పొలిటికల్ స్ట్రాటజిస్ల్ ప్రశాంత్ కిశోర్ ఎక్కడున్నారు. ఇటీవలి కాలం వరకూ దేశ రాజకీయాల్లో   చక్రం తిప్పిన ఈ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం జరుగుతున్న కీలక రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఎక్కడా కనిపించకపోవడం, వినిపించకపోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   గతంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ప్రత్యక్షమై.. ఏదో పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పని చేసి.. ఆ పార్టీని గెలుపు బాటలో నడిచే చోదక శక్తిగా తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడిలో ఎక్కడా ఉనికిమాత్రంగా కూడా లేకపోవడం గమనార్హం.  బీహార్ ఎన్నికల ద్వారా నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశించిన కిశోర్..  అక్కడ జన్ సూరాజ్  పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ,  ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.    ఐదేళ్ల క్రితం తమిళనాడులో డీఎంకేకు, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు పీకే వ్యూహకర్తగా పనిచేశారు. ఆయా పార్టీల విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు మాత్రం డీఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ ఆయనను తమ పార్టీల దరికి కూడా రానీయడంలేదు. మీ సేవలు అవసరం లేదని మర్యాదగా చెప్పేశాయి. తమిళనాట కొత్తగా రాజకీయాలలోకి అడుగుపెట్టిన నటుడు విజయ్ టీవీకే పార్టీకి పీకీ ఎన్నికల వ్యూహాలు అందించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే విజయ్ కూడా ప్రశాంత్ కిశోర్ వ్యూహ సేవలకు నో చెప్పినట్లు టీవీకే వర్గాల చెబుతున్నాయి.  అదలా ఉంటే ప్రశాంత్ కిశోర్ స్థాపించిన   ఐ-ప్యాక్ పై వెల్లువెత్తుతున్న అవినీతి, కుంభకోణాల ఆరోపణలకు కూడా ప్రశాంత్ కిశోర్ మౌనానికి కారణమని అంటున్నారు. ఈ అవినీతి, కుంభకోణం ఆరోపణల కారణంగానే ఆయన కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ తరఫునా ఎన్నికల వ్యూహాలు అందించేందుకు సాహసించలేకపోతున్నారన్నది పరిశీలకులు విశ్లేషణ.   చివరాఖరికి తెలంగాణలో   కల్వకుంట్ల కవిత కూడా ఎన్నికల వ్యూహాలు అందిస్తానంటూ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఆఫర్ కు నో చెప్పేశారని తెలుస్తోంది.  ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ స్ట్రాటజీలకు కాలం చెల్లిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సమాజంలో వర్గాల మధ్య, కులాల మధ్యా విభేదాల ద్వారా రాజకీయ లబ్ధి అన్నదే ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహాలనీ, అవి ఒకసారి ఫలించనినా జనం మరోసారి ఆ వ్యూహాలలో చిక్కుకోరనీ ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల ఫలితాలు నిర్ద్వంద్వంగా రుజువు చేశాయంటున్న రాజకీయ పరిశీలకులు, అందుకే ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశాంత్ కిశోర్ ను వ్యూహకర్తగా నియమించుకోవడానికి సాహసం చేయడం లేదని చెబుతున్నారు. 
 కేరళ అసెంబ్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్ ను.. పోలింగ్ సరళని చూశాక.. కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో బోణీ కొట్టినట్టు తెలుస్తుంది. ఇది నిజమేనా? అందుకు అవకాశముందా? అని పరిశీలిస్తే.. ప్రస్తుత  సమాచారాన్ని బట్టి అధికార ఎల్ డీఎఫ్ ప్రతిపక్షయూడీఎఫ్ మధ్య నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 70 కాగా.. ట్రెండ్స్ ను బట్టి కాంగ్రెస్ కూటమి 72-77, లెఫ్ట్ కూటమి 55-60 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. BJP ఓ ఐదు చోట్ల గట్టి పోటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం  కాంగ్రెస్ లో సిఎం అభ్యర్థి విషయంలో పార్టీ ఫ్లోర్ లీడర్  సతీషన్, సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల మధ్య పోటీ ఉన్నప్పటికీ.. అధిష్ఠానం మొగ్గు సతీషన్ వైపే   ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మెజార్టీ ఎమ్మెల్యేలు, అధిష్టానం ఆశీస్సులతో పాటు సీనియర్ నాయకులు  కేసీ వేణుగోపాల్, శశి థరూర్ లాంటి వారి మద్దతు ఎవరికి దక్కుతుందో తెలియాల్సి ఉంది.  ఇకపోతే రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే కేరళలో సిఎం పినరయ్ విజయన్ మీద జనంలో పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ.. పదేళ్ల ఎల్ డీఎఫ్ పాలన తర్వాత ఈసారి జనం  మార్పు కోరుకున్నట్టు భావిస్తున్నారు.  పదేళ్ల క్రితం సీఎంగా అచ్యుతానందన్ ను కాదని పినరయ్ విజయన్ పేరును పార్టీ ప్రకటించినప్పుడు.. పెద్దాయన పినరయ్ విజయన్ తిరువనంతపురం రావడానికి కన్నూర్ స్టేషన్ లో ఓ సాధారణ ప్రయాణికుడిగా ట్రైన్ కోసం ఎదురుచూసిన దృశ్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. రేపు ఒకవేళ పదవి నుండి దిగిపోయినా అంతే హుందాగా.. ఆయనో సామాన్యుడిలా జనంతో కలిసి ప్రయాణించగలరంటున్నారు. నిజానికి రాజకీయాల్లో ఇంతటి సైద్ధాంతిక నిబద్ధత ఒక్క కమ్యూనిష్టులకే సాధ్యం. ఇవన్నీ అలా ఉంచితే పినరయి విజయన్ హాట్రిక్ కొడతారా? కాంగ్రెస్ బోణి కొట్టబోతుందా? అన్నది తేలాలంటే మాత్రం ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.
