తెలంగాణ కేబినెట్ భేటీ లో మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయిం చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్ల అందజేస్తోంది.తాజాగా అదనంగా 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణ యించింది. కొత్తవి,. పాతవి కలిపి మొత్తం 46 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గురువారం(ఆగ‌ష్టు11) నిర్వహించిన మంత్రివ‌ర్గ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం లభించింది. ఈ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ సమా వేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం  నిర్ణయం తీసు కుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్ష న్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని తీర్మానించింది. దీంతో మొత్తంగా కొత్తవి, పాతవి కలిపి 46 లక్షల పెన్షన్ దారులకు కార్డులు మంజూరు చేయనున్నారు. దీంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఇక కోఠి ఈఎన్.టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయా లని ఆదేశించింది. కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇక స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కోఠి ఈఎన్. టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది.  అలాగే కోఠి ఈఎన్‎టి ఆస్పత్రి లో అధునా తన సౌకర్యాలతో టవర్ నిర్మించాలని మంత్రులు నిర్ణయించారు. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌక ర్యాలతో కూడిన నూతన భవన సముదాయాన్ని నిర్మించేందుకు మంత్రులు ప్రతిపాదనలు చేశారు. 
భ‌క్తి, ప్రేమ‌లు మ‌న‌సులో ఉండాలే గాని మైకుల్లో గోల‌చేయ‌ న‌క్క‌ర్లేదు. భారీ ప్ర‌చారాలేమీ అక్క‌ర్లేదు. చిన్న‌ పాటి ప‌ని చాలు. అమృతోత్స‌వ్ పేరు తో బీజేపీవారికున్నంత దేశ‌భ‌క్తి మాకు లేదుగాని మాకున్నంత‌లో మాదీ దేశ‌భ‌క్తే అంటున్నారు కూర‌ గాయ‌ల మార్కెట్లో దుకాణాల‌వారూ. నిజమే రాజ‌కీయ‌నాయ‌కుల‌కు, పారిశ్రామిక వేత్త‌ల‌కే కాదు అంద‌రికీ ఉంటుంది. ఎవ‌రి స్థాయిలో వారు దాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు.  ఇది ఏ ఊరు, ఎక్క‌డా అన్న‌ది అవ‌త‌ల‌పెడితే, అస‌లు ఇలా కూడా దేశ‌భ‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చ‌న్న ఆలోచ‌న‌కే జ‌య‌హో అనొచ్చు. మార్కెట్లో వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. అంద‌రూ ఇలానే వారి దుకాణాల ముందు ఏర్పాటు చేశారు. పారిశ్రామిక‌ వేత్త‌లు వారి సంస్థ‌ల పైనా జెండా ఏర్పాటు చేస్తారు, నాయ‌కులు వారి వారి కార్యాల‌యాల్లో, స్కూళ్ల‌లో ఉపాధ్యాయులు. కూర‌గాయ‌లు అమ్మేవారు మార్కెట్లో పెట్టుకున్నారు. వీరి ప్ర‌య‌త్నం బ‌హుశా రైతుల ప‌రంగా దేశ‌భ‌క్తిని ప్ర‌క‌టిస్తున్నారేమో! దేశానికి వెన్నెముక రైతాంగం అనేది అనాదిగా మ‌న దేశం గురించి చెప్పుకుంటూన్నాం. కానీ ప్ర‌భుత్వాలేవీ ఇటీవ‌లి కాలంలో వారి గోడే పట్టించుకోవ‌డం లేదు. అందుకే వారు ఆగ్ర‌హించి ఎదురుతిరుగుతున్నారు. ఇదే ఆ మ‌ధ్య గుజ‌రాత్ రైతాంగం చేసి న‌ది. ధ‌డిసి, ఏమీ చేయ‌లేని స్థితిలో కేంద్రం దిగివ‌చ్చింది. రైతుల సంర‌క్ష‌ణే మా ల‌క్ష్యం అంటూ అజెండాల్లో రాసుకునే మ‌హానేత‌లు రైతుల వెన్నే విరుస్తున్నారు. తిండిపెడుతున్న‌వారికే తిండి లేకుండా చేయ‌డానికి సాహ‌సిస్తున్నారు. అంతా పారిశ్రామిక వాడ‌ల‌వుతున్నాయే గాని పంట‌భూములు దెబ్బ‌తింటు న్నాయన్న‌ది తెలియ‌కా కాదు. ఏదో ఒక పండ‌గ‌రోజునో, స్వాతంత్య్ర‌దినోత్స‌వం రోజునో రైతాంగాన్ని ఆకాశానికి ఎత్తే కేంద్ర, రాష్ట్ర ప్ర‌భు త్వాలు రైతుల్ని గుర్తుచేసుకోవ‌డ‌మే అవుతోంది. కానీ వారి దేశ‌భ‌క్తి ఉంద‌న్న‌ది కూర‌గాయ‌లు అమ్మేవారి ద్వారా ప్ర‌క‌టించారు.
మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో తాను ముందుంటాన‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌చారం బాగానే చేయించుకున్నారు. కానీ త‌న ఎంపీయే ఊహిం చ‌నివిధంగా ప‌ట్టుబ‌డినా అదంతా క‌ట్టుక‌ధే అన్న‌ట్టు జ‌గ‌న్ వ్య‌వ‌హ రించ‌డంప‌ట్ల విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. వైసీపీ అనంత‌పురం ఎంపీ గోరంట్లమాధ‌వ్ న్యూడ్ వీడియో లోక‌మంతా చూసి నివ్వెర‌పో యింది. అయినా అందులో ఉన్న‌ది న‌కిలీ, అదంతా మార్ఫింగ్ వ్య‌వ‌ హార‌మ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. ఎంత‌యినా త‌మ‌వాడు అంత దుర్మార్గానికి ఒడిగ‌డ‌తాడా అన్నది వారి ధీమా. కానీ అందులో క‌ని పించిన‌ది గోరంట్ల మాధ‌వుడే అని త‌ప్పుల్లేకుండా అంద‌రూ అన్నారు. కానీ అందుకు అవ కాశం లేద‌ని వైసీపీ కితాబునిచ్చింది.  మావాడు మ‌హా మంచివాడ‌ని చెబుతూ త‌ప్పించుకునే య‌త్నం చేస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక‌లు వ‌స్తేగాని ఏదీ తేల్చ‌లేమ‌ని అం టున్నారు. సీఎం, మంత్రులు, ఎంపీలు కూడా గోరంట్ల ప‌ట్ల ఎంతో ప్రేమ‌గా ఉండ‌డం, ఆయ‌న్నుదీన్నించీ త‌ప్పించ‌డానికే పూను కున్నారని విశ్లేష‌కులు అంటున్నారు. కానీ విప‌క్షాల‌కు అంత అవ‌స‌రం లేదు. ఉన్న‌ది ఉన్న‌ట్టే చీల్చి చెండాడుతారు. అందు లోనూ ప్ర‌జ‌ల దృష్టిలో ప‌రువు పోగొట్టుకున్న వైసీపీ స‌ర్కార్ స‌మాధానం చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది.  ఎస్పీ ఫక్కీరప్ప చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్లపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం వీలుకాదని ఎస్పీ చెప్పడంపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత  అస హనం వ్యక్తం చేశారు. గోరంట్ల న్యూడ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షకు పంపితే అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్లపై, సహకరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. మహిళల పట్ల వైసీపీ నేతల అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకే కొందరు పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్‌ సర్కార్‌ విఫలమైం దన్నారు.
