‘జాతీయ అజెండా, ప్రాంతీయ జెండా’ ఇదే కేసేఆర్ యాత్రల అజెండా

Publish Date:May 27, 2022

Advertisement

మరో రెండు మూడు నెలలు ఆగండి, మీకో సంచలన వార్త చెపుతా .. గురువారం  బెంగుళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మరో సంచలన ప్రకటన ఇది. 

ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “జాతీయస్థాయిలో మార్పు రాబోతోంది.. దాన్ని ఎవరూ ఆపలేరు. రెండు మూడు నెలల తర్వాత మీకు సంచలన వార్త అందుతుంది” అని మీడియాకు చెప్పారు.అయితే ఆ సంచలన ప్రకటన ఏమిటో, ఆయన మనసులో ఏముందో మాత్రం ఆయన బయట పెట్టలేదు. కానీ, ఆయన బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన తర్వాత, కుమార స్వామి అసలు గుట్టు విప్పేశారు. అదేమంటే, వడ్ల గినజలో బియ్యపు గింజ...

కేసీఆర్ చాలా కాలంగా చెపుతున్న ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు ముచ్చటే, ఆ ‘సంచలన’ వార్తని కుమార స్వామి చెప్పారు.  “ప్రాంతీయ పార్టీలన్నీ విబేధాలను పక్కనపెట్టి జాతీయ ప్రయోజనాల రీత్యా ఏకతాటిపైకి వచ్చేస్తాయి, కేసీఆర్‌ చొరవతో భారత భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి” అని కుమార స్వామి చెప్పు కొచ్చారు. అందుకు ఆయన ముహూర్తం కూడా ఖరారు చేశారు. దేశమంతా విజయదశమి జరుపుకొనే రోజుల్లోనే విజయవంతమయ్యే సంచలన ప్రకటన రానుందని కుమారస్వామి అన్నారు. 

అయితే ఇదేమన్నా కొత్త ప్రకటనా అంటే కాదు, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కేసీఆర్ ఇదే చెపుతున్నారు. అంతే కాదు, అయన తాను స్వయంగా  చెప్పిన ఫ్రంట్ ఏర్పాటును ఆయనే, ఫ్రంటూ లేదు టెంటు లేదంటూ ఖండించారు. నిజానికి, జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక గురించి ముఖ్యమంత్రి కేసీఆర్’కు కూడా స్పష్టత లేదని, అయన ప్రకటనలే సూచిస్తున్నాయి.  అదలా ఉంటే గత ఐదారు  నెలలుగా జాతీయ రాజకీయాల పై దృష్టి కేంద్రీకరించైనా కేసీఆర్ , దేశవ్యాప్త రాజకీయ యాత్రలు చేస్తున్నారు, అయితే, ఎందుకనో గానీ, ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఏదో ఒక అపశకునం అనాలో ఇంకేమనాలో కానీ ,అనుకున్న యాత్ర అనుకున్నట్లు సాగడం లేదు.

గత వారం ఢిల్లీ వెళ్ళిన సమయంలో ఆయన అక్కడినుంచి అటే పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక మీదుగా మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి, షిర్డీ వెళ్లి  అన్నా హజారే, షిర్డీ సాయిబాబాలను దర్శించుకుని, 28 తేదీకి గానీ హైదరాబాద్ తిరిగి రారని అన్నారు. కానీ, ఈ యాత్రలో, ఒకటికి రెండు బ్రేకులు పడ్డాయి. ఢిల్లీ టూర్’కు సంబంధించి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండాల్సింది. అటు తర్వాత బెంగళూరు, రాలేగావ్ సిద్ధి, షిర్డీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ, రెండు రోజుల ముందుగా మే 23నే ఆయన  అకస్మాత్తుగా హైదరాబద్ తిరిగి వచ్చారు.

ఇప్పుడు మళ్ళీ గురువారం ( మే 26) ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలోనే, బెంగుళూరు వెళ్లారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బెంగళూరు నుంచి ఆయన శుక్రవారం (మే 27న) మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దికి వెళ్లి, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలవవలసి ఉంది. ఆపై శిరిడీలో సాయిబాబాను దర్శించుకొని హైదరాబాద్ తిరిగిరావాల్సిఉంది. కానీ కేసీఆర్ అనూహ్యంగా బెంగళూరు పర్యటన ముగియగానే నేరుగా హైదరాబాద్ తిరిగొచ్చారు. 

