(actress laya talkies) పేరుతో యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు లయ. మొదటగా 'సారంగ దరియా' కవర్ సాంగ్ తో ఆమె ప్రేక్షకులను పలకరించారు. 'లవ్ స్టోరి' సినిమాలోని ఈ సాంగ్ ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే. ఆ సూపర్ హిట్ సాంగ్ ని రీక్రియేట్ చేస్తూ గ్రాండ్ గా యూట్యూబ్ ఎంట్రీ ఇచ్చారు లయ. తన అందం, నాట్యంతో 'సారంగ దరియా' పాటకు ఆమె మరింత అందం తీసుకొచ్చారు. ఈ కవర్ సాంగ్ కి కొరియోగ్రఫీ కూడా లయే చేయడం విశేషం. ఆమె వేసిన ప్రతి స్టెప్ ఆకట్టుకుంటోంది.  'యాక్ట్రెస్ లయ టాకీస్' లో తాజాగా విడుదలైన 'సారంగ దరియా' కవర్ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇలాగే మంచి కంటెంట్ తో రెగ్యులర్ గా యూట్యూబ్ ప్రేక్షకులను అలరించడానికి లయ సిద్ధమయ్యారని తెలుస్తోంది. నటిగా వెండితెరపై, హోస్ట్ గా బుల్లితెరపై తనమైన ముద్ర వేసిన లయ యూట్యూబ్ లోనూ అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని మొదటి వీడియోతోనే చెప్పేశారు.
వైవిధ్యానికి పెద్ద‌పీట వేసే ద‌ర్శ‌కుల్లో క్రిష్ ఒక‌రు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా తెలుగునాట త‌న‌కంటూ ప్ర‌త్యేక అభిమాన‌గ‌ణాన్ని సొంతం చేసుకున్నారీ అగ్ర ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉంటే.. ఐదేళ్ళ క్రితం విడుద‌లైన `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి` త‌రువాత టాలీవుడ్ లో మ‌ళ్ళీ మ‌రో స‌క్సెస్ ఫుల్ మూవీని త‌న ఖాతాలో వేసుకోలేక‌పోతున్నారు క్రిష్. ఈ నేప‌థ్యంలో.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్ లో తీస్తున్న పిరియ‌డ్ డ్రామా `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`పైనే ఆశ‌లు పెట్టుకున్నారాయ‌న‌. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లోనే తెర‌పైకి రానుంది. Also Read: చిరంజీవి ప్లేస్ లో రామ్ చరణ్! కాగా, మెగా కాంపౌండ్ లో క్రిష్ కి ఇది నాలుగో సినిమా. గ‌తంలో ఆయ‌న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో `వేదం`, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో `కంచె`, మెగా యంగ్ సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్ తో `కొండ పొలం` రూపొందించారు. ఈ సినిమాల‌న్నీ కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందినా..  క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ గా నిలవ‌లేక‌పోయాయి. ఈ క్ర‌మంలో.. ప‌వ‌న్ తో చేస్తున్న `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` అయినా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందేమో చూడాలి. Also Read: కొండా జీవితం మీద ఐదారు సినిమాలు తీయవచ్చు `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`లో ప‌వ‌న్ కి జోడీగా `ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుండ‌గా.. స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీలు అందిస్తున్నారు.  
యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కి అచ్చొచ్చిన సంగీత ద‌ర్శ‌కుల్లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఒక‌రు. `నా అల్లుడు` (2005), `రాఖీ` (2006), `అదుర్స్` (2010), `ఊస‌రవెల్లి` (2011), `నాన్న‌కు ప్రేమ‌తో` (2016), `జ‌న‌తా గ్యారేజ్` (2016), `జై ల‌వ కుశ‌` (2017).. ఇలా వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమాల‌న్నీ కూడా మ్యూజిక‌ల్ గా మెప్పించాయి. వీటిలో `అదుర్స్`, `నాన్న‌కు ప్రేమ‌తో`, `జ‌న‌తా గ్యారేజ్`, `జై ల‌వ కుశ‌` అయితే క‌మ‌ర్షియ‌ల్ గానూ రాణించాయి. Also Read: హిమ‌జ‌కు టెన్త్ క్లాస్‌లో ద‌స‌రా రోజు ప్ర‌పోజ్ చేసిన అబ్బాయి! ఇదిలా ఉంటే.. స్వ‌ల్ప విరామం అనంత‌రం తార‌క్, డీఎస్పీ కాంబోలో మ‌రో మూవీ రాబోతోంద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ఉప్పెన‌` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేసిన బుచ్చిబాబు సానా.. త‌న రెండో సినిమాని ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విజ‌య‌నగ‌రం నేప‌థ్యంలో సాగుతుంద‌ని స‌మాచారం. కాగా, `ఉప్పెన‌` చిత్రానికి చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్ ఇచ్చిన దేవిశ్రీ‌నే ఈ మూవీకి కూడా సంగీత‌మందించ‌బోతున్న‌ట్లు బ‌జ్. త్వ‌ర‌లోనే తార‌క్ - బుచ్చిబాబు సానా కాంబో మూవీపైనా, అందులో డీఎస్పీ ఎంట్రీపైనా క్లారిటీ రానున్న‌ది. 
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ నెల 9వ తేదీన మొదలైన పోలింగ్, ఆదివారం జరిగిన నాల్గవ విడత పోలింగ్ తో ముగిసింది. ఇంచుమించుగా సంవత్సరంపాటు సాగిన పంచయతీ వివాదం చివరాఖరుకు ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్లుగా మొత్తం 10,890 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగాయి.   ఈ ఎన్నికలలో ఎవరు గెలిచారు,ఎవరు ఓడిపోయారు అనే విషయాన్నిపక్కన పెడితే  కొవిడ్ భయాన్ని, ఇతరత్రా ఎదురైన సమస్యలను పక్కన పెట్టి, గ్రామీణ ఓటర్లు, ప్రజాస్వామ్య స్పూర్తిని పుష్కలంగా కురిపించారు. నాలుగు దశల్లో పోలింగ్ జరిగితే, ప్రతి దశలోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్’లో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే 80.14 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క విజయనగరం జిల్లా మినహా మరే జిల్లాలోనూ పోలింగ్ 70 శాతానికి తగ్గలేదు.ఇది ఒక విధంగా, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు బద్దకించే, చదువుకున్నాళ్ళకు, మంచి  గుణ పాఠం.  పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, జెండాల ప్రమేయం ఉండదు.. ఉండ కూడదు. అయినా అన్నిరాజకీయ పార్టీలు పంచాయతీ పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు ఆపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమైన అధికార పార్టీ గెలిచినాళ్ళు అందరూ మావాళ్ళు అంటూ .. గెలుపు గ్రాఫ్ ను పైపైకి పట్టుకు పోయింది. అలాగని మెజారిటీ పంచాయతీలను అధికార పార్టీమద్దతుదారులు గెలవలేదని కాదు. అధికార పార్టీ మద్దతుదారులే అధిక పంచయతీలలో జెండా ఎగరేశారు. అందులో సందేహంలేదు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా కుప్పంలో ఓటమి లాంటి కొన్ని గట్టి ఎదురుదెబ్బలు తిన్నా, ప్రధాన పతిపక్ష హోదాను నిలుపుకుంది.  తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి అధికార తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ, ఏపీలోనూ  తెలుగు దేశం పార్టీని ప్రధాన ప్రత్యర్ధి స్థానం నుంచి పక్కకు నెట్టాలనే ప్రయత్నం చేసింది కానీ, ఫలితం దక్కలేదు. చంద్రబాబు నాయకత్వం, తెలుగు దేశం పార్టీకి ఉన్న సంస్థాగత బలం ముందు బీజేపీ వ్యూహాలు ఫలించలేదు, ఒకవిధంగా బెజేపీ మిత్రపక్షం, జనసేన కొంతలో కొంత మెరుగైన ఫలితాలు సాధించింది.  అయితే ఈ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో పార్టీల బలాబలాకు నిదర్శనమా అంటే కాదు. పంచాయతీ ఎన్నికలు పక్కా లోకల్ ఎన్నికలు, పైగా పార్టీల పాత్రా, ప్రమేయం ఏ మాత్రం ఉండని ఎన్నికలు. సో .. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల బలాబలాలకు ప్రామాణికం కాదు. వచ్చే నెల 10 తేదీన జరిగే నగర పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలు, పార్టీ గుర్తులపై జరుగుతాయి. సో ..వచ్చే నెల 14 వరకు ఆగితే, పురపాలక సంఘాల ఎన్నికలఫలితాలు వస్తాయి. పార్టీల బలాబలాలు, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం స్పష్ట మవుతుంది.  అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబదించినంతవరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరైనా అభినందించక తప్పదు. కోర్టు చిక్కులు, ప్రభుత్వ సహాయ నిరాకరణ, నిధుల కొరత, సమయం తక్కువ కావడం ఇలా అనేక అవరోధాలు ఎదురైనా, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్,  స్థితప్రజ్ఞత చూపారు. అందుకు ఆయన్ని, రాజకీయ పార్టీలు ఎంతగా రచ్చచేసినా,పవిత్ర హక్కును అంతే పవిత్రంగా  పవిత్రంగా వినియోగించుకున్న ఓటర్లను అభినందించక తప్పదు.     అయినా  ఈ ఎన్నికలలో గత 2013పంచాయతీ ఎన్నికల్లో కంటే ఏకాగ్రీవలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాలలో కలిపి, 1,835 గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయితే, ఈ ఎన్నికల్లో 2,197 గ్రామపంచాయతీలు ఏకాగ్రీవ మయ్యాయి.  సజావుగా, సక్రమంగా ఏకాగ్రీవాలు జరిగితే అది అభినందనీయమే, అయినా, ప్రలోభాలకు గురిచేసి సాగించిన బలవంతపు ఏకాగ్రీవాలే ఎక్కువకావడం ... అభ్యతరకరమే.  
