ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ ను పట్టుకోవడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు.   రోజుకో వేషంతో పంజాబ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అమృత్ పాల్ సింగ్ పూటకో వేషం మార్చి దేశంలోనే దర్జాగా తిరుగుతున్నాడన్న వార్తలు ఒకవైపు  దేశం విడిచి ఎప్పుడో పారిపోయాడన్న సమాచారం మరోవైపు జనాలను అయోమయానికి గురి చేస్తోంది. తాజాగా ఖలిస్థాన్ నేత అమృత్ పాల్ సింగ్ ఢిల్లీలోని ఓ మార్కెట్ లో సంచరిస్తున్నట్లుగా ఓ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. దాంతో అమృత్ పాల్ సింగ్ తన సహచరుడు పాపల్ ప్రీత్ సింగ్ తో కలిసి తలపాగా లేకుండా మాస్కు, నల్ల  కళ్ల అద్దాలు ధరించి దర్జాగా తిరుగుతున్నట్టుగా ఉంది. అయితే దానిని పోలీసులు ధృవీకరించలేదు. యథాప్రకారంగా అమృత్ పాల్ సింగ్ ను త్వరలో పట్టుకుంటాం అన్న అరిగిపోయిన రికార్డునే వినిపించారు.   అదలా ఉంటే.. అమృత్ పాల్ సింగ్ ను తప్పకుండా పట్టుకుంటామని పంజాబ్, హర్యానా హైకోర్టుకు పంజాబ్ ప్రభుత్వం మంగళవారం( మార్చి 28) తెలిపింది.   అయితే అమృత్ పాల్ సింగ్ పోలీసుల కస్టడీలోనే  ఉన్నాడని, ఆచూకీ చెప్పాలంటూ ఇమాన్ సింగ్ ఖారా అనే న్యాయవాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.  ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ దేశం విడిచి ఎప్పుడో పారిపోయాడనే వాదన కూడా గట్టిగా  వినిపిస్తోంది.  ప్రస్తుతం అతడు నేపాల్ లో ఉన్నాడంటున్నారు.   మరోవైపు పలు దేశాల్లో ఖలిస్థాన్ సానుభూతిపరులు భారత్ ఎంబసీల మీద దాడులకు దిగుతున్నారు. అమెరికా, యూకే, ఫిలిప్పీన్స్ లో ఖలిస్థాన్ మద్దతుదారులు  తన నిరసనలతో  ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. 70,80వ దశకం తరువాత అణగారిపోయిందనుకున్న ఖలిస్తాన్ ఉద్యమం  మళ్లీ ఇన్నాళ్ల తరువాత మళ్లీ తెరపైకి రావడం నిస్సందేహంగా భారత్ కు ఇబ్బందికరమే.  దీనిని ఆదిలోనే నిరోధించకుంటే.. మరో బ్లూస్టార్ ఆపరేషన్ వంటిది అనివార్యమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. రెండో దశ మెట్రో రైలు ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.  దీనిపై మంత్రి కేటీఆర్   కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాసిన లేఖలో  అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి శాఖకు మెట్రో రైలు రెండో దశకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించడంతో పాటు ప్రాజెక్ట్ సవివర నివేదిక సైతం పంపించామని పేర్కొన్నారు. మరోసారి కూడా సమగ్ర సమాచారాన్ని, పూర్తి వివరాలు, పత్రాలు, నివేదికలను కేంద్రానికి  పంపుతున్నట్లు  చెబుతూ,   అత్యంత రద్దీ కలిగిన నగరమైన హైదరాబాద్ కు మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశ కష్టమని కేంద్రంచెప్పడం సబబు కాదన్నారు. కేంద్రం పక్షపాత ధోరణితో మెట్రో రైలు ప్రాజెక్టులు ఇస్తోందని ఆ లేఖలో ఆరోపించారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పాటు చాలా తక్కువ జనాభా ఉన్న లక్నో, ఆగ్రా,  వారణాసి, కాన్పూర్, ప్రయాగ్ రాజ్, మీరట్ వంటి   చిన్న పట్టణాలకు కూడా మెట్రో ప్రాజెక్టులను కేటాయించి వాటికి అన్ని అర్హతలూ ఉన్నాయని చెబుతూ,   హైదరాబాద్ కు మెట్రో రైలు విస్తరణ అర్హత లేదనడం దుర్మార్గమని కేటీఆర్ ఆ లేఖలో విమర్శించారు. హైదరాబాద్ లో ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువ అని కేంద్రం చెప్పడం అర్థరహితమని విమర్శించారు.  తెలంగాణ నేడు శరవేగంతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. తెలంగాణకు అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్నా వివిధ రంగాలలోని ప్రాజెక్టులు, కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి సీఎం కేసీఆర్, తాను తీసుకెళ్లినట్టు మంత్రి కేటీఆర్ ఆ లేఖలో వివరించారు. సంబంధిత కేంద్ర మంత్రికి వ్యక్తిగతంగా కలిసి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ ప్రాధాన్యాన్ని వివరించేందుకు అనేక సార్లు ప్రయత్నించినా ఆయన కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ నగర మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదముద్ర వేస్తుందని ఆశి స్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.    
