విద్యార్థినిని గర్భిణీని చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్
Publish Date:Dec 7, 2025
Advertisement
విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు. ఘటన తిరుపతి నేషనల్ సంస్కృతి యూనివర్సిటీలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ లక్ష్మణ్ విద్యార్థినితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరిచిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. వేధింపులు తాళలేక బాధిత విద్యార్థిని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌కి ఫిర్యాదు చేసి యూనివర్శిటీ నుంచి ఇంటికి వెళ్లిపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేయడానికి యూనివర్సిటీ స్టాఫ్ వెళ్లగా బాధిత విద్యార్థినిని ఫిర్యాదు చేయమని పోలీసులు సూచించారు. కానీ ఆ విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒడిశాకు వెళ్లిపోయింది. ఈ పాడుపనికి పాల్పడిన లక్ష్మణ్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/professor-impregnated-student-36-210628.html