ALSO ON TELUGUONE N E W S
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. మార్చ్ 25న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. మే 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ హాలీవుడ్ స్టార్స్ ని సైతం ఫిదా చేసింది. వరల్డ్ వైడ్ గా ఎన్నో సంచనాలు సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు బుల్లితెరపై అలరించడానికి సిద్ధమైంది. 'ఆర్ఆర్ఆర్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి ముహూర్తం ఖరారైంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఒక రోజు ముందుగా ఆగస్టు 14న బుల్లితెరపై 'ఆర్ఆర్ఆర్' సందడి చేయనుంది. 'స్టార్ మా'లో సాయంత్రం 5:30 కి తెలుగు, ఏషియన్ నెట్ లో రాత్రి 7 గంటలకు మలయాళం, జీ సినిమాలో రాత్రి 8 గంటలకు హిందీ భాషల్లో ప్రసారం కానుంది. థియేటర్స్, ఓటీటీలో ఎన్నో సంచలనాలు సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'.. టీవీలలో టీఆర్పీ రేటింగ్స్ పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
'పుష్ప: ది రైజ్' సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకునేందుకు బడా బడా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇటీవల ఆయన చాలా యాడ్స్ లో నటించాడు. ఆయనకు ఒక్కో యాడ్ కి రూ.7-8 కోట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆయనకు ఒక పొగాకు ఉత్పత్తుల కంపెనీ నుంచి రూ.10 కోట్ల ఆఫర్ రాగా, ఆయన రిజెక్ట్ చేసినట్లు సమాచారం.   కూల్ డ్రింక్, ఫుడ్ డెలివరీ యాప్, పైప్స్ ఇలా రకరకాల ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న బన్నీ.. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఏ మాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ప్రస్తుతం తాను తీసుకుంటున్న దానికంటే ఎక్కువ మొత్తం ఇస్తామని ఆఫర్ వచ్చినా.. పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి బన్నీ ఓకే చెప్పలేదు.    కేవలం కాసేపు కెమెరా ముందు నటిస్తే పది కోట్లు వస్తాయని తెలిసినా బన్నీ ఆ యాడ్ లో నటించకపోవడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ఎందరో బాలీవుడ్ హీరోలు పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదిస్తుంటే, బన్నీ మాత్రం ప్రజల గురించి ఆలోచించి కోట్లు వదులుకున్నాడు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Shankar, one of India's most celebrated directors, requires no introduction to movie goers. We all know that Shankar, who has established himself as India's best director, directed the film Bharteeyudu and created a history. In this film, Kamal Haasan played the hero. This film was not only a box office smash, but it also rained collections.   The film Bharateeyudu was a huge hit, and Shankar rose to prominence as a director as a result of it. We all know that Shankar recently began filming Indian 2 with Kamal Haasan, however the project was halted owing to an accident.While Kamal Haasan has completed the film 'Vikram,' director Shankar is working on a project with Ram Charan, RC15.   If this is the case, Shankar will begin filming on Indian 2 in a few days. As a result, it appears that filmmaker Shankar has already begun the pre production of Indian 2. Kamal Haasan is currently in the United States. He'll be back in Chennai in the last week of August. It appears that regular filming for Indian 2 will begin in the first week of September, when Kamal Haasan returns from the United States.
Despite his Malayalam identity, Dulquer Salmaan is a hero who has acquired popularity in Telugu states as well. He has previously charmed audiences by dubbing films. He has now appeared in another direct Telugu film 'Sita Ramam' as a performer.   This movie, which drew everyone's attention at first, raised a lot of expectations. Last Friday, it was given to the audience in this order. The audience responded enthusiastically, as expected. The collections are pouring as a result of this. Positive word of mouth contributed to the film smashing box office records. Repeat audience and families flock to theatres to watch the epic love story.   The movie 'Sita Ramam' generated Rs. 10.28 crores share in AP and Telangana in 6 days, demonstrating its potency all over the world. Karnataka Plus Rest of India received Rs. 1.05 crores, overseas earned Rs. 3.85 crores, and other languages got Rs. 2.85 crores. Together with these, the movie collected Rs. 18.03 crores in share and Rs. 35.60 crore in gross within 6 days.   The break-even number is set at Rs. 17 crores. And, in just six days, the film earned Rs. 18.03 crores worldwide. The film passed the breakeven and reached the profit zone. With this, it became the tenth clean hit movie in 2022, following 'Bangarraju,' 'DJ Tillu,' 'RRR,' 'Don,' 'KGF Chapter 2', 'Major,' 'Vikram,' 'Vikrant Rona,' and 'Bimbisara.' Also, it became the sixth straight Telugu movie.
