వర్తమాన రాజకీయ, సామాజిక అంశాలపై తెలుగువన్ ‘వాస్తవ వేదిక’పై తెలుగువన్ ఎండీ రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్   విశ్లేషణాత్మక చర్చ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లోకి మార్చడంపై జరుగుతున్న చర్చ   రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ‘వాస్తవ వేదిక’ ఈ సంచికలో ఆ అంశంపై విశ్లేషణాత్మక చర్చ జరిపారు.   ఆంధ్ర ప్రదేశ్ లో మెడికల్ కాలేజీల నిర్వహణపై   అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.  గత ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించాలనే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాన్ని   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  అయితే  ప్రభుత్వం నేరుగా మెడికల్ కాలేజీలను నడపడం ఒక రకమైన  మూర్ఖత్వమని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ఏడు దశాబ్దాల తరువాత కూడా  ప్రభుత్వ ఆసుపత్రులు కిలోమీటర్ దూరం నుంచే గుర్తుపట్టగలిగేంత దుర్వాసనతో, అపరిశుభ్రంగా ఉంటున్నాయన్న ఆయన. విపరీతమైన   రద్దీ,  వైద్యుల కొరత, పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రభుత్వ వైద్యం ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం లేదని చెప్పారు.  ఇక  గత ప్రభుత్వం పార్వతీపురం, పిడుగురాళ్ల వంటి మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలను ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదన పూర్తిగా హేతు రహితం. ఎందుకంటే..మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం మెడికల్ సీట్లు రావాలంటే  అర్హత కలిగిన ఫ్యాక్ ల్టీ అంటే ప్రొఫెసర్లు ఉండాలి.  పెద్ద డాక్టర్లు లేదా ప్రొఫెసర్లు మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.  నారాయణ వంటి ప్రైవేట్ సంస్థలే నెలకు 15 లక్షల రూపాయల జీతం ఇచ్చినా మంచి ప్రొఫెసర్లను తెచ్చుకోలేకపోతున్నాయి. అటువంటప్పుడు ప్రభుత్వ పే-స్కేల్స్‌తో వారు ఎలా వస్తారన్నది పెద్ద ప్రశ్న. ఇక మారుమూల ప్రాంతాలకు రావడానికి అర్హత కలిగిన వారు రావడానికి ఇష్టపడకపోవడానికి వారి పిల్లల చదువులు, కుటుంబ వసతులు వంటివి అవరోధాలుగా మారుతున్నాయని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.    ఇక పీపీపీ మోడల్ అన్నది ఈ సమస్యలకు పరిష్కారమా? వ్యాపారమా అన్న విషయానికి వస్తే.. ఈ పీపీపీ మోడల్ అన్నది దేశంలో కొత్తదేమీ కాదు,   హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్, కృష్ణపట్నం, గంగవరం పోర్టులు, జాతీయ రహదారులు ఇదే మోడల్‌లో విజయవంతంగా నడుస్తున్నాయి. అటువంటప్పుడు అదే పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీల నిర్వహణకు అభ్యంతరమెందుకని ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి పీపీపీ అంటే పేరుకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఆచరణలో మాత్రం   ప్రైవేట్ నిర్వహణే అన్నారు.  ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీల సీట్ల ధరలు భారీగా ఉన్నాయి.   సీటు 50 లక్షల నుండి కోటి  రూపాయల వరకూ,  అదే పీజీ అయితే   3 నుండి 5 కోట్ల  రూపాయల వరకూ ఉన్నాయి. కానీ ప్రైవేట్ యాజమాన్యం లాభాపేక్షతోనైనా సరే ఆసుపత్రులను శుభ్రంగా, మెరుగైన సౌకర్యాలతో నడిపే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని డోలేంద్ర ప్రసాద్ వ్యక్తం చేశారు.   అయితే వైసీపీ ఈ వ్యవహారాన్ని రాజకీయ కారణాలతో  పెద్ద భూతంగా చూపిస్తూ , ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందన్నారు.  రాష్ట్రంలో  కూటమి ' ప్రభుత్వం కాకుండా, ప్రతిపక్షం మరియు అధికార పక్షం కలిపి నడిపే 'కుమ్మక్కు' ప్రభుత్వం నడుస్తోందన్నారు. ప్రజలకు సంబంధం లేని విషయాలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు. భారతదేశంలో అవినీతి అన్ని రంగాలకు విస్తరించిందనీ, చైనాతో పోలిస్తే మనం అభివృద్ధిలో వెనుకబడి ఉండటానికి కారణం ఇక్కడి రాజకీయ నాయకుల అవినీతి,  పాలకుల చిత్తశుద్ధి లేమే కారణమన్నది ‘వాస్తవ వేదిక’ చర్చ సారాంశం.  మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్ అనేది కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, సామాన్యుడికి మెరుగైన వైద్యం అందే దిశగా అడుగులు వేయాల్సి ఉందని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  పూర్తి వివరాలకు తెలుగువన్ న్యూస్ లో వాస్తవ వేదిక తొమ్మిదో ఎడిషన్ వీక్షించండి   
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.  ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ సమన్ల మేరకు వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డి శుక్రవారం (జనవరి 23) ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.  మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఈడీ నిర్థారణకు వచ్చింది. ఈ కేసులో  కోట్లాది రూపాయల కిక్‌బ్యాగ్స్   ఉండొచ్చన్న అనుమానాలతో దర్యాప్తు ను మరింత వేగవంతం చేసింది.   జగన్ హయాంలో మద్యం విధానం రూపకల్పన, అమలు సమయంలో భారీ అవకతవకలు జరిగాయనీ,  మధ్యవర్తుల ద్వారా భారీ మొత్తాలు లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. ముఖ్యంగా హవాలా మార్గంలో నగదు తరలింపులు, మనీ లాండ రింగ్ చట్టాల ఉల్లంఘన జరిగిందని ఈడీ ప్రాథమికంగా నిర్థారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే  ఈడీ అధికారులు మిథున్ రెడ్డికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, కంపెనీలతో జరిగిన లావాదేవీలు, అను బంధ వ్యక్తులు, సంస్థల వివరాలు సేకరిస్తున్నారు. లిక్కర్ వ్యాపారంలో పాల్గొన్న పలువురు వ్యాపా రులు, మధ్యవర్తులను విచారించడం ద్వారా వచ్చిన సమాచారంతో ఈడీ మిథున్ రెడ్డిని విచారిస్తున్నట్లు సమాచారం.   ఈ కుంభకోణంలో  రాజకీయ నేతల పాత్రపై ఇప్పటికే తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో, ఎంపీ విజయసాయిని ఈడీ విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మిధున్ రెడ్డి విచారణలో మద్యం కుంభకోణం వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ కేసు రాజ కీయ ప్రేరేపితమని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తుండగా, చట్టప్రకారమే విచారణ జరుగుతోందని ఈడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా అన్నట్లుగా ఉంది జగన్ తీరు. తన హయాంలో సర్వే రాళ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. స్థలాల సరిహద్దులను నిర్ణయిస్తూ ఏర్పాటు చేసే సర్వే రాళ్ల కోసం ఏడంగా ఏడువందల రూపాయలు వ్యయం చేయడం, ఖరీదైన గ్రానైట్ రాళ్లను వినియోగించడం అప్పట్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఆ రాళ్లపై జగన్ జగన్ ఫొటోలను ముద్రించడం కూడా పెను వివాదంగా మారింది. హైకోర్టు కూడా సర్వేరాళ్లపై జగన్ బొమ్మల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే  భూముల రీ సర్వేకు సంబంధించి రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలపై కూడా జగన్ బొమ్మ ఉండటంపై కూడా అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.   