క్రికెట్ అంటే ఆల్‌వైట్స్‌లో ఐదురోజులు జ‌రిగే టెస్టు మ్యాచ్‌నే అస‌లు క్రికెట్ అంటారు. పాత‌కాలం ప్లేయ ర్లు దానికే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తారు. మంచి ప్లేయ‌ర్ స‌త్తాను టెస్ట్ క్రికెట్ తెలియ‌జేస్తుంద‌ని అంటారు. ఎందుకంటే ఐదు రోజుల ఆట‌లో ఎంతో నిల‌క‌డ‌గా, ఓపిక‌తో ఆడ‌వ‌ల‌సి వ‌స్తుంది. అదే క్రికెట‌ర్ ల‌క్ష‌ణం అంటారు. అయితే చాలాకాలం నుంచి ఆధునిక క్రికెట్‌లో మ‌కుటాయ‌మానంగా వ‌న్డేలు, ఆ త‌ర్వాత అతి పొట్టి ఫ‌ర్మాట్‌గా టీ-20 పోటీలు వ‌చ్చేశాయి.  వన్డే, టెస్టు క్రికెట్‌ బతికి బట్టకట్టేందుకు ఐసీసీ చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో మరింతగా దృష్టి సారించాలని కోరాడు. మరోవైపు ఐసీసీ మాత్రం వచ్చే సైకిల్‌లో వన్డే క్రికెట్ విషయంలో ఎలాంటి తగ్గుదల లేదని ఐసీసీ పేర్కొంది. వచ్చే 9 సంవత్సరాలకు 3.. 50 ఓవర్ల ప్రపంచకప్‌లను షెడ్యూల్ చేసింది. భార‌త్‌ ఆతిథ్యం ఇవ్వనున్న 2023 ప్రపంచకప్‌తో ప్రారంభం అవుతుంది.  పొట్టిఫార్మాట్ల  ఆట అందం కంటే స్కోరు బోర్డు ప‌రిగెత్తించ‌డ‌మే జ‌రుగుతోంది. ఈ రెండు ఫార్మాట్లు కూడా బౌల‌ర్ల కంటే బ్యాట‌ర్‌, ఫీల్డ‌ర్ ప‌టిమ‌నే తెలిజేస్తాయి. కేవ‌లం సిక్స్ లు, ఫోర్లు బాదే వాడే గొప్ప ప్లేయ‌ర్‌గా అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకుంటు న్నాడు. క‌నుక ఈ ఫార్మాట్ అస‌లు సిస‌లు క్రికెట్ అనిపించుకోద‌న్నది భార‌త్ లెజెండ్ క‌పిల్ దేవ్ అభిప్రాయం. కానీ ఆయ‌న అభి ప్రాయాన్ని చాలా మంది త‌ప్పు ప‌ట్టారు. కాలానుగుణంగా ఆట‌లో వ‌స్తున్న మార్పుల‌ను కూడా అంగీక‌రించా ల్సిందేన‌ని, పొట్టి ఫార్మాట్‌ను లెక్క‌లో కి తీసుకోవాల‌నే గ‌వాస్క‌ర్ వంటివారి వాద‌న‌.  ఐపీఎల్, బీబీఎల్ వంటి పొట్టిఫార్మాట్‌లకు క్రేజ్ పెరుగుతూ సంప్రదాయ టెస్టు, వన్డే క్రికెట్‌పై మోజు తగ్గి పోతుండడంపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆందోళన వ్యక్తం చేశాడు. వన్డే, టెస్టు ఫార్మాట్‌ను రక్షించాలంటూ ఐసీసీ కి మొరపెట్టుకున్నాడు. టీ20, ఫ్రాంచైజీ క్రికెట్ లీగుల సంప్ర దాయ క్రికెట్‌ను వెన క్కి నెట్టకుండా చూడాలని కోరాడు. యూరప్‌లో క్రికెట్ ఫుట్‌బాల్ దారిలోనే నడుస్తోం దన్న కపిల్.. రోజు రోజుకు ద్వైపాక్షిక క్రికెట్‌కు ప్రాధాన్యం తగ్గిపోతోందన్నాడు.  ఐసీసీ తదుపరి అంతర్జాతీయ క్యాలెండర్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చేరగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా తమ దేశవాళీ ఫ్రాంచైజీ ఆధారిత లీగ్స్ కోసం ప్రత్యేక స్లాట్స్ పొందే అవకాశం ఉంది. వారు ఒక్కో దేశంతో ఆడడం లేదని, నాలుగేళ్ల కోసారి ప్రపంచకప్‌లోనే అది జరుగుతోందని, ఇదేమంత ఆరోగ్య‌క‌ర  సంప్రదాయం కాద‌ని క‌పిల్ అన్నారు. 
ఏపీ సీఎం జగన్ అడ్డాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాలు పెడుతున్నారు. పంటలు నష్టపోయి బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు జనసేనాని రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ నెల 20న ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. పంటసాగులో నష్టాల పాలై, అప్పుల బాధతో కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడమే కాకుండా.. ఒక్కొక్క బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అంద జేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల పిల్లలకు చదువులను కూడా జనసేన పార్టీయే చూసుకుంటుందని భరోసా ఇస్తున్నారు. అందు కోసం జనసేనాని ఒక నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తీరుపైన, వైఎస్ జగన్ పరిపాలనా విధానాలపైన సమయం చిక్కిన ప్రతిసారీ విమర్శలు ఎక్కుపెడుతున్న పవన్ కళ్యాణ్.. జగన్ సొంత ఇలాఖాలో అడుగుపెడుతుండడంతో వైసీపీ శ్రేణుల్లో హీట్ పెంచేసింది. గతంలో చేసిన విమర్శలకు తోడు ఇప్పుడు తాజాగా మళ్లీ వైసీపీ పైన, జగన్ పైన ఇంకెలాంటి ఆరోపణలు సంధిస్తారో, ఏ విధంగా ఇరుకున పెడతారో అనే సంశయాలు వైసీపీ శ్రేణుల్లో పెరిగిపోతున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సొంత జిల్లానే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుండడంతో వైసీపీ నేతలు, శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. గతంలో అంటే.. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆ పార్టీ అధినేత చిరంజీవి వాహనాలను వైఎస్సార్ అనుచరులు, బంధువులు ధ్వంసం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అప్పటి మాదిరిగా అవాంఛనీయ సంఘటనలేవైనా జరుగుతాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ గతంలో మాదిరిగానే ఇప్పుడు వైసీపీ శ్రుణులు గానీ, వైఎస్సార్ బంధువులు గానీ జనసేన అధినేత వాహనాలపైన, వాహన శ్రేణిపైన దాడులకు దిగితే.. అనంతర పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అనే భయాలు నెలకొంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనే 12 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని జనసేన నేతలు చెబుతున్నారు. అంతే కాకుండా కడప జిల్లా వ్యాప్తంగా 80 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తామని నోటిమాటగా చెప్పడమే కానీ.. సీఎం జగన్ ఒక్క కుటుంబానికి కూడా పరిహారం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు వైఎస్సార్ బీమా కింద 7 లక్షల రూపాయల బీమా చెల్లించడం లేదని జనసేన నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సభలకు వెళ్లకుండా కౌలు రైతు కుటుంబాలను వైసీపీ నేతలు, అధికారులు వేధిస్తున్నారంటూ జనసేన నేతలు ఆరోపిస్తుండడం గమనార్హం. ఒక పక్కన తన సొంత జిల్లా, మరో పక్కన కౌలు రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించకుండా, బీమా అందించకుండా తన సర్కార్ చేతులెత్తేసిన నేపథ్యంలో జనసేన అధినేత నేరుగా ఆయా బాధిత కుటుంబాలకే ఆర్థిక సాయం చేసేందుకు వస్తుండడాన్ని వైసీపీ నేతలకు అస్సలు సహించలేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత, పవన్ కళ్యాన్ సొంత అన్న చిరంజీవి వాహనాలను ధ్వంసం చేసినట్లే ఇప్పుడు కూడా వైసీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కడప జిల్లాలో కౌలురైతు భరోసా యాత్ర సందర్భంగా రాజంపేట నియోజకవర్గం సిద్దవటంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని కౌలు రైతు కుటుంబాల కష్టాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుంటారు. ఇప్పటికే సరైన ప్రణాళిక లేకుండా పరిపాలన సాగిస్తూ.. అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న వైసీపీకి ఇప్పుడు జనసేనాని కడప టూర్ గోరుచుట్టు మీద రోకలిపోటులా మారనుందా? అనే భయాలు ఆ పార్టీ నేతల్లో పట్టుకున్నాయంటున్నారు. రైతు భరోసా అంటూ పవన్ కళ్యాణ్ తమ జిల్లాకు వచ్చి, వైసీపీ సర్కార్ పైన, జగన్ పైన ఎలాంటి బాంబులు పేలుస్తారో అనే ఆందోళన పట్టుకుందంటున్నారు. మొత్తానికి జగన్ ఇలాఖాలో పవన్ కళ్యాణ్ పర్యటన వైసీపీ నేతుల, శ్రేణుల్లో తీవ్రమైన హీట్ కు కారణం అవుతుందా అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరుసగా రెండో రోజు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. యాప్‌ని డౌన్లోడ్  చేసుకోమంటూ రెండో రోజు సెల్‌డౌన్ కొనసాగించారు. ఉపా ధ్యాయ సంఘాలకు మద్దతుగా ఆందోళనలో టీడీపీ నేత అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యా య సంఘాల నేతలు మాట్లాడుతూ  ప్రభుత్వ విధానాలను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని స్పష్టం చేశారు. తమ సెల్ ఫోన్ లలో యాప్ డౌన్లోడ్‌నుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.  