ఫార్ములా ఈ రేస్ తో పాటు.. కాళేశ్వరం కేసులోనూ కదలిక?
Publish Date:Nov 20, 2025
Advertisement
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే బీఆర్ఎస్, బీజేపీలపై గుప్పించిన ఆరోపణల్లో ప్రధానమైంది ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతించడం లేదన్నదే. దానితో పాటు కాళేశ్వరం అక్రమాల కేసును సీబీఐకి అప్పగించినా ఫలితంల లేకపోయిందని కూడా రేవంత్ ఆరోపణలకు గుప్పించారు. ఈ విధంగా రేవంత్ బీజేపీ బీఆర్ఎస్ నేతలకు అండగా నిలుస్తోందన్న విమర్శలు చేశారు. ఈ కార్ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగిందని దర్యాప్తులో తెలిందని అధికారులు చెబుతుంటే.. కేటీఆర్ మాత్రం ఇది ఒక లొట్టపీసు కేసు అంటే కొట్టిపారేశారు. ఇక ఇప్పుడు విషయమేంటంటే.. విచారణలో కూడా కేటీఆర్ ఇదే చెబుతారా? ఆ విషయం పక్కన పెడితే కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం అంటే.. కేటీఆర్ కు కష్టకాలం మొదలయ్యిందనే చెప్పాలంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరై ఉన్న కేటీఆర్ ఇప్పుడు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తారన్నది పార్టీ శ్రేణుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది. కేటీఆర్ లొట్టపీసు కేసుగా కొట్టిపారేస్తున్న ఫార్ములా ఈకార్ కేసులోనే కదలిక ప్రారంభమైందంటే.. కాళేశ్వరం కేసు పరిస్థితి ఏంటి? దీనిపైనా సీబీఐ ఎంక్వయిరీ మొదలవుతుందా? అంటూ రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సాధారణ ఈఈలే అందిన కాడికి దోచుకుని వందల వేల కోట్లకు పడగలెత్తిన విధం కళ్లకు కట్టింది. వీరు ఏసీబీ వలలో చిక్కిన అతి పెద్ద తిమింగళాలుగా వార్తలకెక్కారు. ఇప్పుడు సీబీఐ ఎంక్వయిరీ మొదలైతే.. ఆ తిమింగళాలకే గాడ్ ఫాదర్లు ఎంత తిన్నారన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తాయంటున్నారు. గతంలో కవితను అరెస్టు చేయకుంటే బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరు అన్న కోణంలో కొండా విశ్వేశ్వరెడ్డి చేసిన కామెంట్లు.. తర్వాతి కాలంలో ఫలితాల రూపంలో రుజువయ్యాయి. అప్పటి వరకూ రెండో స్థానంలో ఉన్న బీజేపీ కాస్తా.. మూడో స్థానానికి పడి పోయింది. నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ విషయం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక ఇప్పడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రేవంత్ కూడా కేంద్రంలోని కమలం పార్టీకి బీఆర్ఎస్ కి బీటీమ్ అంటూ టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడం.. ఈ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడంతో.. కమలనాథులలో కదలిక వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే జూబ్లీ ఉప ఎన్నిక ఫలితం వెలువడగానే కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం లభించిందని అంచనా వేస్తున్నారు. ఇక కాళేశ్వరం దర్యాప్తును సీబీఐ చేపట్టేందుకు కూడా ఎక్కువ కాలం పట్టకపోవచ్చునని చెబతున్నారు.
అయితే ఇప్పుడు గవర్నర్ కేసీఆర్ ప్రాసిక్యేషన్ కు అనుమతి ఇవ్వడంతో.. కాళేశ్వరం కేసు విషయంలో కూడా కదలిక వస్తుందా అన్న చర్చకు తెరలేచింది.
http://www.teluguone.com/news/content/movement-in-kaleswaram-along-with-farmula-ecar-case-45-209841.html