అనగనగా ఓ మధ్యతరగతి ఉద్యోగి. అతను రోజూ తన కార్యాలయానికి వెళ్తూ వస్తూ దారిలో కనిపించే విశేషాలను గమనిస్తూ ఉండేవాడు. అంతా బాగానే ఉండేది కానీ, దారి మధ్యలో కనిపించే ఆ రాజభవనాన్ని చూడగానే ఉద్యోగి మనసు కలుక్కుమనేది. ‘ఆహా! హాయిగా ఆ రాజకుటుంబంలో పుట్టినా బాగుండేది, ఎలాంటి కష్టమూ లేకుండా పట్టుపరుపుల మీద నుంచే అష్టైశ్వార్యాలూ అనుభవించవచ్చు’ అంటూ తెగ ఈర్ష్యపడిపోయేవాడు ఉద్యోగి. రాజకుటుంబం సంగతేమో కానీ ఈ ఉద్యోగిని చూసి అసూయపడేవారు కూడా లేకపోలేదు. రోజూ ఉదయాన్నే ఠంచనుగా ఉద్యోగి గొడుగుని ఊపుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక పళ్ల దుకాణం వాడు అతణ్నే గమనిస్తూ ఉండేవాడు. ‘ఛీ వెధవ బతుకు! చిన్నప్పుడు మా నాన్న మాట విని బుద్ధిగా చదువుకుని ఉంటే హాయిగా ఆ ఉద్యోగిలాగా ఉండేవాడిని కదా! ఉద్యోగం ఉంటే దర్జాగా బతకవచ్చు’ అనుకునేవాడు దుకాణదారుడు.  ఇదిలా ఉండగా ఉద్యోగికి ఓసారి అరుదైన అవకాశం దక్కింది. కార్యాలయం తరఫున యువరాజుని కలిసి కొన్ని సంతకాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ మాట వినగానే ఉద్యోగి ఎగిరి గంతేశాడు. ‘తను ఎప్పటికీ ఆ భోగాలను అనుభవించలేడు. కనీసం వాటిని ఒక రోజు పాటు దగ్గరగా చూసే అవకాశం వచ్చింది కదా!’ అనుకున్నాడు. రాజభవనంలో తన సమయం ఎలా గడవబోతోందో తెగ ఊహించుకోసాగాడు ఉద్యోగి. అతని ఊహలతో పని లేకుండా ఆ రోజు రానే వచ్చింది. తనకున్న వాటిలో బాగున్న దుస్తులను వేసుకుని, తలని ఒకటికి పదిసార్లు దువ్వుకుని రాజభవనానికి బయల్దేరాడు ఉద్యోగి. ఉద్యోగి రాక గురించి వినగానే యువరాజుగారు నేరుగా అతణ్ని తన మందిరానికి పంపించమన్నారు. యువరాజుగారు పట్టుపరుపు మీద పడుకునో, అలంకరించుకుంటూనో ఉంటారనుకుంటూ బెరుకుగా ఆ గదిలోకి అడుగుపెట్టిన ఉద్యోగికి ఆయన కిటికీ దగ్గర నిల్చొని కనిపించారు. ‘యువరాజా! నేను మీ సంతకాల కోసం వచ్చాను’ అని ఉద్యోగి ఒకటికి రెండుసార్లు చెప్పినా యువరాజుగారు వినిపించుకోలేదు. ఇక లాభం లేదని ఉద్యోగి ఆయనకు దగ్గరగా వెళ్లి చూస్తే ఏముంది… యువరాజుగారు తీక్షణంగా ఆ పళ్లు అమ్ముకునేవాడినే చూస్తున్నారు. ‘యువరాజా! అతనేమన్నా అపచారం చేశాడా? అంత తీక్షణంగా చూస్తున్నారు?’ అంటూ కాస్త చొరవగా అడిగాడు ఉద్యోగి.  ‘అపచారమా పాడా! అతణ్ని చూసినప్పుడల్లా నాకు మహా అసూయగా ఉంటుంది. హాయిగా ఏ రోజుకారోజు కాయకష్టం చేసకుంటూ, వచ్చినదానితో తృప్తిగా బతుకుతూ, భవిష్యత్తు గురించి ఎలాంటి బాధా లేకుండా ఉండే అతని జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో కదా! కావాలంటే దుకాణాన్ని తీసి ఉంచుతాడు, లేకపోతే మధ్యలోనే కట్టేసి తన భార్యాపిల్లలతో కలిసి షికారుకి వెళ్లిపోతాడు. అంత స్వేచ్ఛగా, సాదాసీదాగా జీవించడంలో ఉన్న ఆనందం బందిఖానాలాంటి ఈ రాజభవనంలో ఎక్కడ ఉంటుంది,’ అంటూ నిట్టూర్చారు యువరాజులవారు. యువరాజులవారి మాటలు విన్న ఉద్యోగికి ఏదో కొత్త విషయం బోధపడింది. సుఖానికీ, సంతోషానికీ ఉన్న వ్యత్యాసం తెలిసి వచ్చింది. మరి అదే విషయం దుకాణదారుడుకి ఎప్పుడు తెలిసివస్తుందో!