కాగా 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే భూముల రీసర్వేను పారదర్శకంగా చేపడతామనీ, అలాగే పట్టాదారు పాసుపుస్తకాలపై ఉన్న జగన్ బొమ్మలను తొలగిస్తామని అప్పటి విపక్ష నేత చంద్రబాబు హామీ ఇచ్చారు.  అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ మేరకు ఖరీదైన సర్వే రాళ్లను తొలగించి సాధారణ రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను తొలగించి ప్రభుత్వ రాజముద్రను ముద్రించారు పంపిణీ చేశారు. దీనిపై రైతులలో హర్షం వ్యక్తం అవుతోంది.  కానీ జగన్ మాత్రం తన తప్పులను తెలుగుదేశం ప్రభుత్వం సరిదిద్దడాన్ని సహించలేకపోతున్నారు.  సరిహద్దురాళ్లు సరిగా లేవు, పాసుపుస్తకాలు కూడా తప్పుల తడకలా ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  గురువారం (జనవరి 22) తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాదాపు రెండు గంటల సేపు మాట్లాడిన జగన్ తన ప్రసంగం మొత్తం తెలుగుదేశం కూటమి  చేపట్టిన భూముల రీసర్వేపైనే మాట్లాడారు. అసలీ కార్యక్రమాన్ని చేపట్టినది తానేనంటూ క్రెడిట్ చోరీకి శతధా ప్రయత్నించారు. వాస్తవానికి భూముల రీసర్వే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం  అదే సమయంలో అప్పట్లో తన నిర్వాకం అదే ఫొటోల వ్యవహారం తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నవ విషయాన్ని కనీసం ప్రస్తావించలేదు.  భూ యజమానులకు జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలపై  తన సొంత ఫోటోను ముద్రించడం పట్ల జగన్  ఈ సమావేశంలో ఎలాంటి వివరణా ఇవ్వలేదు. అసలా ప్రస్తావన చేయడానికి కూడా సాహసించలేదు. అంతే కాదు తన హయాంలో సరిహద్దు రాళ్లపై తన పేరు, ఫోటో విషయాన్ని కూడా దాటవేశారు.   దీంతో జగన్ మీడియా సమావేశంలో ప్రసంగం విన్నవారంతా తప్పులెన్నువారు అన్న వేమన శతకంలోని పద్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
  NBK111 మూవీ డైరెక్టర్ ఎవరు? గోపీచంద్ మలినేనికి బాలయ్య ఓకే చెప్పాడా? అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ సంగతేంటి?   'వీరసింహారెడ్డి' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ (Nanadamuri Balakrishna), దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) మరోసారి చేతులు కలిపారు. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో ఇటీవల సస్పెన్స్ నెలకొంది. తాజాగా ఆ సస్పెన్స్ కి తెరపడింది.   'NBK 111'ను మొదట హిస్టారికల్ ఫిల్మ్ గా చేయాలనుకున్నారు. కానీ, ఆ తర్వాత జానర్ ఛేంజ్ చేసి.. మరో కొత్త కథపై వర్క్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపించింది. అదే సమయంలో మరో న్యూస్ తెరపైకి వచ్చింది.     2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఒక కథ సిద్ధం చేశాడని.. గోపీచంద్ సినిమా ఆలస్యమవుతుండటంతో అనిల్ తో సినిమా చేయడానికి బాలయ్య ఓకే చెప్పాడని ప్రచారం జరిగింది. దీంతో 'NBK 111' ప్రాజెక్ట్ రావిపూడి చేతికి వెళ్ళి, 'NBK 112' మలినేని చేసే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.   అయితే 'NBK 111' డైరెక్టర్ ఎవరనే సస్పెన్స్ తాజాగా వీడిపోయింది. ముందుగా ప్రకటించినట్టుగానే బాలకృష్ణ-మలినేని కాంబోలో సినిమా ఉంటుందని తాజాగా టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిందని, నరేషన్ పూర్తయిందని తెలిపింది. అంతేకాదు వేసవిలో షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.    Also Read: రామ్ చరణ్ 'పెద్ది' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!  
  వెబ్ సిరీస్ : స్పేస్ జెన్: చంద్రయాన్ నటీనటులు: శ్రియా సరన్, గోపాల్ దత్,  నఖుల్ మెహతా, ప్రకాశ్ బెలావాడి, దనిశ్ సైత్ తదితరులు మ్యూజిక్: రోహణ్ సినిమాటోగ్రఫీ: శ్రీ నమ్జోషి దర్శకత్వం:  అనంత్ సింగ్  నిర్మాతలు: విజయ్ కోషి ఓటిటి: జియో హాట్ స్టార్ కథ:  ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్ లో అర్జున్(నఖుల్ మెహతా) ఒక ప్రోగ్రామర్ గా ఉన్నాడు. అయితే ఆ మిషన్ కు కోఆర్టినేటర్ యామిని(శ్రియా సరన్). అర్జున్ వాళ్ళ నాన్న ఇండియన్ మిలటరీలో ప్రాణాలర్పిస్తాడు. అతని కోరిక మేరకే అర్జున్ ఇస్రో లో ప్రోగ్రామింగ్ యూనిట్ లో ప్రోగ్రామర్ గా జాబ్ తెచ్చుకుంటాడు. అయితే అతనికి పని ఒత్తిడి పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అదే సమయంలో ఇస్రో ఛీఫ్ గా రామయ్య నియమించబడతాడు. చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ రాకెట్ కక్ష్యలోకి వెళ్ళాక మిస్ అవుతుంది. దాంతో ఆ ప్రయోగం ఫెయిల్ అయిందని దేశమంతటి నుండి ఇస్రోకి తీవ్ర విమర్శలు వస్తాయి. అయితే అది ఫెయిల్ అవ్వడానికి కారణం అర్జున్ అని అతడిని తర్వాతి ప్రాజెక్టులో నుండి తీసేస్తాడు  ఛీఫ్ రామయ్య. ఆ తర్వాత శ్రీహరికోటలో చంద్రయాన్-3 ప్రయోగం జరుగుతుంది. మరి అర్జున్ తన నాన్నకి ఇచ్చిన మాటని నిలుపుకున్నాడా? చంద్రయాన్-3 లో అర్జున్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ:  ఈ సిరీస్ మొత్తంగా అయిదు ఎపిసోడ్ లతో సాగింది. మొదటి ఎపిసోడ్- ఫైండింగ్ విక్రమ్(Finding Vikram) లో మిషన్ చంద్రయాన్-2 ఫెయిల్యూర్ అవుతుంది. ఇక రెండో ఎపిసోడ్-మ్యాన్ వర్సెస్ మిషన్(Man vs Machine) లో మిషన్ విఫలమవ్వడం.. దానికి గల కారణాలు వెతకడం.. అన్ని పాజిబులిటీస్ తో విక్రమ్ ని కనిపెట్టడం సాగుతుంది.  మూడో ఎపిసోడ్- సైన్స్ ఫైండ్ ఏ వే(Science Find A way)లో మిషన్ కోఆర్డినేటర్ యామినికి, ఛీఫ్ రామయ్యకి మధ్య ఛాలెంజ్ ఉంటుంది. నాలుగో ఎపిసోడ్- మేక్ ఇన్ ఇండియా(Make in India)లో కోవిడ్-19 లో మన శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సమస్యలు వాటిని దాటి మిషన్ కోసం పనిచేసే ఎఫర్ట్స్, అలాగే దేశంలోనే తయారు చేసే కంపెనీల వెంట ఇస్రో చైర్మన్ తిరగడం.. ఇలా మిషన్ కోసం వాళ్లు పడిన సమస్యలను చూపించారు. ఇక చివరి ఎపిసోడ్- వేర్ ది మైండ్ ఈజ్ వితవుట్ ఫియర్(Where the Mind is without Fear).. ఇందులో మిషన్ ఎగ్జిక్యూట్ చేయడంలో శాస్త్రవేత్తలు ఎవరెవరు.. ఎంతగా సహాయపడ్డారో చూపించాడు దర్శకుడు. రామయ్య సేవలని, అర్జున్ ప్రోగ్రామింగ్ స్కిల్ ని, మేనేజింగ్ డైరెక్టర్ గా యామిని తమవంతు కృషిని చూపించారు. ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుండి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఫుల్ ఎంగేజింగ్ గా సాగుతుంది. ఇస్రోకి తగినంత డబ్బుని గవర్నమెంట్ ఇవ్వకపోవడంతో నాసిరకం స్పేర్ పార్ట్స్ తో పిఎస్‌ఎల్‌విని అంతరిక్షంలోకి పంపడం.. అది విఫలం అవ్వడం.. దానిని అన్ని మీడియా ఛానెల్స్ విమర్శించడం అంతా ఇంటెన్స్ గా సాగుతుంది. అయితే ఆ స్పేర్ పార్ట్స్ కంపెనీ ఎండీ బహిరంగంగా మీడియాలో మా తప్పేం లేదని చెప్పడంతో దానిని ఇస్రో చైర్మన్ ధీటుగా ఎదుర్కోవడం హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత రతన్ టాటానే స్వయంగా రాకెట్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ తయారు చేస్తానని చెప్పే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. దేశంతో రతన్  టాటాకి ఉండే అనుబంధాన్ని చక్కగా చూపించాడు.  దేశం కోసం నాన్న చేసిన త్యాగాన్ని అర్జున్ ని వెంబడిస్తుంది. ప్రెషర్ ను తట్టుకోలేక అర్జున్ రిజైన్ చేయడమనేది ఓ పెద్ద మలుపు. ఆ క్రమంలో అర్జున్ పడిన మానసిక సంఘర్షణను మూడో ఎపిసోడ్, నాలుగో ఎపిసోడ్ లలో చక్కగా చూపించారు. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు చక్కటి భావోద్వేగాల్ని పంచుతాయి. మొదటి ఎపిసోడ్ నుండి చూసిన ప్రతీ ఒక్కరికి ఈ సిరీస్ నచ్చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది‌. నిర్మాణ విలువలు బాగున్నాయి.  నటీనటుల పనితీరు: ప్రోగ్రామర్ అర్జున్ గా నఖుల్ మెహతా, మిషన్ కోర్డినేటర్ యామినిగా శ్రియా సరన్, ఇస్రో ఛీఫ్  రామయ్యగా ప్రకాశ్ బెలావాడి, ఇస్రో చైర్మెన్ గా దనిశ్ సైత్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మిగతా వారు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఫైనల్ గా : ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి చూసే  సిరీస్ ఇది.  రేటింగ్: 3/5 ✍️. దాసరి మల్లేశ్
  వాయిదా పడిన పెద్ది మూవీ? కొత్త రిలీజ్ డేట్ లాక్! పెద్ది డేట్ కి ఉస్తాద్ భగత్ సింగ్!   ఈ ఏడాది మార్చి 27న విడుదల కావాల్సిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ వాయిదా పడినట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే వాయిదా పడటమే కాదు, ఇప్పటికే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది.   రామ్ చరణ్ (Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న మూవీ 'పెద్ది' (Peddi). ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను 2026, మార్చి 27న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే విడుదల తేదీకి ఇంకా రెండు నెలలే సమయముంది. షూటింగ్ ఇంతవరకు పూర్తి కాలేదు.    'పెద్ది' ఫస్ట్ హాఫ్ ఎడిట్ ఇప్పటికే లాక్ అయింది. ప్రస్తుతం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే పనిలో ఉన్నాడు. అయితే సెకండ్ హాఫ్ కి సంబంధించిన కొంత పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. మరో 30 రోజులు దాకా షూటింగ్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. అందుకే రిలీజ్ డేట్ ని వెనక్కి జరిపే ఆలోచనకు మేకర్స్ వచ్చారని వినికిడి. ప్రస్తుతం మే 1వ తేదీకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.    Also Read: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో నాగ చైతన్య మాస్ బొమ్మ!   ఇదిలా ఉంటే, నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'ది ప్యారడైజ్' (The Paradise) మూవీ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. మార్చి 26న విడుదల కావాల్సిన ఈ మూవీ.. షూటింగ్ పెండింగ్ ఉండటంతో పోస్ట్ పోన్ అయిందని టాక్.     మార్చి చివరిలో విడుదల కావాల్సిన 'ది ప్యారడైజ్', 'పెద్ది' సినిమాలు వాయిదా పడగా.. వాటి స్థానంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని మార్చి 26 లేదా 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.    
  -ఇంతకీ ఆ సినిమా ఏంటి! -ఇన్ని రోజులు ఆపింది ఎవరు -అభిమానులు, ప్రేక్షకులని మెప్పిస్తుందా! -వాచ్ ది స్టోరీ ఏవైనా కారణాలతో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)సినిమా రిలీజ్ ఆగిందనుకోండి. స్వయంగా ఫ్యాన్స్ నే రంగంలోకి దిగి తమ స్టైల్ లో పంచాయితీ చేసే పరిస్థితి ఉంటుంది.  రజినీ,అభిమానులకి మధ్య ఉన్న అనుబంధానికి ఒక ఉదాహరణ. నిజానికి రజినీ మూవీ రిలీజ్ ఆగిపోదు. ఆపే సాహసం ఎవరు చెయ్యరు. కానీ రజినీ నుంచి రావాల్సిన మూవీ 37 ఏళ్ళ తర్వాత రిలీజ్ కాబోతుంది. ఇది నిజం. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటో చూద్దాం.   'హమ్ మేన్ షాహెన్‌షా కౌన్'(Hum Mein Shahenshah Kaun)..యాక్షన్ జోనర్ లో తెరకెక్కగా 1989 వ సంవత్సరంలోనే షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. రజినీకాంత్ తో పాటు శత్రుఘ్నసిన్హా(Shatrughan Sinha)మరో హీరోగా చెయ్యగా రాజా రాయ్(Raja Rai)నిర్మాతగా వ్యవహరించాడు. హర్మేష్ మల్హోత్రా(Harmesh Malhotra)దర్శకుడు. ఆర్థిక పరమైన కారణాలు, సెన్సార్ వంటి సమస్యల వల్ల రిలీజ్ ఆగలేదు. కేవలం టైం బ్యాడ్ అని చెప్పవచ్చు. షూటింగ్ అయిపోయిన తర్వాత రాజా రాయ్  చిన్న కొడుకు లండన్ దేశంలో చనిపోయాడు. దాంతో రాజా రాయ్ తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి రిలీజ్ ని పట్టించులేదు.   ఆ తర్వాత కొన్నాళ్లకి  రిలీజ్ ప్లాన్ చేసారు. కానీ దర్శకుడు హర్మేష్ మల్హోత్రా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ప్లాన్ చేసినా కూడా పలు కారణాలతో రిలీజ్ నోచుకోలేదు. దీంతో మూవీ లవర్స్ కి  రజినీ,శత్రుఘ్న ల మేజిక్ ని చూడాలని రాసి పెట్టి ఉండటంతో, ఇప్పుడు 37 ఏళ్ళ తర్వాత  రిలీజ్ అవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కాబోతుండగా డేట్ ని త్వరలోనే ప్రకటించనున్నారు.   Also read:   రావడం పక్కా అని ఎప్పుడో చెప్పాను.. ఎన్ని పెరిగాయి!   రజినీ, శత్రుఘ్నసిన్హా తో పాటు హేమమాలిని(Hemamalini)అనితా రాజ్ హీరోయిన్లు గా చేయగా, ప్రేమ్ చోప్రా,అమ్రిష్ పురి, శరత్ సక్సేనా వంటి స్టార్ కాస్టింగ్ స్క్రీన్ షేర్ చేసుకుంది. లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్  లక్ష్మి కాంత్ ప్యార్ లాల్(Laxmikant Pyarelal)నుంచి సాంగ్స్ రావడం విశేషం. ప్రెజెంట్ టెక్నాలజీ ని ఉపయోగించి సినిమా నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. మరి ఏ మేర ఆదరణ ని పొందుతుందో చూడాలి.                