317 జీవో కారణంగా టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరిం చేందుకు గతంలోనూ హామీ ఇచ్చినా.. కనీసం చర్చించడం లేదన్నారు. కేవలం ప్రభుత్వానికి మద్దుతు ఇచ్చేవారితో చర్చించి.. వదిలేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బదిలీలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. జీవో 317 కారణంగా టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. సమస్యలు పరిష్కరించేందుకు గతంలోనూ హామీ ఇచ్చారు. అయినా కనీసం చర్చిం చడంలేదు. ఇప్పటికైనా బదిలీలు చేపట్టాలి.  వ్యక్తిగత సమాచారం చోరీ కోసమే యాప్ డౌన్లోడ్‌పై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని  అశోక్ ఆరోపించారు. ఉపాధ్యాయుల వ్యక్తిగత సమాచారం మాకెందుకు అంటూనే, మీరెక్కడెక్కడ తిరుగుతున్నారో మా వద్ద సమాచారం ఉందని అధికారులు బెదిరిస్తున్నార‌ని తెలిపారు.  ప్రభుత్వం ఇదే తరహా ఒత్తిడి కొనసాగిస్తే సెల్ డౌన్‌తో పాటు యాప్ డౌన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ డిమాండ్లు అంగీకరించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడమన్నారు. జగన్మోహన్ రెడ్డి నూతన విధానం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. 
ALSO ON TELUGUONE N E W S
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి పాన్ ఇండియా సినిమాలతో రైటర్ గా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ మరో భారీ పాన్ ఇండియా సినిమాకి శ్రీకారం చుట్టారు. 'ఆకాశవాణి' ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.   1882లో బంకించంద్ర ఛటర్జీ రచించిన బెంగాలీ నవల 'ఆనంద్ మఠ్' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి '1770' అనే టైటిల్ ని ఖరారు చేశారు. శైలేంద్ర కుమార్, సూరజ్ శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. చేతిలో ఖడ్గం పట్టుకొని బ్రిటిష్ సైన్యంతో పోరాడుతున్న వీరుడి పోస్టర్ ఆకట్టుకుంటోంది. అలాగే ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో తెలిపారు.     భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించే నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలో టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో నటించనున్నాడని తెలుస్తోంది.
ఆగస్టు 13న విడుదలైన 'కార్తికేయ-2' నాలుగు రోజుల్లోనే రూ.18 కోట్లకు పైగా షేర్ రాబట్టి నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటిదాకా నిఖిల్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రూ.16.55 కోట్లతో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఉండగా.. ఇప్పుడు 'కార్తికేయ-2' నాలుగు రోజుల్లోనే సరికొత్త రికార్డు సృష్టించడం విశేషం.   ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.11.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'కార్తికేయ-2'.. మొదటి రోజు రూ.3.50 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.81 కోట్ల షేర్, మూడో రోజు రూ.4.23 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.2.17 కోట్ల షేర్ రాబట్టింది. వీక్ డేస్ లోనూ జోరు చూపిస్తున్న ఈ చిత్రం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి నాలుగు రోజుల్లో రూ.13.71 కోట్ల షేర్(21.35 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. నాలుగు రోజుల్లో నైజాంలో రూ.5 కోట్ల షేర్(బిజినెస్ 3.50 కోట్లు), సీడెడ్ లో రూ.2.14 కోట్ల షేర్(బిజినెస్ 1.80 కోట్లు), ఆంధ్రాలో రూ.6.57 కోట్ల షేర్(బిజినెస్ 6 కోట్లు) వసూలు చేసింది.   నార్త్ ఇండియాలో 1.20 కోట్ల షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 1.05 కోట్ల షేర్, ఓవర్సీస్ 2.55 కోట్ల షేర్ కలిపి.. వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో 18.51 కోట్ల షేర్(32.15 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. నాలుగు రోజుల్లోనే బయ్యర్లకు రూ.5 కోట్లకు పైగా లాభాలు తీసుకురావడం విశేషం. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ.15 కోట్లకు పైగా ప్రాఫిట్స్ తెచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా నార్త్ లో రోజురోజుకి స్క్రీన్స్ పెంచుకుంటున్న ఈ సినిమా అక్కడ సంచలనాలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
మహమ్మారి దెబ్బకి గతేడాది పలు భాషలకు చెందిన సినీ పరిశ్రమలు డీలా పడిపోతే.. టాలీవుడ్ మాత్రం 2021 లోనూ పలు భారీ విజయాలను అందుకుంది. 2021 ప్రథమార్థంలో ఫిబ్రవరిలో 'ఉప్పెన', మార్చిలో 'జాతిరత్నాలు' విడుదలై చిన్న సినిమాలుగా వచ్చి చాలా పెద్ద విజయాలను అందుకున్నాయి. ఇక డిసెంబర్ లో వచ్చిన 'అఖండ', 'పుష్ప: ది రైజ్' సినిమాలు సరికొత్త రికార్డులు సృష్టించి టాలీవుడ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. 2021 లో ఘన విజయాన్ని అందుకున్న ఈ నాలుగు సినిమాలు.. అవార్డుల్లోనూ అదే జోరు చూపిస్తున్నాయి.   పదో 'సైమా' అవార్డు వేడుకలు సెప్టెంబర్ రెండో వారంలో ఘనంగా జరగనున్నాయి. 2021కి గాను అత్యధిక విభాగాల్లో నామినేట్ అయిన తెలుగు సినిమాల్లో 'పుష్ప', 'అఖండ', 'జాతిరత్నాలు', 'ఉప్పెన' టాప్ లో నిలిచాయి. ఏకంగా 12 విభాగాల్లో నామినేట్ అయ్యి 'పుష్ప' మొదటి స్థానంలో నిలవగా.. 'అఖండ'(10), 'జాతిరత్నాలు'(8), 'ఉప్పెన'(8) ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. మరి అవార్డుల విషయంలో వీటిల్లో ఏ సినిమా టాప్ లో నిలుస్తుందో చూడాలి. తమిళ్, కన్నడ, మలయాళ భాషల సినిమాలతో పోల్చినా కూడా అత్యధిక విభాగాల్లో నామినేట్ అయిన సినిమా 'పుష్ప'నే కావడం విశేషం. తమిళ్ నుంచి 'కర్ణన్'(10), మలయాళం నుంచి 'మిన్నల్ మురళి'(10), కన్నడ నుంచి 'రాబర్ట్'(10) అత్యధిక విభాగాల్లో నామినేట్ అయిన సినిమాలుగా నిలిచాయి.
