కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
Publish Date:Jul 14, 2025
Advertisement
కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళన కారుల మధ్య నెలకొన్న పెనుగులాట, అరెస్ట్ లు ఉద్రిక్తత వాతావరణానికి దారితీశాయి . దళితులు తమ భూములను ఇతరులు కబ్జా చేశారని గత నెల రోజులుగా ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తున్నారు. వీరికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఇచ్చింది. ఎందుకూ సమస్య పరిష్కారం కాకపోవడం, అధికారులు స్పందించక పోవడం తో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. దీంతో పోలీసులు ముట్టడిని బలవంతంగా బగ్నం చేసి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులతో పాటు ఆందోళనకాలను బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితి అక్కడ ఉద్రిక్తత వాతావరణాన్ని కల్పించింది. పోలీసులు అరెస్టులతో ఆగకుండా నెల రోజులుగా ఆందోళన చేపట్టిన దీక్ష శిబిరాన్ని కూల్చేశారు. దీంతో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, బాధిత దళితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కబ్జా కోరనుండి మాభూములకు విముక్తి కల్పించకపోగా తమను అరెస్ట్ చేయడం,చేయడం దీక్షా శిబిరం కూల్చివేయడం కారణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *అరెస్టులతో ఆపలేరు: రవిశంకర్ రెడ్డి దళితులు చేస్తున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, గత 29 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూఉంటే అధికారులు స్పందించకపోవడం , పోలీసులతో ఉద్యమాలను అణిచివేయాలని, టెంట్ ను తొలగించి దళితులను భయబ్రాంతులకు గిరిచేయడం తగదని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి మండి పడ్డారు.అరెస్ లో పై ఆయన మాట్లాడుతూ, పేదలైన దళితుల సమస్యలను పరిష్కరించాలని అడిగితే పోలీసులను పెట్టి అరెస్టు చేయడం సరైన పద్దతి కాదన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ప్రభుత్వాలు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా న్యాయం అడుగుతున్న దళితులపై పోలీసుల ఉక్కు పాదాలను మోపడం ఏమిటని అయన ప్రశ్నించారు, సమస్యలను అధికారులు పరిష్కరించకుండా ఉద్యమాలను అరెస్టులతో ఆపుతామనుకోవడం అవివేకమని అన్నారు. దళితుల ఆందోళనలను అణచివేయటానికి పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపచేసి గంటల తరబడి అరెస్టుకు ప్రణాళికలు చేసేబదులు పదినిమిషాలలో అధికారులు కూర్చుని సమస్యను పరిష్కరించవచ్చునని ఆయన అన్నారు. పాత కడప దళితుల భూమి సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారు ఏఐసీసీ కోఆర్డినేటర్ ఎస్ ఎ సత్తార్, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మడగలం ప్రసాద్, వెంకటేష్, రాయలసీమ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీదేవి, తస్లిమ్ రమేష్ బాబు, దివాకర్, గోపాల్, వీరయ్య, బాబు చిన్న సుబ్బయ్య, కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య, ఓబులేసు, సిపిఐ యం యల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బ్ల్యూ రాము, ఎమ్మార్పీఎస్ నాయకులు బీసీ గంగులు, ఆంజనేయులు, సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/kadapa-25-201979.html





