మోడీ కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాలు- పైపై విమర్శలతో జనం దృష్టి మళ్లించే యత్నాలు!

Publish Date:May 27, 2022

Advertisement

రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కానీ దొంగ శత్రువులు ఉంటారా అంటే మాత్రం కచ్చితంగా ఉంటారంటూ మోడీ, కేసీఆర్ లను చూపుతున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తే కేసీఆర్ నగరం విడిచి వెళ్లడం రాజకీయ కుమ్మక్కులో భాగమేనంటున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మోడీ నినాదాన్ని కేసీఆర్ అందిపుచ్చుకుని దానిని తెలంగాణకు అనుగుణంగా కాంగ్రెస్ ముక్త తెలంగాణగా సవరించుకున్నారని, ఆ లక్ష్యం సాధించేందుకే బీజేపీకి రాష్ట్రంలో లేని ప్రాధాన్యతకు కట్టబెడుతున్నారన్నది వారి విశ్లేషణ. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలం చెక్కు చెదరకపోవడం, నేతలు బలహీనపడినా కార్యకర్తల బలం తెలంగాణలో కాంగ్రెస్ కు ఎలా ఉన్నది అలాగే ఉండటాన్ని వారు ఎత్తి చూపుతున్నారు.  

ఈ నేపథ్యంలోనే రెండు ధఫాలు వరుసగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తీవ్రమైన యాంటీ ఇన్ కంబెన్సీని ఎదుర్కొంటోందనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మళ్ల కుండా ఉండాలంటే బీజేపీ బలోపేతం అయ్యిందన్న భావన ప్రజలలో కలిగించేందుకే ఆ పార్టీకి అధిక ప్రాధాన్యతను కేసీఆర్ ఇస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  కేంద్రం అవినీతి వైఫల్యాలపై కేసీఆర్ గళమెత్తడం, కేసీఆర్ కుటుంబ అవినీతిపై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించండం రెండు పార్టీల రాజకీయ నాటకంలో బాగమేనని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిజంగా కేసీఆర్ అవినీతి నిగ్గు తీయాలంటే ఎంత సేపని వారు ప్రశ్నిస్తున్నారు.

 తాజాగా కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిందనీ, అలాగే  జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావలసిందిగా  జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నో్టీసులు జారీ చేసింది.   తాజాగా మహారాష్ట్ర మంత్రి శివసేన నేత అనిల్‌ పరబ్‌ నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించి మనీలాండరింగ్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ దాడుల పరంపర కొనసాగుతుంటే ..   స్వయంగా మోడీయే కేసీఆర్ అవినీతి, ఆయన కుటుంబ దోపిడీపై విమర్శలు, ఆరోపణలు  గుప్పిస్తుంటే ఈడీ ఎందుకు దాడులు చేయడం లేదని, సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదనీ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మోడీ కేసీఆర్ పై విమర్శలు గుప్పించినా, కేసీఆర్ కేంద్రంపై, ప్రధానిపై ఆరోపణలు సంధించినా.. అదంతా రాజకీయ క్రీడలో భాగమే తప్ప నిజం కాదన్న సంగతిని బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.

తెలంగాణలో తెరాసకు, కేంద్రంలో బీజేపీకి నిజమైన ప్రత్యర్థి కాంగ్రెస్ అన్న అవగాహనతోనే కేసీఆర్, మోడీలు ఆ పార్టీని తగ్గించి చూపేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకే కేసీఆర్, మోడీ రాజకీయ ప్రత్యర్థులుగా ప్రజలకు బిల్డప్ ఇస్తున్నారని వారు అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం అన్న అంశం కూడా అంతిమంగా మోడీకి మేలు చేసేందుకేనని అంటున్నారు. మూడో ఫ్రంట్, కూటమి అంటూ కేసీఆర్ కలుస్తున్న ప్రాంతీయ పార్టీల రాజకీయ మూడ్ ఏమిటన్నది బీజేపీ అగ్రనాయకత్వానికి చేరవేసే వ్యూహంలో భాగమే కేసీఆర్ పర్యటనలని వారు విశ్లేషణలు చేస్తున్నారు. గురువారం తెలంగాణ పర్యటనలో భాగంగా మోడీ బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో కేసీఆర్ కుటుంబ అవినీతిపై చేసిన విమర్శలను  తెలంగాణ బీజేపీ నాయకలే సీరియస్ గా తీసుకోవడం లేదని ఆ పార్టీకి సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి. 

By
en-us Political News

  
తెలుగు సినీ పరిశ్రమకు అందిరకీ తెలిసిన కారణాలతోనే ఏపీలోని జగన్ సర్కార్ పట్ల ఒకింత అయిష్టత ఉంది. సినీమాల విడుదల, సినీమా టికెట్ల ధరల విషయంలో జగన్ సర్కార్ ఒకింత దుర్మార్గంగా వ్యవహరించిందన్న విషయంలో సినీ పరిశ్రమ జగన్ సర్కార్ విషయంలో కినుకతో ఉందనడంలో సందేహం లేదు.
ఏ నోట విన్నా ఒకటే మాట.. ఏ సర్వే చూసినా ఒకటే ఫలితం. ఏపీలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. తాజాగా మరో జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే కూడా అదే ఫలితాన్ని వెలువరించింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (ఏప్రిల్ 16)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో నాలుగు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
కొన్నికొన్ని సందర్భాలను చూస్తే దేశంలో ఇంకా న్యాయం బతికే వుందన్న నమ్మకం కలుగుతూ వుంటుంది. లిక్కర్ కేసులో పూర్తిగా
తాను చాలా మంచోణ్ణని ప్రూవ్ చేసుకోవడానికి మాజీ రాజకుమారుడు కేటీఆర్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వకపోగా
కడపలో వైఎస్ కుటుంబ రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల అజెండాగా మారిపోయాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో దోషులు ఎవరు? ఆయన హత్య ఎందుకు జరిగింది? అన్న విషయంలో కోర్టులు ఇంకా నిర్దుష్టమైన తీర్పు వెలువరించలేదు.
తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ సిఎంను పంజాబ్ సిఎం  ఇవ్వాళ పరామర్శించారు.  ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో అరెస్ట‌యి తీహార్ జైలులో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సోమ‌వారం పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్‌సింగ్‌ మాన్ క‌లిశారు
ఎపిలో అధికారపార్టీ ప్రజల భద్రత కన్నా పాలకుల భద్రత మీద దృష్టి కేంద్రీకరించింది.  ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకు భద్రతను భారీగా పెంచారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవ్వరినీ వదలడం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన బడా నిర్మాత ఈ ఉచ్చులో చిక్కుకున్నారు.
వైఎస్ ఫ్యామిలీకి ఎక్కడ దొరుకుతారోగానీ షార్ప్ షూటర్లు భలే దొరుకుతారు. గతంలో పరిటాల రవిని అంతం చేయడానికి మొద్దు శ్రీను
దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.  ఎన్నికల వేళ అభ్యర్థులు కట్టుతప్పకుండా ఎలక్షన్ కమిషన్ (ఈసీ) పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. మద్యం కుంభకోణంలో ఆమె కీలకమని సీబీఐ, ఈడీలు గట్టిగా చెబుతున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోని ఇడుపుల పాయలో ఒక విద్యార్ధిని విషాదకర పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.