మోడీ కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాలు- పైపై విమర్శలతో జనం దృష్టి మళ్లించే యత్నాలు!

Publish Date:May 27, 2022

Advertisement

రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కానీ దొంగ శత్రువులు ఉంటారా అంటే మాత్రం కచ్చితంగా ఉంటారంటూ మోడీ, కేసీఆర్ లను చూపుతున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తే కేసీఆర్ నగరం విడిచి వెళ్లడం రాజకీయ కుమ్మక్కులో భాగమేనంటున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మోడీ నినాదాన్ని కేసీఆర్ అందిపుచ్చుకుని దానిని తెలంగాణకు అనుగుణంగా కాంగ్రెస్ ముక్త తెలంగాణగా సవరించుకున్నారని, ఆ లక్ష్యం సాధించేందుకే బీజేపీకి రాష్ట్రంలో లేని ప్రాధాన్యతకు కట్టబెడుతున్నారన్నది వారి విశ్లేషణ. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలం చెక్కు చెదరకపోవడం, నేతలు బలహీనపడినా కార్యకర్తల బలం తెలంగాణలో కాంగ్రెస్ కు ఎలా ఉన్నది అలాగే ఉండటాన్ని వారు ఎత్తి చూపుతున్నారు.  

ఈ నేపథ్యంలోనే రెండు ధఫాలు వరుసగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తీవ్రమైన యాంటీ ఇన్ కంబెన్సీని ఎదుర్కొంటోందనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మళ్ల కుండా ఉండాలంటే బీజేపీ బలోపేతం అయ్యిందన్న భావన ప్రజలలో కలిగించేందుకే ఆ పార్టీకి అధిక ప్రాధాన్యతను కేసీఆర్ ఇస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  కేంద్రం అవినీతి వైఫల్యాలపై కేసీఆర్ గళమెత్తడం, కేసీఆర్ కుటుంబ అవినీతిపై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించండం రెండు పార్టీల రాజకీయ నాటకంలో బాగమేనని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిజంగా కేసీఆర్ అవినీతి నిగ్గు తీయాలంటే ఎంత సేపని వారు ప్రశ్నిస్తున్నారు.

 తాజాగా కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిందనీ, అలాగే  జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావలసిందిగా  జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నో్టీసులు జారీ చేసింది.   తాజాగా మహారాష్ట్ర మంత్రి శివసేన నేత అనిల్‌ పరబ్‌ నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించి మనీలాండరింగ్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ దాడుల పరంపర కొనసాగుతుంటే ..   స్వయంగా మోడీయే కేసీఆర్ అవినీతి, ఆయన కుటుంబ దోపిడీపై విమర్శలు, ఆరోపణలు  గుప్పిస్తుంటే ఈడీ ఎందుకు దాడులు చేయడం లేదని, సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదనీ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మోడీ కేసీఆర్ పై విమర్శలు గుప్పించినా, కేసీఆర్ కేంద్రంపై, ప్రధానిపై ఆరోపణలు సంధించినా.. అదంతా రాజకీయ క్రీడలో భాగమే తప్ప నిజం కాదన్న సంగతిని బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.

తెలంగాణలో తెరాసకు, కేంద్రంలో బీజేపీకి నిజమైన ప్రత్యర్థి కాంగ్రెస్ అన్న అవగాహనతోనే కేసీఆర్, మోడీలు ఆ పార్టీని తగ్గించి చూపేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకే కేసీఆర్, మోడీ రాజకీయ ప్రత్యర్థులుగా ప్రజలకు బిల్డప్ ఇస్తున్నారని వారు అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం అన్న అంశం కూడా అంతిమంగా మోడీకి మేలు చేసేందుకేనని అంటున్నారు. మూడో ఫ్రంట్, కూటమి అంటూ కేసీఆర్ కలుస్తున్న ప్రాంతీయ పార్టీల రాజకీయ మూడ్ ఏమిటన్నది బీజేపీ అగ్రనాయకత్వానికి చేరవేసే వ్యూహంలో భాగమే కేసీఆర్ పర్యటనలని వారు విశ్లేషణలు చేస్తున్నారు. గురువారం తెలంగాణ పర్యటనలో భాగంగా మోడీ బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో కేసీఆర్ కుటుంబ అవినీతిపై చేసిన విమర్శలను  తెలంగాణ బీజేపీ నాయకలే సీరియస్ గా తీసుకోవడం లేదని ఆ పార్టీకి సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి. 

