ఏపీలో మూడో సంతానానికి రూ.25 వేలు ప్రోత్సాహకం : సీఎం చంద్రబాబు

Publish Date:Mar 5, 2026

Advertisement

 

మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యం అవుతుందని సీఎం చంద్రబాబు  అన్నారు. ఇన్నాళ్లూ ఫ్యామిలీ ప్లానింగ్‌కి ప్రాధాన్యత ఇచ్చామని, ఇకపై ‘పాపులేషన్ కేర్’ పై దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జనాభా నిర్వహణ పై డ్రాఫ్ట్ పాలసీపై శాసనసభలో గురువారం ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.  ఏపీలో ప్రస్తుతం టోటల్ ఫెర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) 1.5గా ఉందని, దీనిని 2.1కి పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాల్లో ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోందని, భారతదేశంలోనూ, ముఖ్యంగా ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొందని సీఎం అన్నారు. 

1992-93లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీఎఫ్ఆర్ 3.0గా ఉండేదని గుర్తు చేశారు. టీఎఫ్ఆర్ మరింత వేగంగా తగ్గితే వర్క్ ఫోర్స్ పడిపోతుందని... దీంతో ఆర్థిక వృద్ధి మందగిస్తుందని చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మరింత నష్టం వాటిల్లుతుందనే ఆలోచనతో ఈ డ్రాఫ్ట్ పాలసీకి రూపకల్పన చేశామని వివరించారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో కేవలం ఏడాదికి 6.70 లక్షల జననాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇది ఇలాగే కొనసాగితే 2047 నాటికి రాష్ట్ర జనాభాలో 23 శాతం మంది వృద్ధులే ఉంటారని చెప్పారు. ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్’ పాలసీ డాక్యుమెంట్ అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌లో పెడుతున్నట్టు సీఎం ప్రకటించారు.

 దీనిపై రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో నెల రోజుల పాటు ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఈ అంశంపై చర్చ నిర్వహించాలని  ముఖ్యమంత్రి సూచించారు. ప్రతీ నెల నాలుగో శనివారం జనాభా నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీకి తుది రూపు ఇచ్చి, ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామన్నారు. ఏడాది తర్వాత ఫలితాలు పరిశీలించి పాలసీలో మార్పులు చేర్పులు చేస్తామని  వెల్లడించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ అనేది పాపులేషన్ మేనేజ్‌మెంట్‌తోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని ఈ ఐదు పాపులేషన్ మేనేజ్‌మెంట్‌కు మూలస్తంభాలన్నారు. 

మహిళల వర్క్ ఫోర్స్‌ పెరిగితే జీఎస్డీపీ వృద్ధి 

ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘మహిళల వర్క్ ఫోర్స్ ప్రస్తుతం కేవలం 31 శాతం మాత్రమే ఉంది. ఇది 59 శాతాన్ని చేరుకుంటే రాష్ట్ర జీఎస్డీపీ 15 శాతం పెరుగుతుంది. గర్భధారణ నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి జీవిత దశలోనూ ప్రభుత్వ మద్దతు ఉంటుంది. పిల్లలు లేక, ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతిస్తాం. మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వాసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలు పీపీపీ విధానంలో అందిస్తాం. సిజేరియన్లు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే, ప్రస్తుతం 8.8 శాతం ఉన్న టీనేజ్ గర్భధారణలను 3 శాతం లోపు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 50 మంది చిన్నారులు, మహిళలు ఒక ప్రాంతంలో ఉంటే చైల్డ్ కేర్ సెంటర్లు, పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాం. షి క్యాబ్‌లు అందుబాటులోకి తెస్తాం. విశాఖపట్నంలో రూ.172 కోట్లతో వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌ నిర్మాణం చేపట్టాం. 

ఏ ప్రాంతంలో మహిళా ఉద్యోగులు పనిచేస్తారో అక్కడ కొత్తగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మూడో సంతానం, ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్ - తండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం. మూడో సంతానానికి ‘పోషణ-శిక్షా-సురక్ష’ ప్యాకేజ్ ఇస్తాం. మూడో సంతానానికి డెలివరీ సమయంలో రూ.25,000 ప్రోత్సాహకంగా ఇవ్వడంతో పాటు 5 సంవత్సరాల పాటు నెలకు పోషణ కింద రూ.1,000 సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తాం. త్వరలో ‘తల్లి దండ్రుల సమాన బాధ్యత’ పేరుతో కుటుంబ బాధ్యతలు పంచుకోవడంపై అవగాహన క్యాంపెయిన్ చేపడతాం. చైల్డ్ కేర్టేకర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చంద్రబాబు అన్నారు. 
 