సజ్జల రామకృష్ణా రెడ్డి స్వతాహాగా రాజకీయ నాయకుడు కాదు.ఆయన ఒక జర్నలిస్ట్. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన ఆయన వ్యాపార వేత్తగా ఎదిగారు. ఆ పైన వ్యాపార భాగస్వామ్యాన్ని రాజకీయాలతో ముడివేసి రాజకీయ నాయకుడయ్యారు. అయితే  సజ్జల  జర్నలిస్ట్ జీవితాన్ని పక్కన పెడితే వ్యాపార, రాజకీయ ప్రయాణంలో ఆయన ప్రయాణమంతా  వైఎస్ కుటుంబంతో కలిసే సాగింది. ఇక రాజకీయ ప్రయాణం అయితే పూర్తిగా  జగన్ మోహన్ రెడ్డి తోనే   సాగి, సజ్జలయ ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు స్థాయికి ఎదిగారు.   అంతవరకు అన్ని వ్యవహరాలలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిని   పక్కకు నెట్టి మరీ సజ్జల ఆ స్థానాన్ని దక్కించుకున్నారు.  . నిజానికి ఆయన పేరుకే ముఖ్యమంత్రి సలహాదారు కానీ, వాస్తవంలో ఆయన ఇంటర్నల్ స్టేటస్ ఇంకా చాలాచాలా ఎక్కువని, అంటారు. అలాగే, సర్వ శాఖల మంత్రిగా ప్రసిద్ది చెందిన సజ్జల  పార్టీ, ప్రభుత్వ రాజకీయాలపైనే కాకుండా  తాడేపల్లి ప్యాలెస్ రాజకీయాలపై కూడా పట్టు సాధించారనీ అందుకే, ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత ‘ముఖ్య’ నేతగా చక్రం తిప్పుతుండడమే కాకుండా ఒక విధంగా డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని  ఆయన అంటే గిట్టని పార్టీ నేతలు అంటారు. అందుకే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, పార్టీ కీలక నేతలతో సహా చాలా మంది నాయకులు ఆయన పట్ల చాలా గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు.  అదలా ఉంటే ఇప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం నేపథ్యంలో అధికార వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల వెనక సజ్జల హస్తం ఉందనే  అభియోగం బలంగా వినిపిస్తోంది. ఒక విధంగా సజ్జల ముఖ్యమంత్రి కళ్ళకు గంతలు కట్టి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పార్టీ నేతలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. వైసీపీ ప్రస్తుతం ఎదుర్కుంటున సంక్షోభానికి సజ్జలే కారణం అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే కాకుండా, తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో   కూడా వినవస్తునట్లు చెబుతున్నారు.   ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ చేశారనే ఆరోపణపై సస్పెన్షన్ కు గురైన నలుగురు ఎమ్మెల్యేలు, సజ్జలనే దోషిగా నిలబెడుతున్నారు.  సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అన్నారం నారాయణ రెడ్డి అయితే తాము టీడీపీకి అమ్ముడు పోయామని సజ్జల చేసిన ఆరోపణపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సజ్జల ఎవరు? అయన చరిత్ర ఏమిటి? అని ప్రశ్నించారు. అంతే కాదు, సజ్జలను వదిలే ప్రసక్తిలేదని, సస్పెన్షన్  గురైన ఇతర ఎమ్మెల్యేలతో చర్చించి, సజ్జలపై పరవు నష్టం దావా వేస్తామని  అన్నారు. అలాగే, ఆయన సజ్జల టార్గెట్’ గా తీవ్ర ఆరోపణలు చేశారు.  అలాగే  సస్పెన్షన్ వేటుకు గురైన మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి సజ్జల తనను హత్య చేయిస్తారన్న అనుమానం వ్యక్తం చేశారు. సజ్జల వల్ల ప్రాణహాని ఉందన్న భయంతోనే హైదరాబాద్ లో తల దాచుకుంటున్నానన్నారు.   నిజానికి, చాల కాలంగా సజ్జల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయనీ, అయితే ఎందుకనో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆ ఫిర్యాదులను అంతగా పట్టించుకోలేదని అంటారు.  ముఖ్యంగా జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజకీయంగా ఎదగకుండా చేయడంలో సజ్జల కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  అదలా ఉంటే ఇంతకాలం సరైన  సమయం కోసం ఎదురు చూస్తున్న సజ్జల బాధితులంతా ఏకమయ్యేందుకు, తెర వెనక ప్రయత్నాలు మొదలయ్యాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ప్రయత్నాల వెనక, జగన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ మిత్రులు, వైఎస్ కు సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే  జగన్ రెడ్డి కూడా కొంచెం ఆలస్యంగానే అయినా సజ్జల రాజకీయ ఎత్తులను పసిగట్టినట్లు తెలుస్తోంది. అందుకే, సజ్జల చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నారని, ఆదిశగా పావులు కదులుతున్నాయని అంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం 'సైంధవ్'. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'హిట్' ఫేమ్ శైలేష్ కొలను దర్శకుడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'సైంధవ్' చిత్రాన్ని 2023, డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో వెంకటేష్ నెత్తుటి మరకలతో చేతిలో గన్ పట్టుకొని కంటైనర్ పై కూర్చొని ఉండగా, పక్కన పేలుడు పదార్థాలు ఉండటం చూస్తుంటే విధ్వంసానికి సిద్ధం అన్నట్లుగా ఉంది. గత చిత్రం 'ఎఫ్-3'తో ప్రేక్షకులను నవ్వించిన వెంకటేష్.. ఈసారి వైలెన్స్ చూపించబోతున్నారని అర్థమవుతోంది. పైగా విడుదల తేదీ ఎంపిక కూడా కలిసొచ్చేలా ఉంది. మొదటి మూడు రోజులు వీకెండ్, నాలుగో రోజు క్రిస్మస్ హాలిడే కలిసొచ్చే అవకాశముంది.
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డెవిల్'. 'ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్' ట్యాగ్ లైన్. న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. 500 మందితో ఈ ఫైట్‌ను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. టాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ యాక్ష‌న్ ఎపిసోడ్‌గా చెప్పుకునేలా దీన్ని ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ ఆధ్వ‌ర్యంలో డిజైన్ చేశారు.  ఈ సంద‌ర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ "మా బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా డెవిల్ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాం. కొత్త సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే త‌ప‌న ఉన్న మా నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ మ‌రో డిఫ‌రెంట్ అవతార్‌లో ఆక‌ట్టుకోబోతున్నారు. సినిమా అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. 500 మంది ఫైట‌ర్స్‌తో ఈ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను వెంక‌ట్‌గారు నేతృత్వంలో చిత్రీక‌రిస్తున్నారు. దీన్ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూస్తే వావ్ అనేంత గొప్ప‌గా పిక్చ‌రైజేష‌న్ ఉంటుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలియ‌జేస్తాం" అన్నారు.  సౌంద‌ర్ రాజన్‌.ఎస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతాన్ని... శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మిస్తున్న చిత్రం 'యూనివర్సిటీ'. ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. "ఈ రోజు ప్రపంచం ప్రైవేటీ కరణ జరుగుతున్న దశలో భారత్ దేశం లాంటి వర్ధమాన దేశాల్లో లక్షలాది మంది యువత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆశావహ దృక్పధంతో ఎంతో కష్టపడి చదువుతూ డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకొని పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఎగ్జామ్ పేపర్ లీకేజీ లు అయిపోతూవుంటే వాళ్ళు కన్న కలలు ఏమైపోవాలి. వాళ్ళ గమ్యం అగమ్య గోచరం అయిపోతూ నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా కాకూడదు. పోలీస్ శాఖ, రైల్వే శాఖ ఇలా అనేక శాఖల్లో ఉద్యోగుల ఎగ్జామ్ పేపర్స్ లీకేజీ అయిపోతున్నాయి. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసినట్టు ప్రశ్నా పత్రాలు లీకేజీ అవుతుంటే విద్యార్థుల భవిష్యత్ ఏమి అవ్వాలి? లంభకోణం చెప్పేవాడు కుంభకోణం చేసుకు పోతూ ఉంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు గిల గిల లాడి పోతుంటే ఈ విద్య వ్యవస్థకు అర్ధం ఎక్కడుంది. ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి కల పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటివి చాలా అప్రమత్తంగా ఉండాలి. అవకతవకలు జరుగకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేదే యూనివర్సిటీ సినిమా. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాము" అని అన్నారు.
