గుంటూరు జిల్లా కాంగ్రెస్ సమావేశం రచ్చ రచ్చ

Publish Date:Mar 31, 2013

Advertisement

 

 

 

 

గుంటూరులో జరిగిన డీసీసీ సమావేశం ఒక్కసారిగా రసాభాసాగా మారింది. తమ సోదరుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ముప్పయ్యేళ్లుగా కాంగ్రెసు పార్టీలో ఉండి సేవ చేస్తే ఆయనను జైలులో పెడతారా? అంటూ ఆయన తమ్ముడు మోపిదేవి హరినాథ్ తీవ్రంగా మండిపడ్డారు.

 

డిసిసి సమావేశంలో ఎవరి సమస్యలు వారు చెబుతున్నారు. ఈ సందర్భంగా మోపిదేవి హరినాథ్ లేచి తన సోదరుడు కాంగ్రెసు పార్టీ కోసం కష్టపడ్డారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు జైలులో ఉంటే ఎవరు స్పందించరా? అని సమావేశంలో నిలదీశారు. నాటి జివోలతో సంబంధమున్న మంత్రులను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తన సోదరుడు ఒక్కడినే ఎందుకు బలి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. జిల్లాలో ఇద్దరు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ జిల్లాకు చెందిన నేత అకారణంగా జైలులో ఉంటే పట్టించుకోరా అని నిలదీశారు. ఆయనను బయటకు తీసుకు వచ్చేందుకు అందరం కలిసి కిరణ్ కుమార్ రెడ్డిని కలవాలని ఆయన సూచించారు. పార్టీలో బిసిల పట్ల చిన్న చూపు కనిపిస్తోందన్నారు. హరినాథ్ ఆవేదన వ్యక్తం చేస్తుండగా కొందరు నేతలు ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో సమావేశాన్ని వాయిదా వేశారు.