ఒక్క చోట కుదురుగా ఉండాలి అంటే కొందరికి మహా బద్దకం. దానికి తగ్గట్టు ఇల్లు, ఉద్యోగం, ఒత్తిడులు వీటి నుండి బయటపడటానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాటిలో చదవడం, సంగీతం, వివిధ రకాల విభిన్న ప్రయత్నాలు, ట్రెక్కింగ్ ఇంకా కొందరు డాన్స్, యోగ, ధ్యానం ఇలాంటివి అన్ని స్ట్రెస్ బస్టర్ గా భావిస్తూ వుంటారు. అలాంటి వాటిలో ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ అంశం ట్రావెలింగ్. వివిధ ప్రాంతాలను దర్శించడం వల్ల విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు తెలుసుకోవడమే కాకుండా ప్రకృతికి దగ్గరగా ఉండేందుకు కూడా ఎంతో అవకాశం ఉంటుంది. కొత్తదనాన్ని కోరుకునే వాళ్లకు ఇది ఎంతో గొప్పగా సహాయపడుతుంది. ప్రాచీన కట్టడాలు, ప్రత్యేకత సంతరించుకున్న ప్రాంతాలు, సహజత్వాన్ని నిలుపుకున్న ప్రదేశాలు, నీటి వనరులు, పచ్చని చెట్లు, జంతు సంపద సమృద్ధిగా ఉన్న చోట్లకు వెళ్ళడానికి అందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఇక ఎంతోమంది ప్రసిద్ధ దైవ క్షేత్రాల దర్శనం పేరిట కూడా ఎన్నో కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూ ఉంటారు. ఇలాంటి చోట్లకు వెళ్ళొస్తే కొత్త ఊపిరి దొరికినట్టు అవుతుంది. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో గొప్ప గొప్ప ప్రాంతాలు ఉనికిని కోల్పోయే దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా సహజత్వం నింపుకున్న ప్రకృతీ నిలయమైన ప్రదేశాలు వాటి సహజత్వాన్ని కోల్పోతున్నాయి.  ఇదంతా ఒకటైతే ఈమధ్య కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇలా విహరించే పక్షులకు బంధనాలు వేసాయని చెప్పవచ్చు.  కరోనా మొదలయినప్పటి నుండి ఇంటి పట్టున ఉండటం వల్ల ఎంతోమంది ఒత్తిడిలో సతమతం అవుతున్నారు. రెక్కలు కట్తుకుని స్వేచ్ఛగా వీధుల్లోనూ, విహారాల్లోనూ మునిగిపోయే అలవాటున్న అలాంటి వాళ్లకు సంకెళ్లతో బంధించినట్టు వర్క్ ఫ్రొం హోమ్ లు ఇవ్వడం ఇంకా దూర ప్రయాణాలు విరమించుకోమని నిబంధనలు పెట్టడం ఇలాంటి వల్ల పక్షులను పంజరాల్లో బంధించినట్టే ఉంది. ఇలాంటి వాళ్లకు కాస్తో కూస్తో ఒత్తిడిని తగ్గించే మార్గాలు చుట్టూనే ఉంటాయి వాటిని కాస్త అనుసరిస్తే కొంచమైనా మనసుకు హాయిగా ఉంది. ఆహ్లాదం అనడం ఉదయం!! ఉదయకాలం లేలేత ఎండలు మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. వీలున్నంత స్థలమో, దగ్గరలో ఉన్న పార్కులో, లేక ఇంటి మేడ ఇలా ప్రాంతం ఏదైనా ఉదయం లేత ఎండను ఆస్వాదిస్తూ అభిరుచికి  తగ్గట్టు వ్యాయామం, ధ్యానం, ఏరోబిక్స్ లేదా నడక ఇలాంటివి  ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి.  కాబట్టి రోజును ఇలా మొదలుపెడితే రోజు మొత్తం తగినంత ఉత్సాహంగా ఉండచ్చు. ఒత్తిడిని దరిదాపులకు రానీయకుండా ఉంటుంది. మొక్కల పెంపకం!! ఎంతో గొప్ప అలవాటు. రోజులో వీలున్నపుడు కొద్దిసేపు మొక్కల దగ్గర గడిపితే అది ఎంతో గొప్ప ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆ వైబ్రేషన్ మనిషిని రోజు మొత్తం పాజిటివ్ గా ఉండేలా చేస్తుంది. పెంపుడు జంతువులతో గడపడం!! పెంపుడు జంతువులకు మించి గొప్ప స్నేహితులు ఉండరని అనిపిస్తుంది. అవి చూపించే ప్రేమ, ఆప్యాయత, విశ్వాసం మనుషుల దగ్గర కూడా దొరకవు. కాబట్టి వాటితో గడపడం వల్ల ఒత్తిడి సులువుగా దూరమవుతుంది. పుస్తకపఠనం!! నిజానికి ఎక్కడికీ వెళ్లకుండా వివిధ ప్రదేశాలను చూసిన ఫీల్ కలగాలి అంటే దానికి మార్గం అద్భుతమైన చారిత్రక ప్రదేశాల గురించి వెలువడిన పుస్తకాలు చదవడం. ఇది పుస్తకపఠనం అనే మంచి అలవాటును కూడా పెంపొందిస్తుంది. అలాగే ఆ ప్రాంతాల వెనుక ఉన్న సంఘటనలు, సందర్భాలు వంటివి కూడా క్షుణ్ణంగా అర్థమవుతాయి. ఇదే కోవలోకి వచ్చేది డాక్యుమెంటరీస్.  ఇందులో కూడా విషయన్ని ఎంతో వివరంగా విశ్లేషించి చెబుతూ ఉంటారు. కాబట్టి వాటిని హాయిగా చూసేయచ్చు.  చిన్ని చిన్ని ఆనందాలు!! కొందరికి దూరప్రాంతాలు వెళ్తేనే కిక్కు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దగ్గరలోనే కాస్త ప్రకృతీ రమణీయత సంతరించుకున్న ప్రదేశాలను కనుగొనగలిగితే అప్పుడప్పుడూ అక్కడికి వెళ్లి హాయిగా గడపచ్చు. ఇలా విహారాయత్రలను మిస్సయిపోతున్న భావాన్ని భర్తీ చేసుకుని హాయిగా ఉండచ్చు మరి. ◆ వెంకటేష్ పువ్వాడ  
  ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. బుల్లి అడుగులతో ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ప్రతి రోజూ పండగలాగే ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టు భావించేవారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి మరోవైపు ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే కడుపులో ఉన్న బిడ్డను చిదిమేయడం. ప్రసవం అవ్వగానే ఆడపిల్ల అని తెలియగానే వెంటనే అమ్మేయడం లేదా చెత్త కుప్పలో పడేయడం. ఆడపిల్లను  విలాసవస్తువుగా  మార్చడం. ఇవన్నీ భారతదేశం అంతటా పాతుకుపోయి ఉన్నాయి. సుమారు దశాబ్ద కాలం కిందట ఇలా అమ్మాయిలను భూమిధ పడకముందు మరియు భూమి మీద పడ్డాక తుంచేయడం ఎక్కువగా ఉండేది. పలుతంగానే ప్రస్తుతం అబ్బాయిల అమ్మాయిల నిష్పత్తితో పోలిస్తే అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. నిన్నటి పసిబిడ్డలే ఈరోజు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు అన్నట్టు. ఈరోజు పెళ్లి కావలసిన అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండటం. ఇప్పట్లో అబ్బాయిలు పెళ్లి కాకుండా మిగిలిపోతుండటానికి కూడా కారణం అవుతోందని చెప్పవచ్చు.  