  సినిమా పేరు: లాల్ సింగ్ చ‌డ్ఢా తారాగ‌ణం: ఆమిర్ ఖాన్‌, క‌రీనా క‌పూర్‌, నాగ‌చైత‌న్య‌, మోనా సింగ్‌, మాన‌వ్ విజ్‌, షారుక్ ఖాన్ (స్పెష‌ల్ అప్పీరెన్స్‌) మ్యూజిక్: ప్రీత‌మ్‌ బ్యాగ్రౌండ్ స్కోర్: త‌నూజ్ టికు సినిమాటోగ్ర‌ఫీ: స‌త్య‌జిత్ పాండే ఎడిటింగ్: హేమంతి స‌ర్కార్‌ నిర్మాత‌లు: ఆమిర్ ఖాన్‌, కిర‌ణ్ రావ్‌, జ్యోతి దేశ్‌పాండే, అజిత్ అంధారే ద‌ర్శ‌క‌త్వం: అద్వైత్ చంద‌న్‌ బ్యాన‌ర్స్: ఆమిర్ ఖాన్ ప్రొడక్ష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌ విడుద‌ల: తేదీ 11 ఆగ‌స్ట్ 2022 టామ్ హాంక్స్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా 1994లో వ‌చ్చిన హాలీవుడ్ క్లాసిక్ 'ఫారెస్ట్ గంప్‌'కు ఇండియ‌న్ రీమేక్‌ 'లాల్ సింగ్ చ‌డ్ఢా' రూపంలో వ‌స్తున్న‌ద‌నే వార్త చాలా మంది సినీ ప్రియుల్లో క్యూరియాసిటీని క‌లిగించింది. ఆమిర్ ఖాన్ మెయిన్ లీడ్‌గా చేసిన ఈ మూవీలో మ‌న తెలుగు హీరో అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించ‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల్లో కొంత‌మందైనా ఈ సినిమాపై ఆస‌క్తి చూపించారు. 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్' ఫేమ్‌ అద్వైత్ చంద‌న్ డైరెక్ట్ చేసిన 'లాల్ సింగ్ చ‌డ్ఢా' మ‌న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఉందా? క‌థ‌ పంజాబీ అయిన లాల్ సింగ్ చ‌డ్ఢా (ఆమిర్ ఖాన్‌) తండ్రి, తాత‌, ముత్తాత‌.. అంతా మిల‌ట‌రీలోనే ప‌నిచేసిన‌వాళ్లే. అంద‌రూ యుద్ధంలో వీర‌మ‌ర‌ణం పొందిన‌వాళ్లే. త‌ల్లి (మోనాసింగ్‌) అత‌డిని పెంచి పెద్ద‌చేస్తుంది. చిన్న‌త‌నంలో కాళ్ల బ‌ల‌హీన‌త్వం వ‌ల్ల స‌రిగా న‌డ‌వ‌లేని లాల్‌కు స్కూల్లో ప‌రిచ‌య‌మై స్నేహితురాలిగా మారిన‌ రూప వ‌ల్ల మామూలుగా న‌డ‌వ‌డ‌మే కాకుండా, మెరుపు వేగంతో ప‌రుగెత్తే శ‌క్తిమంతుడ‌వుతాడు. చిన్న‌త‌నం నుంచే ఏమాత్రం క‌ల్మ‌షం లేని అమాయ‌క‌త్వంతో ఉండే లాల్ అమ్మ కోరిక మేర‌కు ఆర్మీలో చేర‌తాడు. అక్క‌డ బాల‌రాజు (నాగ‌చైత‌న్య‌) అనే తెలుగు కుర్రాడు నేస్తం అవుతాడు. తండ్రి స‌హా అత‌డి వంశంలోని పూర్వీకులంతా చెడ్డీలు, బ‌నియ‌న్లు త‌యారుచేసే ప‌నిలో నిపుణులైన‌వాళ్లే. ఆర్మీలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక త‌ను చెడ్డీలు, బ‌నియ‌న్లు త‌యారుచేసే కంపెనీ పెడ‌తాన‌నీ, పార్ట‌న‌ర్‌గా చేర‌మ‌నీ లాల్‌ను అడుగుతాడు బాల‌రాజు. స‌రేనంటాడు లాల్‌. కానీ కార్గిల్‌లో టెర్ర‌రిస్టుల‌తో జ‌రిగిన పోరులో బాల‌రాజు చ‌నిపోతాడు. మిత్రుడికి ఇచ్చిన మాట ప్ర‌కారం చెడ్డీలు, బ‌నియ‌న్ల కంపెనీ ప్రారంభిస్తాడు లాల్‌. ఇంకోవైపు త‌ను ఎంత‌గానో ఆరాధించే రూప (క‌రీనా క‌పూర్ ఖాన్‌)ను పెళ్లిచేసుకుంటావా? అన‌డుగుతాడు. చిన్న‌త‌నంలో విప‌రీత‌మైన పేద‌రికాన్ని చూసిన రూప డ‌బ్బు సంపాద‌నే ల‌క్ష్యంతో మ‌రో దారి ఎంచుకుంటుంది. బిజినెస్‌లో లాల్ స‌క్సెస్ అయ్యాడా?  రూప అత‌డికి ద‌గ్గ‌ర‌య్యిందా?  లాల్ జీవితం చివ‌ర‌కు ఏ తీరానికి చేరింది? అనేది మిగ‌తా సినిమాలో చూస్తాం. విశ్లేష‌ణ‌ చిన్న‌పాటి మార్పులు త‌ప్ప 'ఫారెస్ట్ గంప్' క‌థ‌ను దాదాపు య‌థాత‌థంగా తీశాడు డైరెక్ట‌ర్‌ అద్వైత్ చంద‌న్‌. ఒక ట్రైన్‌లో చండీగ‌ఢ్‌కు వెళ్తున్న లాల్ సింగ్ చ‌డ్ఢా తోటి ప్ర‌యాణికుల‌కు త‌న క‌థ చెప్ప‌డం ప్రారంభించ‌డంతో ఈ సినిమా మొద‌ల‌వుతుంది. చిన్న‌త‌నం నాటి సీన్ల‌న్నీ ఒరిజిన‌ల్‌కు కాపీగా క‌నిపిస్తాయి. అయితే కాలానుసారం భార‌త‌దేశంలో జ‌రిగిన కీల‌క ఘ‌ట‌న‌ల‌ను ఈ సినిమాలో వాడుకున్నారు. ఇందిరాగాంధీ హ‌త్యానంత‌రం ఢిల్లీలో సిక్కుల ఊచ‌కోత జ‌రిగిన సంద‌ర్భంలో లాల్ చిన్న‌పిల్లాడు. కొడుకును హంత‌కుల మూక నుంచి ర‌క్షించ‌డానికి త‌ల్లి అత‌డి త‌ల‌పాగా తీసేసి, జుట్టును ప‌గిలిన గాజు ముక్క‌తో కోసేయ‌డం హృద‌యాన్ని క‌దిలించే స‌న్నివేశం. ఆ త‌ర్వాత బాబ్రీమ‌సీదు విధ్వంసం, తాజ్ హోట‌ల్‌పై టెర్ర‌రిస్టు దాడి ఘ‌ట‌న‌ల‌ను కూడా క‌థానుసారం వాడుకున్నారు.  ఎదుటి వ్య‌క్తుల్లోని క్రూర‌త్వాన్ని కానీ, క‌ల్మ‌షాన్ని కానీ గుర్తించ‌లేనంత స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సున్న లాల్ సింగ్ చ‌డ్ఢా జీవితాన్ని అత్యంత ప్ర‌భావితం చేసిన వ్య‌క్తులుగా అత‌ని త‌ల్లి, రూప‌, బాల‌రాజు క‌నిపిస్తారు. అమ్మ మాట వేదంగా భావించే లాల్.. ఆమె ఏం చెబితే అది చేస్తూ.. జీవితంలో ఎదుగుతాడు. ఇంకోవైపు రూప‌ను ఆరాధిస్తూ, ఆమె త‌న నుంచి దూరంగా పోతున్నా ఆప‌లేని నిస్స‌హాయ‌త్వంతో మూగ‌వేద‌న ప‌డుతుంటాడు. ఆర్మీ మిత్రుడు బాల‌రాజు కోసం అత‌ని క‌ల‌ను తాను నిజంచేసి, అత‌డి కుటుంబాన్ని ఆదుకుంటాడు. అలాంటి ఒక అద్భుత‌మైన పాత్ర తెర‌మీద క‌ద‌లాడుతుంటే నిజానికి ప్రేక్ష‌కులు స‌హానుభూతి చెందాలి. కానీ అలా జ‌ర‌గ‌లేదు. కార‌ణం.. అతి నెమ్మ‌దిగా సాగిన క‌థ‌నం. బ‌ల‌హీన‌మైన స్క్రీన్‌ప్లే కార‌ణంగా కొన్ని చోట్ల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టిన‌ట్లు ఫీల‌వుతాం. సినిమాకి ఎండ్ కార్డ్ ప‌డుతుందేమోన‌ని అనిపించాక కూడా ఇంకో అర‌గంట సినిమా న‌డుస్తుంది.  బాల‌రాజు పాత్రతో వినోదాన్ని అందించాల‌నుకున్న ప్ర‌య‌త్నం అంత‌గా ఫ‌లించ‌లేదు. రూప ఎంచుకున్న దారినీ, ఆమె ప్ర‌యాణాన్నీ మ‌నం హ‌ర్షించ‌లేం. దాంతో ఆమె పాత్ర‌తో క‌నెక్ట్ కాలేం. అలాగే మంచిత‌నం, అమాయ‌క‌త్వం త‌ప్ప ఏమాత్రం క‌ల్మ‌షం తెలీనివాడిగా క‌నిపించే లాల్ సింగ్ చ‌డ్ఢా పాత్ర‌తోనూ మ‌నం సంపూర్ణంగా స‌హానుభూతి చెంద‌లేం. మ‌రీ ఇంత అమాయ‌క‌త్వ‌మైతే ఎలా అనిపిస్తుంది. అది ఈ కాల‌పు పాత్ర‌లా అనిపించ‌దు. బ‌హుశా 1990వ ద‌శ‌కంలోనే ఈ మూవీని రీమేక్ చేస్తే ఫ‌లితం మ‌రోలా ఉండేదేమో..  టెక్నిక‌ల్‌గా 'లాల్ సింగ్ చ‌డ్ఢా' టాప్ క్లాస్‌లో ఉంద‌నేది నిజం. స‌త్య‌జిత్ పాండే సినిమాటోగ్ర‌ఫీ, త‌నూజ్ టికు బ్యాగ్రౌండ్ స్కోర్ సూప‌ర్బ్ అనిపిస్తాయి. ప్రీత‌మ్ సంగీతం స‌మ‌కూర్చిన పాట‌లు సంద‌ర్భానుసారం వ‌చ్చి బాగున్నాయ‌నిపిస్తాయి. హిందీ సినిమాకు తెలుగు అనువాద సంభాష‌ణ‌లు మెప్పించాయి. హేమంతి స‌ర్కార్ ఎడిటింగ్ మ‌రింత షార్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువ‌లు అత్యున్న‌త స్థాయిలో ఉన్నాయి. న‌టీన‌టుల ప‌నితీరు నో డౌట్‌.. లాల్ సింగ్ చ‌డ్ఢాగా టైటిల్ రోల్‌లో ఆమిర్ ఖాన్ గొప్ప‌గా రాణించాడు. ఇప్ప‌టికే 'పీకే' సినిమాలో గ్ర‌హాంత‌ర‌వాసిగా అమాయ‌క‌మైన పాత్ర‌లో ఆక‌ట్టుకున్న ఆమిర్ ఇప్పుడు దానికి సిమిల‌ర్‌గా క‌నిపించే లాల్ పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు. ఒరిజిన‌ల్ మూవీలో చేసిన టామ్ హాంక్స్‌కు ఎక్క‌డా ఏమాత్రం త‌గ్గ‌ని న‌ట‌న ప్ర‌ద‌ర్శించాడు. ఆ పాత్ర పోష‌ణ‌లో ఆయ‌న క‌న్విక్ష‌న్ మ‌న‌కు క‌నిపిస్తుంది. తెర‌పై లాల్ ప్ర‌ద‌ర్శించే హావ‌భావాలు.. అమాయ‌క‌పు చూపులు, న‌వ్వు, బాధ‌, విషాదం.. మ‌న‌ల్ని క‌దిలిస్తాయంటే అది ఆమిర్ న‌ట‌న వ‌ల్ల‌నే. రూప‌గా క‌రీనా క‌పూర్ ఉన్న‌త స్థాయి న‌ట‌న ప్ర‌ద‌ర్శించింది. అయితే పాత్ర తీరు వ‌ల్ల ఆమె మ‌న హృదయాల్ని క‌దిలించ‌లేదు. బాల‌రాజుగా నాగ‌చైత‌న్య న‌ట‌న‌ప‌రంగా ఆక‌ట్టుకున్నాడు కానీ లుక్స్ ప‌రంగా ఆక‌ట్టుకోలేదు. ఉబ్బెత్తుగా క‌నిపించ‌డానికి కింది పెద‌వి లోప‌ల ఏదో పెట్టుకొని మాట్లాడుతుండ‌టంతో ఇబ్బందిక‌రంగా అనిపించింది. లాల్ త‌ల్లి పాత్ర‌లో మోనా సింగ్ ఒదిగిపోయింది. కార్గిల్‌లో లాల్ వ‌ల్ల బ‌తికిపోయే టెర్రరిస్ట్ మ‌హ‌మ్మ‌ద్ పాత్ర‌కు మాన‌వ్ విజ్ న్యాయం చేశాడు. చిన్న‌ప్ప‌టి లాల్‌, రూప పాత్ర‌లు చేసిన బాల‌న‌టులు ఆక‌ట్టుకున్నారు. తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌ ఆమిర్ ఖాన్ న‌ట విన్యాసాల్ని ఆస్వాదించాల‌నుకునేవాళ్లు ఈ సినిమాని చూడ‌వ‌చ్చు. మ‌న‌సులో ఎలాంటి క‌ల్మ‌షం లేని వ్య‌క్తి, ఎదుటివాళ్ల నుంచి ఏమీ ఆశించ‌కుండా తానివ్వ‌ద‌ల‌చుకున్న దాన్ని ఇచ్చేసే మంచి వ్య‌క్తి జీవిత ప్ర‌యాణం చిన్న‌త‌నం నుంచి ఎలా సాగింది, ఆ ప్ర‌యాణంలో అత‌నికి ఎవ‌రెవ‌రు తార‌స‌ప‌డ్డారు, ఆ ప్ర‌యాణం ఏయే మ‌లుపులు తిరిగింది అనే క‌థాంశంతో వ‌చ్చిన 'లాల్ సింగ్ చ‌డ్ఢా'ను ఆస్వాదించాలంటే ఒకింత ఓపిక కావాలి. ఆ ఓపిక లేక‌పోతే దీన్ని భ‌రించ‌డం క‌ష్టం. రేటింగ్: 2.5/5 - బుద్ధి య‌జ్ఞ‌మూర్తి