By
en-us Political News

  
అది గరిష్టంగా 20 సంవత్సరాల పాటు లేదా సదరు వ్యక్తికి 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగి, లైసెన్స్‌ను ప్రతి ఐదు లేదా పదేళ్లకు ఒకసారి రీన్యూవల్ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికి.. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్రం సరికొత్త యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే డ్రైవింగ్ లైసెన్స్ గడువును ఏకంగా వాహనదారుడికి 50 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు పొడిగించేలా మార్పు తీసుకురావాలని భావిస్తోంది.
తమ ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు సుమారు రూ.1.5 కోట్ల నగదు, పలు స్థలాలకు సంబంధించిన పత్రాలను కోడలు బంధువులు తీసుకెళ్లారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి గురించి ప్రశ్నించగా ఓ రౌడీషీటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాడుల సమయంలో ఆయన నివాసంలో సుమారు 60 లక్షల రూపాయల నగదు లభించగా.. బ్యాంక్ ఖాతాల్లో మరో కోటి అరవై లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు.ఇక బంగారం విషయానికి వస్తే దాదాపు రెండున్నర కిలోల బంగారు బిస్కెట్లు.. అలాగే పెద్ద మొత్తంలో బంగారు ఆభర ణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కిలోల కొద్దీ వెండి వస్తువులు కూడా దొరికినట్లు సమాచారం.
ఇటీవల లూసియానా రాష్ట్రంలోని ఓ సరస్సులో జరిగిన ప్రమాదంలో తన స్నేహి తులు చిక్కుకున్న సమయంలో వారిని కాపాడే ప్రయత్నంలో నీటిలోకి దిగిన అనురూప్ రెడ్డి, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పలువురు హృద యాలను కదిలించివేసింది
నగరంలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యంచెప్పారు. మంత్రి లోకేష్ వెంట హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ఉన్నారు.
శరీర భాగాలైన తల, కాళ్లు, చేతులు లేకపోవడంతో తొలుత ఎటువంటి ఆధారాలు లభించ లేదు. అయితే మృతదేహం పై ఉన్న దుస్తులు కీలక క్లూగా మారాయి. ఆ దుస్తులు ఒక ప్రముఖ బ్రాండెడ్ కంపెనీకి చెందినవిగా గుర్తించిన పోలీసులు..దర్యాప్తులో భాగంగా ఆ దుస్తుల బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా.. అవి ఎక్కడ కొనుగోలు చేయబడ్డాయో గుర్తించారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన గ్యాస్ సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుండి 4 కి తగ్గిస్తూ కోత విధించింది. అసలు కారణం, సామాన్యులపై పడే ప్రభావం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రముఖ వ్యాపారి నివాసం ఉంటున్నారు. ఇంట్లో నేపాలీ దంపతులను పనిలోకి పెట్టుకున్నారు. నెల రోజుల క్రితమే ఈ నేపాల్ దంపతులను వ్యాపారి ఇంటి పనుల కోసం నియమించుకున్నారు కొద్దిరోజుల క్రితం వ్యాపారి తన కుటుంబ సభ్యుల తో కలిసి ముంబై కి వెళ్లి తిరిగి, ఇంటికి వచ్చిన సమయంలో నేపాలి దంప తులు ఇంట్లో కనిపించలేదు.
కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా క్రూ సభ్యులు ఒక్కసారిగా కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థ తకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై విమా నాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) సుమారు 20,000 మంది అభ్యర్థుల హైరింగ్ పరీక్షలను అకస్మాత్తుగా రద్దు చేసింది. ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌లో జరిగిన అక్రమాలే దీనికి కారణమా? ఫ్రెషర్ల ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్లలో ఎన్‌ఆర్‌ఐలు, ఓసీఐలు సెబీ రిజిస్ట్రేషన్ లేకుండానే భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆర్‌బీఐ కీలక సడలింపులు ఇచ్చింది. బడ్జెట్ 2026 పరిమితుల కంటే మరింత ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఐదేళ్లలో 690% మరియు పదేళ్లలో 1040% భారీ లాభాలను అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ గ్యాబ్రియేల్ ఇండియా (Gabriel India) పై మోతీలాల్ ఓస్వాల్ సానుకూల రేటింగ్ ఇచ్చింది. మరో 30% లాభాల అంచనాతో రూ. 1266 టార్గెట్ ధరను ప్రకటించింది. ఈ స్టాక్ పూర్తి వివరాలు, ఆర్థిక బలం మరియు భవిష్యత్తు వృద్ధి అంచనాలను ఇక్కడ చూడండి.
ఆర్‌బీఐ సరికొత్త డాలర్-రూపాయి స్వాప్ ఫెసిలిటీ నిర్ణయంతో నిఫ్టీ బ్యాంక్ పరుగులు పెడుతోంది. SBI, ICICI, IDFC ఫస్ట్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లలో భారీ లాభాలు రావడానికి గల అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.