సిటీ రోడ్లు రేస్ ట్రాక్‌లా?... వాహనదారుల్లో పెరుగుతున్న భయం
Publish Date:May 24, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి బైక్ రేసర్ల ఆగడాలు పెరుగుతున్నాయి వీకెండ్ వచ్చిందంటే చాలు అర్ధరాత్రి వేళ యువకులు కార్లు, బైకులతో రోడ్లపైకి దిగి స్పీడ్ షోలు చేస్తూ హల్‌చల్ సృష్టిస్తున్నారు. ఇంజిన్ల మోతతో నగర వీధులు మార్మోగుతుండగా.. ప్రజలు భయాందోళనలకు గురవు తున్నారు. ఇప్పుడు తాజాగా మాదాపూర్ నీలోఫర్ ప్రాంతం అర్ధరాత్రి రేసింగ్ హబ్‌గా మారిపోయింది. బైక్‌లపై వింత వింత విన్యా సాలు చేస్తూ యువకులు రచ్చ రచ్చ సృష్టించారు. మరోవైపు కార్లతోనూ స్పీడ్ రేసింగ్ నిర్వహిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్యలో గుమికూడిన యువకులు రహదారులనే రేస్ ట్రాక్‌లు గా మార్చేశారు. రేసింగ్‌లను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగినా.. రేసర్లు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పోలీసుల హెచ్చ రికలను పట్టించుకోకుండా మరింత వేగంగా దూసు కెళ్లారు. ఆ పోకిరిలను పట్టుకునేందుకు పోలీసులు వారిని వెంబడించారు.. దీంతో సినిమా ఛేజ్‌ను తలపించేలా కార్లు, బైక్‌ల వెంట పోలీసులు వెంబడించారు. చివరకు పలు వురిని అదుపులోకి తీసుకున్నారు. పారిపోతున్న రేసర్లను అడ్డుకునే క్రమంలో కొన్ని కార్ల అద్దాలను పోలీసులు పగులగొట్టి వారిని బయటికి లాగినట్టు సమాచారం... ఈ సమయంలో కొందరు రేసర్లు పోలీసుల వైపే కార్లను దూసుకెళ్లే ప్రయత్నం చేయ డంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. చివరకు లాఠీచార్జ్ చేసి రేసర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలువురు యువకులను స్టేషన్‌కు తరలించారు.“వీకెండ్ నైట్ అంటే రోడ్లపై భయంతో బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది” అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరం లో మిడ్‌నైట్ రేసింగ్‌లపై పోలీసులు మరింత కఠి నంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.... మొత్తానికి రోడ్డుమీద హంగామా సృష్టిస్తున్న పోకిరి రేసర్లు ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
http://www.teluguone.com/news/content/hyderabad-roads-are-race-tracks-36-220720.html