  -శర్వానంద్ సినిమా విషయంలో ఏం జరుగుతుంది -అభిమానులు, ప్రేక్షకులు ఏమంటున్నారు -ఇప్పటి వరకు ఎంత  -ఇక్కడ్నుంచి ఎంత!   రావడం లేట్ అవ్వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా అని పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చెప్పిన ఈ క్వెషన్ ఇప్పుడు 'నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari)కి వర్తిస్తుంది. రిలీజ్ రోజు హిట్ టాక్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. దీంతో అభిమానులు, సినీ క్రిటిక్స్ మొదటి ఆట ప్రదర్శించినప్పట్నుంచి  చెప్తున్న బ్లాక్ బస్టర్ మాట నిజమైంది.      అందుకు తగ్గట్టే సినీ సర్కిల్స్ లో వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 'నారీ నారీ నడుమ మురారి' కి థియేటర్స్ పెరిగాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ నే ఇందుకు కారణం. సింగల్ స్క్రీన్స్ తో పాటు మల్టి ప్లెక్స్ ని  కూడా భారీగానే యాడ్ చేశారు. దీంతో ఎక్కువ థియేటర్స్ లోకి  రావడం పక్కా అని మేకర్స్ చెప్పినట్లయింది. మరి ఈ లెక్కన  నారీనారీనడుమ మురారి సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలవడమే ఖాయమనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గౌతమ్ గా శర్వానంద్(Sharwanand),నిత్య, దియా గా సాక్షి వైద్య(sakshi Vaidya),సంయుక్త మీనన్(Samyuktha Menon)ల క్యారక్టరయిజేషన్స్ ప్రేక్షకులని ఆకట్టుకోవడమే కాకుండా గిలి గింతలు పెడుతున్నాయి.   Also read:   చిరంజీవి సినిమా ఆలస్యానికి 'జన నాయగన్’ అడ్డంకి గా మారిందా!    వీరితో పాటు నరేష్, సునీల్, వెన్నెల కిషోర్, సత్య, సంపత్,  దర్శకుడు రామ్ అబ్బరాజు(Ram Abbaraju),డైలాగ్ రైటర్స్ నందు, భాను కూడా జాయిన్ అయ్యి  నారీనారీ నడుమ మురారి స్క్రీన్స్ ని లాఫింగ్ థెరపీ కి కేర్ ఆఫ్ అడ్రస్స్ గా మార్చుతున్నారు. దీంతో నిర్మాత అనిల్ సుంకర తో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ భారీ లాభాల్లో తెలియాడనున్నారు.జనవరి 14 ఈవినింగ్ షో నుంచి థియేటర్స్ లోకి రాగా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 25 కోట్ల రూపాయలని సాధించి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది.  
  మళ్ళీ మాస్ వైపు నాగ చైతన్య చూపు  రంగంలోకి పవన్ కళ్యాణ్ డైరెక్టర్ అక్కినేని హీరో మాస్ హిట్ కొడతాడా?   నాగ చైతన్య(Naga Chaitanya) మనసు మళ్ళీ మాస్ వైపు మళ్లిందా? త్వరలో ఓ మాస్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధమవుతున్నాడా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.   గతేడాది 'తండేల్'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ చైతన్య, ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ'(Vrushakarma) చేస్తున్నాడు. ఈ మిథికల్ థ్రిల్లర్ ను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.   ఇక హరీష్ శంకర్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) రూపొందిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.     Also Read: ప్రభాస్ ని రెండు గంటల పాటు ఎండలో నిలబెట్టిన డైరెక్టర్!   'విరూపాక్ష' తర్వాత నాగ చైతన్య, 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత హరీష్ శంకర్.. ఓ మాస్ ఎంటర్టైనర్ కోసం చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వినికిడి.   కెరీర్ స్టార్టింగ్ లో రెండు మూడు మాస్ ప్రయత్నాలు చేసి, పరాజయాలు చూశాడు నాగ చైతన్య. ఆ తర్వాత ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలు, విభిన్న కథా చిత్రాలతో విజయాలు అందుకుంటున్నాడు. అలాంటిది చైతన్యకు ఇప్పుడు మళ్ళీ మాస్ వైపు మనసు మళ్లినట్లు తెలుస్తోంది. మరి ఈ అక్కినేని హీరోకి.. హరీష్ శంకర్ ఒక మంచి మాస్ హిట్ ని అందిస్తాడేమో చూడాలి.  
  -చిరంజీవికి, విజయ్ జననాయగన్ కి సంబంధం ఏంటి! -అడ్డంకి వార్తలు నిజమేనా! -ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది. -పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.   మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)..ఇళయ దలపతి విజయ్(Vijay)..సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఇద్దరి కట్ అవుట్స్ కి ఉన్న చరిష్మా ఏ పాటిదో తెలిసిందే.  ఓన్ లాంగ్వేజ్ లో అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వర్షంతో తడిసి ముద్దవ్వాల్సిందే. చిరంజీవి ప్రెజెంట్ మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఫ్యాన్స్ ఆనందం గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. కానీ విజయ్ తో పాటు ఫ్యాన్స్ మాత్రం జననాయగన్(Jananayagan)రిలీజ్ కి అడ్డంకులు ఎదురుకావడంతో డీలా లో ఉన్నారు. మరి ఇప్పుడు ఇదే జన నాయగన్ చిరంజీవి ప్రాజెక్ట్ కి  అడ్డంకిగా మారినట్టు సౌత్ సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. మరి పూర్తి విషయమేంటో చూద్దాం.   మన శంకర వరప్రసాద్ తర్వాత బాబీ(Bobby)దర్శకత్వంలో చిరంజీవి తన నెక్స్ట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అధికారకంగా ప్రారంభమవ్వడమే కాకుండా, ఇప్పటికే వచ్చిన పోస్టర్ తో మూవీపై అంచనాలు పెరిగాయి.సదరు పోస్టర్ ద్వారా చిరంజీవి ని సరికొత్త కోణంలో బాబీ చూపించబోతున్నాడని, కథ, కథనాలు ఎవరి ఊహలకి అందని విధంగా ఉండబోతున్నాయని అర్ధమవుతుంది. దీంతో సదరు మూవీ త్వరగా షూటింగ్ కి వెళ్లి మళ్ళీ బాస్ సంక్రాంతికి రావాలని అభిమానులు ఆశపడుతున్నారు. కానీ షూటింగ్ మరింత లేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం సదరు చిత్రాన్ని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్(Kvn Productions).ఈ సంస్థనే జన నాయగన్  ని నిర్మించింది.    Also read:  2026 ఆస్కార్ అందుకోబోయే చిత్రాలు ఇవే.. జాన్వీ కపూర్ జాక్ పాట్ కొట్టింది   ఇప్పుడు ఈ సంస్థకి  జననాయగన్  విషయంలో ఆర్థిక, న్యాయపరమైన సమస్యలు చుట్టుముట్టాయన్నది కోలీవడ్ టాక్.  ముఖ్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్  సీబీఎఫ్‌సీతో నడుస్తున్న న్యాయపోరాటం ప్రొడక్షన్ ని  ఇబ్బందుల్లోకి నెట్టినట్టు సౌత్ సినీ ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో కేసు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు చిరంజీవి చిత్రాన్ని ప్రారంభించడం కష్టమేననే  టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయంపై సినీ విశ్లేషకులు సైతం స్పందిస్తు  నిర్మాతల ముందు రెండు మార్గాలున్నాయి. అన్ని సమస్యలు తీరే వరకు వేచి చూడడం. లేదా  లైన్ ప్రొడ్యూసర్‌ని తీసుకుని సహనిర్మాణం ద్వారా షూటింగ్‌ని  స్టార్ట్ చేయడమని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. మరి కె వి ఎన్ ప్రొడక్షన్స్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఫ్యాన్స్ అయితే మాత్రం త్వరగా షూటింగ్ కి వెళ్లాలనుకుంటున్నారు.  చిరంజీవి చేస్తున్న 158 వ చిత్రం.           
