చలికాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్య ఇదే..

Publish Date:Oct 19, 2023

Advertisement

ఇప్పటిదాకా ఎండలు ఏమాత్రం తగ్గకుండా వేసవిని తలపిస్తున్నా శరత్కాల ప్రభావం వల్ల క్రమంగా చలి పెరుగుతుంది. సాధారణంగానే అక్టోబర్ నెలలో వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. క్రమంగా ఉదయం, సాయంత్రం సమయాలలో చలి ఎక్కువ అవుతుంది. ఈ సీజన్ లో ఇన్ఫ్లూయెంజా వంటి వైరల్ లు పెరగడంతో పాటు మైగ్రేన్ సమస్య కూడా పెరిగే ప్రమాదం ఉంది. మైగ్రేన్ అనేది మొండి తలనొప్పి. ఇది వచ్చిందంటే బాధితులను చాలా దారుణంగా హింసిస్తుంది. అసలు మైగ్రేన్ కు చలికి ఉన్న సమస్య ఏంటి? చలికాలంలో దీనికి చెక్ పెట్టడానికి ఏం చెయ్యాలి? పూర్తీగా తెలుసుకుంటే..

మైగ్రేన్ సమస్య ఉన్నవారు చలికాలంలో ఈ సమస్యను మరింత ఎక్కువగా ఎదుర్కొంటారు. ఈ సీజన్ లో గాలి పొడిగా ఉండటం, విపరీతమైన చలి కారణంగా మైగ్రేన్ వస్తుంది. సూర్యరశ్మి తగినంత లేకపోయినా మైగ్రేన్ వస్తుంది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల మెదడులో సెరోటోనిన్ వంటి రసాయనాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది తలనొప్పి, మెగ్రేన్ వంటి సమస్యలు పెంచుతుంది.  సూర్యరశ్మి లేకపోవడం వల్ల సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలుగుతుంది. ఇది అంతర్గత నిద్ర గడియారం. ఇది అసమతుల్యతకు గురికావడం వల్ల నిద్రలేమి, తద్వారా తలనొప్పి, మైగ్రేన్ కు దారితీస్తుంది.

కేవలం సూర్యరశ్మి మాత్రమే కాకుండా ధూమపానం, మద్యపానం, కెఫిన్ పానీయాలు తీసుకోవడం, అధికంగా వెలుగు కలిగిన, మెరుస్తున్న లైట్లముందు, ఘాడత కలిగిన వాసనల మధ్య ఉండటం కూడా మైగ్రేన్ కు కారణం అవుతాయి.

మైగ్రేన్ ఎలా నివారించాలంటే..

చలి భరించలేని వారు, చాలా సున్నితమైనవారు మైగ్రేన్ బారిన తొందరగా పడతారు. శీతాకాలంలో వీరు మైగ్రేన్ బారిన పడే అవకాశం ఎక్కువ.  మైగ్రేన్ ను నివారించడానికి చలికి లోనుకాకుండా ఉండటం ముఖ్యం. వ్యాయామం శరీరంలో వేడి పుట్టిస్తుంది. కాబట్టి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం సెరటోనిన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే చలికాలపు జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. వేడి నీరు, వేడి ఆహారం, వెచ్చని వాతావరణం, ఆరోగ్యాన్ని కాపాడతాయి. మైగ్రేన్ ను దూరంగా ఉంచుతాయి.

                                               *నిశ్శబ్ద. 

By
en-us Political News

  
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.