When a Bollywood film is released, the entire country awaits it. But things have changed since then. Moviegoers claim that Bollywood films are losing their audience on a daily basis. Because many films with high anticipation are failing at the box office. Laal Singh Chaddha, starring Aamir Khan, and Raksha Bandhan, starring Akshay Kumar, also made the flop list, shocking the Bollywood industry.   No matter how many tests are conducted, Bollywood films continue to fail at the box office. The North audience is hoping for better days because there hasn't been much success recently. When it comes to South films, these films are causing a collection boom. The recently released films have received rave reviews from the public.   Recently Karthikeya 2 in Telugu , Karthi Viruman in Tamil and Tovino Thomas in Malayalam starrer Thallumala have been released and these are creating sensation at the box office. With four days of holiday approaching, whole collections for three films released in South will be phenomenal. Karthi Viruman is entertaining the BC audience in Tamil.   It appears that South films will dominate Bollywood in the future years.
  నిఖిల్ సిద్ధార్థ‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా చందూ మొండేటి డైరెక్ట్ చేసిన 'కార్తికేయ2' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఒక చిన్న సినిమాగా త‌క్కువ స్క్రీన్ల‌తో రిలీజైన ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌తో పాటు హిందీ వెర్ష‌న్ కూడా ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకుంటోంది. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేకీవెన్ సాధించి, ప్రాఫిట్స్ సంపాదించ‌డం స్టార్ట్ చేసేసింది. కాగా 'కార్తికేయ‌2' హిందీ వెర్ష‌న్‌కు ఫ‌స్ట్ డే కేవ‌లం 53 షోలు మాత్ర‌మే ల‌భించ‌గా, నేడు 5వ రోజు ఆ సినిమాకు ల‌భించిన‌ షోల సంఖ్య 1575 పైగా చేర‌డం అతి పెద్ద విశేషంగా భావిస్తున్నారు. ఆగ‌స్ట్ 13న త‌క్కువ షోల కార‌ణంగా కేవ‌లం రూ. 7 ల‌క్ష‌ల నెట్ వ‌చ్చిన ఈ సినిమాకు రెండో రోజు పెరిగిన షోలతో రూ. 28 ల‌క్ష‌లు వ‌చ్చాయి. మూడో రోజు సోమ‌వారం షోలు మ‌రింత‌గా పెరిగి ఏకంగా రూ. 1.10 కోట్లు వ‌చ్చాయి.  గ‌త వారం విడుద‌లైన బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్ ఆమిర్ ఖాన్ సినిమా 'లాల్ సింగ్ చ‌డ్ఢా', అక్ష‌య్ కుమార్ సినిమా 'ర‌క్షాబంధ‌న్‌'.. రెండూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. #BoycottLaalSinghChaddha అనే నెగ‌టివ్‌ స్లోగ‌న్‌కు ల‌భించిన విప‌రీత‌మైన ప్ర‌చారం ఆ సినిమాకు తీవ్ర న‌ష్టాన్ని చేకూర్చింది. ఫ‌లితంగా బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్‌లో ఒక‌టిగా 'లాల్ సింగ్ చ‌డ్ఢా' నిలించింది. అయితే దాన్ని క్యాష్ చేసుకోవ‌డంలో 'ర‌క్షాబంధ‌న్' మూవీ కూడా విఫ‌ల‌మైంది. ఇలా ఆ రెండు సినిమాల‌ను తిర‌స్క‌రించిన హిందీ ప్రేక్ష‌కులు.. 'కార్తికేయ‌2' సినిమాపై ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్నారు. ఫ‌లితంగా రోజు రోజుకూ అక్క‌డ మ‌న మూవీ వండ‌ర్స్ క్రియేట్ చేస్తోంది.
కష్టాల్లో ఉన్న అభిమానులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. క్యాన్సర్ బారిన పడిన అభిమానిని మెరుగైన వైద్యం కోసం మంచి ఆసుపత్రిలో చేర్పించి, స్వయంగా పరామర్శించి గొప్ప మనసుని చాటుకున్నారు. కృష్ణా జిల్లాకి చెందిన దొండపాటి చక్రధర్ మెగాస్టార్ కి వీరాభిమాని. చిరంజీవి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్న చక్రధర్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. అంతేకాదు సోమవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన చిరంజీవి.. అన్ని విధాలా అండగా ఉంటానని చక్రధర్ కి, అతని కుటుంబానికి భరోసా ఇచ్చారు. అలాగే వైద్యులతో మాట్లాడి చక్రధర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్.. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అభిమాని ఆరోగ్యం పట్ల చిరంజీవి చూపిస్తున్న శ్రద్ధపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్'. అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్‌ టైసన్‌ కీలక పాత్రలో కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ కంటే.. స్పెషల్ లో రోల్ లో నరించిన మైక్‌ టైసనే ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాకముందే నార్త్ లోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న విజయ్ కి ఈ సినిమా కోసం ఏకంగా రూ.35 కోట్ల రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మైక్‌ టైసన్‌ కి అంతకంటే ఎక్కువగా ఏకంగా రూ.40 కోట్ల రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు సమాచారం. బాక్సర్ గా మైక్‌ టైసన్‌ కి ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉంది. సినిమాకి చాలా కీలకమైన పాత్ర కావడంతో పాటు, ఆ పాత్రకి మైక్‌ టైసనే కరెక్ట్ అని భావించిన మూవీ టీమ్.. ఆయనకు భారీ మొత్తం చెల్లించి ఆ పాత్ర కోసం ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన అనన్యకు రూ.3 కోట్ల ఇచ్చినట్లు సమాచారం. అంటే హీరో, హీరోయిన్ ల ఇద్దరి రెమ్యునరేషన్స్ కలిపినా మైక్‌ టైసన్‌ కంటే తక్కువేనన్నమాట. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఆగస్టు 25న తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
బిగ్ బాస్ సీజన్‌-2 కంటెస్టెంట్, యాక్టర్ సామ్రాట్ రెడ్డికి ఆగష్టు 15 న కూతురు పుట్టింది. ఈ సంతోషకరమైన విషయాన్ని సామ్రాట్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ప్రకటించాడు. తన కూతురిని రెండు చేతుల్లో ఎత్తుకున్న ఫోటో ఒకటి ఈ పేజీ లో తన ఫాన్స్ కోసం షేర్ చేసాడు.  దీంతో సామ్రాట్ సన్నిహితులు, సెలబ్రిటీస్, ఫాలోవర్లు సామ్రాట్ కి విషెస్ చెప్తున్నారు. కోవిడ్ టైములో సామ్రాట్ కర్ణాటకకు చెందిన అంజనా శ్రీలిఖితను వివాహం  చేసుకున్నాడు. ఈ మ్యారేజ్ ఫంక్షన్ కి  బిగ్ బాస్ కంటెస్టెంట్స్ దీప్తి సునైనా, తనిష్ ఇలా ఎందరో హాజరయ్యారు. కొన్ని మూవీస్ లో  క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న సామ్రాట్.. ‘బిగ్ బాస్’ సీజన్-2లో ఛాన్స్ కొట్టేసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసాడు. తర్వాత అక్కడ  తనీష్‌తో మంచి ఫ్రెండ్ షిప్ బాండింగ్ ఏర్పడింది. ‘బిగ్ బాస్’ ఫినాలే వరకు వచ్చిన సామ్రాట్ ఫైనల్ ఫిఫ్త్ ప్లేస్ లో నిలబడ్డాడు.  ఆ ఎపిసోడ్ లో  కౌశల్ టైటిల్ గెలుచుకున్నాడు. సింగర్ గీతామాధురీ రన్నరప్‌గా, తనీష్ 3వ స్థానంలో నిలబడ్డారు. ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటికొచ్చిన సామ్రాట్ కి తర్వాత మూవీస్ లో పెద్దగా ఛాన్సెస్ ఏమీ రాకపోయేసరికి సోషల్ మీడియాలో పెద్దగా ఆక్టివ్ లేడు. ఇక ఇప్పుడు తనకు కూతురు పుట్టిందంటూ సోషల్ మీడియాలో ప్రకటించాడు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనిషి జీవితంలో నమ్మకమనేది ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలా విషయాలు నమ్మకంతో ముడిపడి ఉంటాయి. అయితే జీవితంలో లక్ష్యాలు సాధించే క్రమంలో నమ్మకం ఎందుకు అవసరం?? అది ఎంత వరకు ముఖ్యం?? దాని పాత్ర ఏమిటి?? నమ్మకం అనేది మనమీద మనతో ప్రారంభం కావాలి. మనం చేసే పనులపై మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే కొండల్ని సైతం పిండి చేయవచ్చు. మనం చేసే పనిపై పూర్తి నమ్మకం, శ్రమ, ఆలోచన అనేవి లేకుండా విజయాల్ని సాధించలేము. ప్రతి ఒక్కరు వారు చేసే పని చిన్నదైనా, పెద్దదైనా పరిపూర్ణతకోసం తపించాలి. ప్రతికష్టంలోనూ ఆనందం ఉంటుంది. ఉదాహరణకు నవమాసాలు మోసి ప్రసవవేదన తరువాత పుట్టిన బిడ్డను చూసి ఆ తల్లి ఎంతో ఆనందపడుతుంది. తన కష్టాన్ని బాధల్ని పూర్తిగా మరచిపోతుంది. అదేవిధంగా ఏ పనిచెయ్యడానికైనా కష్టం తరువాత ఆనందం వస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉంటే మనం మన జీవితంలో దేనినైనా జయించవచ్చు. నమ్మకం అనేది లేకపోతే మనం ఏ పనిని ప్రారంభించలేము. విజయాల్ని సాధించలేము. చీకటి వెనకాల వెలుగు ఎలాగైతే వుంటుందో అలాగే కష్టం వెనకాల ఆనందం, ఫలితం ఉంటాయని తెలుసుకోవాలి. మనకు ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా చేయగలం కాబట్టి మనకి ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి. ఏ పని చేస్తున్నా దానిలోని కష్టాన్ని, నష్టాన్ని కాక దానివల్ల లభించే ఫలితాలను గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే కష్టం, నష్టం గురించి ఆలోచిస్తామో అప్పుడే మనసు నిరాశలోకి జారుకుంటుంది. అదే మనిషిని లక్ష్యం నుండి వెనక్కి లాగుతుంది. కానీ అవేవి పట్టించుకోకుండా నమ్మకంతో పనిచేస్తే రాబోయే ఫలితం యొక్క ఆనందం కష్టాన్ని మరిపిస్తుంది. నేటికష్టం రేపటి ఆనందానికి పెట్టుబడి. అవుతుంది. సాధించగలమనే నమ్మకం ఉన్నప్పుడే ఆనందంగా కష్టపడగలం. సరైన ఆలోచనా విధానం కలిగి ఉండటం ప్రధానం మరి!! "ఏ లక్ష్యం లేకుండా తింటూ జీవించడం కంటే ఏదో ఒక లక్ష్యం కోసం చనిపోయినా ఫర్వాలేదు" అన్నారు ప్రముఖ కార్ల కంపెనీ తయారుదారు హెన్రీఫోర్ట్.  మనిషి తలచుకుంటే ఏ పని అయినా చెయ్యగలడు. అదేవిధంగా ఒక పనిని చెయ్యలేము అనుకుంటే ఆ పనిని ఎప్పటికీ చేయలేము. ఈ మాటలలో వైరుధ్యం ఏమీ లేదు. చెయ్యగలము, చెయ్య లేము రెండూ కరక్టే. ఒక లక్ష్యంతో విజయం సాధించిన వారు విజయం సాధించడానికి కారణం తాము అనుకున్న పనిని చేయగలమనే నమ్మకం, విశ్వాసం కలిగి వుండటమే! లక్ష్యాన్ని చేరుకోవటంలో విఫలం కావడానికి కారణం వారిలో విజయం సాధిస్తామనే నమ్మకం లేకపోవడమే తప్ప వారిలో సమర్ధత లేకపోవడం కాదు.చాలామంది  అంటారు మేము కష్టపడ్డాము అని, మేము ప్రయత్నం చేసాము అని. కానీ నిజానికి ప్రయత్నం చేయడంలో, కష్టపడటంలో కాదు మనం గెలవగలమో లేదో, సాధించగలమో లేదో అనే భావాన్ని మనసులో ఏ మూలనో ఉంచుకోవడం వల్ల విఫలం అవుతుంటారు. మనమీద మనకు నమ్మకం ఉండాలి. మనని మనమే నమ్మకపోతే ఇతరులు మనల్ని ఎందుకు నమ్ముతారు? అందుకే మనని మనం పూర్తిగా పరిపూర్ణంగా నమ్మాలి. జీవితంలో నమ్మకమనేది ఉంటే ఏదైనా సాధించగలం. మనం చేసే ప్రతిపనిలో నమ్మకమనేది ఉండాలి. నమ్మకమనేది వుంటే విజయాల్ని మనం సొంతం చేసుకోవచ్చు. నమ్మకం వెంటే విజయాలు వుంటాయి. నమ్మకం కలిగి ఉండటమే మన తొలి విజయం. ఇది నమ్మండి.                                          ◆నిశ్శబ్ద.
విద్య నేర్చుకో విలువ పెంచుకో అన్న మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే మనం విద్యావంతులం అయితేనే ఇతరులు మనలను గౌరవిస్తారు. విద్యను నేర్చుకోవడం వల్ల సమాజంలో మంచి స్థాయిని సంపాదించుకోవచ్చు. విద్యను బాగా నేర్చుకోవడం వల్ల సమాజంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు. విద్యను నేర్చుకోవడం వల్ల డబ్బును బాగా సంపాదించవచ్చు. ప్రస్తుత సమాజంలో విద్య అనేది చాలా అవసరం. ఎందుకంటే మనిషి బ్రతకాలంటే డబ్బు చాలా అవసరం. డబ్బు కావాలంటే చదువు ఉండాల్సిందే! విద్యలేనివాడు వింత పశువు అంటారు. ఇది నిజం! ప్రస్తుత సమాజంలో విద్యలేని వాళ్ళని వింత పశువులకింద భావిస్తారు. వాళ్ళని విలువ లేని వాళ్ళుగా భావిస్తారు. సమాజంలో విద్యలేనివారు గౌరవ మర్యాదలు కోల్పోతారు. అలాగే విలాసవంతంగా జీవితాన్ని గడపలేరు. తగినంత డబ్బును సంపాదించుకోలేరు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోలేరు. డబ్బు లేకపోయినా సమాజంలో జీవించవచ్చేమో కాని విద్య లేకపోతే జీవించడం అనేది కష్టం అవుతుంది. విద్యను నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు దానిని సద్వినియోగపరచు కోవాలి. మనం మన విద్యను సద్వినియోగ పరచు కోలేకపోతున్నామంటే అది నిర్లక్ష్యం అవుతుంది. అలా చెయ్యలేకపోతే ఆ విద్యకు అర్థం, పరమార్ధం రెండూ ఉండవు. విద్యను ఎంతవరకు నేర్చుకున్నా మన్నది ముఖ్యం కాదు, అలాగే ఎన్ని డిగ్రీలు సంపాదించామన్నది ముఖ్యం కాదు దానిని ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటున్నాము అన్నది ముఖ్యం. బాగా విద్యావంతులైన వారి జీవితాలు డబ్బు, గౌరవ మర్యాదలు, సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. ఒక తోటలో పువ్వులు లేకపోతే ఆ తోట ఎంత శూన్యంగా కనిపిస్తుందో అలాగే మనిషి జీవితంలో విద్య అనేది లేనప్పుడు జీవితం కూడా అంతే శూన్యంగా కనిపిస్తుంది. విద్యార్ధులు తమ విద్యార్ధి దశలోనే కష్టించి చదివి ఉన్నత ఫలితాలు సాధించడానికి కృషి చేయాలి. ఆ సమయాన్ని వృధా చేసుకొంటే జీవితాంతం విచారించే పరిస్థితి రావచ్చు. మన లక్ష్యాలను ముందుగా నిర్దేశించుకోవాలి. లక్ష్యాలను బట్టి ప్రతి పనీ నెరవేర్చుకోవడానికి సులభమవుతుంది. మనం ఎంచుకున్న లక్ష్యం మన మనస్సుకు నచ్చినదై ఉండాలి. నచ్చినపని అయితే అందరూ మెచ్చేవిధంగా చేస్తాము. లక్ష్యాలను ఎదుర్కోవడంలో వచ్చే అవరోధాలను ధైర్యంగా, సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. మన మనస్సులో సాధించాలనుకునే విషయం తప్ప మరొక విషయం ఉండకూడదు. మనసా వాచా ఆ విషయమే ఆలోచించాలి.  అర్జునుడు చెట్టుమీద పక్షిని గురి చూసి కొట్టడం అనే ఒక కథ ఉంటుంది. ఆ కథలో అర్జునుడు చెట్టును, చెట్టుమీద కొమ్మను చూడడు. కేవలం పక్షిని మాత్రమే చూస్తాడు, దాన్ని మాత్రమే చూడటం వల్ల అర్జునుడికి గురి కుదురుతుంది. లక్ష్యాన్ని ఏర్పరచుకున్నవారు ఆ కథను గుర్తు చేసుకోవాలి. యువకులు లక్ష్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకు కాలేజీలో చేరాము అనే విషయం మర్చిపోకూడదు. పరీక్షలలో ఉన్నత ఫలితాలను సాధించడానికి ప్రయత్నం చేయాలి. అందరూ అంటారు అంత మార్కులు, ర్యాంకుల మాయం అని. చదువుతున్న విఆహాయలు గురించి పరీక్షలు రాసి తెచ్చుకునే మార్కుల గురించి, ర్యాంకుల గురించి ఎందుకు బాధ. ప్రతి విద్యార్ధి కాలేజికి ఎందుకు వెళుతున్నారో ప్రతి రోజూ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే కాలేజీలో వారి సమయాన్ని వ్యర్ధం చేసుకోరు. మనలోని కాంక్ష తీవ్రతే మనల్ని లక్ష్యం వైపునకు నడిపిస్తుంది. లక్ష్యాన్ని సాధించడానికి విజువలైజేష్ చేయటం మరొక మంచి పద్ధతి. కాబట్టి లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి, దాన్ని సాధించుకోవాలి.                                         ◆నిశ్శబ్ద.