  టాలీవుడ్ లో సంచలనంగా మారిన న్యూస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని ఎండలో నిలబెట్టిన డైరెక్టర్! ఒక్క ఎక్స్ ప్రెషన్ కోసం రెండు గంటల సమయం! ప్రభాస్ ని అంతలా కష్టపెడుతున్న డైరెక్టర్ ఎవరో తెలుసా?   టాలీవుడ్ దర్శకులలో ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli)కి జక్కన్నగా పేరుంది. ప్రతి షాట్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు. తాను అనుకున్న విధంగా ఆ షాట్ వచ్చేవరకు చెక్కుతూనే ఉంటారు. ఈ విషయాన్ని రాజమౌళితో పనిచేసిన హీరోలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.   ఇక తక్కువ సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా పేరుపొందిన సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కూడా ఇదే స్కూల్ కి చెందిన వారనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆర్టిస్టుల చిన్న ఎక్స్ ప్రెషన్ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ అవ్వరని తెలుస్తోంది. అక్కడున్నది ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్(Prabhas) అయినా కూడా.. సందీప్ తీరు ఇలాగే ఉంటుందని సన్నిహిత వర్గాల మాట.    ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో 'స్పిరిట్'(Spirit) మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ప్రభాస్ ఎప్పుడో కమిట్ అయ్యారు. కానీ, ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండి.. తన సినిమాకి తగినన్ని డేట్స్ కేటాయించలేరనే ఉద్దేశంతో.. సందీప్ కొంతకాలంపాటు వెయిట్ చేశారు. తాను అడిగినన్ని డేట్స్ ఇవ్వడానికి ప్రభాస్ ఓకే చెప్పడంతో.. ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టారు.     Also Read: రాజా సాబ్ ఎఫెక్ట్.. మారుతికి మొట్టికాయలు.. పీపుల్ మీడియాకి మరో ఛాన్స్!   'స్పిరిట్' ఎంత భాగం షూటింగ్ పూర్తయిందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రభాస్ అభిమానుల్లో ఉంది. అయితే ఇప్పటివరకు ఒకే ఒక్క సీన్ షూటింగ్ కంప్లీట్ అయిందట. కానీ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో వచ్చిందని, ఈ ఒక్క సీన్ వంద కోట్లతో సమానమనే మాట వినిపిస్తోంది.    అయితే ఈ సీన్ షూటింగ్ విషయంలో ప్రభాస్ ని సందీప్ రెడ్డి బాగానే కష్టపెట్టారట. ముఖ్యంగా తనకు కావాల్సినట్టుగా ఒక ఎక్స్ ప్రెషన్ రావడం కోసం.. ఏకంగా రెండు గంటల పాటు ప్రభాస్ ని ఎండలో నిలబెట్టారనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.   'ది రాజా సాబ్' విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయిన విషయం తెలిసిందే. బాడీ డబుల్ ఉపయోగించడం, ఫేస్ రీప్లేస్మెంట్ చేయడం వంటివి అభిమానులకు బాగా నిరాశ కలిగించాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఫ్యాన్స్ కి మరిచిపోలేని ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభాస్ ఎంతో కష్టపడుతున్నారట. సందీప్ రెడ్డికి పూర్తిగా సరెండర్ అయిపోయి, 'స్పిరిట్' కోసం ప్రభాస్ చెమటోడ్చుతున్నట్లు తెలుస్తోంది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
సుభాష్ చంద్రబోస్ పేరు వెంటే భారతీయుల ఒళ్ళు పులకరిస్తుంది.  ముఖ్యంగా భారత యువతలో దేశ భక్తి పొంగుతుంది.  భారతీయులను బానిసలుగా చేసుకుని దేశాన్ని దోచుకున్న బ్రిటీషు వారిని గడగడలాడించిన వ్యక్తిగా  సుబాష్ చంద్రబోస్ అందరికీ సుపరిచితం.  అందరూ బోస్ అని ముద్దుగా పిలుచుకునే చంద్రబోస్ జనవరి 23వ తేదీ,  1897లో జన్మించారు. ఈయన జన్మస్థలం కటక్.. జానకీనాథ బోస్,  ప్రభావతి దేవి ఈయన తల్లిదండ్రులు. సుభాష్ చంద్రబోస్ జయంతి రోజును పరాక్రమ్ దివస్ గా జరుపుకుంటారు.  ఆయన దైర్యం, త్యాగానికి ప్రతీకగా ఈ రోజును జరుపుకుంటారు. ఆయన జీవితం అంతా తెలిసినదే అనిపించినా, బయటికి ఎక్కువగా రాని రహస్యమైన, కీలకమైన, లోతైన విషయాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి స్పష్టంగా తెలుసుకుంటే.. బ్రిటీష్ ఇంటెలిజెన్స్ విషయంలో.. గాంధీజీని బ్రిటిష్‌లు “నెగోషియబుల్ శత్రువు”గా చూశారు. కానీ సుభాష్ చంద్రబోస్‌ను మాత్రం “నియంత్రించలేని విప్లవకారుడు”గా పరిగణించారు. బ్రిటిష్ MI5, MI6 ఫైళ్లలో ఆయన పేరు మీదే అత్యధిక నిఘా నివేదికలు ఉన్నాయి.  ఆయనపై నిఘా భారతదేశంలోనే కాదు.. జర్మనీ, ఇటలీ, జపాన్‌లలో కూడా సాగింది. ఈ వ్యక్తి బ్రిటిష్ సామ్రాజ్యానికి చాలా ప్రమాదకారి అని ఒక బ్రిటిష్ అధికారి వ్యాఖ్యానించారంటే బోస్ వారిని ఎంత భయపెట్టి ఉంటాడో ఊహించుకోవచ్చు. అంటే బ్రిటిష్‌లు నిజంగా భయపడింది గాంధీజీ కంటే ఎక్కువగా నేతాజీకే. జర్మనీ–హిట్లర్ సంబంధం.. నిజానిజాలు.. చాలామంది నేతాజీ హిట్లర్‌తో కలిసి పనిచేశాడు బోస్ గురించి అపార్థం చేసుకున్నారు.  కానీ నేతాజీకి హిట్లర్ జాతి సిద్ధాంతాలపై తీవ్ర అసహ్యం ఉంది. భారతీయులు ఆర్యులు కాదు అన్న హిట్లర్ వ్యాఖ్యను నేతాజీ తీవ్రంగా ఖండించాడు. హిట్లర్‌ను కలవడానికే నేతాజీ పెద్దగా ఆసక్తి చూపలేదు కాకపోతే ఆయన చెప్పింది మాత్రం ఒక్కటే.. బ్రిటిష్ శత్రువు – నా మిత్రుడు అని. ఇది వ్యూహం మాత్రమే, సిద్ధాంతం కాదు. ఆజాద్ హింద్ ప్రభుత్వం.. ఇది కేవలం ప్రతీక కాదు. 