Nandamuri fans are currently basking in the success of Bimbisara and now, it’s time for Balakrishna to cheer them up with a powerful announcement. A massive update about the Akhanda actor’s next is here. It is known that Nandamuri Balakrishna would make a film under the direction of talented director Anil Ravipudi, who is currently enjoying a string of successes. Today Shine Screens production delighted Balayya fans with a blasting update about NBK 108. Confirming all the buzz, the makers released a formal announcement glimpse of NBK 108. The movie will be produced by Shine Screens on a massive scale. Thaman is roped in to provide blockbuster music again. More details will be unfolded soon. In an interview, Anil Ravipudi stated that the entire film is character driven. He mentioned that the movie is being shown in a genre that revolves around the hero character. He also stated that he would portray Balayya in a way that no other director had done before. Anil Ravipudi exuded supreme confidence when discussing NBK 108.
నటసింహం నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తన తదుపరి సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.   'NBK 108'ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ తాజాగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది  నిర్మించనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఇటీవల బాలయ్య సినిమాలకు వరుసగా థమన్ పని చేస్తుండటం విశేషం. 'అఖండ'లో బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ కి, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడై ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఇప్పటికే 'NBK 107' కోసం థమన్ వర్క్ చేస్తుండగా.. తాజాగా 'NBK 108' కోసం కూడా థమనే రంగంలోకి దిగుతున్నాడు.   బాలయ్యను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించబోతున్నట్లు అనిల్ రావిపూడి తెలిపాడు. ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటించనుందని గతంలో అనిల్ చెప్పాడు.
ఒకేరోజు(ఆగస్టు 5న) విడుదలైన 'బింబిసార', 'సీతా రామం' రెండు సినిమాలూ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 'బింబిసార' మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుండగా.. 'సీతా రామం' కూడా మౌత్ టాక్ తో రోజురోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ ఆరు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించి బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోంది.   ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా 16.20 కోట్ల బిజినెస్ చేసిన 'సీతా రామం' మూవీ ఆరు రోజుల్లో 18.03 కోట్ల షేర్(35.60 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.11.50 కోట్ల బిజినెస్ చేయగా ఇప్పటిదాకా 10.28 కోట్ల షేర్(18.95 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఆరు రోజుల్లో నైజాంలో రూ.4.06 కోట్ల షేర్(బిజినెస్ రూ.4 కోట్లు), సీడెడ్ లో రూ.1.15 కోట్ల షేర్(బిజినెస్ రూ.1.5 కోట్లు), ఆంధ్రాలో రూ.5.07 కోట్ల షేర్(బిజినెస్ రూ.6 కోట్లు) వసూలు చేసింది. కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా 1.05 కోట్ల షేర్(బిజినెస్ రూ.0.70 కోట్లు), ఓవర్సీస్ లో 3.85 కోట్ల షేర్(బిజినెస్ రూ.2.5 కోట్లు), ఇతర భాషల్లో 2.85 కోట్ల షేర్(బిజినెస్ రూ.1.50 కోట్లు) కలిపి వరల్డ్ వైడ్ గా 18.03 కోట్ల షేర్ రాబట్టి ఇప్పటిదాకా బయ్యర్లకు కోటిగా పైగా లాభాలు తెచ్చిపెట్టింది.    సీడెడ్, ఆంధ్రాలో తప్ప మిగతా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ సాధించిన సీతా రామం.. ఆ ప్రాంతాలలో కూడా ఈ రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటే అవకాశముంది.
Thalapathy Vijay, although being one of the top heroes in the Kollywood industry, requires no introduction to Telugu audiences. Thalapathy Vijay greeted the audience with the recently released film Beast. Beast, which was released as a Pan-India film amid high hopes, failed to live up to the audience's expectations.   Thalapathy Vijay is currently starring as the hero in Varisu/Varasudu, directed by Vamsi Paidipally. Rashmika Mandana stars as the heroine opposite Thalapathy Vijay in this film, which is produced by prominent producer Dil Raju. The music for this film is being composed by sensational music director SS Thaman.   If this is the fact, we all know that the Tollywood industry's shooting has halted owing to the producers guild's shoot bundh decision, but because Dil Raju claimed that this movie is a Tamil film, production is moving quickly. Varasudu is currently filming in Vizag. It appears that filming for this film will continue in Vizag for another week. Makers intend to finish the shoot before September and focus on post-production work.