ప్రస్తుతం భారతదేశం ఎన్నో మతాలకు నిలయం. ఎక్కడినుండో వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటుంది. శరణార్థులకు భరోసా ఇస్తుంది, విదేశీ కంపెనీలకు వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికి వేదిక ఇచ్చింది, పొరుగువారిని ప్రేమించాలి అనే మాటను పాటిస్తుంది. అయితే ప్రపంచదేశాలతో అభివృద్ధి కోసం పరుగులు పెడుతున్న భారతదేశం ఒకప్పుడు బానిసగా మారి ఉక్కు పిడికిళ్లలో చిక్కుకుని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడి చివరికి ప్రాణత్యాగాలు చేసి తన స్వేచ్ఛను సంపాదించుకుంది.   గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి కారణంగా స్వాతంత్ర్య సంబరాలను ఘనంగా జరుపుకున్న దాఖలాలు లేవు. ఈసారి మాత్రం దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా దేశం యావత్తు ఘనంగా వజ్రోత్సవాలు జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట భారత ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.    ఎర్రకోట మీద భారతీయ జండాను ఎగురవేసి భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటించే ప్రధానమంత్రుల ఆలోచనల్లో నాటి జవాహార్ లాల్ నెహ్రు నుండి నేటి ప్రధాని మోడీ వరకు అందరూ ఆగస్టు 15న కాకుండా జనవరి 26 నే స్వతంత్య్ర దినోత్సవాన్ని ప్రకటించే ఉద్దేశంలోనూ, అదే అసలైన స్వాతంత్ర్య దినమని భావిస్తారట. అయితే దీని వెనుక కారణం ఏమిటనేది పరిశీలిస్తే.   జవహర్ లాల్ నెహ్రు తన తండ్రి మోతీలాల్ నెహ్రు నుండి భారతజాతీయ కాంగ్రెస్ బాధ్యతలను స్వీకరించారు. మోతీలాల్ నెహ్రూకు డొమినియన్ హోదా పట్ల ఆసక్తి ఉండేది. అయితే 40 సంవత్సరాల జవహర్ లాల్ నెహ్రూకు అది నచ్చలేదు ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. బ్రిటిష్ పాలన నుండి పూర్తిగా విడిపోవాలని ప్రతిపాదించారు. అప్పటి జాతీయ కాంగ్రెస్ సభ్యులయిన బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, అరబిందో మరియు బిపిన్ చంద్ర పాల్ వంటి ఇతర కాంగ్రెస్ నాయకులు ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆ ప్రతిపాదన కాస్తా భారతదేశ స్వతంత్ర్యాన్ని కోరుతూ డిమాండ్ గా ఏర్పడింది. ఆ తీర్మానం ఆమోదించబడిన కారణంగా 1930 జనవరి చివరి వారంను "పూర్ణ స్వరాజ్" గా నిర్ణయించింది.    దీని ఆధారంగానే జనవరి 26 న స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భారతీయులను కోరింది. అంతకు ముందు 1929, డిసెంబర్ లో లాహోర్ లో రావి ఒడ్డున జాతీయ జెండాను ఎగురవేసిన సందర్భంగా "కాంగ్రెస్ అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటు చేయబోతోంది, స్వాతంత్య్రం కోసం పోరాడండి" అని పిలుపునిచ్చింది. అప్పటి నుండి భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26 నే స్వతంత్రంగా జరుపుకునేవారు.   అనేక సంవత్సరాల పోరాటం తరువాత బ్రిటిష్ వారు భారతదేశం మీద తమ ఆధిపత్యాన్ని వదులుకోవలసి వచ్చింది. అప్పుడు భారతదేశానికి చివరి బ్రిటిష్ గవర్నర్ గా లార్డ్ మౌంట్ బాటన్ ఉండేవారు. జూన్ 30, 1948 నాటికి భారతదేశానికి అధికారం బదిలీచేయాలని అతనికి ఆదేశాలు వచ్చాయి. అయితే అది ఆలస్యమవుతుందని, పట్టులో ఉన్న భారతదేశ పోరాటాన్ని ఎక్కడ నీరుగారుస్తారో అని భారతదేశ సమరయోధులకు ఈ తతంగం నచ్చలేదు. భారత జాతీయ కాంగ్రెస్ వారు కూడా దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు.    ఈ ఒత్తిడుల కారణంగా మౌంట్ బాటన్ బ్రిటిష్ వారికి ఇంత ఆలస్యం చేయడం వల్ల రక్తపాతం, అల్లర్లు పెరుగుతాయని సూచించాడు.    ఆగస్ట్ 15 తేదీ వెనుక తిరకాసు!! రెండవప్రపంచం యుద్ధంలో జపాన్ లొంగిపోయింది. అది కూడా ఆగస్ట్ 15 వ తేదీన లొంగిపోయిన కారణంగా అదేరోజును తాను భారతదేశానికి స్వతంత్ర్యాన్ని ప్రకటించడంలో నిర్ణయించుకున్నట్టు మౌంట్ బాటన్ తన మాటలలో వ్యక్తం చేశారు. అదికూడా మొదట ఆగస్ట్ లేదా సెప్టెంబర్ అనే ఆలోచనలో ఉన్నా కేవలం జపాన్ ప్రపంచ యుద్ధంలో లొంగిపోయి రెండవ వార్షికోత్సవం జరుపుకుంటున్న కారణంగా దానికే మౌంట్ బాటన్ మొగ్గుచూపారు. అంటే భారతదేశం విషయంలో తాము ఓడిపోయినా భారతీయులకు ఇచ్చిన స్వాతంత్ర్య దినోత్సవ తేదీ విషయంలో తమ విజయాన్ని వ్యక్తం చేసుకున్నారు.    బహుశా ఇదొక పైశాచిక ఆనందం కావచ్చు. భారతీయ ప్రజలకు కేవలం స్వేచ్ఛ దొరికిందనే ఆనందంలో ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు. దీనివల్ల భారతీయులకు నష్టమైతే ఏమి లేదు. కానీ తమ ఓటమిలో కూడా తమదే పైచేయి అనిపించుకున్న ఈ బ్రిటిషు వారి ఆలోచన తెలిస్తే మాత్రం అందరూ ఆగస్టును కాదని జనవరికే జైకొడతారేమో!! -నిశ్శబ్ద