వైసీపీ అధినేత జగన్ ను ఆయన సొంత సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. జగన్ పై తెలుగుదేశం, జనసేనల పార్టీలను మించి షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జగన్ ప్రతిపాదించిన మావిగన్ రాజధానిని టార్గెట్ చేస్తూ షర్మిల ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని  జగన్  నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ,  ఇప్పుడు కొత్తగా  మావిగన్   ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చవుతాయని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. ఇటీవల పార్లమెంటులో అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించడంతో ఎన్డీయే ప్రభుత్వం మైలేజ్ సాధించగా, దానిని అడ్డుకునేందుకు వైసీపీ నెగటివ్ ప్రచారం మొదలుపెట్టింది. అమరావతి సాధ్యం కాదని, అది కేవలం భ్రమ అని ప్రచారం చేస్తున్న వైసీపీ తీరును షర్మిల ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిపాదించిన  మావిగన్  అనే పేరును షర్మిల జగన్ దిమ్మదిరిగేలా ఎద్దేవా చేశారు.   మావిగన్ అమరావతికి ప్రత్యామ్నాయం అయితే.. పులివెందులకు అవి గొడ్డలి అని పేరుపెట్టడం సబబుగా ఉంటుందన్నారు.   కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరును, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వచ్చి గొడ్డలిని ముడపెడుతూ పులివెందులకు అవిగొడ్డలి అని పేరుపెట్టాలని జగన్ కు సూచించారు. అవినాష్ రెడ్డి పేరులోని అవి అక్షరాలను  వివేకా హత్యకేసులో గొడ్డలికి ముడిపెడుతూ ఆమె జగన్ లక్ష్యంగా సంధించిన విమర్శనాస్త్రం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో తెగ వైరల్ అయ్యింది. జగన్ రాజధానికి ప్రతిపాదించిన మావిగన్ పేరు కంటే.. తాను పులివెందులకు సూచించిన అవిగొడ్డలి పేరు జనానికి తేలిగ్గా అర్ధమౌతుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాయి.   జగన్ మావిగన్ ప్రతిపాదనను తిప్పికొడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు.. అమరావతి  స్వయం సమృద్ధి నగరం అంటూ వివరణలు ఇచ్చుకుంటుంటే.. షర్మిల మాత్రం దూకుడుగా వైసీపీ అధినాయకత్వాన్నే లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పించా, కూటమి పార్టీల కంటే ముందున్నారు.   ఇప్పుడు  షర్మిల చేసిన  అవి గొడ్డలి  వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  
ALSO ON TELUGUONE N E W S
భారతీయ సినీ సంగీతంలో ఒక పెను సంచలనంలా వచ్చారు ఆశా భోస్లే. ఒక తరహా పాటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పాటలతో సంగీత ప్రియులను అలరించారు. గాయనిగా దాదాపు 80 సంవత్సరాల కెరీర్ కొనసాగించారు ఆశా. తన తొమ్మిదో ఏటనే తొలి పాట పాడిన ఆశా 20 భాషల్లో 12,000కు పైగా పాటలు పాడి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు.  తెలుగు పాటల విషయానికి వస్తే.. ఆశా భోస్లే సోదరి లతా మంగేష్కర్.. 1955లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘సంతానం’ చిత్రంలో ‘నిదురపోరా తమ్ముడా..’ పాటతో తెలుగు వారికి వీనుల విందు చేశారు. ఈ పాట చాలా పెద్ద హిట్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత అక్కినేని నాగార్జున, శ్రీదేవి జంటగా నటించిన ‘ఆఖరిపోరాటం’ చిత్రంలో ‘తెల్ల చీరకు..’ అనే మరో మధురమైన పాటను ఆలపించారు. అలాగే హిందీ నుంచి డబ్ అయిన కొన్ని సినిమాల్లో కూడా పాటలు పాడారు.  ఇక ఆశాభోస్లే 1981లో విడుదలైన ‘పాలు నీళ్లు’ సినిమాలో తొలిసారి పాట పాడారు. మోహన్‌బాబు, జయప్రద జంటగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ‘ఇది మౌనగీతం.. ఒక మూగ రాగం’ అనే పాట అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత కష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ చిత్రంలో ‘నాలో ఊహలకు..’ అనే పాట పాడారు. ఇవి కాక తెలుగులో కొన్ని అన్నమయ సంకీర్తనలు కూడా పాడారు. 