నిజానికి, జాతీయ రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ ప్రయాణం సాఫీగా సాగడం లేదు. ఢిల్లీకి ముందే, తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలు పర్యటించి, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఎన్సీపీ అదినేత పవార్ వంటి సీనియర్ నాయకులను కలిసి  కాంగ్రెస్ యేతర, బీజేపీ యేతర ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించి వచ్చారు.

అయితే, ఆ చర్చలు ఏవీ ఫలించలేదు. కాంగ్రెస్ ’చేయి’ వదిలేది లేదని పవార్ నుంచి స్టాలిన్ వరకు అందరూ స్పష్టం చేయడంతో, కేసీఆర్ స్వరం  మార్చి మరో రూట్’లో వెళుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితిలో కేసీఆర్ ఆశిస్తున్నట్లుగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావడం అయ్యే పనేనా  అంటే, రాజకీయ విశ్లేషకులు, 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు ఏకం కావడం అయ్యే పని కాదనే అంటున్నారు.అయితే, కేసీఆర్’కు ఈవిషయం తెలియదా అంటే, తెలియదాని కాదు, కానీ, లోక్ సభ ఎన్నికలకంటే ముందు వచ్చే అసెంబ్లీ ఎన్నికల గండం గట్టేక్కే ఎత్తుగడలో భాగంగానే ఆయన. 2018లో ప్లే చేసిన ట్రిక్’నే మళ్ళీ మరోమారు ప్లే చేస్తున్నారని, అంటున్నారు. అందుకే కేసీఆర్ ప్రస్తుత రాజకీయాని, ‘జాతీయ అజెండా,  ప్రాంతీయ జెండా’ గా పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కా ల్పుల్లో 8 మంది మావోయిస్టులు నేలకొరిగారు.
​వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమి లేదు. రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్టి అప్పుల‌పాలు చేసి ప్ర‌జ‌ల నెత్తిమీద భారం మోపాడు. 
జగన్ పాలనలో ప్రజలకు జీఎస్టీతో పాటు జీ టాక్స్ భారం పడిందని విజయవాడ లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆర్యవైశ్యులతో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఖిల భారత సర్వీసులలో నియామకాల  కోసం ప్రతి  యేటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌చివాల‌యానికి రాకుండా..తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాడ‌ని...ఈ ఐదేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎక్క‌డా అభివృద్ది జ‌ర‌గ‌లేదు అంతా శూన్యమ‌ని టిడిపి విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ది కేశినేని శివ‌నాథ్ సోద‌రి కేశినేని శ్రీదేవి అన్నారు.
తెలంగాణలో ముక్కోడిని  ఇంటికి పంపించేశాం.. ఆంధ్రప్రదేశ్‌లో తిక్కోడు కూడా ఇంటికి పోతాడు
పదేళ్ల పాటు తెలంగాణలో  చక్రం తిప్పిన బిఆర్ఎస్  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ ఇల్లు లేదా ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. ఓటమి నుంచి తేరుకోకమునుపే కూతురు కవిత తీహార్ సెంట్రల్ జైలులో ఊచలు లెక్కపెట్టడం కెసీఆర్ ను కలచివేసింది.
ఒక్క ఛాన్స్ అంటూ మాయ మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మాట త‌ప్పాడు. ఐదేళ్ల‌లో ద‌శ‌ల వారీగా రాష్ట్రంలో మ‌ధ్య‌పాన నిషేధం చేస్తాన్న జ‌గ‌న్ ఆ మాట మ‌ర్చిపోయాడు. ఇచ్చిన మాట‌ను తప్పిన జ‌గ‌న్ కి నైతికంగా ప్ర‌జ‌ల‌ను ఓటు అడిగే హ‌క్కులేద‌ని తెలుగుదేశం విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ అన్నారు.
గత నెల రోజుల క్రితం అరెస్ట్ అయిన మాజీ సి ఎం  కెసీఆర్ కూతురు కవితకు బెయిల్ ఇప్పట్లో లభించేలా లేదు.
అదీ విషయం.. కోడికత్తి-2 కేసు అలియాస్ గులకరాయి దాడి కేసు తుస్సుమని, అటక ఎక్కే దారిలో పయనిస్తోంది. గత ఎన్నికల సందర్భంలో
సికింద్రాబాబ్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోలాహ‌లం తార స్థాయికి చేరింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. గ‌త ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు ఓటు ద్వారా జగన్ సర్కార్ కు బుద్ధి చెప్పేందుకు రెడీ అయిపోయారు.
నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్- పీజీ) 2024 రిజిస్ట్రేషన్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది.  ఈ ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) చేపట్టనుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) అధికారిక వెబ్ సైట్ natboard.edu.in లింక్ ను ఓపెన్ చేయాలి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.