భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం..నీట మునిగిన పలు ప్రాంతాలు
Publish Date:Jul 18, 2025
Advertisement
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి చిగురుటాకులా భాగ్యనగరం వణుకిపోతుంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు, షాపుల్లో వరద నీరు చేరింది. రోడ్లు ఫ్లైఓవర్లు వరద నీటితో పొంగిపొర్లుతూ సముద్రాన్ని తలపిస్తున్నాయి. పలు వాహనాలు వరద ప్రవాహంతో కోట్టుకుపోయాయి. కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్ ఏర్పాడింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప్పల్ - హబ్సిగూడ, మియాపూర్ - గచ్చిబౌలి మార్గాల్లో, వివిధ కూడళ్లలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షంతో రసూల్‌పురలోని పైగా కాలనీ విమాన నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. ఓ కార్ల షోరూమ్‌లోకి 4 అడుగుల మేర వరద చేరింది. దీంతో అందులో పనిచేస్తున్న సుమారు 30 మంది ఉద్యోగులు వరదలో చిక్కుకుపోయారు. తమను రక్షించాలని పోలీసులు, డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులకు షోరూం సిబ్బంది సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన హైడ్రా వారిని వెనుక వైపు నుంచి రక్షించారు. చిన్న పడవలలో వారిని బయటకు తీసుకువచ్చారు. భారీ వర్షంతో కురవడంతో రోడ్లపైకి వరద నీరు పోటెత్తింది. నగరంలో అత్యధికంగా మారేడ్‌పల్లి పికెట్ ప్రాంతంలో 11.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బాలనగర్, బండ్లగూడ, మూషీరాబాద్‌లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు (శనివారం) వరకూ తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురవనున్నట్లు వెల్లడించింది. భారీ వర్షల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు వరదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
http://www.teluguone.com/news/content/hyderabad-39-202238.html