1943లో నేతాజీ స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ప్రకటించారు.  జపాన్, జర్మనీ, ఇటలీ సహా 9 దేశాలు అధికారికంగా గుర్తించాయి. ఆయన వద్ద  స్వంత కరెన్సీు, పోస్టల్ స్టాంపులు, న్యాయస్థానాలు, మహిళా సైన్యం కూడా  ఉన్నాయి.  భారతదేశానికి గాంధీజీ కంటే ముందే  ప్రధాని లాంటి పాత్రను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోషించాడు. మహిళలకు యుద్ధంలో స్థానం.. రాణి ఝాన్సీ రెజిమెంట్:- ఇది పూర్తిగా మహిళలతో కూడిన యుద్ధ విభాగం. అప్పట్లో యూరప్‌లో కూడా ఇది అసాధారణం. మహిళలు ఆయుధాలు ధరించి ముందుండాలని నేతాజీ స్పష్టంగా చెప్పారు  భారతదేశంలో మహిళా సాధికారతను యుద్ధ స్థాయికి తీసుకెళ్లిన తొలి నాయకుడు ఆయన. గాంధీజీతో విభేదాలు.. గాంధీకి, నేతాజీకి  మధ్య విభేదాలు ఉన్న..  గాంధీజీ నేతాజీని దేశభక్తులలో దేశభక్తుడు అన్నారు. నేతాజీ గాంధీజీని జాతిపిత అని గౌరవించారు. వివాదం ఒక్కటే.. గాంధీజీ అహింసనే ఆయుధంగా మార్చుకున్నాడు. అదే దిశలో పోరాటం జరగాలని అనుకున్నాడు. కానీ నేతాజీ మాత్రం.. అవసరమైతే సాయుధ పోరాటం తప్పు కాదని, సాయుధ పోరాటంతోనే బ్రిటీషర్ల నుండి దేశానికి విముక్తి సాధ్యమని స్పష్టం చేశారు. గాంధీ,నేతాజీ మధ్య వ్యక్తిగత శత్రుత్వం ఏదీ లేదు.. రెండు మార్గాల మధ్య తాత్విక పోరాటమే వారి మీద శత్రువులు అనే ముద్ర వేసింది. రహస్య రేడియో ప్రసారాలు.. నేతాజీ రేడియో ప్రసారాల ద్వారా భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రసారాలు జర్మనీ, జపాన్ నుంచి జరిగాయి.  బ్రిటిష్‌లు ఆ సిగ్నల్స్‌ని ఆపలేకపోయారు. ఆ ప్రసారాలు వినడం నేరంగా ప్రకటించారు.  సమాచార యుద్ధంలో కూడా ఆయన ముందే ఉన్నారు. నేతాజీ మరణం.. మిస్టరీ.. నేతాజీ మరణం – ఇప్పటికీ ఓ మిస్టరీ నేతాజీ మరణం గురించి ఒక అధికార కథ ప్రచారంలో ఉంది. 1945లో తైవాన్ విమాన ప్రమాదం జరిగిందని, అందులో బోస్ మరణించాడని చెబుతారు. కానీ అనేక ప్రశ్నలు పజిల్స్ గా ఉండిపోయాయి.. విమాన ప్రమాదంలో శవం దొరకలేదు. ఆ శవం ఎక్కడుంని ప్రశ్న.. DNA పరీక్ష ఎందుకు జరగలేదని కూడా ప్రశ్న ఉంది. జపాన్ రికార్డుల్లో అస్పష్టత ఉంది.  భారత ప్రభుత్వం ఫైళ్లను దశాబ్దాల పాటు రహస్యంగా ఉంచింది. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే..  నేతాజీ కుటుంబసభ్యులే విమాన ప్రమాద కథను అనుమానించారు. ఆయన మరణం కంటే ఆయన జీవించి ఉండవచ్చన్న సందేహమే ఎక్కువ బలంగా ఉంది. స్వతంత్ర భారతానికి ఆయన కల.. నేతాజీ దేశం గురించి చాలా కలలు కన్నాడు.  బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలని,   శాస్త్రీయ, పరిశ్రమాధారిత ఆర్థిక వ్యవస్థ ఉండాలని,  మతపరమైన రాజకీయాలకు స్థానం ఉండకూడదని,  క్రమశిక్షణ, జాతీయవాదం ముఖ్యంగా ఉండాలని కోరుకున్నాడు. ఆయన బతికి ఉంటే, భారత రాజకీయ దిశ పూర్తిగా వేరేలా ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. 1946లో జరిగిన రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుకి ప్రధాన ప్రేరణ.. INA ట్రయల్స్.. నేతాజీ ప్రభావమే..  ఇది బ్రిటీషర్లకు చాలా పెద్ద షాక్ ఇచ్చింది.  ఈ కారణంగానే నేతాజీ భారత్ ను వదిలి వెళ్లారని అంటారు. నేతాజీ అంటే ఒక నాయకుడు కాదు.. ఆయన శత్రువుల పాలిట సింహ స్వప్నం.  దేశాన్ని దోచుకున్నవారికి ఆయన పేరు ఒక భయంకరమైన ప్రశ్న..                                 *రూపశ్రీ. 
భారతదేశంలో  వందల శతాబ్దాల నుండి కొన్ని నియమాలు, పద్దతులు నిర్ణయమైపోయి ఉన్నాయి.  ముఖ్యంగా వివాహ వ్యవస్థ లో ఉన్న కొన్ని నియమాలను ఏ మతమైనా సరే.. తప్పకుండా పాటిస్తుంది.  అలాంటి నియమాలలో వివాహం,  వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళ్లడం, అత్తవారింట్లో కుటుంబ సభ్యులకు సేవలు చేస్తూ జీవించడం ముఖ్యమైనది.  అమ్మాయిల విషయంలో ఇలా ఉంటే.. అబ్బాయిలు తండ్రి తర్వాత కుటుంబానికి యజమాని అవుతారు.  కుటుంబానికి వారసులుగా అబ్బాయిలనే పరిగణిస్తారు.  ఎందుకంటే వారు తల్లిదండ్రులతోనే ఉంటారు కాబట్టి. కానీ భారతదేశంలోనే ఒక ప్రాంతంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతోంది. అక్కడ అమ్మాయిలను కుటుంబ వారసులుగా పరిగణిస్తారు.  అబ్బాయిలకు పెళ్లి చేసి  అత్తవారింటికి పంపుతారు.  ఇంతకీ ఆ ప్రాంతం ఏది? అక్కడి విశేషాలేంటి? తెలుసుకుంటే.. ఖాసీ తెగ.. ఖాసీ తెగ ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు చెందినది. ఇక్కడి ప్రజలు పితృస్వామ్య నియమాలను కాకుండా మాతృస్వామ్య నియమాలను అనుసరిస్తారు. పితృస్వామ్య వ్యవస్థలలో కుమారులను వారసులుగా పరిగణిస్తారు, అయితే ఖాసీ తెగలో కుమార్తెలు వారసత్వాన్ని వారసత్వంగా పొందుతారు. వీరు మాతృస్వామ్య వ్యవస్థను అనుసరిస్తారు. అంటే కుమార్తెలు జీవితాంతం తమ తల్లి కుటుంబంతోనే ఉంటారు. ఇంటి పేరు.. సాధారణంగా ప్రతి కుటుంబానికి  తండ్రి ఇంటిపేరును మొదటి పేరు సంక్రమిస్తుంది.  