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గుర్తుంచుకోద‌గ్గ సినిమాలు, ఆయ‌న చేసిన క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఆల‌య శిఖ‌రం ఒక‌టి. అనుబంధం, ఆప్యాయ‌త, కుటుంబ బంధాల గురించి తెలియ‌జెప్పే ఈ చిత్రానికి కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తూటాల్లాంటి మాట‌ల‌ను గొల్ల‌పూడి మారుతీరావు సంధించారు. చిరంజీవి, రంగ‌నాథ్‌, సుమ‌ల‌త‌, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, గొల్ల‌పూడి మారుతీరావు త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమాలో తండ్రిగా న‌టించిన గొల్ల‌పూడి చెప్పే డైలాగులు క‌ట్టి ప‌డేస్తాయి.  తెలుగు సినీ చరిత్రలో విలక్షణ నటుడిగా, రచయితగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న గొల్లపూడి మారుతీరావు నటనకు 'ఆలయ శిఖరం' ఒక అద్దం పడుతుంది. ఇటీవల తెలుగువన్ విడుదల చేసిన ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి తండ్రి పడే ఆవేదనను, నేటి తరం కొడుకుల బాధ్యతారాహిత్యాన్ని గొల్లపూడి తనదైన శైలిలో పండించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ వీడియోలోని ప్రధాన ఘట్టం చూస్తే, ఒక తండ్రి తన కొడుకును రిక్షాలో ఎక్కించుకుని లాగే సన్నివేశం గుండెలను పిండేస్తుంది. రాత్రి వేళ చలిలో కష్టపడుతున్న తాతను చూసి జాలిపడి ఒక జంట రిక్షా ఎక్కుతుంది. కానీ ఆ రిక్షా తొక్కుతున్న వ్యక్తి మరెవరో కాదు, తన సొంత తండ్రే అని తెలుసుకున్న కొడుకు ఏ విధంగా స్పందించాడు? తండ్రి కష్టానికి ఆ కొడుకు ఇచ్చిన విలువేంటి? అనే అంశాలను గొల్లపూడి పదునైన సంభాషణలతో వివరించారు. కథలో మరో మలుపు ఏమిటంటే, అవినీతికి పాల్పడే ఒక ఫ్యాక్టరీ యజమాని అక్రమాలను ఒక జర్నలిస్టు ఎలా ఎండగట్టాడనేది. పంచదార గోడౌన్లను తగులబెట్టి ఇన్సూరెన్స్ కోసం ప్రయత్నించే పెద్ద మనుషుల ముసుగును 'చాకిరేవు' పత్రిక ద్వారా నరసింహం అనే పాత్ర బయటపెట్టడం ఆసక్తికరంగా సాగుతుంది. "ధన బలం, పశుబలం నీదైతే.. కలం బలం, నైతిక బలం నాది" అంటూ జర్నలిస్టు చెప్పే డైలాగులు నేటి సమాజానికి కూడా అద్దం పడుతున్నాయి. వీడియో చివరలో నరసింహంపై జరిగే దాడి, ఆ తర్వాత చోటుచేసుకునే నాటకీయ పరిణామాలు సినిమాపై ఉత్కంఠను పెంచుతున్నాయి. ఒకవైపు కుటుంబ విలువలు, మరోవైపు సామాజిక బాధ్యత.. ఈ రెండింటి కలయికతో 'ఆలయ శిఖరం' అప్పట్లోనే ఒక సంచలనం సృష్టించింది. ఈ అల్టిమేట్ డైలాగ్స్ వీడియో ఇప్పుడు పాత తరం ప్రేక్షకులకు గుర్తులను మిగిలిస్తే, కొత్త తరం సినీ అభిమానులకు గొల్లపూడి నటనా చాతుర్యాన్ని పరిచయం చేస్తోంది. ఇలాంటి భావోద్వేగ భ‌రిత‌మైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
The music world mourns the loss of the legendary playback singer Asha Bhosle, who has passed away at the age of 92. With a remarkable career spanning over eight decades, she was celebrated as one of the most versatile voices in Indian cinema. Her ability to effortlessly shift from classical notes to peppy cabaret numbers made her a timeless icon.   Asha Bhosle recorded thousands of songs across multiple languages, earning the Guinness World Record for the most recorded artist in music history. She delivered unforgettable hits like "Piya Tu Ab To Aaja," "Dum Maro Dum," and "Chura Liya Hai Tumne Jo Dil Ko." While she reigned over Bollywood, she also beautifully rendered songs in Telugu and other regional languages, leaving a lasting impression on audiences nationwide.  She was awarded Padma Vibushan by Indian Government for her incredible talent, service and work, in 2008.  Her musical journey was deeply intertwined with her marriage to the iconic music director R.D. Burman, with whom she created some of the most experimental and enduring tracks of the era. She shared a respectful yet competitive dynamic with her elder sister, the late Lata Mangeshkar, together dominating the Indian music landscape for generations.  Beyond the recording studio, Asha lived a vivacious lifestyle. She was an exceptional cook and successfully ran her own chain of restaurants globally, always radiating energy and a zest for life. Her legendary voice and joyful spirit will remain unforgettable. Her legacy will last for generations to come.