Icon Star Allu Arjun, the name itself is a brand. Bunny, who rose to fame in India with the film Pushpa, has recently appeared in a number of commercials. He's also changing his look for these commercials. According to sources, Allu Arjun normally charges Rs 7.5 crore for each brand endorsement. A company appears to have lately approached Allu Arjun to promote their brand. They proposed a compensation of Rs. 10 crores.   However, the icon star thought that doing that ad was pointless. It's because it's a Gutka and Liquor company! It appears that the hero politely declined the massive offer because he had no intention of promoting harmful habits among the populace. And when this matter came to light, his noble intentions won the hearts of the people.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
ఈ ప్రపంచంలో రేపు ఎలా ఉంటుంది అనేది యువత మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే యువతలో ఉత్సాహం, వారి ఆలోచనలు, వారి ప్రణాళికలే రేపటిని గొప్పగా ఉంచాలన్నా, అధఃపాతాళంలోకి నెట్టివేయలన్నా మూలకారణం అవుతాయి.  నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు, నేటి యువత రేపటిని నడిపించే బాధ్యతాయుత సూత్రధారులు  అవుతారు. ప్రపంచం మొత్తం మీద జనాభాలో యువత శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే యువత ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిలో నిరుద్యోగం ఎంతో ముఖ్యమైనది. డిగ్రీ పట్టాలు చేతిలో ఉన్నా, ఉన్నత విద్యలు చదివినా ఉద్యోగ అవకాశాలు సరైనవిధంగా లేక మిగిలిపోతున్న యువత ఎందరో ఉన్నారు. అయితే యువతకు సరైన మార్గం చూపేందుకు ఈ ప్రపంచం కూడా కృషి చేస్తోంది. అంతర్జాతీయ యువ దినోత్సవ కర్తవ్యం అదే. తేడా!! చాలామంది యువ దినోత్సవం అని వినగానే అది వివకానందుడి జన్మదిన సందర్భంగా నిర్వహించుకునే జాతీయ యువజన దినోత్సవం అని అనుకుంటారు. అయితే జాతీయ యువజన దినోత్సవానికి, అంతర్జాతీయ యువ దినోత్సవానికి మధ్య బేధాన్ని గుర్తించడం అవసరం. అంతర్జాతీయ యువ దినోత్సవం!! ఈ ప్రపంచంలో ఉన్న యువతకు సరైన మార్గనిర్దేశకత్వం  అవసరమని, వారికి సరైన సలహాలు, సూచనలు దొరికితే ఈ ప్రపంచాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ప్రపంచదేశాల అభిప్రాయం. దానికి అనుగుణంగానే 1999లో 54/120 అనుసరణ ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న అంతర్జాతీయ యువ దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించారు. కార్యక్రమాలు!! ప్రతి రోజుకూ ఒక ప్రత్యేకత ఉన్నట్టు, ఆ ప్రత్యేకమైన రోజు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం సహజం. అంతర్జాతీయ యువ దినోత్సవం రోజున యువతకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయడం, ఆచరణ విషయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, వాటిని అధిగమించేందుకు పరిష్కారాలు, యువత తమ ఆలోచనలను, నైపుణ్యాలను పెంచుకునేందుకు అవగాహన కల్పించడం. ప్రపంచ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడం, వర్క్ షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేసి యువతలో ఉన్న నైపుణ్యాలు బయటకు తీయడం చేస్తారు. యువత కోసం కొన్ని మాటలు!! స్వేచ్ఛ అనేది అడగాల్సినది కాదు అది ఎవరికి వారు తీసుకునేది అంటారు సుభాష్ చంద్రబోస్. యువతకు లభించే స్వేచ్ఛ వారిని అభివృద్ధి చేసేదిగా ఉండాలి. ఆ అభివృద్ధి దేశాన్ని కూడా ముందుకు నడిపించగలగాలి. యువతలో ఉండే విభిన్న ఆలోచనలను నిరుత్సాహ పరచకుండా వారిని ప్రోత్సహించాలి. యువత గట్టిగా ఏదైనా నమ్మితే దాన్ని సాధించే ఆవేశం, కసి, పట్టుదల వారిలో ఉంటాయి కాబట్టి సాధించగలరు. కావాల్సిందల్లా వారిని ప్రోత్సహించడమే. భారంగా మారిన నాలుగు మేఘాలు ఆకాశంలో పక్కపక్కనే చేరితే కుండపోతగా వర్షం ఎలా కురుస్తుందో, మెండైన ఆలోచనలు కలిగిన యువకులు ఒకచోట చేరితే ఎంతో గొప్ప ఆలోచనలు కలుగుతాయి. ఎన్నో గొప్ప అద్బుతాలు ఈ ప్రపంచానికి పరిచయం అవుతాయి.  చట్టపరంగానూ, సమాజికంగానూ, ఆర్థిక, కుల, మత బేధాలతో ఎన్నో అవకాశాలు అందుకోలేకపోతున్న యువతకు తెలియాల్సిన విషయం ఒకటుంది. తమ ప్రతిభే తమా భవిష్యత్తుకు, తమ జీవితానికి పెట్టుబడి అనే విషయం గ్రహించడం. కాబట్టి యువత తమ జీవితాన్ని దురదృష్టం పేరుతోనో, నమ్మకాల పేరుతోనో, సోమరితనంతోనో, ఇంకా అవకాశాలు లేవని చెబుతూనో చేజార్చుకోకుండా అవకాశాలను సృష్టించుకుంటే అది యువత శక్తి అవుతుంది.                                     ◆ నిశ్శబ్ద.
తెలుగు పంచాంగంలో ఒకో మాసంలో వచ్చే పూర్ణిమకు ఒకో ప్రత్యేకత ఉంటుందనే విషయం బాగా గమనిస్తే అర్థమవుతుంది. మాఘ పూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, వీటిని బుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని జరుపుకుంటారు.  ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది. శ్రావణ మాసం అంతా సందడిగానూ ప్రత్యేకంగానూ ఉంటుంది.  అయితే పెళ్లిళ్లు, శుభకార్యాలు, వ్రతాలు వీటితో ఉండే సందడి వేరు. ఈ మాసంలో అన్నా, చెల్లెళ్లను పలకరించే రాఖీ పూర్ణిమ వేరు.  అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని, వారి మధ్య ఒకరిమీద మరొకరికి ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేసేది రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమినే రక్షా బంధన్ అని కూడా అంటారు. రక్ష అంటే ఎలాంటి ఆపదలు, సమస్యలు రాకుండా కాపాడేది. బంధన్ అంటే కట్టి ఉంచేది. రక్షా బంధన్ అంటే ఎలాంటి సమస్యలు రాకుండా కట్టి ఉంచే బంధనం. ఆ బంధనమే రాఖీ. అందరూ తమ సోదరులకు రాఖీ కట్టడం వల్ల  వాడుక భాషలో అందరూ రాఖీ పండుగ అంటున్నారు. రాఖీ పండుగ వెనుక కథనాలు!! ఈ పండుగకు వెనుక విభిన్న కథనాలు ప్రచారంలో  ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చెప్పుకునేది ఇంద్రుడి కథనం. ఇంద్రుడి కథ!! పూర్వం రాక్షసులు రెచ్చిపోయి మూడు లోకాల మీద దండయాత్ర చేసి మూడు లోకాలను సొంతం చేసుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన పరివారం, తన లోకంలో ఉన్న వాళ్ళందరితో కలసి తన నివాసమైన అమరావతిలో దాక్కున్నాడు. ఇంద్రుడి పరిస్థితి చూసి ఆయన భార్య శచీదేవికి బాధ కలిగింది. దేవాదిదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ప్రార్థించి, నా భర్తను సమస్య నుండి గట్టెక్కించు అని అడిగింది. సరే అయితే నీ భర్తకు ఎరుపు రంగు దారంతో  రక్ష తయారుచేసి దాన్ని చేతికి కట్టు, అతను విజయం సాధిస్తాడు అని చెబుతాడు. శచీదేవి విష్ణుమూర్తి చెప్పినట్టు ఎరుపురంగు దారంతో రక్ష తయారుచేసి ఇంద్రుడికి కట్టి ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన వీరతిలకం దిద్ది యుద్ధానికి వెళ్లమంది. అది తెలిసి అమరావతిలో ఉన్న మిగిలిన వారు కూడా రక్షలు తయారుచేసి ఇంద్రుడికి కట్టి, వీరతిలకం దిద్దారు. ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలిచి తిరిగి మూడు లోకాల ఆధిపత్యాన్ని సంపాదించాడు. దీనికి గుర్తుగా రక్షా బంధన్ జరుపుకుంటున్నారని చెబుతారు. దీని వెనుక ఉన్న మరొక కథ ద్రౌపతి, కృష్ణుల కథ!! కృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తరువాత శిశుపాలుడిని వధిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడి వేలు తెగితే ద్రౌపతి తన చీర కొంగు చింపి కట్టు కడుతుందట. అప్పుడు కృష్ణుడు ద్రౌపతితో నీ సమస్యలలో నేను అన్నగా తోడుంటాను అని చెబుతాడు. ఆ కారణంతోనే ద్రౌపతి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమెను కాపాడాడు అని చెబుతారు. పురుషోత్తముడి కథ!! అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని అన్నగా భావించి రాఖీ కడుతుంది. అలెగ్జాండర్ ప్రపంచానికి అధిపతి కావాలనే అత్యాశతో తక్షశిల మీద దండెత్తినప్పుడు పురుషోత్తముడు యుద్ధంలో గెలిచినా అలెగ్జాండర్ ని చంపకుండా వదిలేసాడు. రాఖీ కట్టినవారికి భయం దొరుకుతుందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఇలా చరిత్రలో రాఖీ పౌర్ణమి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి ఇందులో ఉన్న అర్థం చెల్లెలు కట్టే రక్ష అన్నకు ఆరోగ్యాన్ని, ఆయుష్షును, అన్నిటికీ మించి క్షేమాన్ని కోరుకుంటే, అన్న చేతిలో ఉండే రక్ష అన్నకు తన చెల్లి విషయంలో ఉండాల్సిన బాధ్యత, చెల్లికి ఇవ్వాల్సిన రక్షణ, భరోసాను స్పష్టం చేస్తాయి. ఇదీ రాఖీ వెనుక ఉన్న అనుబంధం.                                    ◆నిశ్శబ్ద.