వివాహం తర్వాత కూడా ఆడపిల్లలకు ఇంటిపేరు, గోత్రం మారుతాయని చెబుతారు.  కానీ ఖాసీ తెగ వారి తల్లి ఇంటిపేరును  కొనసాగిస్తుంది.  ఈ తెగ దాని ప్రత్యేక సంస్కృతి కారణంగా ప్రపంచంలోని ఇతరుల నుండి భిన్నంగా ఉంటుంది. అబ్బాయిలనే పంపిస్తారు.. శతాబ్దాలుగా వివాహం తర్వాత అమ్మాయిలను అత్తవారింటికి పంపే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ ఖాసీ తెగలో ఈ సంప్రదాయం ఉండదు. ఇక్కడ వివాహం తర్వాత అమ్మాయిల ఇంటికి అబ్బాయిలను పంపిస్తారు. ఇక్కడి అబ్బాయిలు వివాహం తర్వాత వారి అత్తమామల ఇంటికి వెళతారు. అంతేకాదు.. అబ్బాయిలు ఇంటి పనులన్నీ చేస్తారు. అమ్మాయిలు బయట పని చేస్తారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. అబ్బాయిని అత్తారింటికి పంపడం అనే విషయం పై అతని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు.  ఇక్కడ ఇది శతాబ్దాలుగా అమలులో ఉన్న సంప్రదాయం. ఈ తెగ వారు ఈ సంప్రదాయాన్ని సంతోషంగా అమలు చేస్తున్నారట. ఖాసీ తెగ మాత్రమే కాదు.. ఇవి కూడా.. భారతదేశంలో ఖాసీ తెగతో పాటు, గారో తెగ, నాయర్ తెగ, తులువా తెగ,  బోండా తెగలు మాతృస్వామ్య విదానాన్ని ఆచరిస్తారు. మేఘాలయ రాష్ట్రంలోని గారో కొండలలో నివసించే గిరిజన సమాజమైన గారో తెగలో, తండ్రి కాదు, తల్లి ఇంటిపెద్ద పాత్ర పోషిస్తుంది. ఇక్కడ కూడా, పిల్లలు తమ తల్లి ఇంటిపేరును ఉపయోగిస్తారు,  చిన్న కుమార్తె తన తల్లి నుండి ఆస్తిని వారసత్వంగా పొందుతుంది. అంతేకాకుండా, కుమార్తెలను వివాహం తర్వాత అత్తారింటికి పంపించరట. నాయర్ తెగ మరింత విభిన్నం.. నాయర్ తెగ మరింత ప్రత్యేకం. వారు స్వాతంత్య్రానికి పూర్వం నుంచే  మాతృస్వామ్య వ్యవస్థలో నివసిస్తున్నారు. ఇక్కడ కూడా స్త్రీలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. స్త్రీలనే కుటుంబాలకు పెద్దలుగా పరిగణిస్తారు.  వీరిని "తారవాడ్లు" అని పిలుస్తారు. ఇక్కడ పురుషులు ప్రత్యేక గదులలో నివసిస్తున్నారంటే ఆశ్చర్యపోతారు.  కానీ ఇదే నిజం.                                               *రూపశ్రీ.
భారతదేశం చాలా వైవిధ్యభరితమైనది. భారతీయ సంప్రదాయాలలో పురుషార్థాలు చాలా ప్రధానమైనవి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పురుషార్థాలు అని అంటారు. ఈ  నాలుగింటిని అవలంభించడం వల్ల ప్రతి వ్యక్తి ఒత్తిడి నుండి విముక్తి అవుతాడని చెబుతారు. కానీ నేటి ఆధునిక కాలంలో వీటిని అటకెక్కించారు. ఈ నాలుగింటి గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఇవి వ్యక్తి జీవితంలో ఎంత ముఖ్యమైనవో తెలిసిపోతుంది. వీటి గురించి తెలుసుకుంటే.. ధర్మం.. జీవితంలో కొన్నిసార్లు మనం పారిపోతున్నట్లు అనిపిస్తుంది.  కానీ ఎందుకు అనే విషయం అర్థం కాదు.  ధర్మం అంటే ప్రతి వ్యక్తి తన నిజమైన కర్తవ్యాన్ని అర్థం చేసుకోవడం. ప్రపంచానికి ఒక వ్యక్తి నుండి కావలసింది ఇదే. ప్రతి వ్యక్తి తనలోకి తాను చూసుకోవాలి. అంటే.. ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఏది ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది? రోజువారీ చిన్న చిన్న పనులలో నిజాయితీని పాటించినప్పుడు లభించే సంతృప్తి చాలా గొప్పది.  ఒక్కసారి దీన్ని అనుభవించినప్పుడు ఇక దాన్నుండి పక్కకు పోవాలన్నా పోలేరు. అర్థం.. డబ్బు లేకుండా జీవితం కష్టమవుతుంది. అర్థ అంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని,  సమాజాన్ని ఆదుకునే శ్రేయస్సు. కానీ డబ్బును సంపాదించడమే అర్థం అనే విషయానికి నిజమైన వివరణ అనుకుంటారు చాలా మంది.  ఈ కారణంగానే జీవితంలో డబ్బు కోసం చాలా పోరాటం చేస్తారు. దానిని ధర్మంతో సమతుల్యం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి తన అవసరాను గుర్తించాలి, తెలివిగా ప్లాన్ చేసుకోవాలి.  కానీ అత్యాశతో ఉండకూడదు.  ఉన్నదాంటో తృప్తి పడటం నేర్చుకోవాలి. కామ.. కామ అంటే కోరికలు.  ప్రేమ,  ఇంద్రియ సుఖాలు. కోరికలను అణచివేయవద్దని, వాటిని సరైన మార్గంలో నెరవేర్చుకోవాలని అర్థం.  కానీ ధర్మార్థాల  విషయంలో రాజీ పడకూడదు. కామం అంటే కేవలం ఇంద్రియాల గురించే కాదు.. కామం అంటే కోరిక, పని.. ఇందులో చాలా ఉంటాయి.  నేటి కాలంలో కామం అనగానే ఒక బూతు అనుకుంటారు. అది తప్పు. ప్రతి రోజూ ఒక చిన్న ఆనందం అయినా ఉండేలా చూసుకోవాలి.  ఎవరితోనైనా మాట్లాడాలి. ప్రకృతితో సమయం గడపాలి. కోరికలను బయటకు చెప్పడం కాదు.. బాలెన్సింగ్ గా ఉంచుకోవాలి. మోక్షం.. మోక్షం  అంటే విముక్తి. అన్ని ఒత్తిడి, భయం,  బంధనాల నుండి విముక్తి. ఒక వ్యక్తి నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం. ధర్మం, అర్థ,  కామాలు సమతుల్యంగా ఉన్నప్పుడు, మోక్షం సహజంగా వస్తుందని చెబుతారు. మోక్షం వైపు అడుగులు వేయాలంటే ధ్యానం చేయాలి. యోగా చేయాలి, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాలి.  వర్తమానంలో జీవించాలి.                                   *రూపశ్రీ.