సర్వేంద్రియానాం నయనం ప్రాధానం అంటే మనకు కళ్ళే కీలకం సమస్త సృష్టిని చూసేది మన కళ్ళే. మనకంటికి కనపడిన వెంటనే మనసు స్పందిస్తుంది. అయితే కళ్ళు ఉండీ నిజాన్ని చూడలేని వాళ్ళ కన్నా. కళ్ళు లేనువాళ్ళే స్పందించే తీరు జీవితం లో వేరుగా ఉంటుంది. వారి జీవితం సవాళ్లతో కూడుకుని ఉంటుంది.సవాళ్ళను అధిగమిస్తూ మేము ఎవరికీ తీసిపోము అన్నట్లుగా తమ జీవితాన్ని పలువురికి ఆదర్శ ప్రాయంగా ఉంటారు అంధులు అయితే అయితే కళ్ళను చూసి మనకు ఉన్న వ్యాధులను గుర్తించ వచ్చని నిపుణులు పేర్కొన్నారు.కంటిద్వారా మనకు ఉన్న వ్య్సధులను ఖచ్చితంగా అంచనా వేయవచ్చని. అవికూడా ప్రస్తుతం ఉన్న వ్యాధులను. భవిష్యత్తులో వచ్చే వ్యాధులను కూడా గుర్తించవచ్చని. ఇది భారతీయులు ముఖ్యంగా మన పూర్వీకులు మనకు ఇచ్చిన నాడీ వైద్యం లో ప్రస్తావించారని పెర్కిన్నారు.మన కళ్ళను బట్టి మన అనారోగ్య సమస్యను గుర్తించవచ్చు. చలామంది హెల్త్ చెకప్ పేరుతో ఆరోగ్యం పై హెల్త్ చెకప్ అందరూ చేయించు కోలేరు.అయితే వారి వారి కళ్ళను చూసి వారి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం సాధ్యమని అంటున్నారు ప్రముఖ నాడీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు. మీకళ్ళు నిప్పుకనాళ మాదిరిగా ఎర్రగా ఉన్నాయా... కొందరి కళ్ళు నిప్పుకనాళ లాగా ఎర్రగా ఉంటాయి. వైద్యుడు పరీక్షించి చూస్తే రెటీనా పైన చిన్న చిన్న రక్తకణాలు కనబడతాయి.దీనికి కారణం అధిక రక్త పోటు అధిక రక్త పోటు కారణంగా కంటిలోని నరాలు ఎర్రగా మారుతాయి. కొన్ని సార్లు అవి పగిలిపోవడం కూడా జరగ వచ్చు. దాంతో కళ్ళు ఎర్రగా కనబడతాయి. అయితే ఈ విషయం నాలుగో వంతు మందికి తెలియదు. ఇలాంటి సమస్య ఉన్నవారు గుండె పోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువేఅని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కళ్ళు ఎర్రబడితే ఆ ఏం జరుగుతుంది లె అని వదిలి వేయకండి ఇది హై బిపి కార్డియోక్ ఇండికేషన్ అని జాగ్రత పడాలి అని అంటున్నారు నిపుణులు. కళ్ళు తెల్లగా పాలిపోయి నట్లు ఉంటె.. దీనిని ఎనిమియా సమస్యగా పేర్కొన్నారు.అంటే రక్త హీనత అని చెప్పవచ్చు. ఇది మీ అనారోగ్య సమస్యగా చెప్పవచ్చు.శరీరంలో సరైన పోషకాలు లేనండువల్లె శరీరంలో రక్త హీనత వస్తుందని ఒక్కోసారి రక్త హీనత మరిన్ని సమస్యలకు దారితీయ వచ్చు. కళ్ళు ఎర్రగా రక్తం కారినట్లు ఉంటె.. ఒక్కొకరిలో కళ్ళలో రక్తం కారినట్లు ఉంటాయి. రక్తంలో ప్లేటి లెట్స్ తగ్గడం వల్ల ఇలా కనిపిస్తుంది. కను గుడ్డు పోటు రావడం.. శరీరంలో డీ హైడ్రేషన్ వల్ల లేదా మెడ నరాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కనుగుడ్డు ముందుకు వస్తుంది. కంటి రెప్పల పై ఉండే హెయిర్ ఊడిపోవడం.. కనురెప్పల పైన ఉండే జుట్టు ఊడి పోవడం అంటే ఇది క్యాన్సర్ కు ఇండికేషన్ గా చెప్పవచ్చు.కనురెప్పలు ఒక్కోసారి డ్రై కావడం--కంటి నుండి ఎక్కువనీరుకారడం. సైనస్ లేదా నోజేల్ సూబ్ బ్లాక్స్ ఉండడం. ఈ కారణంగా సైనస్ సమస్యలు ఉంటె ఇలాంటి సమస్యలు వస్తాయి. కళ్ళు పెద్దవి గా కనిపించడం.. శరీరంలో హార్మోన్స్ సమస్యల వల్ల లేదా సమతౌల్యం లేదా థైరాయిడ్ వల్ల కళ్ళు ముందుకు వచ్చినట్లు. పెద్దవిగా కనిపిస్తాయని నిపుణులు విశ్లేషించారు.కంటి వెనుక భాగం లో పసుపు పచ్చగా కొవ్వు ఉన్నట్లు కనబడుతుంది లేదంటే రెటీనా చిన్న చిన్న నీటిబొట్లు కనబడుతుంది.ఇలాంటి వారిలో టైపు 2 డయాబెటీస్ వ్యాధి వచ్చే అవకాసం ఉంది. కళ్ళు పసుపు పచ్చగా ఉంటె.. కొందరి కళ్ళు పసుపు పచ్చగా కనిపిస్తే దాని ఆర్ధం కాలేయ సమస్య ఉందని అంటున్నారు. కళ్ళు ఇలా మారిపోడానికి కాలేయం పనితీరులో తేడా ఉండడమే. అందువల్ల వెంటనే వైద్యుడిని సలహా తీసుకుని సంప్రదించడం ఉత్తమం సమస్యనుండి బయట పడగలం.దీనిని వైద్య పరిభాషలో లివర్ బైల్ సేక్రేషణ్ ఎక్కువకవాడమని వైద్యులు నిర్ధారించారు. కళ్ళు పొడి బారడం -లేదా అయిడ్రై నెస్.. సహజంగా శరీరానికి అందాల్సిన విటమిన్ ఏ సరిగా అందక పోవడం జిరాప్ గాల్దిమియా అని అంటారు. కళ్ళలో నీరు కారడం.. కండ్లకలకఅంటే కండ్ల లో వచ్చ్ఘే ఇన్ఫెక్షన్ సహజంగా వర్స్ఘాకాలం లో వచ్చే సమస్య.ఇది ఒక్కోసారి ఒకరి నుండి మరొకరికి సోకే అవకాసం ఉంది కాబట్టి కండ్లకలకకు దూరంగా ఉండడం అవసరం సకాకంలో వైద్యుని సూచన మేరకు కంటి లో డ్రాప్స్ వాడాలేతప్ప సొంత వైద్యం చేయరాదని అలా చేస్తే కళ్ళు పోయే ప్రమాదం ఉందని తెలిపారు. కండ్లు గడ్డ కట్టి నట్టుగా ఉండడం.. ఐ స్టేయ్స్ అంటే కండ్లలో గడ్డలు.. కంటిలో ఏవిధమైన డస్ట్ వచ్చి చేరినా కండ్లలో గద్దలగా తయారు అవుతుంది.  కళ్ళు నీలి రంగులోకి మారడం.. మనశరీరం లో బ్రెయిన్ కిఆక్సిజన్ సరిగా అందక పోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల కళ్ళు నీలిరంగులోకి మారవచ్చని తెలుస్తోంది. ఐ బ్యాగ్స్.. కంటికింద బ్యాగ్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. సహజంగా అతిగా మధ్యం తాగేవారిలో లివర్ సమస్యలు కంటికింద ఐ బ్యాగ్స్ లాగా వస్తాయి. కళ్ళు మండడం.. కళ్ళు మండడం సహజంగా వచ్చే సమస్య. అయితే కళ్ళు మండ దానికి కారణాలలో ఎక్కువ కాంతి చూడడం.