తెలంగాణ‌లో మ‌ళ్లీ లాక్‌డౌన్‌?.. కేబినెట్ భేటీలో నిర్ణ‌యం?

Publish Date:Jan 16, 2022

Advertisement

ఒమిక్రాన్ ఎరియంట్’గా కరోనా మహమ్మారి  మళ్లీ విజృంభిస్తున్న నేపద్యంలో రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టుగా అధికార వర్గాల సమాచారం. ఓ వంక కేంద్ర ప్రభుత్వం, స్థానిక పరిస్థితుల అదారంగా అవసరమైన మేరకు ఆంక్షలు విధించాలని, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.అదే సమయంలో ఆర్థిక, ఉపాథి కార్యక్రమాలు దెబ్బ తినకుండా, సామాన్యుల జీవనోపాధికి సమస్యలు లేకుండా  చర్యలు ఉండాలని సూచించింది. ఈ నేపధ్యంలో, కరోనా కట్టడిలో తొలి చర్యగా తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ సలహా మేరకు అన్ని విద్యాలయాలకు ఈనెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ విద్యా సంస్థల సెలవులను పొడిగిస్తూ కీలక ప్రకటన చేశారు.

అలాగే, పండగ అనంతర పరిస్థితిని కూలంకషంగా చర్చించి, తదుపరి చర్యలు తీసుకునేందుకు 
ముఖ్యమంత్రి సోమవారం మంత్రి వర్గ  సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు.  ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై మంత్రులతో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. ఇప్పటికే విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా ఆంక్షలను మరింత కఠినతరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

మరోవంక పండగ సందర్భంగా రాజదాని హైదరాబాద్ నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు వారి స్వస్థలాలకు వెళ్లారు. రేపటి నుంచి తెరిగి రావడం మొదలవుతుంది. కరోనా పై ఈ రాకపోకల ప్రభావం ఉంటుందని, దీంతో తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రలలోనూ గడచిన మూడు నాలుగు రోజుల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అలాగే, ఇరుగు పొరుగు రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌ విధిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. పొరుగు రాష్ట్రం ఏపీలో ఈనెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. అదే విధంగా  తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధిస్తారా? లేక కర్ణాటక తరహాలో వీకెండ్  లాక్‌డైన్ అము చేస్తారా? అదీ కాక, కఠిన ఆంక్షలతో సరిపెడతారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసలు ఉంటాయా? లేదా? అన్నదానిపై రేపటి కేబినెట్ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే,తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో కొత్త కేసులు పెరుగతున్న దృష్ట్యా .. మరో పక్షం  రోజుల పాటు ... ఆంక్షలు విధిస్తారని అటున్నారు.
 

By
en-us Political News

  
భారతీయ మసాలా పౌడర్లపై సింగపూర్ బ్యాన్ విధించింది. గ‌తంలోనూ అమెరికా భార‌తీయ మ‌సాలా బ్రాండ్ల‌ను మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని  అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది.
తెలుగు రాష్ట్రాలలో రాజకీయ స్నేహం గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ గురించే చెప్పుకోవాలి. 2018లోనే అంటే నిర్దిష్ట గడువు కంటే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో తన మిత్రుడు జగన్ విజయం కోసం తెలంగాణ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు.
అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిందట.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అదే కోడ్ అమలులోకి వచ్చింది. దేశ మంతా కోడ్ అమలు అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న అనమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
సుద్దులు చెప్పడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది. గురివింద గింజ సామెత ఆ పార్టీ చెప్పే నీతి వాక్యాలు చూస్తే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట అన్ని దారులూ మూసుకుపోయిన తరువాత.. ఓటమి వాకిలి మాత్రమే తెరిచి ఉన్న తరుణంలో వైసీపీకి ముస్లిం మైనారిటీలు గుర్తుకు వచ్చారు.
ఏపీలో వైసీపీకి గాలాడటం లేదు. ఆ పార్టీ శ్రేణుల్లోనే వైసీపీ ఓటమి ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. చివరాఖరికి ఐప్యాక్ తాజాగా జగన్ కు సమర్పించిన నివేదికలో కూడా అదే విషయాన్ని పేర్కొంది. ఇంత కాలం ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జగన్ సొంత సామాజిక వర్గం కూడా అధికార పార్టీకి దూరమైపోయింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ వైసీపీ స‌ర్కార్ కు ఈసీ బిగ్‌ షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌పై ఈసీ బ‌దిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాను బ‌దిలీ చేస్తూ ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్ద‌రూ ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఎలాంటి ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని, ఎన్నిక‌ల‌కు సంబంధంలేని విధుల‌ను వీరికి అప్ప‌గించాల‌ని ఆదేశించింది.
శ్రీరాముడి పేరు చెప్పి బిజెపి రాజకీయాలు చేస్తోందని.. శ్రీరాముడు బీజేపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఇది పేద, మధ్య తరగతి జనానికి హెచ్చరిక. ఆ మాటకొస్తే ఓ మోస్తరు ధనవంతులు.. చిన్నసైజు కోటీశ్వరులకు కూడా హెచ్చరికే.
ఖమ్మం లోక్ సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ కర్ర విరగాకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించిందా? ఈ సీటు తన తమ్ముడికే ఇవ్వాలంటూ మంత్రి పొంగులేటి.. కాదు తన భార్యకే అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబట్టడంతో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా మూడో వ్యక్తిని తెరమీదకు తీసుకువచ్చిందా?
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పాపం ఎంత వుందో, బీజేపీ పాపం కూడా అంతే వుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.