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Some media outlets recently reported that director and Producer Venu Udugula was also involved in the case registered against singer Mangli in an alleged financial fraud incident. Responding to these false reports, Venu Udugula issued a clarification, firmly stating that he has no connection whatsoever with the case. He released an official press note addressing the issue. Responding to the controversy, Venu Udugula said, “I was deeply distressed to see certain media organizations linking my name to the case involving singer Mangli. Since both Mangli and lawyer Subba Rao are known to me, I only suggested that the issue be resolved amicably and that justice be ensured for the victims."  He continued to say, "That is the extent of my involvement in this matter. My name has not been mentioned as an accused anywhere in the FIR related to this case. Advocate Subba Rao also clearly stated to the media today that I have no connection with this case. The Panjagutta police have also confirmed that I am not related to this matter."  He finally asked media to support him, saying, "I request media friends to understand that such reports can affect a person’s reputation, dignity, and family. The love and support you have shown me all these years have given me great strength, and I hope you will continue to extend the same support.”   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
జీవితం అంటేనే ఒక నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో బంధాలు. ఒక తరం ముగిస్తూ ఉంటే, మరో తరం అప్పుడే అడుగులు వేస్తూ ఉంటుంది. ఈ రెండు తరాల మధ్య ఉండే అనుబంధాన్ని, ఆత్మీయతను, కాలం నేర్పే పాఠాలను ఎంతో హృద్యంగా ఆవిష్కరించిన గీతం 'అవసాన దశలో నేను'. తెలుగువన్ (TeluguOne) సమర్పణలో విడుదలైన ఈ వీడియో సాంగ్ ప్రస్తుతం సంగీత ప్రియుల హృదయాలను బ‌రువెక్కిస్తోంది. ఈ పాటలో మణి భామ్మ మరియు చిన్నారి జోష్విక జున్నురెడ్డి ప్రధాన పాత్రల్లో కనిపించారు. జీవితం చరమాంకానికి చేరుకున్న ఒక బామ్మ, అప్పుడే లోకాన్ని చూస్తున్న ఒక పసిపాప. వీరిద్దరి మధ్య సాగే సంభాషణే ఈ పాటలోని ప్రధానాంశం. బామ్మగా మణి భామ్మగారు పండించిన హావభావాలు, ఆ చిన్నారి అమాయకత్వం కలగలిసి చూసేవారి కళ్లలో నీరు తెప్పిస్తాయి. ఈ పాటలోని ప్రతి అక్షరం ఒక అనుభవంలా అనిపిస్తుంది. దీనికి సత్య సాగర్ పోలం అందించిన సంగీతం, మాధవ స్వరపరిచిన విధానం ఎంతో హృద్యంగా ఉంది. సంగీతం ఈ పాటలోని ఎమోషన్‌ను మరింత ఎలివేట్ చేసింది. మరీ ముఖ్యంగా గాయని జయశ్రీ గొంతులో ఉన్న ఆర్ద్రత పాట వింటున్నంత సేపూ మనల్ని ఆ లోకంలోకి తీసుకెళ్తుంది. ఆ గొంతులోని బాధ, ఓదార్పు, ప్రేమ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి. సాహిత్యం విషయానికి వస్తే.. ఎంతో సహజంగా, సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ఉంది. "అవసాన దశలో నేను - ఆరంభ దశలో నువ్వు" అనే పల్లవిలోనే జీవిత పరమార్థం దాగి ఉంది. ఒకరు గతాన్ని గుర్తు చేసుకుంటుంటే, మరొకరు భవిష్యత్తు వైపు చూస్తున్నారనే భావన చాలా గొప్పగా కుదిరింది. పాట ప్రారంభంలోనే అనుబంధాల గురించి చెప్తూ, "అనుబంధాలతో నేను.. అల్లరి ముద్దుతో నువ్వు" అంటూ రెండు విభిన్న మనస్తత్వాలను చిత్రించారు. ఒకవైపు ముసలితనంలో వచ్చే ఒంటరితనం, శారీరక అలసట కనిపిస్తుంటే, మరోవైపు పసితనంలోని ఉత్సాహం ఉరకలు వేస్తుంది. బామ్మ తన జీవితాన్ని ఒక "చదివిన పుస్తకం" తో పోలిస్తే, ఆ చిన్నారిని "నేర్వని పుస్తకం"గా వర్ణించడం అద్భుతం. ఒకరు అనుభవాల సారాన్ని రుచి చూసి ఉంటే, మరొకరు కొత్త పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వయసు మళ్ళిన తర్వాత శరీరం సహకరించకపోయినా, మనసు మాత్రం ఆత్మీయుల కోసం తపిస్తూనే ఉంటుంది. "బరువైన బంధమే నీవు.. ప్రియమైన బాధ్యత నీవు" అనే పదాలు మన ఇంట్లోని పెద్దలు మనపై చూపే నిస్వార్థ ప్రేమని గుర్తు చేస్తాయి. ఈ పాట కేవలం వేదననే కాదు, ఒక నిరీక్షణను కూడా చూపిస్తుంది. గడిచిన కాలం స్వప్నమైతే, రాబోయే కాలం సత్యమని చెబుతూ జీవితంపై ఒక స్పష్టమైన అవగాహనను కలిగిస్తుంది. హర్ష అన్నవరపు దర్శకత్వంలో ప్రతి ఫ్రేమ్ ఎంతో సహజంగా ఉంది. ఆ పల్లెటూరి వాతావరణం, బామ్మ-మనవరాల మధ్య ఉండే చిన్న చిన్న ముచ్చట్లు, ఒకరికొకరు తోడుగా ఉండే దృశ్యాలు మన ఇంట్లో జరిగే కథలాగే అనిపిస్తాయి. ఈ దృశ్యాలను మరింత అందంగా చిత్రీకరించారు డీఓపీ వెంకట్.  