మనుషులు నాగరికులు కాకముందు వారి జీవితం వేరుగా ఉండేది.  మనిషి కోతి నుండి పుట్టాడని ఆదిమమానవుడు కాలక్రమంలో మార్పులకు లోనవుతూ నేడు నాగరిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, నాగరికుడిగా బ్రతుకున్నాడని చెబుతారు. ఈ నాగరిక అనాగరిక అంశాల మధ్య తేడాలు ఎన్ని ఉన్నా, ఆ రెండింటిలో ఉన్న మనుషులు వారి వారి జీవితాలను కొనసాగించడానికి పోరాటం చేయక తప్పదు. అయితే కాలంతో కొన్ని మాత్రమే అభివృద్ధి చెందినట్టు మనుషులు కూడా కొందరే అభివృద్ధి చెంది నాగరిక సమాజంలో కొందరు, ఆటవిక సమాజంలో కొందరు ఉండిపోయారు.  అడవులను నమ్ముకుని, ప్రకృతి మధ్య, ఆటవిక వనరులను ఉపయోగించుకుంటూ, ఆ అడవినే దైవంగా భావిస్తూ బ్రతుకుతున్న ఆటవిక జాతులు చాలా ఉన్నాయి. సమాజంలో కుల, మత, వర్గ భేదాలు, ఆర్థిక వ్యవస్థ, అన్నిటికి మించి స్వార్థంగా ఆలోచించడం వల్ల ఇలాంటి ఆటవిక జాతులకు నేటికి సరైన న్యాయం అంటూ జరగడం లేదు. అడవులలో నివసించేవారిని ఆదివాసీలు అంటారు. గిరిజనులైన వీరు సంచారజీవితాన్ని గడుపుతూ ఉన్నచోట అనుకూలమైన వ్యవసాయం చేసుకోవడం, ప్రకృతి వనరుల మధ్య బ్రతకడం, ముఖ్యంగా అటవీ ఉత్పత్తులను దగ్గర్లోని సంతల్లో అమ్మడం చేస్తూ జీవిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు "వంద దేశాలలో" "అయిదు వేల ఆదివాసీ తెగలు" ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఒక్కో తెగ ఒక్కో భాష మాట్లాడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆదివాసీ తెగలు "ఆరువేల ఏడువందల" భాషలు మాట్లాడుతున్నారు. మొత్తంమీద "వీరి జనాభా" చూస్తే సుమారు "నలభై కోట్లకు" పైన ఉంది. ప్రపంచ జనాభాలో వీరి జనాభా శాతం తక్కువే అయినప్పటికీ అభివృద్ధి చెందుతున్న ప్రపంచీకరణలో ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తోంది.  ఆదివాసీల జీవనశైలి వారి అలవాట్లు, సంప్రదాయాలు అన్నీ ఎంతో విశిష్టమైనవి. వారి సంస్కృతి సంప్రదాయాలను, వారి హక్కుల్ని కాపాడటం కోసం ప్రతి సంవత్సరం ఆగష్టు 9 వ తేదీన ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1993లో ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఈ తీర్మానం అమలు అయిన తరువాత  అడవులపై హక్కులు ఆదివాసులకే ఉన్నాయని 2010 జూలై 14న జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారు. అయితే అది అమలు కాలేదు.  దేశ పార్లమెంటుల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆదివాసీలు ఉన్నా ఆదివాసీల అభివృద్ధి వారి హక్కుల కోసం నోరుతెరచి మాట్లాడేవారు వాటిని సాధించుకోవాలని ప్రయత్నం చేసేవారు కనిపించడం లేదు. కారణం వారిలో వారే స్వార్థపరులుగా మారిపోవడం కూడా.  ఉప్పుతో కూడా కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతున్న నేటి వ్యాపార అధినేతల మనసులో ఆదివాసులు అంతరించిపోతే ఎంతో ఆటవిక భూములు, అక్కడ ఉత్పత్తులతో వ్యారసామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకోవాలనే ఆలోచనలే ఆదివాసుల జీవితాలను ప్రమాద కోరల్లో నిలబెడుతున్నాయి. ఈ ఆదివాసుల సంరక్షణకు నడుం బిగిస్తూ నక్సల్స్ వంటి పోరాట బృందాలు ఏర్పడ్డా వారికి కూడా నిరంతరం హింసాయుత జీవితం, ప్రాణం మీద భరోసాలేని బ్రతుకు దిక్కవుతోంది. అటవీ భూముల కోసం, ఆ భూముల్లో ఖనిజాల కోసం, ఇతర ఉత్పత్తుల కోసం, విలువైన కలప కోసం ఆశపడి పూర్తిగా ఆదివాసులని అంతం చేయాలని అనుకుంటున్న నేటి నాగరిక సమాజానిది ఎలాంటి మనస్తత్వమో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎన్నో రకాల కుటీర పరిశ్రమలు, చేతి కళలు, ఆరోగ్య రహస్యాలు, ఆయుర్వేద మూలికలకు నిలయమైన అడవులను నిర్వీర్యం చేస్తూ అక్కడి ఆదివాసులకు నరకం చూపించడం మృగలక్షణం అనే మాట సరిగ్గా సరిపోతుంది. మానవ నాగరిత ప్రారంభమైన అడవులను, మానవ జీవితం మొదలైన విధానాన్ని అంతం చేయడం అంటే నడవడానికి సహకరిస్తున్న కాళ్ళను నరికేసుకోవడమే. ఆ తరువాత ఈ ప్రపంచంలో మనిషి ఉనికి కోసం చాలా కష్టాలు పడి వెతకాలి. ఎందుకంటే మనుషులు మృగాలుగా మారిపోయాక నిజమైన మనుషులు కనబడతారో లేదో మరి.  మనసున్నవారు ఆదివాసులకు చేతనైన సహాయం చెయ్యాలి. విద్య, వైద్యం వంటి వసతులు కలిగించాలి. అప్పుడు వాళ్ళు తమ సామర్త్యాన్ని చాటిచెబుతారు. సహాయం చేసే ఉద్దేశ్యం లేనివారు ఎవరి జీవితాల్ని వాఫు చూసుకోవాలి. అంతేకానీ వారి జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టి వారిని ఇబ్బందిపెట్టకూడదు. ప్రస్తుతం భారత రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్ము ఎంపికైన సందర్భంగా చాలామంది ఆదివాసీ ప్రజల గురించి మాట్లాడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏ తెగలో అయినా ఏ జాతిలో అయినా ఒక వ్యక్తి దేశ స్థాయి పదవిని, గౌరవాన్ని పొందినంత మాత్రాన ఆ తెగలోనూ, ఆ జాతి లోనూ మార్పు వచ్చేయదు. ప్రతి మనిషి మేలైన జీవితం కోసం పాటుపడాల్సిందే. కాబట్టి వారి జీవితం కోసం తపించే ఆదివాసులని నొప్పించకండి.                                           ◆నిశ్శబ్ద.