ఒక్కోసారి చిన్న సినిమాలు ఏమాత్రం అంచనాల్లేకుండా సైలెంట్ గా వచ్చి సర్ ప్రైజ్ హిట్ కొడుతుంటాయి. 'నారాయణ అండ్ కో' అనే చిత్రం అలాంటి సర్ ప్రైజ్ హిట్ కొడుతుంది అనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ కడుపుబ్బా నవ్వుకునేలా ఉండి, వెంటనే సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించేలా ఉంది. సుధాకర్ కోమాకుల, దేవి ప్రసాద్, ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'నారాయణ అండ్ కో'. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్లపై పాపిశెట్టి బ్రదర్స్ తో కలిసి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిన్న పాపిశెట్టి దర్శకుడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. మిల్లెట్స్ తో దేవుడి ప్రసాదం, శవంతో ఫ్యామిలీ ఫోటోలు వంటి సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగింది. తిక్కల్ ఫ్యామిలీకి కేరాఫ్ అడ్రెస్ లాంటి నారాయణ కుటుంబం.. ఓ పిల్లి బొమ్మ కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడిందనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు టీజర్ ని బట్టి అర్థమవుతోంది. వినోదాన్ని నమ్ముకునే ఇలాంటి సినిమాలు విజయాన్ని అందుకునే అవకాశాలు ఎక్కువ. మరి 'నారాయణ అండ్ కో' కూడా ఆ లిస్టులో చేరుతుందేమో చూడాలి.
అప్ప‌టిదాకా అన్ని విష‌యాల్లో ఓకే చెప్పిన వారు ఉన్న‌ట్టుండి నో చెబితే ఎలా అనిపిస్తుంది? ఏం చేసినా వెరీగుడ్ అన్న‌వారు.. ఇంకొక్కసారి ఆలోచించ‌కూడ‌దా అని అంటే ఎలా స్పందించాలి?  వాళ్లు అదేప‌నిగా చెబుతున్నారు క‌దా అని సైలెంట్‌గా ఉండాలా?  లేకుంటే, మ‌న‌సుకు న‌చ్చిన‌ట్టు చేసేయాలా? మ‌రొక‌రో, ఇంకొక‌రో అయితే ఏం చేసేవారో తెలియ‌దు కానీ, స‌మంత మాత్రం త‌న మ‌న‌సు ఏం చెబితే అదే విన్నారు. యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే ప్ర‌వ‌ర్తించారు. అందుకే ఊ అంటావా మావా ఉఊ అంటావా మావా అంత పెద్ద హిట్ అయింది. పుష్ప‌2లో ఉ అంటావా పాట కోసం ద‌ర్శ‌కుడు సమంత‌ను అప్రోచ్ అయిన‌ప్పుడు స‌మంత ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో కాస్త డిస్ట‌ర్బెన్స్ ఉంది. అప్పుడే స‌మంత‌, నాగ‌చైత‌న్య డైవ‌ర్స్ ప్ర‌క‌టించారు. అలాంట‌ప్పుడు ఈ సాంగ్‌కి స‌మంత యాక్సెప్ట్ చేయాలా? వ‌ద్దా? అప్పుడు అదో మిలియన్ డాల‌ర్ల్ ప్ర‌శ్న‌. స‌మంత మాట్లాడుతూ ``నా లైఫ్‌లో నేను ఏ నిర్ణ‌యం తీసుకున్నా న‌న్ను ఎంకరేజ్ చేసిన వారున్నారు. నేను సూప‌ర్ డీల‌క్స్ లాంటి సినిమాలు చేస్తాన‌న్న‌ప్పుడు కూడా ఎంక‌రేజ్ చేశారు. కానీ అలాంటివారు, మ‌రీ ముఖ్యంగా ఫ్యామిలీ మెంబ‌ర్స్, ఫ్రెండ్స్ మాత్రం స్పెష‌ల్ సాంగ్ ఇప్పుడు అవ‌స‌ర‌మా? అని ఒక‌సారి ఆలోచించుకోమ‌న్నారు. అలా ఆలోచించుకున్నాను కాబ‌ట్టే నేను ఆ సాంగ్‌లో చేశాను. అలాంటి ఎక్స్ ప్రెష‌న్స్ కెమెరా ముందు పెట్ట‌గ‌ల‌నా? అని న‌న్ను నేను చాలా సార్లు ప్ర‌శ్నించుకునేదాన్ని. వాట‌న్నిటికీ స్క్రీన్ మీద స‌మాధానం దొరికింది. ఆ పాట సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయింది`` అని అన్నారు స‌మంత‌. ఆమె న‌టించిన శాకుంత‌లం ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా నార్త్ మీడియాతో  ఈ విష‌యాన్ని పంచుకున్నారు స‌మంత‌. విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఆమె న‌టిస్తున్న ఖుషి సినిమా సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానుంది. స‌మంత అనారోగ్యం పాలు కాకుండా ఉంటే, ఈ సినిమా గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది. నార్త్ లో వ‌రుణ్‌ధావ‌న్‌తో సిటాడెల్ ఇండియ‌న్ వెర్ష‌న్‌లో న‌టిస్తున్నారు స‌మంత‌.