నేటి యాంత్రిక జీవనంలో మనం తరచుగా మన ఇంట్లోని పెద్దలను, వారి అనుభవాలను మర్చిపోతుంటాం. అటువంటి సమయంలో ఈ 'అవసాన దశలో నేను' పాట మన కళ్లు తెరిపిస్తుంది. ముసలితనం అనేది శాపం కాదు, అది ఒక నిండు జీవితం తాలూకు పరిపూర్ణత అని ఈ గీతం చాటి చెబుతోంది. ఎమోషన్స్, మంచి సాహిత్యం, మరియు శ్రావ్యమైన సంగీతం కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన వీడియో సాంగ్ ఇది. తెలుగువన్ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్న ఈ పాటను మీరు కూడా వీక్షించండి, ఈ అందమైన భావోద్వేగంలో భాగమవ్వండి. ఇలాంటి అర్థవంతమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, చరణ్ ఒక భారీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజయ్ లీల భన్సాలీతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ గురించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కథా నేపథ్యం సాధారణంగా సంజయ్ లీల భన్సాలీ సినిమాలంటే ప్యాలెస్‌లు, రాజసం, భారీ సెట్టింగ్‌లు గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి ఆయన రామ్ చరణ్ కోసం ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో సాగే జంగిల్ అడ్వెంచర్ అని తెలుస్తోంది. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు, గుండెను హత్తుకునే భావోద్వేగాలు, రోమాంచితమైన సాహసాలు ఉండబోతున్నాయట. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని దృష్టిలో ఉంచుకుని, ఆయన మాస్ ఇమేజ్‌కి సరిపోయేలా భన్సాలీ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు టాక్. పాన్-ఇండియా రేంజ్.. బాలీవుడ్ డైరెక్షన్! ఈ ప్రాజెక్ట్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాని సంజయ్ లీల భన్సాలీ నిర్మిస్తుండగా, ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు దీనిని తెరకెక్కించే అవకాశం ఉంది. సినిమాను హిందీలో చిత్రీకరించి, ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక భారీ బడ్జెట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనుంది. నెక్స్ట్ లెవల్ అంచనాలు 'RRR' తర్వాత రామ్ చరణ్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. వీటి తర్వాత భన్సాలీ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశముంది. రామ్ చరణ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఒక భిన్నమైన కథతో ముందుకు రావడం, అది కూడా భన్సాలీ నిర్మాణంలో కావడం ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  
- సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పాత వీడియో  - కింగ్‌ పవర్‌ఫుల్ ఎంట్రీతో షేక్ అవుతున్న నెటిజన్లు - విల‌న్ల‌కు ద‌డ పుట్టించిన యంగ్ కింగ్‌ అక్కినేని నాగార్జున కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ అంటే 'కింగ్' సినిమా అని చెప్పవచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, బుల్లితెరపై కూడా ఎప్పుడు వచ్చినా మంచి టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమాలోని ఒక పవర్‌ఫుల్ సీన్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ వీడియోలో చిన్నప్పటి నాగార్జున తన మార్క్ మేనరిజంతో బిజినెస్ డీలింగ్‌లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం చూడవచ్చు. ముఖ్యంగా కింగ్ కన్‌స్ట్రక్షన్స్ నుంచి ఇక ఎవరూ రారు అని ప్రత్యర్థులు భావిస్తున్న సమయంలో, ఒక కుర్రాడి ఎంట్రీ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. వేలం పాటలో ప్రత్యర్థులను రెచ్చగొట్టి, కేవలం 50 లక్షలు కూడా విలువ చేయని స్పిన్నింగ్ మిల్లును కోట్లకు పెంచేలా చేయడంలో చిన్నప్పటి కింగ్ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది. వర్కర్ల ప్రయోజనాల కోసం ఆ కుర్రాడు ఆడిన ఈ 'మైండ్ గేమ్' ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బిజినెస్ అంటే బంతాట కాదు అని వెక్కిరించిన విలన్లకు కింగ్ తనదైన శైలిలో బుద్ధి చెబుతాడు. ముఖ్యంగా ఈ సీన్ చివరలో వచ్చే "కింగ్ అంటే గెలిచేవాడు మాత్రమే కాదు.. ఎదుటివాడిని గెలిపించేవాడు కూడా" అనే డైలాగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే ఈ షార్ట్ వీడియో ప్రస్తుతం మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. నాగార్జున ఫ్యాన్స్ ఈ వీడియోను చూసి "కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సంవత్సరాలు గడిచినా 'కింగ్' మూవీలోని ఈ సీన్ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇలాంటి ఎక్స్‌లెంట్ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