ఒకప్పుడు వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కోల్పోవడం, శరీర వణుకు వంటి సమస్యలు వచ్చేవి. పెద్ద వయసులో ఇవి సాధారణం అని భావించేవారు. కానీ నేటి వేగవంతమైన జీవితాల్లో చిత్తవైకల్యం,  పార్కిన్సన్స్ వంటి వ్యాధులు ఊహించకుండా వచ్చేస్తున్నాయి.  అందులోనూ వయసుతో సంబందం లేకుండా చాలామంది ఈ సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ రెండు వ్యాధులు  మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. జన్యుశాస్త్రంతో పాటు,  జీవనశైలి కూడా ఈ వ్యాధులకు దోహదం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా. చిత్త వైకల్యం,  పార్కిన్సన్స్ వంటి జబ్బులు రాకుండా ఉండాలన్నా మూడు అలవాట్లు  పొరపాటున కంటిన్యూ  చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. నిద్ర.. శారీరక అలసటకు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా నిద్ర చాలా అవసరం. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు గ్లింఫాటిక్ వ్యవస్థ ద్వారా టాక్సిన్స్ తొలగిస్తుంది. వీటిలో అమిలాయిడ్-బీటా ప్రోటీన్ ఉంటుంది. ఇది అల్జీమర్స్,  చిత్తవైకల్యంతో నేరుగా కనెక్షన్ కలిగి ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తుల మెదడులో హానికరమైన ప్రోటీన్లు పేరుకుపోతాయి. ఇవి మెదడు కణాలను నాశనం చేస్తాయి. రాత్రి నిద్ర ఆరోగ్యకరంగా ఉండాలంటే  ప్రతి రాత్రి ఒకే సమయంలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి.   పడుకునే 1-2 గంటల ముందు  మొబైల్ ఫోన్ వాడటం మానేయాలి. అల్పాహారం.. అల్పాహారం మన మెదడుకు ఇంధనంగా పనిచేస్తుంది. రాత్రంతా ఆహారం లేకుండా శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది.  దీని  తర్వాత మెదడు సరిగ్గా పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. అందువల్ల, అల్పాహారం దాటవేసే వ్యక్తులకు పోషకాలు లోపిస్తాయి. ఇది మెదడు క్షీణత లేదా మెదడు కుంచించుకుపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది చిత్తవైకల్యం ప్రారంభానికి మూలం అయ్యే అవకాశం కలిగి ఉంటుంది. అందువల్ల అల్పాహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, గింజలు,  తాజా పండ్లను చేర్చడం ముఖ్యం. ఇవి మెదడు కణాలను మరమ్మతు చేయడంలో సహాయపడతాయి. వ్యాయామం.. శరీరంలోని బద్ధకం మనస్సులో బద్ధకాన్ని కలిగిస్తుంది. వ్యాయామం శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది మెదడుకు తగినంత ఆక్సిజన్,  పోషకాలను అందిస్తుంది. అయితే వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయం,  అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇవి పార్కిన్సన్స్,  చిత్తవైకల్యానికి రెండు ప్రధాన ప్రమాద కారకాలు. శారీరకంగా చురుకుగా లేకపోవడం వల్ల మెదడులో డోపమైన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది పార్కిన్సన్స్‌కు ప్రధాన కారణం. అందువల్ల ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు చురుకైన నడక, యోగా లేదా ఏదైనా ఇతర వ్యాయామం చేయాలి.                            *రూపశ్రీ.
క్యాన్సర్ ప్రపంచాన్ని కబళిస్తున్న జబ్బు. పూర్తీగా చెయ్యి దాటిన దశలో బయటపడటం అనే కారణం వల్ల క్యాన్సర్ అంటే ఇక మరణమే అనే అభిప్రాయం ఏర్పడింది.  క్యాన్సర్ కు వైద్యం ఉన్నా అది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా నరకం అనుభవించాల్సి వస్తుంది.  సింపుల్ గా చెప్పాలంటే.. క్యాన్సర్ ఒక మనిషి  శరీరాన్ని లోపలే విచ్చిన్నం చేయడమే కాకుండా.. ఒక కుటుంబాన్ని ఆర్థికంగా కూడా చితికిపోయేలా చేస్తుంది. నేటికాలంలో క్యాన్సర్ నిపుణులు కొన్ని ఆందోళనకరమైన మార్పులు గమనిస్తున్నారు. క్యాన్సర్ అంటే పెద్దవారిలో బయటపడేది అనుకునేవారు. కానీ నేటికాలంలో యువతలో కూడా క్యాన్సర్ బయటపడటం ఆందోళనగా మారుతోంది. కొంతమంది 20 లేదా 30 ఏళ్ల లోపు క్యాన్సర్ రోగులుగా మారుతున్నారు. రొమ్ము క్యాన్సర్ నుండి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వరకు అన్ని రకాల క్యాన్సర్‌లలో ఈ మార్పు కనిపిస్తోంది. శరీరాన్ని చాలా సైలెంట్ గా క్యాన్సర్ బారిన పడేలా చేసే 7 అలవాట్లు ఉన్నాయి. ఈ 7లో కూడా 3 పనులు చేసిన తర్వాత ప్రజలు చాలా గ్రేట్ గా ఫీలవుతూ ఉంటారు. అవేంటో అవి శరీరాన్ని క్యాన్సర్ బారిన పడేలా ఎందుకు చేస్తాయో.. తెలుసుకుంటే..   ప్రజలు మూడు పనుల విషయంలో చాలా గ్రేట్ ఫీలవుతారు.  పైగా వాటిని మార్చుకోవాలని కూడా అనుకోరు.  కానీ క్రమంగా అవి కణాలను,  హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఉదాహరణకు.. గంటల తరబడి కూర్చోవడం వల్ల  తాము చాలా పని చేస్తున్నామని, చాలా భాద్యతగా ఉంటున్నామని అనుకుంటారు. ఇది విజయానికి  మంచిదే కానీ ఇది ఆరోగ్యపరంగా చాలా నష్టాలు కలిగిస్తుందని అంటున్నారు. అదేవిధంగా.. నిద్రించడానికి తగినంత సమయం లేకపోవడం వల్ల  తగినంత నిద్రపోని వారు అనేకమంది ఉన్నారు. కొంతమంది ఎక్కువగా మద్యం సేవించిన తర్వాత తమ సామర్థ్యం బాగా పెరిగిందని తమను తాము గొప్పగా చెప్పుకుంటారు. ఆహారం.. నేటికాలంలో ఆహారపు అలవాట్లు చాలా అనారోగ్యకరంగా తయారయ్యాయి. ప్యాక్ చేసిన స్నాక్స్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు,  తక్కువ ఫైబర్ భోజనం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది ప్రేగులలోని బ్యాక్టీరియా సంఖ్యను ప్రభావితం చేస్తుంది. ఇది పెద్దప్రేగు,  గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. యాంటీబయాటిక్ ఎక్కువ వాడటం కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతుంది. పొల్యూషన్.. పర్యావరణ,  కాలుష్య కారకాలు క్యాన్సర్‌కు ప్రధాన కారణం. చుట్టూ ఉన్న కలుషితమైన గాలి,  ఇంటి లోపల,  వెలుపల గాలిని ప్రమాదకరంగా మారుస్తోంది. PM2.5,  వాయు కాలుష్యం నుండి వచ్చే టాక్సిన్స్ శరీరంలోకి ప్రవేశించి వాపుకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.  DNA ను దెబ్బతీస్తాయి. ఇది ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతుంది. జన్యువులు.. చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చే వ్యక్తులు జన్యు కారణాల వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉండటం వలన BRCA వంటి  సమస్యలు  సంభవించవచ్చు. అనారోగ్యకరమైన వాతావరణంలో జీవించడం దీని ప్రమాదం పెరుగుతుంది. పరీక్షలు.. యువతలో చాలామంది తమకు ఎదురయ్యే  ఆరోగ్య సమస్యలను లైట్ తీసుకుంటారు. మాది చిన్న వయసు మాకేం జబ్బులు వస్తాయి అని అనుకుంటారు. ఈ వయసులో క్యాన్సర్ ఎలా వస్తుందనే ఆలోచన యువతలో ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాణాంతక వ్యాధిని గుర్తించడం ఆలస్యం అవుతుంది.  చికిత్స కష్టమవుతుంది.  దీర్ఘకాలిక నొప్పి, ఆకస్మికంగా బరువు తగ్గడం, మలద్వారం నుండి రక్తస్రావం, ఎప్పుడూ  దగ్గు రావడం,  రొమ్ములో ముద్దగా ఉండటం,  మూత్ర విసర్జన అలవాట్లలో మార్పు లేదా నోటిలో పూతలు ఎక్కువ కాలం ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.                         *రూపశ్రీ.