తెలుగు రైతుపై కన్నడ కాంట్రాక్టర్ పైశాచికం

Publish Date:Feb 6, 2017

Advertisement

పరిహారం పెంచండి అన్న పాపానికి తెలుగురైతును గాలిలో వేలాడదీశాడు కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్. అసలు వివరాల్లోకి వెళితే..అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు అతి సమీపంలో ఉంటుంది. తుముకూరు జిల్లా మధుగిరి నుంచి పావగడకు ఓ హైటెన్షన్ లైను వేసే ప్రాజెక్ట్‌ను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది కర్ణాటక ప్రభుత్వం..ఈ నేపథ్యంలో దాని నిర్మాణం కోసం ఏపీ సరిహద్దు గ్రామాల మీదుగా 220 కేవీ టవర్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో మడకశిర మండలం మెళవాయి గ్రామ రైతు నబీరసూల్ పొలంలో కర్ణాటక విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా హైటెన్షన్ వైర్లు వెళుతున్న పొలాలకు చెందిన రైతులకు నష్టపరిహారం ప్రకటించారు.

 

 

అయితే నబీరసూల్ అనే రైతు తనకు తగిన నష్టపరిహారం దక్కలేదంటూ కుమారుడితో కలిసి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తగిన నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేయడానికి వీల్లేదంటూ తండ్రికొడుకులు ఇద్దరూ తీగలను పట్టుకున్నారు. ఈ దశలో కనీసం వారిని పట్టించుకోకుండానే జేసీబీతో వైర్లను లాగివేశారు.. దీంతో 15 అడుగుల ఎత్తు వరకు వైర్లను పట్టుకున్న తండ్రి ఇక శక్తి లేక వదిలివేయటంతో కింద పడిపోయాడు. అయితే కుమారుడు వన్నూర్‌సాబ్ మాత్రం తీగను పట్టుకుని 40 అడుగుల వరకు వెళ్లిపోయాడు..సుమారు 15 నిమిషాల పాటు గాల్లోనే వేళాడుతూ.."కాపాడండి..కాపాడండి" అంటూ ఆర్తనాదాలు చేసినా కర్ణాటక విద్యుత్ అధికారులు కానీ..కాంట్రాక్టర్ కానీ పట్టించుకున్న పాపాన పోలేదు.

 

అలా వేలాడి..వేలాడి కాసేపటికి అతను కూడా కిందపడిపోయాడు. అంత ఎత్తు నుంచి కింద పడటంతో అతని నడుముకు తీవ్ర గాయమైంది. వెంటనే స్పందించిన తోటి రైతులు వన్నూర్‌సాబ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాజెక్ట్ పని పూర్తయిన తర్వాత తీరిగ్గా సర్వే చేసి పరిహారం అందిస్తామని కాంట్రాక్టర్ ప్రతినిధులు చెప్పడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక విద్యుత్తు శాఖతో మాట్లాడి రైతులకు న్యాయమైన పరిహారం ఇప్పిస్తామని పల్లె హామీ ఇచ్చారు.

By
en-us Political News

  
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.