శరీరం లో రక్తానికి సంబందించిన అన్నిరేపెర్లు చేసేది ప్లేటిలేట్లే. అలాంటిది డెంగు మలేరియా వచ్చిందో రోగికి శరీరం లో ప్లేటిలెట్స్ సమర్ధవంతంగా చేస్తాయి.ప్లేతిలేట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు మనిషి ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. మనం తినే ఆహారం లో నే ప్లేటిలేట్స్ సంఖ్య పెంచాలంటే అసలు మన శరీరానికి ప్లేటిలెట్స్ అందించాలంటే సహకరించే ఆహార పదార్ధాలు ఏమిటి?అసలు మనరక్తం లో ఎన్ని ప్లేటిలేట్స్ ఉండాలి అన్నవిష్యం మీకు తెలుసా ఆవిషయాలు తెలుసుకుందాం.ప్లేటిలేట్స్ సంఖ్య ఎంతఉండాలి?--మనశరీరంలో ప్లేటిలేట్స్ 1,5౦,౦౦౦ నుండి 4,5౦,౦౦౦ ప్లేటిలేట్స్ ఉంటాయి.శరీరంలో గాయాలు అయినప్పుడు.రక్తం గడ్డకట్టడానికి గాయాలు త్వరగా మానడానికి ప్లేటిలెట్స్ సహాయ పడతాయి. ప్లేటిలెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. ప్లేటిలేట్స్ తగ్గాయా తీవ్ర జ్వరం,బిపి, హార్ట్ ఎట్టాక్ నీరసం వచ్చే ప్రమాదం ఉంది.ఎప్పటికప్పుడు ప్లేటిలెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. రక్త పరీక్ష చేయించుకుంటే మనరక్తంలో ఎన్ని ప్లేటిలెట్స్ ఉన్నాయో తెలుస్తుంది.మనం తీసుకునే ఆహారం పైనే ప్లేటిలేట్స్ సంఖ్య ఆధార పడి ఉంటుంది.ప్లేటిలేట్స్ వృద్ది చెందేందుకు ఏఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. 1) బొప్పాయి... బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి జ్యూస్ చేసుకుని తాగడం.లేదా బొప్పాయి ఆకులను బాగా ఉడకపెట్టి వడపోసిన కషాయాన్ని రోజుకు రెండుసార్లు తాగడం వల్ల ప్లేటిలెట్స్ పెరుగుతాయి. అలాగే బొప్పాయి వల్ల రక్త్గం వృద్ధిచెందుతుంది.రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది. 2)బీట్ రూట్... బీట్ రూట్ వల్ల రక్తం వల్ల ప్లేటిలెట్స్ పెరగడానికి బీట్ రూట్ మంచిది. అనిమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్ రూట్ ను తీసుకోవాలి. ౩) క్యారెట్... క్యారెట్ వల్ల రక్తం వృద్ధిచెంది ప్లేటిలేట్స్ పెరుగుతాయి. కనీసం వారానికి మూడుసార్లు అయినా క్యారెట్ తినాలి. 4)వెల్లుల్లి... శరీరంలో సహజంగా ప్లేటిలేట్స్ పెంచుకోవాలంటే వెల్లుల్లి మంచిది. అని నిపుణులు సూచిస్తున్నారు .కాగా కొందరు ఉదయం వేళల్లో పరగడుపునే కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే గుండే సంబందిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. 5)ఆకుకూరలు... శరీరంలో ప్లేటిలేట్స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ కే పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.కాగా శరీరంలో రక్త్ఘహీనత అనీమియా ఉన్న వారికి తోటకూరను తినిపించడం ద్వారా రక్తం పుష్కలంగా లభిస్తుంది.అందుకే ఆకుకూరాలు తీసుకోవడం మంచిది. 6)దానిమ్మ.. శరీరం లో ప్లేటిలెట్స్ కౌంట్ పెరగాలంటే దానిమ్మ ఉపయోగ పడుతుంది.దీనిలో విటమిన్లు పోషకాలు అధికంగా ఉంటాయి. 7)ఎండు ద్రాక్ష... ప్లేటి లెట్స్ కౌంట్ పెంచడానికి సహజంగా పెరగాలంటే ఎందుద్రాక్షను తీసుకోవాలి.లేదా రాత్రి నీళ్ళలో నానపెట్టి ఉదయాన్నే పరగడుపునే ఎండుద్రాక్ష ను తీసుకుంటే మచిదని నిపుణులు సూచిస్తున్నారు.కాగా వేదినీళ్ళ లో ఎందుద్రాక్షను నానపెట్టి తీసుకుంటే మలబద్దకం వంటి సమస్యనుండి బయపదవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 8) ఖర్జూరం... ఖర్జూరం పండ్లలో ఐరన్,కాల్షియం,రక్తహీనత,ఇతర న్యుత్రీశియన్స్ అధికంగా లభిస్తాయి.ఎప్పటికప్పుడ్డు రక్త్ఘ పరీక్షలు చేయిస్తూ ఉంటె శరీరంలో ప్లేటిలేట్స్ సంఖ్య ఎంత ఉందొ తెలుసుకుంటూ ప్లేటిలెట్స్ సంఖ్య   తగ్గకుండా చూసుకోవాలి. మనం తీసుకునే ఆహారం పైనే ప్లేటి లెట్స్ సంఖ్య ఆధార పడిఉంటాయి.పైన పేర్కొన్న ఆహారం తీసుకోవడం వల్ల మీ ప్లేటిలేట్స్ పెరుగుతాయి. కీప్ యువర్ సెల్ఫ్హేల్తీ
భోజనం తరువాత నీరు తాగితే 1౦౩ రోగాలు వస్తాయి జాగ్రత్త.!    ఏమిటి ఆశ్చర్యం గా ఉందా ఇది నిజం.  భోజనం తరువాత నీళ్ళు తాగడం విషంతో సమానం.సహజంగా భోజనం చేసిన తరువాత నీరు తాగడం సర్వసాధారణం. అయితే భోజనం తరువాత నీరు తాగడం విషం తోసమానం అని అంటున్నారు నిపుణులు.ఆ సలు ఆమాటల్లో ఏది నిజమో తెలుసుకుందాం. భోజనం చేసినతరువాత చివరన నీళ్ళు తాగడం చెస్తూ ఉండడం సహజం కొంతమంది భోజనం చేస్తున్న సమయం లో లేదా భోజనం చేసిన తరువాత చివరన నీరు తాగడం విషం తోసమానం అని అంటున్నారు సనాతన సాంప్రదాయ వైద్య విధానం అని అంటున్నారు ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు.మరి నీళ్ళు ఎప్పుడుతాగాలి ఎలా తాగాలి అన్న విషయం గురించి అయన మాటల్లో తెలుసుకుందాం.భోజనం తిన్న వెంటనే నీళ్ళు తాగడం మనశరీరం లో జరిజే అనర్ధాలు అన్ని ఇన్ని కావు. భోజనం చేసిన తరువాత నీరు తాగడం విషం తోసమానం.ఆకలి వేసింది అంటే అగ్ని మాంద్యం ఏర్పడింది అని అర్ధం. మనము తీసుకునే ఆహారం జటరాగ్ని కి చేరి ఆతరువాత అక్కడ అగ్ని ప్రాదీప్త మై భోజనం అరుగుతుంది.