By
en-us Political News

  
ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జనసేన నేత కొణిదెల నాగబాబు మధ్య ట్విట్టర్ వేదికగా ప్రాసలతో విమర్శలు పడుతున్నాయి. పంచ్ లు పేలుతున్నాయి. వీరి మధ్యలో అంబటిపై నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్, జనసేన శ్రేణులు, పవన్ ఫ్యాన్స్. వీరంతా తమ శైలిలో ట్వీట్ల వార్ రసవత్తరంగా కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు, సెటైర్లతో ఏపీలో పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేశారు. ఈ వార్ ప్రారంభించింది మంత్రి అంబటి రాంబాబు. వివాదానికి మూల కారణం చేనేత చాలెంజ్.
బీజేపీ, టీఆర్ ఎస్ ల మ‌ధ్య ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల ర‌భ‌స మ‌ళ్లీ త‌లెత్తింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌చారానికి టీఆర్ఎస్ మీద విరుచుకుప‌డ‌ట‌మే ప్ర‌ధాన అస్త్రంగా ఉప‌యోగించుకుంటు న్నారు.
పిల్లాడికి ముచ్చ‌ట‌ప‌డి పేరు పెడ‌తారు పెద్ద‌వాళ్లంతా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి. దానికి ముందో వెన‌కో ఆధుని క‌త్వం జోడిస్తూ మంచి పేరు పెట్టడానికే ప్ర‌య‌త్నిస్తారు. కుద‌ర‌క‌పోతే లోకంలో స‌ర్వ‌సాధార‌ణ మైన బాబీ, నిమ్మీ, విన్నూ.. ఎలాగూ ఉంటాయి. పేరు మార్చ‌డం, అలాగే ఉంచ‌డం త‌ల్లిదండ్రుల యి ష్టం. కానీ ఒక ప్ర‌భుత్వ ప‌థ‌కానికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మారుస్తానంటే ఎలా కుదురుతుంది? అదేమ‌న్నా స్వ‌ంత వ్య‌వహార‌మా. జగన్ సర్కార్ అంబేడ్కర్ విద్యానిథికి ప‌థ‌కానికి పేరు మార్చ‌డం సర్వత్రా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.
తెలుగు వన్ సంస్థల అధినేత కంఠంనేని రవిశంకర్ కుమార్తె జితేష్ణ వివాహం సాయిరామ్ సోహిల్ తో శనివారం(ఆగస్టు 13) సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
సహజ నటి జయసుధ వెండి తెర మీద.. దాదాపు ఐదు దశాబ్దాల పాటు.. వివిధ పాత్రల్లో అభిమానులను అలరించింది. అయితే ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా.. సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ ఆమెను తమ పార్టీలో చేర్చుకోవాలని కమలనాథులు.. ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ క్రమంలో ఇప్పటికే బీజేపీ జాయినింగ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ఈ సహజ నటితో భేటీ అయి.. పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ప్ర‌జాసంక్షేమ‌మే మా ప్ర‌భుత్వ ధ్యేయ‌మని ప్ర‌చారం చేసుకున్నంత మాత్రాన సంక్షేమం చేప‌డుతున్న‌ట్టు కాదు. నిజంగానే ప్ర‌జ‌ల సంక్షేమానికి త‌గిన ప‌థ‌కాల‌తో వారికి ఆస‌రాగా నిల‌వాలి. కేవ‌లం ప‌థ‌కాలు ప్ర‌క టించ‌డం, యాప్‌లు త‌యారుచేయించి ప్ర‌జ‌ల‌కు తాయిలాలుగా ఇవ్వ‌డం త‌ప్ప ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రత్యే కించి జ‌రుగుతున్న సంక్షేమ‌మేమీ లేద‌న్నది విశ్లేష‌కుల మాట‌.
తెలంగాణాలో మాత్రం కేసీఆర్ ప్ర‌భుత్వం ఎప్పుడు కూల‌బోతున్న‌దీ బీజేపీ వారు లోకానికి తెలియ‌జేసే గ‌డియా రాన్ని ఏ ర్పాటు చేశారు. గ‌తంలోనూ ఇలాంటి కార్య‌క్ర‌మం చేప‌ట్టి ఈసీ నుంచి మొట్టికాయ‌లు వేయించు కున్నారు.
కర్నాటకలో బొమ్మై ప్రభుత్వం ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో తెలియజేసే ఓ ఆడియో లీక్ అయ్యింది. కర్నాటక న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారానికి తెరతీశాయి.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై దర్యాప్తునకు సీబీఐ రంగంలోనికి దిగనుందా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అలాగే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. గోరంట్ల న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై జాతీయ రాజకీయాలలో కూడా దుమారం రేగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనదైన శైలిలో స్పందించారు. ఈ వీడియో వ్యవహారంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ చెబుతున్నవి సొల్లు కబుర్లు అని ఆమె అభివర్ణించారు. అతడు జిమ్‌లో ఉంటే తీశారన్నారని.. అయినా ఎవరిదండి ఆ జిమ్.. జిమ్‌లో బట్టలు లేకుండా ఉంటారా?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ఒక పక్కన అధికార వైసీపీ, మరో పక్కన ప్రతిపక్ష టీడీపీ, ఇంకో వైపున జనసేన, బీజేపీలు తమ తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంలో తలమునకలై ఉన్నాయి.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై విపక్షాలే కాకుండా, రాష్ట్ర ప్రజలు కూడా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ అశ్లీల వీడియో గోరంట్ల మాధవ్ దే అని తేలితే.. కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ వీడియోపై ప్రతిపక్ష టీడీపీ విమర్శల తీవ్రత పెంచింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఓ మిలియన్ మార్చ్ జరగబోతోంది. సెప్టెంబర్ ఒకటో తేదీన సీపీఎస్ ఉద్యోగులు. టీచర్లు ఈ మిలియన్ మార్చ్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్.అందుకు భిన్నంగా అవగాహన లేకుండా లేకుండా హామీ ఇచ్చానని చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.