లేదా ఎక్కువ కాంతిలో పనుచేయడం. ఒత్తిడికి గురికావడం. నిద్రలేమి వంటి సమస్యలు ఉన్నందున కళ్ళు మండడం లేదా మీరు పనిచేసే ప్రాంతాలలో రసాయనాల మధ్య లేదా దుమ్ము ధూళి ఉన్నచోట కళ్ళు మండడం సహజంగా ఉంటుంది. కళ్ళు మూతలు పడడం.. కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. ఇది ఒక న్యురోలోజికల్ దిజార్దర్ గా పెర్కిన్నారు. ఈ సమస్యకు కారణం బాగా నిల్వ ఉన్న తీసుకున్న వారికి వస్తుందని నిపుణులు నిర్దారించారు. కంటి కింద నల్లటి వలయాలు .. కొందరిలో కంటికింద నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. దీనికి కారణం స్టమక్ దిజార్దర్ గా పేర్కొన్నారు. కాగా సహజంగా ఒత్తిడికి గురికావడం. లేదా యాన్కజైయిటీ వల్ల కంటికింద న్హల్లటి వలయాలు వస్తాయని నిపుణులు తేల్చి చెప్పారు. కళ్ళు డీవియేట్ కావడం.. శరీరంలో కళ్ళు ఒక్కోసారిషిఫ్ట్ అవుతూ ఉంటాయి.దీనికి కారణం  పోషక ఆహార లోపంగా పేర్కొన్నారు. అంటే సరైన పోషకాలు  లేనండువల్లె కళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటాయికళ్ళను పరిశీలించడం ద్వారా ఎన్నోరకాల రుగ్మతలను చెప్పవచ్చ్గు. నాడీ పతి ద్వారా ఎన్నోరకాల రుగ్మతలను చెప్పుకోవచ్చు. ఈ పద్దతిని నాడీ పతి లో ఇరిదోలజీ అని అంటారు.మనం చెప్పుకున్న కొన్ని అంశాలు పైకి కనిపించే కళ్ళ యొక్క సిమ్టమ్స్  ను ఆధారంగా ఏదైనా లక్షణం కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. దీనిఆదారంగానే చికిత్చ తీసుకోవచ్చు అని నిపుణులు పేర్కొన్నారు.  
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నాయి! ఒక్క ప్రశ్న మనం నిజంగానే అన్నిట్లో స్వేచ్చగా స్వతంత్రంగా ఆలోచిస్తున్నామా? దేశం పార్ల మెంట్ లో చర్చకు అవకాశం లేకుండా చేస్తున్న చట్టాల పై చర్చ లేకుండా చట్టాలను అమలు చేస్తున్న మన ప్రభుత్వాలు ప్రాజాస్వామ్య యుతంగా వ్యహరిస్తున్నాయా. ప్రజా అభిప్రాయానికి ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా. ప్రజా భి ష్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుకు సిగ్గుపడాలి. స్వతంత్ర భారతావనిలో మనరాజ్యాంగం బ్రిటీష్,అమెరికాల రాజ్యాంగాల పై ఆధార పడ్డాము. ఎన్నికలు వ్యవస్థ మరొకరిపై ఆధారపడ్డా ము.ఇప్పటికీ మన చట్టాలు బ్రిటీష్ పోలీసు వ్యవస్థలోని చట్టాలను అమలు చేస్తున్నాము. అంటే చట్టాలు కూడా ఇంకొకరి నుండి అరువు తెచ్చుకున్నవే. అక్కడా మనం డిపెండెన్సీ యే. ప్రస్తుతుం మన విద్య విధానం సైతం మెకాలే విధానమే అక్కడా మనం డిపెండెంట్.మనకంటూ ఒక ఆరోగ్య విధానం లేదు.ఇంకా వైద్య విధానంలోనూ విదేశాలనుండి తెచ్చుకున్నది అంటే ఇక్కడా మనం డిపెండెంట్.వన్ చైనా అని వాళ్ళు అంటే వన్ ఇండియా వన్ నేషన్, వన్ రేషన్ అని అక్కడా మనం డిపెండెంట్. దేశంలో దేశభక్తికి మేమే పేటెంట్ అంటూ బోరవిరుచుకు తిరుగుతున్న మనం పెట్టుబడులకోసం విదేశాల పై డిపెండెంట్.ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటూ.దేశ సంపద పెంచమంటే సంపదనే వేరొకరికి ఇచ్చి వేరొకరి పైన డిపెండెంట్.ఆఖరికి సినిమా కధలు పాటలు,సంగీతం సైతం వేరేదేశపు కధలు అంటే అక్కడా మనం డిపెండెంట్. ఇక ఎన్నికల సమయానికి అక్కడ ఈ వి ఎం లు ఉంటె అక్కడా మనం డిపెండెంట్. ఇందుగలదు అందులేదు సందేహము వలదు డిపెండెన్సీ అన్నిటా ఉందనేది వాస్తవం.ఇక దేశం లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనకంటూ ఒక ఆరోగ్య విధానం అవసరం.    దేశంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అదే మన పాలనా విదానం కావాలి... 2౦19 లో కోవిడ్ వచ్చిన తరువాత కూడా మనదేశ ప్రజలకి ఇది మనదేశం లో సమగ్ర ఆరోగ్యవిధనమంటూ ప్రకటించిన దాఖలాలు లేవు అనే చెప్పాలి.2౦ 19 లో వచ్చిన ఉపద్రవం నుంచి మనం నేర్చుకున్న గుణపా టాలు ఏమిటి ? తీవ్రంగా తరుముకొస్తున్న వైరస్ ను గుర్తించడం వాటికి తగ్గట్టుగా మనం యుద్ధానికి ఎలా సన్నద్ధం కాగలం ఎక్కడ నుంచి వచ్చిన్నా యుద్ధం చేయాలంటే మనకంటూ యుద్ధనీతి ఉండాలి కదా?అసలు  ఏ పద్దతిలో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారో అర్ధం కాని ప్రభుత్వాలు పాలించడం గమనార్హం. ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేశామన్న ప్రకటన లు తప్ప ఆచరణ సాధ్యం కాలేదు. నేటికీ సగటు గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ఆర్ధికంగా వెనక పడ్డ జిల్లాలు రాష్ట్రాలలో ప్రస్తుతం ప్రజల ఆరోగ్య ఎలా ఉంది వాళ్ళ అవసరాలు, నిధుల కేటాయింపు జరిగిన దాఖలాలు ఎక్కడా లేదు. పట్టణ ప్రాంతాలలో  కార్పోరేట్ ఆసుపత్రుల లో వైద్యం పేదలకి అందని ద్రాక్ష,  ప్రభుత్వ ఆసుపత్రుల లో సౌకర్యాలు లేక రోగిని వెక్కి రిస్తాయి.  రోగికి వైద్యుడికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. తాను చెప్పిదే వేదం అన్నట్లుగా తాను చేసిందే వైద్యం అన్న చందం గా సాగిపోతోంది.అసలు రోగి సమస్య ఏమిటి ఏ వైద్యం చేస్తున్నారు, చికిత్స తరువాత రోగి స్థితి ఏ మిటి అన్నదే ప్రశ్న?నిండు గర్భిణి వచ్చినా నొప్పులు పడుతున్న తమకు పట్ట దన్నట్లు జిల్లా ఆసుపత్రి కి తీసుకు పోవాలని సూచిస్తారు, జిల్లా ఆసుపత్రికి వెళితే బెడ్లు లేవని వేరే ఆసుపత్రికి తీసుకు పోవాలని సూచిస్తారు. అలా నొప్పులు పడుతున్న సగటు గర్భిణి అన్నీ తిరిగే లోపు  పిల్లాడిని కానీ చనిపోతుంది. లేదా పుట్టిన పిల్లవాడు పిల్ల చనిపోతుంది లోపం ఎక్కడా ఉంది సమస్యలు వచ్చినా తెలిసినా ప్రతినిధులు ఆరోగ్యా అధికారులు చర్యలు చేపట్టరు.  అక్కడ వైద్యుల దారి వారిదే రోగుల దారి వారిదే అన్నట్లు ఉంటుంది.