By
en-us Political News

  
ఆంద్రప్రదేశ్ లొ బిజెపి రూట్ మ్యాప్ మారినట్టు కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడవాల్సిన బిజెపి రూట్లో చిరు స్పీడ్ బ్రేకర్ నిలిచింది. అసలు బిజెపి ఏపీలో తానే మార్గ సూచి అని ఇంత కాలం చెప్పుకుంటూ వస్తున్న పవన్ కల్యాణ్ కు చిరు రూపంలో కమలం పార్టీ చెక్ పెట్టింది. చడీ చప్పుడూ లేకుండా మెగా స్టార్ ను తీసుకువచ్చి తెరముందు నిలిపింది. రాజకీయాల నుంచి తెర మరుగై పోయి వెండి తెరపై వెలుగొందితే చాలని అనుకుంటున్న చిరంజీవిని భీమవరంలో అల్లూరి సభకు ఆహ్వానించి మోడీతో వేదికపై కూర్చో పెట్టడం ద్వారా రాష్ట్రంలో కొత్త రాజకీయ చర్చకు తెరలేచింది.
ఆజాదీ కా అమృతోత్సవ్ లో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రాముఖ్యతను ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయం చేసేసింది. తెలుగు ఖ్యాతికి రాజకీయ మకిలి పట్టించిన ఘనతను సొంతం చేసుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోందన్న చందంగా ఎవరి దృష్టినీ ఆకర్షించని, ఎవరూ పట్టించుకోని కార్యక్రమంలా సాగింది. ప్రధాని మోడీ వచ్చి అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించినా అదేదో వైసీపీకి చెందిన సొంత వ్యవహారంగానే రాష్ట్ర ప్రజలు భావించారంటే ఆ తప్పు జగన్ సర్కార్ దేనని పరిశీలకులు అంటున్నారు.
బీజేపీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించిందనడానికి హైదరాబాద్ వేదికగా జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిదర్శనంగా నిలిచాయి. దక్షిణాది రాష్ట్రాలలో పడుతూనో, లేస్తూనో కర్నాటకలో బీజేపీ కాలూనగలిగింది. ఆ రాష్ట్రం వినా బీజేపీకి దక్షిణాదిలో పెద్దగా పట్టు లేదనే చెప్పాలి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆ పార్టీది శబ్ద గాంభీర్యమే కానీ క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ బలం కానీ, బలగం కానీ దాదాపు శూన్యమే అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆ పార్టీ ఆశలన్నీ ఇప్పుడు తెలంగాణపైనే. ఇన్నేళ్లుగా బీజేపీలో దక్షిణాదికి పెద్దగా ప్రాధాన్యం దక్కిన దాఖలాలు లేవు. దక్షిణాది నాయకులంటే ఆ పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగిన వాళ్లను వేళ్ల మీద లెక్కంచేంత మందే ఉంటారు. అయితే జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీ అగ్రనేతల తీరు ఇప్పటి దాకా ఒకెత్తు ఇకపై ఒకెత్తు అన్నట్లుగా ఉంది. ఉత్తరాదిని ఏలేస్తున్నాం అని భావిస్తున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాదిలో వేళ్లూనుకోవాలన్న ప్రయత్నాలకు ఇక్కడి నేతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనివార్యమైన పరిస్థితి ఎదురైంది.
నిజం. బీజేపీలో జోష్ పెరిగింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతగా నిర్వహించడమే కాకుండా.. బహిరంగ సభను ఆ స్థాయిలో సక్సెస్ చేయడంతో పార్టీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం పై విశ్వాసం మరింతగా పెరిగింది. ముఖ్యంగా బహిరంగ సభ ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందనికానీ, అంత పెద్ద ఎత్తున జనసమీకరణ సాధ్యమవుతుందని కానీ, ప్రధాని నరేంద్ర మోడీ సహా పార్టీ పెద్దలు ఎవరూ ఉహించలేదు. అందుకే, ప్రధాని నరేంద్ర మోడీ, ఉబ్బి తబ్బిబై పోయారు. వేదిక మీదనే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్’ను భుజం తట్టి మరీ అభినందించారు. అయితే, ఇప్పడు ఆ అభినందనే పార్టీలో లుకలుకలు సృష్టించిందా, అంటే, అవుననే అంటున్నారు పార్టీ పెద్దలు, పరిశీలకులు.