ఇంత విషయం ఆడపిల్లలను తుంచేయడం వల్ల జరుగుతోంది. దీని కోసం ఏర్పాటైనదే జాతీయ బాలికల దినోత్సవం. ప్రతి రోజు వెనుకా ఒక మంచి ఆశయం ఉన్నట్టే, ఈ జాతీయ బాలికల దినోత్సవం వెనుక కూడా గొప్ప ఆలోచనలు ఉన్నాయి. సంరక్షణ!! సమాజంలో ఆడపిల్లలను సంరక్షించుకోవడం రోజురోజుకు కష్టంగా మారిపోతోంది కారణం గద్దలు కోడిపిల్లల్ని తన్నుకుపోయినట్టు కొందరు ఆడపిల్లల్ని అపహరించడం, శారీరకంగా వేధించడం, స్మగ్లింగ్ చేయడం, రెడ్ లైట్ ఏరియాలలో అమ్మేయడం. ఇట్లా అన్ని విషయాల నుండి ఆడపిల్లలకు ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంది. ఆ సమస్యలన్నింటి నుండి ఆడపిల్లను కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలకు స్కూల్స్ కు వెళ్లడం, తిరిగి రావడంలోనే బోలెడు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. వాటి విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. హక్కుల కానుకలివ్వాలి!! ఆడపిల్లలకూ కొన్ని హక్కులు ఉంటాయి. అందులో ముఖ్యమైనది చదువుకోవడం. ఆడపిల్లకు చదువు ఎందుకు అని నిర్లక్ష్యం చేయకూడదు. అంతరిక్షానికి వెళ్లొచ్చిన ఆడపిల్ల అంటారు అందరూ కానీ గమనించాల్సిన విషయం ప్రతి ఆడపిల్ల అంతరిక్షానికి వెళ్ళలేదు కాబట్టి ప్రతి ఆడపిల్ల అంతరిక్షం కాదు కనీసం ధైర్యంగా బయటకు వెళ్లి రాగలిగే సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే లింగ వివక్షత లేకుండా చక్కగా చదువుకోవాలి. ఎంతోమంది మహిళలు పోరాటం చేసి మరీ చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించారు. కాబట్టి చదువుకోవడం, తగినంత స్వేచ్ఛ, లింగవివక్షత లేకుండా చూడటం.  ప్రతి ఆడపిల్లకూ తప్పనిసరిగా అందివ్వాల్సిన హక్కులు. ఎదుగుదలకు చేయూతనివ్వాలి!! చిన్న ఆసరా దొరికితే అంచెలంచెలుగా ఎదిగిపోయే వాళ్ళు ఎందరో ఉంటారు. ఈ కోవలో ఆడ, మగ ఇద్దరూ ఉంటారు కూడా. కానీ సమాజంలో చూస్తే మగవాళ్ళ కంటే ఆడవాళ్లకు ఇలాంటి చేయూత కాస్త తక్కువగా ఉండేది. అలాంటి వాళ్ల అభివృద్ధి కోసం ఎన్నో స్వచ్చంధ సంస్థలు ముందుకొచ్చి నడుం బిగించాయి. పాలితంగా స్త్రీలకు ఎన్నో ఉపాధి మార్గాలు ఇప్పట్లో చాలా చోట్ల ఉన్నాయి. ఇక ముఖ్యంగా బాలికలకు ఉత్తమమైన విద్యను అందించడం ద్వారా వాళ్ళు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవడానికి చేయుతనిచ్చినట్టు అవుతుంది. ఏ ఆడపిల్ల ఆర్థిక సమస్యల వల్ల చదువు ఆపే పరిస్థితి రాకుండా చూడటం సమాజం, ప్రభుత్వం, స్వచ్చంధ సంస్థలు కలసికట్టుగా చేయవలసిన పని. ఆహారం!! ఆహారం ఎంతో ముఖ్యమైనది.  ప్రతి ఆడపిల్లకు తన జీవితంలో పీరియడ్స్ లోకి అడుగుపెట్టడం అనేది తప్పనిసరి. అయితే శరీరంలో కలిగే మార్పులను అనుసరించి పోషకారం కూడా తప్పనిసరి. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో పోషకార లోపంతో ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలు, మహిళల శాతం ఎక్కువ. కాబట్టి మంచి ఆహారం పొందడం ఆడపిల్లల హక్కు, అందించడం ప్రభుత్వ, కుటుంబ బాధ్యతలు. ఇట్లా విద్య, వైద్యం, హక్కులు, ఎదుగుదల ముఖ్యంగా లింగవివక్ష అరికట్టడం ప్రతి ఆడపిల్ల జీవితానికి అందరూ కలసి అందించాల్సిన ముఖ్య అవసరాలు!! ◆ వెంకటేష్ పువ్వాడ  
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న నానుడి ఎలా వచ్చిందో తేలియదు గాని ఉల్లి వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఉల్లి కేవలం ఆహారంలో భాగం మాత్రమే కాదు పోష కలా భాలు ఉన్నాయి . అంటున్నారు నిపుణులు. ఉల్లి కేవలం ఆహారం లో భాగం మాత్రమే కాదు సంపూర్ణ పోషకాలు ఉన్నాయని అంటున్నారు. వితమిన్ సి...ఉల్లి అందరూ అంగీకరించినట్లుగా ఇది మంచి పోశాకమని శరీరానికి అవసరమైన విటమిన్ సి అందిస్తుందని తద్వారా మనం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. శరీరంలోని రక్త నాళాల ఇతర భాగాలాకు సరిగా పనిచేసేవిధంగా చేస్తుంది. యాంటి ఆక్సిడెంట్ పని చేస్తుంది. రాడికల్స్ పై పోరాడే గుణం ఉల్లికిఉంది ఏ మాలిక్యుల్స్ అయితే కొన్ని సార్లు నాశనం చేస్తాయో అప్పుడు నిపుణులు విటమిన్ సి మిల్లి గ్రాములలో సూచిస్తారు. అది ప్రతిరోజు తీసుకోవచ్చు. ఒక్క ఉల్లి పాయలో 1% నుండి 18 % వరకు ఉంటుంది. పీచు పద్దర్ధము...ఉల్లిపాయలో రెండు రకాల పీచు పదార్దాలు ఉంటాయి. డై టెరీ ఫ్రీ బయోటిక్ ఒక కప్పులో 12% 2 1 నుంచి 38 గ్రా మీకు రోజూ అవసరం. అవుతుంది.పీచు పదార్ధం శరీరంలో ప్రతిరోజూ బౌల్ కదలికలు ఉండడం అవసరం. మీకు కడుపు నిండి నప్పుడు చాలా తక్కువగా తింటారు. అప్పుడు మీకు ఊబ కాయం తగ్గుతుంది. ఉల్లిలో ఫ్రీ బయోటిక్ మీ గత ను బ్యాక్టీరియా ను కలిగిఉంటుంది.యాంటి ఆక్సిడెంట్...అన్ని ఉల్లిపాయాలలో క్వార్ స్టాన్ ఫ్లావోనాయిడ్స్ లేదా యాంటి ఆక్సిడెంట్ కాంపౌండ్ క్వార్టిన్ లో యాంటి ఇంఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి శరీరానికి సహకరిస్తాయి. విటమిన్ ఇ సంరక్షిస్తుంది. క్యాన్సర్ ప్రతి ఉల్లి పాయనుంచి ఆక్సిడెంట్ ఎరుపు,పసుపు తెల్ల ఉల్లిపాయాలలో పూర్తి పోషకాలు ఉంటాయని అంటున్నారు. విటమిన్ బి 6 ఒక మీడియం ఉల్లిపాయాలో 8% ప్రతిరోజూ విటమిన్ బి6 శరీరానికి సహకరిస్తుంది. ఉల్లి తీసుకోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల వృద్ది ప్రోటీన్ నిరోదిస్తుంది. ఉదయం సాయంత్రం వేళ లో స్త్రీలు ఎదుర్కొనే సిక్ నెస్ నుండి బయట పడడానికి సహకరిస్తుంది. పచ్చి ఉల్లిపాయా ఆరోగ్యకరం... పచ్చి ఉల్లిపాయ ను తినడం వల్ల లాభాలు ఉన్నాయి. సలాడ్ లో ఆమ్లెట్ లేదా సాంద్ విచ్ లో గుండ్రంగా కోసిన ఉల్లిపాయాలు చాలా నెమ్మదిగా కొరికి తినడం వల్ల మంచి పీచు పదార్ధము ఉంటుంది. వండినా లేదా  వేయించిన ఉల్లిపాయాలు చెడుపు చేస్తాయి. అందులో పోషకాలు ఉండవని అంటున్నారు నిపుణులు. ఎర్ర ఉల్లి పచ్చడి... సన్నగా కోసిన ఎర్ర ఉల్లి పాయాను రెడ్ వైన్ లో లేదా వెనిగర్ లో కొంచం ఉప్పువేసి 15 ని మిషాలు ఉంచి ప్రతి 5 నిమిషాలు కట్ చేయండి. బర్గర్స్ లో సలాడ్స్ లో కొన్ని కొన్ని ఆహారాలలో ముఖ్యంగా బకింగ్ ఐటమ్స్ లో బాగుంటాయి. మీకిష్టమైన వాటితో ఫిల్ చెయ్యండి... సన్నగా తరిగిన ఉల్లిపాయలు. వాటిపై కొంచం మిరియాల పొడి మీకు నచ్చిన ప్రోటీన్ ఆయిల్ కొంచం సోడియం సోయా, బ్రౌన్ రైస్ సల్సా సోర్ కరీం బోనస్ గా పచ్చి ఉల్లిపాయాని గ్యుకమోల్ తో కలిపి తింటే ఆ రుచివేరు అంటారు ఆహారా ప్రియులు.  నాన పెట్టి తినాలి... ఉల్లిపాయా కోసినప్పుడు కంటినుంచి నీటిని తెప్పిస్తుంది. అది పచ్చి ఉల్లిపాయ కోసినప్పుడు చాలా ఘాటుగా అనిపిస్తుంది.వాటిని సనాగా కోసి చల్లని నీటిలో చల్లని ప్రదేశంలో 3౦ నిమిషాలు ఉంచండి వాటి ఘాటు పవర్ తగ్గి దానిఅసలు మూలం పోకుండా ఉంటుంది. ఉల్లిని ఎలా నిల్వచేయాలి... మీరు మీ ఇంట్లో ఉల్లిని నిల్వ చేసినప్పుడు చల్లటి ప్రదేశంలో ఉంచండి. కాస్తగాలి ఉండే ప్రదేశంలో ఉల్లిని నిల్వ ఉంచండి.ఒకాసారి కోసిన చీల్చిన వాటిని మాత్రమే ఫ్రిజ్ లో ఉంచండి 7 నుండి 1౦ రోజులు ఆలు కు దూరంగా ఉంచండి. అన్నిటికన్నా ప్రసస్తంగా ఉండాలంటే పురుషుల లో సామార్ధ్య్సాన్ని పెంచేది ఈ ఉల్లే. కాబట్టి అన్నిరాకల ఆరోగ్య విలువలు ఉన్న ఉల్లి సర్వాత్రా మేలు చేస్తుందనేది నిపుణులు చెపుతున్న మాట.  
