రఫేల్ అంపైరింగ్‌లో ఇండియా గెలవడం కష్టమే అంటున్న అశ్విన్
Publish Date:Jul 14, 2025
Advertisement
ఇండియా, ఇంగ్లాండ్ మూడో టెస్టు రసవత్తరంగా మారింది. ఇండియా విజయం సాధించాలంటే చివరి రోజు ఆటలో 135 పరుగులు చేస్తు చాలు. చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. అద్భుత ఫామ్ లో ఉన్న రాహుల్ క్రీజ్ లో ఉన్నాడు. ఫామ్ కొనసాగిస్తున్న రిషభ్ పంత్, సిరీస్ లో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలతో చెలరేగిన జడేజా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. పరిస్థితులలో టీమ్ ఇండియా విజయం నల్లేరు మీద బండినడే అని ఎవరైనా భావిస్తారు. అయితే టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, స్టార్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ మాత్రం ఇండియా విజయం సాధించడం అంత వీజీకాదు.. చాలా చాలా కష్టం అంటున్నాడు. అందుకు ఇంగ్లాండ్ బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్, కచ్చితత్వంతో కూడుకున్న బౌలింగ్ ఇవేవీ కారణం కాదంటున్నారు. ఇంతకీ టీమ్ ఇండియాకు విజయం ఎందుకు కష్టమంటే.. ఈ మ్యాచ్ లో అంపైరింగ్ చేస్తున్న పౌల్ రఫేద్ వ్యవహరిస్తున్న తీరు కారణమంటున్నాడు. నిజమే మూడో టెస్టులో రఫేల్ అంపైరింగ్, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. రఫేల్ ఉద్దేశపూర్వకంగా ఇంగ్లాండ్‌కు సహకరిస్తున్నారని టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలే అందుకు ప్రత్యక్ష నిదర్శనగా నిలుస్తున్నాయి. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్న టీమ్ ఇండియా, ఇంగ్లండ జట్లు మూడో టెస్ట్ మ్యాచ్‌ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి . దీంతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగాలకు గురవుతున్నారు. కాగా.. తాజా మ్యాచ్‌లో అంపైర్ పౌల్ రఫెల్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా ఉంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అవుట్ విషయంలో రఫెల్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సిరాజ్ బౌలింగ్‌లో బంతి నేరుగా వెళ్లి స్టోక్స్ ప్యాడ్స్‌ను తాకింది. అప్పీల్ చేయగా రఫెల్ నాటౌట్ అని ప్రకటించాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు డీఆర్‌ఎస్ తీసుకున్నారు. అయితే రివ్యూలో అంపైర్స్ కాల్ ప్రకారం నాటౌట్ అని ప్రకటించారు. ఈ విషయంపై మాజీ ఆటగాడు ఆశ్విన్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంపైర్ రఫెల్‌పై ఆరోపణలు చేశాడు. రఫెల్ అంపైరింగ్ చేస్తున్న మ్యాచ్‌లో గెలవడం టీమిండియాకు కాస్త కష్టమేనని వ్యాఖ్యానించాడు. 'పౌల్ రఫెల్‌తో నాకున్న అనుభవం ప్రకారం ఎప్పుడూ అతడితో వాదిస్తూ ఉండాలి. టీమిండియా బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడికి ఏదైనా నాటౌట్‌లాగానే కనిపిస్తుంది. అదే టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఏదైనా అవుట్‌లా అనిపిస్తుంది. ఇతర జట్లతో కూడా రఫెల్ ఇలాగే వ్యవహరిస్తున్నాడో, లేదో తెలియదు. ఈ విషయంపై ఐసీసీ ఒకసారి దృష్టి సారించాలి. పౌల్ రఫెల్ మైదానంలో ఉంటే ఇండియా గెలవదు అని మా నాన్న అంటుంటారు' అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించాడు.
http://www.teluguone.com/news/content/team-india-win-difficult-under-rafel-umpiring-25-201965.html