ఆంధ్రప్రదేశ్ లో స్టార్టప్ ల ర్యాంకింగ్ లో ఏపీ దేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఇది ఏ రాజకీయ పార్టీయో చేసిన విమర్శ కాదు. కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్. ఔను స్వయంగా కేంద్రం ప్రకటించిన ర్యాంకింగ్స్ లోనే ఏపీ దేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలిచింది. దేశంలో స్టార్టప్ ల ఎకో సిస్టమ్ లలో ఏ రాష్ట్రం మెరుగ్గా ఉంది అన్న అంశంపై కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లలో ఏపీకి వచ్చిన ర్యాంక్ ఇది. ఈ ర్యాంకింగ్స్ లో ఏపీ కన్నా బీహార్ మెరుగ్గా ఉంది. మరి అగ్ర స్థానంలో ఉన్నరాష్ట్రం ఏమిటంటారా అది గుజరాత్. రెండో స్థానంలో కర్నాటక నిలిచింది. స్టార్టప్ ల విషయంలో రెండు కేటగరీల్లో కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది. కోటి కన్నా ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలను ఏ కేటగిరీలో చేర్చింది.
రఘురామకృష్ణం రాజు.. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం రచ్చబండ అంటూ టెలివిజన్లలో దర్శనమిచే లోక్ సభ సభ్యుడు. సొంత పార్టీ నుంచే వేధింపులు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణం రాజు వైసీపీపై, ఆ పార్టీ నేతలపై విమర్శలెన్ని చేసినా.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి, రఘురామకృష్ణం రాజు మధ్య ట్వీట్ వార్ మాత్రం ఏపీ వ్యాప్తంగా ఎప్పుడూ హాట్ టాపికే.
ప్ర‌జ‌ల్ని ఎలాంటి క‌ష్ట‌న‌ష్టాల‌కు గురిచేయ‌కుండా వుండేది మంచి పాల‌న‌. మాటి మాటికి ఏదో ఒక కొత్త నిబంధ‌న‌ల‌తో వేధించేది అస‌లు ప్ర‌భుత్వ‌మ‌నిపించుకోదు. న‌రేంద్ర‌మోదీ నాయ‌క‌త్వంలోని బిజెపి ప్ర‌భుత్వం నోట్ల మార్పిడి నిర్ణ‌యంతో గ‌తంలో సామాన్య జ‌నాన్ని గ‌తంలో ఎంతో ఇబ్బంది పెట్టింది. ఇపుడు కొత్త‌గా మ‌రో ఇబ్బంది పెట్టే మార్గాన్ని ఎంచుకుంది. మ‌నిషి ఆరోగ్యంగా వున్న‌దీ లేనిదీ ఫిట్నెస్ టెస్ట్ పెట్ట‌డం పోలీసు, ఆర్మీ వుద్యోగాల్లో మామూలే. క‌రెన్సీ నోట్లు ఫిట్నెస్ త‌నిఖీ చేసే యంత్రాల‌ను రంగంలోకి దింపాల‌ని యోచిస్తున్నారు ప్ర‌ధాని. బ్యాంకుల్లో, పెద్ద పెద్ద మాల్స్‌లో నోట్ల‌ను లెక్కించే మిష‌న్లే ఇప్ప‌టివ‌ర‌కూ చూశాం. ఇక నుంచి మ‌నం జేబులోంచి ఇచ్చే ప‌ది, ఇర‌వై, యాభై, వంద నోట్లు కాస్త‌ కూడా న‌ల‌క్కుండా, మ‌ట్టి ప‌ట్ట‌కుండా వుండాలిట‌!
దూర‌దృష్టితో ఆలోచించేవారిని వినాలి, ప‌ట్టించుకోవాలి, గౌరవించుకోవాలి. ఎందుకంటే వారి కార్యాచరణ తక్షణ లబ్ధి కోసం, ఎన్నికల ప్రయోజనాల కోసం పరిమితం కాదు. భవిష్యత్ వెలుగుల కోసం, భావి తరాల బాగు కోసం కూడా. వారి ప్రణాళికలు కేవలం తమ పార్టీ అధికారంలో ఉండాలనో లేదా ఈ రోజు అందరి మెప్పూ పొందితే చాలనో కాదు.. తరతరాలు సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలనీ, భవిష్యత్ తరాలు కూడా ఈ అభివృద్ధి ఫలాలు అనుభవించాలని. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దార్శనికత సరిగ్గా ఆ కోవలోకి వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఏర్పాటు చేసిన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం కానీ, తెలుగు విద్యార్థుల చదువులకు గట్టి పునాది కోసం తీసుకు వచ్చిన విద్యా సంస్కరణలు కానీ అప్పడే కాదు, ఇప్పుడూ తెలుగు పిల్లల భవిష్యత్ కు బంగారు బాట వేశాయి. వేస్తూనే ఉన్నాయి.