వృ ద్దాప్యం... శరీర కణాల వృద్ది కణాలు అంతరించిపోవడం మధ్య ఉండాల్సిన సమతుల్యత దెబ్బతిన్నప్పుడు క్యాన్సర్ ఏర్పడుతుంది. జన్యువులలో మార్పు సంభవించినప్పుడు. ఇలా జరుగుతుందని సైంటిస్ట్లు కనుగొన్నారు. శరీర కణాలు వృద్ది చెందడం అంతరించిపోవడం మధ్య సమతౌల్యతను కాపాడే జన్యువులలో మార్పు మార్పు రావడం సాధారణంగా వయస్సు పై బడుతున్న కొద్దీ జరగడానికి అవకాసం ఉంది. ఉదాహరణకు 25 సంవత్సరాల యువకుని కంటే 75 సంవత్సరాల యువకుని కంటే 75 సంవత్సరాల వ్రుద్దునిలో క్యాన్సర్ రావడానికి 1౦ ౦ శాతం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీర్ఘకాలం పాటు జీవించే వారికి జన్యువులలో ఇలాంటి మార్పులు జరిగె అవకాసం ఎక్కువుంటుంది. అలా అని వృద్ధులందరికీ ఇలా మార్పులు జరిగి క్యాన్సర్ వస్తుందని చెప్పటానికి వీలు లేదు.  క్యాన్సర్ ఏ వయస్సులో ఐనా రావచ్చు. ఆఖరికి పిల్లలకు కూడా వచ్చే అవకాసం ఉంది.  కుటుంబ చరిత్ర... ఎక్కువ రకాల క్యాన్సర్స్ జన్యువుల లో అనుకుని మార్పులు జరగడం. మూలంగా రావచ్చని చెప్పుకున్నాము. ఇలాంటి మార్పులు కుటుంబ పరంగా క్యాన్సర్ చరిత్ర కలవారికి వారసత్వంగా వచ్చే అవకాసం కొంత ఉంది. అలా అని కుటుంబ సభ్యుల లో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉంటె వారి పిల్లలకు కూడా క్యాన్సరు తప్పకుండా వస్తుందని కాదు. నిజం చెప్పాలంటే 8౦ నుంచి 9౦ శాతం క్యాన్సరు కేసులు ఏ క్యాన్సరు చరిత్ర లేనివారికి వస్తున్నాయి. కాక పోతే కుటుంబ పరంగా క్యాన్సరు చరిత్ర కలవారికి క్యాన్సరు రావడానికి కొంత ఎక్కువ అవకాసం ఉంది. ఉదాహరణకు 5% బ్రెస్ట్ క్యాన్సర్లు ఆ కుటుంబ చరిత్ర కలవారికి వస్తోంది.  పొగతాగడం... పొగ తాగడం మూలంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్, గొంతు, క్యాన్సర్, నోటి క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్,మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ, జీర్నాశయ క్యాన్సర్, క్లోమం, గర్భాశయ క్యాన్సర్. మొదలైన అవయవాలకు క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో ఏటా 1, 8౦, ౦౦౦ మందికి పైగా పోగాతాగాటం వల్ల చనిపోతున్నారని అక్కడి ప్రభుత్వ గణాంకాలు తెలియ చేస్తున్నాయి. ఒక్క పొగ తాగే వారు మాత్రమే కాదు ఆ పక్కన ఉండే వారికీ వారి కుటుంబ సభ్యులకు కూడా క్యాన్సార్లలో ఎదో ఒకటి రావడానికి అవకాసం ఉంది. పోగాతాగడం అనేది మనం మార్చుకోగలిగిన జీవన శైలి. తద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. పోగాతాగడం తో పాటు మద్యం సేవించే అలవాటు కూడా ఉన్నవారికి క్యాన్సర్ రావడానికి మరిన్ని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోషకాహార లోపం- స్థూలకాయం... రెండు రకాల సమస్యలు కల వారికి కొన్ని రకాల క్యాన్సర్లు రావడానికి అవకాసాలు ఉన్నాయని పరిశోధకులు చేపుతున్నారు. ఉదా.. కొవ్వు పదార్ధాలు అతిగా తీసుకునే వారికి పెదా పేగులు, ర్భాశయం, ప్రోస్టేట్ క్యాన్సర్, రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే స్థూల కాయం తో బాధ పడే వారు సరిపడా లేని వారికి పెద్ద ప్రేవులు, అన్న వాహిక కిడ్నీ, గర్భాశాయాలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహారంలో పళ్ళు ఫలాలు కాయ కూరలు, సరిపడా ఉండే టట్లు చూసుకోవడం రోజుకి 3౦ నిమిషాల చొప్పున 5 రోజులు చురుకుగా నడవడం. వంటి కనీస వ్యాయామం చేయడం ద్వారా స్తూల కాయం రాకుండా చూసుకోవడం ఒకవేళ స్తూల కాయం తో బాధ పడుతుంటే దానిని తగ్గించుకోవడం లాంటి చర్యల ద్వారా కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు ను నివారించ వచ్చనేది నిపుణుల సూచన.  రేడియేషన్, సూర్యరస్మి... అనువిద్యుత్ ప్రాజెక్ట్ ల నుండి గాని లేదా ఆణు ఆయుధ ప్రయోగాలు జరప బడ్డ చుట్టుపక్కల ప్రాంతాలాలో నివసించే వారికి ఆణు ధార్మికత సోకే అవకాశం ఉంది. ఇలాంటి వారికి ల్యుకేమియా గా పిలవబడే బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, రావడానికి ఎక్కువ అవకాశాలుఉంటాయి. లేదా కొన్ని గనులలో పనిచేసే వారికి అక్కడి మట్టి, రాళ్ళలో ఉండే రంగు,రుచి వాసన లేనిరాడాన్ అనబడే రేడియో యాక్టివ్ గ్యాస్ సోకి ఊపిరి తిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎముకలు విరిగినప్పుడు లేక ఇతరత్రా అంతర్గత అవయవాల చిత్రాలను చూడడానికి ఎక్స్ రేలు తీసే టెక్నీషియన్లకు క్యాన్సర్ ను నయం చేయడానికి వాడే రేడియేషన్ తెరఫిలో పెద్ద యంత్రాల నుంచి వచ్చే రేడియేషన్ మూలంగా ఆయా మిషన్ల టెక్నీషియన్లకు క్యాన్సర్ వచ్చే ప్రామాదం ఉంది. అయితే ఎక్స్ రే ఫోటోలకు వాడే రేడియేషన్ చాలా స్వల్పంగా మాత్రమే రేడియేషన్ తెరఫిలో వాడే రేడియేషన్ కొంచం అధికంగానే ఉంటుంది. మనలాంటి ఉష్ణ దేశాలాలో కంటే శీతల దేశాలలో నివసించే ప్రజలకు ఎండలో ముఖ్యంగా మిట్ట మాధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు గడిపితే చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.  రాసాయానాలు... వృత్తి రీత్యా కొన్ని రకాల పనులు చేసేవారు. ఉదా-- భవనాలకు రంగులు వేసే పెయింటర్లు నిర్మాణ రంగ కార్మికులు ఆస్బెస్టాస్ కెమికల్ పరిశ్రమలో పని చేసేవారికి వాళ్ళు పని చేసే రాసాయనాల మూలంగా క్యాన్సర్ ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది.  కొన్ని రకాల వైరస్ లు...హ్యూమన్ పాపిలోమా వైరస్... హెపటైటిస్ -బి వైరస్ మూలంగా లివర్ క్యాన్సర్ పాపిలోమా వైరస్ మూలంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్,సెర్వైకల్ క్యాన్సర్, ఎయిడ్స్ వ్యాధికి కారణ మైన హెచ్ ఐ వి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్,మూలంగా కపోసి సర్కోమా అనబడే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే హెలికో బ్యాక్టార్ పైలోరి, అనబడే బ్యాక్టీరియా మూలంగా జీర్ణాశయం లో పుళ్ళు ఏర్పడడం మాత్రమే కాదు జీర్నాశయ క్యాన్సర్ వచ్చే అవకాసం ఉంది.  