   -గత నెల 27 న తెలుగులో రిలీజైన యూత్  -ఇప్పుడు నేరుగా మీ కోసం ఓటిటిలోకి  -ఎక్కడ, ఎప్పుడు అంచనాలు లేకుండా వచ్చి ఘన విజయాన్ని అందుకున్నచిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన చిత్రం యూత్(Youth). డబ్బులు పెట్టి ఎన్ని ప్రమోషన్స్ చేసుకున్నా టాక్ విషయంలో మౌత్ టాక్ ని మించిన మహర్దశ మరొకటి ఉండదని నిరూపించింది. చాలా మంది యూత్ ఎక్కడ ఆడుతుందో కనుక్కొని మరి థియేటర్స్ కి వెళ్లడమే అందుకు ఉదాహరణ. ఇప్పుడు ఈ మూవీ మీ ఇంటికే వస్తుంది. బహుశా ఎండల్లో తన కోసం వెతికే పని లేకనేమో. మరి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పి ఎంజాయ్ చేయండి. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.  యూత్ ఓటిటి హక్కులని నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ఈ మేరకు ఈ నెల 16 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టుగా నెట్‌ఫ్లిక్స్‌ అధికారకంగా  ప్రకటించింది. కెన్ కరుణాస్(Ken Karunas)హీరోగా చేస్తు  దర్శకత్వం వహించగా  కథ, కథనం ఏజ్ తో పని లేకుండా ప్రతి ఒక్కరి హృదయాలని టచ్ చేస్తుంది. హీరోయిన్స్ దగ్గరనుంచి ప్రతి ఒక్కరు అత్యద్భుతంగా చేసారు. స్కూల్ లైఫ్, టీనేజ్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నిటిని దాచుకోవడం యూత్ స్పెషాలిటీ. మరి థియేటర్లలో  మిస్ అయిన వారు, ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూసి సినీ ఎంజాయ్ ని మీ సొంతం చేసుకోండి. Also read: Dacoit: డెకాయిట్  ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. మరి హిట్టా ప్లాపా!  జి.వి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం మేజర్ అసెట్‌. గత నెల మార్చి 19 న తమిళ్,  27 న తెలుగులో రిలీజయ్యింది. అనీష్మా,  ప్రియాన్షి, మీనాక్షి, దేవదర్శిని కీలక రోల్స్ లో కనిపించారు    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు.. ఇలా జీవితం ఎంత సాఫీగా గడుస్తోంది అనుకున్నా.. మనిషి లోపల మాత్రం మనసు తృప్తిగా, సంతోషంగా అనుభూతి చెందడం లేదు. చాలామందిలో ఈ గందరగోళం కనిపిస్తూ ఉంటుంది.  ఏదో కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంటారు. అయితే దీనికి రివర్స్ గా.. సంతోషంగా ఉండే వ్యక్తులు మాత్రం జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సులువుగా అధిగమించగలరు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోగలరు,  వీరికి జీవితం అసలు కష్టంగా అనిపించదు.  కానీ సంతోషంగా ఉండటం ఎలా.. మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండటం కేవలం నాలుగు అలవాట్ల వల్ల సాధ్యం అవుతుందని అంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు.  ఆ నాలుగు అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. జాగ్రత్తగా వినడం.. కొంతమంది తమ గురించి మాత్రమే పట్టించుకుంటారు, ఇతరులు చెప్పేది వినడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మీరు మాట్లాడే దానికంటే ఎక్కువగా వినడం నేర్చుకోవాలి. ఇతరులు చెప్పేది శ్రద్దగా వినగలిగే వ్యక్తులు జీవితంలో ఎన్నో సమస్యలను క్లిష్టతరం కాకుండా,  అసలు సమస్యలుగా మారకుండా ముందుగానే వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు. తద్వారా జీవితాన్ని డిస్టర్బ్ చేసేంత సమస్యలు ఏవీ వారికి ఉండవు. పాజిటివ్ మైండ్ సెట్.. సానుకూల భావాలు అంటే పాజిటివ్ మైండ్ సెట్  ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ తమ జీవితాలతో సంతోషంగా ఉంటారు,  వారికి దొరికే ఏ కొద్ది సమయాన్ని అయినా సంతోషంగా గడపడానికి,  ఆ సమయాన్ని మధురమైన జ్ఞాపకాలుగా మార్చుకోవడానికి, పదిలపరుచుకోవడానికి ఇష్టపడతారు. ఈ విషయాలు క్రమంగా వారిని సంతోషంగా ఉంచుతాయి. ఒత్తిడికి దూరంగా ఉండటం.. సంతోషంగా ఉండే వ్యక్తులకు ఒత్తిడి లేకుండా నిద్రపోవడం  అలవాటుగా మారుతుంది. ఈ అలవాటు  సంతోషంగా ఉంచడానికి సహాయపడుతుంది.  నిద్రపోయేటప్పుడల్లా అస్సలు  ఏ చింతా లేకుండా,  ఏ సమస్య గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నం చేయాలి.  ఇది ఒత్తిడిని దూరంగా ఉంచుతుంది. తమ మీద తాము జాలి పడటం.. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తులు తమ మీద తాము జాలి పడటం అస్సలు పాటించరు. వారు ఏదో ఒకటి నేర్చుకుని, తప్పులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ తప్పులను తాము దాచిపెట్టడం లేదా తమ అసమర్థతను ఒప్పుకోకుండా ఇతరులతో గొడవ పడటం లాంటివి చేయరు.   పైన చెప్పుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.  ఆ లక్షణాలు వ్యక్తులను సంతోషంగా ఉండటానికి ప్రేరేపిస్తాయి,  సహాయపడతాయి కూడా.                                          *రూపశ్రీ  