రాజకీయ దురంధరుడిగా, ప్రత్యర్థులకు అంతు చిక్కని వ్యూహాలతో దూసుకుపోయే నేతగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి గుర్తింపు ఉంది. నిత్యం రాజకీయ జిత్తులు, రణతంత్రపు ఎత్తులతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉండే కేసీఆర్ కు ఇటీవలి కాలంలో అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. వ్యూహాలు వికటిస్తున్నాయి. ఎత్తులు పారడం లేదు. తాడనుకున్నది కూడా పామై బుస కొడుతోంది. ఏ ముహూర్తంలో అయితే జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారించారో అప్పటి నుంచీ ఆయనకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు ఎవరిని దగ్గరకు తీస్తారో.. ఎప్పుడు ఎవరిని దూరం నెట్టేస్తారో ఎవరికీ ఎప్పటికీ అర్ధం కాదు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో అప్పటి దాకా మంత్రివర్గంలో నోరెట్టుకు విపక్షాల మీద పడిపోయి.. అధినేత మన్ననలు పొంది ఆయనకు సన్నిహితులుగా మెలిగిన వారంతా మాజీలైపోయి.. ఎక్కడా కనిపించక, వినిపించక కనుమరుగైపోయిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు పార్టీ విపక్షంలో ఉన్న సమయం నుంచీ అంతా తానై చక్రం తిప్పిన విజయసాయి పరిస్థితీ అంతే ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా ఆయన పరిధిని పరిమితం చేసేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున విజయసాయి మాజీ మంత్రుల్లా ఎవరికీ పట్టకుండా మిగిలిపోకుండా తప్పించుకున్నారు. సరే ఇప్పుడు ఆయన పరిధిని జగన్ ఒకింత పెంచారు అది వేరే సంగతి. విషయమేమిటంటే.. జగన్ ఎవరిని ఎందుకు దగ్గరకు తీస్తారో.. ఎవరిని ఎందుకు దూరంపెట్టేస్తారో అంటే సమాధానం చెప్పేవారు వైసీపీలోనే లేరన్నది మాత్రం వాస్తవం. అసలు జగన్ కైనా అందుకు లాజికల్ కారణాలు తెలుసా అంటే అదో మిలియన్ డాలర్ల ప్రశ్నే.
పెళ్లికి వ‌చ్చిన‌వారంతా స‌ర‌దాగానే గ‌డిపి వెళిపోతారు. మంచిమాట‌లు, మంచి అభిప్రాయాల‌తో మంచి జ్ఞాప‌కాల‌నూ వెంట తీసికెళ‌తారు. నిన్న మొన్న‌టి బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చి కేసీఆర్ ప్ర‌భుత్వానికి కేంద్రం నుంచి ఇచ్చిన ఆర్ధిక స‌హ‌కారం గురించి ఎంతో చెప్పారు. టిఆర్ ఎస్ ప్రభుత్వానికి కేంద్రం సాయం చేయ‌డం లేద‌న్న‌ది శుద్ధ అబ‌ద్ధ‌మ‌ని ఆయ‌న మాట‌ల్లోనే ప్ర‌ధాని తెలంగాణా ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేశారు. అంతవ‌ర‌కూ బాగానే వుంది. కానీ వెళుతూ ఓ క్ష‌ణం గ‌వర్న ర్‌తో మోడీ భేటీయే గులాబి దండులో ఆందోళ‌న నింపింది. పోతూ పోతూఈ పెద్దాయ‌న గవర్నర్ తో ఏం మాట్లాడి వుంటారు, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తమ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఏం ఫిర్యాదులు చేసి ఉంటారు అన్న చ‌ర్చ‌లు ఆరంభ‌మ‌య్యాయి. అస‌లే ఇటివ‌ల కేసీఆర్‌, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య ఏది ప‌డినా భ‌గ్గుమ‌ంటున్న‌ది. మ‌రి ప్ర‌ధాని ఏకంగా ఆమెతో చర్చకు సమయం కేటాయించారంటే ఏదో బ్రహ్మాండం బద్దలయ్యే అంశమే ఆమె నుంచి ఆయనకు చేరి ఉంటుందని గులాబి దళం ఆందోళన పడుతోంది.
మ‌ర‌ణానికి మ‌రింత ద‌గ్గ‌ర్లో వున్న తండ్రికి ర‌మ్ ఇచ్చి ఆనంద‌ప‌రిచింది పెన్నెలోప్‌ ఆన్‌!  చిన్న ప్ప‌టి నుంచి బిస్కెట్లూ, చాక్లెట్లు ఇచ్చి బ‌డికి పంపిన తండ్రి పెదాల మీద చివ‌రి చిర్న‌వ్వు  కోసం ఆన్ త‌న‌కు బొత్తిగా ఇష్టంలేని రమ్ ఇవ్వ‌క త‌ప్ప‌లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.