నటసింహం నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' షో కోసం హోస్ట్ అవతారం ఎత్తినప్పటి నుంచి.. ఆయన హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఒక సినిమా నిర్మించనున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఎట్టకేలకు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బాలకృష్ణ హీరోగా సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ ఏడాది సంక్రాంతికి 'వీరసింహారెడ్డి' సినిమాతో విజయాన్ని అందుకున్న బాలకృష్ణ.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాని చేస్తున్నాడు. ఈ మూవీ దసరాకు విడుదలయ్యే అవకాశముంది. దీని తర్వాత బాలయ్య చేయబోయే సినిమాపై కూడా క్లారిటీ వచ్చినట్లే అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఆయన తదుపరి సినిమా చేయనున్నారని టాక్. దీనికి పరశురామ్ లేదా చందు మొండేటి దర్శకత్వం వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ కోసం కథ సిద్ధం చేసి అల్లు అరవింద్ కి వినిపించినట్లు గతంలో ఓ సినిమా వేడుకలో పరశురామ్ ప్రకటించాడు. దాంతో అల్లు అరవింద్ నిర్మాణంలో బాలయ్య హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సినిమా అంటూ అప్పట్లో వార్తలు బలంగా వినిపించాయి. మరోవైపు చందు మొండేటి సైతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ చిత్రాన్ని కమిట్ అయ్యి ఉన్నాడు. దీంతో గీతా ఆర్ట్స్ లో బాలయ్య సినిమా పరశురామ్ తోనా? లేక చందు మొండేటితోనా? అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇప్పుడంతా ప్యాన్ ఇండియా సంస్కృతి న‌డుస్తోంది. అందుకే కాస్త పేరున్న హీరోలంద‌రూ ప్యాన్ ఇండియ‌న్ స్టార్లుగా చ‌లామ‌ణి అవుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో శివ కార్తికేయ‌న్ కూడా ప్యాన్ ఇండియా స్టారే. బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు ఇచ్చిన హీరో అనే గౌర‌వం ఇండ‌స్ట్రీకి ఉంది. అభిమానుల్లోనూ ఉంది. మంచి కాన్సెప్టుల‌తో సినిమా చేస్తార‌నే ఫీలింగ్ తెలుగు ఆడియ‌న్స్ కి కూడా ఉంది. శివ‌కార్తికేయ‌న్ ఇప్పుడు న‌టిస్తున్న సినిమా మావీర‌న్‌. ఈ సినిమాలో ఆయ‌న పార్ట్ షూటింగ్ పూర్త‌యింది. ఈ సినిమాను మండేలా ఫేమ్ అశ్విన్ మ‌డోన్న తెర‌కెక్కిస్తున్నారు. గ‌త కొన్ని నెల‌ల ముందు టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. ఏడాదిగా ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్ కంటిన్యూ అవుతోంది. సినిమాలో శివ పోర్ష‌న్ కంప్లీట్ అయింద‌ని మేక‌ర్స్ ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించారు. బ‌క్రీద్‌ని పుర‌స్క‌రించుకుని జూన్ 29న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. హై ఆక్టేన్ యాక్ష‌న్ చిత్ర‌మిది. పొలిటిక‌ల్ కామెంట‌రీ డోస్ కూడా ఉంటుంది. అదితి శంక‌ర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.  అరుణ్ విశ్వ తెర‌కెక్కిస్తున్నారు. శాంతీ టాకీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇంకా కొంత భాగం మాత్ర‌మే షూటింగ్ పెండింగ్ ఉందని ప్ర‌క‌టించింది శాంతీ టాకీస్‌. త్వ‌ర‌లోనే దాన్ని కూడా పూర్తి చేసేస్తామ‌ని, బ‌క్రీద్ సంద‌ర్భంగా జూన్ 29న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని అన్నారు అరుణ్‌. జూన్‌లో విడుద‌ల కానున్న ఈ సినిమాతో స‌మ్మ‌ర్ రేసులో తాను కూడా ఉన్న‌ట్టే అని అంటున్నార‌ట శివ కార్తికేయ‌న్‌. ఈ సినిమాతో పాటు అయ‌లాన్ అనే మ‌రో ప్రాజెక్ట్ లోనూ న‌టిస్తున్నారు శివ‌. సైన్స్ ఫిక్ష‌న్ సినిమా అది. ఆర్థిక ఇబ్బందులు, ప‌లు కాంట్ర‌వ‌ర్శీల కార‌ణంగా ప్రొడ‌క్ష‌న్ డిలే అయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. డాక్టర్, డాన్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన శివ కార్తికేయ‌న్ కి ప్రిన్స్ ఫ్లాప్ అయింది. అందుకే ఇప్పుడు ఆశల‌న్నీ మావీర‌న్ మీదే పెట్టుకున్నారు. ర‌జ‌నీకాంత్ జైల‌ర్‌లోనూ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు శివ‌కార్తికేయ‌న్‌.
