Publish Date:May 27, 2022
తెలుుదేశం అంటే చైతన్యం. తెలుగుదేశం అంటే అభివృద్ధి, తెలుగుదేశం అంటే సంక్షేమం. అలాంటి తెలుగుదేశం పార్టీని అంతమొందించడం ఎవరి తరం కాదు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను ఎంతగా ఇబ్బందులకు గురి చేస్తే అంతకు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఒంగోలులో రెండు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంలో తొలి రోజు శుక్రవారం చంద్రబాబు ప్రారంభోత్సవంలో చంద్రబాబు తొలి పలుకులివి.
మహానాడును తెలుగు జాతి పండుగగా అభివర్ణించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, సీఎం జగన్ చాతకాని దద్దమ్మ అని ఘాటుగా విమర్శించారు. జగన్ రాష్ట్రం పరువు తీస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్మాది పాలనను అంతమొందించాలని పిలుపు నిచ్చారు. ఒంగోలు వేదికగా జరుగుతున్న మహానాడులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. చాతకాని దద్దమ్మ పాలనలో రాష్ట్రం పరువు గంగలో కలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా జగన్ సర్కార్ తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయడం, దాడులు చేయడం, కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టిందని చంద్రబాబు విమర్శించారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాదుడే బాదుడు. ఇంటిపన్ను, చెత్తపన్ను, డ్రైనేజీ ట్యాక్స్ ఇలా అన్నీ పంచేశారు. కేంద్రం తగ్గించినా జగన్ పెట్రో ధరలు తగ్గించడం లేదు. రాష్ట్రంలో రైతులు ఆనందంగా లేరు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరిస్థితి తీసుకోస్తారా? మహిళలకు భద్రత లేదు. అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, పేరలకు తక్కువ ధరకూ కడుపు నిండా అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లను తీసేశారు.
విదేశీ విద్య, పెళ్లి కానుక పథకాలన్నీ రద్దు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. ఈ ఉన్మాది పాలనను అంతమొందించడమే లక్ష్యంగా పని చేయాలి అంటూ చంద్రబాబు మహానాడు వేదికగా పిలుపు నిచ్చారు. నిలదీస్తే, విమర్శిస్తే, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్న జగన్ సర్కార్ కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం బెదరిపోదన్నారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించమని స్పష్టం చేశారు. మహానాడుకు భారీగా హాజరైన తెలుగు తమ్ముళ్లను ఆయ అభినందించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-in-efficient-cm-ruling-state-as-phyco-39-136526.html
ఆజాదీ కా అమృతోత్సవ్ లో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రాముఖ్యతను ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయం చేసేసింది. తెలుగు ఖ్యాతికి రాజకీయ మకిలి పట్టించిన ఘనతను సొంతం చేసుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోందన్న చందంగా ఎవరి దృష్టినీ ఆకర్షించని, ఎవరూ పట్టించుకోని కార్యక్రమంలా సాగింది. ప్రధాని మోడీ వచ్చి అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించినా అదేదో వైసీపీకి చెందిన సొంత వ్యవహారంగానే రాష్ట్ర ప్రజలు భావించారంటే ఆ తప్పు జగన్ సర్కార్ దేనని పరిశీలకులు అంటున్నారు.
బీజేపీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించిందనడానికి హైదరాబాద్ వేదికగా జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిదర్శనంగా నిలిచాయి. దక్షిణాది రాష్ట్రాలలో పడుతూనో, లేస్తూనో కర్నాటకలో బీజేపీ కాలూనగలిగింది. ఆ రాష్ట్రం వినా బీజేపీకి దక్షిణాదిలో పెద్దగా పట్టు లేదనే చెప్పాలి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆ పార్టీది శబ్ద గాంభీర్యమే కానీ క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ బలం కానీ, బలగం కానీ దాదాపు శూన్యమే అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆ పార్టీ ఆశలన్నీ ఇప్పుడు తెలంగాణపైనే. ఇన్నేళ్లుగా బీజేపీలో దక్షిణాదికి పెద్దగా ప్రాధాన్యం దక్కిన దాఖలాలు లేవు. దక్షిణాది నాయకులంటే ఆ పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగిన వాళ్లను వేళ్ల మీద లెక్కంచేంత మందే ఉంటారు. అయితే జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీ అగ్రనేతల తీరు ఇప్పటి దాకా ఒకెత్తు ఇకపై ఒకెత్తు అన్నట్లుగా ఉంది. ఉత్తరాదిని ఏలేస్తున్నాం అని భావిస్తున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాదిలో వేళ్లూనుకోవాలన్న ప్రయత్నాలకు ఇక్కడి నేతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనివార్యమైన పరిస్థితి ఎదురైంది.
నిజం. బీజేపీలో జోష్ పెరిగింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతగా నిర్వహించడమే కాకుండా.. బహిరంగ సభను ఆ స్థాయిలో సక్సెస్ చేయడంతో పార్టీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం పై విశ్వాసం మరింతగా పెరిగింది. ముఖ్యంగా బహిరంగ సభ ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందనికానీ, అంత పెద్ద ఎత్తున జనసమీకరణ సాధ్యమవుతుందని కానీ, ప్రధాని నరేంద్ర మోడీ సహా పార్టీ పెద్దలు ఎవరూ ఉహించలేదు. అందుకే, ప్రధాని నరేంద్ర మోడీ, ఉబ్బి తబ్బిబై పోయారు. వేదిక మీదనే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్’ను భుజం తట్టి మరీ అభినందించారు.
అయితే, ఇప్పడు ఆ అభినందనే పార్టీలో లుకలుకలు సృష్టించిందా, అంటే, అవుననే అంటున్నారు పార్టీ పెద్దలు, పరిశీలకులు.
ఆంధ్రప్రదేశ్ లో స్టార్టప్ ల ర్యాంకింగ్ లో ఏపీ దేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఇది ఏ రాజకీయ పార్టీయో చేసిన విమర్శ కాదు. కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్. ఔను స్వయంగా కేంద్రం ప్రకటించిన ర్యాంకింగ్స్ లోనే ఏపీ దేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలిచింది. దేశంలో స్టార్టప్ ల ఎకో సిస్టమ్ లలో ఏ రాష్ట్రం మెరుగ్గా ఉంది అన్న అంశంపై కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లలో ఏపీకి వచ్చిన ర్యాంక్ ఇది. ఈ ర్యాంకింగ్స్ లో ఏపీ కన్నా బీహార్ మెరుగ్గా ఉంది. మరి అగ్ర స్థానంలో ఉన్నరాష్ట్రం ఏమిటంటారా అది గుజరాత్. రెండో స్థానంలో కర్నాటక నిలిచింది. స్టార్టప్ ల విషయంలో రెండు కేటగరీల్లో కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది. కోటి కన్నా ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలను ఏ కేటగిరీలో చేర్చింది.
రఘురామకృష్ణం రాజు.. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం రచ్చబండ అంటూ టెలివిజన్లలో దర్శనమిచే లోక్ సభ సభ్యుడు. సొంత పార్టీ నుంచే వేధింపులు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణం రాజు వైసీపీపై, ఆ పార్టీ నేతలపై విమర్శలెన్ని చేసినా.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి, రఘురామకృష్ణం రాజు మధ్య ట్వీట్ వార్ మాత్రం ఏపీ వ్యాప్తంగా ఎప్పుడూ హాట్ టాపికే.
