వాళ్లది ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్...మనది ఫైటర్ జెట్ బ్యాగ్రౌండ్ : లోకేష్

Publish Date:May 15, 2026

Advertisement

 

వాళ్లది కిడ్నాప్ బ్యాగ్రౌండ్...మనది కియా బ్యాగ్రౌండ్.. 

"బోత్ ఆర్ నాట్" దా "సేమ్ అంటూ" వైసీపీపై లోకేశ్ సైటైర్లు.. 

ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. కియా పరిశ్రమ నుంచి ఫైటర్‌ జెట్‌ తయారీ సంస్థల వరకు ఏపీకి తీసుకురావడంలో ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషించారని తెలిపారు. లోకేశ్ వైసీపీకి పంచ్ ఇచ్చారు. వాళ్లది ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్..మనది ఫైటర్ జెట్ బ్యాగ్రౌండ్, వాళ్లది కిడ్నాప్ బ్యాగ్రౌండ్...మనది కియా బ్యాగ్రౌండ్, బోత్ ఆర్ నాట్ దా సేమ్ అంటూ మామయ్య బాలయ్య స్టైల్‌లో ఫినింగ్ టచ్ ఇచ్చారు. అర్ధమైందా రాజా! అంటూ లోకేశ్ సైటైర్లు వేశారు. 

ఉమ్మడి అనంతపురం జిల్లా పారిశ్రామిక ప్రగతిలో మరో చారిత్రాత్మక మైలురాయి ఆవిష్కృతమైంది. రాబోయే రోజుల్లో దేశ రక్షణ రంగానికే ఈ ప్రాంతం ఒక ప్రధాన కేంద్రంగా మారబోతోందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐదో తరం ‘అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్’ (AMCA) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో కలిసి మంత్రి లోకేశ్ పుట్టపర్తిలో జరిగిన భూమిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు కూటమికి కట్టబెట్టిన అఖండ విజయానికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న అపురూపమైన ‘రిటర్న్ గిఫ్ట్’ ఈ భారీ ప్రాజెక్టు అని అభివర్ణించారు.

గతంలో కరవు కాటకాలతో అల్లాడిన అనంత నేలపై కియా మోటార్స్ వంటి అంతర్జాతీయ కార్ల పరిశ్రమను తీసుకొచ్చి ఇక్కడి యువతకు ఉపాధి కల్పించిన విజనరీ చంద్రబాబు అని లోకేశ్ కొనియాడారు. ఇప్పుడు అదే గడ్డపై నుంచి దేశ రక్షణకు ఉపయోగపడే అత్యాధునిక యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరబోతున్నాయని, ఈ ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడుల ‘నమో జోడి’ కాంబినేషన్ కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ లాగా కాకుండా, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్‌లా దూసుకుపోతోందని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ శక్తివంతమైన కలయిక వల్లే గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్ పెట్టుబడులతో పాటు ఇప్పుడు లక్ష కోట్ల రూపాయల విలువైన ఏఎంసీఏ ప్రాజెక్టు రాష్ట్రానికి సాధ్యమైందని వివరించారు. పోలవరం, అమరావతి రాజధాని నిధుల సాధనతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ సంరక్షణ, రైల్వే జోన్ ఏర్పాటు వంటి కీలక అంశాలు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే సాకారమవుతున్నాయన్నారు.

డీఆర్‌డీఓ, ఏడీఏ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్  వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ రక్షణ సంస్థల భాగస్వామ్యంతో పుట్టపర్తిలో ఈ 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ యూనిట్ రూపుదిద్దుకోనుంది. దీనితో పాటు భారత్ ఫోర్జ్, భారత్ డైనమిక్స్ వంటి అనేక అనుబంధ రక్షణ రంగ దిగ్గజ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఈ బృహత్తర ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు వేల సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఒకే ఒక్క కియా పరిశ్రమ రాకతో అనంతపురం ఆర్థిక రూపురేఖలు మారాయని, ఇప్పుడు ఏఎంసీఏ రాకతో ఈ జిల్లా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానానికి చేరుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఈ ప్రాజెక్ట్ సాధన కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టారని గుర్తుచేశారు.

ఇదే సమయంలో ప్రతిపక్షాల తీరుపై లోకేశ్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. కొందరిది ఫ్యాక్షన్, కిడ్నాపుల నేపథ్యమైతే.. తమ ప్రభుత్వానిది మాత్రం కియా కార్లు, ఫైటర్ జెట్ల అభివృద్ధే ఏకైక ఎజెండా అని చురకలంటించారు. ఆంధ్రప్రదేశ్‌ను రక్షణ రంగ హబ్‌గా మార్చేందుకు ఇంతటి భారీ ప్రాజెక్టును మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రాష్ట్ర ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాబోయే రోజుల్లో ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసుకుని, స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ రాయలసీమను పారిశ్రామికంగా మరింత ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
ప్రస్తుతం జగన్ కారణంగా ఏపీ అంతటా రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్.. ఆ కుటుంబ చరిత్ర, వారి రక్తసిక్త రాజకీయ విధానాలు
కాలినడకన తిరుమల కొండ ఎక్కిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
తెలంగాణలో ప్రీపెయిడ్ మీటర్ల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది
నారాయణఖేడ్‌లో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఎవరెస్టు శిఖరాన్ని అధి రోహించి తిరిగి దిగివస్తున్న సమయంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు
బెంగళూరు నగరం ఐటీ రంగానికి, స్టార్టప్‌లకు ఎంత ప్రసిద్ధి చెందిందో, అక్కడి ట్రాఫిక్ కష్టాలకు కూడా అంతే పేరుగాంచింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ డి. జోయల్ డేవిస్ వెల్లడించారు
హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.
తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
మానవత్వానికి, సాయం చేసే గుణానికి వయసుతో అస్సలు సంబంధం లేదని నిరూపించింది
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి బైక్ రేసర్ల ఆగడాలు పెరుగుతున్నాయి వీకెండ్ వచ్చిందంటే చాలు అర్ధరాత్రి వేళ యువకులు కార్లు, బైకులతో రోడ్లపైకి దిగి స్పీడ్ షోలు చేస్తూ హల్‌చల్ సృష్టిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.