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే... గొప్ప వ్యక్తులలో ఉండే అతిగొప్ప లక్షణం తక్కువ మాట్లాడటం.  తక్కువ మాట్లాడేవాడు తన చేతల్లోనే తన విజయాన్ని చూపిస్తాడు అని తరచుగా చెబుతూ ఉంటారు కూడా. ఇతరుల కంటే తక్కువ మాట్లాడేవారే ఎక్కువ తెలివైనవారని, జ్ఞానులని ఎందుకు అంటారు? తక్కువ మాట్లాడేవారు ఎందుకు ప్రత్యేకమైనవారిగా పరిగణించబడతారు? తక్కువ మాట్లాడటం అనేది గొప్ప లక్షణంగా ఎందుకు పరిగణించబడుతుంది? వివరంగా తెలుసుకుంటే.. తక్కువ మాట్లాడితే మాట విలువ పెరుగుతుంది.. ఎప్పుడూ  మాట్లాడుతూ ఉండే వ్యక్తులపై  చుట్టూ ఉన్నవారు  శ్రద్ధ పెట్టడం తగ్గిస్తారట.చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి మాట్లాడినా కూడా ప్రజలు శ్రద్ధగా వింటారు. తక్కువ మాట్లాడటం వల్ల  వ్యక్తి మాటలకు విలువ పెరిగి, సమాజంలో వారికి మరింత గౌరవం లభిస్తుందని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఆలోచనా శక్తి.. తక్కువ మాట్లాడేవారు తమ మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. వారు స్పందించడానికి తొందరపడరు.  ముందుగా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని, ఆ తర్వాతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే  వారు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకున్నారని అందరూ ఒప్పుకునే విధంగా ఉంటాయి.   సమాజం కూడా ఇలా తక్కువ మాట్లాడే వారికి చాలా తెలివైన వారు అని చెబుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం..  తక్కువ మాట్లాడేవారు ఆర్భాటాలు చేయరు. వారికి తమపై పూర్తి విశ్వాసం ఉంటుంది, కాబట్టి ఇతరులను ఆకట్టుకోవడానికి  పనికిమాలిన మాటలు మాట్లాడరు. ఇలా  నిశ్శబ్దంగా ఉండే స్వభావమే వారి నిజమైన బలం అవుతుందని చాణక్యుడు అంటాడు.  తక్కువ మాట్లాడినప్పుడు వారిలో ఎన్నో విషయాలు వారిలోనే రహస్యంగా ఉండిపోతాయి. అదే ఎప్పుడూ మాట్లాడేవారు ఏ చిన్న సంఘటన జరిగినా బయటకు చెప్పేసుకుంటారు. దీని వల్ల వారికి విలువ, గౌరవం తగ్గిపోతుంది. అర్థం చేసుకునే అవకాశం.. తక్కువ మాట్లాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం  ఇతరుల మాటలను వినడానికి  అవకాశం లభించడం. ఇతరులు చెప్పేది బాగా వినగలిగే వ్యక్తి మాత్రమే  ఇతరుల బలహీనతలను, అవసరాలను అర్థం చేసుకోగలరని చాణక్యుడు చెబుతాడు. మౌనంగా ఉండి ఇతరుల మాటలను విన్నప్పుడు, వారి ఆలోచనలపై  ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది నిర్ణయాలు తీసుకోవడానికి,  విజయం సాధించడానికి అత్యంత కీలకం అవుతుంది.                                 *రూపశ్రీ.
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది. అయితే.. విజయం సాధించడానికి కష్టపడితే సరిపోతుందని  తెలివి ఉంటే చాలని అనుకుంటారు అందరూ. కానీ విజయం సాధించడానికి తెలివి తేటలు, కష్టపడే తత్వం ఉన్నా.. కొన్ని అలవాట్లు మాత్రం వారికి విజయాన్ని దూరంగానే ఉంచుతాయి.  కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడని సాక్షత్తు ఆచార్య చాణక్యుడే చెబుతాడు.  ఒక వ్యక్తిని విజయం సాధించకుండా చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. సోమరితనం.. కష్టపడే వ్యక్తులలో సోమరితనం ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.. కష్టపడే వ్యక్తులలో ఎంతో కొంత సోమరితనం కనిపిస్తూ ఉంటుంది.  అయితే ఏదో ఒక సందర్బంలో ఈ సోమరితనం వారిని దెబ్బతీస్తుంది.  కీలకమైన సందర్బంలో ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటే లేదా పనిని నిర్లక్ష్యం చేస్తే.. చేతుల దాకా వచ్చిన విజయం కూడా చేజారిపోతుంది.  అందుకే.. ఏ కొద్దిపాటి సోమరితనం ఉన్నా,  దాన్ని వదిలిపెట్టడం మంచిది. పట్టుదల.. పట్టుదల ఏ పనిలో అయినా ముందుకు సాగడానికి,  పనిని పూర్తీ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు చాలా సీరియస్ గా ప్రారంభించి కష్టపడతారు.. ఆ తరువాత మాత్రం తమ పట్టుదలను తగ్గిస్తారు.  దీని వల్ల దక్కాల్సిన విజయం చెయ్యి జారిపోతుంది. ప్రవర్తన.. మనిషి ప్రవర్తన కూడా వారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఇతరులతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను చుట్టుప్రక్కల వారు, సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, వారికి గౌరవం ఇవ్వదు,  వారు చేసే పనులలో తోడ్పాటు, వారు చేసే పనులకు గౌరవం కూడా ఇవ్వదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తమ పనుల విషయంలో కూడా నెగెటివ్ ఫలితాలు పొందుతారు.                                   *రూపశ్రీ.