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'దసరా'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం రేపు(మార్చి 30న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం నాని కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దసరాలో నాని మొదటిసారి ఊర మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ.50 కోట్లని అంచనా. ఇప్పటిదాకా నాని హీరోగా నటించిన ఏ సినిమా కూడా రూ.50 కోట్ల షేర్ మార్క్ ని అందుకోలేదు. నాని కెరీర్ లో అత్యధికంగా 'MCA'(మిడిల్ క్లాస్ అబ్బాయి) మూవీ రూ.40 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అలాంటిది ఇప్పుడు దసరా థియేట్రికల్ బిజినెస్ రూ.50 కోట్లంటే అంచనాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హిట్ టాక్ వస్తే ఈ సినిమా రూ.50 కోట్ల షేర్ మార్క్ ని సునాయాసంగా అందుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దసరా సినిమాపై భారీ అంచనాలు ఉండటం, పైగా రేపు శ్రీరామనవమి(సెలవు దినం) కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే భారీస్థాయిలో టికెట్లు బుక్ అయ్యాయి. దీంతో ఈ మూవీ ఓపెనింగ్స్ పరంగా సంచలనం సృష్టించడం ఖాయమంటున్నారు. మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.10 కోట్లకి పైగా షేర్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.15 కోట్లకు పైగా షేర్(రూ.30 కోట్లకు పైగా గ్రాస్) రాబట్టే అవకాశముంది అంటున్నారు. ఆ అంచనాలను దసరా అందుకుంటుందేమో చూడాలి.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
జీవితంలో అన్ని విషయాలలోనూ మంచి చెడు అనే రెండు కోణాలు ఉంటాయి. వాటిని బట్టే మనుషులను కూడా మంచి చెడు అని పేర్కొంటాము.  ఎదుటివాడి ఆశయాలను, ఇష్టాయిష్టాలను గౌరవించే స్నేహమే నిజమైన స్నేహం. తాను చెప్పిందే ఎదుటివాడు వినాలి, తాను రమ్మన్నప్పుడు రావాలి, చేయమన్న పని చేయాలి అనేది బానిసత్వం అవుతుంది. అది స్నేహం ఎప్పటికీ కాదు. తన స్నేహితుడిలోని లక్షణాలను విశ్లేషించి, స్నేహం గురించి విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. జీవితంలోని ప్రతి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. గమనిస్తే అనేక మంది విజేతలు ఏదో ఓ దశలో సమాజంలో పిచ్చివారుగా పరిగణనకు గురైనవారే. తమ లక్ష్యంపై వారి దృష్టి ఎంతగా కేంద్రీకృతమై ఉంటుందంటే ఇతర విషయాలన్నీ వారికి పనికిరానివిగా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఇతర విషయాలను పట్టించుకోవడం మానేస్తారో అప్పుడే వారి మీద విమర్శలు మొదలవుతాయి. అవెలా ఉంటాయంటే స్థాయి పెరిగేకొద్దీ మనుషుల్ని మరచిపోతారు అనేలా. తన దృష్టి దేనిపై కేంద్రీకృతమై ఉందో ఆ విషయానికి సంబంధించినవి మాత్రమే విజేతలకు గుర్తుంటాయి. ఒకే రకమైన పక్షులు ఒకే గూటికి చేరతాయంటారు. కాబట్టి మనిషి మంచివాడైనా, చెడ్డవారితో స్నేహం వాడి మంచితనాన్ని మరుపుకు తెస్తుంది. ఒకే గూటి పక్షి అయిపోతాడు.  "తాటి చెట్టు పాలు తాగడం" కథ ఇక్కడ వర్తిస్తుంది. మంచివాడైనా, దుష్టులతో కలిసి తిరిగితే చెడ్డవాడనే అని అందరూ అంటారు. స్వతహాగా ఇతను మంచివాడే అయినప్పటికీ, చెడ్డ లక్షణాలు ఉండి ఉంటాయని అనుమానిస్తారు. చెడ్డవాడుగానే పరిగణిస్తారు. సాధారణంగా, ప్రతివ్యక్తికీ ఇష్టాయిష్టాలుంటాయి. ఆ ఇష్టాయిష్టాలు అతడు పెరిగిన వాతావరణం, సంస్కారం వంటి అంశాలపై ఆధారపడి వుంటాయి. ఆ ఇష్టాయిష్టాల ఆధారంగా అతడు కొందరు వ్యక్తులకే సన్నిహితుడవుతాడు. అందరితో కలిసి తిరుగుతున్నా కొందరితోనే అత్యంత సన్నిహితంగా వెళ్ళగలుగుతాడు. ఈ సన్నిహితులెవరో గమనిస్తే చాలు, వ్యక్తి స్వభావ స్వరూపాలు బోధపడతాయి. వారు మంచివారైతే పరవాలేదు. అదే వారు చెడ్డవారైతే వ్యక్తి మంచి వాడైనా అనుమానాస్పదుడే అవుతాడు. ఎందుకంటే అటువంటి వారి ప్రభావం వ్యక్తిపై ఎంతైనా వుంటుంది. ఏదో ఓ రోజు అది ఫలితాన్ని చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు మంచి ఆలోచనలపైనే దృష్టిని నిలపాలి. అలా కాక దుర్మార్గులు, దుష్టులుగా పరిగణించే వారి సాంగత్యంలో వుంటే వాళ్ళ నడుమ తుచ్ఛమైన ఆలోచనలే వస్తాయి. అవి మనపై ప్రభావం చూపిస్తాయి. కొందరు అంటారు మనం బాగుంటే ఇతర విషయాలు మనల్ని ఏమీ చేయలేవు అని.  వజ్రం ఎంత విలువైనది అయినా దాన్ని బంగారంలో పెట్టి ఆభరణంగా మారిస్తే దాని స్వరూపం ఎంతో బాగుంటుంది. అదే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి గులకరాళ్ల మధ్య వేస్తే దాన్ని గుర్తించేవారెవరు?? పరీక్షల కోసం బాగా చదివే విద్యార్థిని మాటమాటికి వచ్చి బయటకు రమ్మని పిలిచే స్నేహం అంత మంచిది కాదు. చాలా మంది తాము బాగా చదువుకుని తమ విరామ సమయాన్ని గడపడానికి వచ్చి, ఏమీ చదవనట్టు పరీక్షంటే లెక్కలేనట్టు మాట్లాడతారు. కష్టపడి చదివే వాడిని వెక్కిరిస్తారు. దాంతో చదివేవాడు సైతం తానేదో తప్పు చేస్తున్నట్లు బాధపడతాడు. చదువు వదలుతాడు దెబ్బ తింటాడు. కాబట్టి, చదవాలనుకున్న వాడు చదువుతుంటే వచ్చి ఏకాగ్రతకు భంగం కలిగించేవాడి స్నేహాన్ని నిర్మొహమాటంగా వదల్చుకోవాలి. ఎందుకంటే కొందరు పైకి మంచిగా నటించినా మనసులో వేరే రకంగా భావిస్తూంటారు. అటువంటివారితో స్నేహం ఎప్పడైనా ముప్పు తెస్తుంది. ఈవిషయం అందరూ గమనించండి. చెడ్డవారితో స్నేహాన్ని వదులుకోండి. తమ జీవితానికి చెడ్డవారి వల్ల కలిగే నష్టాన్ని ఆ నష్టం ఎదురయ్యే వరకు కాకుండా వ్యక్తుల ప్రవర్తనలో గుర్తించి దూరంగా ఉంటేనే మంచిది.                                       ◆నిశ్శబ్ద.