కొన్ని రకాల హార్మోన్లు... మెన్సెస్ నెలసరి ఆగిపోతున్న దశలో స్త్రీలకు ఎముకలు పెళుసుగా ఉండడం, యోని పోడి బారాడం. వంట్లో సెగలు పొగలు లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి స్త్రీలకు డాక్టర్లు ఈస్ట్రో జన్ గాని,ప్రోజేస్ట్రోన్, గాని లేక లేదా రెండు హార్మోన్లు కలగలిసి సూచిస్తారు. ఇలాంటి హార్మోన్ తెరఫీ మూలంగా ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ కింద బ్రెస్ట్ క్యాన్సర్ ,గర్భసంచి క్యాన్సర్, గుండె పోటు, పక్షవాతం, రక్తపు గడ్డలు, కట్టడం లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.  క్యాన్సర్ నిర్ధారణ... క్యాన్సర్ ఏ అవయవానికి సోకింది, అది ఏ దశలో ఉంది. అన్నది తెలుసుకున్నాక డాక్టర్స్ రోగికి చికిత్స చేసే విషయాన్ని ఈ కింద అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.  ఆరోగి వయస్సు. ఆ వ్యక్తి శరీర దారుడ్యం. క్యాన్సర్ ఏ సైజు లో ఉంది. క్యాన్సర్ ఏ దశలో ఉంది . క్యాన్సర్ ఎంత వేగంగా వృద్ధి చెందుతుంది. ఇతర అంశాలు క్యాన్సర్ ఏ దశలో ఉందొ తెలుసుకోడానికి కింద పేర్కొన్న పరీక్షలను జరిపిస్తారు. ఎక్స్ రే పరీక్ష. అల్ట్రా సౌండ్ స్కాన్. సిటి స్కాన్ . న్యూక్లియర్ స్కాన్ . ఎం ఆరై స్కాన్. పెట్ స్కాన్ ఈ పరీక్షల వల్ల క్యాన్సర్ శరీరంలో ఏ భాగాన్ ఉందొ గడ్డ ఏ సైజులో ఉంది. క్యాన్సర్ శరీరంలోని ఇతర అవయవాల లోకి లేదా ఇతర భాగాలాలోకి వ్యాపించిందా లేదా అన్న విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా ల్యాబోరేట రీ లలో చేసే రక్త పరీక్ష,మూత్ర పరీక్ష, కళ్లి పరీక్ష ఇతర ద్రవాల పరీక్షలు క్యంసర్ కు సంబందించిన ఇతర సమస్యలు ఏ మైనా ఉంటె తెలుస్తాయి.  క్యాన్సర్ ముదరడం- వివిధ దశలు... రోగికి క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యాక డాక్టర్స్ మొదట ఆ క్యాన్సర్ ఏ దశలో ఉందొ అన్నది తెలుసుకోడానికి ప్రాయాత్నిస్తారు. అంటే ఎంతగా ముదిరి పోయింది? అన్నది క్యాన్సర్ ముదిరి పోవడాన్ని డాక్టర్స్ మూడు విధాలుగా తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియను టి ఎన్ ఎం పద్ధతి అంటారు.  టి ---అంటే ట్యూమర్ గడ్డ (గడ్డ సైజ్ ) ఎన్ --- అంటే లింఫ్ గ్రంధులు సంఖ్య సైజు. ఎం -- మేటాసిస్ అంటే క్యాన్సర్ కణాలు రక్త ప్రావాహం ద్వారా లేక లింఫ్ వ్యవాస్త ద్వారా మిగతా శరీరం లో ఎంత మేరకు వ్యాపించాయి అన్నది తెలుసుకోవడం కీలకంగా భావిస్తారు వైద్యులు. ఈ మూడిటినీ వివిధ పరీక్షల ద్వారా పరిసీలించాక క్యాన్సర్ ఏ దశలో ఉందొ అంచనాకి వస్తారు. క్యాన్సర్ ముదర డానికి సంబందించిన వివిధ దశలు వరసగా ఈ కింది విధంగా ఉంటాయి. సాధారణదశ...క్యాన్సర్ ప్రారంభానికి ముందు దశ.  మొదటిదశ ...స్టేజి1 -ఏదైనా ఒక అవయవం లో క్యాన్సర్ ప్రారంభం అయి ఉంటుంది. రెండవదశ ...స్టేజి 2- క్యాన్సర్ గడ్డ పెద్దది గా ఉంటుంది. లింఫ్ గ్రంధులకు సోకవచ్చు,సోకక పోవచ్చు. మూడవదశ...స్టేజి3-వరూధి చెందిన క్యాన్సర్ లింఫ్ గ్రంధులకు సోకుతుంది. నాల్గవదశ ...స్టేజి4 -క్యాన్సర్ ప్రారంభ మైన అవయవం నుంచి క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించడం ఇది పూర్తిగా ముదిరి పోయిన దశ. క్యాన్సర్ లో రకాలు..వాటిపేర్లు... క్యాన్సర్ ఏ శరీరానికి వస్తే దానిని అశరీర భాగపు క్యాన్సర్ గా పిలుస్తారు ఉదా..ఎముకలకు వస్తే బోన్ క్యాన్సర్. ఊపిరి తిత్తులకు వస్తే లంగ్ క్యాన్సర్ వక్షోజాలకు వస్తే బ్రస్ట్ క్యాన్సర్, చర్మానికి వస్తే స్కిన్ క్యాన్సర్, అని అంటూ ఉంటారు.  క్యాన్సర్ లో రకాలు... కార్సినోమా... చర్మం మీద,అంతర్గత అవయవాల లోపలి పొరలు లేక బయటి పొరల మీద, ఏర్పడే క్యాన్సర్,కార్సినోమా గా చెపుతారు. సా ర్కోమా... ముకలు,కొవ్వు ,కండరాలు, రక్తనాళాలు, లేదా ఆయా అవయవాలని పట్టి ఉండే కణజాలానికి వచ్చే క్యాన్సర్ ను సార్కోమా విభాగానికి చెందినదిగా వర్గీకరించారు. ల్యుకేమియా... రక్త కణాలను తయారు చేసే ఎముక మజ్జ లో ప్రారంభమైన అసంఖ్యాకం గా అసాదారణ రక్త కణాలని ఉత్పత్తి చేస్తూ రక్త ప్రావాహాం లోకి ప్రవేసించే క్యాన్సర్ ను ల్యుకేమియగా పిలుస్తారు. లింఫోమా మైలోమా ... లింఫోమా మైలోమా రోగ నిరోధక వ్యవస్త లో ప్రారంభమయ్యే క్యాన్సర్ కణాలను లింఫోమా మైలోమాగా పిలుస్తారు. క్యాన్సర్ చికిత్స లు -పద్దతులు... న్సర్ కు చికిత్స ఆ క్యాన్సర్ ఏ టైపు కు చెందినది క్యాన్సర్ ఎంతగా ముదిరింది క్యాన్సర్ ఏ స్టేజి లో ఉంది. అం శాల ప్రాతిపదికన చికిత్స ఉంటుంది. సాధారణంగా క్యాన్సర్ సోకిన భాగాన్ని సర్జరీ చేసి తొలగించడం ద్వారా చికిత్స చేస్తారు సర్జరీ తరువాత రోగి కొంత కాలం పాటు నొప్పిని భరించక తప్పదు. అయితే ఈ  నొప్పిని మందుల ద్వారా నియంత్రించ వచ్చు. అంతే కాక సర్జరీ తరువాత రోగి కొంతకాలం తీవ్రమైన నీరసం,అలసట కు గురి అవుతారు.  రేడియేషన్ తెరఫి..కీమోతేరఫీ రేడియో తెరఫీ... దీనిని రేడియో తెరఫి అని కూడా అంటారు. ఈ పద్దతిలో క్యాన్సర్ సోకిన భాగానికి హై ఎనేర్జీ రేస్ పంపించడం ద్వారా ఆ భాగంలో ఉన్న క్యాన్సర్ కణాలను నిర్మూలించడం జరుగుతుంది. ఇందులో రెండు రకాల పద్దతులు అమలు చేస్తారు. మెషిన్ ద్వారా బయటి నుంచి క్యాన్సర్ గడ్డ వద్దకు రేడియేషన్ ను ను పంపడం ఒక పద్ధతి. రెండో పద్దతిలో రేడియో యాక్టివ్ పదార్ధం కలిగి ఉన్న సూదులు, వైరులు గింజలు, లేదా ట్యూబ్ లు శరీరం లోపలి క్యాన్సర్ గడ్డ వద్దకు లేదా గడ్డ లోపలి కి పపడం ఉంటుంది. వివిదరాకాల పద్దతుల అమలు చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను నిర్మూలించడం జరుగుతుంది. రేడియేషన్ ట్రీట్మెంట్ మూలంగా నొప్పి ఉండదు. వాటి మూలంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తాత్కాలికం మాత్రమే వాటిని కంట్రోల్ చేయవచ్చు.  