అలా మొదటి ముద్ద నోటిలోకి వెళ్లి లాలాజలం తో కలిసి భోజనాన్ని రాసంగా మారుస్తుంది. ఆలారసంగా మారి ఆరసం నుండి మిగిలినవి తయారయ్యి శరీరానికి మనకు కావాల్సిన పోశాకాలుగా మారుస్తాయి.భోజనం తిన్న వెంటనే నీళ్ళు తాగడం వల్ల జటరాజ్ఞి ఆగిపోతుంది ఈకారణంగానే భోజనం అరగదు. మండుతున్న పొయ్యిమీద నీళ్ళు చల్లితే ఎలాఉంటుందో ఎలా ఆరిపోతుందో అగ్ని,నీళ్ళు మధ్య వైరం ఉన్నదని నిపుణులు పేర్కొన్నారు.అగ్ని చల్లబడితే భోజనం అరగదు.అది కుళ్ళి పోతుంది. భోజనం కుళ్ళితే గ్యాస్ గా మారుతుంది.ఆ వాయువు తీవ్రత పెరిగితే గొంతులోమంట చతీలోమంట కడుపుమంట గా మారి శరీరంలో ఇతర భాగాలకు చేరుతుంది శరీరంలో ఎక్కడ ఖాళీ ఉంటె అక్కడకి గ్యాస్ చేరుతుంది. ఇలా గ్యాస్ చేరితే  దాదాపు 1౦౩ రోగాలు వస్తాయి వాటిలో మొదటిది అసిడిటి అల్సర్ గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. 1) అందుకే తిన్న తరువాత భోజనానికి ముందు ఆతరువాత 45 నిమిషాలు వరకు నీరు తాగకూడదు. 2)చల్లటి కూలింగ్ నీళ్ళు అంటే ఐస్ చిల్ద్ వాటర్ తాగకూడదు. ౩) నీళ్ళు కొద్ది కొద్దిగా సిప్ చేస్తూతాగాలి. 4) సూర్యో దయానికి రెండు గడియల తరువాత నీరు తాగకూడదు సాయంత్రం ౩ నుండి 5 గంటల సమయంలో ఎక్కువనీరు తాగాలి  ఉన్న విషయం చెప్పిన తరువాత కూడా మీరు నీళ్ళు తాగుతాము అంటే 1౦౩ రోగాలు కొనితేచ్చుకున్నట్టే ఆలోచించండి.   
ఆశలు ఈ మధ్యకాలం లో అందరినీ వేదిస్తున్న మరో పెద్ద సమస్య ఫ్యాటీ లివర్ అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఫ్యాటీ లివర్ ను ఏ విధంగా తగ్గించుకోవచ్చు.ఫ్యాటీ లివర్ ప్రమాదకరమా అన్న సందేహాలు నేడు వస్తున్నాయి,అసలు ఫ్యాటీ లివర్ నియంత్రణ కు చర్యలు ఏమిటి?ఎలా తగ్గించుకోవచ్చు?ఫ్యాటీ లివర్ లక్షణాలు ఏమిటి? ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయా? నాడీ పతిలో ఏవిధమైన ట్రీట్మెంట్ ఉంది. ఇలాంటి సమస్యలకు నాడీ పతిలో ఎలాంటి చికిత్చ ఉందొ ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు తెలుగు వన్ కు వివరించారు.ఫ్యాటీ లివర్ అంటే శరీరంలోని కాలేయానికి సంబందించిన సమస్య. హెపటైటిస్ కు సంబందించిన వ్యాధి. కాలేయం లో కొద్దిగా కొవ్వు అనేది సహజం.అయితే కొవ్వు 5 నుండి1౦ శాతం పెరిగిందో ప్రమాదమే, కాలేయపు బరువు పెరిగి ఫ్యాటీ లివర్ కు కారణం అవుతుంది. అది ప్రమాదకర స్థితికి దారి తీస్తుంది.మనం తీసుకునే ఆహారాలు,పానీయాలను జీర్ణం చేసి,ప్రోటీనులు విటమిన్లను గ్లూకోజ్ గా మార్వ్హడం తో పాటు రక్తం లోని మలినాలను తొలగిస్తుంది.  అలాగే హేమగ్లోబిన్ ఉత్పత్తికి సహాయ పడుతుంది.ఫ్యాటీ లివర్ సమస్య రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్య పానం ఎక్కువ చేసే వారిలో ఫ్యాటీ లివర్ సమస్యలు ఏర్పడతాయి.అయితే కొన్ని సందర్భాలలో మధ్యం తాగని వారిలో ఊబకాయం మరియు చక్కెర వ్యాధితో ఉన్న వారిలో ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాతిలివేర్ వ్యాధి ఉన్న వారిలో ఆకలిలేకపోవడం వాంతులు,వికారం,పోట్టలోనొప్పి వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో కామెర్లు వ్యాధి కూడా ఫ్యాటిలివర్ కు కారణం అవుతుంది. ఫ్యాటీ లివర్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల పేగుల్లో రక్త శ్రావం లివర్ క్యాన్సర్ మానసికంగా మార్పులు లివర్ ఫేయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.శరీరక పరీక్ష రక్త పరీక్ష లు, అల్ట్రాసౌండ్,స్కాన్ వంటి పరీక్షలు చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను గుర్తించవచ్చు. ఫ్యాటీ లివర్ సమస్యకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి... ఫ్యాటీ లివర్ సమస్యకు కొలస్ట్రాల్ అధిక బరువును తగ్గించుకోవడం షుగర్ లెవెల్స్ నియంత్రణ లో ఉంచుకోవడం ముఖ్యం.శరీరం లోని కొవ్వు శాతాన్ని తగ్గించుకోవడం మధ్యపానాన్ని వదిలివేయడం లేదా తగ్గించుకు కోవడం ధాన్యాలు,తాజా పళ్ళు ఎక్కువగా శాఖాహారం తీసుకోవడం ముఖ్యం.ప్రత్ర్హిరోజూ కనీసం ముప్ఫై నిమిషాలు వ్యాయామం చేయడం ,లేదా నిపుణులు సూచనల ప్రకారం వేడి నీళ్ళు తాగితే ఫ్యాతీలివేర్ అనేది సహజంగానే తగ్గవచ్చు. ఫ్యాటీ లివర్ కు అక్యు ప్రెషర్ పాయింట్స్ వచ్చి మన చేతుల్లో ఉన్న ఈ పాయింట్స్ ఎక్కువగా ప్రెజర్ చేయడం వల్ల కూడా ఈ సమస్యనుండి మనం కొంతమేర బయట పడి తగ్గించు కునే  అవకాసంఉందని నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు స్పష్టం చేసారు.నాడీ పతి ద్ఫారా ఫ్యాటీ లివర్ సమస్యకు అద్భుతమైన ట్రీట్మెంట్ విధానం ఉందని ఇందుకోసం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అతి ప్రాచీన మైన తెరఫీ విధానాల ద్వారా అతి తక్కువ రోజుల్లోనే పూర్తిగా ఫ్యాటీ లివర్ ను తగ్గించవచ్చని ఈ చికిత్చద్వారా భవిష్యత్తులో వచ్చే లివర్ సమస్యలకు పూర్తిగా అరికట్ట వచ్చు అని కృష్ణం రాజు.పేర్కొన్నారు.