గ్రామీణ అజెన్సీ లలో పరిస్థితి మరీ దారుణం. సమయానికి వైద్యులు రారు మందులూ ఉండవు. ముఖ్యంగా సీజన్ వస్తున్న దోమతెరలు ఇవ్వరు. మందులూ ఉండవు. గట్టిగా  రోడ్డు ప్రమాదాలు జరిగిన అత్యవసర వైద్యం లేదా శస్త్ర చికిత్స చేయడానికి వైద్యులు ఉండరు. కనీసం పురుడు పోయడానికి డాక్టర్స్ ఉండరు.అక్కడ ఆరోగ్య కేంద్రాలలో  కనీస సౌకర్యాలు లేవని ఒక ఆరోగ్య కేంద్రానికి ఒకే డాక్టర్ ఉన్నాడని. కనీసం మందులు కూడా లేవని కేంద్రానికి నివేదిక ఇచ్చినా చేసింది లేదు.  ప్యాం డమిక్ తరువాత అయినా కనీస సౌకర్యాలు కల్పించక పోవడం పై సర్వాత్రా విమర్శలు వస్తున్నాయి.కార్పోరేట్ కు దీటుగా ప్రభుత్వ  ఆరోగ్య సేవలు మాటలకే పరిమిత మయ్యాయి.అటు ప్రభుత్వ ఆసుపత్రికి పోలేక ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకు పోలేక సగటు మధ్య తరగతి ప్రజలకు మీరు చేసింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? చేయాలనీ అనుకున్నది ఏమిటి?అన్న ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర  సమాధానాలు లేవు ఇతరులతో పోలిస్తే మేము చేసిందే కరెక్ట్ అని చెప్పుకుంటూ వేరొకరితో పోల్చుకుంటూ బతికేస్తారు.మీ సమర్ధతకు నిదర్శనాలు ఇవే వీటి గురించి ఒక్కసారి చూద్దాం.దేశంలో కోవిడ్ కేసులు త్వరిత గతిన పెరుగుతున్నాయి. వీటి విస్తరణను నియంత్రించడానికి మీ ప్రణాళిక ఏమిటి కేవలం కొన్ని నిబందనలు అమలు చేస్తే చాలా? ఒమేక్రాన్ నియంత్రించే యాంటి బాడీలు లను శాస్త్రజ్ఞులు గుర్తించారు అవి వాటి ఫలితాలు ఎప్పటికి అందేను. ఎప్పటికి అందుబాటులోకి వస్తాయి అన్నది ఇంకా పూర్త్జిగా చెప్పలేని స్థితి.కోవిడ్ ను నియంత్రించడానికి మేమే  వ్యాక్సిన్ కనుక్కోనాం అని చెప్పుకున్నాం ఎనిమిది వ్యాక్సిన్లు నాలుగు చికిత్సలు గా సాగుతుంది. మహారాష్ట్రా, దిల్లో లో అప్పుడు కోవిడ్ ఇప్పుడు ఓమిక్రాన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి మరి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎప్పుడు ముందుగా నమోదు అయ్యేది పెద్దసంఖ్యలో బాదితులు ఉండేది పెద్దనగారాల లోనేనా అంటే ఆర్ధికంగా దేబ్బతీయడానికి ఏదైనా కుట్ర లేదుకదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారా అన్న అనుమానం వస్తోంది.  నియంత్రణ లోపమ నిఘా లోపమా చెప్పాలి.పోస్ట్ కోవిడ్ తరువాత అనారోగ్యాన్ని నియంత్రించడం కష్టంగా ఒక సవాల్ గా మారింది. అసలు ఈ సమస్యకు ఇదే చికిత్స అని నిర్దిష్టంగా చెప్పలేని వైద్యులు శాస్త్రజ్ఞులు ఉన్నారు. 695 ఆసుపత్రులు క్లినిక్లు రైల్వే స్ కు సాఫ్ట్ వేర్ ను అనుసంధానం చేసారు. అక్కడితో ఆపని పూర్తి అయిపొయింది. కోవిడ్ చికిత్సకు నాట్కో ఫార్మా మోలో ను పిరావిడ్ క్యాప్సుల్ ను సిద్ధం చేసేసమాన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 16. 67 కోట్లు వినియోగించని వ్యక్సిన్ల నేటికీ అందుబాటులో ఉన్నాయి వీటిని వినియోగించే విషయంలో ప్రభుత్వం ఏమిచేయాలని అనుకుంటుంది.కోవ్యాక్సిన్ తీసుకున్న వారు కోవి షీల్డ్ బెటర్ బూస్టర్ గా పేర్కొన్నారు డాక్టర్ షాహీద్ జమీల్ వైరాలజిస్ట్ టెక్నాలజీ వృద్ధి సాధించారు. గుర్గాం ఆసుపత్రిలో కోవిడ్ రోగులకి 25% బెడ్స్ కావాలంటూ డిమాండ్ చేసారు. మీరట్ లో సర్జరీ తరువాత 27 మందికి కంటి చూపు కోల్పోయారు.అంటే చికిత్స లో లోపమా అంత పెద్దమోతం లో కంటి చూపు పోయిన వారికి అంధత్వం ప్రసాదించిన ఘనకర్యానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి. ఫార్మా రంగం... కార్చి వ్యాక్స్ బూస్టర్ గా క్లినికల్ ట్రైల్స్ నడుస్తున్నాయి.అసలు ఒమేక్రాన్ ను ఎదుర్కోగలిగిన సమార్ధవంత మైన వ్యాక్సిన్లు లేవాకోవేక్సిన్ కు ప్రత్యామ్నాయం లేదా లేదా ఇతర కంపెనీలు ఉత్పత్తి చేయడం సాధ్యం కావడం లేదా.కోవిడ్  వ్యాక్సిన్ విధానం డోసుల విషయం లో జాగ్రత లేదా సంరక్షణ బద్రత అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోందా.యు ఎస్ భారత్  సంయుక్తంగా ఆరోగ్య రంగం లో కృషి చేయాల్సి ఉంది.డొమెస్టిక్ ఫార్మా కంపెనీలు మేర్క్స్ కోవిడ్ పిల్ ఉత్పత్తి కి సిద్ధమయ్యాయి.కోవిడ్ తో మనం కలిసి సహజీవనం చేయాల్సిందే. అని డబ్ల్యు హెచ్ ఓ చేసిన ప్రకటన వాస్తవనేనా.కోవిడ్ 19 మిగిల్చిన భయంకరమైన అనుభవం తో నైనా మనం ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వక తప్పదు.కోవిడ్ ను ఎదుర్కోడానికి మరిన్ని వ్యక్సిన్ల పై పరిశోదనలు సాగాలని త్వరిత గతిన వైరస్ అంతానికి పరిశోదనలు  సాగించాల్సిన అవసరం ఉంది.ఆదిశగా ప్రయాత్నం సాగిస్తారని ఆశిద్దాం. న్యూట్రిషియన్, సంబందిత అనారోగ్యం, కిడ్నీ రోగులకు, ఫ్రీ కాప్సియా,గర్భిణీ స్త్రీలు ఇతర హైపర్ టేన్సివ్ డిజాస్టర్. వంటి సమస్యలు. ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శస్త్ర  చికిత్స సమస్య కు సరైన నూతన విధానం ప్రజలకు చౌకైన మెరుగైన ఉచిత వైద్య విధానం అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. అందుకే ఎ ప్రభుత్వమైనా రానున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సామాగ్ర ఆరోగ్య విధానం తో ప్రజలముందుకు రావాలని ఆశిద్దాం.