ఈ ట్రీట్మెంట్ జరిగిన తరువాత వారాలలో రోగి తీవ్రమైన అలసటకు గురిఅవుతారు. అలాగే ఆ వ్యక్తిలో తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవచ్చు. బయటి నుంచి ఇచ్చే రేడియేషన్ చికిత్స జరిగిన ప్రాంతంలో తాత్కాలికంగా వెంట్రుకలు రాలిపోవచ్చు అక్కడి చరర్మం కమిలి పొడిగా అయి దురద ఉంటుంది ఇది సాధారణం అని వైద్యులు పేర్కొన్నారు.  కీమోతేరఫీ... కీమోతేరఫీ పద్దతిలో మందుల ద్వారా శరీరం లోపలి క్యాన్సర్ కణాలను నసింపచేసే ప్రయత్నం ఉంటుంది.ఈ పద్ధతి మూలంగా క్యాన్సర్ సోకని సాధారణ ఆరోగ్యకర కణాలు కూడా నశించే అవకాశం ఉంది ముఖ్యంగా వేగంగా విభజన చెందే కణాలు నశిస్తాయి. ముఖ్యంగా వాడే మందులను బట్టి వాటి డోస్ ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఆధారపడి ఉంటాయి. అలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లో జుట్టు రాలడం. తాత్కాలికంగా అలసట ఆకలి తగ్గిపోవడం, తెమలడం వాంతులు, నీళ్ళ విరేచనాలు నోట్లోను పెదాల మీద పుళ్ళు ఏర్పడడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. తెమలడం, వాంతులు లాంటి వాటిని కొన్ని మందులు వాడడం ద్వారా నివారించవచ్చు. కీమోతేరఫి పూర్తి కాగానే సాధారణ కణాలు నశించడం ఆగిపోతుంది.  హార్మోన్ తెరఫీ... కొన్ని క్యాన్సర్ లలో కణాలు వృద్ది చెందడానికి రోగి శరీరంలోని హార్మోన్ లను ఉపయోగించుకోవడం. జరుగుతుంది. ఇలాంటి క్యాన్సర్ లకు హార్మోన్ తెరఫీ ని వాడతారు. ఈ తెరఫీ లో క్యాన్సర్ కణాలు వృధీ చెందడానికి అవి ఉపయోగించుకుంటున్న శరీరంలోని హార్మోన్ల ఉత్పత్తిని మందుల ద్వారా ఆపుచేయటం. లేదా ఆ హార్మోన్లు పని చేసే విధానాన్ని మార్పు చేయటమో చేసి క్యాన్సర్ కణాల వృద్ధికి అడ్డుకట్ట వేస్తారు. లేకపోతే క్యాన్సర్ కణాలు ఉపయోగించుకుంటున్న హార్మోన్లు తయారు చేసే శరీర భాగాన్ని సర్జరీ ద్వారా తొలగిస్తారు. ఉదా..బ్రెస్ట్ క్యాన్సర్ కు ఉన్నప్పుడు రోగి శరీరంలోని అందాశాయాల్ని తొలగిస్తారు. హార్మోన్ తెరఫి మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు అలసట శరీరంలో నీరు నిలువకావడం బరువు పెరగడం. వంట్లో సెగలు పొగలు తెమలటం, వాంతులు, ఆకలి తగ్గడం కొన్ని కేసులలో రక్తం గడ్డలు కట్టడం మొదలైనవి కనబడతాయి. మెనోపాజ్ చేరుకుంటున్న స్త్రీలలో ఎముకలు పెళుసుగా అవుతాయి. ఇస్తున్న హార్మోన్ తెరఫి టైప్ ను బట్టి సైడ్ ఎఫెక్ట్స్ తాత్కాలికంగా ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉంటాయా లేక శాస్వతంగా ఉండి పోవచ్చ అనేది ఆధారపడి ఉంటుంది.  బాయోలాజికల్ తేరాఫీ... బయో లాజికల్ తెరఫీ లో క్యాన్సర్ వ్యాధితో పోరాడటానికి గాని లేకపోతే క్యాన్సర్ చికిత్స మూలంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తాకిడిని తగ్గించుకోడానికి డైరెక్ట్ గానో శరీరంలోని వ్యాదినిరోడక వ్యవస్థ ను ఉపయోగించుకుంటుంది.బయోలాజికల్ తెరఫీ లో మళ్ళీ వివిదరకాలు ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వాస్తాయి ఆయా తెరఫీ రకాలను బట్టి ఉంటుంది. ఈ తెరఫివల్ల ఫ్లూ జ్వరం లో వచ్చే లక్షణాల లాంటివి. సైడ్ ఎఫెక్ట్స్ గా ఉంటాయి. ఉదా.. శరీరం లోపలినుంచి చలి జ్వరం, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం, తెమలడం, వాంతులు, నీళ్ళ విరేచనాలు, మొదలైనవి. రోగి చర్మం తేలికగా కమిలిపోయి. రక్త స్రావం కావాచ్చు. చర్మం వాయడం, దద్దుర్లు లాంటివి, ఉండవచ్చు. సమస్యలు తీవ్రంగానే ఉండే అవకాసం ఉంది గాని చికిత్స ని ఆపగానే పోతాయి.  
కొన్ని అపోహలు,సందేహాలు.అవగాహన. క్యాన్సర్ గురించి అందరూ వినే ఉంటారు. కాని క్యాన్సర్ అంటే ఏమిటి ? అని అడిగితే మాత్రం చాలా మంది సమాధానాన్ని చెప్పలేరు. కొద్ది మంది మాత్రమే క్యాన్సర్ క్యాన్సర్ అంటే ఏమిటి అది ఎలా ఏర్పడుతుంది, ఎలా వృద్ధి చెందుతుంది అన్న విషయాలు తెలిసి ఉంటాయి. క్యాన్సర్ లో 1౦౦ కు పైగా రకాలు ఉన్నాయి. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు ఆఖరికి కళ్ళు గుండె కు కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఉందంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. క్యాన్సర్ ప్రారంభం మొదట ఎదో ఒక శరీర భాగపు కణాల లో మొదలు అవుతుంది. సాధారణ శరీర కణాలు క్యాన్సర్ కణాలుగా ఎలా మారాయి అన్నది తెలుసుకుంటే క్యాన్సరు రూపు రేఖలు ఏమిటో తెలుస్తాయి. సాధారణ శరీర కణాలు...జీవిత చరిత్ర తెలియాలి.  మన శరీరం అనేక రకాల సజీవ కణాల తో కూడుకుని ఉంటుంది. శరీరంలోని ప్రతి అవయవము కణాల సముదాయమైన తిష్యుల తో నిర్మితమై ఉంటుంది. భావన నిర్మాణం లో ఇటుకలు ఎలాంటివో శరీరంలోని వివిధ విభాగాల నిర్మాణం లో టిష్యూ లు ఇటుకల లాంటివి. సాధారణ ఆరోగ్యకర శరీరంలో కణాలు పరిపక్వ స్థితికి రాగానే ఒకటికి మరిన్ని కణాలుగా విభాజ్యం చెందుతూ ఎప్పటి కప్పుడు కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక నిర్ణీత కాలం వచ్చే సరికి శరీరంలోని ప్రతి కణానికి వయస్సు చెల్లె సమయం ఆసన్న మౌతుంది.అప్పుడు అవి ఇక పని చేయని స్థితికి వస్తాయి. పని చేయని స్థితికి వచ్చిన కణాలు ఎప్పటి కప్పుడు నశించి పోతాయి. నశించిన కణాల స్థానం లో అంతకు ముందు విభాజ్యం చెందుతూ ఏర్పడిన కొత్తకణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనిషికి జీవన ప్రారంభదశలో అంటే బాల్యంలో శరీర కణాలు వేగంగా విభాజ్యమౌతూ వృద్ది చెందుతాయి. ఆకాలం లో నశించి పోయే కణాలకంటే కొత్తగా ఏర్పడే కణాల సంఖ్య అధికంగా ఉంటుంది. దీనివల్ల శరీరాలు అభివృద్ధి చెందుతూ పిల్లలు ఎదగడానికి వీలు కలుగుతుంది. ఇది మనశారీర కణాల జీవిత చరిత్ర.  క్యాన్సర్ కణాలు ---కణితలు.  