వేసవికాలం వచ్చిందంటే వామ్మో అంటాము. మండిపోయే ఎండలు, మగ్గబెట్టే ఉక్కపోత, వీటికి తోడు కరెంట్ కోతలు. ఉదయం, సాయంత్రం తప్ప ఏ మధ్యాహ్నపు ఎండలోనో బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందంటే గుండె గుభేలుమంటుంది. అందుకే ఎండ అంటే చెప్పలేనంత మంట అందరికీ. కానీ సమయం గడుస్తూ ఉంటే ఈ కాలాలు అదేనండి వర్షాకాలం, చలికాలం వచ్చినట్టు ఎండాకాలం కూడా రాక తప్పదు. అది తన ప్రతాపం చూపించక తప్పదు. అయితే ఈ వేసవిని చూసి భయపడటానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, దీన్ని ఎంజాయ్ చేయడానికి అన్నే మార్గాలు ఉన్నాయి. ఓసారి తెలుసుకుంటే సమ్మర్ మీద హమ్మర్ తో ఓ మోస్తరు సౌండ్ చేయచ్చు. ఒకప్పుడు!! సంవత్సరకాలం అంతా పిల్లలు ఎదురుచూసేరోజులు ఇవే అంటే ఆశ్చర్యమేస్తుంది. నిజంగానే వేసవి కోసం పిల్లలు అర్రులు చాచేవాళ్ళు. ఒక పూట బడి ముగియగానే ఎండను కూడా లెక్కచేయకుండా బావుల వెంట, చేల వెంట వెల్తూ ఎన్నో మధురస్మృతులను మూటగట్టుకునేవాళ్ళు. ఓ ముప్పై సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళను పిలిచి బాల్యం గురించి చెప్పమంటే కళ్ళు మెరవడం, చిరునవ్వు బయటకు రావడం ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి.  అందుకే అన్ని కాలలను ఒకేలా పుస్తకాల మధ్య కాకుండా కాసింత ప్రత్యేకంగా గడిపేలా మీ పిల్లలకు ఏర్పాటు చేయండి. అది వాళ్లకు ఆసక్తికరమై, వాళ్ళ సంతోషానికి కారణమయ్యేది అయ్యుండాలి సుమా!! ప్రకృతి ఆతిథ్యం!! నిజంగా నిజమే. వేసవిలో ప్రకృతి ఎంత గొప్ప ఆతిథ్యం ఇస్తుందని. అవన్నీ చాలా వరకు ఇప్పటి తరానికి తెలియకుండా ఉన్నాయి. వాళ్లకు ఓసారి పరిచయం చేసి చూడండి. నాచురల్ లైఫ్ మీద లవ్ లో పడతారు వాళ్ళు. పుల్లని విందు!! బలే బలే పసందు ఈ పుల్లని విందు. అదే అదే ఫలాల రాజు మామిడి గారు ఎంతో ఠీవిగా చెట్లలో పెరిగి అందరినీ పలకరించడానికి ఇంటింటికి వస్తాడు. అందరి నోర్లు జలపాతాలు చేస్తాడు.  చెరకు చరిష్మా!! చిన్నప్పటి దంతాల రహస్యం. నోటితోనే చెరకు పొట్టు తీసి, కొరికి, కసకస నమిలి, రసాన్ని జుర్రుకుంటూ పిప్పిని పడేస్తే ఆహా ఉంటుంది ఆ నాలుగు అదృష్టం ఎంతో అనిపిస్తుంది. ఇప్పట్లో అంత సీన్లు లేకపోయినా ఎంచక్కా రోడ్ సైడ్ దొరికే చెరకు రసం తాగేసి హాయి హాయిగా వెళ్లిపోవచ్చు.  ఇవి మచ్చుకు రెండు మాత్రమే. ఇంకా చింతచిగురు వేరే లెవెల్. తాటి ముంజలు మరొక ఎత్తు, చల్ల చల్లటి మజ్జిగ, శరీర తాపాన్ని తగ్గించే పుదీనా శరబత్ ఇవన్నీ హైలైట్.  అయితే మరొక మ్యాజిక్ కూడా ఉంది. అదే కేవలం రాయలసీమ ప్రాంతంలో లభ్యమయ్యే సుగంధి సిరప్. కేవలం కడప జిల్లాలో అడవులలో మాత్రమే పెరిగే సుగంధ మొక్కల వేర్లను ఉడికించి పంచదార కలిపి సిరప్ చేసి అమ్ముతుంటారు. సువాసన అద్భుతంగా ఉంటుంది. చల్లని నీళ్లు, లేదా షోడాతో ఈ సిరప్ కలిపి తీసుకుంటే వేసవి కాలం వెంట తీసుకొచ్చే వడదెబ్బ వంద కిలోమీటర్లు పరిగెత్తి పరిగెత్తి పారిపోతుంది. శరీర వేడిని తక్షణమే తగ్గిస్తుంది.  వేసవి భయం అసలు వద్దు!! ఎవరు ఎన్ని చెప్పుకున్నా బయటకు వెళ్ళేవాళ్లకు అదొక భయం. సర్రుమని కాలిపోతున్న రోడ్లన్నీ నరకంలో యమధర్మరాజు ఏర్పాటు చేసినట్టు అనుభూతి కలుగుతుంది. అందుకే సులువైన, మరియు అందరూ ఆచరించగల జాగ్రత్తలు. బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. మరి నీళ్లు అయిపోతే?? ఏముంది ఏకంగా బాటల్  కొనే పని తప్పుతుంది ఎక్కడో ఒక చోట అయిదు రూపాయల్లో బాటల్ నింపుకోవచ్చు. లేదు కాదు అంటే 20 నుండి 30 పెట్టి వాటర్ బాటిల్ కొనేబదులు ఎంచక్కా ఫ్రూట్ జ్యూస్, లేదా నిమ్మ షోడా వంటివి తాగడం హాయి. వేసవి తాపాన్ని తగ్గిస్తాయి ఇవి. ఇవి కాకుండా మరొక సలహా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కీరా దోస, పుచ్చకాయ వంటి నీరు అధికంగా ఉన్నవి తినడం లేదా జ్యూస్ తాగడం మంచిది. ఉప్పు, కారం, మసాలాలు వంటివి తగ్గించుకోవాలి ఈ కాలంలో. శరీర ఉష్ణోగ్రత మీద అవి ప్రభావం చూపిస్తాయి.  వెంట గొడుగు ఉంచుకోవడం మర్చిపోకండి. లేదంటే టోపి, లేదా స్పార్క్ ఇలా ఎదో ఒకటి నెత్తిని కప్పి ఉంచేలా జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లేలా చూసుకోవాలి. మధ్యలో సమయం అంతా ఇంటి పట్టున లేదా ఉద్యోగాలు చేసే ప్రాంతాలలో ఉండటం మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే వేసవి కోసం బోలెడు మార్గాలు. అయితే మనం ఎంత డాబు చెప్పుకున్నా ఈ ఎండల కొరడా దెబ్బకు ఒళ్ళు చురుక్కుమనడం సాధారణం. అందుకే దాని నుండి జాగ్రత్త మరి. జాగ్రత్తగా షేక్ హాండ్ ఇచ్చి కూల్ గా డీల్ చేసి పంపిద్దాం.                                     ◆వెంకటేష్ పువ్వాడ.
