Publish Date:May 26, 2025
చిత్తురు జిల్లా కుప్పం వచ్చి గత రెండురోజులుగా బిజీ బిజీగా ఉన్న రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ వీరాభిమానినని, శాంతిపురంలో టీకొట్టు నడపుతూ జీవనం సాగిస్తున్నాటీడీపీ వీరాభిమాని చెంగాచారికి కలిశారు. కుప్పం నుంచి కడప మహానాడుకు బయలుదేరిన యువనేత లోకేష్ సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా టీకొట్టు వద్దకు వెళ్లాడు. అన్నా... చాలా దూరం వెళ్లాలి... టీ ఇస్తావా అని అడిగాడు లోకేష్. చెంగాచారికి కొద్దిసేపు నోటమాట రాలేదు. తమ అభిమాననేత నేరుగా తమ కొట్టుకురావడంతో సంభ్రమాశ్చార్యానికి లోనయ్యాడు. యువనేత లోకేష్ కు టీ గ్లాసు అందించాడు.
వ్యాపారం ఎలా ఉందని అడగ్గా చెంగాచారి స్పందిస్తూ... సర్... నేను 1994 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నా. చంద్రబాబు గారంటే అభిమానం. నేను టిడిపికి చెందిన వాడినన్న కోపంతో గత అయిదేళ్లుగా నా టీ అంగడిని మూయించేశారు. గత ఏడాది జూన్ 12న చంద్రబాబు గారు సిఎంగా ప్రమాణ స్వీకారం చేశాక 17వతేదీ మళ్లీ టీకొట్టు ప్రారంభించా. నాకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒకబిడ్డకు పెళ్లయింది... మరో కూతురికి పెళ్లి చేయాలి. మీరు మా అంగడికి రావడం నమ్మలేక పోతున్నా చిన్నయ్యా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. చెంగాచారి భుజం తట్టిన యువనేత లోకేష్... ఇప్పుడు నువ్వు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. నీ వెంట నేనున్నా... ఏ అవసరమొచ్చినా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ముందుకు సాగారు. కార్యకర్తకు యువనేత లోకేష్ ఎంతటి ప్రాధాన్యత నిస్తారనడానికి ఇదొక మచ్చుతునక.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-nara-lokesh-25-198730.html
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.