క్యాన్సరు ఎప్పుడూ ఎదో ఒక శరీర భాగపు కణం తో ప్రారంభ మౌతుంది. కణాలు విభాజ్యం చెందడం కొత్త కణాలు గా ఏర్పడుతూ వృధీ చెందడం . పాత గా అయిపోయిన కణాలుమరణించడం అనే సహజ సిద్దమైన క్రమబద్ద క్రియ లో ఒక్కోసారి ఎక్కడో తేడా వస్తుంది. ఆ తేడా కారణంగా శరీరంలోని ఒకానొక భాగం లో పనిచేయని వయస్సు చెల్లిన కణాలు నసిన్చిపోవడం అంతే కాక అవసరం లేక పోయినా ఆ భాగాన కొత్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవసరం తీరి నశింపు చెందకుండా ఉన్న పాత కణాలు, అవసరం లేకపోయినా ఏర్పడిన కొత్త కణాలు ఆ మొత్తంలో అక్కడి భాగం ఒక ముద్దగా గడ్డలా తయారు అవుతుంది. అలా ఏర్పడిన గద్దలనే వైద్య పరి భాషలో ట్యూమర్స్ అంటారు. గడ్డలు శరీరంలో ఏ భాగంలో ఐనా ఏర్పడవచ్చు. వీటిలో ప్రామాడం లేని గడ్డలు ఉంటాయి. ప్రమాదాన్ని కలిగించే హానికారక గడ్డలు ఉంటాయి. ప్రమాదంలేని గడ్డలను మ్యాలిగ్నేంట్ ట్యూమర్స్ అంటారు.   ప్రమాదాన్ని కలిగించే గడ్డలను మ్యాలిగ్నేట్ ట్యూమర్ అంటారు క్యాన్సరు గద్దలంటే ఇవే.. ప్రమాదం లేని గడ్డలు- బినైన్ ట్యూమర్స్... * ఇవి క్యాన్సర్ ను కలిగించవు,ప్రాణాపాయం లేనివి. * వీటిని చిన్నపాటి శస్త్ర చికిత్స ద్వారా తొలగించ వచ్చు. సాధారణంగా ఇంకా మళ్ళీ పెరగవు. * ఈ గడ్డ లోని కణాలు చుట్టుపక్కల కణ జాలం లోకి ప్రవేసించ లేవు.  * అదే విధంగా మరో ప్రాంతపు శరీర భాగం లోకి వ్యాపించలేవు. హానికార గడ్డలు -మ్యాలి గ్నేట్ ట్యూమర్స్...  * ఇవి క్యాన్సర్ కు సంబందించిన ప్రాణాపాయ గడ్డలు.  * ఈ రకంగా ప్రాణాంతక హానికారక క్యాన్సర్ గడ్డలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించ వచ్చుకాని మళ్ళీ పెరిగే అవకాసం ఉంది.  * క్యాన్సర్ కణాలు చుట్టుపక్కల కణజాలం లోకి ఇతర శరీర భాగాలలోకి ప్రవేసించ గలుగుతాయి. * ఈ గడ్డ లోని క్యాన్సరు కణాలు రక్త ప్రావాహం ద్వారా,లింఫ్ వ్యవస్థ ద్వారా దూరంగా ఉన్న అవయవాల లోకి ప్రవేశించి. ఆయా భాగాలాలో కొత్త గడ్డలను ఏర్పరచ గలుగు తాయి. ఇలా దూరంగా ఉన్న ఆవయవాలలోకి క్యాన్సర్ వ్యపించడాన్ని మెటా స్టే సిస్ అంటారు. క్యాన్సర్ లక్షణాలు ... క్యాన్సర్ లో అనేక రకాలు ఉన్నాయి.ఒక్కోరకమైన క్యాన్సరు లో ఒక్కోరకమైన లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల క్యాన్సార్ లలో అవి భాగా ముదిరిపోయే దాకా ఏ లక్షణాలు కనిపించవు. కూడా అందుకనే  డాక్టర్స్ క్యాన్సర్ కవాచ్చు ఏమో అన్న అనుమానం కలగ గానే ఆ వ్యక్తికి వివిధ టెస్టులు ,స్క్రీనింగ్ లు జరిపిస్తారు. క్యాన్సర్ లో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలు, చిహ్నాలు ఈ విధంగా ఉంటాయి ... * చాతిలో లేక శరీరంలో మరెక్కడైనా కొత్తగా ఏదైనా గడ్డలు కనిపించడం.  * కొత్తగా నల్లటి మచ్చ ఏర్పడడం. లేదా అంతకు ముందే ఉన్న పులిపిరి లేక నల్ల మచ్చలో మార్పులు కనిపించడం గమనించవచ్చు.  * పుండు ఎంతకీ తగ్గక పోవడం.  * విడవకుండా దగ్గు, గొంతు బొంగురు పోవడం. * మల మూత్ర అలవాట్లలో మార్పులు కనిపించడం.  * నిరంతరం అజీర్ణం. * మింగటానికి ఇబ్బంది కలగడం. * ఏ కారణమూ లేకుండా బరువు తగ్గడం. * జననేంద్రియం నుంచి అసాధారణంగా రక్త స్రావం కావడం లేక విపరీతంగా తెల్లటి ద్రవం ఉత్పత్తి కావటం.  మొదలైన లక్షణాలు గమనించిన వెంటనే క్యాన్సరా కదా అని నిర్ధారించుకోవాలి.అయితే చెప్పినవన్నీ క్యాన్సర్ మూలంగానే వస్తాయని కాదు. ఏ ఇన్ఫెక్షన్ మూలంగానో కూడా రావచ్చు. అయినా సరే ఇలాంటి లక్షణాలు కనిపించి నప్పుడు డాక్టర్ ను సంప్రదించి పరీక్ష చేయించుకోవడం అవసరం. పైన చెప్పిన లక్షణాలే కాకుండా కింద పేర్కొన్న కొన్ని సాధారణ లక్షణాలు కూడా వివిధ క్యాన్సర్లకు చిహ్నాలు కావచ్చు.  పొత్తికడుపు నొప్పి పెల్విక్ పెయిన్... బొడ్డుకు దిగువ భాగంలో పొత్తికడుపులో విడవకుండా నొప్పి వస్తే అది నెలసరి కి సంబందించిన మూలంగానే కాకుండా ఎండో మెట్రియాల్ క్యాన్సర్ ఓవరియన్ క్యాన్సర్, లేదా సర్వికల్ క్యాన్సర్ లాంటి వాటి మూలంగా కూడా కవాచ్చు.  కడుపు ఉబ్బరం..తేన్పులు... వీటిని మనం అంతగా పట్టించుకోము కాని రెండూ విడవకుండా ఉండడం సాధారణంగా జీర్నకోస క్యాన్సర్ లక్షణం గా అని నిపుణులు అనుమానించే అవకాశం ఉంది. నడుము నొప్పి... కొందరు స్త్రీలు నడుము కింది భాగంలో తీవ్రనోప్పి వస్తోందంటూ వాపోతూ ఉంటారు. కొందరు స్త్రీలు అయితే ఆ నొప్పి ప్రసవ నొప్పులంత తీవ్రంగా ఉంటోందని అంటున్నారు. బహుశా అది అండాశయ క్యాన్సర్ వల్ల కావచ్చు.  ఎంతకీ తగ్గని జ్వరం ...  నెలరోజులుగా గడిచినా జ్వరం తగ్గక పోతే డాక్టర్ ను కలవడం మంచిది. ఒక్కోసారి అది క్యాన్సర్ లక్షణం కావచ్చు.  తీవ్రమైన అలసట నీరసం... క్యాన్సర్ లో కనిపించే సాధారణ లక్షణం. ఇది ప్రారంభ దసకంటే సాధారణంగా క్యాన్సరు ముదిరి పోయిన దశలో ఎక్కువగా కనిపిస్తుంది. మామూలు దిన చర్యలు కూడా చేసుకోలేనంతగా నీరసం. అలసట ఉంటె డాక్టర్ ను తప్పకుండా కలవాలి.  క్యాన్సర్ ఎవరికీ వస్తుంది ?...రిస్క్ ఫాక్టర్... క్యాన్సర్ ఎవరికీ వస్తుంది? ఎవరికీ రాదు? అన్న విషయాన్ని ఇది మిద్దం గా చెప్పడం కష్టం. కాకపోతే కొన్ని కారణాలు కొన్ని రిస్క్ ఫాక్టర్స్ క్యాన్సర్ రావడానికి మూలంగా ఉదావచ్చని పరిశోధకులు చెపుతున్నారు. స్థూలంగా చూసినప్పుడు అలాంటి అలాంటి కారణాలలో కొన్నిటిని చూద్దాం. వృద్దాప్యం. పొగ తాగే వాళ్ళు, సూర్యరస్మి, రేడియేషన్ కి గురికావడం,, విచల విడిగా,రాసాయన ఎరువులు వాడడం. వాతావరణ కాలుష్యం, ఆహార పదార్ధాలలో రంగుల వాడకం, కొన్ని రకాల వైరస్ లు, బ్యాక్టీరియా,కొన్ని హార్మోన్లు, కుటుంబ పరంగా, క్యాన్సర్ చరిత్ర ఉన్న వారికి, మద్యాన్ని సేవించేవారికి, పోషకాహార లోపం,స్థూలకాయం, పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్ లో కొన్ని నివారించు కోగాలిగినవి. కొన్ని మన చేతిలో ఉంటాయి.