ప్రజల్ని ఎలాంటి కష్టనష్టాలకు గురిచేయకుండా వుండేది మంచి పాలన. మాటి మాటికి ఏదో ఒక కొత్త నిబంధనలతో వేధించేది అసలు ప్రభుత్వమనిపించుకోదు. నరేంద్రమోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం నోట్ల మార్పిడి నిర్ణయంతో గతంలో సామాన్య జనాన్ని గతంలో ఎంతో ఇబ్బంది పెట్టింది. ఇపుడు కొత్తగా మరో ఇబ్బంది పెట్టే మార్గాన్ని ఎంచుకుంది. మనిషి ఆరోగ్యంగా వున్నదీ లేనిదీ ఫిట్నెస్ టెస్ట్ పెట్టడం పోలీసు, ఆర్మీ వుద్యోగాల్లో మామూలే. కరెన్సీ నోట్లు ఫిట్నెస్ తనిఖీ చేసే యంత్రాలను రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు ప్రధాని. బ్యాంకుల్లో, పెద్ద పెద్ద మాల్స్‌లో నోట్లను లెక్కించే మిషన్లే ఇప్పటివరకూ చూశాం. ఇక నుంచి మనం జేబులోంచి ఇచ్చే పది, ఇరవై, యాభై, వంద నోట్లు కాస్త కూడా నలక్కుండా, మట్టి పట్టకుండా వుండాలిట!
దూరదృష్టితో ఆలోచించేవారిని వినాలి, పట్టించుకోవాలి, గౌరవించుకోవాలి. ఎందుకంటే వారి కార్యాచరణ తక్షణ లబ్ధి కోసం, ఎన్నికల ప్రయోజనాల కోసం పరిమితం కాదు. భవిష్యత్ వెలుగుల కోసం, భావి తరాల బాగు కోసం కూడా. వారి ప్రణాళికలు కేవలం తమ పార్టీ అధికారంలో ఉండాలనో లేదా ఈ రోజు అందరి మెప్పూ పొందితే చాలనో కాదు.. తరతరాలు సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలనీ, భవిష్యత్ తరాలు కూడా ఈ అభివృద్ధి ఫలాలు అనుభవించాలని. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దార్శనికత సరిగ్గా ఆ కోవలోకి వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఏర్పాటు చేసిన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం కానీ, తెలుగు విద్యార్థుల చదువులకు గట్టి పునాది కోసం తీసుకు వచ్చిన విద్యా సంస్కరణలు కానీ అప్పడే కాదు, ఇప్పుడూ తెలుగు పిల్లల భవిష్యత్ కు బంగారు బాట వేశాయి. వేస్తూనే ఉన్నాయి.
రాజకీయ దురంధరుడిగా, ప్రత్యర్థులకు అంతు చిక్కని వ్యూహాలతో దూసుకుపోయే నేతగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి గుర్తింపు ఉంది. నిత్యం రాజకీయ జిత్తులు, రణతంత్రపు ఎత్తులతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉండే కేసీఆర్ కు ఇటీవలి కాలంలో అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. వ్యూహాలు వికటిస్తున్నాయి. ఎత్తులు పారడం లేదు. తాడనుకున్నది కూడా పామై బుస కొడుతోంది. ఏ ముహూర్తంలో అయితే జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారించారో అప్పటి నుంచీ ఆయనకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు ఎవరిని దగ్గరకు తీస్తారో.. ఎప్పుడు ఎవరిని దూరం నెట్టేస్తారో ఎవరికీ ఎప్పటికీ అర్ధం కాదు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో అప్పటి దాకా మంత్రివర్గంలో నోరెట్టుకు విపక్షాల మీద పడిపోయి.. అధినేత మన్ననలు పొంది ఆయనకు సన్నిహితులుగా మెలిగిన వారంతా మాజీలైపోయి.. ఎక్కడా కనిపించక, వినిపించక కనుమరుగైపోయిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు పార్టీ విపక్షంలో ఉన్న సమయం నుంచీ అంతా తానై చక్రం తిప్పిన విజయసాయి పరిస్థితీ అంతే ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా ఆయన పరిధిని పరిమితం చేసేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున విజయసాయి మాజీ మంత్రుల్లా ఎవరికీ పట్టకుండా మిగిలిపోకుండా తప్పించుకున్నారు. సరే ఇప్పుడు ఆయన పరిధిని జగన్ ఒకింత పెంచారు అది వేరే సంగతి. విషయమేమిటంటే.. జగన్ ఎవరిని ఎందుకు దగ్గరకు తీస్తారో.. ఎవరిని ఎందుకు దూరంపెట్టేస్తారో అంటే సమాధానం చెప్పేవారు వైసీపీలోనే లేరన్నది మాత్రం వాస్తవం. అసలు జగన్ కైనా అందుకు లాజికల్ కారణాలు తెలుసా అంటే అదో మిలియన్ డాలర్ల ప్రశ్నే.