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం చేయడానికి ఆహారంలో నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవడం ఎంతో ఉత్తమం అని ఆహార నిపుణులు అంటున్నారు. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అసలు గుండె బలంగా ఉండటానికి నైట్రేట్ ఎందుకు అవసరం? నైట్రేట్ ఆ కూరగాయలలో అధికంగా ఉంటుంది? ఆహార నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తీగా తెలుసుకుంటే.. ఆరోగ్యకరమైన గుండెకు నైట్రేట్ ఎందుకు ముఖ్యం? శరీరంలో నైట్రేట్, నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చబడుతుంది. నైట్రేట్ ఆక్సైడ్ రక్తనాళాలను విస్తరింపజేస్తుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు సమస్య.. కొన్ని సంవత్సరాల క్రితం అధిక రక్తపోటును వృద్ధాప్య వ్యాధిగా పరిగణించేవారు. ఆ తరువాత 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో అధిక రక్తపోటు కనిపించేది. ఇప్పుడు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు కూడా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. అధిక రక్తపోటును సకాలంలో కంట్రోల్ చేయలేకపోతే అది గుండె జబ్బులు, పక్షవాతం , మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు అంటే ధమనులలో రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు.. పాలకూర.. పాలకూరలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి. పాలకూరను తినడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది , గుండె కండరాలను బలపరుస్తుంది. బీట్‌రూట్ .. బీట్‌రూట్ రసంలో నైట్రేట్లు ఉంటాయి. బీట్‌రూట్ రసం తాగడం వల్ల ఓపిక పెరిగి, గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఆకుకూర సలాడ్లు.. ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లలో నైట్రేట్లు ఉంటాయి.  ఆహారంలో సలాడ్లను చేర్చుకోవచ్చు.  ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లను చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం. మెంతులు.. మెంతిలో పీచుపదార్థం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి, ఇవి గుండె జబ్బులను నివారించడంలో , చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. కాలీఫ్లవర్.. క్యాబేజీలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాకుండా ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడే నైట్రేట్లు ఉంటాయి.                      *రూపశ్రీ.
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు త్రాగమని కూడా సిఫార్సు చేస్తారు. కొందరు ఆరోగ్యానికి కొబ్బరి నీరు బెటర్ అని చెబితే.. మరికొందరు మజ్జిగ చాలా మంచిది అంటారు.  ఈ రెండూ ఆరోగ్యకరమైనవే.. అయినప్పటికీ రెండింటిలో కూడా ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది అనే విషయం దగ్గర చాలా మంది కన్ప్యూజ్ అవుతుంటారు.  కొబ్బరి నీరు,  మజ్జిగ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేసే డ్రింక్ ఏంటో తెలుసుకుంటే.. కొబ్బరి నీరు.. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం , సోడియం ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం నివారించబడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, తక్షణ శక్తిని అందిస్తుంది.  తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది.  అధికంగా చెమట పట్టినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు కొబ్బరి నీళ్లు తాగమని డైటీషియన్లు సిఫార్సు చేస్తారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత చేయబడుతుంది. మజ్జిగ.. మజ్జిగలో జీర్ణవ్యవస్థను బలపరిచే ప్రోబయోటిక్ గుణాలు ఉంటాయి. మజ్జిగ తాగడం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ప్రతిరోజూ మజ్జిగ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ ,  ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ తాగితే  శరీరం  చల్లబడుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. గ్యాస్ లేదా అజీర్ణం వంటి కడుపు సమస్యలతో బాధపడుతుంటే, మజ్జిగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తేడా.. కొబ్బరి నీరు శరీరానికి తక్షణమే తేమను అందిస్తుంది. మరోవైపు, మజ్జిగ జీర్ణక్రియను బలపరుస్తుంది. కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండగా, మజ్జిగలో ప్రోటీన్ , ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఎప్పుడు ఏది ఎంచుకోవాలి..?  డీహైడ్రేషన్ లేదా అలసటగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇది శరీరాన్ని తిరిగి ఎనర్జీగా మారుస్తుంది.  శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత తగ్గిస్తుంది. భోజనం తర్వాత మజ్జిగ తాగవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.  అలాగే ఎండలో బయటకు వెళ్లే ముందు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఎండ నుండి వచ్చిన తర్వాత కూడా కాసింత చల్లగా ఉండే మజ్జిగ తాగవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీరు రెండూ మంచివే అయినా.. శరీర పరిస్థితిని బట్టి కొబ్బరి నీరు, మజ్జిగ వేర్వేరు ఫలితాలు ఇస్తాయి,  వేర్వేరుగా ఉపయోగపడతాయి.                              *రూపశ్రీ.