మనిషి జీవితంలో బలాలు, అవకాశాలు, భయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటి గురించి తెలుసుకుంటే... బలాలు మనిషి జీవితంలో బలాలు మాత్రమే కాదు. బలహీనతలు కూడా ఉంటాయి. అయితే నేటి కాలంలో మనుషులు తమలో ఉన్న బలాలను పక్కన పెట్టి తమలో ఉన్న చిన్న బలహీనతల్ని కూడా భూతద్దంలో చూస్తారు. ఫలితంగా తమలో చాలా పెద్ద లోటుపాట్లు ఉన్నాయని అవి తమ జీవితాన్నే కుదిపేస్తున్నాయనే ధోరణిలోకి వెళ్ళిపోతారు. స్నేహితులను, బంధువులను, ఆత్మీయులను కలిసినప్పుడు తమ గురించి తాము ఓపెన్ గా మాట్లాడుకోగలిగే చనువు ఉంటే గనుక అలాంటి సందర్భంలో  సహజంగా చాలామంది తమలో చాలా బలహీనతలు ఉన్నాయని అంటూంటారు. కానీ అందరూ గ్రహించని ముఖ్య విషయం ఏమిటంటే… అందులో అధికశాతం ఊహించుకున్నవే.  ఇక్కడ బలహీనతలంటే మొహమాటం, ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆందోళన.. లాంటి వైఖరులన్నమాట. ఉదాహరణకి చెప్పుకుంటే తను చదివే కోర్సు పూర్తయిపోగానే తరువాత ఏది ఎంపిక చేసుకోవాలనే నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కొందరు చాలా బాధపడిపోతారు. అలాంటి పరిస్థితిలో వారి మనసులో ఉండే భావం ఎలాంటిదంటే ఒకరి మీద ఆధారపడాల్సి వస్తోందే అనే బాధ, నాకు నేను ఎలా నిర్ణయం తీసుకోవాలి నాకు తెలియనప్పుడు అనే సంఘర్షణ ఒక విద్యార్థిలో ఏర్పడటం తన బలహీనతగా భావిస్తాడు. అయితే ఇదేమీ పెద్ద సమస్య కాదు. కొద్దిపాటి అవగాహన పెంచుకుంటే, తెలుసుకుంటే అన్నీ సాధ్యమవుతాయి. మనిషిలో ఉండే బలహీనతలు ఎప్పటికీ బలహీనతలుగా ఉండిపోవు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఆ బలహీనతలు క్రమంగా అధిగమించవచ్చు. అవకాశాలు అవకాశాల గురించి చాలామందికి అవగాహన సరిగా ఉండదు. తమ ముందున్నవి అవకాశాలే కాదు అన్నంత నిర్లక్ష్యంగా, అవగాహనా లోపంతో ఉంటారు చాలామంది.  చదువుకునే విద్యార్థుల నుంచి, ఉద్యోగాలు చేసే వారి వరకు తాము ముందుకు పోవడానికి గల అవకాశాలను గుర్తించడం అరుదు. చదువుకునే విద్యార్ధినీ విద్యార్థులు, తాము బాగా చదువుకుంటే భవిష్యత్తులో ఏమి సాధించగలరో, తమ కుటుంబ గౌరవ ప్రతిష్ఠలు ఎలా పెంచగలరో గుర్తించాలి. చదువు పూర్తి చేస్తే తండ్రి వ్యాపారంలో చేరవచ్చు. విదేశాల్లో ఉన్న బంధువులు స్పాన్సర్ చేయవచ్చు. ఇక్కడే ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని ఆదుకోవచ్చు... ఇలా తమ జీవితానికి ఉన్న మార్గాలను అనుసరించి ఆలోచించాలి. నిజానికి ఈనాటి యువతరానికి ఇవన్నీ తెలియకకాదు. అన్నీ తెలుసు. కానీ బద్ధకం, నిర్లక్ష్యవైఖరి, చెడు అలవాట్లు అడ్డుపడుతున్నాయి.  భయాలు  మనిషి పతనానికి మూలకారణం భయం. ఒక పని ప్రారంభించే ముందు విజయం సాధించగలమా లేదా అనే చిన్న భయం ఉండవచ్చు. దాంతో మధ్యలో సమస్యలు రావచ్చు. విజయమార్గంలో వైఫల్యాలు ఉంటాయి తప్పదు. విజయం అనేది ప్రయాణం తప్ప, గమ్యం కాదని గుర్తించాలి. అర్థం లేని భయాలు, భీతులు మన విజయానికి ఆటంకం కాకుండా ధైర్యం తెచ్చుకోవాలి. “నేను మాట్లాడలేను, నావల్లకాదు" వంటి మాటలకు ముగింపు చెప్పాలి.మాట్లాడటం అందరికీ వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడలేను?? విషయం గురించి కొంచెం అవగాహన పెంచుకుంటే ఆ అవగాహన ఉన్న విషయాన్ని మాట్లాడటమే క్షదా చేయాల్సింది. అలాంటప్పుడు మాట్లాడలేమనే భయం ఎందుకు?? ఇలాంటి ప్రశ్నను తమకు తాము వేసుకోవాలి. అలా వేసుకుంటే ఒకానొక ప్రేరణ ఎవరిలో వారికి కలుగుతుంది.  కాబట్టి మనిషి జీవితంలో బలహీనతలు, అవకాశాలు, భయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిని సరైన విధంగా డీల్ చేయడం నేర్చుకోవాలి.                                ◆నిశ్శబ్ద.