పెళ్లికి వచ్చినవారంతా సరదాగానే గడిపి వెళిపోతారు. మంచిమాటలు, మంచి అభిప్రాయాలతో మంచి జ్ఞాపకాలనూ వెంట తీసికెళతారు. నిన్న మొన్నటి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఇచ్చిన ఆర్ధిక సహకారం గురించి ఎంతో చెప్పారు. టిఆర్ ఎస్ ప్రభుత్వానికి కేంద్రం సాయం చేయడం లేదన్నది శుద్ధ అబద్ధమని ఆయన మాటల్లోనే ప్రధాని తెలంగాణా ప్రజలకు స్పష్టం చేశారు. అంతవరకూ బాగానే వుంది. కానీ వెళుతూ ఓ క్షణం గవర్న ర్తో మోడీ భేటీయే గులాబి దండులో ఆందోళన నింపింది. పోతూ పోతూఈ పెద్దాయన గవర్నర్ తో ఏం మాట్లాడి వుంటారు, గవర్నర్ తమిళిసై తమ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఏం ఫిర్యాదులు చేసి ఉంటారు అన్న చర్చలు ఆరంభమయ్యాయి. అసలే ఇటివల కేసీఆర్, గవర్నర్ మధ్య ఏది పడినా భగ్గుమంటున్నది. మరి ప్రధాని ఏకంగా ఆమెతో చర్చకు సమయం కేటాయించారంటే ఏదో బ్రహ్మాండం బద్దలయ్యే అంశమే ఆమె నుంచి ఆయనకు చేరి ఉంటుందని గులాబి దళం ఆందోళన పడుతోంది.
మరణానికి మరింత దగ్గర్లో వున్న తండ్రికి రమ్ ఇచ్చి ఆనందపరిచింది పెన్నెలోప్ ఆన్! చిన్న ప్పటి నుంచి బిస్కెట్లూ, చాక్లెట్లు ఇచ్చి బడికి పంపిన తండ్రి పెదాల మీద చివరి చిర్నవ్వు కోసం ఆన్ తనకు బొత్తిగా ఇష్టంలేని రమ్ ఇవ్వక తప్పలేదు.
నాటకీయ పరిణామాల నడుమ జూన్ 30న మహా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన, శివసేన తిరుగుబాటు నాయకుడు, ఏక్నాథ్ షిండే ఈ రోజు ( సోమవారం) రాష్ట్ర శాసన సభలో సభలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు. 164 మంది ఎమ్మెల్యేలు షిండే’కు మద్దతుగా నిలిచారు. మ్యాజిక్ ఫిగర్ (144) కంటే 20 ఎక్కువ ఓట్లు సాధించారు. ఆయన బలపరీక్షలో గెలుపొందినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. దీంతో షిండే తిరుగుబాటుతో మొదలైన మహా సంక్షోభం షిండే విజయంతో, ముగింపు కొచ్చింది. మరోవైపు, శివసేన చీఫ్ విప్‌గా సునీల్ ప్రభును తొలగించి.. భరత్ గోగావలేను నియమించిన నేపథ్యంలో ఠాక్రే వర్గం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ జూలై 11 న విచారణకు వస్తుంది. అయితే, కోర్టు తీర్పు ఎటు వచ్చినా, షిండే సర్కార్’ కు తక్షణ ముప్పు వచ్చే ప్రమాదం లేదని, న్యాయ కోవిదులు పేర్కొంటున్నారు.