మారుతున్న వాతావరణం వల్ల  తరచుగా అనేక రకాల గొంతు సమస్యలు వస్తాయి. వీటిలో గొంతు ఇన్ఫెక్షన్ చాలా ఇబాబుది పెడుతుంది.  గొంతు ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణాల ద్వారా దాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. అదే ఈ ఇన్ఫెక్షన్ ను లైట్ తీసుకుంటే ఇది చాలా దారుణమైన ఫలితాన్ని పరిచయం చేస్తుంది.   గొంతు ఇన్ఫెక్షన్ సాధారణంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, అలెర్జీల వల్ల సంభవించవచ్చు. కొన్నిసార్లు వాతావరణంలో మార్పు లేదా ఫ్లూ కారణంగా కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే.. గొంతు ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? గొంతు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వస్తుంది. ఇది  ఏ వయస్సు వారిలో అయిన కనిపించవచ్చు.  కానీ ఈ సమస్య చిన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలు గొంతు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ.   గొంతు ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. గొంతు నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది తలెత్తడం.  టాన్సిల్స్‌లో వాపు, నొప్పి. టాన్సిల్స్ మీద తెల్లగా ఉండటం. గొంతు ఎరుపు రంగులోకి మారడం.  వాయిస్ లో మార్పు, గొంతు బొంగురు పోవడం జరుగుతుంది.  గొంతు ఎండిపోయినట్టు, నాలుక మీద దద్దుర్లు రావడం,  జ్వరం-దగ్గు, తలనొప్పి మొదలైనవి ఉంటాయి.  గొంతు ఇన్ఫెక్షన్ కారణాలు.. జలుబు వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. గొంతు నొప్పి, వాపు, జ్వరం వంటి సమస్యలు ఉండవచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని కారణంగా, స్ట్రెప్ థ్రోట్ సమస్య, గొంతు, టాన్సిల్స్‌లో ఇన్ఫెక్షన్ వస్తుంది. అలర్జీ వల్ల కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. కాలుష్యం, పెంపుడు జంతువులు, బలహీనమైన రోగనిరోధక శక్తి, ఇతర కారణాల వల్ల అలెర్జీలు వస్తాయి. గొంతు గాయం కారణంగా,  స్వర తంతువులు, గొంతులో కండరాలు వ్యాకోచం చెందుతాయి. , దీని కారణంగా గొంతు నొప్పి వస్తుంది. దీర్ఘకాలం గొంతు నొప్పి ఉంటే అది ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ నివారణ ఇలా.. గొంతు నొప్పి లేదా ఇతర లక్షణాలు ఉంటే, భౌతిక దూరం పాటించడం ముఖ్యం. శుభ్రత పట్ల శ్రద్ధ వహించండి. ఆహారం తినే ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోటిపై రుమాలు ఉంచుకోవాలి. సిగరెట్ మద్యం అలవాట్లు ఉంటే వాటిని వదిలెయ్యాలి. . పొగతాగడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ మరింత పెరుగుతుంది. ఎక్కడైనా గాలి కాలుష్యం, ధూళి ఉంటే గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. మురికి ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి. పుష్కలంగా నీరు త్రాగాలి కానీ చల్లని నీరు మాత్రం త్రాగకూడదు. గొంతు ఇన్ఫెక్షన్ చికిత్స ఇలా..   గొంతు ఇన్ఫెక్షన్ ఉంటే  డాక్టర్లు  యాంటీబయాటిక్స్ ఇవ్వవచ్చు.  వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఏదైనా మందు  వాడటం ముఖ్యం. సమస్య తీవ్రత పెరిగినప్పుడు  గొంతు ఇన్ఫెక్షన్ చికిత్సకు శస్త్రచికిత్సా ప్రక్రియ కూడా ఉంది, దీనిలో టాన్సిల్స్ తొలగించబడతాయి.  గొంతు ఇన్ఫెక్షన్‌లో అనేక ఇంటి చిట్కాలు  ప్రయోజనకరంగా ఉంటాయి.  ఉప్పు, వెల్లుల్లి, ఆపిల్ వెనిగర్, తేనె, పాలు మంచివి. అలాగే పసుపు, అల్లం, ఆవిరి పట్టడం లికోరైస్ మొదలైనవి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.                                  ◆నిశ్శబ్ద.
ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే  తీసుకునే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతారు. ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా ఆకుపచ్చ కూరగాయలు పండ్లను తీసుకోవడం మంచిది. మనం తినే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల అనేక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే బొప్పాయి ఆరోగ్యానికి హానికరంగా కూడా మారుతుంది. అందుకే రోజూ బొప్పాయిని ఎంత తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఆరోగ్య నష్టాలు ఏంటి తెలుసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  బొప్పాయిలో ఉండే పోషకాలు..  బొప్పాయి విటమిన్ ఎ కి ఖజానా అనుకోవచ్చు.  ఇందులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది, అంతే కాకుండా విటమిన్ సి కూడా లభిస్తుంది. మరోవైపు, బొప్పాయిలో చాలా నీరు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ పదార్థాలు, ఆల్కలీన్ మూలకాలు, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, చక్కెర మొదలైనవి కనిపిస్తాయి. సహజంగా, ఫైబర్, కెరోటిన్, ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు బొప్పాయి తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వీటి గింజలను తీసుకుంటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. బొప్పాయిలో ఉండే ఔషధ గుణాలు కంటి ఆరోగ్యానికి మంచిది. ఆర్థరైటిస్ రోగులు సమస్య నుండి ఉపశమనం కావాలని అనుకుంటే బొప్పాయి చక్కగా పనిచేస్తుంది. బొప్పాయి స్కిన్ టోన్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. జుట్టును దృఢంగా ఒత్తుగా మార్చేందుకు బొప్పాయి ఆకుల రసాన్ని ఉపయోగించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బొప్పాయి గింజలు క్యాన్సర్‌ను నివారించడంలో మేలు చేస్తాయి. అధిక బరువు ఉన్నవారు బొప్పాయి తినడం వల్ల  ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. అధిక రక్తపోటు చికిత్సలో పచ్చి బొప్పాయి ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయి తీసుకోవడం వల్ల  రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగవుతుంది. బొప్పాయి తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు గర్భధారణ సమయంలో బొప్పాయి తినకూడదు. బొప్పాయిలో పాలు కనిపిస్తే, అది గర్భాశయ సంకోచాలకు కారణమవుతుంది. దీని కారణంగా గర్భస్రావం, ప్రసవ నొప్పి, శిశువులో అసాధారణతలు ఉండవచ్చు. పాలిచ్చే తల్లులు బొప్పాయికి దూరంగా ఉండటమే మంచిది. బొప్పాయిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే జాండిస్ సమస్య పెరుగుతుంది. బొప్పాయిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కులో రద్దీ, జలదరింపు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అంతేకాదు కిడ్నీలో రాళ్ల సమస్య రావచ్చు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే..  ఒక సంవత్సరం లోపు పిల్లలకు బొప్పాయి హానికరం.                                 ◆నిశ్శబ్ద.